Confederation of Indian Industry
-
పన్నుల విషయంలో అనిశ్చితి
న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్‌కు రూ. 32,400 కోట్ల జీఎస్టీ ఎగవేత నోటీసులివ్వడంపై ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ స్పందించింది. ఐటీ పరిశ్రమ నిర్వహణ విధానాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదనడానికి తాజా పన్ను నోటీసుల ఉదంతమే నిదర్శనమని పేర్కొంది. పలు కంపెనీలు ఇలాంటి అనవసరమైన లిటిగేషన్లను, పన్నుల విషయంలో అనిశి్చతిని ఎదుర్కొంటున్నాయని కూడా తెలిపింది. ‘పరిశ్రమ వ్యాప్తంగా ఇలాంటి సమస్య నెలకొంది. జీఎస్టీ కౌన్సిల్లో తీసుక్ను నిర్ణయాలు, సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేస్తుంది. చట్టాలను అమలు చేసే యంత్రాంగాలు వీటిని పాటించాలి. దీనివల్ల నోటీసులతో అనిశి్చతికి దారితీయదు, అలాగే భారత్‌లో వ్యాపార సానుకూలతపై ప్రభావం చూపకుండా ఉంటుంది’ అని నాస్కామ్ పేర్కొంది. రివర్స్ చార్జ్ మెకానిజం (ఆర్సీఎం) ద్వారా జీఎస్టీని వర్తింపజేయడం వల్లే సమస్య ఉత్పన్నమవుతోందని అభిప్రాయపడింది. ‘భారత ఐటీ కంపెనీల ప్రధాన కార్యాలయాలు తమ విదేశీ శాఖలకు పంపే నిధులపై జీఎస్టీ అధికారులు పన్ను ఎగవేత నోటీసులు ఇస్తున్నారు. ఈ ఆర్సీఎం విషయంలో హెడ్ ఆఫీసు, విదేశీ బ్రాంచ్ మధ్య ఎలాంటి సేవల లావాదేవీలు జరగలేదు. ఇది బ్రాంచ్ నుంచి హెడ్ ఆఫీసు సేవలను పొందడం కిందికి రాదనే విషయాన్ని అధికారులు విస్మరిస్తున్నారు. ఇదేమీ కొత్త సమస్య కాదు. ఇప్పటికే పలు కేసుల్లో కోర్టులు ఐటీ పరిశ్రమకు అనుకూలంగా తీర్పులిచ్చాయి. ఓ పెద్ద ఐటీ కంపెనీకి ఇలాంటి కేసులోనే జారీ చేసిన జీఎస్టీ నోటీసుపై కర్నాటక హైకోర్టు స్టే ఇచ్చింది’ అని నాస్కామ్ వివరించింది. దీనికి సంబంధించి స్పష్టతనిచ్చేలా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులివ్వాలని విజ్ఞప్తి చేసింది. -
సీఐఐ సదరన్ రీజియన్ చైర్మన్‌గా కమల్ బాలి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: 2023–24 సంవత్సరానికి గాను పరిశ్రమల సమాఖ్య సీఐఐ సదరన్ రీజియన్ చైర్మన్‌గా కమల్ బాలి, డిప్యుటీ చైర్‌పర్సన్‌గా ఆర్ నందిని ఎన్నికయ్యారు. 2022–23కి గాను సీఐఐ సదరన్ రీజియన్ చైర్‌పర్సన్‌గా భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు సుచిత్రా ఎల్లా వ్యవహరిస్తున్నారు. వోల్వో గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్‌గా ఉన్న కమల్ బాలికి సీఐఐతో చిరకాల అనుబంధం ఉంది. 2022–23కి గాను ఆయన సీఐఐ సదరన్ రీజియన్ డిప్యుటీ చైర్మన్‌గా ఉన్నారు. పరిశ్రమలోని పలు సంస్థలు, ఇన్వెస్ట్ కర్ణాటక ఫోరం మొదలైన వాటిలో ఆయన వివిధ హోదాల్లో సేవలు అందిస్తున్నారు. అటు నందిని .. చంద్ర టెక్స్టైల్స్ సంస్థకు ఎండీగా ఉన్నారు. ఆమె సీఐఐ కార్యకలాపాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. సీఐఐ సదరన్ రీజనల్ కౌన్సిల్లో సభ్యురాలిగా, సీఐఐ నేషనల్ కౌన్సిల్ టాస్క్ ఫోర్స్ (గ్రామీణాభివృద్ధి, వలస కార్మికులు)కు కో–చైర్‌పర్సన్‌గా ఉన్నారు. అలాగే పలు సంస్థల్లో డైరెక్టరుగా కూడా వ్యవహరిస్తున్నారు. మరోవైపు, హైదరాబాద్‌లోని టీ–హబ్‌లో ఇన్నోవేషన్, ఎంట్రప్రెన్యూర్షిప్ అండ్ స్టార్టప్స్ (సీఐఈఎస్) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను సీఐఐ ప్రారంభించింది. తెలంగాణ ప్రభుత్వం, ప్రతీక్షా ట్రస్ట్స్‌తో కలిసి ఏర్పాటు చేసిన ఈ ప్లాట్‌ఫాం .. ఔత్సాహిక వ్యాపారవేత్తలకు అవసరమైన తోడ్పాటు అందించేందుకు ఉపయోగపడగలదని తెలిపింది. తెలంగాణ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సీఐఐ సీఐఈఎస్ చైర్మన్ క్రిస్ గోపాలకృష్ణన్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. -
వడ్డీ రేట్ల పెంపు వేగాన్ని తగ్గించండి.. ఆర్బీఐకి సీఐఐ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: వడ్డీ రేట్ల పెంపు వేగాన్ని కాస్త తగ్గించే అంశాన్ని పరిశీలించాలని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)కి పరిశ్రమల సమాఖ్య సీఐఐ విజ్ఞప్తి చేసింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను కట్టడి చేసేందుకే ఆర్బీఐ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 190 బేసిస్ పాయింట్ల మేర పెంచినప్పటికీ .. దాని ప్రతికూల ప్రభావాలు ప్రస్తుతం కార్పొరేట్ రంగంపై కనిపిస్తున్నాయని పేర్కొంది. జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో 2,000 పైచిలుకు కంపెనీల ఆదాయాలు, లాభాలు ఒక మోస్తరు స్థాయికే పరిమితమయ్యాయని తమ విశ్లేషణలో వెల్లడైనట్లు సీఐఐ తెలిపింది. దీంతో ‘అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా దేశీయంగా వృద్ధికి సవాళ్లు ఎదురయ్యే నేపథ్యంలో గతంలో లాగా 50 బేసిస్ పాయింట్ల స్థాయిలో కాకుండా వడ్డీ రేట్ల పెంపు వేగాన్ని కాస్త తగ్గించడాన్ని పరిశీలించాలి‘ అని ఆర్బీఐని సీఐఐ కోరింది. ఇంకా 6 శాతం ఎగువనే ఉంటున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు అవసరమైతే మరో 25 నుండి 35 బేసిస్ పాయింట్ల వరకూ మాత్రమే పెంచే అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. ఆర్బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) డిసెంబర్ తొలి వారంలో వడ్డీ రేట్ల విషయంలో నిర్ణయాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో సీఐఐ విజ్ఞప్తి ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటు ధరలను కట్టడి చేస్తూనే అటు వృద్ధికి కూడా ఊతమిచ్చేలా ఆర్బీఐ గతంలో లాగా తన అమ్ములపొదిలో ఉన్న అస్త్రాలన్నీ ఉపయోగించాలని సీఐఐ అభిప్రాయపడింది. అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు రిస్కులను తీసుకోవడానికి ఇష్టపడని ధోరణులు పెరుగుతుండటం .. భారత్‌లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని వివరించింది. దీనితో కరెంటు అకౌంటు లోటును భర్తీ చేసుకోవడంలోనూ సవాళ్లు ఎదురుకానున్నట్లు పేర్కొంది. ప్రభుత్వం కేవలం విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులను (ఎఫ్‌పీఐ) మాత్రమే ఎక్కువగా పట్టించుకోవడం కాకుండా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), ఎన్నారై నిధుల ప్రవాహంపై కూడా దృష్టి పెట్టాలని సీఐఐ అభిప్రాయపడింది. -
కోవిడ్–19 తర్వాత భారత్ మరింత శక్తివంతం
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి తర్వాత భారత్ ఎకానమీ మరింత శక్తివంతంగా మారిందని ప్రముఖ ఆర్థికవేత్త, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యులు సంజీవ్ సన్యాల్ పేర్కొన్నారు. పారిశ్రామిక వేదిక– కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, భారత్ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని, చైనాకన్నా ఈ వేగం రెట్టింపు ఉందని అన్నారు. మహమ్మారి కాలంలో ప్రభుత్వం ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించిందని, దేశ బ్యాంకింగ్ రంగాన్ని ప్రక్షాళన చేసిందని అన్నారు. ఒప్పందాల సమర్థవంతమైన అమలు, జైలు సంస్కరణలు కేంద్రం తదుపరి సంస్కరణ ఎజెండాగా ఉండాలని పేర్కొన్నారు. -
బ్రిటన్–భారత్ పరిశ్రమల టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
లండన్: స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) సాకారం అయ్యే దిశగా పరిశ్రమల మధ్య సహకారాన్ని మరింత పెంపొందించుకునే ఉద్దేశంతో భారత్, బ్రిటన్ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశాయి. కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్రిటీష్ ఇండస్ట్రీ (సీబీఐ), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) కలిసి ఈ జాయింట్ కమిషన్‌ను ఏర్పాటు చేశాయి. ఇరు దేశాలకూ ప్రయోజనం చేకూర్చే విధంగా ఎఫ్‌టీఏను తీర్చిదిద్దేందుకు అవసరమైన అంశాలపై చర్చించేందుకు ఇది వేదికగా ఉంటుందని సీబీఐ ప్రెసిడెంట్ లాార్డ్ కరణ్ బిలిమోరియా తెలిపారు. కోవిడ్, ఉక్రెయిన్ సంక్షోభ ప్రభావాల నుంచి ఇరు దేశాలు కోలుకునే క్రమంలో వాణిజ్యం, పర్యావరణం, ఆరోగ్య రంగం మొదలైన విభాగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవడంపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎఫ్‌టీఏ సాకారమైతే 2035 నాటికి బ్రిటన్–భారత్ మధ్య వాణిజ్యం 28 బిలియన్ పౌండ్లకు చేరుతుందని అంచనా. ప్రస్తుతం ఇది 23 బిలియన్ పౌండ్ల స్థాయిలో ఉంది. -
సవాళ్లను ఎదుర్కొనేందుకు సన్నద్ధం
న్యూఢిల్లీ: అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు సహా అంతర్జాతీయ పరిణామాల వల్ల తలెత్తే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉందని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీతో సమావేశంలో మంత్రి చెప్పారు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత భారత్ అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయిందని ఆమె తెలిపారు. ప్రస్తుతం మహమ్మారి అనంతరం ప్రపంచంలో పరిస్థితులు మారిపోయాయని, భారత్ ఈసారి అవకాశాలను జారవిడుచుకోకుండా పారిశ్రామిక రంగం చూడాలని ఆమె పేర్కొన్నారు. జీఎస్టీలోకి ఏటీఎఫ్‌పై చర్చ.. కాగా, విమాన ఇంధనాన్ని (ఏటీఎఫ్) వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) పరిధిలోకి చేర్చే అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్ తదుపరి సమావేశంలో చర్చించనున్నట్లు అసోచాం సమావేశంలో నిర్మలా సీతారామన్ చెప్పారు. మరోవైపు, బ్యాంకింగ్‌పరంగా సహకారం లభించేలా ఏవియేషన్‌కు పరిశ్రమ హోదా ఇవ్వాలన్న విజ్ఞప్తిపై బ్యాంకులతో మాట్లాడతామని ఆమె చెప్పారు. పెట్టుబడులకు ఆహ్వానం... వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్లో చేసిన ప్రతిపాదనల ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలని సీతారామన్ సూచించారు. వృద్ధి వేగం పుంజుకునేలా సత్వరం పెట్టుబడులను పెంచడంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. పరిశ్రమ వర్గాల సమాఖ్య సీఐఐ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు. -
‘గత ప్రభుత్వాలకు నిర్ణయాలు తీసుకునే ధైర్యం లేదు’
సాక్షి, న్యూఢిల్లీ: గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన, రాజకీయంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే ధైర్యం లేదని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకొని వాటిని అమలుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. బుధవారం భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చవల్‌గా మాట్లాడారు. తమ ప్రభుత్వం 2014 నుంచి పలు కీలకైన సంస్కరణలు తీసుకువచ్చిందని గుర్తుచేశారు. అదే విధంగా పాలన పరంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. గత ప్రభుత్వాలు పాలన, రాజకీయంగా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవకపోవటం వల్ల జీఎస్టీ సంస్కరణలు ఏళ్ల తరబడి నిలిచిపోయాయని పేర్కొన్నారు. తమ ప్రభుత్వవం జీఎస్టీని అమలు చేయటమే కాదు, రికార్డు స్థాయిలో పన్నులు వసూలు చేసినట్లు ప్రధాని మోదీ వివరించారు. ఈ సంస్కరణల మూలంగానే భారత్ రికార్డు స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించినట్లు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కాలంలో ప్రజలుకు ఉపయోగపడే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. భారత్ ఎకానమీ వృద్ధి నెమ్మదిగా పెరుగుతోందని తెలిపారు. దానికి పరిశ్రమలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాని పేర్కొన్నారు. పరిశ్రమలు నూతన లక్ష్యాలను ఏర్పరుచుకొని, దేశం స్వావలబన దిశగా అడుగులు వేయాడానికి కృషి చేయాలని ప్రదాని మోదీ పిలుపునిచ్చారు. -
శ్రీసిటీకి మరో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు
వరదయ్యపాళెం (చిత్తూరు జిల్లా): మరో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు శ్రీసిటీని వరించాయి. నీటి వనరుల సంరక్షణ, నిర్వహణలో అత్యుత్తమ విధానాలు పాటిస్తున్నందుకు సీఐఐ (భారత పారిశ్రామిక సమాఖ్య) రెండు ప్రతిష్టాత్మక అవార్డులకు శ్రీసిటీని ఎంపిక చేసింది. శ్రీసిటీ చేపడుతున్న నీటి సుస్థిరత, అభివృద్ధి చర్యలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. ఆగస్టు 28న సీఐఐ నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డులను శ్రీసిటీ యాజమాన్యం అందుకోనుంది. దీనిపై సంతోషాన్ని వ్యక్తం చేసిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఇది నిజంగా తాము గర్వించదగ్గ గుర్తింపుగా వ్యాఖ్యానించారు. బాధ్యతాయుతమైన కార్పొరేట్‌గా నీటి వనరులను సంరక్షించడానికి, నీటి నిల్వలు పెంచడానికి శ్రీసిటీ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ అవార్డులు తమ సిబ్బందికి మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వడంతో పాటు వారి భవిష్యత్ ప్రయత్నాలకు మంచి ప్రేరణ ఇస్తాయన్నారు. -
అన్ని పరిశ్రమలు, వ్యాపారాలను అనుమతించాలి
న్యూఢిల్లీ: ఆర్థిక కార్యకలాపాలు అధిక స్థాయిల్లో ఉండే అన్ని జిల్లాల్లోనూ తక్షణమే అన్ని రకాల పరిశ్రమలు, వ్యాపారాలను అనుమతించాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. లాక్డౌన్ జోన్లుగా గుర్తించే విషయంలో జిల్లాల ఆర్థిక ఉత్పాదకతను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. రెడ్‌జోన్ ప్రాంతాల్లోనూ ఉన్నత స్థాయి భద్రతా చర్యలు తీసుకోవడం ద్వారా పరిశ్రమలు, వ్యాపారాలను అనుమతించాల్సిన అవసరాన్ని ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో తెలియజేసింది. -
రుణమాఫీలు తాత్కాలిక ఉపశమనం మాత్రమే!
సాక్షి, హైదరాబాద్: రైతుల కష్టాలను తీర్చే ఉద్దేశంతో ప్రభుత్వాలు ప్రకటించే రుణమాఫీలపై తనకు నమ్మకం లేదని.. పండించిన పంటకు తగిన ధర చెల్లించగలిగితే రైతులు కూడా రుణమాఫీల కోసం ఎదురుచూడరని భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. రుణమాఫీ వంటివి తాత్కాలిక ఉపశమనం కలిగించవచ్చుగానీ... రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు, పారిశ్రామిక వేత్తలు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో శనివారం అగ్రిటెక్ –సౌత్ విజన్ 2020 పేరిట 3 రోజుల సదస్సు ప్రారంభమైంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), వ్యవసాయ వర్సిటీలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు హాజరైన ఉపరాష్ట్రపతి సుస్థిర వ్యవసాయ అభివృద్ధికి వినూత్న ఆలోచనల అవసరముందన్నారు. వరి, గోధుమ వంటి తిండిగింజల ఉత్పత్తి నుంచి రైతు లు పక్కకు జరిగి, పంటల సాగుతోపాటు పాడి, పశుపోషణలను కూడా చేపడితే అదనపు ఆదాయం సమకూరుతుందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ వీసీ డాక్టర్ ప్రవీణ్ రావు, అగ్రిటెక్ సౌత్ సదస్సు చైర్మన్ అనిల్ వి.ఏపూర్, ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ పీటర్ కార్‌బెరీ తదితరులు పాల్గొన్నారు. -
‘డిగ్రీ’ వద్దు.. ‘డిప్లొమా’ ముద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్య లక్షకు పైగా తగ్గిపోయింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), డెలాయిట్ సంస్థ సంయుక్తంగా వెల్లడించిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అంతేకాదు గతంతో పోల్చితే మన రాష్ట్రంలో కాలేజీల సంఖ్య కూడా పెరిగిందని ‘యాన్యువల్ స్టేటస్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ (ఏఎస్‌హెచ్‌ఈ) ఆఫ్ స్టేట్స్ అండ్ యూటీస్ ఇన్ ఇండియా–2016’నివేదిక తెలిపింది. ఈ నివేదికను సీఐఐ ఇటీవల విడుదల చేసింది. ఏఎస్‌హెచ్‌ఈ–2015 నివేదిక ప్రకారం రాష్ట్రం లో 13,82,137 మంది విద్యార్థులు వివిధ ఉన్నత విద్యా కోర్సులను అభ్యసించగా, 2016 నివేదిక ప్రకారం 12,81,443 మందే ఉన్నత విద్యను అభ్యసిస్తున్నట్లు వెల్లడైంది. మొత్తం లక్షమంది విద్యార్థులు తగ్గగా.. ఒక్క డిగ్రీలోనే 79,880 మంది తగ్గిపోయారు. అలాగే గతంలో రాష్ట్రంలో మొత్తం 2,256 కాలేజీలు ఉంటే 2016 నివేదిక ప్రకారం వాటి సంఖ్య 2,536కు పెరిగింది. అంటే 284 కాలేజీలు పెరిగాయి. పెరిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్య మొత్తంగా తగ్గినా.. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. గతంలో కంటే ఈసారి బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో కాలేజీల్లో చేరిన విద్యార్థుల సంఖ్య పెరిగిందని నివేదిక వెల్లడించింది. 2015 నివేదిక ప్రకారం ఎస్సీ విద్యార్థులు 15.8 శాతం ఉన్నత విద్యను అభ్యసిస్తే.. 2016లో 16.2 శాతానికి పెరిగింది. బీసీ విద్యార్థులు అంతకుముందు 42.5 శాతం మంది ఉన్నత విద్యను అభ్యసించగా, తాజాగా 44 శాతానికి పెరిగింది. ఎస్టీ విద్యార్థులు గతంలో 7.4 శాతం ఉండగా, ప్రస్తుతం 8.4 శాతానికి పెరిగింది. ముస్లిం విద్యార్థుల సంఖ్య గతంలో 6.5 శాతం ఉంటే.. ఈసారి 6.8 శాతానికి చేరింది. డిప్లొమాకు పెరుగుతున్న ఆదరణ రాష్ట్రంలో డిప్లొమా కోర్సులు చదివే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. గత నివేదికతో పోలిస్తే 2016లో 15,042 మంది అత్య«ధికంగా డిప్లొమా కోర్సుల్లో చేరారు. మన రాష్ట్రాల్లోనే ఎక్కువ అధ్యాపకులు ఎక్కువ మంది ఉన్న రాష్ట్రాల్లో కేరళ, కర్ణాటక ముందున్నాయి. అక్కడ ఉన్నత విద్యను బోధించేందుకు 13 మంది విద్యా ర్థులకు ఒక అధ్యాపకుడు ఉండగా.. తెలం గాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో 14 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉన్నారు. దేశ వ్యాప్తంగా చూస్తే సరాసరి ప్రతి 21 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు పని చేస్తున్నట్లు వెల్లడించింది. -
నవంబర్‌లో నిర్మాణరంగ యంత్రాల ప్రదర్శన
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : దక్షిణాసియాలోనే అతిపెద్ద నిర్మాణరంగ యంత్రాల ప్రదర్శనను బెంగళూరులో నిర్వహిస్తున్నట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) తెలిపింది. ‘ఎక్స్‌కాన్ 2015’ పేరుతో నవంబర్ 25 నుంచి 29 వరకు నిర్వహించే ఈ ప్రదర్శనలో 275 విదేశీ కంపెనీలు పాల్గొంటాయని సీఐఐ చైర్పర్సన్ (తెలంగాణ) వనితా దాట్ల తెలిపారు. ఎక్సకాన్ 2015 రోడ్‌షోలో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఈ ఎగ్జిబిషన్లో 800 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటారని, 35,000 మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ ఐదు రోజుల ప్రదర్శన సందర్భంగా సుమారు 200 కొత్త ఉత్పత్తులు మార్కెట్లోకి విడుదలకానున్నాయి. దేశీయ నిర్మాణరంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, మేకిన్ ఇండియా విజయవంతం కావడానికి అనుసరించాల్సిన విధానాలపై ఈ సదస్సు ప్రధానంగా దృష్టి పెడుతుందన్నారు. -
ఎంఎస్ఎంఈకి బడ్జెట్ జోష్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా(ఎంఎస్ఎంఈ) పరిశ్రమల రంగానికి మంచి రోజులని చెప్పడానికి బడ్జెట్ ప్రతిపాదనలే నిదర్శనమని పారిశ్రామిక వర్గాలు అంటున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు రూ.10 వేల కోట్ల ఫండ్ కేటాయించడంతో ఎంఎస్ఎంఈ రంగం కొత్త పుంతలు తొక్కేందుకు పునాది పడిందని చెబుతున్నాయి. అదే స్థాయిలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నది నిపుణుల మాట. జీడీపీలో తయారీ రంగం వాటా ప్రస్తుతం 15-16 శాతంగా ఉంది. రానున్న రోజుల్లో ఇది 25 శాతానికి చేరవచ్చని నిపుణులు అంటున్నారు. మరింత మంది ముందుకు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వేలాది మంది పారిశ్రామికవేత్తలు వ్యాపార, వాణిజ్య రంగంలో విజయవంతంగా రాణిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో మరింత మంది వ్యాపారం చేసేందుకు ముందుకు వస్తారని అసోచాం దక్షిణ భారత చైర్మన్, శ్రీసిటీ ఎండీ రవి సన్నారెడ్డి అన్నారు. ప్రభుత్వ తోడ్పాటు ఒక్కటే సరిపోదని, చిన్న కంపెనీల వ్యాపారాభివృద్ధికి భారీ పరిశ్రమలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భారీ పరిశ్రమల కంటే ఎంఎస్ఎంఈలే ఉద్యోగావకాశాలకు అధికంగా కల్పిస్తాయన్నారు. తయారీకి ఊతమిచ్చేలా బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయని ఎలికో ఎండీ రమేష్ దాట్ల తెలిపారు. మూడు రెట్ల వృద్ధి.. దేశీయ పారిశ్రామిక ఉత్పత్తిలో ఎంఎస్ఎంఈ వాటా ప్రస్తుతం 45 శాతంపైగా ఉంది. ఎగుమతుల్లో ఈ రంగం వాటా 40 శాతంపై మాటే. ఈ రంగంలో 3 కోట్లకుపైగా కంపెనీలున్నాయి. 6-7 కోట్ల మంది పనిచేస్తున్నారు. ఏటా కొత్తగా 13 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందీ రంగం. బడ్జెట్ ప్రతిపాదనలు కార్యరూపంలోకి వస్తే మూడేళ్లలో ఎంఎస్ఎంఈల వ్యాపారం రెండు మూడు రెట్లు పెరగడం ఖాయమని విశ్లేషకులు, స్కార్లెట్ ఇండస్ట్రీస్ ఎండీ మండవ శ్రీరామ్ మూర్తి తెలిపారు. దేశవ్యాప్తంగా కొత్త కంపెనీలు వెల్లువలా ఏర్పాటవుతాయని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చే ప్రోత్సాహకాలు ఏమిటో కేంద్రం నుంచి స్పష్టత వస్తే.. ఈ రెండు రాష్ట్రాల్లో కొత్త ప్లాంట్లు ఏర్పాటై పారిశ్రామిక అభివృద్ధి దూసుకెళ్తుందని చెప్పారు. వెల్లువలా ప్రైవేటు ఈక్విటీలు.. చక్కని వ్యాపార ప్రణాళికలున్నా నిధులు లేక కార్యరూపంలోకి రాని ప్రతిపాదనలు ఎన్నో ఉన్నాయి. స్టార్టప్‌ల ఏర్పాటుకు రూ.10 వేల కోట్లు కేటాయించడం పెద్ద సంచలనమేనని, రానున్నది స్టార్టప్ ఇండియా అని ఎస్ఈసీ ఇండస్ట్రీస్ ఎండీ డి.విద్యాసాగర్ అన్నారు. ప్రభుత్వం తీసుకున్న చొరవ కారణంగా స్టార్టప్‌లకు అదనపు నిధులు సమకూర్చేందుకు ప్రైవేటు ఈక్విటీ సంస్థలు ముందుకు వస్తాయని పేర్కొన్నారు. రక్షణ రంగంలో ఎఫ్‌డీఐల పరిమితిని 26 నుంచి 49కి చేర్చారు. దీంతో రక్షణ రంగ పరికరాల తయారీ దేశీయంగా అధికమవుతుందని అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇక్కడి కంపెనీలకు బదిలీ అవుతుందని, చిన్న కంపెనీలకు సబ్ కాంట్రాక్టులు ఎక్కువ అవుతాయని వివరించారు. -
హైదరాబాద్‌లో కూర్చుని ఆంధ్రా అభివృద్ధా?
సాక్షి, విశాఖపట్నం:‘హైదరాబాద్‌లో కూర్చుని ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసేస్తామంటే జరిగేపని కాదు.. హైదరాబాద్ ఇడ్లీలు తిని, అక్కడి ప్రభుత్వానికి పన్నులు చెల్లించడం తప్ప! ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు గడుస్తున్నా.. ఆ ఛాయలేం కనిపించట్లేద’ని విశాఖ ఎంపీ కంభంపాటి హరి బాబు ఆక్షేపించారు. విశాఖలో భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. -
ఇలా చేస్తే తెలంగాణ ఆర్థికాభివృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయింది. ఇదంతా సరే. మరిప్పుడు ఏం చేయాలి. రెండు రాష్ట్రాలు ఎలా అభివృద్ధి సాధించాలి. ఇతర రాష్ట్రాలతో ఎలా పోటీ పడాలి. పోటీలో ఎలా నిలదొక్కుకోవాలి. ఇక్కడి వనరులను ఎలా సద్వినియోగం చేసుకోవాలి. పారిశ్రామికంగా, విద్య, ఉద్యోగం, ఉపాధి, ఆరోగ్యం, మౌలిక వసతులు.. ఇలా అన్ని రంగాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలి. రెండు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై పరిశ్రమ నిపుణులు చేసిన సూచనల ఆధారంగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) ఒక చర్చనీయాంశ(ఎజెండా) ప్రతిని రూపొందించింది. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఈ ప్రతిపాదనలను తప్పనిసరి చేయాల్సిందిగా రాజకీయ పార్టీలను కోరుతోంది. ఇరు రాష్ట్రాల అభివృద్ధిలో తాము భాగస్వామ్యమవుతామని సీఐఐ స్పష్టం చే స్తోంది. హైదరాబాద్ వెలుపల.. పెట్టుబడులను ఆకర్షించడంలో హైదరాబాద్ తన హవాను కొనసాగిస్తుంది. అయితే తదుపరి అభివృద్ధి రామగుండం, వరంగల్, మెదక్, ఖమ్మం, నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ వంటి ప్రాంతాల్లో చేపట్టాలి. అభివృద్ధి కావాలంటే పారిశ్రామిక వృద్ధి తప్పనిసరి. ప్రతి జిల్లాలో ప్రధాన పరిశ్రమను గుర్తించాలి. నూతన వ్యాపార అవకాశాలను అందుకునేలా ద్వితీయ, తృతీయశ్రేణి నగరాల్లోని ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను వెన్నుతట్టాలి. ఉద్యోగిత, వ్యవస్థాపకత ఈ రెండూ కేంద్రంగా విధాన చర్యలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాలు, పరిశ్రమ, విద్యా నిపుణుల భాగస్వామ్యంతోనే ఆర్థిక వ్యూహాల అమలు. పరిశ్రమలో స్నేహపూర్వక పోటీ. పారిశ్రామికవేత్తలు ఏ ప్రాంతం వారైనా వ్యాపార కార్యకలాపాలు సాఫీగా సాగేందుకు సహృద్భావ వాతావరణం. ఇరు ప్రాంతాల్లో సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించాలంటే తెలంగాణ, సీమాంధ్ర మధ్య ఆర్థిక అనుసంధానం కొనసాగాలని సీఐఐ విశ్వసిస్తోంది. విద్య, ఉపాధి కల్పన, నైపుణ్యం: 2018-19 వరకు స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో(జీఎస్డీపీ) 6 శాతం విద్యకు కేటాయింపు. ప్రైవేటు భాగస్వామ్యంతో టీచర్ ట్రైనింగ్ కళాశాలలు. పనితీరు ఆధారంగా కళాశాలలకు రేటింగ్. కంపెనీలకు ఉద్యోగ కల్పన ఆధారిత ప్రోత్సాహకాలు. ‘ఇన్స్పెక్టర్ రాజ్’ వ్యవస్థ నిర్మూలన. ఏకైక సమగ్ర తనిఖీ వ్యవస్థ. పాఠశాలల స్థాయిలోనే పాఠ్యాం శంగా వ్యవస్థాపకత(ఎంట్రప్రెన్యూర్షిప్). వీసీ ఫండ్స్‌కు ప్రోత్సాహం. మహిళల ఉద్యోగిత, వ్యవస్థాపకతపై ప్రత్యేక దృష్టి. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా నగరాలకు వలసల తగ్గింపు. శిక్షణ ఇచ్చి వ్యవసాయేతర రంగాల్లో అవకాశాల సృష్టి. జిల్లాకో నైపుణ్య శిక్షణ కేంద్రం. హార్టికల్చర్, వెటర్నరీ, ఏవియేషన్ యూనివర్సిటీ, పాలిటెక్నిక్ కేంద్రాలు. ఆరోగ్యం: 2014 నాటికి సార్వజనీన ఆరోగ్య రక్షణ. స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో(జీఎస్డీపీ) 3 శాతం ఆరోగ్య రంగానికి కేటాయింపు. ప్రైవేటు భాగస్వామ్యానికి ప్రోత్సాహం. ఒక కుటుంబం నుంచి ఏటా రూ.3 వేలకు మించకుండా తక్కువ ప్రీమియంతో ఆరోగ్య బీమా. ఇది ఆరోగ్యశ్రీకి అదనం. మౌలిక వసతులు: ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో పూర్థి స్థాయి మౌలిక వసతులు. విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టాస్క్‌ఫోర్స్. ఇందుకోసం ప్రత్యేకంగా నిధి. కాజీపేటలో రైల్వే వ్యాగన్ల తయారీ యూనిట్. హైదరాబాద్-వరంగల్ మధ్య హై స్పీడ్ ట్రైన్లు. హైదరాబాద్-మంచిర్యాల మార్గంలో డబుల్ రైల్వే లైన్, కంటైనర్ డిపోలు. మెట్రో, ఎంఎంటీఎస్, సబర్బన్ ట్రైన్ల విస్తరణ, సామర్థ్యం పెంపు. కాజీపేట, హైదరాబాద్, కర్నూలు, రేణిగుంట మీదుగా ఢిల్లీ-బెంగళూరు ఫ్రైట్ కారిడార్, భువనగిరి(నల్లగొండ)లో మెట్రో కోచ్ ఫ్యాక్టరీ. హైదరాబాద్ నుంచి అన్ని జిల్లా కేంద్రాలకు ఆరు లేన్ల రహదారి. వరంగల్, ఆదిలాబాద్‌లో విమానాశ్రయం. వరంగల్-హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ కడప, రేణిగుంట వరకు ఏర్పాటు. మంచిర్యాల నుంచి భద్రాచలం వరకు మరో కారిడార్. జిల్లాకొక గ్రోత్ సెంటర్. సౌర, పవన విద్యుత్ ప్రోత్సాహం. రెండు రాష్ట్రాల మధ్య సరుకుల రవాణాకు తక్కువ పన్ను విధింపు. జీఎస్టీకి మద్దతు. పరిశ్రమలు, విద్యుత్: కొత్త కంపెనీలకు ట్యాక్స్ హాలిడే. ఇప్పటికే ఉన్న కంపెనీలు సామర్థ్యాన్ని 25 శాతం పెంచితే వీటికి కూడా వర్తింపు. భూముల లీజు విషయంలో దీర్ఘకాలిక వ్యూహం. గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు సరిపడా గ్యాస్ కేటాయింపు. పరిశ్రమలకు నిరంతర విద్యుత్. ఎంఎస్ఎంఈ పునరుజ్జీవనం. వస్త్రాలు/హ్యాండిక్రాఫ్ట్స్ పరిశ్రమకు ప్రత్యేక రాయితీ. కార్పొరేట్ డెట్ మార్కెట్‌కు ప్రోత్సాహం. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఏర్పాటయ్యే ఐటీ సేవల కంపెనీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు. అవసరమైన నిధులు సమకూర్చి ఎంఎస్ఎంఈకి ప్రోత్సాహం. అన్ని జిల్లాల్లో ఇండస్ట్రియల్ క్లస్టర్లు. క్లస్టర్లలో వ్యవసాయాధారిత, ఆహారోత్పత్తులు, నిర్మాణ రంగ ఉత్పత్తులు, వస్త్రాలు, తయారీ యూనిట్లు, లెదర్, టూరిజం ఆధారిత పరిశ్రమల స్థాపన. -
యువతకు ఊతం ఇవ్వాల్సింది ప్రభుత్వమే
విజయవాడ, న్యూస్‌లైన్ : ఉన్నత విద్య పూర్తిచేసిన వారికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ డాక్టర్ ఎస్ఎస్.మాన్తా అన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో మంగళవారం హోటల్ గేట్‌వేలో ‘ది రోల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టార్’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పలు ఇంజినీరింగ్, ఉన్నత విద్య కళాశాలలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. మాన్తా మాట్లాడుతూ.. టెక్నికల్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు పరిశ్రమల అవసరాలకు త గినట్లుగా స్కిల్స్ కలిగి ఉండటం లేదనడం సరికాద న్నారు. ఎప్పటికప్పుడు ఆధునిక పరిజ్ఞానంతో కూడిన కొత్త కోర్సులు ప్రవేశ పెడుతున్నట్లు చెప్పారు. ఇంజినీరింగ్ కాకుండా ఇతర కోర్సులు చదువుతున్నవారికి ఉద్యోగావకాశాలు తక్కువగా ఉంటున్నాయని అభిప్రాయపడ్డారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారిలో 20 శాతం మందికి కూడా ప్రభుత్వరంగంలో ఉద్యోగాలు లభించడం లేదని, ప్రయివేటు సెక్టార్లోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్నట్లు తెలిపారు. పబ్లిక్ సెక్టార్లో అధికశాతం మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం విస్తృతంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎఫ్ట్రానిక్స్ ఎండీ, సీఐఐ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్యానల్ రాష్ట్ర కన్వీనర్ డి.రామకృష్ణ మాట్లాడుతూ.. సాంకేతిక విద్యనభ్యసిస్తున్న వారిలో కంపెనీల అవసరాలకు అనుగుణంగా స్కిల్స్ ఉండటం లేదన్నారు. విద్యార్థి ఎంచుకున్న కోర్సును బట్టి పరిశ్రమలకు ఉపయోగపడే విధంగా కళాశాలలు శిక్షణ ఇవ్వాలని చెప్పారు. థియరీతో పాటు, ప్రాక్టికల్స్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇంపార్టెన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టార్ అనే అంశంపై ఆదిత్య ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ వైస్‌చైర్మన్ సతీష్‌రెడ్డి, డేటా ప్రైవసీ అండ్ అసోసియేటెడ్ రిస్క్స్ ఆన్ అకౌంటెంట్ ఆఫ్ నాన్ జెన్యూన్ సాప్ట్వేర్ అనే అంశంపై ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ మురళీ తలశిత, మైక్రోసాఫ్ట్ ప్ట్ ఇండియా డెరైక్టర్ అనీల్ వర్జీస్ తదితరులు ప్రసంగించారు. సమావేశానికి సీఐఐ నగర చైర్మన్ వీవీఎం.కృష్ణ అధ్యక్షత వహించారు. -
12వ ఆటో ఎక్స్‌పోలో కొత్త కార్ల సందడి