
శ్రీసిటీలో ‘మెజ్జో హోల్డింగ్స్’ బృందం
తడ : హాంకాంగ్ కేంద్రంగా సాగుతూ పలుదేశాల్లో విస్తరించిన మెజ్జో హోల్డింగ్స్ గ్రూప్ ప్రతినిధుల బృందం మంగళవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా తడ సమీపంలోని శ్రీసిటీని సందర్శించింది. భారత్‌లో పెట్టుబడుల అవకాశాలను పరి శీలించేందుకు సంస్థ అంతర్జాతీయ డెరైక్టర్ రఫీక్ సిద్దిఖీ నేతృత్వంలో వచ్చిన 35 మంది ప్రతినిధుల బృందానికి శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికారు. శ్రీసిటీలోని మౌలిక వసతులు, పారిశ్రామిక అభివృద్ధిని మెజ్జో ప్రతినిధులకు వివరించారు. అనంతరం సెజ్‌లో పర్యటించిన బృందం అక్కడ ఏర్పాటైన పరిశ్రమలను పరిశీలించారు.
పరిశీలన అనంతరం మెజ్జో ప్రతినిధులు మాట్లాడుతూ మెజ్జో గ్రూప్ భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు శ్రీసిటీ విశ్వాసం కలిగిస్తోందని సిద్దిఖీ అన్నారు. ఈ సందర్భంగా సన్నారెడ్డి మాట్లాడుతూ మెజ్జో పర్యటన తమకు ఎంతో ముఖ్యమైనదని అన్నారు. ఇక్కడి పరిస్థితులను వారు ఆసక్తితో అడిగి తెలుసుకోవడం ద్వారా త మ పెట్టుబడులను ఇక్కడ పెట్టేందుకు అవకాశం ఉందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.