Upper middle class
-
2047 నాటికి ‘ఎగువ మధ్య తరగతి’ కేటగిరీలోకి భారత్!
న్యూఢిల్లీ: కొనుగోలు శక్తి సమానత్వం (పీపీపీ) నిబంధనల ప్రకారం, 2047 నాటికి భారతదేశం ‘ఎగువ మధ్య తరగతి’ కేటగిరీలోకి ప్రవేశించే అవకాశం ఉందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) చైర్మన్ వివేక్ దేవ్రాయ్ పేర్కొన్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే అధిక ఆదాయ కేటగిరీలో ఉన్నాయని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. భారత ఆర్థిక వృద్ధి రేటు పురోగతి కేవలం ఎగుమతులమీదే ఆధారపడి ఉందన్న అభిప్రాయం తప్పని ఆయన పేర్కొంటూ, దీనితోపాటు దేశాభివృద్ధికి బహుళ అవకాశాలు ఉ న్నాయని అన్నారు. ప్రపంచ బ్యాంక్ నిర్వచనం ప్ర కారం, తలసరి వార్షిక ఆదాయం 12,000 డాల ర్ల కంటే ఎక్కువ ఉన్న దేశాన్ని అధిక–ఆదాయ దేశంగా పరిగణిస్తారు. ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశాన్ని ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశంగా పరిగణిస్తున్నారు. 2047 నా టికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మా ర్చాలని ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా నిర్దేశించా రు. అభివృద్ధి చెందిన దేశం మానవ అభివృద్ధి సూ చిక (హెచ్‌డీఐ)లో దాదాపు తొలి స్థానాల్లో ఉంటుంది. సాధారణంగా అధిక స్థాయి ఆర్థిక వృద్ధి, సా« దార ణ జీవన ప్రమాణం, అధిక తలసరి ఆదా యంతో పా టు విద్య, అక్షరాస్యత, ఆరోగ్యాల విష యాల్లో మంచి ప్ర మాణాలను అభివృద్ధి చెందిన దేశం కలిగి ఉంటుంది. -
మేము ఎన్నారైలు అయ్యాము కదా.. ఇంకా తెప్ప ఎందుకు..!?
గడచిన ముప్ఫై ఏళ్లలో కొత్తగా ఎగువ మధ్యతరగతిగా మారిన వర్గాలను, ఈ రోజు మీరు ఇంత భద్రంగా ఉండడానికి, ఇవీ కారణాలు అని చెప్పి వారిని ఒప్పించడం అంత తేలిక ఏమీ కాదు. కొన్నివేల రూపాయలతో కొన్న స్థలం నుంచి ఇప్పుడు నమ్మశక్యం కానంత ‘రిటర్న్స్’ వచ్చేట్టుగా మీ ఆస్తి విలువ పెరిగింది అంటే– అప్పట్లో దాన్ని కొనడం తప్ప, అదనంగా మీరు చేసింది ఏమీలేదు, అని వాళ్లనిప్పుడు ఒప్పించడం కష్టం. మీ పిల్లల జీతాలు ఇబ్బడి ముబ్బడిగా పెరగడానికి కూడా– ‘మార్కెట్ ఎకానమీ’ కారణం తప్ప, అందులో మన పనితనం ఏమీ లేదు. ఇవన్నీ సంపద పంపిణీ క్రమంలో, ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకున్న పరిణామాల వల్ల మనకు అందిన ఫలాలు. అయితే, ఇలా కొత్తగా ఎగువ మధ్యతరగతిగా ‘ప్రమోట్’ అయిన వారే చిత్రంగా ఇప్పుడు మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలనూ, వాటిని అమలుచేస్తున్న ప్రభుత్వ ఉదార వైఖరినీ తప్పు పడుతున్నారు. ఇటువంటి ధోరణి మునుపు ఉందా అని వెనక్కి చూస్తే, 1970–80 దశకాల మధ్య కాలంలో అమలైన సంక్షేమం పట్ల ఈ తరహా విమర్శ దాదాపు లేదనే చెప్పాలి. కారణం– స్వాత్యంత్య్రం తర్వాత, కేంద్ర ప్రభుత్వ ‘సంక్షేమ విధానాల’ వల్ల కులాలతో సంబంధం లేకుండా ఆర్థికంగా చితికి ఉన్న అన్ని వర్గాలు ఎంతోకొంత మేలుపొందాయి. కులీన వర్గాలుగా పేర్కొనే ఎగువ మధ్యతరగతి ఇప్పటిలా ప్రభుత్వ ఉదారవాద చర్యల్ని తప్పుపట్టేది కాదు. అప్పట్లో ఎక్కువమంది స్వాగతించిన – రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ వంటి నిర్ణయాలు అటువంటివే. అప్పట్లో భద్రతతో స్థిరపడి ఉన్న కులీన వర్గాలలోని విద్యాధికులు, దేశంలో జరుగుతున్న మార్పు ‘ప్రాసెస్’లో చురుకైన భాగస్వామ్య పాత్ర పోషించారు. వారు ఇక్కడ చదివి, విదేశాల్లో ఉన్నత విద్య తర్వాత ఇండియా తిరిగివచ్చి, దేశం చేస్తున్న ప్రగతి యజ్ఞంలో తమదైన పాత్ర పోషించారు. డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు (బయోకెమిస్ట్), డాక్టర్ యలవర్తి నాయుడమ్మ (లెదర్ టెక్నాలజీ) అటువంటివారే. ఇటీవల డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఇంకా రెండేళ్ల పాటు చీఫ్ సైంటిస్ట్‌గా కొనసాగే అవకాశాన్ని ఈ నవంబర్ 30 నాటికి వదులుకుని, ఇండియాలో బాలల ఆరోగ్య రంగంలో చేయాల్సింది చాలా ఉందని వెనక్కి రావడం ఈ ధోరణికి కొనసాగింపే అవుతుంది. ఇప్పుడైనా ఇది చర్చించాల్సిన అంశం ఎందుకైందంటే– ‘ఏరు దాటి మేము ‘ఎన్నారై’లు అయ్యాము కదా, మా వెనక వచ్చేవారి కోసం ఇంకా తెప్ప ఎందుకు ఉండాలి’ అని పేద కుటుంబాల కోసం అమలవుతున్న ప్రభుత్వ పథకాల పట్ల వారికున్న దుగ్ధను దాచుకోవడం లేదు. లేని వంకలు వెతికి మరీ ప్రభుత్వానికి మసిపూయడానికి వీరు చేస్తున్న ప్రయత్నంలో దాపరికం ఏమీలేదు. అది తెలుస్తున్నది. ఈ క్రమంలో వాదన కోసం, వీరికి ఆక్షేపించడానికి మరేదీ కనిపించక కొందరు– ‘రోడ్లు సంగతి ఏమిటి?’ అంటున్నారు. కానీ మూడేళ్ళకు ముందు రోడ్ల పరిస్థితి ఏమిటి, ఈ మూడేళ్ళలో క్రమం తప్పకుండా కురుస్తున్న వానలు వల్ల గట్లకు నీళ్లు తన్నుతూ నిండుతున్న చెరువులు, వాగుల సంగతి వీరికి పట్టదు. అంతేనా ‘కరోనా’ కాలంలో అత్యవసర వైద్యసేవల కోసం చేసిన వ్యయం గురించి కానీ, దాని వల్ల ప్రభుత్వ ఖజానాకు పడిన గండి గురించి గానీ – ఎంతో సౌకర్యంగా వీరు తమ వాదనలో దాటవేస్తారు. నిజానికి వీరి సమస్య వేరు. అదేమో పైకి చెప్పుకోలేనిది. ఈ ప్రభుత్వం ప్రతి రంగాన్నీ క్రమబద్ధీకరించడంతో, మునుపటిలా వీరి ఆస్తుల విలువ పెరగడం లేదు. విషయం ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఒకప్పుడు బలుపుగా కనిపించిన వాపులన్నీ పొంగు తగ్గి నరాలు బయటపడి, అన్ని రంగాలు మళ్ళీ సాధారణ ఆరోగ్య స్థితికి చేరు తున్నాయి. ఈ మూడేళ్ళలో ఇక్కడ రిటైర్ అయిన చీఫ్ సెక్రటరీలు, డీజీపీ ఇప్పటికీ ఇక్కడ పనిచేయడానికి సుముఖత చూపడం, ‘బ్యూరోక్రసీ’కి ఇక్కడున్న పని అనుకూల వాతావరణంగా చూడాల్సి ఉంటుంది. కానీ కొందరికి ఇవేమీ జరగకూడదు. జరుగుతున్నవి ఎలాగోలా మధ్యలో ఆగిపోవాలి. అయితే ఎలా? ప్రభుత్వంపై ఫిర్యాదు ఉన్నవర్గాలు ఇప్పుడు పెద్దగా లేవు. ఫిర్యాదు ఉన్న వారి సమస్యేమో – ‘బ్లాక్ అండ్ వైట్’లో చెప్పలేనిది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అధ్యక్షుడు క్లావ్ స్వాబ్ 2004 ఫిబ్రవరి 10న హైదరాబాద్‌లో మాట్లాడుతూ– ‘సమాజంలో ప్రతి ఒక్కరికీ వికాసం పొందే అవకాశం కల్పిస్తే తప్ప, మనకు ఎంతమాత్రం భద్రత ఉండదు’ అనే హెచ్చరిక అయినా వీళ్ళకిప్పుడు అర్థం కావడం ఎంతైనా అవసరం. (క్లిక్ చేయండి: ‘మై హూ నా’ హామీ తీరేదెన్నడు?) - జాన్సన్ చోరగుడి అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
తెల్లారింది లెగండోయ్..
- ఉదయం నుంచి రాత్రి దాకా... ఇదీ ప్రభావం - ఎగువ మధ్యతరగతికి నెలవారీ చిల్లే అపుడెపుడో డెబ్భై ఏళ్ల కిందట... అర్ధరాత్రి స్వతంత్రమొచ్చింది. ఎదురుచూసీ చూసీ ఉన్న జనానికి... తెల్లారేసరికల్లా కొత్త ప్రపంచంలోకి వచ్చేశామని అర్థమైపోయింది. ఇప్పుడు అదే అర్ధరాత్రి... బోలెడన్ని పన్నుల నుంచి స్వతంత్రమొచ్చింది. మీడియాలో వినీవినీ చూసీచూసీ ఉన్న జనానికి.. తాము జీఎస్టీ రాజ్యంలోకి ప్రవేశించామని తెల్లారకముందే తెలిసిపోయింది. మరి ఈ కొత్త రాజ్యంలో మధ్య తరగతి మనిషి శివ జీవితం ఎలా మొదలైంది? తెల్లారింది మొదలు రాత్రి నిద్రపోయేదాకా శివపై ఈ కొత్త పన్ను ప్రభావం ఎలా ఉంది? ఒక్కసారి తన కళ్లతోనే చూద్దాం... సాక్షి, బిజినెస్ విభాగం: బద్ధకంగా నిద్రలేస్తూనే బ్రష్ పట్టుకుని బాత్రూమ్లోకి దూరాడు శివ. జీఎస్టీతో రేటు తగ్గిన టూత్‌పేస్ట్.. కాస్త రుచిగా అనిపించింది. స్నానం చేసేటపుడు సబ్బు కాస్త తేలిగ్గా అనిపించినా.. షాంపూ మాత్రం భారమైంది. టిఫిన్‌కి కూర్చున్నాక తెలిసింది... అల్పాహారం కాస్త ఖరీదయిందని. అల్పాహారమే కాదు. టేబుల్ మీది పాత్రలు, స్పూన్లు సైతం కాస్త ప్రియమయ్యాయి. ఒక్కోసారి టిఫిన్ చేయకపోతే కార్న్‌ఫ్లేక్స్‌తో కానిచ్చేస్తాడు శివ. కానీ అవి మరింత భారమయ్యాయని అప్పుడే తెలిసింది. సరే! ఎలాగోలా టిఫిన్ అయిందనిపించాడు. ఆఫీసుకు బయల్దేరటానికి రెడీ అయ్యాడు. ► బీరువా తీయగానే షర్ట్లు, ప్యాంట్లు మెరిసిపోతూ కనిపించాయి. సంగతేమిటని ఆరా తీస్తే... ధరలు తగ్గే జాబితాలో ఉన్నామని బదులిచ్చాయి. ఖరీదైన, చవకైన దుస్తులు కూడా తమ స్థాయిని బట్టి మరింత చౌకగా మారుతున్నామని చెప్పేశాయి. హుషారుగా ఈల వేస్తూ... షూ రాక్ దగ్గరికి చేరాడు శివ. అక్కడికెళ్లేసరికి ఆ సంతోషం ఆవిరైపోయింది. ఎందుకంటే మంచి జీతగాడు కాబట్టి ఖరీదైన చెప్పులే అలవాటు అతనికి. కానీ అవి ప్రియమయ్యే జాబితాలో ఉన్నామంటూ వెక్కిరించాయి. ఆఖరికి చేతి వాచీ కూడా చెప్పులతో పాటేనని చెప్పేసింది. చేసేదేమీ లేక బయటికొచ్చి బండి తీశాడు. పెట్రోలును జీఎస్టీ పరిధిలోకి తేలేదు కాబట్టి ఏ మార్పులూ ఉండవని అర్థమైంది. ► ఆఫీసుకెళ్లాడు శివ. ఒకటో తేదీ కావటంతో మిత్రుల నుంచి, అప్పున్న కంపెనీల నుంచి ఫోన్లే ఫోన్లు. తాను చేయాల్సిన ఫోన్లు కూడా చాలానే ఉండటంతో అన్నీ ఒకటొకటిగా ముగించాడు. అప్పుడే తెలిసింది. ఇకపై ఫోన్ బిల్లు కాస్తంత పెరుగుతుందని. ఫోన్ బిల్లే కాదు. ఫోన్ పాడైతే కొత్తది కొనాలన్నా కాస్త ఎక్కువ పెట్టక తప్పదని. చుట్టూ ఉన్న కంప్యూటర్లు, ప్రింటింగ్ ఉపకరణాలు అన్నీ ధరలు పెరిగే జాబితాలో ఉన్నా... అవన్నీ ఆఫీసు లెక్కల్లోనివే కదా అని తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. కాకపోతే ఆఫీసుపై పడే భారం.. మున్ముందు తన జీతానికీ ఎసరు పెట్టొచ్చని మనసులో పీకుతూనే ఉంది. మధ్యాహ్నం క్యాంటీన్లో లంచ్‌కు కూర్చున్నాక తెలిసింది. అది కూడా కాస్త భారమయ్యే జాబితాలోనే ఉందని. ► సాయంత్రం ఇంటికొచ్చాడు. ఇంట్లోని ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, ఏసీ అన్నీ చూస్తుంటే... స్వల్పమే అయినా వాటన్నిటిపైనా పన్నులు పెరుగుతున్నాయన్న విషయం గుర్తొచ్చింది శివకు. ‘‘వీటిలో ఏదైనా పాడై కొత్తది కొనాలంటే కష్టమే కదా!’’ అనుకున్నాడు. బోర్ కొడుతోంది కదా అని టీవీ ఆన్ చేశాడు. అప్పుడే గుర్తొచ్చింది. టీవీపై పన్ను తగ్గుతోందని. కానీ టీవీలో బొమ్మ ఖరీదు పెరుగుతోందని కూడా గుర్తుకొచ్చింది. అంటే... ఇకపై కేబుల్ టీవీ, డిష్ ఛార్జీలపై పన్ను పెరుగుతోందని. పోనీ టీవీలో ఇంటర్నెట్ పెట్టుకుందామంటే... అది కూడా కాస్త పెరగబోయే జాబితాలోనే ఉంది. ‘అమ్మో! ఇక ఎంటర్టైన్మెంట్ అంత ఈజీ కాదు!!’ అనుకున్నాడు. ► రాత్రి పదవుతోంది. ఇంతకీ రోజువారీ వాడే వస్తువుల్లో చూస్తే ధరలు పెరిగేవెన్ని? తగ్గేవెన్ని? అంచనా వేయటానికి ప్రయత్నించాడు శివ. లేచిన దగ్గర్నుంచి చూస్తే ధరలు తగ్గే వస్తువులకన్నా పెరిగేవే ఎక్కువగా కనిపించాయి. కాకపోతే ఆ పెరుగుదల మరీ భారీగా లేదనిపించింది. కొంచెమే కదా... అనుకున్నాడు. ఆ కొంచెం కొంచెం.. తన జేబుకెంత చిల్లు పెడుతుందో లెక్కేయటానికి ప్రయత్నించేలోగానే నిద్ర ముంచుకొచ్చి దుప్పటి చేతికొచ్చింది. కాకపోతే... ఆ దుప్పటి కూడా పన్నుపోటును కాస్తంత పెంచే జాబితాలోనే ఉంది!!!