న్యూఢిల్లీ: కొనుగోలు శక్తి సమానత్వం (పీపీపీ) నిబంధనల ప్రకారం, 2047 నాటికి భారతదేశం ‘ఎగువ మధ్య తరగతి’ కేటగిరీలోకి ప్రవేశించే అవకాశం ఉందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) చైర్మన్ వివేక్ దేవ్రాయ్ పేర్కొన్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే అధిక ఆదాయ కేటగిరీలో ఉన్నాయని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. భారత ఆర్థిక వృద్ధి రేటు పురోగతి కేవలం ఎగుమతులమీదే ఆధారపడి ఉందన్న అభిప్రాయం తప్పని ఆయన పేర్కొంటూ, దీనితోపాటు దేశాభివృద్ధికి బహుళ అవకాశాలు ఉ న్నాయని అన్నారు.
ప్రపంచ బ్యాంక్ నిర్వచనం ప్ర కారం, తలసరి వార్షిక ఆదాయం 12,000 డాల ర్ల కంటే ఎక్కువ ఉన్న దేశాన్ని అధిక–ఆదాయ దేశంగా పరిగణిస్తారు. ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశాన్ని ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశంగా పరిగణిస్తున్నారు. 2047 నా టికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మా ర్చాలని ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా నిర్దేశించా రు. అభివృద్ధి చెందిన దేశం మానవ అభివృద్ధి సూ చిక (హెచ్‌డీఐ)లో దాదాపు తొలి స్థానాల్లో ఉంటుంది. సాధారణంగా అధిక స్థాయి ఆర్థిక వృద్ధి, సా« దార ణ జీవన ప్రమాణం, అధిక తలసరి ఆదా యంతో పా టు విద్య, అక్షరాస్యత, ఆరోగ్యాల విష యాల్లో మంచి ప్ర మాణాలను అభివృద్ధి చెందిన దేశం కలిగి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment