
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: 2023–24 సంవత్సరానికి గాను పరిశ్రమల సమాఖ్య సీఐఐ సదరన్ రీజియన్ చైర్మన్‌గా కమల్ బాలి, డిప్యుటీ చైర్‌పర్సన్‌గా ఆర్ నందిని ఎన్నికయ్యారు. 2022–23కి గాను సీఐఐ సదరన్ రీజియన్ చైర్‌పర్సన్‌గా భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు సుచిత్రా ఎల్లా వ్యవహరిస్తున్నారు. వోల్వో గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్‌గా ఉన్న కమల్ బాలికి సీఐఐతో చిరకాల అనుబంధం ఉంది.
2022–23కి గాను ఆయన సీఐఐ సదరన్ రీజియన్ డిప్యుటీ చైర్మన్‌గా ఉన్నారు. పరిశ్రమలోని పలు సంస్థలు, ఇన్వెస్ట్ కర్ణాటక ఫోరం మొదలైన వాటిలో ఆయన వివిధ హోదాల్లో సేవలు అందిస్తున్నారు. అటు నందిని .. చంద్ర టెక్స్‌టైల్స్ సంస్థకు ఎండీగా ఉన్నారు. ఆమె సీఐఐ కార్యకలాపాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. సీఐఐ సదరన్ రీజనల్ కౌన్సిల్‌లో సభ్యురాలిగా, సీఐఐ నేషనల్ కౌన్సిల్ టాస్క్ ఫోర్స్ (గ్రామీణాభివృద్ధి, వలస కార్మికులు)కు కో–చైర్‌పర్సన్‌గా ఉన్నారు.
అలాగే పలు సంస్థల్లో డైరెక్టరుగా కూడా వ్యవహరిస్తున్నారు. మరోవైపు, హైదరాబాద్‌లోని టీ–హబ్‌లో ఇన్నోవేషన్, ఎంట్రప్రెన్యూర్‌షిప్ అండ్ స్టార్టప్స్ (సీఐఈఎస్) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను సీఐఐ ప్రారంభించింది. తెలంగాణ ప్రభుత్వం, ప్రతీక్షా ట్రస్ట్స్‌తో కలిసి ఏర్పాటు చేసిన ఈ ప్లాట్‌ఫాం .. ఔత్సాహిక వ్యాపారవేత్తలకు అవసరమైన తోడ్పాటు అందించేందుకు ఉపయోగపడగలదని తెలిపింది. తెలంగాణ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సీఐఐ సీఐఈఎస్ చైర్మన్ క్రిస్ గోపాలకృష్ణన్ తదితరులు ఇందులో పాల్గొన్నారు.