నవంబర్‌లో నిర్మాణరంగ యంత్రాల ప్రదర్శన | Construction machinery exhibition In November | Sakshi
Sakshi News home page

నవంబర్‌లో నిర్మాణరంగ యంత్రాల ప్రదర్శన

Published Sat, Sep 26 2015 12:08 AM | Last Updated on Sun, Sep 3 2017 9:58 AM

నవంబర్‌లో నిర్మాణరంగ యంత్రాల ప్రదర్శన

నవంబర్‌లో నిర్మాణరంగ యంత్రాల ప్రదర్శన

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : దక్షిణాసియాలోనే అతిపెద్ద నిర్మాణరంగ యంత్రాల ప్రదర్శనను బెంగళూరులో నిర్వహిస్తున్నట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) తెలిపింది. ‘ఎక్స్‌కాన్ 2015’ పేరుతో నవంబర్ 25 నుంచి 29 వరకు నిర్వహించే ఈ ప్రదర్శనలో 275 విదేశీ కంపెనీలు పాల్గొంటాయని సీఐఐ చైర్‌పర్సన్ (తెలంగాణ) వనితా దాట్ల తెలిపారు. ఎక్సకాన్ 2015 రోడ్‌షోలో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఈ ఎగ్జిబిషన్‌లో 800 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటారని, 35,000 మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

ఈ ఐదు రోజుల ప్రదర్శన సందర్భంగా సుమారు 200 కొత్త ఉత్పత్తులు మార్కెట్లోకి విడుదలకానున్నాయి. దేశీయ నిర్మాణరంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, మేకిన్ ఇండియా విజయవంతం కావడానికి అనుసరించాల్సిన విధానాలపై ఈ సదస్సు ప్రధానంగా దృష్టి పెడుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement