వరదయ్యపాళెం (చిత్తూరు జిల్లా): మరో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు శ్రీసిటీని వరించాయి. నీటి వనరుల సంరక్షణ, నిర్వహణలో అత్యుత్తమ విధానాలు పాటిస్తున్నందుకు సీఐఐ (భారత పారిశ్రామిక సమాఖ్య) రెండు ప్రతిష్టాత్మక అవార్డులకు శ్రీసిటీని ఎంపిక చేసింది. శ్రీసిటీ చేపడుతున్న నీటి సుస్థిరత, అభివృద్ధి చర్యలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. ఆగస్టు 28న సీఐఐ నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డులను శ్రీసిటీ యాజమాన్యం అందుకోనుంది. దీనిపై సంతోషాన్ని వ్యక్తం చేసిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఇది నిజంగా తాము గర్వించదగ్గ గుర్తింపుగా వ్యాఖ్యానించారు. బాధ్యతాయుతమైన కార్పొరేట్‌గా నీటి వనరులను సంరక్షించడానికి, నీటి నిల్వలు పెంచడానికి శ్రీసిటీ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ అవార్డులు తమ సిబ్బందికి మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వడంతో పాటు వారి భవిష్యత్ ప్రయత్నాలకు మంచి ప్రేరణ ఇస్తాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment