
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి తర్వాత భారత్ ఎకానమీ మరింత శక్తివంతంగా మారిందని ప్రముఖ ఆర్థికవేత్త, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యులు సంజీవ్ సన్యాల్ పేర్కొన్నారు.
పారిశ్రామిక వేదిక– కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, భారత్ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని, చైనాకన్నా ఈ వేగం రెట్టింపు ఉందని అన్నారు. మహమ్మారి కాలంలో ప్రభుత్వం ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించిందని, దేశ బ్యాంకింగ్ రంగాన్ని ప్రక్షాళన చేసిందని అన్నారు. ఒప్పందాల సమర్థవంతమైన అమలు, జైలు సంస్కరణలు కేంద్రం తదుపరి సంస్కరణ ఎజెండాగా ఉండాలని పేర్కొన్నారు.