నేడు శ్రీసిటీలో సీఎం ప్రారంభోత్సవాలు
సత్యవేడు: శ్రీసిటీ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డు శుక్రవారం 12 పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు, 11 నూ తన పరిశ్రమలకు భూ మిపూజ చేయనున్నా రు. పెప్సీకో కంపెనీ సీఈవో ఇంద్రనూయి, ఇతర ప్రముఖుల సమక్షంలో ముఖ్యమంత్రి తొలుత పెప్సీకో పానీయ, ఆహార వస్తు ఉత్పాదక కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం వెస్టుఫార్మా పరిశ్రమను ప్రారంభించి డేనియలీ కంపె నీ వందో వార్షికోత్సవంలో పాల్గొంటారు. తరువాత బిజినెస్ సెంటర్‌లో ఉత్పత్తి దశకు చేరిన జెడ్‌టీటీ, నిస్సాన్, నిట్టాన్, వాల్వ్, ఎంఎం హలీ టెక్, కుసాకబే, వైటల్ సొల్యూషన్, సిద్ధార్థ లాజి స్టిక్, సీఎక్స్ ప్రిసిషన్, ఆర్చురా ఫార్మాస్యూటికల్ ను ప్రారంభిస్తారు.
అనంతరం రెక్సామ్, వెర్మిరాన్, గోదావరి ఉద్యోగ్, ఆయుర్వేట్, బిరోలెక్స్, పవర్ గ్యాస్ ఎనర్జీ, బెవాసిలికోన్స్, కాస్పెఫ్ట్‌పాలిప్రో, పేజిల్, కేజీఐక్లాతింగ్, బ్రిండ్కో కంపెనీలకు భూమి పూజ చేస్తారు. అనంతరం మీడియా ప్రతినిధులు, స్ధానిక ప్రముఖులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం హంటర్ డగ్లస్ పరిశ్రమను ప్రారంభిస్తారు. కొబెల్ క్రేన్స్‌కు చేరుకుని ఎగుమతి చేయనున్న తొలి క్రేన్‌కు జెండా ఊపుతారు. ఈ సందర్భంగా శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబునాయుడు రాష్ట్రముఖ్యమంత్రిగా తొలిసారి శ్రీసిటీకి రావడం ఆనంద దాయకమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానం ఆశాజనకంగా ఉందన్నారు. నూతన పారిశ్రామిక విధానం ద్వారా పారిశ్రామిక సంస్థలు తమ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ను, శ్రీసిటీని ఎంచుకుంటున్నారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పెప్సీకో అధినేత ఇంద్రనూయి శ్రీసిటీకి రావడంపై హర్షం వ్యక్తం చేశారు. దేశంలో అతి పెద్ద పెప్సీకో ప్లాంటును శ్రీసిటీలో నెలకొల్పడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయన్నారు. రాష్ట్రమంత్రులు, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, రాష్ట్ర, జిల్లా అధికారులు పాల్గొంటారని ఆయన తెలిపారు.