న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2020–21) ఈక్విటీలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు) 19 శాతం బలపడ్డాయి. దాదాపు 60 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రభుత్వ సంస్కరణలు, పెట్టుబడి అవకాశాలు, బిజినెస్‌లకు సరళ వాతావరణం ఇందుకు దోహదం చేసినట్లు కేంద్ర వాణిజ్య శాఖ తెలియజేసింది. ఈక్విటీ, ఆర్జనలను తిరిగి ఇన్వెస్ట్ చేయడం, పెట్టుబడులతో కలిపి మొత్తం ఎఫ్‌డీఐలు 10 శాతం పుంజుకున్నట్లు పేర్కొంది. వెరసి చరిత్రలోనే అత్యధికంగా 81.72 బిలియన్ డాలర్లను తాకినట్లు వెల్లడించింది. అంతక్రితం ఏడాది(2019–20)లో ఇవి 74.39 బిలియన్ డాలర్లు మాత్రమే. వీటిలో ఈక్విటీ ఎఫ్‌డీఐలు 50 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
దేశాలవారీగా చూస్తే...
దేశీ ఎఫ్‌డీఐలలో 29 శాతం వాటాతో సింగపూర్ టాప్ ర్యాంకులో నిలవగా.. యూఎస్ 23 శాతం, మారిషస్ 9 శాతం చొప్పున వాటాను ఆక్రమించాయి. విదేశీ ప్రత్యక్షపెట్టుబడుల విషయంలో కేంద్ర తీసుకున్న విధానపరమైన సంస్కరణలు, పెట్టుబడుల అనుకూలత, సులభతర వ్యాపార నిర్వహణ తదితర అంశాలు ఇందుకు సహకరించినట్లు వాణిజ్య శాఖ వివరించింది. వెరసి ప్రపంచ ఇన్వెస్టర్లకు ప్రాధాన్య దేశంగా భారత్ నిలుస్తున్న విషయాన్ని ఇది స్పష్టం చేస్తున్నట్లు పేర్కొంది.
రంగాలవారీగా..: ఎఫ్‌డీఐలను అత్యధికంగా ఆకట్టుకున్న రంగాలలో సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ 44 శాతం వాటాతో అగ్రపథాన నిలవగా.. నిర్మాణం(మౌలిక సదుపాయాలు) 13 శాతం, సరీ్వసుల రంగం 8 శాతం చొప్పున జాబితాలో చేరాయి. రాష్ట్రాలవారీగా చూస్తే గుజరాత్‌కు 37 శాతం పెట్టుబడులు లభించగా.. 27 శాతం వాటాతో మహారాష్ట్ర రెండో ర్యాంకును కైవసం చేసుకుంది. ఈ బాటలో కర్ణాటక 13 శాతం ఎఫ్‌డీఐలను సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment