Economic Advisory Council
-
పీఎం ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ కన్నుమూత
ఆర్థికవేత్త, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ 'బిబేక్ దెబ్రాయ్' (69) శుక్రవారం ఉదయం 7 గంటలకు కన్నుమూశారు. ఈయన మృతికి నరేంద్ర మోదీ నివాళులు అర్పిస్తూ.. దేబ్రాయ్ ఉన్నత పండితుడని అభివర్ణించారు.డా. బిబేక్ దెబ్రాయ్ ఆర్థిక శాస్త్రం, చరిత్ర, సంస్కృతి, రాజకీయాలు, ఆధ్యాత్మికత వంటి విభిన్న రంగాలలో బాగా ప్రావీణ్యం కలిగి ఉన్నారు. తన రచనల ద్వారా భారతదేశ మేధో దృశ్యంలో చెరగని ముద్ర వేశారు. ప్రాచీన గ్రంథాలపై పని చేయడంలో ఆనందాన్ని పొందారని మోదీ ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా బిబేక్ దెబ్రాయ్ మృతికి సంతాపం తెలియజేసారు. ఆయన విశిష్ట ఆర్థికవేత్త, నిష్ణాతులైన రచయిత, అద్భుతమైన విద్యావేత్త. ఆర్థిక సమస్యలను అవలీలగా పరిష్కరిస్తూ.. భారతదేశ అభివృద్ధికి విశేష కృషి చేసిన ఈయన ప్రశంసనీయులని తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.Dr. Bibek Debroy Ji was a towering scholar, well-versed in diverse domains like economics, history, culture, politics, spirituality and more. Through his works, he left an indelible mark on India’s intellectual landscape. Beyond his contributions to public policy, he enjoyed… pic.twitter.com/E3DETgajLr— Narendra Modi (@narendramodi) November 1, 20242019 జూన్ 5 వరకు నీతి ఆయోగ్ సభ్యులుగా పనిచేసిన దెబ్రాయ్ పద్మశ్రీ అవార్డు గ్రహీత. పూణేలోని గోఖలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ (GIPE)కి ఛాన్సలర్‌గా పనిచేసిన ఈయన.. అనేక పుస్తకాలు, పేపర్లు, ప్రముఖ కథనాలను రచించారు. అంతే కాకుండా అనేక వార్తాపత్రికలతో కన్సల్టింగ్/కంట్రిబ్యూటింగ్ ఎడిటర్‌గా కూడా ఉన్నారు.నరేంద్రపూర్‌లోని రామకృష్ణ మిషన్ స్కూల్లో చదువుకున్న దెబ్రాయ్ కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో పనిచేశారు. ఆ తరువాత ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌లో పనిచేశారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు.Deeply saddened by the passing of Dr. Bibek Debroy. He was a distinguished economist, a prolific author as well as an excellent academician. He will be admired for his policy guidance on economic issues and noteworthy contributions to India’s development. His columns in… pic.twitter.com/y1niSMlxU7— Dharmendra Pradhan (@dpradhanbjp) November 1, 2024 -
2047 నాటికి ‘ఎగువ మధ్య తరగతి’ కేటగిరీలోకి భారత్!
న్యూఢిల్లీ: కొనుగోలు శక్తి సమానత్వం (పీపీపీ) నిబంధనల ప్రకారం, 2047 నాటికి భారతదేశం ‘ఎగువ మధ్య తరగతి’ కేటగిరీలోకి ప్రవేశించే అవకాశం ఉందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) చైర్మన్ వివేక్ దేవ్రాయ్ పేర్కొన్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే అధిక ఆదాయ కేటగిరీలో ఉన్నాయని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. భారత ఆర్థిక వృద్ధి రేటు పురోగతి కేవలం ఎగుమతులమీదే ఆధారపడి ఉందన్న అభిప్రాయం తప్పని ఆయన పేర్కొంటూ, దీనితోపాటు దేశాభివృద్ధికి బహుళ అవకాశాలు ఉ న్నాయని అన్నారు. ప్రపంచ బ్యాంక్ నిర్వచనం ప్ర కారం, తలసరి వార్షిక ఆదాయం 12,000 డాల ర్ల కంటే ఎక్కువ ఉన్న దేశాన్ని అధిక–ఆదాయ దేశంగా పరిగణిస్తారు. ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశాన్ని ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశంగా పరిగణిస్తున్నారు. 2047 నా టికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మా ర్చాలని ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా నిర్దేశించా రు. అభివృద్ధి చెందిన దేశం మానవ అభివృద్ధి సూ చిక (హెచ్‌డీఐ)లో దాదాపు తొలి స్థానాల్లో ఉంటుంది. సాధారణంగా అధిక స్థాయి ఆర్థిక వృద్ధి, సా« దార ణ జీవన ప్రమాణం, అధిక తలసరి ఆదా యంతో పా టు విద్య, అక్షరాస్యత, ఆరోగ్యాల విష యాల్లో మంచి ప్ర మాణాలను అభివృద్ధి చెందిన దేశం కలిగి ఉంటుంది. -
అధిక వృద్ధి బాటలోనే భారత్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఏజెన్సీలు భారత వృద్ధి రేటు అంచనాల్లో స్వల్ప కోతలు విధిస్తున్నప్పటికీ ఎకానమీ అధిక వృద్ధి బాటలోనే ఉందని ప్రధాని ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) సభ్యుడు సంజీవ్ సన్యాల్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దాదాపు 6.5 శాతం వృద్ధితో ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా అనిశ్చితుల నేపథ్యంలో మిగతా ఏ దేశంతో పోల్చి చూసినా భారత్ చాలా ముందే ఉందని సన్యాల్ పేర్కొన్నారు. ‘ఏడీబీ (ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్), ప్రపంచ బ్యాంక్ ఈ ఏడాదికి సంబంధించి వృద్ధి అంచనాలను స్వల్పంగానే కుదించాయి. ఈ అంచనాల ప్రకారం చూసినా భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా ఎదిగే ఎకానమీగా ఉంటుంది‘ అని ఆయన చెప్పారు. వినియోగం మందగించడం, అంతర్జాతీయంగా కఠిన పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్థిక వృద్ధి అంచనాలను ఇటీవలే 6.3 – 6.4 శాతం శ్రేణికి ఇటీవలే ప్రపంచ బ్యాంక్, ఏడీబీలు కుదించాయి. దీనివల్ల మనమేమీ వెనకబడిపోతున్నట్లుగా భావించాల్సిన అవసరం లేదని సన్యాల్ చెప్పారు. కేంద్రం తీసుకుంటున్న చర్యలతో 8 శాతం పైగా వృద్ధి రేటు సాధించే సత్తా ఉన్నప్పటికీ ఎగుమతులు, దిగుమతులపరంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల రీత్యా కొంత ఆచితూచి వ్యవహరించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాకా భారత్ వృద్ధి రేటు మరింత వేగవంతం కాగలదని సన్యాల్ చెప్పారు. వివిధ సంస్కరణలతో బ్యాంకింగ్ రంగాన్ని ప్రక్షాళన చేసినందున అమెరికా, యూరప్ బ్యాంకింగ్ సంక్షోభ ప్రభావాలు భారత ఆర్థిక రంగంపై ప్రత్యక్షంగా ఉండబోవని సన్యాల్ తెలిపారు. అయినప్పటికీ ప్రపంచ దేశాలన్నీ ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉన్నందున అప్రమత్తత కొనసాగించాల్సి ఉంటుందన్నారు. -
2023లో ప్రపంచ ఎకానమీ ఒడిదుడుకులు!
న్యూఢిల్లీ: గ్లోబల్ ఎకానమీలో ప్రస్తుతం తీవ్ర ఒత్తిడి పరిస్థితులు నెలకొన్నాయని ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడు సన్యాల్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఏజెన్సీలు ప్రపంచ ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి సంఖ్యలను పదేపదే డౌన్గ్రేడ్లు చేస్తున్నాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చే 2023 సంవత్సరం కూడా కష్టతరమైనదని చెప్పడానికి స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయని విశ్లేషించారు. ఎకానమీకి సంబంధించి ఆయన ఇచ్చిన ఒక తాజా ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు... ► వాణిజ్యలోటు (ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య నికర వ్యత్యాసం) భారీగా పెరిగిపోకుండా చర్యలు అవసరమే. ఒకే దేశంలో వాణిజ్యలోటు తీవ్రంగా పెరిగిపోకుండా పలు చర్యలు తీసుకోవడం జరుగుతోంది. మనకు కావాల్సిన ఉత్తులను వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది. (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య చైనాతో వాణిజ్యలోటు 51.1 బిలియన్ డాలర్లకు తాకిన నేపథ్యంలో సన్యాల్ ఈ వ్యాఖ్యలు చేశారు) ► భారతదేశ మొత్తం సరుకు వాణిజ్య లోటు పెరిగిన మాట వాస్తవమే. అయితే దేశీయ ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకోవడం, మిగిలిన ప్రపంచం మందగించడం దీనికి కారణం. ► ఇక భారత్ నుంచి ఎగుమతుల పెంపునకూ వ్యూహ రచన జరుగుతోంది. ఇక్కడ మనం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీమ్‌నూ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. పీఎల్ఐ పథకం లక్ష్యం– దేశీయ తయారీని ప్రపంచవ్యాప్త పోటీ వేదికపై నిలబెట్టడం, తయారీ రంగంలో ప్రపంచ ఛాంపియన్లను సృష్టించడం, ఎగుమతులను పెంచడం, ఉద్యోగ అవకాశాలను కల్పించడం. ► తూర్పు యూరప్‌లో ఇబ్బందులు, చైనాలో కోవిడ్ కేసుల విజృంభన వంటి అంశాలు భారత్‌సహా ప్రపంచంలోని పలు ఎకానమీలపై ప్రతికూలత చూపే అవకాశం ఉంది. అయితే సవాళ్లను తట్టుకుని నిలబడగలిగే స్థితిలో భారత్ ఉంది. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ వ్యవస్థగా కొనసాగుతోంది. 2023–24లో కూడా ఇదే హోదా కొనసాగిస్తుందన్న విశ్వాసం ఉంది. ► కాగా, కోవిడ్ తిరిగి తీవ్రమయ్యే అవకాశాలపై భారతదేశం అప్రమత్తంగా ఉండాలి. ► ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్ లోటు (దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) వంటి స్థూల ఆర్థిక స్థిరత్వ అంశాలపై జాగరూకత అవసరం. ► తక్షణం కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక భారత్ ఎకానమీ అవుట్‌లుక్ స్థిరంగా ఉంది. పాత పెన్షన్ పథకాల పునరుద్ధరణ సరికాదు..! ఉద్యోగుల వంతు జమతో (కాంట్రిబ్యూషన్) సంబంధంలేని పాత పెన్షన్ పథకాలు (ఓపీఎస్).. భవిష్యత్ తరాలపై దాడి వంటిదేనని సన్యాల్ పేర్కొన్నారు. కొన్ని ప్రతిపక్ష పాలక రాష్ట్రాల నుంచి వచ్చిన ‘పాత పెన్షన్ పథకాలను పునరుద్ధరణ డిమాండ్’ సరైంది కాదని స్పష్టం చేశారు. గత రెండు దశాబ్దాలుగా చాలా కష్టాలతో అమల్లోకి తెచ్చిన పెన్షన్ సంస్కరణలను తిరిగి వెనక్కు మళ్లించే విషయంలో జాగరూకత అవసరమన్నారు. పెన్షన్ మొ త్తాన్ని ప్రభుత్వమే ఇవ్వడానికి సంబంధించిన పాత పెన్షన్ పథకాలను 2003లో ఎన్డీఏ ప్రభుత్వం నిలిపివేసింది. 2004 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. కొత్త కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) కింద ఉద్యోగులు తమ ప్రాథమిక (బేసిస్) వేతనంలో 10 శాతం పెన్షన్‌కు జమ చేయాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం 14 శాతం జమ చేస్తుంది. -
కోవిడ్–19 తర్వాత భారత్ మరింత శక్తివంతం
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి తర్వాత భారత్ ఎకానమీ మరింత శక్తివంతంగా మారిందని ప్రముఖ ఆర్థికవేత్త, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యులు సంజీవ్ సన్యాల్ పేర్కొన్నారు. పారిశ్రామిక వేదిక– కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, భారత్ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని, చైనాకన్నా ఈ వేగం రెట్టింపు ఉందని అన్నారు. మహమ్మారి కాలంలో ప్రభుత్వం ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించిందని, దేశ బ్యాంకింగ్ రంగాన్ని ప్రక్షాళన చేసిందని అన్నారు. ఒప్పందాల సమర్థవంతమైన అమలు, జైలు సంస్కరణలు కేంద్రం తదుపరి సంస్కరణ ఎజెండాగా ఉండాలని పేర్కొన్నారు. -
భారత ఎకానమీ వృద్ధిపై వివేక్ దేవరాయ్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ రానున్న 25 సంవత్సరాల్లో వార్షికంగా సగటున 7 నుంచి 7.5 శాతం వృద్ధి రేటును సాధిస్తే, దేశం 2047 నాటికి ‘ఎగువ మధ్య తరగతి’ ఆదాయ దేశంగా ఆవిర్భవిస్తుందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) చైర్మన్ వివేక్ దేవ్రాయ్ పేర్కొన్నారు. అదే విధంగా దేశం అప్పటికి 20 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఆవిర్భవిస్తుందని కూడా విశ్లేషించారు. తలసరి ఆదాయం 10,000 డాలర్లకు చేరుతుందని అన్నారు. దీనివల్ల భారత్ సమాజ స్వభావం పూర్తిగా రూపాంతరం చెందుతుందని పేర్కొన్నారు. ఒక దేశ తలసరి ఆదాయం 12,000 డాలర్లు దాటితే ఆ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించాలని ప్రపంచ బ్యాంక్ సూచిస్తోంది. రాష్ట్రాలదే కీలకపాత్ర... ప్రస్తుతం భారత్ ఎకానమీ విలువ 2.7 ట్రిలియన్ డాలర్లు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశంగా అతిపెద్ద ఆరవ ఆర్థిక వ్యవస్థ హోదాను పొందుతోంది. 2047 నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించాలని ప్రధాని మోదీ లక్షించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ది కాంపిటేటివ్‌నెస్ రోడ్‌మ్యాప్ ఫర్ ఇండియా@100’ పేరుతో వివేక్ దేవ్రాయ్ ఈ నివేదికను విడుదల చేశారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌కు చెందిన ఇనిస్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్నెస్ ప్రొఫెసర్ మైఖేల్ ఇ పోర్టర్, క్రిస్టియన్ కెటెల్స్, అమిత్ కపూర్లతో భాగస్వామ్యంతో ఈ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నివేదిక రూపొందింది. దేశాభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర కీలకమని పేర్కొన్న ప్రధాని ఆర్థిక సలహాదారు, రాష్ట్రాలు తమ వృద్ధి రికార్డులను ఎంత ఎక్కువగా నమోదుచేస్తే అంత ఎక్కువగా భారత్ పురోగతి సాధ్యమవుతుందని నివేదిక విడుదల సందర్భంగా దేవ్రాయ్ పేర్కొన్నారు. 1947లో బ్రిటీష్ పాలన నుండి స్వాతంత్య్రం వచ్చినప్పుడు భారత్‌ను ’మూడో–ప్రపంచ’ దేశంగా వర్గీకరించారు. అయితే గత ఏడు దశాబ్దాలలో దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కేవలం రూ. 2.7 లక్షల కోట్ల నుండి రూ. 150 లక్షల కోట్లకు పెరిగింది. నివేదికకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు.. ♦ వృద్ధి, పోటీతత్వ పెంపొందడం కోసం ఒక పొందికైన వ్యూహాన్ని అనుసరించాలి. ఇందుకు దేశం పారిశ్రామిక, ప్రాంతీయ విధానాలను పునర్వ్యవస్థీకరించాలి. రంగాల వారీగా, ప్రాంతాల వారీగా వృద్ధికి విధాన రూపకల్పన జరగాలి. ♦ భారత్ ఎకానమీ ఫండమెంటల్స్, స్థూల దేశీయోత్పత్తి పరిస్థితులు బలంగా ఉన్నాయి. ప్రపంచంలోనే భారత్ ఎకానమీ వేగంగా పురోగమిస్తోంది. అయితే బలహీన సామాజిక పురోగతి, పెరుగుతున్న అసమానతలు, ప్రాంతాల మధ్య సమన్వయం లేకపోవడం వంటి అంశాల వల్ల చాలా మంది భారతీయుల జీవన నాణ్యతలో ఆశించిన మెరుగుదలను సాధించలేకపోతున్నాం. ♦ ఉపాధిని పెంపొందించే, ఉద్యోగార్ధులకు అడ్డంకులను తగ్గించే సామాజిక విధానాలను భారతదేశం ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ♦ తగిన విధంగాలేని, కాలం చెల్లిన నియంత్రణ పరమైన నిబంధనలు, వ్యవస్థాపరమైన లోటుపాట్లు భారతదేశాన్ని వెనక్కి నెడుతున్నాయి. ♦ కార్మిక చట్టాలు పెద్ద సంస్థలపై అధిక వ్యయాల భారాలకు కారణమవుతున్నాయి. భూ చట్టాల వల్ల తరచుగా అభివృద్ధి కోసం భూమిని పొందడం కష్టతరం అవుతోంది. ఆయా అంశాల్లో కీలక సంస్కరణలు జరగాలి. ఇక జనాభాకు తగ్గట్టుగా వ్యవసాయ వస్తువులు, ఉత్పత్తుల ధరలను స్థిరంగా ఉంచండంపై దృష్టి సారించాలి. ♦ భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా విదేశీ వాణిజ్యం, పెట్టుబడులకు మరింత ద్వారాలు తెరిచింది. అయితే ఇప్పటికీ అడ్డంకులు ఉన్నాయి. ముఖ్యంగా టారిఫ్ యేతర అడ్డంకులు మరింత తగ్గాలి. ప్రపంచ మార్కెట్లకు సేవలను అందించడానికి సంబంధించి ఒక ఆకర్షణీయ స్థానం సంపాదించడానికి విధాన రూపకల్పన భారత్ ముందు ప్రస్తుతం ఉన్న అతిపెద్ద సవాలు. -
ప్రధాని ఆర్థిక సలహా మండలికి భల్లా రాజీనామా
న్యూఢిల్లీ: కేంద్రం స్థాయిలో ఆర్థిక వేత్తల రాజీనామా పరంపర కొనసాగుతోంది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేసి 24 గంటలు కూడా గడవకముందే ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలిలో (పీఎంఈఏసీ) సభ్యుడైన ప్రముఖ ఆర్థిక నిపుణుడు సుర్జిత్ భల్లా తాను సైతం రాజీనామా చేసినట్టు మంగళవారం ప్రకటించారు. డిసెంబర్ 1 నుంచి పీఎంఈఏసీ తాత్కాలిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు భల్లా ట్వీట్ చేశారు. భల్లా రాజీనామాను ప్రధానమంత్రి ఆమోదించినట్టు ఆయన కార్యాలయ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. 1952 నుంచి భారత్‌లో ఎన్నికలు అనే పుస్తకంపై తాను పనిచేస్తున్నానని, సీఎన్ఎన్ ఐబీఎన్‌లో తాను చేరిన డిసెంబర్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని భల్లా తెలిపారు. ప్రభుత్వ విధానాలకు మద్దతుదారుగా ఉండే ఈ ఆర్థిక వేత్త ఇటీవలి జీడీపీ గణాంకాల ప్రకటన విషయంలో నీతి ఆయోగ్ పాత్రపై విమర్శలు చేశారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్ సమక్షంలో కేంద్ర ముఖ్య గణాంక అధికారి ప్రవీణ్ శ్రీవాస్తవ గత నెల 28న సెప్టెంబర్ క్వార్టర్ జీడీపీ గణాంకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై భల్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆరుగురు సభ్యుల ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలికి బిబేక్ దేబ్రాయ్ నేతృత్వం వహిస్తున్నారు. గతంలో ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా కూడా తమ పదవులకు రాజీనామా చేయడం తెలిసిందే. -
సూర్జిత్ భల్లా రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఆర్థికవేత్త, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సూర్జిత్ భల్లా రాజీనామాచేశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రధానమంత్రి (ఇఎసి-పిఎం) పాక్షిక సభ్యుడిగా డిసెంబర్ 1 న గా రాజీనామా చేసినట్లు భల్లా ట్విటర్లో వెల్లడించారు. నీతి ఆయోగ్ సభ్యుడు వివేక్ ఒబెరాయ్ నేతృత్వంలో ఆర్థిక సలహా మండలిలో ఆర్ధికవేత్తలు రాతిన్ రాయ్, అషిమా గోయల్, షామికా రవి ఇతర పార్ట్ టైమ్ సభ్యులు. కాగా ఆర్బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ రాజీనామా ప్రకంపనలు రేపింది. ఇవి ఇంకా చల్లారకముందే సూర్జిత్ భల్లా రాజీనామా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరోవైపు కొత్త ఆర్బీఐ గవర్నర్ ఎంపికపై నేడు (డిసెంబరు 11) ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. 1/2 My forecast on Elections 2019; written as Contributing Editor Indian Express & Consultant @Network18Group; I resigned as part-time member PMEAC on December 1st; also look for my book Citizen Raj: Indian Elections 1952-2019 , due — Surjit Bhalla (@surjitbhalla) December 11, 2018 -
పూనమ్‌కి చాన్స్
పోటీకి దీటుగా నిలబడితే కనుక పూనమ్ గుప్తా భారతదేశపు తొలి చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అవుతారు. చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ (సి.ఇ.ఎ.) అనేది దేశంలో పెద్ద పోస్టు. ఈ పోస్టులో ఉన్నవాళ్లు దేశ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన సలహాలు ఇస్తుండాలి. దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడితే దాన్నుంచి గట్టెక్కించాలి. కేంద్ర ఆర్థిక శాఖ కింద పనిచేస్తూ, అవసరమైతే స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని, ఒప్పించేలా ఉండాలి. అయితే అంత కీలకమైన ఈ పోస్టులో ఇంతవరకు ఒక్క మహిళ కూడా లేరు! ప్రస్తుత సి.ఇ.ఎ. అరవింద్ సుబ్రహ్మణియన్. ఆయన పదవీకాలం గత ఆగస్టులోనే ముగిసింది. అప్పటి నుంచీ ఆయనే సలహాదారుగా కొనసాగుతున్నారు. ఈ తరుణంలో అరవింద్ తర్వాత ఎవరు అన్న ప్రశ్న వస్తున్నప్పుడు ప్రభుత్వం ఒక మహిళ వైపు మొగ్గు చూపుతోంది. ఆ మహిళే పూనమ్ గుప్తా. ప్రస్తుతం ఆమె ప్రపంచ బ్యాంకులో పని చేస్తున్నారు. అంతకుముందు వరకు పూనమ్ ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ’ (ఎన్.ఐ.పి.ఎఫ్.పి.) లో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్ ప్రొఫెసర్. అయితే సి.ఇ.ఎ. పదవికి పూనమ్‌కు గట్టి పోటీ ఉంది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ అయిన జె.పి.మోర్గాన్‌లో చీఫ్ ఇండియా ఎకనమిస్టుగా ఉన్న సాజిద్ చినాయ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫెసర్ అయిన కృష్ణమూర్తి పేర్లను కూడా భారత ప్రభుత్వం పరిశీలిస్తోంది. మోదీ ప్రభుత్వానికి మరో ఆరు నెలల్లో కాల పరిమితి తీరిపోతున్నప్పటికీ.. అంతర్జాతీయంగా భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఒడిదుదుకుల్లో ఉన్నందున వెంటనే సి.ఇ.ఎ. పోస్టును భర్తీ చేయాలని కేంద్ర ఆర్థికశాఖ త్వరపడుతోంది. అరవింద్ సుబ్రహ్మణ్యంని మొదట మూడేళ్ల పదవీ కాలానికి నియమించి, కాల పరిమితి తీరాక పన్నెండు నెలల పొడిగింపు ఇచ్చారు. ఆ పొడిగింపు కూడా గత ఆగస్టులో పూర్తయి నెలలు దాటింది. ఆ వారసుడిని / వారసురాలిని వెదికిపట్టే పట్టేందుకు ఆర్.బి.ఐ. మాజీ గవర్నర్ బిమల్ జలాన్ సారథ్యంలో ప్రభుత్వం ఒక ‘సెర్చ్ కమిటీ’ని కూడా ఏర్పాటు చేసింది. అరవింద్ సుబ్రహ్మణ్యం కన్నా ముందు రఘురామ్ రాజన్ సి.ఇ.ఎ.గా పని చేశారు. వీళ్లిద్దరూ కూడా ఐ.ఎం.ఎఫ్., వరల్డ్ బ్యాంకుల్లో పని చేసిన అనుభవం ఉన్నవారే. ఒకవేళ ఇప్పుడు పూనమ్ గుప్తా సి.ఇ.ఎ.గా ఎంపికైతే ఆమె కూడా ఐ.ఎం.ఎఫ్, వరల్డ్ బ్యాంకుల నుండి వచ్చిన వారే అవుతారు. -
ప్రధాని ఎకానమీ ప్యానెల్‌కు షామిక
సాక్షి, న్యూఢిల్లీ: బ్రూకింగ్ ఇండియా సీనియర్ అధికారి డా. షామిక రవి ఆర్థిక సలహామండలికి (ఎకానమిక్ ఎడ్వైజరీ కౌన్సిల్) ఎంపికయ్యారు. నీతి అయోగ్ సభ్యుడు వివేక్ దేబ్రాయ్ నేతృత్వంలో ఏర్పాటైన ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పిఎం)లో ఆమె ఒక భాగంగా ఉండనున్నారు. ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలిలో తాత్కాలిక సభ్యురాలిగా రవి త్వరలోనే నియమితులుకానున్నారని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు పీఎంవో వర్గాలనుంచి ఆమోదం లభించిందన్నారు. బ్రూకింగ్స్ ఇండియాలో ఆర్థిక పరిశోధనకు ఆమె నేతృత్వం వహిస్తున్నారు. అలాగే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఆర్థికశాస్త్రంలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. గేమ్ థియరీ అండ్ మైక్రోఫైనాన్స్ కోర్సులను ఆమె బోధిస్తున్నారు. ప్రొఫెసర్ రవి ప్రధాన వార్తాపత్రికలలో వ్యాసాలతోపాటు అనేక జర్నల్స్‌ను విస్తృతంగా ప్రచురించారు. ఆమె పరిశోధన బీబీసీ, ది గార్డియన్, ది ఫైనాన్షియల్ టైమ్స్ తో భారతదేశంలోని చాలా జాతీయ , ప్రాంతీయ వార్తాపత్రికలు మేగజైన్లలో చోటు సంపాదించడం విశేషం. కాగా ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన ఆర్థిక సలహామండలిలో డా.సూర్జిత్ బళ్లా, రతిన్ రాయ్, డా. అషీమా గోయల్, సభ్య కార్యదర్శిగా రతన్ వటల్ నియమితులయ్యారు. ఆర్థిక వ్యవహారాలు, ఇతర అంశాలపై ఆర్థిక సలహా మండలి ప్రధానికి సలహాలు ఇస్తుంది. -
వద్దనుకున్నదే మళ్లీ తెచ్చుకున్నారు...
సాక్షి, న్యూఢిల్లీ : దేశ ఆర్థిక మంత్రిగా సరిలేరు నాకెవ్వరూ అనుకుంటూ అరుణ్ జైట్లీ కూనిరాగం తీస్తుండగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక అంశాల్లో తనకు సలహా ఇవ్వడానికి అనూహ్యంగా ఆర్థిక సలహా మండలిని ఏర్పాటు చేశారు. అధికారంలోకి రాగానే 2014లో మోదీ ప్రభుత్వం, అంతకుముందు యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్థిక సలహా మండలిని రద్దు చేసింది. ఆ తర్వాత ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌ను తొలగించారు. ఆ తర్వాత తన ప్రభుత్వమే ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ చీఫ్ అర్వింద్ పనగారియాలను కూడా తొలగించారు. దేశంలో పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ ప్రవేశపెట్టిన నేపథ్యంలో జాతీయ స్థూల ఆదాయం బాగా పడిపోయిన పరిస్థితుల్లో తన ఆచితూచి ఆర్థిక సలహాలు ఇవ్వడానికి ఈ ఆర్థిక మండలిని ప్రధాని మోదీ మళ్లీ ఏర్పాటు చేశారన్న విషయం చెప్పకనే అర్థం అవుతుంది. నీతి ఆయోగ్ సభ్యుడు వివేక్ దేవ్రాయ్ నాయకత్వాన ఏర్పాటు చేసిన ఈ ఆర్థిక మండలిలో ఆర్థిక వేత్తలు సుర్జీత్ భల్లా, రతిన్ రాయ్, ఆషిమా గోయెల్, మాజీ ఆర్థిక కార్యదర్శి రతన్ వతాల్ను తీసుకున్నారు. గతేడాది దేశంలో 500, 1000 రూపాలయల నోట్లను రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. సరైన అంచనా, ముందస్తు ఏర్పాటు లేకపోవడం వల్ల ఆయన తీసుకున్న నిర్ణయం ఫలించలేదు. అలాగే ముందస్తు ఏర్పాట్లు లేకుండానే జీఎస్టీని తీసుకొచ్చారని ఆర్థిక నిపుణుల నుంచి విమర్శలు వస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించి వర్షాలు పడుతున్న పరిస్థితుల్లో, అంతర్జాతీయ మార్కెట్లో రోజు రోజుకు చమురు ధరలు పడిపోతున్న నేపథ్యంలో స్థూల జాతీయోత్పత్తి గణనీయంగా పెరగాలి. కానీ గత మూడేళ్లుగా ఉత్పత్తి పరిస్థితి మెరగు పడడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే తనకు తగిన సలహాలు ఇవ్వడం కోసం ఆయన ఆర్థిక సలహా మండలిని తీసుకొచ్చారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అంశాల్లో ఆయనకు ఆర్థిక నిపుణులు సరైన సలహాలు ఇవ్వక పోవడం వల్లన ఆయన పొరపాటు నిర్ణయం తీసుకున్నారని భావించలేం. ఎవ్వరి సలహాలు ఆయన వినేరకం కాదని పార్టీ వర్గాలే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఆర్థిక మండలిని ఆయన ఏర్పాటు చేసినంత మాత్రాన, దాని సలహాలను ఆయన వింటారా? అన్న గ్యారంటీ లేదు. -
ఐదుగురు సభ్యులతో ఆర్థిక సలహా సంఘం
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ సభ్యుడు వివేక్ డెబ్రాయ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ఆర్థిక సలహా సంఘాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం నియమించారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో మోదీ ఏర్పాటు చేసిన తొలి ఆర్థిక సలహా సంఘం ఇదే. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు మూడేళ్ల కనిష్టానికి పడిపోయి, విమర్శలు పెరిగిన నేపథ్యంలో సలహా సంఘాన్ని నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కౌన్సిల్లో మిగతా సభ్యులుగా నీతి ఆయోగ్ ప్రధాన సలహాదారు రతన్ వాటల్, ఆర్థిక వేత్తలు సుర్జీత్ భల్లా, రథిన్ రాయ్, ఆషిమా గోయల్ ఉంటారు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విషయాలను విశ్లేషించి ప్రధానికి తెలియజేయటం, ఆయనకు సలహాలు ఇవ్వటం వీరి విధి. -
మాయదారి లెక్కలు!
పేదరికం గురించి లెక్కలేయడం మన దేశంలో చీకట్లో తడుములా టలా తయారవుతున్నదని అప్పుడప్పుడు విడుదలచేసే అధికారిక నివే దికలను చూస్తే అర్ధమవుతుంది. ఈ తొట్రుపాటు పేదలను లెక్కేయడా నికి ఎలాంటి ఉపకరణాలను వాడాలో తెలియక పోవడంవల్లనా లేక పాలకుల అభీష్టానికి అనుగుణంగా కుదించడానికి చేసే విన్యాసంలో విఫలం కావడంవల్లనా అనేది ఎవరికీ అర్ధంకాని విషయం. ప్రధాని ఆర్ధిక సలహా మండలి మాజీ చైర్మన్ రంగరాజన్ ఆధ్వర్యంలోని కమిటీ తాజాగా విడుదల చేసిన నివేదికను గమనిస్తే నిపుణుల్లో సైతం వాస్తవ పరిస్థితులపై అవగాహనాలోపం ఎంతగా ఉన్నదో తెలుస్తుంది. ఆ కమిటీ చెప్పిన ప్రకారం దేశంలో 36కోట్ల 30 లక్షలమంది పేదలు న్నారు. అంటే దేశ జనాభా 120 కోట్లలో పేదలు 29.6శాతం అన్న మాట. అంటే ప్రతి పదిమందిలోనూ ముగ్గురు పేదలు. గతంలోని గణాంకాలను ఒకసారి నెమరేసుకుంటే దారిద్య్రరేఖ చుట్టూ నిపుణులు గిరికీలు కొడుతున్న తీరు కళ్లకు కడుతుంది. నిరుడు ప్రణాళికా సంఘం పేదల లెక్కలు విడుదల చేసింది. 2004-05తో పోలిస్తే 2011-12 నాటికి పేదరికం గణనీయంగా తగ్గిందని చెప్పింది. యూపీఏ ప్రభుత్వ తొలినాళ్లతో పోలిస్తే పేదరికం 15 శాతానికిపైగా తగ్గిందని వివరిం చింది. ఈ పేదరికం కొలమానానికి తీసుకునే ప్రాతిపదికలు చిత్రంగా ఉంటాయి. పేదరికాన్ని ఎలా లెక్కేస్తున్నారని 2010లో సుప్రీంకోర్టు ప్రశ్నించినప్పుడు ప్రణాళికా సంఘం ఇచ్చిన జవాబు న్యాయమూర్తు లనే ఆశ్చర్యపరిచింది. 2004-05 ధరల సూచీ ఆధారంగా లెక్కేసి పట్టణ ప్రాంతాల్లో రోజుకు రూ. 20(నెలకు రూ. 578), గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు రూ. 15(నెలకు రూ. 450) మాత్రమే ఖర్చుచేసే వారు పేదలని చెప్పింది. ఈ లెక్కలకు న్యాయమూర్తులు తెల్లబో యారు. ఇంత స్వల్ప మొత్తంతో ఏ వ్యక్తయినా బతకగలరా అని ప్రశ్నిం చారు. ఈ లెక్కలను కట్టిబెట్టి తాజా ధరల సూచీ ఆధారంగా కొత్త గణాంకాలు రూపొందించాలని సూచించారు. ఆ తర్వాతనైనా వారేమీ మెరుగైన లెక్కలు తీసుకురాలేదు. ఈసారి పట్టణ ప్రాంతాల్లో రోజుకు రూ. 33.30 (నెలకు రూ. 1,000), పల్లెసీమల్లో రోజుకు రూ. 27.20(నెలకు రూ. 816) ఖర్చుచేసేవారే పేదలని ఇంకో అంచ నాను సర్వోన్నత న్యాయస్థానానికి అందించారు. దాని ప్రకారం ప్రతి పదిమంది భారతీయుల్లో ఇద్దరు నిరుపేదలు. ఒక మనిషి బతకడం అంటే ఏమిటో అర్ధం చేసుకుంటే ఈ లెక్కల్లోని గారడీ ఏమిటో తెలు స్తుంది. అవసరమైన తిండి, బట్ట, గూడు, విద్య, ఆరోగ్యంవంటివన్నీ దీనితోనే సమకూరాలి. అది ఎక్కడైనా సాధ్యమయ్యే పనేనా?! రంగరాజన్ కమిటీ నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు రూ. 32 కన్నా తక్కువ, పట్టణ ప్రాంతాల్లో రోజుకు రూ. 47కన్నా తక్కువ మొత్తంతో రోజు గడిపేవారంతా పేదలకింద లెక్క. ఇంతక్రితం ప్రణాళికా సంఘం చెప్పిన లెక్కకూ, రంగరాజన్ కమిటీ ఇచ్చిన లెక్కకూ కాస్త వ్యత్యాసమున్నమాట వాస్తవమే. కానీ, ఈ కమిటీ చెప్పిన లెక్కలు కూడా గతంలోని గణాంకాలవలే తప్పుల తడకేనని అర్ధం చేసుకోవడానికి మేధావిత్వ ప్రకర్ష ఏమీ అవసరం లేదు. నిత్యావసరాల ధరలు చుక్కలనంటిన వర్తమాన పరిస్థితుల్లో ఆ డబ్బుతో బతకడం అసాధ్యమని ఎవరికైనా తెలుస్తుంది. పట్టణ ప్రాంతాల్లో తానున్న చోటు నుంచి పనిచేసే ప్రాంతానికి, అటునుంచి తిరిగిరావడానికి అయ్యే మొత్తమే రూ. 30 దాటుతుంది. అదిపోగా మిగిలేది కేవలం రూ. 17 మాత్రమే అయినప్పుడు మనిషి ఇక ఏం తిని బతకాలి? ఎక్కడ బత కాలి? నిరుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆదాయంతోపాటు పోషకా హారం, చదువు, పారిశుద్ధ్యంవంటి ఇతరేతర అంశాలను కూడా కొల మానంగా తీసుకుని ఒక నివేదిక రూపొందించింది. దాని ప్రకారం పేద రిక నిర్మూలనలో మన దేశం చాలా వర్ధమాన దేశాలకంటే వెనకబడి ఉంది. అసలు దారిద్య్ర రేఖను నిర్ధారించడంలో నిపుణులు ఇన్ని పిల్లి మొగ్గలు వేయడానికి కారణమేమిటి? పేదరికాన్ని అంచనావేయడానికి తీసుకునే ప్రాతిపదికలేమిటి? కేవలం ఆదాయాన్ని మాత్రమే లెక్కేసి, దాన్ని ధరలసూచీతో పోల్చిచూసే విధానం ఒకటైతే...పోషకాహార లభ్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అంచనావేసే విధా నం మరోటి. బ్రిటన్‌లో ఒక కుటుంబ ఆదాయం జాతీయ సగటులో 60 శాతంకన్నా తక్కువగా ఉంటే పేదలుగా లెక్కేస్తారు. అమెరికాలో ఒక కుటుంబానికయ్యే ఆహార వ్యయాన్ని లెక్కేసి దాన్ని మూడుతో హెచ్చిస్తారు. మన దేశంలో ఏవో కాకిలెక్కలే తప్ప నిర్దిష్టమైన విధానం ఉన్నట్టు తోచదు. ఉదాహరణకు జాతీయ పోషకాహార సంస్థ సూచన ప్రకారం ఒక మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే రోజుకు 400 గ్రాముల తృణధాన్యాలు, 300 గ్రాముల కాయగూరలు, 80 గ్రాముల కాయధా న్యాలు, 100 గ్రాముల తాజా పండ్లు అవసరం. రంగరాజన్ సూచించే 47 రూపాయలతో ఒక మనిషి ఇన్నిటిని కొనుక్కోగలుగుతాడా? ఒక వేళ అవన్నీ లభిస్తాయనుకున్నా ఉండటానికి, కట్టుకోవడానికి, విద్యకు డబ్బులు ఎక్కడ పుట్టిస్తాడు? తాము అమలు చేస్తున్న పేదరిక నిర్మూ లనా కార్యక్రమాలు విజయవంతమయ్యాయని చెప్పుకోవడానికో, అలాంటి పథకాలకు మరింతగా ఖర్చుపెట్టే బాదరబందీనుంచి తప్పిం చుకోవడానికో మాత్రమే ప్రభుత్వాలు ఇలాంటి విచిత్ర గణాంకాలను తీసుకొస్తున్నాయి. సుప్రసిద్ధులైన ఆర్ధికవేత్తలు ప్రభుత్వాల అభీష్టానికి అనుగుణంగా ఈ మాయా గణాంకాలను పరిచి దారిద్య్రం పరారవుతు న్నదని నమ్మించాలని చూడటం దురదృష్టకరం. కనీసం ఎన్డీయే ప్రభుత్వమైనా ప్రతిష్టకు పోకుండా వాస్తవానికి దగ్గరగా ఉండే ప్రాతిప దికలను నిర్ణయించి, వాటి ఆధారంగా పేదల సంఖ్యను లెక్కేస్తే, దాని ఆధారంగా సంక్షేమ పథకాలు అమలుచేస్తే ప్రజలు సంతోషిస్తారు