Equity
-
రెండింటిలోనూ ఇన్వెస్ట్ చేసే ఫండ్..
ఇటీవలి కాలంలో మన మార్కెట్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇది చూసి దీర్ఘకాలానికి ఈక్విటీలు బ్రహ్మాండమైన రాబడులు ఇస్తాయన్న ప్రచారంలో వాస్తవం ఎంత? అన్న సందేహాలు కూడా కొందరు ఇన్వెస్టర్లలో ఏర్పడ్డాయి. ఈ సమయంలో ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలా? లేక డెట్‌లో పెట్టుబడులు పెట్టుకోవాలన్న సంశయం కూడా ఎదురుకావచ్చు. కానీ, పెట్టుబడుల ప్రయాణం చాలా సుదీర్ఘమైనది. దీర్ఘకాల లక్ష్యాల కోసం నిధిని సమకూర్చుకోవాలని కోరుకునే ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీలకు తప్పకుండా చోటు ఉండాలి. అదే సమయంలో పెట్టుబడినంతా ఈక్విటీల్లోనే పెట్టేయడం సరికాదు. డెట్‌కు సైతం కొంత కేటాయింపులు అవసరం. ఈక్విటీ, డెట్ పెట్టుబడులకు వీలు కల్పించే పథకాల్లో కోటక్ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ ఒకటి. రాబడులు గడిచిన ఏడాది కాలంలో కోటక్ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్‌లో రాబడి 7.30 శాతంగా ఉంది. గత ఐదు నెలలుగా మార్కెట్లు తీవ్ర కుదుపులను చూస్తున్నాయి. అలాంటి తరుణంలోనూ ఏడాది కాలంలో రాబడి సానుకూలంగా ఉండడం గమనార్హం. ఏడాది కాల పనితీరు విషయంలో ఈక్విటీ ఆధారిత హైబ్రిడ్ విభాగంలో ఈ పథకం రెండో స్థానంలో నిలిచింది. మూడేళ్ల కాలంలో ఈ పథకం ఏటా 14 శాతం చొప్పున పెట్టుబడులపై ప్రతిఫలాన్ని తెచ్చిపెట్టింది. ఇక ఐదేళ్లలో చూస్తే 21 శాతం, ఏడేళ్లలో 14 శాతం, 10 ఏళ్లలో 12.75 శాతం చొప్పున వార్షిక రాబడిని అందించింది. అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్ విభాగంతో పోల్చి చూస్తే అన్ని కాలాల్లోనూ ఈ పథకంలోనే రాబడి అధికంగా ఉండడాన్ని గమనించొచ్చు. పెట్టుబడుల విధానం ఈ పథకం అగ్రెస్సివ్ అలోకేషన్ విధానాన్ని అనుసరిస్తుంది. 75 శాతం వరకు ఈక్విటీలకు, 25 శాతం వరకు డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. వివిధ మార్కెట్ క్యాప్‌ల మధ్య తగినంత వైవిధ్యాన్ని పాటిస్తుంది. అధిక వేల్యూషన్లకు చేరితే లాభాలు స్వీకరించి, అదే సమయంలో చౌక విలువల వద్ద అందుబాటులో ఉన్న స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఈ పథకం పెట్టుబడుల విధానంలో భాగంగా గుర్తించొచ్చు.ఇందుకు నిదర్శనం గత ఆరు నెలల్లో క్యాపిటల్ గూడ్స్, ఆటోల్లో అమ్మకాలు చేయగా, అదే సమయంలో టెక్నాలజీ, కెమికల్స్, ఫార్మా, హెల్త్‌కేర్‌లో ఎక్స్పోజర్ పెంచుకుంది. ఈ విధానంతో నష్టాలను పరిమితం చేసి లాభాలను పెంచుకునే వ్యూహాన్ని ఫండ్ నిర్వహణ బృందం అమలు చేసింది. ఈ తరహా విధానాలతో రిస్క్ తగ్గించి, రాబడులు పెంచుకునే విధంగా పథకం పనిచేస్తుంటుంది. పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.6,324 కోట్ల పెట్టుబడులున్నాయి. ఇందులో 73 శాతం వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. డెట్ సాధనాల్లో 25 శాతం పెట్టుబడులు పెట్టగా, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్)లలో 0.43 శాతం మేర ఇన్వెస్ట్ చేసింది. 1.64 శాతం మేర నగదు నిల్వలు ఉన్నాయి. ఈక్విటీ పెట్టుబడులను గమనిస్తే 68 శాతం మేర లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్ కంపెనీల్లో 30 శాతం ఇన్వెస్ట్ చేస్తే, స్మాల్‌క్యాప్ కంపెనీలకు 1.92 శాతం కేటాయించింది.ఈక్విటీల్లో టెక్నాలజీరంగ కంపెనీల్లో అత్యధికంగా 18 శాతం మేర ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత 15 శాతం మేర బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీలకు, 9.68 శాతం మెటీరియల్స్ కంపెనీలకు, 8 శాతం హెల్త్‌కేర్ కంపెనీలకు కేటాయించింది. డెట్ పెట్టుబడుల్లో రిస్క్ దాదాపుగా లేని ఎస్వోవీల్లో (ప్రభుత్వ బాండ్లు) 20 శాతం ఇన్వెస్ట్ చేయగా, మెరుగైన క్రెడిట్ రేటింగ్‌కు నిదర్శనంగా ఉండే ఏఏఏ సెక్యూరిటీల్లో 3.41 శాతం పెట్టుబడులు ఉండడాన్ని గమనించొచ్చు.టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడులు శాతం1భారతీ ఎయిర్టెల్ 4.49 2హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3.89 3ఇన్ఫోసిస్ 3.18 4ఫోర్టిస్ హెల్త్ 2.905అల్ట్రాటెక్ సిమెంట్ 2.88 6విప్రో 2.747ఎన్టీపీసీ 2.398పవర్‌ఫైనాన్స్ 2.259ఒరాకిల్ ఫైనాన్స్ 1.96 10ఐసీఐసీఐ బ్యాంక్ 1.89 -
ఈక్విటీ డెరివేటివ్స్‌పై సెబీ ఫోకస్
న్యూఢిల్లీ: ఈక్విటీ డెరివేటివ్స్ మార్కెట్లో సరళతర లావాదేవీల నిర్వహణకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చర్యలు చేపట్టనుంది. అంతేకాకుండా రిస్క్ పర్యవేక్షణను పటిష్టపరచడం ద్వారా సమర్థవంత లావాదేవీలకు తెరతీయనుంది. దీనిలో భాగంగా ఫ్యూచర్స్ అండ్ అప్షన్స్(ఎఫ్‌అండ్‌వో) ఓపెన్ ఇంటరెస్ట్(ఓఐ)పై రియల్‌టైమ్ పర్యవేక్షణకు శ్రీకారం చుట్టనుంది. ఇందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిపై మార్చి 17వరకూ ప్రజల నుంచి అభిప్రాయాలను కోరుతోంది. ప్రతిపాదనలను అమలు చేస్తే మరింతగా సమాచార ఆధారిత నిర్ణయాలు తీసుకునేందుకు మార్కెట్ పార్టిసిపెంట్లకు వీలు ఏర్పడుతుంది. తద్వారా రిస్కులను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవకాశమేర్పడుతుంది. రియల్‌టైమ్‌లో సెబీ రూపొందించిన తాజా ప్రతిపాదనల ప్రకారం మార్కెట్ పార్టిసిపెంట్లు ఇంట్రాడే స్నాప్‌చాట్స్ ద్వారా రియల్‌టైమ్ ఎఫ్‌అండ్‌వో ఓఐ సంబంధిత సమాచారాన్ని అందుకోగలుగుతారు. ఇది రిస్క్ లను సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో సహకరించడంతోపాటు.. ఉత్తమ నిర్ణయాలు తీసుకునేందుకు దారి చూపిస్తుంది. సెబీ సిద్ధం చేసిన కన్సల్టేషన్ పేపర్ ప్రకారం డెరివేటివ్స్‌లో మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్), ఆల్టర్నేటివ్ పండ్స్(ఏఐఎఫ్) చేపట్టే లావాదేవీల(ఎక్స్పోజర్) పరిమితులలో సవరణలకు తెరలేవనుంది. ఫ్యూచర్స్ ఎక్స్పోజర్ మదింపులో ఎలాంటి మార్పులు ఉండవు. అయితే ఆప్షన్స్(లాంగ్ అండ్ షార్ట్) ఎక్స్పోజర్లో సవరణలు చోటు చేసుకోనున్నాయి. వీటి ప్రకారం ఫ్యూచర్ ఈక్వివాలెంట్ లేదా డెల్టా ప్రాతిపదికన వీటిని మదింపు చేస్తారు. తద్వారా ఇవి మార్కెట్ కదలికల(సెన్సిటివిటీ)ను సమర్ధవంతంగా ప్రతిఫలిస్తాయి. సవరణల బాటలో ప్రస్తుతం విభిన్న పద్ధతుల్లో ఎఫ్‌అండ్‌వో ఎక్స్పోజర్లను మదింపు చేస్తున్నారు. ఫ్యూచర్స్ పొజిషన్ల ఆధారంగా, షార్ట్ అప్షన్స్ను నోషనల్ విలువ ద్వారా, లాంగ్ ఆప్షన్స్ అయితే ప్రీమియం చెల్లింపు ద్వారా మదింపు చేస్తున్నారు. కాగా.. మార్కెట్ రిస్క్ లను మరింతగా ప్రతిఫలించేలా ఇండెక్స్ డెరివేటివ్స్‌కు సెబీ కొత్త పొజిషన్ పరిమితులను ప్రతిపాదించింది. ఇండెక్స్ ఆప్షన్స్‌కు రోజువారీ ముగింపులో నికర విలువ రూ. 500 కోట్లు, స్థూలంగా రూ. 1,500 కోట్లవరకూ అనుమతించనుండగా.. ఇంట్రాడేకు నికరంగా రూ. 1,000 కోట్లు, స్థూలంగా రూ. 2,500 కోట్లు చొప్పున పరిమితులు అమలుకానున్నాయి.ఇక ఇండెక్స్ ఫ్యూచర్స్‌కు రోజువారీ ముగింపు పరిమితి రూ. 500 కోట్ల నుంచి రూ. 1,500 కోట్లకు పెరగనుంది. రూ. 2,500 కోట్ల ఇంట్రాడే పరిమితి ఇందుకు అమలుకానుంది. తాజా ప్రతిపాదనలు విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు), ఎంఎఫ్‌లు, ట్రేడర్లు, క్లయింట్లతోపాటు మార్కెట్ పార్టిసిపెంట్లు అందరికీ అమలుకానున్నాయి. అయితే నిజంగా హోల్డింగ్స్ కలిగిన పొజిషన్లకు మినహాయింపులు లభించనున్నాయి. స్టాక్స్ కలిగిన షార్ట్ పొజిషన్లు, నగదు కలిగిన లాంగ్ పొజిషన్లకు మినహాయింపులు వర్తించనున్నాయి. -
చిన్న సంస్థల రుణాల ట్రాకింగ్‌కు ప్రత్యేక సంస్థ ఉండాలి
చిన్న వ్యాపార సంస్థలు తీసుకునే రుణాలు లేదా ఈక్విటీ కింద సమీకరించే సద్వినియోగం అవుతున్నాయో లేదో పరిశీలించేందుకు మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలాంటిదేదైనా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ సీఎస్ శెట్టి అభిప్రాయపడ్డారు. ‘నిధులను దేని కోసం తీసుకుంటున్నారో కచి్చతంగా ఆ అవసరానికే వినియోగించేలా చూసేందుకు ఒక యంత్రాంగం అవసరం. రుణంగా లేదా ఈక్విటీ కింద తీసుకున్న నిధుల వినియోగాన్ని ట్రాక్ చేసే అధికారాలతో ప్రత్యేక మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలాంటిది ఉండాలి‘ అని ఎన్ఐఎస్ఎం నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఇలాంటి సంస్థను ఏర్పాటు చేయడం వల్ల రుణదాతలు, ఇన్వెస్టర్లకు కొంత భరోసా లభించగలదని శెట్టి చెప్పారు. చిన్న వ్యాపార సంస్థలు సమీకరించిన నిధులను అంతిమంగా ఉపయోగించే తీరుతెన్నులపై ఆందోళన వ్యక్తమవుతుండటం, నిధుల వినియోగాన్ని పర్యవేక్షించాలంటూ బ్యాంకులపై ఆర్బీఐ కూడా ఒత్తిడి పెంచుతుండటం తదితర పరిణామాల నేపథ్యంలో శెట్టి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదగాలంటే దేశీయంగా పొదుపు రేటు మరింత పెరగాలని, ఇందులో క్యాపిటల్ మార్కెట్లు కూడా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని శెట్టి చెప్పారు. క్రెడిట్ రేటింగ్స్‌ను పొందాలంటే చిన్న, మధ్య తరహా సంస్థలకు సరైన ఆర్థిక వివరాల రికార్డులు గానీ ఆర్థిక వనరులు గానీ ఉండవని, అలాంటి సంస్థలకు రుణాలివ్వడంలో రిస్కులను మదింపు చేయడం బ్యాంకులకు కష్టతరంగా ఉంటుందని పేర్కొన్నారు. -
అత్యవసర నిధికి నిజంగా ‘బంగారం’ అనుకూలమా?
ఆరు నెలల అవసరాలకు సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధి కింద బంగారంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? – నర్సింగ్రావుఆర్థిక అనిశ్చితుల్లో సురక్షిత సాధనంగా బంగారానికి మంచి గుర్తింపు ఉన్నప్పటికీ.. అత్యవసర నిధి ఏర్పాటుకు ఇది అనుకూలమైన సాధనం కాదు. ఎందుకంటే బంగారం ఆటుపోట్లతో కూడి ఉంటుంది. గడిచిన దశాబ్ద కాలంలో ఏ మూడు నెలల కాలాన్ని పరిశీలించి చూసినా బంగారం రాబడుల్లో ఆటుపోట్లు స్పష్టంగా కనిపిస్తాయి. రాబడులు గరిష్టంగా 24 శాతం వరకు, కనిష్టంగా 13 శాతం మధ్య ఉన్నాయి. అత్యవసర నిధికి స్థిరత్వం అవసరం. కానీ, బంగారం రాబడుల్లో ఉన్న ఈ ఊహించలేనితత్వం దీనికి విరుద్ధం. అత్యవసర నిధి ఏర్పాటుకు మోస్తరు స్థాయిలో స్థిరమైన రాబడులు ఇచ్చే సాధనాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు లిక్విడ్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ఈ ఫండ్స్ చాలా తక్కువ రిస్క్‌తో వస్తాయి. ఎలాంటి లాకిన్ పీరియడ్ ఉండదు.లిక్విడ్ ఫండ్స్ మంచి ఎంపికఅత్యవసర నిధి ఏర్పాటుకు కొన్ని లిక్విడ్ ఫండ్స్ మంచి ఎంపిక అవుతాయి. కరెన్సీల్లో అస్థిరతలు లేదా ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో బంగారం విలువైన సాధనంగా మారుతుంది. ఆ సమయంలో సంపద విలువ రక్షణ సాధనంగా పనికొస్తుంది. కొందరు ఇన్వెస్టర్లు తమ దీర్ఘకాల పోర్ట్‌ఫోలియోలో కొంత బంగారానికీ కేటాయిస్తుంటారు. ఇది ఈక్విటీలకు హెడ్జ్ సాధనంగా పనిచేస్తుంది. స్టాక్ మార్కెట్ గణనీయమైన దిద్దుబాట్లకు గురైనప్పుడు హెడ్జింగ్ సాధానంగా అనుకూలిస్తుంది. వైవిధ్యమైన, దీర్ఘకాల పోర్ట్‌ఫోలియోలో బంగారం సైతం తనవంతు పాత్ర పోషిస్తుంది. కానీ, అత్యవసర నిధికి అనుకూలమైనది కాదు. ఇదీ చదవండి: ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు!బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ గురించి విన్నాను. 2020 మార్చిలో ఈక్విటీ పతనం మాదిరి సంక్షోభాల్లో డౌన్‌సైడ్ రిస్క్ నుంచి రక్షణ ఉంటుందా? – మునిరత్నంఈక్విటీ మార్కెట్ల అస్థిరతల నుంచి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ పూర్తి స్థాయిలో రక్షణ కల్పించలేవు. ఎందుకంటే ఇవి కొంతమేర పెట్టుబడులను ఈక్విటీలకు సైతం కేటాయిస్తుంటాయి. ఈక్విటీలు మార్కెట్ అస్థిరతలకు లోబడే ఉంటాయి. కాకపోతే అచ్చమైన ఈక్విటీ పథకాలతో పోల్చుకుంటే మాత్రం వీటిలో అస్థిరతలు తక్కువ. ఇక బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ లేదా డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ అన్నింటిలోనూ ఈక్విటీ పెట్టుబడులు ఒకే మాదిరిగా ఉండవు. ఇటీవలి డేటా ప్రకారం ఈ పథకాల్లో ఈక్విటీ ఎక్స్పోజర్ 14 శాతం నుంచి 80 శాతం మధ్య ఉండడాన్ని గమనించొచ్చు. ఈక్విటీల్లో ఎంత మేర పెట్టుబడులు ఉన్నాయనే అంశం ఆధారంగా ఆయా పథకాల్లో డౌన్‌సైడ్ (నష్టం) రిస్క్ వేర్వేరుగా ఉంటుంది. అంతేకాదు విడిగా ఒక్కో పథకం సైతం మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఈక్విటీ ఎక్స్పోజర్ను మార్పులు, చేర్పులు చేస్తుంటుంది. కనుక వీటి ఆధారంగానూ డౌన్‌సైడ్ రిస్క్ మారుతుంటుంది. కనుక బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ మార్కెట్ల హెచ్చు, తగ్గుల ప్రభావాలకు అతీతం కాదని చెప్పుకోవాల్సిందే.- ధీరేంద్ర కుమార్, సీఈఓ, వ్యాల్యూ రీసెర్చ్ -
‘సిప్’ సరికొత్త రికార్డు.. ఈ ఇన్వెస్ట్ మీరూ చేస్తున్నారా?
న్యూఢిల్లీ: క్రమానుగత పెట్టుబడుల ప్రణాళిక (ఎస్ఐపీ– సిప్) పై ఇన్వెస్టర్ల భరోసా పెరుగుతోంది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్ఐ) సెప్టెంబర్ తాజా గణాంకాల ప్రకారం– సిప్‌లోకి సమీక్షా నెల్లో రికార్డు స్థాయిలో రూ.24,509 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.సిప్‌లోకి ఒకే నెలలో ఈ స్థాయి పెట్టుబడులు రావడం ఇదే తొలిసారి. క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక సంపద వైపు మళ్లుతున్న పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను ఈ పరిణామం తెలియజేస్తోందని ఏఎంఎఫ్ఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకట్ చలసాని అన్నారు. కాగా, ఆగస్టులో సిప్‌లోకి వచ్చిన పెట్టుబడుల విలువ రూ.23,547 కోట్లు. ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.34,419 కోట్లు.. ఇక మొత్తంగా చూస్తే, ఈక్విటీ ఫండ్స్‌లోకి ఇన్వెస్ట్మెంట్లు సెప్టెంబర్‌లో 10 శాతం (ఆగస్టుతో పోల్చి) పడిపోయి రూ.34,419 కోట్లుగా నమోదయ్యాయి. లార్జ్ క్యాప్, థీమెటిక్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు భారీగా తగ్గాయి. అయితే ఈక్విటీ ఫండ్స్‌లోకి నికర పెట్టుబడులు సుస్థిరంగా 43 నెలలుగా కొనసాగుతుండడం సానుకూల అంశం. మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్ల విశ్వాసానికి ఇది అద్దం పడుతోందని సంబంధిత వర్గాలు పేర్కొంన్నాయి. ఇక ఫండ్స్ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ ఆగస్టులో రూ.66.7 లక్షల కోట్లు ఉంటే, సెప్టెంబర్‌లో రూ.67 లక్షల కోట్లకు ఎగసింది. -
పెట్టుబడి మొత్తం ఈక్విటీలకేనా?
సంపాదనను సంపదగా మార్చుకోవాలంటే అనుకూలమైన వేదికల్లో ఈక్విటీ ముందుంటుంది. రియల్ ఎస్టేట్ సైతం దీర్ఘకాలంలో మంచి సంపద సృష్టికి మార్గమవుతుంది. కానీ, ఈక్విటీ మాదిరి సులభమైన లిక్విడిటీ సాధనం రియల్ ఎస్టేట్ కాబోదు. మొత్తం పెట్టుబడిని ఒకటి రెండు రోజుల్లోనే వెనక్కి తీసుకోవడానికి స్టాక్ మార్కెట్ వీలు కలి్పస్తుంది. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఈ విభాగం వైపు అడుగులు వేయడానికి గల కారణాల్లో ఇదీ ఒకటి. అయితే, ఒకరి పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ పెట్టుబడులు ఎంత మేర ఉండాలి..? రిటైల్ ఇన్వెస్టర్లలో చాలా మంది దీనికి సూటిగా బదులు ఇవ్వలేరు. ఈక్విటీల జిగేల్ రాబడులు చూసి చాలా మంది తమ పెట్టుబడులు మొత్తాన్ని స్టాక్స్‌లోనే పెట్టేస్తుంటారు. ఇలా చేయడం ఎంత వరకు సబబు? అసలు ఈ విధంగా చేయవచ్చా? ఒకరి పెట్టుబడుల కేటాయింపులు ఎలా ఉండాలి? ఈ విషయాలపై స్పష్టత కోసం కొన్ని కీలక అంశాలను ఒకసారి మననం చేసుకోవాల్సిందే. మీరు ఎలాంటి వారు? బుల్ మార్కెట్లో రిస్క్ తీసుకునేందుకు వెనుకాడకపోవడం.. బేర్ మార్కెట్లో రిస్‌్కకు దూరంగా ఉండడం రిటైల్ ఇన్వెస్టర్లలో కనిపించే సాధారణ లక్షణం. సుప్రసిద్ధ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ సూత్రానికి ఇది పూర్తి విరుద్ధం. ‘‘ఇతరులు అత్యాశ చూపుతున్నప్పుడు భయపడాలి.. ఇతరులు భయపడుతున్నప్పడు అత్యాశ చూపాలి’’ అన్నది బఫెట్ స్వీయ అనుభవ సారం. మెజారిటీ రిటైల్ ఇన్వెస్టర్లు దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తుంటారు. పైగా తమ రిస్క్ స్థాయి ఎంతన్నది కూడా పరిశీలించుకోరు. పెట్టుబడిపై భారీ రాబడుల అంచనాలే వారి నిర్ణయాలను నడిపిస్తుంటాయి. దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్లో రాణించాలంటే ఇలాంటి ప్రతికూల ధోరణలు అస్సలు పనికిరావు. అత్యవసర నిధి ఉన్నట్టుండి ఉపాధి కోల్పోయి ఏడాది, రెండేళ్ల పాటు ఎలాంటి ఆదాయం రాకపోయినా జీవించగలరా? ప్రతి ఒక్కరూ ఒకసారి ఇలా ప్రశ్నించుకోవాలి. లేదంటే ఏడాది, రెండేళ్ల జీవన అవసరాలు తీర్చే దిశగా అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాల్సిందే. దీర్ఘకాలం కోసమేనా?దీర్ఘకాలం అంటే ఎంత? అనే దానిపై ఇన్వెస్టర్లలో భిన్నమైన అంచనాలు ఉండొచ్చు. కొందరు 2–3 ఏళ్లు, కొందరు 5–10 ఏళ్లను దీర్ఘకాలంగా భావిస్తుంటారు. కానీ, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసే వారు స్వల్పకాలాన్ని మరిచి.. అవసరమైతే దశాబ్దాల పాటు ఆ పెట్టుబడులు కొనసాగించే మైండ్‌సెట్‌తో ఉండాలి. బేర్ మార్కెట్ తట్టుకున్నారా?కరోనా సమయంలో (2020 మార్చి) స్టాక్ మార్కెట్ భారీగా పడిపోవడం, కొన్ని నెలల వ్యవధిలోనే అంతా కోలుకోవడాన్ని ఇన్వెస్టర్లు చూసి ఉండొచ్చు. కానీ, మార్కెట్లు అన్ని సందర్భాల్లోనూ అంత వేగంగా కోలుకుంటాయని చెప్పలేం. చారిత్రక డేటాను పరిశీలిస్తే బేర్ మార్కెట్ ఆరంభం నుంచి రికవరీకి ఎంత లేదన్నా మూడేళ్లు పడుతుంది. కనుక బేర్ మార్కెట్ ఎంత కాలం పాటు కొనసాగినా, ధైర్యంగా వేచి చూడాలి. సాహసంబేర్ మార్కెట్లో తమ పోర్ట్‌ఫోలియో స్టాక్స్ భారీ నష్టాల పాలవుతుంటే దాన్ని చూసి తట్టుకోలేక రిటైల్ ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడుతుంటారు. నిజానికి ఆ సమయంలో అదనపు పెట్టుబడులు పెట్టాలే కానీ, ఉన్న పెట్టుబడులను వెనక్కి లాగేసుకోకూడదన్నది మార్కె ట్ పండితుల సూచన. ఇక్కడ చెప్పుకున్నట్టు అత్యవసరనిధి కలిగి, బేర్ మార్కెట్లో అదనంగా పెట్టుబడులు పెట్టే వెసులుబాటు.. లేదంటే ఉన్న పెట్టుబడులను కొనసాగించే మనో ధైర్యం ఉన్నవారు 100% పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకున్నా నష్టం లేదన్నది నిపుణుల నిర్వచనం. నూరు శాతం కాదు..? ఎన్ని చెప్పుకున్నా.. మధ్యమధ్యలో అనుకోని ఆర్థిక అవసరాలు ఎదురవుతుంటాయి. కనుక సామాన్య మధ్యతరగతి ఇన్వెస్టర్లు నూరు శాతం పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకుకోవడం సమంజసం కాదన్నది నిపుణుల అభిప్రాయం. ఇలాంటి వారు ఒకటి కంటే ఎక్కువ సాధనాల మధ్య పెట్టుబడులు వర్గీకరించుకోవాలి (అస్సెట్ అలోకేషన్). ఏ సాధనంలో ఎంతమేర అన్నది నిర్ణయించుకోవాలంటే.. విడిగా ఒక్కొక్కరి ఆరి్ధక అవసరాలు, లక్ష్యాలు, ఆశించే రాబడులు, రిస్క్ సామర్థ్యం, పెట్టుబడులు కొనసాగించడానికి ఉన్న కాల వ్యవధి ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అస్సెట్ అలోకేషన్ అంటే? ఒకరు రూ.100 ఇన్వెస్ట్ చేయాలనుకుంటే.. ఇందులో ఈక్విటీకి ఎంత, డెట్‌కు ఎంత అన్నది నిర్ణయించుకోవడం. ఈ రెండు సాధనాలే కాదు, బంగారం, రియల్ ఎస్టేట్ తదితర సాధనాలు కూడా ఉన్నాయి. కానీ, ఎవరికైనా ఈ నాలుగు సాధనాలు సరిపోతాయి. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తుంటే ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, గోల్డ్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. డెట్‌లో రిస్క్ డెట్‌లో రిస్క్ లేదా? అంటే లేదని చెప్పలేం. ఇందులో వడ్డీ రేట్లు, క్రెడిట్ రిస్క్ ఉంటాయి. అందుకే ఏఏఏ రేటెడ్ సాధనాల ద్వారా క్రెడిట్ రిస్‌్కను దాదాపు తగ్గించుకోవచ్చు. డెట్‌కు సింహ భాగం, కొంత శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే ‘ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్’ను సైతం అరుణ్ కుమార్ సూచించారు.బేర్ మార్కెట్ తట్టుకున్నారా?కరోనా సమయంలో (2020 మార్చి) స్టాక్ మార్కెట్ భారీగా పడిపోవడం, కొన్ని నెలల వ్యవధిలోనే అంతా కోలుకోవడాన్ని ఇన్వెస్టర్లు చూసి ఉండొచ్చు. కానీ, మార్కెట్లు అన్ని సందర్భాల్లోనూ అంత వేగంగా కోలుకుంటాయని చెప్పలేం. చారిత్రక డేటాను పరిశీలిస్తే బేర్ మార్కెట్ ఆరంభం నుంచి రికవరీకి ఎంత లేదన్నా మూడేళ్లు పడుతుంది. కనుక బేర్ మార్కెట్ ఎంత కాలం పాటు కొనసాగినా, ధైర్యంగా వేచి చూడాలి. సాహసంబేర్ మార్కెట్లో తమ పోర్ట్‌ఫోలియో స్టాక్స్ భారీ నష్టాల పాలవుతుంటే దాన్ని చూసి తట్టుకోలేక రిటైల్ ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడుతుంటారు. నిజానికి ఆ సమయంలో అదనపు పెట్టుబడులు పెట్టాలే కానీ, ఉన్న పెట్టుబడులను వెనక్కి లాగేసుకోకూడదన్నది మార్కె ట్ పండితుల సూచన. ఇక్కడ చెప్పుకున్నట్టు అత్యవసరనిధి కలిగి, బేర్ మార్కెట్లో అదనంగా పెట్టుబడులు పెట్టే వెసులుబాటు.. లేదంటే ఉన్న పెట్టుబడులను కొనసాగించే మనో ధైర్యం ఉన్నవారు 100% పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకున్నా నష్టం లేదన్నది నిపుణుల నిర్వచనం. రాబడులు దీర్ఘకాలం పాటు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తే కచి్చతంగా రాబడులే వస్తాయా? నిఫ్టీ 50 టీఆర్ఐ (రోలింగ్ రాబడులు) ఐదేళ్ల కాల పనితీరును గమనిస్తే ఒక్కో ఏడాది 47 శాతం పెరగ్గా, ఒక ఏడాది మైనస్ 1 శాతం క్షీణించింది. 2007 నుంచి 2023 మధ్య ఒక ఏడాది 52 శాతం, మరొక ఏడాది 25 శాతం వరకు నిఫ్టీ సూచీ నష్టపోయింది. కానీ, 55 శాతం, 76 శాతం రాబడులు ఇచి్చన సంవత్సరాలూ ఉన్నాయి.ఏ సాధనానికి ఎంత? సాధారణంగా ఈక్విటీలకు ఎక్కువ కేటాయించుకోవడం వల్ల దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు అవకాశాలు ఉంటాయని చెప్పుకున్నాం. కనుక 20–30 ఏళ్ల వయసు వారు ఈక్విటీలకు 70–80 శాతం వరకు కేటాయించుకున్నా పెద్ద రిస్క్ ఉండబోదు. ఎందుకంటే వారు తమ పెట్టుబడులను దీర్ఘకాలంపాటు అంటే 20 ఏళ్ల పాటు కొనసాగించే వెసులుబాటుతో ఉంటారు. అదే 30–40 ఏళ్ల వయసు వారు ఈక్విటీలకు 50–70 శాతం మధ్య కేటాయించుకోవచ్చు. అంతకుపైన వయసున్న వారు 50 శాతం మించకుండా ఈక్విటీ పెట్టుబడులను కొనసాగించుకోవచ్చని నిపుణులు సూచిస్తుంటారు. 70 శాతం ఈక్విటీ కేటాయింపులు చేసుకునే వారు 20 శాతం డెట్‌కు, 10 శాతం బంగారంలో ఇన్వెస్ట్ చేయవచ్చు. 50 శాతం ఈక్విటీలకు కేటాయించే వారు 30–40 శాతం డేట్‌కు, బంగారానికి 10 శాతం వరకు కేటాయించొచ్చు. ఈ గణాంకాలన్నీ సాధారణీకరించి చెప్పినవి. విడిగా చూస్తే, 30 ఏళ్ల వయసున్న వ్యక్తికి 5 ఏళ్లలోపు వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారని అనుకుందాం. అటువంటప్పుడు పిల్లల ఉన్నత విద్యకు 10–15 ఏళ్ల కాలంలో నిరీ్ణత మొత్తం కావాల్సి వస్తుంది. అటువంటప్పుడు పెట్టుబడులకు 10–15 ఏళ్ల కాలం మిగిలి ఉంటుంది. కనుక ఈక్విటీలకు 70 శాతం వరకు, మిగిలినది డెట్, గోల్డ్‌కు కేటాయింపులు చేసుకోవచ్చు. పిల్లల వివాహం కోసం అయితే 20 ఏళ్లు, రిటైర్మెంట్ కోసం అయితే 30 ఏళ్ల కాలం ఉంటుంది. వీటి కోసం కూడా ఈక్విటీలకు గణనీయమైన కేటాయింపులు చేసుకోవచ్చు. ఒకవేళ ఐదేళ్లలోపు లక్ష్యాలు అయితే 80 శాతం డెట్‌కు, 20 శాతం ఈక్విటీలకు (ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్) కేటాయించుకోవచ్చు. మూడేళ్ల లక్ష్యాల కోసం అయితే పూర్తిగా డెట్‌కే పరిమితం కావడం శ్రేయస్కరం.3టీ కార్యాచరణ అస్సెట్ అలోకేషన్ విషయంలో మూడు ‘టీ’ల కార్యాచరణను ఫండ్స్ ఇండియా రీసెర్చ్ హెడ్ అరుణ్ కుమార్ తెలియజేశారు. మొదటిది కాలం (టైమ్). ‘‘చారిత్రకంగా చూస్తే దీర్ఘకాలంలో డెట్ (ఫిక్స్డ్ ఇన్కమ్)తో పోలి్చనప్పుడు ఈక్విటీలే మెరుగైన పనితీరు చూపించాయి. కానీ స్వల్పకాలంలో 10–20 శాతం వరకు పతనాలు కనిపిస్తుంటాయి. అలాగే ఏడు–పదేళ్లకోసారి 30–60 శాతం వరకు పతనాలు కూడా సంభవిస్తుంటాయి. గత 40 ఏళ్ల చరిత్ర చూస్తే ఇదే తెలుస్తుంది. కానీ, ఈ 10–20 శాతం దిద్దుబాట్లు 30–60 శాతం పతనాలుగా ఎప్పుడు మారతాయన్నది ఎవరూ అంచనా వేయలేరు. ఇలాంటి పతనాలను ఎక్కువ మంది తట్టుకోలేరు. అందుకే పోర్ట్‌ఫోలియోలో డెట్‌ను చేర్చుకోవాలి. ఇది నిలకడైనది. దీర్ఘకాలంలో రాబడి 5–7 శాతం మధ్యే ఉంటుంది. కనుక ఈక్విటీలకు ఎంత కేటాయించాలన్న విషయంలో కాలాన్ని చూడాలి. ఎంత ఎక్కువ కాలం ఉంటే, ఈక్విటీలకు ఎక్కువ పెట్టుబడులు కేటాయించుకోవచ్చు. రెండోది టోలరెన్స్(టీ). అంటే నష్టాలను భరించే సామర్థ్యం. స్వల్పకాలంలో 10–20 శాతం పతనాలను తట్టుకునే సామర్థ్యం లేని వారు డెట్ కేటాయింపులు మరికాస్త పెంచుకోవచ్చు. ఈక్విటీలకు 50 శాతమే కేటాయించుకుంటే తరచూ వచ్చే పతనాల ప్రభావం తమ పోర్ట్‌ఫోలియోపై 10 శాతం, ఏడు–పదేళ్లకోసారి వచ్చే భారీ పతన ప్రభావాన్ని 25 శాతానికి తగ్గించుకోవచ్చు. మూడోది. ట్రేడాఫ్ (టీ). పెట్టుబడికి దీర్ఘకాలం ఉన్నప్పటికీ నష్టాల భయంతో రాబడుల్లో రాజీపడడం. ఏటా 12 శాతం రాబడి (ఈక్విటీల్లో దీర్ఘకాలం సగటు వార్షిక రాబడి) సంపాదిస్తే 20 ఏళ్లలో పెట్టుబడి 10 రెట్లు అవుతుంది. రాబడి ఏటా 10 శాతమే ఉంటే 20 ఏళ్లలో పెట్టుబడి ఏడు రెట్లే పెరుగుతుంది. 8 శాతం వార్షిక రాబడే వస్తే 20 ఏళ్లలో పెట్టుబడి ఐదు రేట్లే వృద్ధి చెందుతుంది. డెట్‌కు కేటాయింపులు పెంచుకున్నకొద్దీ అంతిమంగా నికర రాబడులు తగ్గుతుంటాయి’’ అని అరుణ్ కుమార్ వివరించారు. నేరుగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే వారు 70–80 శాతం లార్జ్‌క్యాప్‌నకు, మిడ్‌క్యాప్ స్టాక్స్‌కు 10–15 శాతం, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌కు 5–10 శాతం మధ్య కేటాయించుకోవచ్చని సూచించారు. ఫండ్స్ ద్వారా అయినా సరే ఇంతే మేర ఆయా విభాగాల ఫండ్స్‌కు కేటాయింపులు చేసుకోవచ్చు. -
మగపిల్లల పెంపకం
సాధారణంగా పెంపకం విషయంలో ఆడపిల్లలకి ఎన్నో జాగ్రత్తలు చెప్పటం చూస్తాం. మగపిల్లలకి చెప్పవలసినది ఏమీ లేదని చాలా మంది అభిప్రాయం. ఈ కారణంగానే సమాజంలో ఎన్నో అయోమయ పరిస్థితులు, అలజడులు, అరాచకాలు. ముఖ్యంగా ఆడపిల్లలకి సమాజం మీద ఏవగింపు, కోపం, పురుషద్వేషం పెరిగి అవాంఛనీయ సంఘటనలకి దారి తీయటం జరుగుతోంది. అమ్మాయిలు విప్లవభావాల పట్ల ఆకర్షించబడటం, పెళ్లి చేసుకోవద్దు అనుకోటం, చేసుకున్నా విడాకులు తీసుకోవటం, కుటుంబాలు విచ్ఛిన్నం కావటం, లేదా అమ్మాయిలనే పెళ్లి చేసుకోవటమో, సహజీవనం చేయటమో జరుగుతోంది. ఇవన్నీ కొంతవరకైనా అదుపులో ఉండి సమాజంలో సమరసత ఉండటానికి మగపిల్లలని సరిగా పెంచటం ప్రధానం. మన తరువాతి తరం వారికి మనం ఏం నేర్పిస్తున్నాం? అని కాస్త వివేచన చేస్తే ... అమ్మో! ఎంత భయం వేస్తుందో! మన ప్రవర్తన ద్వారా నేర్పే విషయాలే కాదు, మన మాటలు, ఆదేశాలు, ఉపదేశాలు, బోధలు మొదలైనవి కూడా తలుచుకుంటే బాధ కలుగుతుంది. ఆడ, మగ వివక్ష ఇంట్లోనే మొదలవుతుంది. ఆడపిల్ల పుట్టిందనగానే ముందుగా ‘‘అయ్యో!’’ అనేది తల్లే. పెంపకంలోనూ తేడా చూపిస్తారు. ఉదాహరణకి ఇంట్లో అమ్మాయిని తల్లే అంటుంది ‘‘ఆడపిల్లవి నీకెందుకు?’’ అని. అంటే ఆడపిల్ల కొన్ని విషయాలు పట్టించుకోకూడదు. అవసరం లేదు. కొడుకు కూడా కొన్ని పట్టించుకోకూడదు. కానీ అవి వేరు. అవి ఇంటి విషయాలు, వంటవిషయాలు మొదలైనవి. ఇంక కొన్ని కుటుంబాలలో ఆస్తిపాస్తులు పంచి ఇవ్వటం మాట అటుంచి కూతురిని ఇంటిపని చెయ్యమని, కొడుకుని చదువుకోమని చెప్పేవారు కనపడుతూనే ఉన్నారు. ఇద్దరినీ సమానంగా చూడటం ఎట్లా కుదురుతుంది? ఆడపిల్లలు కొంచెం నాజూకుగా ఉంటారు, మగపిల్లలు కాస్త మొరటుగా ఉంటారు కదా! అనిపించటం సహజం. సమానత్వం అంటే వారి పట్ల ప్రవర్తించే తీరు సమానంగా ఉండటం. వారికి ఇష్టమయినవి, వారి అభిరుచులకు తగినవి అందించటం. నిజానికి మగపిల్లలైనా ఏ ఇద్దరికీ ఒకే రకమైన అభిరుచులు, లక్ష్యాలు ఉండవు కదా! ఒకరికి ఇంజనీరింగ్ ఇష్టమైతే మరొకరికి వైద్యవృత్తి ఇష్టం, వేరొకరికి వ్యవసాయం మీద మక్కువ ఉండవచ్చు. వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వటం తల్లితండ్రుల కర్తవ్యం. అదే ఆడపిల్లల విషయంలో కూడా పాటించాలి. ఇదిప్రోత్సాహం మాత్రమే. అసలు చేయవలసినది మగపిల్లల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు. ఆడపిల్లలని గౌరవించటం నేర్పాలి. ఇది తండ్రి ప్రవర్తన వల్ల కలుగుతుంది. తండ్రి తల్లిని గౌరవిస్తూ ఉంటే కొడుకు కూడా తల్లిని, స్త్రీలని గౌరవిస్తాడు. చీటికి మాటికి భార్యని భర్త చులకన చేస్తూ ఉంటే కొడుకుకి ఆడవారిని తక్కువగా చూడటం అలవాటు అవుతుంది. తరువాతి కాలంలో ఈ భావం సరి అవటం కష్టం. ఇటువంటి పెంపకంలో పెరిగిన వారే ఆడపిల్లలని ఏడిపించటం నుండి యాసిడ్ దాడులు, అత్యాచారాలు మొదలైనవి చేస్తూ ఉంటారు. ఏ ఇంట్లో తండ్రి తల్లిని అగౌరవపరచడో, ఆడపిల్లలని బరువుగా భావించ కుండా ఉంటారో ఆ ఇంట్లో పెరిగిన మగపిల్లలు తోటి ఆడపిల్లలతో మర్యాదగా ప్రవర్తిస్తారు. అటువంటి వాళ్ళు ఉన్న సమాజంలో మన ఆడపిల్లలు కూడా భద్రంగా ఉంటారు. ప్రతి క్షణం ఆడపిల్ల, మగపిల్లవాడు అనే మాటని అని వారికి ఆ సంగతి గుర్తు చేస్తూ ఉండకూడదు. ఇంటి పనులన్నీ ఇద్దరి చేత సమానంగా చేయిస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ రోజులలో ఆడ, మగ అందరు ఉద్యోగం చేస్తున్నారు. మగవారి బాధ్యత అయిన సంపాదించటంలో ఆడవారు భాగస్వామ్యం వహిస్తున్నప్పుడు, ఇంటి పనిలో మగవారు కూడా భాగస్వామ్యం వహించాలి అని చిన్నప్పుడే బుర్రకి ఎక్కించాలి. ముందు తిన్నకంచం తీయటం, వంటపనిలో సహాయం చేయటం అలవాటు చేయాలి. లేక΄ోతే కోడలు అత్తగారి పెంపకాన్ని తప్పు పడుతుంది. – డా. ఎన్. అనంతలక్ష్మి -
స్మార్ట్ సిప్ అంటే ఏంటి?
ఈక్విటీ మార్కెట్ ఎప్పటికప్పుడు నూతన గరిష్ట స్థాయిలను తాకుతోంది. కనుక ఈ పరిస్థితుల్లో స్మార్ట్ సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవడాన్ని సూచిస్తారా..? డి. వెంకట రమణ స్మార్ట్ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (స్మార్ట్ సిప్) అనేది రెగ్యులర్ సిప్‌తో పోలిస్తే వినూత్నమైనది. ప్రతి నెలా సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసే మొత్తం అప్పటి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా స్మార్ట్ గా మారిపోతుంది. కొన్ని పారామీటర్ల ఆధారంగా మార్కెట్ల విలువలు ఖరీదుగా ఉన్నాయా? లేక చౌక గా ఉన్నాయా అన్నది ఆల్గోరిథమ్ నిర్ణయిస్తుంది. మార్కెట్లు పూర్తి విలువ మేర ట్రేడ్ అవుతున్నాయని ఆల్గోరిథమ్ (సాఫ్ట్వేర్) భావిస్తే, అప్పుడు సిప్‌లో కొంత భాగమే ఈక్విటీ పెట్టుబడిగా వెళుతుంది. మిగిలిన మొత్తాన్ని లిక్విడ్ ఫండ్‌కు తరలిస్తుంది. ఒకవేళ స్టాక్ విలువలు చౌకగా ఉన్నాయని భావిస్తే అప్పుడు పెట్టుబడిలో అధిక భాగం స్టాక్స్‌కే కేటాయిస్తుంది. లిక్విడ్ ఫండ్‌కు పరిమితంగానే వెళుతుంది. స్మార్ట్ సిప్ ఇదే మాదిరిగా పనిచేస్తుంది. ఈ విధానం ఇన్వెస్టర్లకు ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఈక్విటీ వ్యాల్యూషన్లు ఖరీదుగా ఉన్నప్పుడు తక్కువ మొత్తమే పెట్టుబడిగా వెళుతుంది. అదే ఈక్విటీ వ్యాల్యూషన్ చౌకగా మారినప్పుడు సిప్‌లో అధిక భాగం ఈక్విటీలకు వెళుతుంటుంది. మార్కెట్లో అనుకూల సమయాన్ని ఎవరూ అంచనా వేయ లేరు. ఓ పద్ధతి ప్రకారం, క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లడమే కీలకం. ఇందుకు స్మార్ట్‌సిప్ వీలు కల్పిస్తుంది. నిజానికి సాధారణ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ఉద్దేశం కూడా పెట్టుబడులకు సంబంధించి రిస్‌్కను తగ్గించడమే. మార్కెట్లు ఎప్పుడు దిద్దుబాటుకు గురవుతాయి? ఎప్పటి వరకు ర్యాలీ చేస్తాయి? అని ఎవరూ చెప్పలేదు. అటు ర్యాలీల్లోనూ, ఇటు పతనాల్లోనూ ప్రతి నెలా క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం సిప్ ద్వారా సాధ్యపడుతుంది. మార్కెట్లు ఖరీదుగా మారా యా? చౌకగా ఉన్నాయా? అని చూడక్కర్లేదు. దీనివల్ల దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తాన్ని సమకూర్చుకోవడం సాధ్యపడుతుంది. స్టాక్స్ ధరలు దిద్దుబాటుకు గురైనప్పుడు సిప్ పెట్టుబడితో ఎక్కువ ఫండ్ యూనిట్లు సమకూరుతాయి. దీర్ఘకాలంలో సంపద సృష్టికి కావాల్సినది క్రమశిక్షణ. అందుకు సిప్ వీలు కల్పిస్తుంది. కనుక మార్కెట్లు గరిష్టాల్లో ఉన్నాయని చెప్పి స్మార్ట్సిప్ను పరిశీలించక్కర్లేదు. మీరు రెగ్యులర్ సిప్ మార్గంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నా పెట్టుబడుల్లో సింహ భాగం ఈక్విటీల్లోనే ఉన్నా యి. రిటైర్మెంట్కు మూడేళ్లు మిగిలి ఉంది. ఇప్పుడు ఈక్విటీ పెట్టుబడులను డెట్ ఫండ్స్‌లోకి మళ్లించుకోవచ్చా? నా లాభం రూ.లక్షకు మించే ఉంటుంది. కనుక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇలా డెట్‌లోకి మళ్లించిన త ర్వాత ప్రతి నెలా ఇంత చొప్పున సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ద్వారా తీసుకుందామని అనుకుంటున్నాను. డెట్ ఫండ్ నుంచి ప్రతి నెలా బ్యాంక్ ఖాతాకు జమ అయ్యే మొత్తంపైనా పన్ను పడుతుందా? త్యాగన్ నరేంద్రన్ అవును. రెండు సందర్భాల్లోనూ మూలధన లాభంపై పన్ను పడుతుంది. అయినప్పటికీ రెండింతల పన్ను చెల్లించినట్టు కాదు. పెట్టుబడిపై వచ్చే రాబడిపైనే పన్ను అమలవుతుంది. దీర్ఘకాల లక్ష్యానికి చేరువ అవుతున్న క్రమంలో మూడేళ్ల ముందుగానే ఈక్విటీ పెట్టుబడులను స్థిరాదాయ సాధనాల్లోకి మళ్లించుకోవడం మంచి ఆలోచనే అవుతుంది. లక్ష్యానికి చేరువ అవుతున్నప్పుడు పెట్టుబడులు తక్కువ అస్థిరతలతో కూడిన సాధనాల్లో ఉండడం ఎంతో అవసరం. ఇలాంటప్పుడే సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) అక్కరకు వస్తుంది. ఈక్విటీ ఫండ్స్ నుంచి మీ పెట్టుబడులను ఎస్‌డబ్ల్యూపీ ద్వారా డెట్ ఫండ్స్‌లోకి మళ్లించుకోవడం వల్ల మార్కెట్ కనిష్టంలో ఉన్నప్పుడు వైదొలిగే రిస్క్‌ను తప్పిస్తుంది. ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
గోల్డ్ ఈటీఎఫ్‌లకు మళ్లీ ఆదరణ
న్యూఢిల్లీ: బంగారం ఎక్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు)కు అక్టోబర్‌లో ఇన్వెస్టర్ల నుంచి ఆదరణ కనిపించింది. ఏకంగా రూ.841 కోట్ల పెట్టుబడులను గోల్డ్ ఈటీఎఫ్‌లు ఆకర్షించాయి. అంతకుముందు సెప్టెంబర్ మాసంలో గోల్డ్ ఈటీఎఫ్‌లలో తాజా పెట్టుబడులు రూ.175 కోట్లతో పోల్చి చూస్తే గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది ఆగస్ట్‌లో అత్యధికంగా రూ.1,028 కోట్లు గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చాయి. ఇది 16 నెలల గరిష్ట స్థాయి కావడం గమనార్హం. జూలైలోనూ రూ.456 కోట్ల పెట్టుబడులను గోల్డ్ ఈటీఎఫ్‌లు ఆకర్షించాయి. అంతకుముందు ఏప్రిల్–జూన్ మధ్య నికరంగా రూ.298 కోట్ల పెట్టుబడులను ఇవి కోల్పోయాయి. ఈ ఏడాది మార్చి నెలలో వీటి నుంచి ఇన్వెస్టర్లు రూ.1,243 కోట్లు ఉపసంహరించుకున్నారు. గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్టర్ల పెట్టుబడి ఖాతాల సంఖ్య (ఫోలియోలు) అక్టోబర్‌లో 27,700 పెరిగి మొత్తం 48.34 లక్షలకు చేరాయి. గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తులు 10 శాతం పెరిగి రూ.26,613 కోట్లకు చేరాయి. సెప్టెంబర్ చివరికి వీటి విలువ రూ.23,800 కోట్లుగా ఉన్నట్టు యాంఫి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లు ఒక గ్రాము పరిమాణంలో ట్రేడ్ అవుతుంటాయి. దేశీయ బంగారం ధరలనే ఇవి ప్రతిఫలిస్తుంటాయి. ‘‘ప్రస్తుతం పలు దేశాల మధ్య నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, యూఎస్‌లో వడ్డీ రేట్ల పెరుగుదల కొనసాగుతుందన్న భయాలు, ద్రవ్యోల్బణం ఇప్పటికీ గరిష్ట స్థాయిలోనే ఉండడం, వృద్ధి రేటు తగ్గిన నేపథ్యంలో బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్లు పరిగణిస్తున్నారు’’అని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ మెల్విన్ శాంటారియా తెలిపారు. -
క్యూ2లో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు రూ. 34,765 కోట్లు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో మొత్తం మీద రూ.34,765 కోట్ల పెట్టుబడులను నికరంగా ఆకర్షించింది. అంతకుముందు జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో వచ్చిన పెట్టుబడులు రూ.1.85 లక్షల కోట్లతో పోలిస్తే గణనీయంగా తగ్గాయి. అయినప్పటికీ పెట్టుబడుల రాక సానుకూలంగానే ఉంది. ఫిక్స్డ్ ఇన్కమ్ (డెట్ ఫండ్స్) విభాగంపై ఎక్కువ ప్రభావం పడింది. వీటి నుంచి ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. ఫండ్స్ నుంచి జూలైలో రూ.82,467 కోట్ల పెట్టుబడులు రాగా, ఆగస్ట్‌లో రూ.16,180 కోట్లకు పరిమితమయ్యాయి. సెప్టెంబర్ నెలలో రూ.63,882 కోట్ల పెట్టుబడులు బయటకు వెళ్లిపోయాయి. దీంతో నికరంగా రూ.34,765 కోట్ల పెట్టుబడులు నమోదైనట్టు మార్నింగ్ స్టార్ ఇండియా నివేదిక తెలిపింది. జూన్ త్రైమాసికంలో వచ్చిన పెట్టుబడులు నాలుగేళ్లలోనే గరిష్ట స్థాయి అని పేర్కొంది. మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తుల విలువ జూన్ చివరి నుంచి సెప్టెంబర్ చివరికి 5 శాతం పెరిగి రూ.46.22 లక్షల కోట్లుగా ఉంది. గత పది త్రైమాసికాల్లోనే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి సానుకూల పెట్టుబడులు నమోదయ్యాయి. ఈక్విటీ పథకాల్లోకి నికరంగా రూ.41,962 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వచ్చిన రూ.18,358 కోట్లతో పోలిస్తే రెట్టింపునకు పైగా పెరిగాయి. ఇక డెట్ ఫండ్స్ నుంచి రూ.65,944 కోట్ల పెట్టుబడులు బయటకు వెళ్లిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో ఈ విభాగం రూ.1.38 లక్షల కోట్లు ఆకర్షించడంతో పోలిస్తే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. -
మీ ఫండ్‌కు మీరే మేనేజర్..?
మెరుగైన రాబడుల కోసం ఈక్విటీల వైపు అడుగులు వేసే రిటైల్ ఇన్వెస్టర్లు పెరుగుతున్నారు. అన్ని సాధనాల్లోకెల్లా ఈక్విటీలు దీర్ఘకాలంలో స్థిరమైన, మెరుగైన రాబడులు ఇవ్వడమే ఈ ఆకర్షణకు కారణం. ఈక్విటీల్లో పెట్టుబడులు ఎంత సులభమో, ఆచరణలో అంత కష్టం. నిపుణులైన ఫండ్ మేనేజర్లను కాదని, నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపించే వారు, ప్రాథమిక విషయాల గురించి, రిస్క్ గురించి తప్పకుండా తెలుసుకుని తీరాలి. లేదంటే అసలు ఉద్దేశమే నెరవేరకుండా పోతుంది. తమ పెట్టుబడులకు తామే ఫండ్ మేనేజర్ పాత్ర పోషిస్తామనుకునే వారు, ఈక్విటీలో తలపండిన వారెన్ బఫెట్, ఫిలిప్ ఫిషర్, చార్లీ ముంగర్ చెప్పిన సూత్రాలు పాటించడం అనుసరణీయం. కంపెనీ గురించి, చేస్తున్న వ్యాపారం గురించి, పని చేస్తున్న రంగం, యాజమాన్య దక్షత, పోటీ సామర్థ్యాలు, నిధుల బలాలు ఇలా ఎన్నో అంశాలను చూసి వడపోయాలి. ఆపై మిగిలిన కంపెనీలకే పెట్టుబడులను పరిమితం చేసుకోవడం వల్ల రక్షణ ఎక్కువగా ఉంటుంది. నేరుగా పెట్టుబడులు పెట్టే ప్రతి ఇన్వెస్టర్ తెలుసుకోవాల్సిన అంశాల సమాహారమే ఈ కథనం... వ్యాపార నమూనా అర్థమైందా? ఒక కంపెనీ షేర్లు కొంటున్నామంటే.. సదరు వ్యాపారంలో పెట్టుబడి పెడుతున్నట్టు. ఒక షేరును రూ.20లో కొని, అది రూ.100కు చేరితే నాలుగింతలు లాభం వస్తుందన్న అవాస్తవ అంచనాలు వేసుకుని ఓ కంపెనీలో పెట్టుబడులు పెడుతున్నారంటే? అనుసరించే బాట సరిగ్గా లేదని తెలుసుకోవాలి. ఎంపిక చేసుకునే కంపెనీకి ఆదాయం ఎలా వస్తోంది? కంపెనీ సేవలు లేదా ఉత్పత్తులు ఏంటన్నవి అర్థం చేసుకున్నారా? ఈ ప్రశ్నలకు మీ వద్ద సమాధానం ఉండాల్సిందే. కంపెనీ ఉత్పత్తులు లేదా సేవల గురించి తెలియనప్పుడు, భవిష్యత్తులో ఆ కంపెనీ వ్యాపారం ఎలా సాగుతుందో ఎలా తెలుస్తుంది? అటువంటప్పుడు పెట్టే పెట్టుబడి ఎలా వృద్ధి చెందుతుంది? ఒక కంపెనీ గురించి అర్థం కాకకపోయినా లేదా ఉత్పత్తులు, సేవలు ఆకర్షణీయంగా అనిపించకపోయినా, ఆ కంపెనీకి దూరంగా ఉండడమే మంచిది. వ్యాపారం అర్థం చేసుకునేందుకు ఎంత సులభంగా ఉంటే, అంత ఆకర్షణీయమైనదిగా భావించొచ్చు. యాజమాన్య దక్షత గుడ్ బిజినెస్ ఇన్ రాంగ్ హ్యాండ్స్.. రాంగ్ బిజినెస్ ఇన్ గుడ్ హ్యాండ్స్.. ఈ రెండింటిలో రెండోదే ఉత్తమం. సమర్థత లేని వ్యక్తుల చేతుల్లో మంచి వ్యాపారం ఉన్నా దాన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్లలేరు. అదే మంచి వ్యాపార దక్షత కలిగిన వ్యక్తులు యాజమాన్య స్థానంలో ఉంటే, చెత్త వ్యాపారాన్ని సైతం మంచిగా వృద్ధి చేయగలరు. పెట్టుబడులు పెట్టే కంపెనీకి సమర్థులైన, ప్రతిభావంతులైన, భవిష్యత్తు ప్రణాళికలు, పోటీతత్వంపై స్పష్టమైన అవగాహన, టెక్నాలజీ పట్ల ఆసక్తి కలిగిన ప్రమోటర్లు ఉండాలి. ఆ కంపెనీ యాజమాన్యం పనితీరు గురించి సాధ్యమైనంత లోతుగా తెలుసుకోవాలి. వ్యవస్థాపకుల ఆధ్వర్యంలో నడిచేవి, కుటుంబ కంపెనీలు సగటున ఏటా 3 శాతం అధిక పనితీరు చూపిస్తున్నట్టు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అదే సమయంలో ప్రమోటర్లతో సంబంధం లేకుండా నిపుణుల ఆధ్వర్యంలో గొప్పగా పనిచేసే హెచ్డీఎఫ్సీ గ్రూప్, ఎల్అండ్టీ గ్రూప్, ఐటీసీ గ్రూప్ కూడా ఉన్నాయి. మరొక ముఖ్యమైన అంశం.. ప్రతి కంపెనీ కూడా ఒక్కో రంగంలో విశేషమైన అనుభవం కలిగి ఉంటుంది. ఆయా రంగంలో వచ్చే మార్పులు, సవాళ్లకు అనుగుణంగా తన వ్యూహాలు మార్చుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. అలా ఓ రంగానికే కట్టుబడి గొప్పగా రాణిస్తున్న కంపెనీలను పెట్టుబడులకు పరిశీలించొచ్చు. కంపెనీల మేనేజ్మెంట్ వ్యాపారంపైనే దృష్టి పెట్టాలి కానీ, వాటాదారుల విలువపై కాదు. కంపెనీ వ్యాపారంలో మెరుగ్గా రాణిస్తుంటే సహజంగానే వాటాల విలువ ఇతోధికం అవుతుంది. వ్యాపారం కాకుండా వాటాల విలువను పెంచడంపై దృష్టి సారించే యాజమాన్యాల వైఖరి, దీర్ఘకాలంలో వాటాదారులకు మేలు చేయకపోవచ్చు. కొన్ని కంపెనీలు చేస్తున్న వ్యాపారంపై దృష్టి తగ్గించి, మార్కెట్లో వచ్చే కొత్త వ్యాపార అవకాశాల్లోకి ప్రవేశిస్తుంటాయి. వాటాల విలువ పెరుగుతుందని అలా వ్యవహరిస్తుంటాయి. దీనివల్ల నిజానికి వ్యాపార విధానం గాడి తప్పుతుంది. కొత్త వ్యాపారాల కోసం పెద్ద ఎత్తున రుణాలు సమీకరిస్తుంటాయి. ఇది కూడా వాటాదారుల విలువకు ప్రతికూలం అవుతుంది. భవిష్యత్ నాయకత్వం? ఒక గొప్ప ప్రమోటర్‌ను చూసి కళ్లు మూసుకుని ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చని అనుభవజు్ఞలైన ఇన్వెస్టర్లు చెబుతుంటారు. నిజమే అలా ఇన్వెస్ట్ చేసిన తర్వాత, ఆ గొప్ప ప్రమోటర్ ఏదో ఒకరోజు వయసు మళ్లో లేకుంటే ఆకస్మికంగా కాలం చేస్తే పరిస్థితి ఏమిటి? కంపెనీ సంక్షోభంలో పడిపోకుండా, ఆ తర్వాత నుంచి సమర్థవంతంగా నడిపించే నాయకుడు ఉన్నారో లేదో చూడాలి. ప్రమోటర్ కాకపోయినా కంపెనీలను గొప్ప స్థాయికి తీసుకెళ్లిన ఎల్అండ్టీ ఏఎం నాయక్ వంటి నిపుణులు ఎందరో ఉంటారు. అలాంటి నిపుణుల చేతికి నాయకత్వం వెళితే నిశి్చంతగా ఉండొచ్చు. పనిచేస్తున్న రంగం కంపెనీ ఏ రంగంలో పనిచేస్తుందన్నది మరో ముఖ్యమైన అంశం. ఉదాహరణకు మెటల్స్ తీసుకుంటే వాటి ధరలు అంతర్జాతీయంగా వివిధ దేశాల వినియోగం, ఆరి్థక పరిస్థితులకు అనుగుణంగా తీవ్ర హెచ్చుతగ్గులను చూస్తుంటాయి. స్థిరమైన రాబడి కోరుకునే వారు మెటల్స్‌కు దూరంగా ఉండాల్సిందే. అదే ఐటీ రంగం తీసుకుంటే అస్థిరతలు తక్కువ. ఎక్కువ కాలాల్లో స్థిరమైన వృద్ధిని ఏటా నమోదు చేస్తుంటాయి. అలాగే బాగా వృద్ధికి అవకాశం ఉన్న రంగాలను ఎంపిక చేసుకుంటే, ఎక్కువ కాంపౌండింగ్‌కు అవకాశం ఉంటుంది. పోటీతత్వం ఎంపిక చేసుకునే కంపెనీకి గట్టి పోటీనిచ్చే సామర్థ్యాలున్నాయా? సదరు కంపెనీకి వ్యాపార పరంగా బలాలు ఉండే పెట్టుబడులకు రక్షణ ఉన్నట్టుగా భావించొచ్చు. దీన్నే మోట్ అని పిలుస్తారు. దీన్ని ఎలా తెలుసుకోవచ్చు? అంటే.. కంపెనీకి వ్యాపారంలో స్థూల మార్జిన్లు గరిష్ట స్థాయిలోనే దీర్ఘకాలం పాటు కొనసాగుతుంటే, ఆ కంపెనీ ఉత్పత్తులు లేదా సేవలకు మంచి డిమాండ్ ఉన్నట్టుగా భావించొచ్చు. ఉదాహరణకు యాపిల్ స్థూల మార్జిన్లు 44 శాతానికి పైనే. ఆయా వ్యాపారంలో కొన్ని కంపెనీలే పనిచేస్తుండడం, కొత్త కంపెనీల ప్రవేశం అంత సులభం కాకపోవడం వంటివి అనుకూలతలు. దీనివల్ల ఉన్న కంపెనీలకు ప్రైసింగ్ పవర్ (ధరలను నిర్ణయించే శక్తి) ఉంటుంది. కనీసం లాభాల మార్జిన్ 10 శాతానికి పైన ఉండేలా చూసుకోవాలి. స్వల్ప మార్జిన్‌తో నడిచే కంపెనీలు ఎప్పుడైనా నష్టాల్లోకి జారిపోవచ్చు. పోటీ సంస్థల కంటే మీరు పెట్టుబడి పెట్టే కంపెనీ లాభాల మార్జిన్ ఎక్కువగా ఉండాలి. ఈ మార్జిన్‌ను ఏటేటా పెంచుకోవడం లేదంటే అదే స్థాయిలో కొనసాగించడం అవసరం. ఏటేటా క్షీణిస్తూ ఉంటే, బలం క్షీణిస్తున్నట్టుగా చూడొచ్చు. కంపెనీ నిలబడుతుందా? కంపెనీ రిస్క్‌లను కూడా చూడాలి. కంపెనీకి బలాలు ఉన్నాయని ఇన్వెస్ట్ చేసిన తర్వాత.. అవి అలాగే కొనసాగుతున్నాయా? అని కనిపెట్టుకుని ఉండాలి. టెలికం రంగంలో ఏం జరిగిందో చూశారు కదా..? జియో రావడంతో ఎయిర్టెల్, వొడాఐడియా మినహా అన్నీ మూట సర్దేసుకోవాల్సి వచ్చింది. వొడాఐడియా కూడా ఆరి్థక సంక్షోభంతో కొనసాగుతోంది. ఇలాంటి విపత్తు ఏ రంగంలో అయినా ఉండొచ్చు. ఇన్వెస్ట్ చేసే ముందే కంపెనీకి వచ్చే రిస్‌్కల గురించి కూడా అవగాహన ఉండాలి. ఎయిర్టెల్ కంపెనీకి నెట్వర్క్ విస్తరణ పరంగా కాస్త మెరుగైన సామర్థ్యాలు ఉన్నాయి. దీనికితోడు మారుతున్న మార్కెట్ పరిణామాలకు తగ్గట్టు ఎయిర్టెల్ ప్రణాళికలు రచించి, అమలు చేసుకుంటూ వెళ్లింది. అందుకే జియోకు గట్టి పోటీదారుగా నిలిచింది. ముఖ్యంగా కంపెనీకి దీర్ఘకాలిక విజన్ (భవిష్యత్ ప్రణాళిక) ఉండాలి. అలాంటి కంపెనీలు దీర్ఘకాలంలో సవాళ్లను దీటుగా ఎదుర్కొని, వాటాదారులకు విలువను సమకూర్చగలవు. బలమైన బ్యాలన్స్ షీట్ ఎంపిక చేసుకునే కంపెనీకి ఆరి్థక బలాలు తప్పకుండా ఉండాలి. కంపెనీకి దాదాపు రుణ భారం లేకుండా ఉంటే మంచిది. ఒకవేళ రుణాలు ఉన్నా కానీ, ఆ మొత్తం ఈక్విటీతో పోలిస్తే నూరు శాతం మించకుండా చూసుకోవాలి. రుణభారం ఎక్కువైతే కంపెనీ సంపాదించినదంతా వడ్డీ చెల్లింపులకే సరిపోతుంది. అప్పుడు కంపెనీ వృద్ధి ప్రణాళికల కోసం అప్పు మీద అప్పు చేసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి బ్యాలన్స్ షీటు కంపెనీలకు దూరంగా ఉండాలి. రుణరహిత కంపెనీలు, ఆదాయం ఏటా కనీసం 10–15 శాతం, నికర లాభం ఏటా 15–20 శాతం వృద్ధి చెందే కంపెనీల్లో పెట్టుబడికి రక్షణ, వృద్ధికి అవకాశం ఉంటుంది. ఓ కంపెనీ షేరు ధర దీర్ఘకాలంలో లాభాలనే అనుసరిస్తుంటుంది. డివిడెండ్ చెల్లించేవి అయితే అదనపు ప్లస్‌గా చూడొచ్చు. పరిశోధన, ఆవిష్కరణల సామర్థ్యం మారుతున్న కస్టమర్ అవసరాలకు అనుగు ణంగా ఉత్పత్తులు, సేవల్లోనూ నవ్యత అవసరం. అందుకే కంపెనీలు పరిశోధనపై పెద్ద మొత్తంలో వెచి్చస్తుంటాయి. ఓ కంపెనీ పరిశోధన, ఆవిష్కరణల సామర్థ్యాలకు నిదర్శనం, ఆ కంపెనీ ఉత్పత్తులకు పేటెంట్ హక్కులు ఉండడం. ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులు, సేవలను మార్కెట్ చేస్తుండడం. ఇలాంటి బలాలు ఉంటే, దీర్ఘకాలంలో ఆ కంపెనీ ఎంత పోటీ ఉన్నా నిలదొక్కుకుని, రాణిస్తుంది. ఇందుకు ఒక నిదర్శనం గూగుల్, యాపిల్. ఇవి పరిశోధనపై పెద్ద ఎత్తున ఖర్చు చేస్తుంటాయి. ఉత్పత్తులు, సేవలపై పేటెంట్ ఉంటే, వ్యాపారంలో అ ధిక లాభాల మార్జిన్లకూ అవకాశం ఉంటుంది. ఒకవేళ అప్పటికే ఉన్న పేటెంట్ల గడువు ముగుస్తుంటే, అది లాభాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఉద్యోగులతో సంబంధాలు కంపెనీలో పని విలువలు కూడా వాటాదారులకు విలువను తెచ్చి పెట్టే అంశాల్లో ఒకటి. మెరుగైన పని విధానం ఉన్న కంపెనీలు దీర్ఘకాలంలో వాటాదారులకు మంచి విలువను సమకూరుస్తాయని ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. కంపెనీ ఉద్యోగుల విషయంలో సముచితంగా వ్యవహరిస్తుంటే, మెరుగైన పని వాతావరణం ఉన్నప్పుడు వారు మరింత ఉత్పాదకత దిశగా పనిచేయగలరు. వాటాల విలువ పలుచన అవుతోందా? కంపెనీల మూలధనం పెరుగుతూ వెళుతోందా? ఏ రూపంలో అయినా కానీయండి, దీనివల్ల అప్పటికే కంపెనీలో ఉన్న వాటాల విలువ పలుచనవుతుంది. పెట్టుబడులకు ఎంపిక చేసుకునే కంపెనీల మూలధనం స్థిరంగా ఉండాలి. షేర్ల బైబ్యాక్ రూపంలో ఈక్విటీ తగ్గుతుంటే ఇంకా మంచిది. దీనివల్ల వాటాదారుల విలువ ఎప్పటికప్పుడు వృద్ధి చెందుతుంది. బ్యాంక్ స్టాక్స్‌కు ఈ విషయంలో మినహాయింపు ఇవ్వొచ్చు. ఎందుకంటే బ్యాంకులకు నిధులే వ్యాపార వస్తువు. కనుక అవి తాజా ఈక్విటీ జారీ ద్వారా ఎప్పటికప్పుడు నిధులు సమీకరిస్తూ, వ్యాపార విస్తరణపై వెచి్చస్తుంటాయి. ఇవి కూడా గమనించాలి.. ► టెక్నాలజీ పరంగా కంపెనీ ముందుండాలి. కాలంతో పాటు వచ్చే మార్పులను ఆహా్వనించాలి. లేదంటే అస్తిత్వ ముప్పు ఏర్పడొచ్చు. ► కొన్ని రంగాల్లో చిన్న కంపెనీల కంటే పెద్ద కంపెనీలకు ప్రాధాన్యం ఇవ్వడమే మంచిది. ఉదాహరణకు టైర్ల రంగంలో చిన్న కంపెనీని ఎంపిక చేసుకోవడం కంటే ఎంఆర్ఎఫ్ వంటి పెద్ద కంపెనీలే దీర్ఘకాలంలో రాణించేందుకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ► ఓ కంపెనీ షేరు గణనీయంగా పడిపోయిందని ఇన్వెస్ట్ చేయడం సరికాదు. ఆ షేరు ఏ కారణాల వల్ల పడిపోయిందన్నది ముందుగా తెలుసుకోవాలి. జెట్ ఎయిర్వేస్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, యస్ బ్యాంక్ ఇలాంటి కేసులను అధ్యయనం చేయాలి. పడిపోతున్న షేరును కొనుగోలు చేయడం, పడిపోతున్న కత్తిని పట్టుకోవడంగా నిపుణులు చెబుతుంటారు. ► కంపెనీ రిటర్న్ ఆన్ ఈక్విటీ (ఆర్‌వోఈ) దీర్ఘకాలంలో పెద్దగా వృద్ధి లేకుండా అక్కడక్కడే చలిస్తుంటే.. దీనికి బదులు ఏటేటా ఆర్‌వోఈ వృద్ధి చెందే కంపెనీలే మెరుగైన రాబడులను ఇవ్వగలవు. ► సిమెంట్, మెటల్స్, షుగర్, ఆటోమొబైల్ ఇవన్నీ సైక్లికల్ కంపెనీలు. కొన్నేళ్ల కాలంలోనే ఎన్నో రెట్ల రాబడులు ఇచి్చన తర్వాత, మళ్లీ ర్యాలీ చేయడానికి కొన్నేళ్ల సమయం తీసుకుంటాయి. ఇలాంటి కంపెనీల్లో అధిక వేల్యుయేషన్ల వద్ద ఇన్వెస్ట్ చేసే ముందు ఈ అంశాలను గమనించాలి. ► వాటాల పరంగా లిక్విడిటీ మెరుగ్గా ఉండాలి. అంటే ఫ్రీఫ్లోట్ మార్కెట్ క్యాప్ చెప్పుకోదగినంతగా ఉండాలి. లిక్విడిటీ తక్కువగా ఉంటే, మార్కెట్ కరెక్షన్లలో అమ్ముకోవడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కొద్దిపాటి అమ్మకాల ఒత్తిడికే షేరు ధర భారీగా పతనం చెందుతుంది. దీంతో భారీ నష్టాలు ఎదురవుతాయి. కంపెనీ షేరు ధరను కాకుండా, అంతర్గత విలువను (ఇంట్రిన్సిక్ వ్యాల్యూ) చూసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ► కార్పొరేట్ గవర్నెన్స్ మెరుగ్గా ఉండాలి. కంపెనీ వ్యవహారాలు పారదర్శకంగా ఉన్నప్పుడే, మార్కెట్ ఆ కంపెనీకి మెరుగైన విలువను కడుతుంది. ఇనిస్టిట్యూషన్స్ పెట్టుబడులతో ముందుకు వస్తాయి. కార్పొరేట్ గవర్నెన్స్ మెరుగ్గా లేని కంపెనీలకు దూరంగా ఉంటాయి. సత్యం కంప్యూటర్స్, బ్రైట్‌కామ్ గ్రూప్, ఈకేఐ ఎనర్జీ వంటి కంపెనీల కేసులను ఇందుకు అధ్యయనం చేయొచ్చు. ► ప్రమోటర్ల వాటా కంపెనీలో ఎంత ఉందన్నది కూడా చూడాలి. కనీసం 20 శాతంపైన ఉంటే మంచిది. పైగా ప్రమోటర్లు తమకున్న వాటాలను తనఖా పెట్టారా? తనఖా పెట్టిన మొత్తం వారి వాటాల్లో 50 శాతం మించితే అటువంటి వాటికి దూరంగా ఉండాలి. స్కటిల్బట్ మెథడ్ ప్రకారం.. ఓ కంపెనీలో పెట్టుబడులకు ఆసక్తిగా ఉంటే, ముందు ఆయా కంపెనీల ఉత్పత్తులు, సేవలను వినియోగించుకునే వారిని కలసి మాట్లాడాలి. అలాగే, ఆ కంపెనీ పోటీదారులు, ఉద్యోగులతో మాట్లాడిన తర్వా త ఓ నిర్ణయానికి రావాలి. – ఫిలిప్ ఎ. ఫిషర్ -
అదానీ పవర్లో 8.1% వాటా విక్రయం
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం జీక్యూజీ పార్ట్నర్స్, ఇతర ఇన్వెస్టర్లు తాజాగా అదానీ పవర్లో 8.1 శాతం వాటాలు కొనుగోలు చేశాయి. ఇందుకోసం 1.1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 9,000 కోట్లు) వెచ్చించాయి. సెకండరీ మార్కెట్లో అత్యంత భారీ ఈక్విటీ డీల్స్‌లో ఇది కూడా ఒకటని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. స్టాక్ మార్కెట్ డేటా ప్రకారం.. 31.2 కోట్ల షేర్లను ప్రమోటర్ అదానీ కుటుంబం విక్రయించగా, సగటున షేరుకు రూ. 279.17 రేటుతో జీక్యూజీ పార్టనర్స్, ఇతర ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారు. జీక్యూజీ ఇప్పటికే అదానీ గ్రూప్‌నకు చెందిన పలు సంస్థల్లో ఇన్వెస్ట్ చేసిన నేపథ్యంలో.. ఒక ఇన్వెస్టరు, ప్రమోటరు గ్రూప్ మధ్య ఈ తరహా లావాదేవీ జరగడం భారత్‌లో ఇదే తొలిసారని సంబంధిత వర్గాలు వివరించాయి.. అదానీ గ్రూప్ వ్యాపార ప్రమాణాలను, బలాన్ని ఇది సూచిస్తోందని తెలిపాయి. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ దెబ్బతో అదానీ గ్రూప్ అతలాకుతలం అయిన పరిస్థితుల్లో, ఈ ఏడాది మార్చి నుంచి ఆ గ్రూప్ సంస్థల్లో జీక్యూజీ క్రమంగా ఇన్వెస్ట్ చేస్తూ వస్తోంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 5.4 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీలో 6.54%, అదానీ ట్రాన్స్‌మిషన్‌లో 2.5 శాతం వాటాలు కొనుగోలు చేసింది. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీలోనూ.. మరో స్టాక్ మార్కెట్ డీల్‌లో జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీలో జేఎస్‌డబ్ల్యూ ఇన్వెస్ట్మెంట్స్ 1.27 శాతం వాటాలను రూ. 717.57 కోట్లకు విక్రయించింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా జీక్యూజీ పార్ట్నర్స్, వాషింగ్టన్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ తదితర సంస్థలు కొనుగోలు చేశాయి. జేఎస్‌డబ్ల్యూ ఇన్వెస్ట్మెంట్స్.. షేరు ఒక్కింటికి రూ. 341.7 రేటు చొప్పున 2.10 కోట్ల షేర్లను విక్రయించింది. డీల్ అనంతరం జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీలో జేఎస్‌డబ్ల్యూ ఇన్వెస్ట్మెంట్స్ వాటా 20.22 శాతం నుంచి 18.95 శాతానికి తగ్గింది. ఇటీవలే జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీలో జీక్యూజీ పార్ట్నర్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఈక్విటీ ఫండ్ రూ. 411 కోట్లతో 1.19 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. -
తక్కువ రిస్క్.. మంచి రాబడి - ఉందిగా సరైన మార్గం!
మార్కెట్ అస్థిరతల్లో పెట్టుబడులకు తక్కువ రిస్క్‌ను ఆశించే వారు, దీర్ఘకాలంలో సంప్రదాయ ఎఫ్డీలు, పోస్టాఫీసు పథకాల కంటే కాస్తంత అధికరాబడులు కోరుకునే వారు హైబ్రిడ్ ఈక్విటీ పథకాలను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న పథకాల్లో ఎస్బీఐ హైబ్రిడ్ ఈక్విటీ కూడా ఒకటి. ఈ పథకం ఈక్విటీ, డెట్ రెండింటిలోనూ ఇన్వెస్ట్ చేస్తుంది. రాబడి మాత్రం అచ్చమైన డెట్ సాధనాలకు మించి ఉంటుంది. అదే సమయంలో అచ్చమైన ఈక్విటీ పథకం కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ పథకం కనీసం 65 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. మిగిలిన మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీల్లో పెడుతుంది. బుల్ మార్కెట్లో, బేర్ మార్కెట్లోనూ పనితీరు పరంగా ఈ పథకానికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. రాబడులు ఈ పథకం రాబడులు గడచిన ఏడాది కాలంలో 14.52 శాతంగా ఉన్నాయి. మూడేళ్ల కాలంలో చూసుకుంటే సగటున ఏటా 17.74 శాతం చొప్పున ఇన్వెస్టర్లకు ప్రతిఫలాన్ని తెచ్చిపెట్టింది. ఐదేళ్ల కాలంలో వార్షికంగా 11.70 శాతం, ఏడేళ్లలోనూ ఏటా 11.55 శాతం, పదేళ్లలో 14.37 శాతం చొప్పున రాబడుల చరిత్ర ఉంది. 1995 డిసెంబర్ 31న ఈ పథకం ప్రారంభం కాగా, అప్పటి నుంచి చూసుకుంటే వార్షిక రాబడులు 15.43 శాతంగా ఉన్నాయి. డెట్‌తో కూడిన పెట్టుబడులు కనుక దీర్ఘకాలంలో వార్షిక రాబడి 11–12 శాతం చొప్పున ఉంటే మెరుగైనదిగా పరిగణించొచ్చు. అచ్చమైన ఈక్విటీ కాకుండా, ఈక్విటీ–డెట్ కలయికతో కూడిన సాధనాల్లో దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేద్దామని అనుకునే వారు ఈ విభాగాన్ని పరిశీలించొచ్చు. ఇంతకంటే అధిక రాబడి కోరుకునే వారికి అచ్చమైన ఈక్విటీ పథకాలే సూచనీయం. (ఇదీ చదవండి: గతంలో టెస్లాను భారత్ తిరస్కరించింది అందుకేనా?) పెట్టుబడుల విధానం ఈ పథకం పెట్టుబడుల కేటాయింపు సమయోచితంగా ఉంటుంది. ఆటుపోట్ల సమయాల్లో ఈక్విటీ ఎక్స్పోజర్ను తగ్గించుకుని నగదు నిల్వలు పెంచుకుంటుంది. 2011 మార్కెట్ కరెక్షన్లో, 2015, 2020 ఒడిదుడుకుల సమయాల్లో ఈక్విటీలకు ఎక్స్పోజర్ తగ్గించుకోవడం వల్ల ఈ పథకంలో నష్టాలు పరిమితం అయ్యాయి. 2014 బాండ్ మార్కెట్ ర్యాలీ ప్రయోజనాలను సైతం పొందింది. ఈ విధమైన వ్యూహాలతో నష్టాలను పరిమితం చేసి, మెరుగైన రాబడులు తీసుకొచ్చేలా పథకం పరిశోధనా బృందం పనిచేస్తుంటుంది. ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతానికి రూ.58వేల కోట్లకు పైనే పెట్టుబడులు ఉన్నాయి. వీటిల్లో 75.80 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించింది. డెట్ పెట్టుబడులు 18.72 శాతంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ సాధనాలకు కూడా ఒక శాతం లోపు కేటాయించగా, 4.61 శాతాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. ఈక్విటీల్లోనూ 78 శాతం పెట్టుబడులు లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్ కంపెనీలకు 21 శాతం కేటాయింపులు చేసింది. స్మాల్‌క్యాప్ కంపెనీల్లో కేవలం 0.73 శాతమే ఇన్వెస్ట్ చేసింది. దీంతో ఈక్విటీల్లోనూ రిస్క్‌ను తగ్గించే విధంగా కేటాయింపులు ఉన్నాయి. 18.72 శాతం డెట్ కేటాయింపుల్లోనూ అధిక క్రెడిట్ రేటింగ్ కలిగిన సాధనాల్లోనే 14 శాతానికి పైన పెట్టుబడులు ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 36 స్టాక్స్ ఉన్నాయి. ఈక్విటీల్లో అత్యధికంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 28 శాతం కేటాయింపులు చేయగా, సేవల రంగ కంపెనీలకు 7 శాతానికి పైన కేటాయించింది. హెల్త్‌కేర్‌లో 6 శాతం, ఆటోమొబైల్ కంపెనీల్లో 6 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. -
ఈక్విటీ పథకాల్లో పెట్టుబడుల జోరు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మరోసారి ఇన్వెస్టర్ల నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఆకర్షించాయి. జూన్ నెలలో నికరంగా రూ.8,637 కోట్ల పెట్టుబడులు ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. వివిధ ఏఎంసీలు కొత్త పథకాల ద్వారా (ఎన్‌ఎఫ్‌వోలు) పెట్టుబడులు సమీకరించడం, సిప్ పెట్టుబడులు బలంగా కొనసాగడం, స్మాల్‌క్యాప్ పథకాలకు చక్కని ఆదరణ లభించడం ఇందుకు దారితీసింది. జూన్ నెలకు సంబంధించిన గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ప్రకటించింది. ఈక్విటీ పథకాల్లోకి జూన్ నెలలో వచ్చిన పెట్టుబడులు మూడు నెలల గరిష్ట స్థాయి కావడం గమనార్హం. మే నెలలో రూ.3,240 కోట్లను ఈక్విటీ పథకాలు ఆకర్షించగా, ఏప్రిల్‌లో వచ్చిన పెట్టుబడులు రూ.6,480 కోట్లుగా ఉన్నాయి. ఇక ఈ ఏడాది మార్చి నెలలో ఈక్విటీ పథకాలు భారీగా రూ.20,534 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ‘‘ఈక్విటీ పథకాల్లోకి మెరుగైన పెట్టుబడులు రావడం అన్నది ప్రధానంగా ఆరు కొత్త పథకాలు రూ.3,038 కోట్లు సమీకరించడం వల్లేనని చెప్పుకోవాలి’’అని మార్నింగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ మెల్విన్ శాంటారియా పేర్కొన్నారు. జూన్ నెలలో 11 ఎన్‌ఎఫ్‌వోలు (ఓపెన్ ఎండెడ్) ప్రారంభం కాగా, ఇవి సమీకరించిన పెట్టుబడులు రూ.3,228 కోట్లుగా ఉన్నాయి. మే నెలతో పోలిస్తే జూన్ పెట్టుబడులు మెరుగ్గా ఉన్నట్టు కోటక్ మహీంద్రా అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ సేల్స్ హెడ్ మనీష్ మెహతా చెప్పారు. గరిష్ట స్థాయిలో అస్సెట్ అలోకేషన్ కారణంగా కొంత లాభాల స్వీకరణకు అవకాశం లేకపోలేదన్నారు. అయితే ఇన్వెస్టర్లు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్), సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎస్టీపీ) ద్వారా పెట్టుబడులు కొనసాగించుకోవాలని సూచించారు. నికరంగా చూస్తే ఉపసంహరణే జూన్ నెలలో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ మొత్తం మీద నికరంగా రూ.2,022 కోట్ల పెట్టుబడులను కోల్పోయింది. ప్రధానంగా డెట్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు రూ.14,135 కోట్లను నికరంగా వెనక్కి తీసుకున్నారు. దీనివల్లే మొత్తం మీద పెట్టుబడుల క్షీణత చోటు చేసుకుంది. అంతకుముందు మే నెలలో డెట్ విభాగంలోకి రూ.45,959 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. విభాగాల వారీగా.. ►స్మాల్‌క్యాప్ పథకాల్లోకి రికార్డు స్థాయిలో రూ.5,472 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ►సిప్ రూపంలో ఇన్వెస్టర్లు జూన్‌లో రూ.14,734 కోట్లు పెట్టుబడులు పెట్టారు. మే నెలలో సిప్ పెట్టుబడులు రూ.14,749 కోట్లుగా ఉన్నాయి. ►లార్జ్‌క్యాప్ పథకాల నుంచి రూ.2,049 కోట్లు, ఫోకస్డ్ ఫండ్స్ నుంచి రూ.1,018 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. ►వ్యాల్యూ ఫండ్స్ రూ.2,239 కోట్లు, మిడ్‌క్యాప్ పథకాలు రూ.1,748 కోట్లు, లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ.1,147 కోట్ల చొప్పున ఆకర్షించాయి. ►ఈటీఎఫ్ ల్లోకి రూ.3,402 కోట్లు వచ్చాయి. ►అన్ని ఏఎంసీల నిర్వహణలోని మొత్తం నిర్వహణ ఆస్తుల (ఏయూఎం) విలువ మే చివరికి ఉన్న రూ.42.9 లక్షల కోట్ల నుంచి, జూన్ చివరికి రూ.44.8 లక్షల కోట్లకు పెరిగింది. ►డెట్ విభాగంలో హైబ్రిడ్ ఫండ్స్‌లోకి రూ.4,611 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ►లిక్విడ్ ఫండ్స్ రూ.28,545 కోట్లు కోల్పోయాయి. -
వృద్ధాప్యంలో ఆదాయానికి ప్రణాళిక..
ప్రభుత్వరంగ ఉద్యోగులను మినహాయిస్తే మిగిలిన వారికి పదవీ విరమణ ప్రణాళిక తప్పనిసరి. ఉద్యోగం లేదా వృత్తి జీవితం ప్రారంభించినప్పుడే, దాన్ని విరమించే రోజు కోసం ప్రణాళిక రూపొందించుకోవాలి. విశ్రాంత జీవనాన్ని హాయిగా గడిపేందుకు తగినంత నిధిని సమకూర్చుకోవడమే కాదు, ఆ నిధిపై రాబడికీ అనుకూలమైన వ్యూహం ఉండాలి. మనలో చాలా మంది రిటైర్మెంట్ లక్ష్యానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. కానీ, ఆలస్యంగా దీని అవసరం తెలిసి వస్తుంది. అప్పుడు మేల్కొన్నా, సంపాదనకు ఎక్కువ కాలం మిగిలి ఉండకపోవచ్చు. కనుక ఆరంభంలోనే దృష్టి పెట్టాల్సిన దీన్ని.. అవగాహన లేమి, నిర్లక్ష్యంతో వాయిదా వేసుకోవద్దు. తగిన ప్రణాళికతోనే రిటైర్మెంట్ లక్ష్యాన్ని అధిగమించగలమని ఆర్థిక నిపుణులు తెలియజేస్తున్నారు. ఈక్విటీ పెట్టుబడులూ అవసరమే రిటైర్మెంట్ తర్వాత కూడా ఈక్విటీల్లో పెట్టుబడులు కలిగి ఉండాలి. ఎందుకంటే నేటి కంటే, రేపటి రోజు మరింత మొత్తం జీవనానికి ఖర్చు అవుతుంది. కనుక మన నిధి మరింత ఆదాయన్నిచ్చే విధంగా వృద్ధి చెందుతూ ఉండాలి. మీ వద్దనున్న నిధి నుంచి ఏటా 5% చొప్పున వెనక్కి తీసుకుంటున్నారనుకోండి. వచ్చే ఏడాది కూడా అదే 5% సరిపోవచ్చు. కానీ ఐదు, పదేళ్ల తర్వాత అంతే మొత్తం సరిపోకపోవచ్చు. ఎందుకంటే పదేళ్ల కాలంలో పెట్టుబడి దాని విలువను కోల్పోతుంది. కనుక ఇక్కడ నుంచి మరో ఐదు పదేళ్ల తర్వాత అవసరాలకు మరింత మొత్తం కావాలి. మీరు మీ ఫండ్ మొత్తాన్ని స్థిరాదాయ సాధనంలో ఇన్వెస్ట్ చేశారనుకోండి.. అది పెరిగే అవసరాలకు, కరిగిపోయే కరెన్సీ విలువకు తగినంత మద్దతుగా నిలవదు. ఎక్కువ మంది రిటైర్మెంట్ తర్వాత రిస్క్ వద్దని అనుకుంటుంటారు. కానీ, భవిష్యత్తులో వచ్చే భారీ ఖర్చులను భరించేంత ఆదాయానికి తగ్గ ప్రణాళిక ఉండాలి. కనుక మెరుగైన రాబడుల కోసం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం మినహా మరో మార్గం లేదు. రిటైర్మెంట్ తర్వాత ఈక్విటీ రిస్క్ తీసుకోవడం ఎందుకని కొందరు అనుకోవచ్చు. అస్థిరతలు/ఆటుపోట్లు అన్నవి రిస్క్ కాదు. ఈక్వి టీల్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు అది రిస్క్ అనుకుంటే.. మరి ఎలక్ట్రిసిటీ గురించి ఏమ ని అనుకోవాలి. ప్రమాదకరమైన విద్యుత్‌ను వాడుకుంటూ మనం జీవించడం లేదా..? అలాగే, ఈక్విటీలను మనకు అనుకూలంగా వినియోగించుకోవాలి. ఈక్విటీ పోర్ట్‌ఫోలియో ఏర్పాటులో జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలు. ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా, నిర్ణీతకాలం లోపు ఆ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాలి. పెట్టుబడులను వైవి ధ్యం చేసుకోవాలి. నిర్ణీత కాలానికి ఒకసారి చొప్పున రీబ్యాలన్స్ (మార్పులు చేర్పులు) చేసుకుంటూ వెళ్లాలి. ఎంత నిధి కావాలి? రిటైర్మెంట్కు కావాల్సినంత నిధి నా దగ్గర ఉందా..? ఎవరికివారు ఈ ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే అందరికీ ఒక్కటే నిధి ఇక్కడ పనిచేయకపోవచ్చు. మీ అవసరాలు, వ్యయాలపైనే ఇది ఆధారపడి ఉంటుంది. రిటైర్మెంట్ ఫండ్ కోసం మెరుగైన పెట్టుబడుల ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఇందుకు వాస్తవిక అంచనాలు వేసుకోవాలి. మీ నెలవారీ వ్యయాలు ఎంత? 12 నెలలకు ఎంత మొత్తం కావాలో లెక్కించాలి. అంత మేర ఏటా ఆదాయం తెచ్చి పెట్టేంత నిధి మీకు రిటైర్మెంట్ తర్వాత అవసరం అవుతుంది. ఇతరత్రా వేరే ఆదాయ వనరులు ఉంటే వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. రిటైర్మెంట్ కోసం సన్నద్ధం అయ్యేందుకు ఏఏ అంశాలపై దృష్టి పెట్టాలో తెలుసుకోవడం కీలకం అవుతుంది. తాము ఎంత కాలం పాటు జీవిస్తామనే విషయం ఎవరికీ తెలియదు. కనుక చిరాయువుగా జీవించేందుకు సన్నద్ధం కావాలి. ముఖ్యంగా రాబడులకు మించి జీవించకూడదు. అందుకే ప్రణాళిక అవసరం. మీ అవసరాలకు మించి పెట్టుబడి నిధి కరిగిపోకుండా ఇది మార్గం చూపుతుంది. ప్రస్తుత విలువల ప్రకారం వార్షిక ఖర్చులకు 20 నుంచి 25 రెట్ల సరిపడా నిధిని సమకూర్చుకుంటే అది మీ అవసరాలను తీరుస్తుంది. ఇది అంత సౌకర్యవంతమైన నిధి కాకపోయినా, మీ అవసరాలను తీరుస్తుంది. మీ అవసరాలకు సరిపడా ఆదాయాన్ని ఇవ్వడంతోపాటు, భవిష్యత్తులో పెరిగే ఖర్చులకు తగ్గట్టు ఆదాయాన్ని వృద్ధి చేసే ప్రణాళిక వేరు. మీ ఆదాయం, వెసులుబాటు ఆధారంగా చాలా శ్రద్ధగా ప్రణాళిక వేసుకోవాలి. మధ్యలో అత్యవసరం ఏర్పడినా గట్టెక్కే నిధి వేరుగా ఉండాలి. అస్సెట్ అలోకేషన్ అస్సెట్ అలోకేషన్ అనేది మీ సౌకర్యం కోసం అనుసరించే విధానం. మార్కెట్లు పడిపోయినప్పుడు దీనివల్ల సౌకర్యంగా ఉండొచ్చు. స్వభావ రీత్యా ఈక్విటీల పట్ల రక్షణాత్మకంగా లేదా దూకుడుగా ఉన్నా కానీ.. ఆరంభంలో రక్షణాత్మకంగానే కేటాయింపులు చేసుకోవాలి. ఎంత ధైర్యవంతులైనా సరే మార్కెట్లు పడిపోయినప్పుడు ఆందోళన చెందడం సహజం. కనుక మొదటిసారి ఇన్వెస్టర్ అయినా, రక్షణ ధోరణితో కూడిన ఇన్వెస్టర్ అయినా ఈక్విటీలకు కేటాయింపులు 25 శాతం లేదా 33 శాతంగానే ఉండాలి. దీన్ని పేపర్‌పై రాసుకోవాలి. మొదటి కొన్నేళ్లపాటు ఇదే విధానాన్ని అనుసరించాలి. ఏడాదికోసారి ఈ కేటాయింపులను సమీక్షించుకోవాలి. దీన్నే అస్సెట్ అలోకేషన్ అంటారు. ఉదాహరణకు ఈక్విటీలకు 33 శాతం కేటాయింపులు చేయాలన్నది మీ ప్రణాళిక. ఏడాది కాలంలో మార్కెట్ ర్యాలీతో మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీల వాటా 50 శాతానికి చేరిందని అనుకుందాం. అప్పుడు 33 శాతానికి దిగొచ్చే విధంగా ఈక్విటీ పెట్టుబడులను విక్రయించాలి. మిగిలిన మొత్తాన్ని డెట్‌కు మళ్లించుకోవాలి. ఇలా కొంత కాలం చేసిన తర్వాత ఈక్విటీల పట్ల అవగాహన, నమ్మకం పెరుగుతుంది. అప్పుడు అవసరానికి అనుగుణంగా అస్సెట్ అలోకేషన్‌ను సవరించుకోవచ్చు. రిటైర్మెంట్ ఫండ్‌పై 3.5–4 శాతం రాబడి వచ్చినా సరిపోతుందని అనుకుంటే అప్పుడు మీ దగ్గర మెరుగైన ఫండ్ ఉన్నట్టుగా భావించాలి. ఇలాంటి వెసులుబాటు ఉన్న వారు రిటైర్మెంట్ ఫండ్‌ను ఈక్విటీ, డెట్‌కు సమానంగా కేటాయించుకోవచ్చు. లేదా ఈక్విటీకి 40 శాతం, డెట్‌కు 60 శాతం కేటాయించుకోవచ్చు. 5–20 శాతాన్ని షార్ట్ టర్మ్ డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. పీపీఎఫ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్నకు కేటాయింపులు చేసుకోవాలి. ఇక తమపై ఆధారపడిన వారు లేకపోతే.. అప్పుడు 25 లేదా 33 శాతాన్ని డెట్‌కు కేటాయించి, మిగిలిన మొత్తాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీన్ని ర్యీబ్యాలన్స్ చేసుకుంటూ ఉండాలి. కార్యాచరణ ప్రణాళిక.. రిటైర్మెంట్ నాటికి రుణ భారం నుంచి పూర్తిగా బయటకు రావాలి. అన్ని పెట్టుబడులకూ ఒక్కటే బ్యాంక్ ఖాతా వినియోగించాలి. పెట్టుబడుల కేటాయింపులు (అస్సెట్ అలోకేషన్) ఏ విభాగానికి ఎంత మేర ఉండాలో నిర్ణయించుకోవాలి. ఈక్విటీలకు 50 శాతమా లేక 40 లేదా 25 శాతమా.. అలాగే డెట్‌కు ఎంతన్నది తేల్చుకోవాలి. వీటి నుంచి అవసరాలకు సరిపడా ప్రతి నెలా రాబడి వచ్చేలా చూసుకోవాలి. ఇతర వనరుల ద్వారా ఆదాయం వస్తుందేమో చూసుకోవాలి. పింఛను సదుపాయం ఉందా? ఉంటే వచ్చే మొత్తం సరిపోతుందా? అద్దె రూపంలో ఆదాయం వచ్చే మార్గం ఉందా? డివిడెండ్ల రూపంలో ఆదాయం వస్తుందా? విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి రెమిటెన్స్ వస్తుందా? ఇలా అన్ని రూపాల్లోని ఆదాయ వనరులను లెక్కించుకోవాలి. అప్పుడు మీ నెలవారీ ఖర్చులకు సరిపడా ఆదాయం వస్తే నిశ్చింతగా ఉండొచ్చు. తరుగు ఉంటే ఆ మేరకు పెట్టుబడుల నుంచి ఆదాయం వచ్చే ఏర్పాటు చేసుకోవాలి. మీ ఖర్చులకు మించి ఆదాయం వస్తుంటే సంతోషంగా విశ్రాంతి జీవనాన్ని గడిపేయొచ్చు. మిగులు ఉంటే ఆ మొత్తాన్ని తిరిగి ఇన్వెస్ట్ చేసుకోవడమే సరైనది. మీ పెట్టుబడి నుంచి తీసుకునే మొత్తం రాబడి కంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే, మీ పెట్టుబడి నుంచి తీసుకునే మొత్తం రాబడికి సమాన స్థాయిలోనూ ఉండకూడదు. ఎందుకంటే ఏటా ద్రవ్యోల్బణ ప్రభావంతో 5–6 శాతం మేర పెట్టుబడి విలువ క్షీణిస్తుంది. కనుక పెట్టుబడి నుంచి తీసుకునే మొత్తం రాబడి కంటే తక్కువే ఉండాలి. అప్పుడే మీ పెట్టుబడి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వృద్ధి చెందుతుంది. ఒకవేళ మీ పెట్టుబడిపై వచ్చే ఆదాయానికి సమాన స్థాయిలో ప్రతి నెలా ఉపసంహరించుకుంటున్నారని అనుకుందాం. అలాంటి సందర్భాల్లో భవిష్యత్తులో పెరిగే ఖర్చులకు సరిపడా ఆదాయం పెంచుకునేందుకు కొంత మొత్తాన్ని ప్రతి నెలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాలి. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, పీపీఎఫ్‌లో పెట్టుబడులు కొనసాగించండి. ఎందుకంటే ఇవి సురక్షితమైన, మెరుగైన రాబడులు కలిగిన డెట్ సాధనాలు. ఏటా ఏప్రిల్‌లో సమీక్ష నిర్వహించుకోవాలి. క్రితం ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీలపై రాబడులు ఏ మేరకు ఉన్నాయి? డెట్‌లో ఏ మేరకు రాబడి వచ్చింది? అన్ని పరిశీలించుకోవాలి. ఉదాహరణకు 2013లో రూ.50 లక్షలను ఈక్విటీ, డెట్‌లో సమానంగా ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. ఏటా మీ అవసరాలకు 6 శాతం ఉపసంహరించుకోవాలన్నది ప్రణాళిక. అప్పుడు ఒక ఏడాదికి రూ.3 లక్షలు అవసరం అవుతుంది. అదే 2014లో రూ.3,18,000 అవసరం అవుతుంది. ఇలా ఏటా ఉపసంహరించుకోవాల్సిన మొత్తం పెరుగుతూ వెళుతుంది. ఈ ప్రకారం 2023లో రూ.4,32,000 అవసరం అవుతుంది. 6 శాతం ఉపసంహరించుకోవాలన్నది ప్రణాళిక. కనుక ఇప్పుడు మీ వద్ద రూ.72,00,000 పెట్టుబడి ఉండాలి. అప్పుడే 6 శాతం చొప్పున రూ.4,32,000 తీసుకోగలరు. అందుకే మీ పెట్టుబడి నిధి కూడా వృద్ధి చెందాలి. -
2047 నాటికి ‘ఎగువ మధ్య తరగతి’ కేటగిరీలోకి భారత్!
న్యూఢిల్లీ: కొనుగోలు శక్తి సమానత్వం (పీపీపీ) నిబంధనల ప్రకారం, 2047 నాటికి భారతదేశం ‘ఎగువ మధ్య తరగతి’ కేటగిరీలోకి ప్రవేశించే అవకాశం ఉందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) చైర్మన్ వివేక్ దేవ్రాయ్ పేర్కొన్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే అధిక ఆదాయ కేటగిరీలో ఉన్నాయని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. భారత ఆర్థిక వృద్ధి రేటు పురోగతి కేవలం ఎగుమతులమీదే ఆధారపడి ఉందన్న అభిప్రాయం తప్పని ఆయన పేర్కొంటూ, దీనితోపాటు దేశాభివృద్ధికి బహుళ అవకాశాలు ఉ న్నాయని అన్నారు. ప్రపంచ బ్యాంక్ నిర్వచనం ప్ర కారం, తలసరి వార్షిక ఆదాయం 12,000 డాల ర్ల కంటే ఎక్కువ ఉన్న దేశాన్ని అధిక–ఆదాయ దేశంగా పరిగణిస్తారు. ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశాన్ని ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశంగా పరిగణిస్తున్నారు. 2047 నా టికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మా ర్చాలని ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా నిర్దేశించా రు. అభివృద్ధి చెందిన దేశం మానవ అభివృద్ధి సూ చిక (హెచ్‌డీఐ)లో దాదాపు తొలి స్థానాల్లో ఉంటుంది. సాధారణంగా అధిక స్థాయి ఆర్థిక వృద్ధి, సా« దార ణ జీవన ప్రమాణం, అధిక తలసరి ఆదా యంతో పా టు విద్య, అక్షరాస్యత, ఆరోగ్యాల విష యాల్లో మంచి ప్ర మాణాలను అభివృద్ధి చెందిన దేశం కలిగి ఉంటుంది. -
రుణ భారం, ఆదాయం రెండూ అప్
ముంబై: నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అనుగుణమైన ఈక్విటీ కమిట్మెంట్స్, పెరుగుతున్న వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు రహదారుల అభివృద్ధి కంపెనీల రుణ భారాన్ని పెంచనున్నట్లు రేటింగ్ దిగ్గజం క్రిసిల్ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. అయితే ఇదే సమయంలో ఆయా కంపెనీల ఆదాయం సైతం పురోభివృద్ధి చెందనున్నట్లు తెలియజేసింది. ఇందుకు భారీ కాంట్రాక్టులు, పటిష్ట ఎగ్జిక్యూషన్ దోహదపడనున్నట్లు వచ్చే ఏడాది అంచనాలపై నివేదిక వివరించింది. తక్కువ రుణ భారమున్న కంపెనీలు కొత్త ప్రాజెక్టులకు అవసరమైన నిధుల సమీకరణ చేపట్టేందుకు వీలుంటుందని తెలియజేసింది. ఇది ఆయా కంపెనీల క్రెడిట్ రిస్క్ ప్రొఫైల్ స్థిరత్వానికి సహకరిస్తుందని పేర్కొంది. రుణ భారానికి చెక్ పెట్టేందుకు ఆస్తుల మానిటైజేషన్ కీలకంగా నిలవనున్నట్లు అభిప్రాయపడింది. 18 సంస్థలపై.. ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్(ఈపీసీ) కాంట్రాక్టులు చేపట్టే 18 కంపెనీలను నివేదికలో పరిగణనలోకి తీసుకున్నట్లు క్రిసిల్ వెల్లడించింది. ఈ రంగం మొత్తం ఆదాయంలో వీటి వాటా 70 శాతంకాగా.. ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యం(పీపీపీ)లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 2025కల్లా మొత్తం రూ. 21,000 కోట్ల ఈక్విటీ కమిట్మెంట్ ఉన్నట్లు క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ మోహిత్ మఖిజా తెలియజేశారు. రానున్న రెండేళ్లలో ఆదాయం 10–15 శాతం స్థాయిలో వృద్ధి చెందే వీలుండగా.. వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు సైతం పెరగనున్నట్లు నివేదిక అంచనా వేసింది. వీటికి 45 శాతం నిధులు ఆర్జన ద్వారా లభించనున్నప్పటికీ ఆస్తుల మానిటైజేషన్, రుణాల ద్వారా మిగిలిన పెట్టుబడులను సమకూర్చుకోవలసి ఉంటుందని విశ్లేషించింది. 2022కల్లా నమోదైన రూ. 17,000 కోట్ల నుంచి 2025 మార్చికల్లా రుణ భారం రూ. 30,000 కోట్లకు చేరనున్నట్లు అభిప్రాయపడింది. హెచ్ఏఎంలో.. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్(హెచ్ఏఎం) మార్గంలో ప్రకటించిన ప్రాజెక్టులలో అత్యధిక శాతం జాతీయ రహదారి అభివృద్ధి(ఎన్హెచ్ఏ) సంస్థ జారీ చేసినవే. వీటికి సంబంధించి 12–15% ప్రాజెక్ట్ వ్యయాలకు నిధులను ఈక్వి టీ రూపేణా సమకూర్చవలసి ఉంటుంది. వీటికి వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు జత కలుస్తాయి. మధ్యకాలానికి ఇవి ఆదాయాలతోపాటు పెరిగే అవకాశముంది. ఈ రంగంలోని కంపెనీల ఆర్డర్ బుక్ మూడు రెట్లు జంప్‌చేయడం ద్వారా ఇది ప్రతిఫలిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. మరోవైపు రెండు, మూడేళ్లుగా భారీ స్థాయిలో జారీ చేసిన కాంట్రాక్టుల లాభదాయకతపై ప్రతికూల ప్రభా వం పడే అవకాశముంది. గతంలో నమోదైన 14–15% నుంచి లాభదాయకత వచ్చే రెండేళ్ల లో 12–13 శాతానికి పరిమితం కావచ్చు. వెరసి లాభాల మార్జిన్లు 1.5% మేర నీరసించవచ్చు. ఇందుకు ముడివ్యయాలు కారణంకానున్నాయి. అంతర్గత వనరులకుతోడు రోడ్ కాంట్రాక్టర్లు నిధుల సమీకరణకు ఆస్తుల మానిటైజేషన్, ఈక్విటీ జారీ, రుణాలు తదితరాలపై ఆధారపడవలసి ఉంటుందని క్రిసి ల్ డైరెక్టర్ ఆనంద్ కులకర్ణి తెలియజేశారు. అయితే తక్కువ రుణ భారమున్న కంపెనీలకు క్రెడిట్ రిస్క్ ప్రొఫైల్‌పై ప్రభావం పడకుండానే పెట్టుబడుల సమీకరణకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు. -
వైవిధ్యమే పెట్టుబడులకు రక్ష
రిటైల్ ఇన్వెస్టర్లలో చాలా మందికి పరుగెత్తే కుందేలు అంటేనే ఇష్టం. తాబేలు వైపు చూసేది చాలా కొద్ది మందే. కానీ, అడవి అన్న తర్వాత అన్ని జంతువులకూ నీడనిచ్చిన మాదిరే.. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్లోనూ ఒకటికి మించిన సాధనాలకు చోటు కల్పించాలి. ఇక్కడ కుందేలు అంటే ఈక్విటీ మార్కెట్. తాబేలు అంటే డెట్, గోల్డ్ అని చెప్పుకోవచ్చు. దీర్ఘకాలంలో ఈక్విటీలలో వచ్చినంత రాబడి మరే సాధనంలోనూ ఉంటుందని చెప్పలేం. కానీ, అన్ని కాలాలకూ, పెట్టుబడులు అన్నింటికీ ఈక్విటీ ఒక్కటే వేదిక కాకూడదు. ఏదైనా సంక్షోభం ఎదురైతే.. వేరే సాధనంలోని పెట్టుబడులు కొంత రక్షణనిస్తాయి. ఇన్వెస్టర్లు తమ రిస్క్ సామర్థ్యం ఆధారంగా ఈక్విటీతోపాటు ఇతర సాధనాల మధ్య కూడా కొంత పెట్టుబడులను వైవిధ్యంగా చేసుకోవాలి. అప్పుడే పెట్టుబడుల ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఈ వివరాలన్నీ తెలియజేసే కథనమిది... ఈక్విటీ, డెట్ మార్కెట్లలో గతేడాది నుంచి అస్థిరతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఏడాది దాటిపోయింది. అన్ని దేశాలూ ద్రవ్యోల్బణ రిస్క్‌ను ఎదుర్కొంటున్నాయి. కంపెనీల మార్జిన్లపై దీని ప్రభావం గణనీయంగానే ఉంది. ద్రవ్యోల్బణాన్ని కిందకు దించేందుకు సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపు ఆయుధాన్ని నమ్ముకున్నాయి. మన దగ్గరా గతేడాది మే నుంచి రెపో రేటు 2.5 శాతం పెరిగింది. అమెరికా, యూరప్ మాంద్యం ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఐటీ రంగంలో ఉద్యోగాలకు కోతలు పడుతున్నాయి. ఒకవైపు ఈక్విటీ, డెట్ మార్కెట్లు ఆటుపోట్లు చూస్తుంటే.. మరోవైపు బంగారం, వెండి గడిచిన ఏడాది కాలంలో మంచి ర్యాలీని చూశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లకు మెరుగైన పెట్టుబడుల విధానమే అస్సెట్ అలోకేషన్. అంటే ఒకే విభాగం కాకుండా, ఒకటికి మించిన సాధనాల మధ్య పెట్టుబడులను వర్గీకరించుకోవడం. ఒక్కో విభాగం ఒక్కో రీతిలో పనితీరు చూపిస్తుంటుంది. కనుక అస్సెట్ అలోకేషన్‌తో దీర్ఘకాలంలో మంచి ప్రతిఫలాన్ని చూడొచ్చు. అంతేకాదు పోర్ట్‌ఫోలియో రిస్క్‌ను (ఒక్క బాక్సులోనే అన్ని గుడ్లు పెట్టడం)ను తగ్గించుకోవచ్చు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్)కూడా పెట్టుబడుల వైవిధ్యానికి అందుబాటులో ఉన్న సాధనాలు. గత పదిహేనేళ్ల కాలంలో వివిధ సాధనాలు ఎలా పనిచేశాయి? వైవిధ్యం ఏ విధంగా నష్టాలను పరిమితం చేసి, మెరుగైన రాబడులు ఇచ్చిందన్నది అర్థం చేసుకోవాలంటే కొన్ని గణాంకాలను విశ్లేషించుకోవాల్సిందే. పనితీరు ఇలా.. 2006 నుంచి 2022 వరకు డేటాను పరిశీలిస్తే.. ఈక్విటీ, డెట్, గోల్డ్, వెండి ఎలా ర్యాలీ చేసిందీ తెలుస్తుంది. 2006లో ఈక్విటీ 41.9 శాతం, 2007లో 56.8 శాతం చొప్పున ర్యాలీ చేసింది. డెట్ ఆ రెండు సంవత్సరాల్లో ఒకే అంకె రాబడులను ఇచ్చింది. బంగారం స్వల్పంగా లాభాలను ఇచ్చింది. అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం ప్రభావంతో 2008లో ఈక్విటీ మార్కెట్ 51 శాతం పడిపోయింది. కానీ, బంగారం అదే ఏడాది 26.1 శాతం ర్యాలీ చేసింది. 2011లో యూరోజోన్ సంక్షోభం తలెత్తింది. దీంతో ఈక్విటీ మార్కెట్ 23.8 శాతం పడిపోయింది. కానీ, బంగారం 31.7 శాతం రాబడులను ఇచ్చింది. డెట్‌లో రాబడి 8 శాతంగా ఉంది. అంతెందుకు కరోనా సంవత్సరం 2020లోనూ ఈక్విటీ మార్కెట్ 50 శాతం వరకు పడిపోగా, అంతే వేగంగా రివకరీ అయి, ఆ ఏడాది నికరంగా 16%రాబడినిచ్చింది. అదే ఏడాది బంగారం 28% రాబడులను ఇచ్చింది. 2021లో బంగారం నికరంగా నష్టాలను మిగల్చితే.. ఈక్విటీలు రాబడులు మెరుగ్గా ఉన్నాయి. ఇక్కడి గణాంకాలను పరిశీలిస్తే, అన్ని సాధనాలు ఒకే తీరులో కాకుండా.. భిన్న సమయాల్లో భిన్నమార్గంలో చలిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. అందుకనే పోర్ట్‌ఫోలియోలో వీటన్నింటికీ చోటు ఇవ్వాలని చెప్పేది. ఇక్కడ బంగారం రాబడికి ఎంసీఎక్స్, బాండ్ల పనితీరునకు క్రిసిల్ షార్ట్ టర్మ్ ఇండెక్స్ గణాంకాలను పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. పెట్టుబడుల మిశ్రమం వైవిధ్యం కోసం ఈక్విటీలకు తోడుగా ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల (డెట్) వరకే పరిమితం కాకూడదు. ఈక్విటీ, డెట్‌కు తోడు బంగారం కూడా జోడించుకోవడం మెరుగైన విధానమని చెప్పుకోవచ్చు. కేవలం ఈక్విటీ, డెట్‌తో కూడిన పోర్ట్‌ఫోలియోతో పోలిస్తే, ఈక్విటీ, డెట్, గోల్డ్‌తో కూడిన పోర్ట్‌ఫోలియోలోనే మెరుగైన రాబడులు ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2002 నుంచి 2022 వరకు ఈ సాధనాల్లో మూడేళ్ల రోలింగ్ రాబడులను గమనించినట్టయితే.. 65:35 నిష్పత్తిలో ఈక్విటీ, డెట్ పోర్ట్‌ఫోలియో 67.2 శాతం సమయంలో 10 శాతానికి పైగా వార్షిక రాబడులను ఇచ్చింది. అదే 65:20:15 నిష్పత్తిలో ఈక్విటీ, డెట్, గోల్డ్ పోర్ట్‌ఫోలియో మాత్రం 71.7% కాలంలో 10 శాతానికి పైనే రాబడులను ఇచ్చింది. కానీ, గత 20 ఏళ్ల కాలంలో ఈక్విటీ, డెట్ పోర్ట్‌ఫోలియో వార్షిక రాబడి 14.3 శాతంగా ఉంటే, ఈక్విటీ, డెట్, గోల్డ్‌తో కూడిన పోర్ట్‌ఫోలియోలో రాబడి 15.4 శాతం చొప్పున ఉంది. ఈక్వటీ, డెట్‌కు బంగారాన్ని జోడించుకోవడం వల్ల ఒక శాతం అదనపు రాబడులు కనిపిస్తున్నాయి. మల్టీ అస్సెట్ పోర్ట్‌ఫోలియో రిస్క్‌ను అధిగమించి దీర్ఘకాలంలో మెరుగైన రాబడులను ఇచ్చాయి. మిశ్రమ పోర్ట్‌ఫోలియో వల్ల మూడేళ్లకు మించిన కాలంలో ప్రతికూల రాబడులకూ అవకాశం దాదాపుగా ఉండదు. గత ఐదేళ్లలో మల్టీ అస్సెట్ పథకాలు, అగ్రెస్సివ్ హైబ్రిడ్ లేదా డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ మెరుగైన పనితీరు చూపించాయి. ఎంత చొప్పున.. అస్సెట్ అలోకేషన్ విషయంలో ఏ సాధనానికి ఎంత పెట్టుబడులు కేటాయించాలన్నది ముఖ్యమైన అంశం అవుతుంది. ఇది ఇన్వెస్టర్ రిస్క్ సామర్థ్యం, పెట్టుబడుల కాలం, రాబడుల అంచనాల ఆధారంగా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అందరికీ ఒక్కటే ప్రామాణిక సూత్రం పనిచేయదు. యుక్త వయసులో ఉన్న వారు ఈక్విటీలకు ఎక్కువ కేటాయింపులు చేసుకోవాలి. వయసు పెరుగుతున్న కొద్దీ ఈక్విటీలకు కేటాయింపులు తగ్గుతూ వెళ్లాలి. అదే సమయంలో డెట్, గోల్డ్‌కు కేటాయింపులు పెంచుకుంటూ వెళ్లాలి. రిటైర్మెంట్ తర్వాత కూడా కొంత మేర పెట్టుబడులు ఈక్విటీల్లోనే ఉండాలి. అప్పుడే ద్రవ్యోల్బణం నుంచి పెట్టుబడులకు రక్షణతోపాటు, మెరుగైన రాబడులను సొంతం చేసుకోవడానికి వీలుంటుంది. 100 నుంచి ఇన్వెస్టర్ తన వయసును తీసివేయగా, మిగిలేంత ఈక్విటీలకు కేటాయించుకోవచ్చన్నది ఒక సూత్రం. ఉదాహరణకు 30 ఏళ్ల ఇన్వెస్టర్ 70 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీలకు తప్పనిసరిగా మెజారిటీ పెట్టుబడులు కేటాయించుకోవడం అవసరం. దీర్ఘకాలంలో (7 ఏళ్లకు మించి) ఈక్విటీలు సగటున రెండంకెల రాబడులను ఇచ్చాయి. ఇక ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలు (డెట్) స్థిరమైన రాబడులకు మార్గం అవుతుంది. వైవిధ్యంతోపాటు, నష్టాలకు అవకాశం ఉండదు. బంగారం అన్నది ద్రవ్యోల్బణానికి హెడ్జింగ్‌గా అనుకూలిస్తుంది. ఈక్విటీలు ప్రతికూలతలు ఎదుర్కొంటున్న సందర్భాల్లో అండగా నిలిచే సాధనం ఇది. బంగారం కేవలం హెడ్జింగ్ కోసమే కాకుండా, దీర్ఘకాలంలో డెట్‌కు మించి రాబడులను ఇవ్వగలదని గణాంకాలు చెబుతున్నాయి. 2006 నుంచి 2012 మధ్య కాలంలో రెండంకెల వార్షిక రాబడులను ఇచ్చింది. కానీ, ఆ తర్వాత 2013 నుంచి 2015 వరకు నష్టాలను ఎదుర్కొన్నది. ఇక వెండి అన్నది పారిశ్రామిక కమోడిటీ. ఎలక్ట్రానిక్స్, బ్యాటరీలు, స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెళ్లలో దీని అవసరం ఉంటుంది. ఈ రంగాలు వృద్ధి చెందే కొద్దీ వెండికి డిమాండ్ పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు చూపిస్తున్న దశలో వెండికి డిమాండ్ పెరుగుతుంది. ఒకవేళ వెండిలోనూ ఇన్వెస్ట్ చేయాలనే ఆసక్తి ఉంటే సిల్వర్ ఈటీఎఫ్‌లకు 5 శాతం లోపు కేటాయింపులను పరిశీలించొచ్చు. బంగారం కోసం సావరీన్ గోల్డ్ బాండ్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. భౌతిక బంగారం మెరుగైన పెట్టుబడి సాధనం కాబోదు. నేరుగా ఇన్వెస్ట్ చేసుకునే ఆసక్తి లేకపోయినా లేదా అంత పరిజ్ఞానం లేకపోయినా నిరాశ పడక్కర్లేదు. మార్కెట్లో మెరుగైన మల్టీ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ ఉన్నాయి. ఇన్వెస్టర్లు వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవడాన్ని పరిశీలించొచ్చు. మల్టీ అస్సెట్ పథకాలు చాలా వరకు ఈక్విటీ, డెట్, బంగారానికి 65:20:15 నిష్పత్తిలో పెట్టుబడులు కేటాయిస్తుంటాయి. ఈ విభాగంలో ఐసీఐసీఐ మల్టీ అస్సెట్ అలోకేషన్, హెచ్డీఎఫ్సీ మల్టీ అస్సెట్, ఎస్బీఐ మల్టీ అస్సెట్ తదితర పథకాలు అందుబాటులో ఉన్నాయి. -
రికవరీకి అవకాశం
ముంబై: గత వారం రెండున్నర శాతం దిద్దుబాటుకు గురైన దేశీయ సూచీల్లో ఈ వారం కొంత రికవరీ కనిపించవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అయితే అదానీ గ్రూప్ షేర్లలో కొనసాగుతున్న అమ్మకాలు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని బలహీనతల కారణంగా భారీ లాభాలైతే ఉండకపోవచ్చు. అంతర్జాతీయ పరిణామాలు కీలకం కానున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) డిసెంబర్ క్వార్టర్ జీడీపీ గణాంకాలు, ఫిబ్రవరి ఆటో అమ్మకాలు, తయారీ, సేవారంగ పీఎంఐ డేటాను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. అలాగే విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలు తదితర సాధారణ అంశాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. ఫెడ్ రిజర్వ్, ఆర్బీఐ కఠిన ద్రవ్య విధాన వైఖరి కొనసాగింపు సంకేతాలు, రష్యా – ఉక్రెయిన్– అమెరికా దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తెరపైకి రావడంతో సూచీలు గడిచిన ఎనిమిది నెలల్లో ఒకవారంలో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. మొత్తం ఐదు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,539 పాయింట్లు, నిఫ్టీ 478 పాయింట్ల చొప్పున క్షీణించాయి. ‘‘వరుస నష్టాల మార్కెట్ వచ్చే వారం గట్టెక్కే వీలుంది. అయితే అగ్రరాజ్యమైన అమెరికా మార్కెట్లలో కరెక్షన్ ఆందోళన రేకెత్తిస్తోంది. మొత్తంగా., సూచీలు ఒడిదుడుకులకు లోనవుతూ పరిమిత శ్రేణిలో ట్రేడవొచ్చు. సాంకేతికంగా నిఫ్టీ కీలక మద్దతు స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది. అమ్మకాలు కొనసాగి బడ్జెట్ రోజునాటి కనిష్ట స్థాయి(17,353)ని కోల్పోతే 17,050 –17,000 శ్రేణిలో తక్షణ మద్దతు లభించవచ్చు. అనుకున్నట్లే రికవరీ కొనసాగితే 17,750–17,800 పాయింట్ల పరిధిలో నిరోధం ఎదురయ్యే అవకాశం ఉంది’’ అని ఏంజెల్ వన్ సాంకేతిక నిపుణుడు రాజేశ్ భోంస్లే తెలిపారు. బుధవారం డివ్గీ టార్క్‌ట్రాన్స్‌ఫర్ ఐపీవో కొన్ని నెలల విరామం తర్వాత ప్రైమరీ మార్కెట్ మళ్లీ యాక్టివ్ అయ్యింది. ఆటోమోటివ్ ఉపకరణాల తయారీ సంస్థ డివ్గీ టార్క్‌ట్రాన్స్‌ఫర్ ఐపీవో మార్చి ఒకటిన మొదలవనుంది. శుక్రవారం ముగియనున్న ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ మొత్తం రూ.180 కోట్లను సమీకరించనుంది. ఇందుకు 39 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయానికి పెట్టింది. ధర శ్రేణిని సోమవారం కంపెనీ వెల్లడించనుంది. కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతోంది. ఫెడ్ రిజర్వ్ మినిట్స్ వెల్లడి నేపథ్యంలో ఈ ఫిబ్రవరి 24 తేదీ నాటికి ఎఫ్ఐఐలు రూ.2,313 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించినట్లు ఎన్‌సీడీఎల్ డేటా చెబుతోంది. అయితే ఈ ఏడాది జన వరి విక్రయాలు రూ.28,852 కోట్లతో పోలిస్తే అమ్మకాలు భారీగానే తగ్గాయి. ‘‘అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు సంకేతాలు వెలువడిన నేపథ్యంలో వర్ధమాన మార్కెట్ల నుంచి ఎఫ్ఐఐ లు వైదొలుగుతున్నారు. అయితే దక్షిణ కొరి యా, తైవాన్, చైనా దేశాలు ఈక్విటీలు చౌకగా లభిస్తున్నందున ఇన్వెస్టర్లు ఈ దేశాల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వీకే విజయ్‌కుమార్ తెలిపారు. స్థూల ఆర్థిక గణాంకాలపై దృష్టి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్(క్యూ3) జీడీపీ గణాంకాలు ఈ మంగళవారం(ఫిబ్రవరి 28) కేంద్రం వెల్లడిస్తుంది. అదేరోజున జనవరి ద్రవ్యలోటు డేటా వెలువడుతుంది. మార్చి ఒకటిన(బుధవారం) ఆటో కంపెనీలు ఫిబ్రవరి హోల్‌సేల్ అమ్మకాల వివరాలు, ఫిబ్రవరి తయారీ పీఎంఐ డేటా వెల్లడి అవుతాయి. వారాంతాపు రోజైన శుక్రవారం సేవారంగ పీఎంఐ డేటా విడుదల అవుతుంది. అదే రోజున ఆర్బీఐ ఫిబ్రవరి 24 తేదీన ముగిసిన వారం నాటి ఫారెక్స్ నిల్వలు డిసెంబర్ 19వ తేదీతో ముగిసిన బ్యాంక్ రుణాలు–డిపాజిట్ వృద్ది గణాంకాలను విడుదల చేయనుంది. ఇక అంతర్జాతీయంగా నేడు(సోమవారం) యూరోజోన్ ఫిబ్రవరి ఎకనామిక్స్, సర్విసెస్, పారిశ్రామిక సెంటిమెంట్ వివరాలు వెల్లడికానున్నాయి. అమెరికా, యూరోజోన్‌తో పాటు ఇతర ప్రధాన దేశాల తయారీ రంగ డేటా మార్చి ఒకటిన(బుధవారం) విడుదల అవుతుంది. యూరోజోన్ ద్రవ్యోల్బణ డేటా మార్చి రెండో తేదీన వెల్లడి కానుంది. ఆయా దేశాలకు సంబంధించిన ఆర్థిక స్థితిగతులను తెలియజేసే ఈ కీలక స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. -
వొడా ఐడియాకు ఊరట.. ప్రభుత్వానికి మెజారిటీ వాటా!
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) కట్టాల్సిన రూ. 16,133 కోట్ల వడ్డీ బాకీలను ఈక్విటీ కింద మార్చుకునే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. స్పెక్ట్రం వాయిదాలు, సవరించిన స్థూల లాభాలపై కట్టాల్సినది (ఏజీఆర్) కలిపి ప్రభుత్వానికి వీఐఎల్ భారీగా బాకీ పడింది. సంస్థ ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా బకాయిలకు సంబంధించి ప్రభుత్వానికి ఈక్విటీ షేర్లను వాటాగా కేటాయించింది. దీంతో రూ.10 షేర్ విలువతో రూ.16,133 కోట్ల విలువైన షేర్లను కంపెనీ కేంద్రానికి బదిలీ చేసింది. తమ భాకీలను ఈక్విటీగా మార్చుకుంటే తమ సంస్థలో ప్రభుత్వానికి 33.14 శాతం వాటా లభించగలదని వీఐఎల్ గతంలో తెలిపింది. పలు కారణాలతో కేంద్రం ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వస్తోంది. అయితే తాజాగా దీనికి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. భారతదేశ టెలికాం రంగంలో బిలియనీర్ ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో రంగ ప్రవేశంతో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. జియో దెబ్బకు ఈ రంగంలోని పలు టెలికాం కంపెనీలు మూతపడ్డాయి. మరో వైపు ప్రభుత్వానికి చెల్లించాల్సిన భారీ బకాయిలు కూడా టెలికాం రంగం ఇబ్బందులను మరింత పెంచాయి. చదవండి: అదానీ గ్రూప్: బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ -
దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త మైలురాయి.. ఒక్క రోజులోనే సెటిల్మెంట్
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త మైలురాయిని అందుకున్నాయి. శుక్రవారం(27న) నుంచి మొత్తం ఈక్విటీ విభాగంలో లావాదేవీలను ఒక్క రోజులోనే సెటిల్ చేసే ప్రక్రియకు తెరతీశాయి. దీంతో మార్కెట్లో నమోదయ్యే లావాదేవీలను మరుసటి రోజులోనే క్లియర్ చేస్తారు. అంటే షేరు లేదా నగదు బదిలీని పూర్తి చేస్తారు. ఈక్విటీ విభాగంలోని సెక్యూరిటీలలో ఈ నెల 27 నుంచి ట్రేడ్‌ప్లస్(టీప్లస్)1 సెటిల్మెంట్ను అమలు చేస్తున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ తాజాగా పేర్కొంది. తద్వారా దేశీ మార్కెట్లు సరికొత్త రికార్డును సృష్టించాయి. ఇప్పటివరకూ టీప్లస్2 సెటిల్మెంట్ అమల్లో ఉంది. అంటే లావాదేవీ జరిగిన రెండు రోజుల్లో క్లియరింగ్‌ను చేపడుతున్నారు. టీప్లస్1 సెటిల్మెంట్ వల్ల ఇన్వెస్టర్ల పెట్టుబడి సామర్థ్యాలు మెరుగుపడటంతోపాటు.. మొత్తం పరిశ్రమలో రిస్కులు తగ్గేందుకు వీలు చిక్కనుంది. 2021లోనే పునాది: నిజానికి టీప్లస్1 సెటిల్మెంట్కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 2021 సెప్టెంబర్ 7న గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2022 జనవరి 1 నుంచి ప్రవేశపెట్టేందుకు ఎక్సే్ఛంజీలను అనుమతించింది. ట్రేడింగ్ సభ్యులు, కస్టోడియన్లు తదితర మార్కెట్ మౌలిక సంస్థలు దశలవారీగా టీప్లస్1 అమలుకు తెరతీశాయి. 2022 ఫిబ్రవరి 25న కొత్త సెటిల్మెంట్ను ప్రారంభించాయి. 2023 జనవరి 27కల్లా ఈక్విటీ విభాగంలోని అన్ని సెక్యూరిటీలనూ ఒక్క రోజు సెటిల్‌మెంట్‌లోకి తీసుకువచ్చాయి. వీటిలో ఎస్ఎంఈ షేర్లు సహా ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్‌లు), రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్(రీట్లు), సావరిన్ గోల్డ్ బాండ్లు(ఎస్‌జీబీలు), ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్లు చేరాయి. పలు అభివృద్ధి చెందిన మార్కెట్లలో ఇప్పటికీ టీప్లస్2 సెటిల్మెంటును అమలు చేస్తుండటం గమనార్హం! చదవండి: జియో బంపర్ ఆఫర్.. ఈ ప్లాన్‌తో 23 రోజుల వ్యాలిడిటీ, 75జీబీ డేటా.. ఫ్రీ, ఫ్రీ! -
దేశంలోని ధనవంతులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుసా?
న్యూఢిల్లీ: దేశంలోని అధిక ధనవంతులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? చాలా మందికి దీన్ని తెలుసుకోవాలని ఉంటుంది. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ ‘నైట్ ఫ్రాంక్’ సర్వే పరిశీలిస్తే.. అల్ట్రా హై నెట్ వర్త్ వ్యక్తులకు (యూహెచ్ఎన్డబ్ల్యూఐ/అధిక ధనవంతులు) అత్యంత ఇష్టమైన పెట్టుబడి సాధనం ఈక్విటీలే అని తెలుస్తోంది. 34% పెట్టుబడులను ఈక్విటీలకే కేటాయిస్తున్నారు. ఆ తర్వాత వాణిజ్య రియల్ ఎస్టేట్‌లో 25 శాతం, బాండ్లలో 16 శాతం, ప్రైవేటు ఈక్విటీ/వెంచర్ క్యాపిటల్ రూపంలో 10 శాతం, బంగారంలో 6 శాతం, ఇతర ఇష్టమైన వస్తువులపై (కళాకృతులు, కారు) 4% చొప్పున పెట్టుబడులు పెడుతున్నట్టు తెలిసింది. నైట్ ఫ్రాంక్ సంస్థ అంతర్జాతీయంగా సర్వే నిర్వహించి ‘ద వెల్త్ రిపోర్ట్ అవుట్‌లుక్ 2023’పేరుతో విడుదల చేసింది. సర్వే ఫలితాలు.. ► దీర్ఘకాలంలో ఎంతో అనిశ్చితులు నెలకొన్నప్పటికీ 88 శాతం మంది భారతీయ అధిక ధనవంతుల సంపద 2022లో వృద్ధి చెందింది. ► గతేడాది 10 శాతానికి పైగా తమ సంపద పెరిగినట్టు 35 శాతం మంది చెప్పారు. ► ఈ ఏడాది కూడా తమ సంపద కనీసం 10 శాతం వృద్ధి చెందుతుందని 53 శాతం మంది అధిక ధనవంతులు అభిప్రాయపడుతున్నారు ► 47 శాతం మంది 10 శాతానికి పైనే పెరగొచ్చన్న అంచనాతో ఉన్నారు. ► అంతర్జాతీయంగా.. సంపన్నుల కంటే ధనవంతులే ఈక్విటీల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ► మన దేశంలో అధిక ధనవంతులు కనీసం ఒక్కొక్కరు 5 నివాస ఆస్తులను కలిగి ఉన్నారు. అంతర్జాతీయంగా ఇది 4.2గానే ఉంది. ► 2022లో 14 శాతం మంది అధిక ధనవంతులు ఇంటిని కొనుగోలు చేయగా, 2023లో 10 శాతం మంది ఇంటిని కొనుగోలు చేస్తారని అంచనా. ► యూకే, యూఏఈ, యూఎస్ఏ ఇళ్ల కొనుగోలుకు ప్రాధాన్య ప్రాంతాలుగా ఉన్నాయి. చదవండి: సేల్స్ రచ్చ మామూలుగా లేదు, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో నంబర్ వన్! -
ఈ స్మాల్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే..లాభాలే లాభాలు
కెనరా రోబెకో స్మాల్ క్యాప్ ఫండ్! భవిష్యత్తులో మంచి వృద్ధిని సాధించే అవకాశాలున్న లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ పథకం ఇది. మోస్తరు రిస్క్ ఉంటుంది. మోస్తరు రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు దీర్ఘకాలం కోసం ఈ పథకాన్ని పెట్టుబడుల కోసం పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే దీర్ఘకాలంలో మంచి రాబడులను ఇచ్చిన చరిత్ర ఈ పథకానికి ఉంది. పెట్టుబడుల విధానం/పోర్ట్‌ఫోలియో మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా రంగాల వారీ, పెట్టుబడుల కేటాయింపుల విధానాలను ఈ పథకం మార్చుకుంటూ ఉంటుంది. 2014, 2017 మార్కెట్ ర్యాలీ సమయాల్లో ఈ పథకం 99 శాతం వరకు పెట్టుబడులను ఈక్విటీల్లోనే కలిగి ఉంది. అలాగే, 2015, 2018 సంవత్సరాల్లో మార్కెట్లలో అస్థిరతలు పెరిగిన సందర్భాల్లో సురక్షిత రంగాలు, కంపెనీల్లో పెట్టుబడులను పెంచుకోవడాన్ని గమనించొచ్చు. కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్, ఫార్మా రంగాలను అస్థిరతల సమయాల్లో నమ్ముకున్నది. బోటమ్‌అప్ విధానాన్ని పెట్టుబడుల విషయంలో అనుసరిస్తోంది. కొనుగోలు చేసి, దీర్ఘకాలం పాటు కొనసాగడం అనే విధానాన్ని పాటిస్తోంది. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.15వేల కోట్లకు పైగా పెట్టుబడులు ఉండడం, ఇన్వెస్టర్లకు ఈ పథకం పట్ల ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. సిప్ విధానంలో ప్రతి నెలా రూ.1,000 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. తన నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో ప్రస్తుతం ఈక్విటీలకు 97 శాతం కేటాయించి, మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో 56 స్టాక్స్ ఉన్నాయి. లార్జ్కాప్స్ కంపెనీల్లో 72 శాతం మేర పెట్టుబడులు కలిగి ఉంటే, మిడ్‌క్యాప్ కంపెనీల్లో 35 శాతం పెట్టుబడులు పెట్టి ఉంది. స్మాల్‌క్యాప్ కంపెనీల్లో కేవలం 1.92 శాతం పెట్టుబడులే ఉన్నాయి. పెట్టుబడుల పరంగా బ్యాకింగ్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 30 శాతం పెట్టుబడులు ఈ రంగంలోని కంపెనీలకే కేటాయించింది. ఆ తర్వాత ఆటోమొబైల్ కంపెనీల్లో 9.24 శాతం, సేవల రంగ కంపెనీల్లో 7.72 శాతం, హెల్త్‌కేర్ కంపెనీల్లో 7.25%, టెక్నాలజీ కంపెనీల్లో 6.99 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టింది. రాబడులు ఈ పథకం గడిచిన ఏడాది కాలం మినహా అన్ని కాలాల్లోనూ స్థిరమైన, మెరుగైన రాబడులను ఇచ్చింది. గత ఏడాదిగా మార్కెట్లలో అనిశ్చితులు నెలకొని ఉండడం, మిడ్‌క్యాప్ కంపెనీలు ఎక్కువగా నష్టపోవడం రాబడులపై ప్రభావం చూపించిందని చెప్పుకోవాలి. గడిచిన మూడేళ్ల కాలంలో ఈ పథకం ఏటా 18 శాతం చొప్పున రాబడులను ఇచ్చింది. ఇక ఐదేళ్లలో 10.16 శాతం, ఏడేళ్లలో 14.24 శాతం, పదేళ్లలో 19.38 శాతం చొప్పున వార్షిక రాబడులు ఇందులో ఉన్నాయి. ఏడాది, ఐదేళ్ల కాలంలో మినహా లార్జ్ మిడ్‌క్యాప్ టీఆర్ఐ రాబడుల కంటే ఇందులోనే ఎక్కువగా ఉన్నాయి. -
వారీ ఎనర్జీస్‌కు రూ.1,000 కోట్లు
న్యూఢిల్లీ: సోలార్ మాడ్యూల్స్ తయారీలో ఉన్న వారీ ఎనర్జీస్ రూ.1,000 కోట్ల నిధులను సమీకరించింది. ప్రైవేట్ ఇన్వెస్టర్స్ నుంచి ఈ మొత్తాన్ని స్వీకరించినట్టు సంస్థ సీఎండీ హితేష్ దోషి తెలిపారు. ఈ నిధులతో ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 9 గిగావాట్లకు చేర్చనున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఇది 5 గిగావాట్లు ఉంది. 2023 జనవరి నాటికి విస్తరణ పూర్తి అవుతుందని పేర్కొన్నారు. గుజరాత్‌లోని చిక్లిలో ఉన్న కంపెనీకి చెందిన మాడ్యూల్స్ తయారీ కేంద్రం వద్ద 5.4 గిగావాట్ల సోలార్ సెల్స్ తయారీ యూనిట్ సైతం స్థాపిస్థామన్నారు. సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారీలో భాగంగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకంలో పాలుపంచుకోనున్నట్టు గుర్తు చేశారు. వారీ ఎనర్జీస్ ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ (ఈపీసీ), ప్రాజెక్ట్ డెవలప్మెంట్, రూఫ్‌టాప్ సొల్యూషన్స్ అందించడంతోపాటు సోలార్ వాటర్ పంప్స్ తయారీలోనూ ఉంది. -
ఈక్విటీ ఫండ్స్‌లో తగ్గిన పెట్టుబడులు!
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక క్రమంగా తగ్గుతోంది. ఆగస్ట్‌లో కేవలం రూ.6,120 కోట్ల వరకే వచ్చాయి. అంతకు ముందు నెలలో (జూలై) వచ్చిన రూ.8,898 కోట్లతో పోలిస్తే 30 శాతం తగ్గాయి. అంతేకాదు ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.15,890 కోట్లు, మే నెలలో రూ.18,529 కోట్లు, జూన్‌లో రూ.15,495 కోట్ల చొప్పున వచ్చిన పెట్టుబడులు.. తర్వాతి రెండు నెలల్లో గణనీయంగా తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే.. ఆగస్ట్‌లో వచ్చిన పెట్టుబడులు 2021 అక్టోబర్ (రూ.5,215 కోట్లు) తర్వాత అత్యంత కనిష్ట స్థాయి కావడం గమనార్హం. అయితే, ఈక్విటీల్లోకి నికర పెట్టబుడుల రాక 18వ నెలలోనూ నమోదైంది. సిప్ ద్వారా రూ.12,693 కోట్లు..: ఫ్లెక్సీక్యాప్, లార్జ్ అండ్ మిడ్‌క్యాప్, మిడ్‌కాయ్ప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి. కొత్త పథకాల ఆవిష్కరణపై సెబీ నియంత్రణ ఎత్తివేయడంతో ఏఎంసీలు పలు కొత్త పథకాల ద్వారా నిధులు సమీకరించాయి. హైబ్రిడ్ పథకాల నుంచి ఇన్వెస్టర్లు రూ.6,601 కోట్లను వెనక్కి తీసుకున్నారు. బంగారం ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ నుంచి రూ.38 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఆగస్ట్‌లో రూ.12,693 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సిప్ ఖాతాల సంఖ్య అత్యంత గరిష్ట స్థాయి 5.71 కోట్లకు చేరింది. డెట్‌లోకి భారీగా.. ఇక డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి ఆగస్ట్‌లో రూ.49,164 కోట్లు వచ్చాయి. జూలైలో వచ్చిన రూ.4,930 కోట్లతో పోలిస్తే పది రెట్లు పెరిగాయి. -
డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులకు సరైన తరుణం ఏది?
మార్కెట్లు పడినప్పుడు ఈక్విటీ ఫండ్స్ యూనిట్లు కొనుగోలు చేసినట్టుగానే.. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు అనుకూల సమయం ఏది? డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో పెట్టుబడులు పెట్టుకునేందుకు సరైన సమయం అంటూ ఏదీ ఉండదు. డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టుకునే ముందు, లంప్ సమ్ (ఒకే విడత మొత్తం) అయినా సరే.. మీ పెట్టుబడుల కాల వ్యవధికి అనుకూలమైన ఫథకాన్ని ఎంపిక చేసుకోవడం అన్నది కీలకమవుతుంది. చాలా మంది ఇన్వెస్టర్లు దీర్ఘకాలం కోసం డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. మీరు ఎంపిక చేసుకున్న పథకం రక్షణ ఎక్కువగా ఉండే సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసేలా ఉండాలి. ఈక్విటీ మార్కెట్లు పడినప్పుడు కొనుగోలు చేసే మాదిరి అని అన్నారు. కానీ, అదేమంత సులభం కాదు. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్లు పడిపోతున్నప్పుడు దిద్దుబాటు చివరికి వచ్చిందా.. ఇంకా కరెక్షన్ మిగిలి ఉన్నదా అన్నది మీకు తెలియదు. అందుకని ఇన్వెస్టర్లు క్రమశిక్షణతో కూడిన విధానాన్ని ఆచరించాలని చెబుతుంటాను. మీరు ప్రతి నెలా నిర్ణీత మొత్తం ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే కొంత మొత్తాన్ని మార్కెట్లు పడినప్పుడు పెట్టే విధంగా లక్ష్యాన్ని నిర్ధేశించుకోవచ్చు. కనిష్ట స్థాయిల్లో పెట్టుబడి పెట్టాలన్న దానిపై దృష్టి పెట్టడం వల్ల మంచిగా పెరిగే వాటిల్లో పెట్టుబడుల అవకాశాలను కోల్పోవచ్చు. నా మొత్తం పెట్టుబడుల్లో 70 శాతం ఈక్విటీల్లో ఉంటే, 30 శాతం ఫిక్స్డ్ ఇన్కమ్ (డెట్) పథకాల్లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఈక్విటీ పెట్టుబడుల్లో 10 శాతాన్ని తీసుకెళ్లి రీట్లలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. పదేళ్ల కాలంలో వీటి రాబడులు సెన్సెక్స్‌ను అధిగమిస్తాయా? రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఆర్ఈఐటీ/రీట్)లు అన్నవి వాణిజ్య అద్దె ఆదాయం వచ్చే ఆస్తులపై ఇన్వెస్ట్ చస్తుంటాయి. వీటి అద్దె రాబడులు అన్నవి ప్రస్తుతం అంత ఎక్కువేమీ లేవు. వచ్చే పదేళ్లలో కొంత పురోగతి ఉంటుందని ఆశిస్తున్నాను. అదే సమయంలో ప్రస్తుతం చూస్తున్న మాదిరి ప్రతికూలతలు మధ్యలో ఎదురైనప్పటికీ ఆర్థిక వ్యవస్థ, సెన్సెక్స్ పట్ల నేను ఎంతో ఆశావహంతో ఉన్నాను. రీట్ల కంటే సెన్సెక్స్ విషయంలోనే నేను ఎక్కువ సానుకూలంగా ఉన్నాను. ప్రతి నెలా ఫండ్స్‌లో రూ.50,000కు మించి పెట్టుబడులు పెట్టేట్టు అయితే పథకాల విభజన ఎలా? ప్రతి నెలా రూ.50,000తో ఒకటికి మించిన పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ, పోర్ట్‌ఫోలియో సరళంగా ఉండేలా చూసుకోవాలన్నది నా సూచన. రెండు మంచి ఫ్లెక్సీక్యాప్ పథకాలు సరిపోతాయి. పదేళ్లు, అంతకుమించిన కాలానికి ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే, రెండు ఫ్లెక్సీక్యాప్ పథకాలకు తోడు, రెండు స్మాల్‌క్యాప్ పథకాలను కూడా చేర్చుకోండి. పెట్టుబడులు సంక్లిష్టంగా కాకుండా, సరళంగా ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవాలి. చదవండి: ఇలాంటి పాన్ కార్డు మీకుంటే.. రూ.10,000 పెనాల్టీ! -
మీ చిన్నారుల భవిష్యత్తు కోసం.. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయండి!
చిన్నారుల భవిష్యత్తు అవసరాల కోసం ఓ చక్కని నిధిని సమకూర్చుకోవాలని భావించే వారి ముందు ఉన్న పెట్టుబడి సాధనాల్లో ఈక్విటీలకు మించినది మరేదీ లేదనే చెప్పుకోవాలి. ఈక్విటీల్లో మంచి పథకాలను ఎంపిక చేసుకుని సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో (సిప్) దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తూ వెళితే సగటు వార్షిక రాబడి 15 శాతం, అంతకంటే ఎక్కువే ఆశించొచ్చు. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలని భావిస్తే, హెచ్డీఎఫ్సీ చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్ ను పరిశీలించొచ్చు. సెబీ సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్స్ విభాగంలోకి ఇది వస్తుంది. ఈ పథకంలో పెట్టుబడులకు ఐదేళ్ల పాటు లాకిన్ ఉంటుంది. అంటే ఐదేళ్ల వరకు పెట్టుబడులను వెనక్కి తీసుకోలేరు. దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు కనుక ఐదేళ్లలోపు పెట్టుబడులను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడదు. మోస్తరు రిస్క్ భరించగలిగే వారికి హెచ్డీఎఫ్సీ చిల్ట్రన్స్ గిఫ్ట్ ఫండ్ అనుకూలం. పెట్టుబడుల విధానం/రాబడులు ఏడాది కాలంలో ఈ పథకంలో రాబడి 7 శాతంగా ఉంది. కానీ, ఇదే కాలంలో అగ్రెస్సివ్ హైబ్రిడ్ కేటగిరీ రాబడి 4.5 శాతంగానే ఉంది. ఇక మూడేళ్ల కాలంలో 17 శాతం చొప్పున వార్షిక రాబడులను అందించింది. ఐదేళ్ల కాలంలో 11 శాతం, ఏడేళ్లలో 12 శాతం, పదేళ్లలో 15 శాతం చొప్పున వార్షిక రాబడిని అందించింది. మైనర్ పేరిటే (18 ఏళ్ల లోపు) ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సంబంధిత చిన్నారి తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుడి పేరిట వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీ లభిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రీమియం చెల్లించక్కర్లేదు. ఫండ్స్ యూనిట్లు ఎన్నున్నాయో వాటి విలువకు పది రెట్లు, గరిష్టంగా రూ.10 లక్షల వరకు ఈ బీమా ఉంటుంది. అస్థిరతల రిస్క్‌ను తగ్గించుకునేందుకు సిప్ ద్వారా ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవడం అనుకూలం. పనితీరు విధానం ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ మాదిరిగా హెచ్డీఎఫ్సీ చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్ పనిచేస్తుంది. డెట్ సాధనాల్లో, ఈక్విటీలోనూ ఇన్వెస్ట్ చేస్తుంది. కనుక అచ్చమైన ఈక్విటీ పథకాలతో పోలిస్తే రిస్క్ కొంత తక్కువగా ఉంటుంది. ఒక విభాగంలో ప్రతికూలతలు ఎదురైనప్పుడు మరో విభాగం నుంచి కొంత కుషన్ ఉంటుంది. రూ.5,217 కోట్ల పెట్టుబడులు ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో ఉన్నాయి. ఇందులో 65.7 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించింది. డెట్ సాధనాల్లో 20 శాతం ఇన్వెస్ట్ చేయగా, 14.3 శాతం మేర నగదు నిల్వలు కలిగి ఉంది. మార్కెట్ల వ్యాల్యూషన్లు గరిష్టానికి చేరాయని భావించినప్పుడు కొంత మేర ఈక్విటీ పెట్టుబడులను విక్రయించి నగదు నిల్వలను పెంచుకుంటుంది. తద్వారా కరెక్షన్లో ఇన్వెస్ట్ చేయడానికి నిల్వలను పెంచుకుంటుంది. ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో 47 స్టాక్స్ వరకు ఉన్నాయి. ఈక్విటీ పెట్టుబడుల్లో 20 శాతం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లోనే ఉన్నాయి. ఆ తర్వాత క్యాపిటల్ గూడ్స్ రంగానికి 10 శాతం, టెక్నాలజీ కంపెనీలకు 8 శాతం మేర కేటాయింపులు చేసింది. -
ఈ ఈక్విటీ ఫండ్‌తో లాభాలొస్తాయా!
ఈక్విటీల్లో పెట్టుబడులకు ఎన్నో మార్గాలున్నాయి. ఇన్వెస్టర్ల రిస్క్ సామర్థ్యం, రాబడుల అంచనాలకు అనుగుణంగా మ్యూచువల్ ఫండ్స్‌లో అనుకూలమైన విభాగాన్ని ఎంపిక చేసుకోవచ్చు. అందులో స్పెషల్ సిచ్యుయేషన్ కూడా ఒకటి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఇండియా అపార్చునిటీస్ ఫండ్ ఈ విభాగం కిందకే వస్తుంది. పెట్టుబడుల విధానం.. కంపెనీల్లో చోటుచేసుకునే అసాధారణ పరిణామాలను పెట్టుబడుల అవకాశాలుగా ఈ పథకం చూస్తుంది. మంచి అవకాశం అని భావిస్తే ఇన్వెస్ట్ చేస్తుంది. టాప్ డౌన్, బోటమ్ అప్ విధానాలను పెట్టుబడులకు అనుసరిస్తుంది. ఇందుకోసం 360 డిగ్రీల కోణంలో పరిశోధన చేస్తుంది. ప్రత్యేక పెట్టుబడి సందర్భాలన్నవి ఎన్నో రూపాల్లో ఎదురవుతుంటాయి. ఆయా కంపెనీ లేదా రంగంలో తాత్కాలిక సంక్షోభం వల్ల స్టాక్స్ పడిపోవచ్చు. అంతర్జాతీయ అనిశ్చితులు, ప్రభుత్వ నిర్ణయాల ప్రభావంతో దిద్దుబాటుకు లోను కావచ్చు. ఈ పథకానికి ఎస్ నరేన్ నేతృత్వం వహిస్తున్నారు. ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నప్పుడు కొన్ని విభాగాల ఫండ్స్ ఆయా స్టాక్స్ నుంచి బయటకు వచ్చేయడానికి ఆసక్తి చూపిస్తుంటాయి. ఆ సందర్భాలను ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఇండియా అపార్చునిటీస్ తరహా పథకాలు అవకాశాలుగా చూస్తుంటాయి. అందుకుని ఈ ఫండ్ లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాల పెట్టుబడులకే ఈ పథకాన్ని ఎంపిక చేసుకోవాలి. రాబడులు ఈ పథకం 2019 జనవరి 15న ప్రారంభమైంది. గత ఏడాది కాలంలో 42 శాతం రాబడులు ఇవ్వగా.. మూడేళ్లలో వార్షికంగా 19 శాతానికిపైనే రాబడులు తెచ్చి పెట్టింది. ఆరంభం నుంచి చూస్తే.. వార్షిక రాబడి రేటు 20 శాతానికిపైనే ఉంది. డైవర్సిఫైడ్ ఈక్విటీ పథకాలైన లార్జ్‌క్యాప్, లార్జ్ అండ్ మిడ్‌క్యాప్, మల్టీక్యాప్, ఫ్లెక్సీక్యాప్ పథకాల కంటే కూడా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఇండియా అపార్చునిటీస్ ఫండ్ మెరుగైన పనితీరు చూపించడం గమనించాలి. నిఫ్టీ 500 టీఆర్ఐ కంటే కూడా ఈ పథకం పనితీరు మెరుగ్గా ఉంది. ఆరంభంలో రూ.10 ఇన్వెస్ట్ చేస్తే 2022 ఏప్రిల్ 20 నాటికి రూ.18.46 అయి ఉండేది. పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.4,911 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇందులో ఈక్విటీల్లో 98 శాతం మేర ఇన్వెస్ట్ చేసి, మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 44 స్టాక్స్ ఉన్నాయి. తన పెట్టుబడుల్లో 64 శాతాన్ని టాప్–10 స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేసింది. 72 శాతం మేర పెట్టుబడులను లార్జ్‌క్యాప్ కంపెనీలకు కేటాయించగా.. మిడ్ క్యాప్‌లో 19 శాతం, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో 9 శాతం చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది. పెట్టుబడుల పరంగా ఇంధన రంగ కంపెనీలకు అగ్ర ప్రాధాన్యం ఇచ్చింది. 27 శాతం పెట్టుబడులను ఈ రంగానికి చెందిన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీలకు అత్యధికంగా 22 శాతం కేటాయింపులు చేసింది. హెల్త్‌కేర్ కంపెనీల్లో 17 శాతం, ఆటోమొబైల్, నిర్మాణ రంగ కంపెనీలలో 10 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. ’’దీర్ఘకాలంలో స్పెషల్ సిచ్యుయేషన్ పెట్టుబడులు మంచి రాబడులు కురిపిస్తాయి. అయితే స్వల్పకాలంలో అస్థిరతలు ఉండవని చెప్పలేం. ఎన్నో అంచనాలతో చేసిన పెట్టుబడులు మధ్య కాలం నుంచి ఫలితాలు ఇవ్వడం కనిపిస్తాయి’’అని ఎస్.నరేన్ ఇన్వెస్టర్లకు సూచించారు. -
మ్యూచువల్ ఫండ్స్ మురిపిస్తున్నాయ్..పెట్టుబడులు పెరుగుతున్నాయ్!
న్యూఢిల్లీ: ఈక్విటీల పట్ల ఇన్వెస్టర్లలో విశ్వాసం మరింత అధికమైంది. ఇందుకు నిదర్శనంగా మార్చి నెలలో రూ.28,463 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఒక నెలలో వచ్చిన గరిష్ట పెట్టుబడులు ఇవి. మార్కెట్ దిద్దుబాటు నేపథ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు రిటైల్, హెచ్ఎన్ఐ (అధిక నెట్‌వర్త్ ఉన్నవారు) ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిన ఫలితమే ఇదని విశ్లేషకులు అంటున్నారు. ఇక వరుసగా 13వ నెలలోనూ ఈక్విటీ ఫండ్స్‌లోకి నికరంగా పెట్టుబడులు వచ్చాయి. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.19,705 కోట్లుగా ఉంటే, జనవరిలో రూ.14,888 కోట్లు, 2021 డిసెంబర్లో రూ.25,077 కోట్ల చొప్పున వచ్చాయి. మార్చి నెలకు సంబంధించిన గణంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. మరింత వివరంగా గణాంకాలు.. ► 2021–22 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఈక్విటీ పథకాలు రూ.1,64,399 కోట్ల భారీ పెట్టుబడులు ఆకర్షించడం విశేషం. ఎందుకంటే అంతకుముందు సంవత్సరం 2020–21లో రూ.25,966 కోట్లు నికరంగా బయటకు వెళ్లిపోయాయి. ఈక్విటీ పెట్టుబడుల పట్ల మారిన ఇన్వెస్టర్ల వైఖరిని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ► ఈక్విటీ పథకాలు 2021 మార్చి నుంచి నికరంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. కరోనా రెండో విడత మార్కెట్లలో కరెక్షన్కు దారితీసింది. దీంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు మొగ్గు చూపించారు. దీనికంటే ముందు 2020 జూలై నుంచి 2021 ఫిబ్రవరి వరకు ఎనిమిది నెలల కాలంలో ఈక్విటీ పథకాల నుంచి నికరంగా రూ.46,791 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. ► ఈక్విటీల్లో దాదాపు అన్ని రకాల పథకాలు మార్చి మాసంలో నికరంగా పెట్టుబడులు ఆకర్షించాయి. అత్యధికంగా మల్టీక్యాప్ కేటగిరీ పథకాల్లోకి రూ.9,695 కోట్లు వచ్చాయి. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కొత్తగా మల్టీక్యాప్ ఫండ్‌ను ప్రారంభించి రూ.8,170 కోట్లను ఆకర్షించడం అధిక పెట్టుబడుల రాకకు కలిసొచ్చింది. ► లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్, లార్జ్‌క్యాప్ ఫండ్స్ విభాగాలు ఒక్కోటీ రూ.3,000 కోట్లకు పైనే ఆకర్షించాయి. ► ఈటీఎఫ్ పథకాల్లోకి ఫిబ్రవరిలో రూ.10,719 కోట్లు వస్తే, మార్చిలో రాక రూ.6,907 కోట్లకు పరిమితమయ్యాయి. ఇండెక్స్, ఈటీఎఫ్ విభాగాలు రెండింటిలోకి కలిపి రూ.19,219 కోట్లు వచ్చాయి. ► డెట్ విభాగం నుంచి నికరంగా రూ.1.15లక్షల కోట్లు బయటకు వెళ్లాయి. ఫిబ్రవరిలో రూ.8,274 కోట్లు నికరంగా ఈ విభాగంలోకి వచ్చాయి. ► లిక్విడ్ ఫండ్స్‌లోకి మార్చి నెలలో రూ.44,604 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఫిబ్రవరిలో ఈ మొత్తం రూ.40,273 కోట్లుగా ఉన్నాయి. ► క్రెడిట్ రిస్క్ పథకాలు రూ.399 కోట్లను ఆకర్షించాయి. ఫిబ్రవరిలో వీటి నుంచి ఇన్వెస్టర్లు నికరంగా రూ.388 కోట్లను ఉపసంహరించుకోవడం గమనార్హం. ► మొత్తం మీద మ్యూచువల్ పండ్ పరిశ్రమ నుంచి మార్చిలో రూ.69,883 కోట్ల పెట్టుబడులు బయటకు వెళ్లిపోయాయి. అంతకు ముందు నెలలో నికర పెట్టుబడి రాక రూ.31,533 కోట్లుగా ఉంది. ► అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) విలువ ఫిబ్రవరి చివరికి ఉన్న రూ.38.56 లక్షల కోట్ల నుంచి మార్చి చివరికి రూ.37.7 లక్షల కోట్లకు తగ్గింది. సిప్ పెట్టుబడులూ ఆల్‌టైమ్ గరిష్టం సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలోనూ భారీగా రూ.12,328 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది కూడా నెలవారీగా అత్యధిక పెట్టుబడులు కావడం గమనార్హం. ప్రస్తుత అనిశ్చితుల్లోనూ సిస్ పెట్టుబడులు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరడం ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని ప్రతిఫలిస్తోందని నిపుణులు అంటున్నారు. రిస్క్ తీసుకునే ధోరణి పెరిగింది.. ‘‘రష్యా–ఉక్రెయిన్ సంక్షోభం మార్కెట్లలో అనిశ్చితులకు దారితీసింది. దీంతో అధిక కేటాయింపులు చేసుకునేందుకు, ప్రస్తుత పెట్టుబడుల్లో మార్పులు చేసుకునేందుకు దీన్ని ఇన్వెస్టర్లు సానుకూలంగా తీసుకున్నారు. ఈక్విటీల్లో రిస్క్ ధోరణి గరిష్టానికి చేరింది. ఇది మార్కెట్లకు, ఇన్వెస్టర్లకు దీర్ఘకాలంలో మంచిది’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఏఎంసీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అఖిల్ చతుర్వేది తెలిపారు. ‘‘చమురు ధరలు పెరగడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ఫిబ్రవరి చివర, మార్చి మొదట్లో మార్కెట్లో కరెక్షన్ వచ్చింది. దీంతో ఈక్విటీలకు కేటాయింపులు చేసుకునేందుకు ఇన్వెస్టర్ల అవకాశం ఏర్పడింది’’అని మార్నింగ్‌స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. -
గెయిల్ బైబ్యాక్ బాట
న్యూఢిల్లీ: యుటిలిటీ పీఎస్‌యూ దిగ్గజం గెయిల్ ఇండియా బోర్డు సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గురువారం(31న) సమావేశమైన బోర్డు పెయిడప్ ఈక్విటీలో 2.5 శాతం వాటాను బైబ్యాక్ చేసేందుకు ఆమోదముద్ర వేసినట్లు గెయిల్ పేర్కొంది. షేరుకి రూ. 190 ధర మించకుండా 5.7 కోట్ల షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 1,083 కోట్లవరకూ వెచ్చించనుంది. ప్రస్తుత బైబ్యాక్ ధర ఎన్ఎస్ఈలో బుధవారం(30న) ముగింపు ధరతో పోలిస్తే 24% అధికంకావడం గమనార్హం! గతంలోనూ..: గెయిల్ 2020–21 లోనూ షేరుకి రూ. 150 ధరలో రూ. 1,046 కోట్లతో షేర్ల బైబ్యాక్‌ను పూర్తి చేసింది. ప్రస్తుతం కంపెనీలో ప్రభుత్వానికి 51.8% వాటా ఉంది. దీంతో ప్రభుత్వం సైతం బైబ్యాక్‌లో పాలుపంచుకోనున్నట్లు తెలుస్తోంది. గత బైబ్యాక్‌లో ప్రభుత్వ వాటాకు రూ. 747 కోట్లు లభించిన సంగతి తెలిసిందే. కాగా.. 2021–22లో కంపెనీ మధ్యంతర డివిడెండ్ కింద రికార్డ్ సృష్టిస్తూ రూ. 3,996 కోట్లు(90 శాతం) చెల్లించింది. ఇక 2009, 2017, 2018 లతోపాటు 2020లోనూ వాటాదారులకు బోనస్ షేర్లను సైతం జారీ చేసింది. ఎన్ఎస్ఈలో గెయిల్ షేరు 2 శాతం పుంజుకుని రూ. 156 వద్ద ముగిసింది. -
కంపెనీలో వారికి ఆహ్వానం పలకనున్న ఎయిర్టెల్..!
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ వ్యూహాత్మక పెట్టుబడిదారు సంస్థను ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా ప్రిఫరెన్షియల్ ఈక్విటీ షేర్ల జారీని చేపట్టనున్నట్లు సంబంధితవర్గాలు పేర్కొంటున్నాయి. పెట్టుబడుల అంశాన్ని ఈ నెల 28న(శుక్రవారం) నిర్వహించనున్న వాటాదారుల సమావేశంలో బోర్డు చర్చించనున్నట్లు తెలియజేశాయి. రుణ చెల్లింపుల ఒత్తిడి వంటి అంశాలుకాకుండా దీర్ఘకాలిక వ్యాపార ప్రణాళికలకు అనుగుణంగా మాత్ర మే పెట్టుబడిదారు సంస్థకు ఈక్విటీ జారీ యోచనలో ఉన్నట్లు వివరించాయి. వెనువెంటనే పెట్టుబడుల ఆవశ్యకత లేనప్పటికీ భారతీ ఎయిర్టెల్ ప్రిఫరెన్షియల్ ఈక్విటీ జారీ యోచన చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నట్లు జెఫరీస్ ఈక్విటీ రీసెర్చ్ నివేదికలో పేర్కొనడం గమనార్హం. ఈ వార్తల నేపథ్యంలో భారతీ ఎయిర్టెల్ షేరు బీఎస్ఈలో 3.25 శాతం లాభపడి రూ. 712 వద్ద ముగిసింది. -
వొడాఫోన్-ఐడియాలో వాటా: మాంచి ట్విస్ట్ ఇచ్చిన కేంద్రం
Govt Not Interested in Supervising Vodafone Idea Operations: భారత టెలికాం రంగంలో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దేశంలోనే మూడో అతిపెద్ద టెలికాం కంపెనీగా ఉన్న వొడాఫోన్-ఐడియా తన మేజర్ వాటాను కేంద్రం చేతికి అప్పగించింది. దీంతో కార్యనిర్వాహణ, కీలక నిర్ణయాలు ప్రభుత్వమే తీసుకోనుందని.. మంచిరోజులు రాబోతున్నాయంటూ కంపెనీ గంపెడు ఆశలు పెట్టుకుంది. ఈ తరుణంలో కేంద్రం ఆ ఆశలపై నీళ్లు జల్లింది. కంపెనీలో మేజర్ వాటా దక్కించుకున్నప్పటికీ.. వొడాఫోన్ ఐడియా కంపెనీ కార్యకలాపాల పర్యవేక్షణ, నిర్వహణలో ఎలాంటి జోక్యం చేసుకోబోమని కేంద్రం స్పష్టం చేసింది. అంతేకాదు బోర్డు నిర్ణయాలను సైతం ప్రభావితం చేయబోదని పేర్కొంది. వొడాఫోన్-ఐడియాను ప్రభుత్వ రంగ సంస్థగా మార్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. బోర్డు సీటుపై ప్రభుత్వానికి ఎలాంటి ఆసక్తి లేదు. నష్టాల్లో ఉన్న టెల్కో స్థిరపడిన వెంటనే.. నిష్క్రమించాలని ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని సీనియర్ అధికారులు చెబుతున్నారు. ఇక వొడాడియా ఆఫర్ చేసిన వాటాను.. ప్రభుత్వ ఈక్విటీగా మార్చే విధానంపై టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) త్వరలో ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపనుందని అధికారులు వెల్లడించారు(దాదాపు ఖరారైనట్లే!). మొత్తం వడ్డీ బకాయిలను ఈక్విటీగా మార్చేయగా.. రూ. 16,000 కోట్లకుగానూ 35.8 శాతం వాటాను వొడాఫోన్-ఐడియా కంపెనీ, కేంద్రానికి అప్పజెప్పేందుకు సిద్ధమైంది. దీంతో కంపెనీలో గరిష్ఠ వాటా దక్కడంతో.. మొత్తం నిర్వహణ ప్రభుత్వమే చూసుకోనుందంటూ(మరో బీఎస్ఎన్ఎల్గా మారనుందంటూ సోషల్ మీడియాలో సెటైర్లు సైతం) కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఇదిలా ఉంటే ప్రభుత్వ చేతికి మేజర్ వాటాను అప్పజెప్పడం ద్వారా లబ్ధి పొందవచ్చని భావించిన కంపెనీకి.. అధికారుల తాజా ప్రకటనతో నిరాశే ఎదురైంది. కేవలం టెలికాం సంస్కరణల ప్యాకేజీ ద్వారా లిక్విడిటీకి తీసుకురావడం, టెలికాం కంపెనీ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడటం లాంటి చర్యలకు మాత్రమే ప్రభుత్వం పూనుకోనుందట. ఇక ఓటింగ్ హక్కులు, PSU(పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్)గా మార్చడం, డైరెక్టర్ల బోర్డులో స్థానం పొందడంలాంటి ఆలోచనలు ప్రభుత్వానికి లేదనే స్పష్టత లభించింది. మరోవైపు ఇన్వెస్టర్లలో ధైర్యం నింపేందుకే ప్రభుత్వం ఈ చర్యకు ఉపక్రమించిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.దీంతో కంపెనీ ఇక మీదట కూడా స్వతంత్రగా కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే.. కొంతకాలంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న టెలికాం రంగానికి మేలు చేసే యోచనతో గతేడాది కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమన ప్యాకేజీని ప్రకటించించింది. ఇందులో భాగంగానే టెలికం కంపెనీలు.. స్పెక్ట్రమ్ వాయిదాలు, ఏజీఆర్ బకాయిలపై చెల్లించవలసిన నాలుగేళ్ల కాలపు వడ్డీ వాయిదాలను ఎన్పీవీ ఆధారంగా ఈక్విటీకింద మార్పు చేసేందుకు అనుమతించింది. అలా ఐడియా-వొడాఫోన్ నుంచి కేంద్రం వాటా రూపంలో ఆఫర్ అందుకుంది. సంబంధిత పూర్తి కథనం: ప్రభుత్వం చేతికి వొడాఐడియా! -
ప్రభుత్వం చేతికి వొడాఐడియా!
న్యూఢిల్లీ: రుణ భారంతో సతమతమవుతున్న మొబైల్ సేవల టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వానికి 35.8 శాతం వాటా లభించనుంది. ఇందుకు వీలుగా సుమారు రూ. 16,000 కోట్ల వడ్డీ బకాయిలను ఈక్విటీగా మార్పు చేసేందుకు నిర్ణయించినట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. ఈ ప్రణాళికలు అమలైతే వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా నిలవనుంది. తాజాగా నిర్వహించిన సమావేశంలో స్పెక్ట్రమ్ వేలం వాయిదాలు, ఏజీఆర్ బకాయిలపై చెల్లించవలసిన వడ్డీని ఈక్విటీగా మార్పు చేసేందుకు బోర్డు నిర్ణయించినట్లు వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ఈ వడ్డీల ప్రస్తుత నికర విలువ(ఎన్పీవీ) రూ. 16,000 కోట్లుగా అంచనా వేసింది. ఈ అంశాలను టెలికం శాఖ(డాట్) ఖాయం చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. ప్యాకేజీ ఎఫెక్ట్ కొంతకాలంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న టెలికం రంగానికి మేలు చేసే యోచనతో గతేడాది కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమన ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా టెలికం కంపెనీలు స్పెక్ట్రమ్ వాయిదాలు, ఏజీఆర్ బకాయిలపై చెల్లించవలసిన నాలుగేళ్ల కాలపు వడ్డీ వాయిదాలను ఎన్పీవీ ఆధారంగా ఈక్విటీకింద మార్పు చేసేందుకు అనుమతించింది. ప్రస్తుతం కంపెనీ సుమారు రూ. 1.95 లక్షల కోట్ల రుణ భారంతో సవాళ్లను ఎదుర్కొంటోంది. వీటిలో వాయిదాపడిన స్పెక్ట్రమ్ బకాయిలు రూ. 1,08,610 కోట్లు, ఏజీఆర్ బకాయిలు రూ. 63,400 కోట్లు ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంది. ఇక బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల రుణాలు రూ. 22,700 కోట్లుగా నమోదయ్యాయి. రూ. 10 విలువలో ఈక్విటీ కేటాయింపులకు పరిగణనలోకి తీసుకున్న 2021 ఆగస్ట్ 14కల్లా షేరు సగటు ధర కనీస విలువకంటే తక్కువగా ఉన్నట్లు వొడాఫోన్ ఐడియా ఈ సందర్భంగా వెల్లడించింది. ప్రభుత్వానికి షేరుకి రూ. 10 చొప్పున కనీస విలువలో ఈక్విటీని జారీ చేయనున్నట్లు తెలియజేసింది. ఇందుకు డాట్ తుదిగా ధరను ఖరారు చేయవలసి ఉన్నట్లు పేర్కొంది. ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్ పద్ధతిలో షేర్లను జారీ చేయనున్నట్లు తెలియజేసింది. ఈక్విటీ కేటాయింపుతో కంపెనీ ప్రమోటర్లుసహా వాటాదారులందరిపైనా ప్రభావముంటుందని వివరించింది. వెరసి తాజా ఈక్విటీ జారీతో కంపెనీలో ప్రభుత్వానికి 35.8% వాటా లభించనున్నట్లు అంచనా వేసింది. ప్రమోటర్లలో వొడాఫోన్ గ్రూప్ 28.5%, ఆదిత్య బిర్లా గ్రూప్ 17.8 శాతం చొప్పున వాటాలను కలిగి ఉంటాయని తెలియజేసింది. ప్రభుత్వ వాటా ఇలా.. ప్రభుత్వం తమ ప్రణాళికలకు అనుగుణంగా ఈ రుణాలలో ఎంతమేర కావాలనుకుంటే అంతవరకూ ఈక్విటీకి బదులుగా ప్రిఫరెన్స్ షేర్లుగా కూడా మార్చుకునే వీలున్నట్లు వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ఇవి ఆప్షనల్‌గా, లేదా కచ్చితంగా మార్పిడి లేదా రీడీమబుల్గా ఎంచుకునే సౌలభ్యమున్నట్లు వెల్లడించింది. ఎస్‌యూయూటీఐ ద్వారా లేదా ప్రభుత్వం తరఫున ఏ ఇతర ట్రస్టీ ద్వారా అయినా ప్రభుత్వం వీటిని హోల్డ్ చేసే వీలున్నట్లు కంపెనీ వివరించింది. షేరు భారీ పతనం... ప్రభుత్వానికి వాటా జారీ వార్తల నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా కౌంటర్లో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో బీఎస్ఈలో ఈ షేరు ఇంట్రాడేలో 23 శాతంవరకూ దిగజారింది. రూ. 11.50 వద్ద కనిష్టానికి చేరింది. తదుపరి స్వల్పంగా కోలుకుని 20.5 శాతం నష్టంతో రూ. 11.80 వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈలోనూ 21 శాతం పతనమై రూ. 11.75 వద్ద స్థిరపడింది. ఫలితంగా కంపెనీ మార్కెట్ క్యాప్(విలువ)లో రూ. 8,764 కోట్లు ఆవిరైంది. రూ. 33,908 కోట్లకు పరిమితమైంది. టాటా టెలీలోనూ వాటా.. వడ్డీ చెల్లింపులకు బదులుగా ఈక్విటీ జారీ న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉపశమన ప్యాకేజీలో భాగంగా టాటా టెలిసర్వీసెస్ (మహారాష్ట్ర) వడ్డీ చెల్లింపులను ఈక్విటీగా మార్పు చేసేందుకు నిర్ణయించింది. వొడాఫోన్ ఐడియా బాటలో ఏజీఆర్ బకాయిలపై వడ్డీని ఈక్విటీగా మార్పు చేయడం ద్వారా ప్రభుత్వానికి కేటాయించనుంది. దీంతో టాటా టెలిలో ప్రభుత్వానికి 9.5 శాతం వాటా దక్కనున్నట్లు అంచనా. వడ్డీని షేర్లుగా జారీ చేసేందుకు వొడాఫోన్ ఐడియా నిర్ణయించిన వెనువెంటనే టాటా టెలి సైతం ఇదే బాటలో పయనించడం గమనార్హం! కాగా.. ఎన్పీవీ ప్రకారం దాదాపు రూ. 850 కోట్ల వడ్డీని ఈక్విటీగా కేటాయించనున్నట్లు తెలియజేసింది. బోర్డుకి చెందిన అత్యున్నత కమిటీ ఏజీఆర్ బకాయిలపై వడ్డీని పూర్తిగా ఈక్విటీగా మార్పు చేసేందుకు నిర్ణయించినట్లు వెల్లడించింది. షేర్ల జారీకి పరిగణించే 2021 ఆగస్ట్ 14కల్లా డాట్ మార్గదర్శకాల ప్రకారం సగటు షేరు ధర రూ. 41.50గా మదింపు చేసినట్లు తెలియజేసింది. అయితే ఇందుకు తుదిగా డాట్ అనుమతించవలసి ఉన్నట్లు పేర్కొంది. 2021 సెప్టెంబర్‌కల్లా కంపెనీలో ప్రమోటర్ల వాటా 74.36 శాతంగా నమోదైంది. మిగిలిన వాటా పబ్లిక్ వద్ద ఉంది. షేరు జూమ్... ప్రభుత్వానికి వాటా జారీ వార్తలతో టాటా టెలి కౌంటర్‌కు డిమాండ్ పుట్టింది. బీఎస్ఈలో ఈ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 291 వద్ద ముగిసింది. కంపెనీ ఏజీఆర్ బకాయిలు రూ. 16,798 కోట్లుకాగా.. వీటిలో ఇప్పటికే రూ. 4,197 కోట్లు చెల్లించింది. కాగా.. గత వారం మొబైల్ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ వడ్డీ చెల్లింపులకు బదులుగా ఈక్విటీ జారీ అవకాశాన్ని వినియోగించుకోబోమని స్పష్టం చేసిన విషయం విదితమే. -
ఎఫ్‌డీఐల రాకలో 62 శాతం వృద్ధి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి నాలుగు నెలల్లో దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) రాకలో 62 శాతం వృద్ధి నమోదైనట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలంలో 16.92 బిలియన్ డాలర్ల మేర ఎఫ్‌డీఐలు రాగా, ఈ ఏడాది 27.37 బిలియన్ డాలర్ల మేర వచ్చాయి. ఎఫ్‌డీఐ ఈక్విటీల రాక 112 శాతం పెరిగింది. గత ఏడాది ఇదే కాలానికి 9.61 బిలియన్ డాలర్లు రాగా, ఈ ఏడాది 20.42 బిలియన్ డాలర్ల మేర వచ్చాయి. ఎఫ్‌డీఐ ఈక్విటీల రాకలో ఆటోమొబైల్ పరిశ్రమ 23 శాతంతో అగ్రస్థానంలో నిలవగా, కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ పరిశ్రమ 18 శాతంతో ద్వితీయ స్థానంలో నిలిచింది. సేవారంగం 10 శాతంతో తృతీయ స్థానంలో నిలిచింది. ఆటోమొబైల్ పరిశ్రమలోకి వచ్చిన మొత్తం ఎఫ్‌డీఐ ఈక్విటీలో 87 శాతం కర్ణాటక నుంచే నమోదైంది. తొలి నాలుగు నెలల్లో మొత్తం ఎఫ్‌డీఐ ఈక్విటీల్లో కర్ణాటకకు 45 శాతం, మహారాష్ట్రకు 23 శాతం, ఢిల్లీకి 12 శాతం వచ్చాయి. ఎఫ్‌డీఐ ఈక్విటీల రాకలో టాప్–10 రాష్ట్రాలు.. మహారాష్ట్ర (27 శాతం), గుజరాత్ (25), కర్ణాటక (20), ఢిల్లీ (11), తమిళనాడు (4), హరియాణా (3), జార్ఖండ్ (3), తెలంగాణ (2), పంజాబ్ (1), పశ్చిమ బెంగాల్ (1శాతం)తో తొలి పది స్థానాల్లో ఉన్నాయి. 8వ స్థానంలో నిలిచిన తెలంగాణకు తొలి మూడు నెలల్లో రూ. 4,226 కోట్ల మేర ఎఫ్‌డీఐలు వచ్చాయి. 2019 అక్టోబర్ నుంచి 2021 జూన్ మధ్య మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు, హర్యానా, జార్ఖండ్, తెలంగాణ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, యూపీ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ ఎఫ్‌డీఐల రాకలో తొలి 15 స్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌కు ఈ కాలంలో రూ. 2,577 కోట్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సమకూరాయి. తెలంగాణకు రూ. 17,709 కోట్ల మేర ఎఫ్‌డీఐలు వచ్చాయి. చదవండి: చలో ఆఫీస్..! .. డెలాయిట్ సర్వేలో ఆసక్తికర అంశాల వెల్లడి -
స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్.. పెట్టుబడికి ఏదీ మంచిది ?
నేను యాక్సిస్ మిడ్‌క్యాప్, యాక్సిస్ బ్లూచిప్, మిరేఅస్సెట్ ట్యాక్స్ సేవర్ పథకాల్లో గత రెండేళ్ల నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. రాబడుల విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నాను. అయితే, కొన్ని కంపెనీల షేర్లు సైతం ఇదే కాలంలో 100–200 శాతం పెరగడాన్ని గమనించాను. కనుక మంచి రాబడుల కోసం నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలా లేక మ్యూచువల్ ఫండ్స్లోనా? – ప్రశాంత్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్న మూడు పథకాలు కూడా మంచివే. వీటితో కూడిన పోర్ట్‌ఫోలియో సమతూకంగానే ఉంది. అయితే, యాక్సిస్‌కు చెందిన రెండు పథకాల్లో ఏదో ఒక దానిలోనే ఇన్వెస్ట్ చేసుకుని.. ఇతర ఫండ్‌హౌస్‌కు చెందిన మరో పథకాన్ని ఎంపిక చేసుకోండి. దీనివల్ల వైవిధ్యం పెరిగి రిస్క్ తగ్గుతుంది. ఈ మూడు పథకాల్లోనూ సమానంగా ఇన్వెస్ట్ చేసి ఉంటే.. అప్పుడు మూడింట రెండొంతులు యాక్సిస్ ఫండ్ పథకాల్లోనే ఉంటుంది. ఎప్పుడైనా సంబంధిత ఫండ్‌హౌస్ పరంగా అంచనాలు తప్పితే రాబడులపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకని యాక్సిస్‌కు చెందిన ఒకే పథకంలో ఇన్వెస్ట్ చేసుకుని, రెండో పథకానికి బదులు ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్‌లో రాబడులను.. ఏ కంపెనీ షేరుతోనూ పోల్చి చూడకూడదు. మీ మ్యూచువల్ ఫండ్ పథకం పనితీరును సంబంధిత సూచీ రాబడులతోనే పోల్చి చూడాలి. అంటే మిడ్‌క్యాప్ పథకాన్ని మిడ్‌క్యాప్ ఇండెక్స్ రాబడులతోనే పోల్చి చూడాలి. నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారు కేవలం ఒకటి, రెండు కంపెనీల్లోనే పెట్టుబడులకు పరిమితం కాకూడదు. తగినంత వైవిధ్యం కోసం కనీసం 10–20 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా పోర్ట్‌ఫోలియో నిర్వహించినట్టయితే రాబడులు మోస్తరుగా ఉంటాయి. రిస్క్ కూడా తగ్గుతుంది. ఎవరైనా కానీ ఒక కంపెనీ 200 శాతం రాబడులను ఇస్తుందని పెట్టుబడులన్నింటినీ అందులోనే ఇన్వెస్ట్ చేయడం సరికాదు. 200 శాతం రాబడులకు అవకాశం ఎలా అయితే ఉంటుందో.. కొనుగోలు ధర నుంచి 60–70 శాతం పతనానికీ అవకాశం ఉంటుంది. ఈ రిస్క్‌లు అన్నింటినీ పరిగణనలోకి తీసుకునే మ్యూచువల్ ఫండ్స్ పథకాలు వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తుంటాయి. అలాంటప్పుడు రాబడులు మోస్తరు నుంచి మెరుగ్గా దీర్ఘకాలానికి ఉంటాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో రూ.10లక్షలను ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేసేందుకు ఇది సరైన సమయమేనా? నేను కనీసం పదేళ్లపాటు నా పెట్టుబడులను కొనసాగించగలను – గజేంద్ర రూ.10లక్షలు అన్నవి మీకు అంత అవసరమైనవి కాకపోతే ఒకే విడత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ, ఒకేసారి గణనీయమైన పెట్టుబడి మొతాన్ని ఇన్వెస్ట్ చేయడం సరైనది కాదు. ఒకవేళ ఒకేవిడత ఇన్వెస్ట్ చేసిన తర్వాత మార్కెట్లు కిందకు వెళితే మీరు కచ్చితంగా భయానికి లోనవుతారు. భయపడి పెట్టుబడులను నష్టాలతో వెనక్కి తీసుకోవడం వల్ల దీర్ఘకాలానికి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలన్న మీ ప్రాథమిక లక్ష్యం దెబ్బతింటుంది. కనుక క్రమంగా ఇన్వెస్ట్ చేయడం మంచిది. మీదగ్గర ఉన్న పెట్టుబడులను వచ్చే 12–15 నెలల కాలంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీకు భారీ పెట్టుబడి అనిపిస్తే 18–36 నెలల పరిధిలో పెట్టుబడులు పెట్టడాన్ని విస్తరించుకోవడం కూడా సూచనీయం. రిటైర్ అయిన వ్యక్తి క్రమ ఆదాయం కోసం ఎన్పీఎస్ టైర్–2 అకౌంట్‌ను వాడుకోవచ్చా? – ఎం.మాధుర్ ఆదాయం పన్ను పరిధిలో లేకపోతే మీ సౌకర్యం ప్రకారం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా చూస్తే ఎన్పీఎస్ సరైన ఆప్షన్ అవుతుంది. మీ అస్సెట్ అలోకేషన్ (ఏ విభాగంలో ఎంత మేర కేటా యింపులు) ఆధారంగా ఈ తరహా పెట్టుబడి అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్‌పీఎస్‌లో అందుబాటులో ఉన్న మూడు రకాల ఆప్షన్లలో సరైనది ఎంపిక చేసుకోవడం మీ బాధ్యతే. ఫిక్స్డ్ ఇన్కమ్ విభాగానికి ఎంత కేటాయింపులు చేయగలరు, ప్రభుత్వ బాండ్లు, కార్పొరేట్ బాండ్ల లో ఎంత ఇన్వెస్ట్ చేయగలరనే దాని ఆధారంగా ఎంపిక ఉంటుంది. స్థిరాదాయ పథకాల కంటే ఎక్కువ రాబడులను మీరు ఆశిస్తున్నట్టు అయితే.. మీ ఆదాయం రూ.6.5 లక్షల వరకు ఉన్నట్టయితే అప్పుడు రూ.1.5 లక్షలను పన్ను ఆదా సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీంతో మిగిలిన రూ.5లక్షలపై పన్ను చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు. ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసేట్టు అయితే ఈక్విటీలకు కేటాయింపులు 20–30% మించనీయకండి. డబ్బులను వెనక్కి తీసుకోవాలంటే కూడా స్థిరాదాయ ప్లాన్ల నుంచే తీసుకోవాలి. ఇదే మాదిరి మ్యూచువల్ ఫండ్స్‌లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. - ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ చదవండి: ఫిట్‌గా ఉన్న ఉద్యోగులకు బంపర్ఆఫర్ ప్రకటించిన జిరోదా..! -
భారత్‌పై డాలర్ల వెల్లువ ! పెరిగిన విదేశీ పెట్టుబడులు
ఇండియన్ స్టాక్ మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది. ఎంతలా అంటే ప్రపంచంలో మరే ఇతర ఈక్విటీ మార్కెట్ చూడని లాభాలను గడచిన ఏడాది కాలంలో ఇండియన్ స్టాక్ మార్కెట్ నమోదు చేసింది, ఈ సానుకూల వాతావరణానికి తగ్గట్టే విదేశీ ఇన్వెస్టర్లు సైతం ఇండియా వైపు చూస్తున్నారు. తమ పెట్టుబడులకు భారత్ అనువైన చోటుగా ఎంచుకుంటున్నారు. కేంద్ర వాణిజ్య శాఖ జారీ చేసిన వివరాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. 90 శాతం పెరుగుదల కరోనా సంక్షోభం తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. అందుకే మిగిలిన దేశాల కంటే ఇక్కడే పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఇండియాకు డాలర్ల వరద మొదలైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 22.53 బిలియన్ డాలర్లు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా వచ్చాయి. గతేడాది ఇదే సమయానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విలువ 11.84 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే ఒక్క ఏడాది కాలంలోనే పెట్టుబడులు 90 శాతం పెరిగాయి. నగదు రూపంలోనే కేంద్ర వాణిజ్య శాఖ ఇటీవల జారీ చేసిన వివరాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు మొదటి మూడు నెలలులోనే 17.57 బిలియన్ డాలర్లు నిధులు నగదు రూపంలో వచ్చాయి. అంతకు ముందు ఏడాదిలో ఇదే కాలానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నగదు విలువ కేవలం 6.56 బిలియన్ డాలర్లే. ఏడాది వ్యవధిలో నగదు రూపంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 168 శాతం పెరిగాయి. ఎక్కువగా ఈ రంగానికే విదేశీ ప్రత్యక్ష పెట్టుబుడలకు సంబంధించి నగదు రూపంలో వచ్చిన పెట్టుబడుల్లో 27 శాతం వాటాతో సింహభాగం ఆటోమొబైల్ ఇండస్ట్రీకే వచ్చాయి. ఆ తర్వాత ఐటీ రంగానికి 17 శాతం సర్వీస్ సెక్టార్‌లోకి 11 శాతం పెట్టుబడులు వచ్చాయి. కర్నాటకకు ప్రాధాన్యం విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు కర్నాటకను సేఫ్ ప్లేస్‌గా ఎంచుకుంటున్నారు. ఈ ఏడాది వచ్చిన పెట్టుబడుల్లో 48 శాతం కర్నాటక రాష్ట్రానికి తరలిపోగా ఆ తర్వాత మహారాష్ట్రకి 23 శాతం, ఢిల్లీకి 11 శాతం నిధులు వచ్చాయి. ఆటోమొబైల్, ఐటీ పరిశ్రమలు ఇక్కడ నెలకొని ఉండటం ఆ రాష్ట్రాలకు సానుకూల అంశంగా మారింది. రికవరీయే కారణం విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్‌పై ఆసక్తి చూపించడానికి ప్రధాన కారణాల్లో కోవిడ్ సంక్షోభం తర్వాత ఆర్థిక వ్యవస్థ త్వరగా రికవరీ మోడ్‌లోకి రావడం ప్రదానంగా నిలిచింది. దీనికి ఎకానమీ మూలాల పటిష్టత, కార్పొరేట్ ఆదాయాలు బాగుండడం వంటి అంశాల దన్నుగా నిలిచాయి. ఫలితంగా రిటైల్, వ్యవస్థాగత పెట్టుబడులు మార్కెట్లోకి భారీగా వస్తున్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. చదవండి : స్టాక్ మార్కెట్లో రంకెలేస్తున్న బుల్.. ప్రపంచంలో భారత్ టాప్ -
ఈక్విటీల్లో ఈపీఎఫ్‌వో రూ.7,715 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం) ఈక్విటీల్లో రూ.7,715 కోట్లను ఇన్వెస్ట్ చేసింది. కార్మిక శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌తెలి ఈ విషయాన్ని లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలిపారు. నిబంధనల ప్రకారం ఈపీఎఫ్‌వో తన నిర్వహణలోని మొత్తం నిధుల్లో 15 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే, ఈపీఎఫ్‌వో నేరుగా షేర్లలో కాకుండా ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. 2020–21లో ఈపీఎఫ్‌వో ఈక్విటీల్లో రూ.31,025 కోట్లను, 2019–20లో రూ.32,377 కోట్లు, 2018–19లో రూ.27,743 కోట్ల చొప్పున ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. -
ఈక్విటీల్లో పన్ను మినహాయింపు అధికంగా పొందాలంటే ?
క్రెడిట్ రిస్క్ ఫండ్స్, కార్పొరేట్ బాండ్స్ అంటే ఏంటీ ? ఈక్వీటీల నుంచి ఎక్కువ లాభాలు పొందాలంటే ఏం చేయాలని ఇలాంటి అంశాలపై ఇన్వెస్టర్లు, స్టాక్ మార్కెట్‌పై ఆసక్తి ఉన్న వారు అడిగిన ప్రశ్నలు, సందేహాలకు మార్కెట్ నిపుణులు , వాల్యు రీసెర్చ్ సీఈవో ధీరేంద్ర కుమార్ వివరణ మీ కోసం.. నా వయసు 60 ఏళ్లు. ఈక్విటీల్లో నా పెట్టుబడులపై గణనీయమైన రాబడులు వచ్చి ఉన్నాయి. వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలన్నది నా ఆలోచన. ఈ పెట్టుబడులను బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ లేదా డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి మళ్లించుకోవాలా? ఒకవేళ డెట్ ఫండ్స్‌కు మారేట్టు అయితే నా పెట్టుబడికి ఏదైనా రిస్క్ ఉంటుందా? రెండు నుంచి మూడు మంచి డెట్ పథకాలను సూచించగలరు? – రామకృష్ణ, భీమవరం మీ లాభాలను కాపాడుకోవాలనుకుంటే అందుకున్న ఏకైక మార్గం ఈక్విటీల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుని డెట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడమే. దాంతో మార్కెట్‌పై ఇక ఎంతమాత్రం ఆధారపడి ఉండరు. ఈక్విటీల్లో స్వల్పకాలంలోనే అధిక రిస్క్ ఉంటుందని అర్థం చేసుకోవాలి. అంతేకానీ, దీర్ఘకాలంలో అంత రిస్క్ ఉండదు. మీరు 60 ఏళ్లకు వచ్చి, గణనీయమైన రాబడులను ఈక్విటీల్లో సంపాదించుకున్నారు కనుక.. భవిష్యత్తులో ఈక్విటీలు కరెక్షన్ను చూస్తే విచారించకూడదనుకుంటే ఇందులో అధిక భాగాన్ని డెట్ ఫండ్స్‌కు మళ్లించడం మంచి ఆలోచనే అవుతుంది. దీనిని ప్రణాళిక మేరకు చేసుకోవాలి. అంతేకానీ, ఈక్విటీలకు మొత్తంగా దూరం అవ్వాల్సిన అవసరం లేదు. ఫిక్స్డ్ డిపాజిట్లు, డెట్ మ్యూచువల్ ఫండ్స్ మధ్య వ్యత్యాసం, వీటిల్లో ఏవి మెరుగన్నది చూస్తే.. ఫిక్స్డ్ డిపాజిట్లలో పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసినట్టయితే, వచ్చే వడ్డీ ఆదాయం పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. మీకు వర్తించే శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఆ లాభాలను తీసుకునే వరకు పన్ను వర్తించదు. ఒకవేళ డెట్ ఫండ్స్‌లో లాభాలను స్వీకరించేట్టు అయితే.. అది కూడా ఇన్వెస్ట్ చేసి మూడేళ్లలోపు అయితే.. ఆ లాభాలను కూడా ఆదాయంగా ఆదాయపన్ను చట్టం పరిగణిస్తుంది. దానిపై మీ పన్ను శ్లాబు మేరకు పన్ను చెల్లించాలి. ఒకవేళ డెట్‌లో పెట్టుబడులు మూడేళ్లకుపైగా కొనసాగించిన తర్వాత లాభాలను స్వీకరిస్తే అందులో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తీసేసిన తర్వాత మిగిలిన లాభాలపై 20 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. దీంతో ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే డెట్ ఫండ్స్‌లో రాబడులపై నికరంగా పన్ను భారం తక్కువ ఉంటుంది. డెట్ ఫండ్స్‌లో ఎక్కువ పథకాలు సురక్షితమే. కానీ, రాబడులకు అవి ఎటువంటి హామీ ఇవ్వవు. వీటిల్లో రాబడులు వడ్డీ రేట్లకు అనుగుణంగానే ఉంటుంటాయి. డెట్ ఫండ్‌ను ఎంపిక చేసుకునే ముందు ఇటీవలి పనితీరును చూడకుండా.. పెట్టుబడుల్లో నాణ్యతను చూడాలి. డెట్ ఫండ్స్‌లో స్వల్పకాలం కోసం యాక్సిస్ షార్ట్ టర్మ్ ఫండ్, ఐడీఎఫ్సీ బాండ్ షార్ట్ టర్మ్ ఫండ్, ఎల్అండ్టీ షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్, హెచ్డీఎఫ్సీ షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్లను పరిశీలించొచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే వీటిల్లో మెరుగైన నికర రాబడులను ఆశించొచ్చు. క్రెడిట్ రిస్క్ ఫండ్స్, కార్పొరేట్ బాండ్స్ మధ్య వ్యత్యాసం ఏంటి? సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకునేందుకు ఏది సురక్షితమైనది? – రిషికేష్, విశాఖపట్నం క్రెడిట్ రిస్క్ ఫండ్స్, కార్పొరేట్ బాండ్ ఫండ్స్ మధ్య అంతర్లీనంగా ఉండే వ్యత్యాసం వాటి పెట్టుబడుల్లో ఉండే క్రెడిట్ రిస్కే. కార్పొరేట్ బాండ్ ఫండ్స్ మొత్తం పెట్టుబడుల్లో కనీసం 80 శాతాన్ని అత్యధిక నాణ్యత కలిగిన బాండ్లలోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ, దీనికి విరుద్ధంగా క్రెడిట్ రిస్క్ ఫండ్స్ మొత్తం పెట్టుబడుల్లో కనీసం 65 శాతాన్ని తక్కువ నాణ్యత కలిగిన బాండ్లలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ రిస్క్ ఫండ్స్ అన్నవి పెట్టుబడుల్లో అధిక రిస్క్ తీసుకుని, అధిక రాబడులను ఇచ్చే విధానంతో పనిచేస్తుంటాయి. ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉన్న కంపెనీలు నిధుల సమీకరణ కోసం జారీ చేసే బాండ్లలో ఈ పథకాలు ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఆర్థిక వ్యవస్థలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయాల్లో ఇటువంటి కంపెనీలు అసలు, వడ్డీ చెల్లింపుల్లో విఫలమయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ తరహా రిస్క్ ఉంటుంది కనుక ఆయా సంస్థలు జారీ చేసే బాండ్లపై అధిక వడ్డీ రేటును ఇన్వెస్టర్లకు ఆఫర్ చేస్తుంటాయి. కనుకనే క్రెడిట్‌రిస్క్ ఫండ్స్ ఎక్కువ రాబడులు ఇచ్చేందుకు వీలుంటుంది. దాంతో అధిక రిస్క్ వీటిల్లో ఉంటుంది. ఇక మీరు అడిగిన సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) కోసం అయితే ఈ రెండు కూడా తగినవి కావన్నది నా నమ్మకం. వీటికి బదులు లిక్విడ్ ఫండ్స్ లేదా అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ అన్నవి లిక్విడిటీ పరంగా, వడ్డీ రేట్ల అస్థితరల పరంగా కాస్త మెరుగైన ఎంపిక అవుతాయి. వాల్యు రీసెర్చ్ సీఈవో ధీరేంద్ర కుమార్ -
దివాలా కంపెనీలకు స్పెషల్ ట్యాగ్
ముంబై: కార్పొరేట్ దివాలా ప్రక్రియ ప్రారంభమైన కంపెనీల విషయంలో ఇన్వెస్టర్లకు స్పష్టతను ఇచ్చేందుకు వీలుగా దిగ్గజ స్టాక్ ఎక్సే్ంజీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ మార్గదర్శకాలు రూపొందించాయి. తద్వారా ఇలాంటి కంపెనీల లిస్టింగ్ అంశాలకు సంబంధించి సరైన సమాచారాన్ని అందించేందుకు నడుం బిగించాయి. ఇటీవల రుణ పరిష్కార ప్రణాళికల్లో భాగంగా పలు కంపెనీలు వాటాదారులకు ఎలాంటి చెల్లింపులనూ చేపట్టకుండానే తమ ఈక్విటీల డీలిస్టింగ్ లేదా రైటాఫ్, రద్దు వంటివి చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే దివాలా ప్రక్రియలో భాగంగా జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) రుణ పరిష్కార ప్రణాళికలను ఆమోదించడంలో తొలి ఆదేశాలు, తదుపరి రాతపూర్వక ఆదేశాలకు మధ్య గడువుకు ఆస్కారం ఉంటోంది. దీంతో ఎన్సీఎల్టీకి చేరిన కంపెనీలు ఈ అంశాలపై తగిన విధంగా సమాచారాన్ని అందించడంలేదని బీఎస్ఈ, ఎన్ఎస్ఈ తెలియజేశాయి. ఎన్సీఎల్టీ నుంచి రాతపూర్వక ఆదేశాలు వచ్చేవరకూ స్టాక్ ఎక్సే్ంజీలకు వివరాలను దాఖలు చేయడంలేదని వివరించాయి. ఇలాంటి సమాచారం ఎంపిక చేసిన కొంతమందికి మాత్రమే అందుతున్నదని, ఇది అస్పష్టతకు తావిస్తున్నదని తెలియజేశాయి. వెరసి మార్కెట్లలో ఈ కంపెనీల లిస్టింగ్ సమాచారంపై గందరగోళం నెలకొంటున్నట్లు పేర్కొన్నాయి. పూర్తి వివరాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ తాజాగా రూపొందించిన నిబంధనలలో భాగంగా కార్పొరేట్ రుణ పరిష్కార ప్రక్రియకు చేరిన కంపెనీలకు పూర్తిస్థాయి మార్గదర్శకాలను జారీ చేయనున్నాయి. సెబీ ఎల్‌వోడీఆర్ నియంత్రణల ప్రకారం ఈ ఆదేశాలు జారీకానున్నాయి. వీటిని స్టాక్ ఎక్సే్ంజీల వెబ్సైట్లలో పొందుపరచరు. ఆయా కంపెనీల ఈమెయిల్స్‌కు పంపిస్తాయి. ఎల్‌వోడీఆర్ నిబంధనలను రిజల్యూషన్ ప్రొఫెషనల్ అమలు చేయవలసి ఉంటుంది. రుణ పరిష్కార ప్రణాళికపై నిర్ణయాలను 30 నిముషాల్లోగా దాఖలు చేయవలసి ఉంటుంది. దీంతోపాటు లిస్టెడ్ సెక్యూరిటీల వాటాదారులపై ఈ ప్రభావానికి సంబంధించి తగిన సమాచారాన్ని అందించవలసి ఉంటుంది. ఇదే సమయంలో ఆయా కంపెనీలు, రుణపరిష్కార నిపుణులు.. రిజల్యూషన్ ప్రణాళికకు చెందిన రహస్య అంశాలపట్ల ఎక్సే్ంజీలకు దాఖలు చేసేటంత వరకూ గోప్యతను పాటించవలసి ఉంటుంది. ఏదైనా కంపెనీ ఎన్సీఎల్టీకి చేరిన వెంటనే ఎక్సే్ంజీలు టాగ్ చేస్తాయి. ఇలాంటి కంపెనీల జాబితాను సైతం పొందుపరుస్తాయి. ఎన్సీఎల్టీ ఆదేశాలు ఏవైనా ఉంటే అలర్ట్‌ను ప్రకటిస్తాయి. -
యులిప్‌లకు మళ్లీ ఆదరణ
న్యూఢిల్లీ: యూనిట్ ఆధారిత బీమా పథకాలకు (యులిప్/ఈక్విటీలతో కూడిన) ఇన్వెస్టర్ల నుంచి మళ్లీ ఆదరణ పెరిగింది. కరోనా సంక్షోభ సమయంలో యులిప్‌ల్లో పెట్టుబడులు పెరిగినట్టు బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. యులిప్‌లలో పెట్టుబడుల నిర్వహణ సౌకర్యంగా ఉండడం కారణమని ఈ సంస్థ పేర్కొంది. సర్వే వివరాలను శుక్రవారం విడుదల చేసింది. ప్రతీ ముగ్గురిలో ఇద్దరు రానున్న సంవత్సరంలో యులిప్‌లలో ఇన్వెస్ట్ చేసే ఉద్దేశ్యంతో ఉన్నట్టు సర్వేలో చెప్పారు. కరోనా మొదటి దశ తర్వాత యులిప్‌ల పట్ల తమకు ఇష్టం పెరిగినట్టు 92 శాతం మంది చెప్పారు. యులిప్ ప్లాన్లు ఒకవైపు జీవిత బీమా రక్షణ కల్పిస్తూ, మరోవైపు ఈక్విటీ, డెట్ సాధనాల్లో పెట్టుబడులకు వీలు కల్పిస్తుంటాయి. ప్రీమియంలో కొంత బీమా రక్షణకు పోగా, మిగిలిన మొత్తాన్ని పాలసీదారు ఎంపిక చేసుకున్న సాధనాల్లో బీమా సంస్థ పెట్టుబడులు పెడుతుంది. నీల్సన్ ఐక్యూ సాయంతో బజాజ్ అలియాంజ్ లైఫ్ ఈ సర్వే నిర్వహించింది. మెట్రో, నాన్ మెట్రోల్లో 499 మంది నుంచి అభిప్రాయాలు స్వీకరించింది. ‘‘యులిప్‌లలో పెట్టుబడుల పురోగతిని సమీక్షించుకోవడం సులభంగా ఉంటుంది. వ్యయాలు తక్కువగా ఉంటాయి. రైడర్ లేదా టాపప్ జోడించుకోవడం, నిధులను వెనక్కి తీసుకోవడం సులభం’’ అని సర్వే తెలిపింది. ఆకర్షించే సదుపాయాలు.. మధ్యాదాయ వర్గాల వారు యులిప్‌ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు వీలుండడాన్ని ఇష్డపడుతున్నారు. 21–30 సంవత్సరాల్లోని వారు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్/క్రమానుగత పెట్టుబడుల సాధనం) రూపంలో యులిప్‌లలో ఇన్వెస్ట్ చేసేందుకు సుముఖంగా ఉన్నారు. అదే 50 ఏళ్లకు పైన వయసులోని వారు యులిప్‌లో ఒకే విడత (సింగిల్ప్రీమియం) ఇన్వెస్ట్ చేసే ఆప్షన్‌ను ఇష్టపడుతున్నారు. రూపాయి ఖర్చు లేకుండానే యులిప్‌లలో పెట్టుబడులను ఒక విభాగం నుంచి మరో విభాగానికి మార్చుకునే సదుపాయం కూడా ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఈ సౌకర్యం లేదు. ఎక్కువ మందికి నచ్చే అంశం బీమా రక్షణకుతోడు, పెట్టుబడుల అవకాశం ఉండడం. అన్ని వర్గాలకూ నచ్చే సాధనం.. ‘‘అన్ని రకాల వయసులు, ఆదాయ వర్గాలు, భౌగోళిక ప్రాంతాల్లోనూ యులిప్‌ల పట్ల ఆదరణ ఉన్నట్టు ఈ సర్వే రూపంలో తెలుస్తోంది. దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు అవకాశం ఉండడంతోపాటు, పెట్టుబడుల్లో సౌకర్యం, బీమా రక్షణ, ఉపసంహరణకు వీలు ఇవన్నీ యులిప్‌ల కొనుగోలుకు దారితీసే అంశాలు’’ అని బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ముఖ్య మార్కెటింగ్ అధికారి చంద్రమోహన్ మెహ్రా తెలిపారు. తమ దీర్ఘకాల లక్ష్యాలకు బీమా ప్లాన్లు కూడా ప్రాధాన్య సాధనంగా ఎక్కువ మంది పరిగిణిస్తున్నట్టు ఆయన చెప్పారు. -
Vijaya Diagnostic: పబ్లిక్ ఇష్యూకి సిద్ధం
ముంబై: తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన విజయ డయగ్నోస్టిక్ సెంటర్ పబ్లిక్ ఇష్యూకి రెడీ అయ్యింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు ఢిల్లీలో ఈ సంస్థకు మొత్తం 13 నగరాల్లో 80 రోగ నిర్థారణ కేంద్రాలు ఉన్నాయి. తొలిసారిగా ఈ సంస్థ నిధుల సేకరణ కోసం పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఈ మేరకు సెబికి దరఖాస్తు చేసింది. 35 శాతం విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రమోటర్ ఎస్ సురేంథ్రనాథ్‌రెడ్డితో పాటు ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేదార ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లు సంయుక్తంగా ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 3.56 కోట్ల షేర్లను విక్రయించాలని నిర్ణయించారు. దీని ద్వారా కంపెనీలో 35 శాతం షేర్లు పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. ఇందులో 5 శాతం షేర్ ప్రమోటర్ సురేంద్రనాథ్‌కి కాగా మిగిలిలిన 30 శాతం షేర్లు ప్రైవేటు ఈక్వీటీ సంస్థది. లాభాల బాటలో విజయ కేదార ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సంస్థ 2016లో విజయ డయగ్నోస్టిక్స్‌లో పెట్టుబడులు పెట్టింది. తాజా షేర్ల విక్రయం ద్వారా ఆ సంస్థ విజయ నుంచి దాదాపుగా తప్పుకోనుంది. గతేడాది విజయ డయాగ్నోస్టిక్స్ నికర లాభం రూ. 84.91 కోట్లు. అంతకు ముందు రూ. 62 కోట్ల లాభాన్ని ఆ సంస్థ ప్రకటించింది. -
చరిత్రలోనే అత్యధికంగా 81.72 బిలియన్ డాలర్లు..
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2020–21) ఈక్విటీలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు) 19 శాతం బలపడ్డాయి. దాదాపు 60 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రభుత్వ సంస్కరణలు, పెట్టుబడి అవకాశాలు, బిజినెస్‌లకు సరళ వాతావరణం ఇందుకు దోహదం చేసినట్లు కేంద్ర వాణిజ్య శాఖ తెలియజేసింది. ఈక్విటీ, ఆర్జనలను తిరిగి ఇన్వెస్ట్ చేయడం, పెట్టుబడులతో కలిపి మొత్తం ఎఫ్‌డీఐలు 10 శాతం పుంజుకున్నట్లు పేర్కొంది. వెరసి చరిత్రలోనే అత్యధికంగా 81.72 బిలియన్ డాలర్లను తాకినట్లు వెల్లడించింది. అంతక్రితం ఏడాది(2019–20)లో ఇవి 74.39 బిలియన్ డాలర్లు మాత్రమే. వీటిలో ఈక్విటీ ఎఫ్‌డీఐలు 50 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దేశాలవారీగా చూస్తే... దేశీ ఎఫ్‌డీఐలలో 29 శాతం వాటాతో సింగపూర్ టాప్ ర్యాంకులో నిలవగా.. యూఎస్ 23 శాతం, మారిషస్ 9 శాతం చొప్పున వాటాను ఆక్రమించాయి. విదేశీ ప్రత్యక్షపెట్టుబడుల విషయంలో కేంద్ర తీసుకున్న విధానపరమైన సంస్కరణలు, పెట్టుబడుల అనుకూలత, సులభతర వ్యాపార నిర్వహణ తదితర అంశాలు ఇందుకు సహకరించినట్లు వాణిజ్య శాఖ వివరించింది. వెరసి ప్రపంచ ఇన్వెస్టర్లకు ప్రాధాన్య దేశంగా భారత్ నిలుస్తున్న విషయాన్ని ఇది స్పష్టం చేస్తున్నట్లు పేర్కొంది. రంగాలవారీగా..: ఎఫ్‌డీఐలను అత్యధికంగా ఆకట్టుకున్న రంగాలలో సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ 44 శాతం వాటాతో అగ్రపథాన నిలవగా.. నిర్మాణం(మౌలిక సదుపాయాలు) 13 శాతం, సరీ్వసుల రంగం 8 శాతం చొప్పున జాబితాలో చేరాయి. రాష్ట్రాలవారీగా చూస్తే గుజరాత్‌కు 37 శాతం పెట్టుబడులు లభించగా.. 27 శాతం వాటాతో మహారాష్ట్ర రెండో ర్యాంకును కైవసం చేసుకుంది. ఈ బాటలో కర్ణాటక 13 శాతం ఎఫ్‌డీఐలను సాధించింది. -
ఇండస్‌ఇండ్‌కు తాజా పెట్టుబడులు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంకుకు తాజాగా రూ. 2,201 కోట్ల పెట్టుబడులు లభించాయి. హిందుజా గ్రూప్‌నకు చెందిన బ్యాంక్ ప్రమోటర్లు ప్రిఫరెన్షియల్ వారంట్లను ఈక్విటీగా మార్పిడి చేసుకోవడం ద్వారా ఈ నిధులను అందించారు. 2019 జూలైలో భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌ను విలీనం చేసుకున్న నేపథ్యంలో ప్రమోటర్లకు బ్యాంకు వారంట్లను జారీ చేసింది. విలీన సమయంలో ప్రమోటర్లు వారంట్లపై తొలిదశలో రూ. 673 కోట్లు చెల్లించారు. మిగిలిన రూ. 2021 కోట్లను తాజాగా విడుదల చేసినట్లు బ్యాంక్ పేర్కొంది. వారంట్లను షేరుకి రూ. 1,709 ధరలో ఈక్విటీగా మార్పిడి చేసుకున్నట్లు వెల్లడించింది. బుధవారం షేరు ముగింపు ధర రూ. 1033తో పోలిస్తే మార్పి డి ధర 65 శాతం ప్రీమియంకావడం గమనార్హం! 2019లో..: ప్రమోటర్ సంస్థలు ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్, ఇండస్ఇండ్ లిమిటెడ్‌కు దాదాపు 1.58 కోట్ల ఈక్విటీ షేర్లను కేటాయించేందుకు తాజాగా ఇండస్ఇండ్ బ్యాంక్ ఫైనాన్స్ కమిటీ అనుమతించింది. 2019 జూలై 6న ప్రమోటర్ సంస్థలకు బ్యాంకు ఇదే స్థాయిలో వారంట్లను జారీ చేసింది. వీటి విలువ రూ. 2,695 కోట్లు. ఈ సమయంలో 25% సొమ్ము (రూ.674 కోట్లు)ను ప్రమోటర్లు చెల్లించారు. కాగా.. తాజా పెట్టుబడుల నేపథ్యంలో కనీస మూలధన నిష్పత్తి 17.68 శాతానికి బలపడినట్లు బ్యాంక్ తెలియజేసింది. ఎన్ఎస్ఈలో ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు 1 శాతం లాభంతో రూ. 1,043 వద్ద ముగిసింది. -
మీ అడుగులు ఎటువైపు..
సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఎన్నో పాఠాలు నేర్పిన సంవత్సరం.. 2020. ఒక మహమ్మారి (కోవిడ్–19) వ్యక్తుల ఆర్థిక ప్రణాళికలను కుదిపేసింది. పెట్టుబడులపై దీని ప్రభావం గణనీయంగానే పడింది. ఈ అనుభవాలను పాఠాలుగా తీసుకుని.. భవిష్యత్తు పరిస్థితులపై ఒక అంచనాతో 2021 సంవత్సరానికి ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాలని భావిస్తున్నారా..? పెట్టుబడుల విషయంలో ఏ విభాగంలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా..? ఫండ్ మేనేజర్ల అభిప్రాయాల సమాహారమే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనం. ఈక్విటీలు రంగాలు.. ప్రస్తుతానికి అయితే అన్ని రకాల స్టాక్స్ ర్యాలీ చేస్తున్నాయి. కొన్ని రంగాల్లో డిమాండ్ బలంగానే ఉంది. వ్యయ నియంత్రణలు, ఆస్తుల నాణ్యత పరంగా మెరుగైన పనితీరు చూపిస్తున్నాయి. మహమ్మారిని నియంత్రించడం ఆలస్యమైనా లేదా వడ్డీ రేట్లు తక్కువ స్థాయిల్లో కొనసాగకపోయినా రంగాల వారీగా ర్యాలీ కొన్ని స్టాక్స్‌కే పరిమితం కావొచ్చు. జీడీపీ వృద్ధి తీరుపైనే మార్కెట్ రాబడులు ఆధారపడి ఉంటాయి. 2–5 ఏళ్ల కాల దృష్టితో ఇన్వెస్టర్లు పెట్టుబడుల నిర్ణయం తీసుకోవాలి. – శ్రేయాష్ దేవల్కర్, సీనియర్ ఫండ్ మేనేజర్, యాక్సిస్ ఏఎమ్‌సీ మిడ్, స్మాల్‌క్యాప్ మార్చి, జూన్ త్రైమాసికాలపై లాక్డౌన్ ప్రభావం చూపించగా.. ఆదాయాల పరంగా మిడ్, స్మాల్‌క్యాప్ కంపెనీలు 2020 సెప్టెంబర్ నాటికి మంచి రికవరీని చూపించాయి. అంతర్జాతీయంగా వెల్లువలా ఉన్న లిక్విడిటీ (నగదు లభ్యత) కూడా స్టాక్స్ ధరలను గరిష్టాలకు తీసుకెళ్లాయి. ఎర్నింగ్స్ రికవరీ ఆలస్యమవుతుందన్న అంచనాలతో మిడ్, స్మాల్‌క్యాప్ విభాగంలో.. ఇప్పటికీ బ్యాంకింగ్, ఎంటర్టైన్మెంట్, రిటైల్ స్టాక్స్ పనితీరు నిరుత్సాహకరంగానే ఉంది. కొన్ని రంగాల/స్టాక్స్ విలువలు చాలా ఎక్కువలోనే ఉన్నాయి. కనుక అధిక ఆశావాదంతో కాకుండా బలహీన కంపెనీల్లో పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఆటోమొబైల్, సిమెంట్, ఇంజనీరింగ్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విలువలు చూడ్డానికి అధికంగా ఉన్నాయి. కానీ, అవి తక్కువ ఆర్జనా సైకిల్లో (కాలంలో) ఉన్నాయి. ఆదాయాల్లో రికవరీ మొదలైతే ఇవి మంచి రాబడులను ఇవ్వగలవు. అధిక వ్యాల్యూషన్ల దృష్ట్యా ఏడాది కోసం అయితే స్మాల్, మిడ్‌క్యాప్‌లో ఇన్వెస్ట్ చేయవద్దనే సూచిస్తున్నాము. ప్రస్తుతం చూస్తున్న అనిశ్చిత పరిస్థితుల్లో 2021 సంవత్సరానికి ప్రత్యేకంగా ఏ అంచనాలు ఇవ్వడం వివేకమని భావించడం లేదు. కనీసం ఐదేళ్ల కంటే ఎక్కువ కాలానికి ఇన్వెస్టర్లు ఈ విభాగంలోని స్టాక్స్‌లో పెట్టుబడుల వైపు చూడొచ్చు. ఏ స్టాక్స్.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నాము. అంతర్జాతీయంగా టెక్నాలజీ అనుసరణ పెరగడం వీటికి కలసివస్తుంది. అలాగే, ఆరోగ్య రంగ అవసరాలు పెరగడం అమెరికాలో స్పెషాలిటీ జనరిక్స్‌కు కలసిరానుంది. కరోనా తర్వాత డిమాండ్ కోలుకోవడం ఇందుకు తోడు కానుంది. అదే విధంగా కన్జూమర్ డిస్క్రిషనరీ రంగం కూడా క్రమంగా తెరిచే ఆర్థిక వ్యవస్థతో ప్రయోజనం పొందే రంగం అవుతుంది. ఆటోమొబైల్, సిమెంట్, ఇంజనీరింగ్ పట్ల కూడా సానుకూల అంచనాతో ఉన్నాము. ఆయిల్, గ్యాస్, పవర్ యుటిలిటీలు, మెటల్స్‌కు ఈ దశలో దూరంగా ఉంటాము. – వినిత్ సంబ్రే, హెడ్ (ఈక్విటీస్), డీఎస్పీ ఇన్వెస్ట్మెంట్ డెట్ వడ్డీ రేట్లు..! రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉండడం, ఆర్బీఐ చర్యల కారణంగా విస్తారమైన నిధుల అందుబాటు నెలకొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు లిక్విడిటీ మిగులుగానే ఉంటుంది. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనుకూలతల దృష్ట్యా స్వల్ప కాలం నుంచి మధ్య కాలానికి (ఐదేళ్ల వరకు) ఈల్డ్ కర్వ్ అధికంగానే ఉండొచ్చు. పాలసీ సర్దుబాట్లు క్రమంగా ఉండొచ్చు. ఈల్డ్ కర్వ్ చాలా నిటారుగా ఉంది. ఈ పరిస్థితుల దృష్ట్యామూడేళ్ల కంటే ఎక్కువ కాల దృష్టితో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో అస్థిరతలకు సన్నద్ధంగానూ ఉండాలి. – అనురాగ్ మిట్టల్, ఐడీఎఫ్సీ ఫండ్ ఏ స్టాక్స్.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నాము. అంతర్జాతీయంగా టెక్నాలజీ అనుసరణ పెరగడం వీటికి కలసివస్తుంది. అలాగే, ఆరోగ్య రంగ అవసరాలు పెరగడం అమెరికాలో స్పెషాలిటీ జనరిక్స్‌కు కలసిరానుంది. కరోనా తర్వాత డిమాండ్ కోలుకోవడం ఇందుకు తోడు కానుంది. అదే విధంగా కన్జూమర్ డిస్క్రిషనరీ రంగం కూడా క్రమంగా తెరిచే ఆర్థిక వ్యవస్థతో ప్రయోజనం పొందే రంగం అవుతుంది. ఆటోమొబైల్, సిమెంట్, ఇంజనీరింగ్ పట్ల కూడా సానుకూల అంచనాతో ఉన్నాము. ఆయిల్, గ్యాస్, పవర్ యుటిలిటీలు, మెటల్స్‌కు ఈ దశలో దూరంగా ఉంటాము. – వినిత్ సంబ్రే, హెడ్ (ఈక్విటీస్), డీఎస్పీ ఇన్వెస్ట్మెంట్ ఏవి మెరుగు? ఇన్వెస్టర్లు తమ కాల వ్యవధి, రిస్క్ సామర్థ్యం ఆధారంగా పెట్టుబడులను మూడు బకెట్లుగా వర్గీకరించుకోవాలి. లిక్విడిటీ బకెట్‌ను స్వల్ప కాల అవసరాల కోసం కేటాయించుకోవాలి. కోర్ బకెట్ అధిక నాణ్యతతో కూడిన క్రెడిట్ లేదా డ్యురేషన్ ఫండ్స్‌తో ఉండాలి. స్థిరమైన రాబడులను అందించే విధంగా ఎంపిక ఉండాలి. ఇందుకోసం అల్ట్రాషార్ట్, మీడియం టర్మ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక శాటిలైట్ బకెట్ అన్నది దీర్ఘకాల పెట్టుబడుల కోసం ఉద్దేశించినది. మూడేళ్లకు పైన కాలానికి కేటాయింపులు చేసుకునే వారికి ఇది అనుకూలం. కొంత అస్థిరతలను తట్టుకునే విధంగా ఉండాలి. అయితే స్థూల ఆర్థిక అనిశ్చిత వాతావరణంలో, క్రెడిట్ స్ప్రెడ్స్ కుచించుకుపోయిన దృష్ట్యా క్రెడిట్ రిస్క్ ఫండ్స్ అన్నవి రిస్క్‌కు తగ్గ రాబడులు ఇవ్వవని మా అభిప్రాయం. పసిడి లార్జ్‌క్యాప్.. ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ద్రవ్య, పరపతి విధానాలు సులభంగా మారడం కారణంగా వచ్చిన స్టాక్స్ ర్యాలీ ఇది. అధిక ఫ్రీ క్యాష్ ఫ్లో (వ్యాపారంలో నగదు లభ్యత), తక్కువ రుణ భారం, అధిక ఆర్‌వోఈ (ఈక్విటీపై రాబడి) ఉన్న కంపెనీల్లోకి పెట్టుబడులు ప్రవాహంలా వచ్చాయి. గడిచిన రెండు త్రైమాసికాల గణాంకాలను పరిశీలిస్తే.. పండుగుల సీజన్‌తో ధరల పరంగా కంపెనీలకు స్వేచ్ఛ (ప్రైసింగ్ పవర్) తిరిగి లభించింది. డిమాండ్ ఎక్కువగా ఉండడానికి తోడు, ఇప్పటికీ కొన్ని రంగాల్లో సరఫరా పరంగా సమస్యలు ఇందుకు కారణమై ఉండొచ్చు. ముఖ్యంగా 2021లో ఈ డిమాండ్ నిలదొక్కుకోవడం ఎంతో ముఖ్యమైనది. తక్కువ స్థాయిల్లోనే వడ్డీ రేట్లు కొనసాగడం అనేది రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ వంటి రంగాల్లో దీర్ఘకాలిక రికవరీకి కీలకం అవుతుంది. చాలా కంపెనీల వ్యాల్యూషన్లు అధిక స్థాయిల్లోనే ఉన్నాయి. అయితే, వ్యాక్సిన్లలో పురోగతి, తక్కువ వడ్డీ రేట్లు స్థిరమైన రాబడులకు దారితీయగలవు. ర్యాలీ ముగిసినట్లేనా? కరోనా వ్యాక్సిన్ల తయారీలో పురోగతితో సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్న ఆశావహ ధోరణి ఏర్పడింది. దీంతో రిస్కీ సాధనాలకు (ఈక్విటీ తదితర) డిమాండ్ ఏర్పడడంతో బంగారం ర్యాలీ గత కొన్ని వారాలుగా నిలిచింది. అయితే, సమస్యలు ఇప్పటికీ ఉన్నాయి. పెద్ద ఎత్తున వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. వ్యాక్సిన్లను ఇవ్వడం ఆరంభించినా కూడా.. గడిచిన కొన్ని నెలల్లో ఆర్థిక వ్యవస్థకు ఏర్పడిన నష్టం ఒక్క రాత్రితో పోయేది కాదు. పూర్తిగా కోలుకునేందుకు ఐదేళ్లు పడుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా. దీనికి తోడు అభివృద్ధి చెందిన దేశాల్లో వైరస్ ఇన్ఫెక్షన్ కేసులు మరో విడత పెరిగిపోవడంతో ఆర్థిక రికవరీ బలహీనపడనుంది. మరికొన్ని నెలల పాటు ఈ అనిశ్చిత పరిస్థితులు బంగారం ధరలకు మద్దతుగా నిలుస్తాయి. బంగారం ధరల్లో అప్‌మూవ్ కరోనాకు ముందే మొదలైంది. కాకపోతే అద్భుత ర్యాలీకి కారణాల్లో కరోనా వైరస్ కూడా ఒకటి. బంగారం ధరలకు మద్దతుగా నిలిచిన స్థూల ఆర్థిక పరిస్థితులే 2021లోనూ కొనసాగనున్నాయి. అమెరికా, ఇతర పాశ్చాత్య ప్రపంచంలో కనిష్ట వడ్డీ రేట్లు దీర్ఘకాలం పాటు ఉంటాయని అంచనా వేస్తున్నాము. కనుక యూఎస్ ట్రెజరీల్లో కంటే బంగారంలో పెట్టుబడులను కలిగి ఉండడమే మెరుగైన ఆప్షన్ అవుతుంది. అనూహ్యమైన లిక్విడిటీతో ద్రవ్యోల్బణం రిస్క్ ఉండనే ఉంది. ఇది కూడా బంగారానికి మద్దతుగా నిలిచే అంశమే. గోల్డ్ ఈటీఎఫ్‌లు.. భారత్‌లో బంగారంపై పెట్టుబడుల విషయంలో ఈటీఎఫ్‌ల వాటా గతంలో 10 శాతంగా ఉంటే, 2020లో 25 శాతానికి చేరుకుంది. లాక్డౌన్ కారణంగా భౌతికంగా బంగారం కొనుగోలుకు అననుకూలతలు ఇందుకు కారణమై ఉండొచ్చు. అయితే, డిజిటైజేషన్, బంగారంలో స్వచ్ఛత, ధరలు, సౌకర్యం కూడా ఇన్వెస్టర్లను ఈటీఎఫ్‌లకు దగ్గర చేస్తోంది. కనుక ఈటీఎఫ్‌లకు ఆదరణ కొనసాగుతుంది. బంగారం అన్నది రిస్క్‌ను తగ్గించి, పోర్ట్‌ఫోలియోకు వైవిధ్యాన్నిచ్చే సాధనం. మీ పెట్టుబడుల్లో 10–15 శాతం మేర బంగారానికి ఇప్పటికీ కేటాయించనట్టయితే.. అందుకు ఇది సరైన తరుణం అవుతుంది. తక్కువ ధరల నుంచి ప్రయోజనం పొందొచ్చు. – చిరాగ్ మెహతా, సీనియర్ ఫండ్ మేనేజర్, క్వాంటమ్ ఏఎమ్‌సీ రియల్టీ ఇళ్లకు డిమాండ్ 2020 ద్వితీయ ఆరు నెలల్లో (జూలై నుంచి) నివాస గృహాలకు బలమైన డిమాండ్ నెలకొంది. ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖా తీసుకున్న చర్యలు కొనుగోలు దిశగా నిర్ణయానికి దారితీశాయి. గడిచిన కొన్ని త్రైమాసికాల్లో గృహాల ధరలు చాలా మార్కెట్లలో స్థిరంగా ఉండిపోవడం, కొన్ని చోట్ల దిద్దుబాటుకు (తగ్గడం) గురి కావడం చూశాము. దీంతో అవి అందుబాటు ధరలకు వచ్చేశాయి. తక్కువ వడ్డీ రేట్లు, ఇళ్ల ధరలు తగ్గుముఖం పట్టడం వల్ల డిమాండ్ పుంజుకుంది. కొత్త ఏడాది! ఇతర పెట్టుబడి సాధనాల పనితీరు, బడ్జెట్లో ప్రకటనలు, కేంద్రం అందించే రాయితీలు, గృహ రుణాలపై వడ్డీ రేట్లు ఇవన్నీ డిమాండ్‌ను నిర్ణయించేవే. ఆర్థిక వృద్ధిలో సానుకూల ధోరణలు కనిపిస్తున్నప్పటికీ కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన సవాళ్లు అంత త్వరగా అంతం కావు. వాణిజ్య రియల్టీ అంతర్జాతీయ, దేశీయ ఐటీ, టెక్నాలజీ రంగంలో క్రమబద్ధమైన వృద్ధి, కార్పొరేట్ల విస్తరణ కారణంగా.. ఆఫీసు స్థలాలకు వృద్ధి కొనసాగుతూనే ఉంది. కీలకమైన వాణిజ్య మార్కెట్లలో ఆఫీస్ స్పేస్ విభాగంలో లావాదేవీల్లో వృద్ధి నెలకొనడమే కాకుండా, సాధారణ స్థితి ఏర్పడుతోంది. వాణిజ్య కార్యకలాపాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటున్నందున ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నాము. – శిశిర్ బైజాల్, చైర్మన్, ఎండీ, నైట్ ఫ్రాంక్ ఇండియా -
లాభాలు తీసుకోండి.. రీబ్యాలెన్స్ చేసుకోండి
స్టాక్ మార్కెట్లు మార్చిలో చూసిన కనిష్టాల నుంచి భారీగానే రికవరీ అయ్యాయి. ఒకటి తర్వాత ఒకటి చొప్పున వివిధ రంగాల్లోని స్టాక్స్ వరుసగా ర్యాలీ బాట పడుతున్నాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు సైతం కనిష్ట స్థాయిల నుంచి గణనీయంగానే పెరిగాయి. ఇంకా పెరుగుతాయన్న ధోరణి కాకుండా.. ర్యాలీ కారణంగా ఈక్విటీ పెట్టుబడుల విలువ పెరిగిందన్న సత్యాన్ని గుర్తించాలి. దీనికి తగినట్టు పోర్ట్ ఫోలియోను సవరించుకోవడం వల్ల రిస్క్ తగ్గించుకోవచ్చు. దీన్నే పోర్ట్ పోలియో రీబ్యాలెన్స్ గా చెబుతారు. ఇన్వెస్టర్ తన లక్ష్యాలకు తగిన రాబడులను ఇచ్చే సాధనాలను ఎంచుకోవడం, అందుకు అనుగుణంగా వాటికి కేటాయింపులు చేసుకోవడం పోర్ట్ ఫోలియో అలొకేషన్ అవుతుంది. వివిధ మార్కెట్లలో రాబడుల తీరుకు అనుగుణంగా పోర్ట్ ఫోలియోలోనూ మార్పులు అవసరం అవుతాయి. ఆ వివరాలను ‘మై మనీ మంత్ర’ ఎండీ రాజ్ ఖోస్లా వివరించారు. అందరికీ అన్ని సాధనాలు ఒకే విధంగా అనుకూలంగా ఉండవు. ఉదాహరణకు రమణ (39) సాఫ్ట్వేర్ ఇంజనీర్. నెలకు సంపాదన రూ.లక్ష వరకు ఉంటుంది. సంతానం ఒకే కుమారుడు. దీంతో వీరికి ప్రతీ నెలా రూ.60వేల వరకు మిగులు కనిపిస్తోంది. మరో ఉదాహరణలో గోపాల్ (32) ఓ ఫార్మా కంపెనీ ప్రొడక్షన్ యూనిట్లో పనిచేస్తుంటాడు. నెలకు ఆదాయం రూ.40వేలు. సంతానం ఒక కుమార్తె, ఒక కుమారుడు. నెలలో మిగులు కష్టంగా ఉంటోంది. కొన్ని ఖర్చులను నియంత్రించుకుంటే రూ.5వేల వరకు పొదుపు చేసుకోగల సౌలభ్యం ఉంటుంది. ఈ రెండు కేసుల్లో ఆదాయ స్థాయిలు మారిపోయాయి. వారి అవసరాల్లోనూ, కుటుంబ సభ్యుల సంఖ్యలోనూ మార్పులు గమనించొచ్చు. వీరిలో రమణ అధిక ఆదాయ పరుడు. చిన్న కుటుంబం. బాధ్యతలు తక్కువ. కనుక రిస్క్ ఎక్కువగా తీసుకోగలడు. కనుక ఈక్విటీలకు అధిక కేటాయింపులు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ, గోపాల్ పరిస్థితి వేరు. మిగిలేదే తక్కువ. కనుక ఈక్విటీలకు ఎక్కువ కేటాయింపులు చేసుకోలేని పరిస్థితి. రిస్క్ ఎక్కువగా తీసుకోలేడు. ఇలా ప్రతీ ఒక్కరూ అవసరాలు, ఆదాయాలు, మిగులు, జీవిత లక్ష్యాలు, బాధ్యతలను అనుసరించి వారి పోర్ట్ ఫోలియో అలొకేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పోర్ట్ ఫోలియో అంటే.. ఈక్విటీ, డెట్, డిపాజిట్స్, బంగారం, రియల్ ఎస్టేట్ తదితర సాధనాల్లో పెట్టుబడులు. భిన్న సాధనాల మధ్య చేసిన కేటాయింపులను.. అవసరమైనప్పుడల్లా సమతూకం ఉండేలా మార్పులు, చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అన్ని రకాల పెట్టుబడులు ఒకే తీరులో, ఒకే దిశలో చలిస్తాయని చెప్పలేము. ఇందుకు ఈ ఏడాది తొలి ఆరు నెలలే ప్రత్యక్ష నిదర్శనం. ఈక్విటీ మార్కెట్లు మార్చి కనిష్టాల నుంచి చూస్తే 50 శాతానికి పైగా ఐదు నెలల్లో పెరిగాయి. బంగారం 20 శాతం పెరిగింది. రాబడులన్నవి ఈక్విటీ, బంగారంలో ఒకే మాదిరిగా లేకపోవడాన్ని గమనించొచ్చు. ఎవరైనా ఒకరు తమ ఆర్థిక ప్రణాళిక మేరకు.. ఈ ఏడాది జనవరిలో 60% ఈక్విటీలకు, 30 శాతం డెట్ సాధనాలకు, మరో 10 శాతం బంగారానికి కేటాయించారనుకుంటే.. ఆగస్ట్ చివరి నాటికి చూస్తే ఈక్విటీ పెట్టుబడుల శాతం 55గాను, డెట్ పెట్టుబడులు 32.5 శాతంగాను, బంగారం 12.5 శాతంగా మారి ఉంటాయి. ఇక రానున్నఆరు నెలల్లో ఈక్విటీలు మరో 5 శాతం క్షీణించి, డెట్ 7 శాతం, బంగారం 10 శాతం పెరుగుతుందనుకుంటే.. అప్పటికి ఈక్విటీల్లో 53 శాతం, డెట్‌లో 34 శాతం, బంగారంలో 14శాతంగాను ఉంటాయి. ఎంత రిస్క్ తీసుకోగలరు, ఎంత రాబడులను ఆశిస్తున్నారనే అంశాల ఆధారంగా ఈ కేటాయింపులు చేసుకుని ఉండొచ్చు. కానీ కొంత కాలానికి వీటిల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈక్విటీలకు 60% అనుకుంటే 55 శాతానికి తగ్గిపోయి, మిగిలిన రెండు సాధనాల్లోని పెట్టుబడుల విలువ పెరిగింది. ఈ వ్యత్యాసం ప్రస్తుతం చూడ్డానికి చాలా స్వల్పమే అనిపించొచ్చు. కానీ దీర్ఘకాలానికి రాబడుల పరంగా ఈ వ్యత్యాసం భారీగా ఉంటుందన్న వాస్తవాన్ని గమనించాలి. అందుకే ఈ సమయంలో పోర్ట్ ఫోలియో రీబ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈక్విటీల్లో పెట్టుబడులను తిరిగి 60 శాతానికి పెంచుకోవాలి. అందుకోసం డెట్, బంగారంలో కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలి. బుల్ రన్ చూసి అధిక ఉత్సాహంతో ఈక్విటీలకు అధిక కేటాయింపులు చేసుకుంటే ఆటుపోట్లు భారీగా పెరిగే అవకాశాన్ని ఇచ్చినట్టే అవుతుంది. ఒకవేళ స్టాక్ మార్కెట్ పెరిగిన స్థాయి నుంచి మళ్లీ పడిపోతే పెట్టుబడుల విలువ క్షీణిస్తుంది. తగిన ప్రణాళికకు మార్గం పడిన మార్కెట్లు మళ్లీ పెరగడం సహజం. కానీ, మార్కెట్లు రికవరీ అయినా కానీ, ఇన్వెస్టర్ పోర్ట్ ఫోలియోలోని ఈక్విటీ పెట్టుబడుల విలువ అదే స్థాయిలో రికవరీ అవ్వకపోవచ్చు. అందుకే ఇన్వెస్టర్ రీబ్యాలెన్స్ చేసుకోవడం అవసరం. దానివల్ల రిస్క్ ను కూడా నియంత్రించుకోవడం సాధ్యపడుతుంది. తద్వారా ఇన్వెస్టర్ విశ్వాసం మరింత పెరుగుతుంది. తన పోర్ట్ ఫోలియోలో ఏదేనీ ఒక విభాగం కరెక్షన్ లోనైనప్పుడు ఇన్వెస్టర్ భయపడిపోకుండా తన పెట్టుబడులను ప్రణాళిక మేరకు సవరించుకుని కొనసాగించుకునే వీలుంటుంది. ఈ ఏడాది మార్చిలో స్టాక్ మార్కెట్ల భారీ పతనంతో చాలా మంది ఇన్వెస్టర్లు నష్టాలను ఎదుర్కొని ఉంటారు. కానీ, క్రమశిక్షణ కలిగిన ఇన్వెస్టర్లు ఎవరైతే ఈ ఏడాది జనవరిలో తమ పోర్ట్ ఫోలియోను రీబ్యాలెన్స్ చేసుకుని ఉండి ఉంటారో వారు మంచి సక్సెస్ చవి చూసి ఉంటారు. ఎందుకంటే ఈ ఏడాది జనవరిలో ఈక్విటీ మార్కెట్లు ఆల్ టైమ్ గరిష్టాలకు చేరాయి. రీబ్యాలెన్స్ విధానం తెలిసి, దాన్ని ఆచరిస్తున్నవారు అయితే భారీగా పెరిగిన ఈక్విటీ విభాగంలో పెట్టుబడులను తగ్గించుకుని ఉండేవారు. దాంతో అనంతరం మార్చిలో భారీ పతనం తర్వాత ఈక్విటీ పెట్టుబడుల విలువ తగ్గినందున మరిన్ని పెట్టుబడులకు అవకాశం లభించేది. ఇన్వెస్ట్‌మెంట్‌పై ఆటుపోట్లను తగ్గించుకునే ప్రయత్నం మార్కెట్లలో ఆటుపోట్లను ఇన్వెస్టర్లు నియంత్రించలేరన్నది నిజం. కాకపోతే ఈ ఆటుపోట్ల ప్రభావం తమ పెట్టుబడులపై తక్కువగా ఉండేలా రిస్క్‌ను నియంత్రించుకోగలరు. ఇందుకు చేయాల్సిందల్లా పెట్టుబడుల్లో సమతుల్యం ఉండేలా చూసుకోవడమే. నిర్ణయించుకున్న మేర వివిధ సాధనాలకు పెట్టుబడుల కేటాయింపులను సవరించుకోవాలి. ఇన్వెస్ట్ చేసి, అవసరం వచ్చే నాటి వరకు వాటిని పట్టించుకోని వారితో పోలిస్తే.. క్రమానుగతంగా తమ పెట్టుబడుల కేటాయింపులను రీబ్యాలెన్స్ చేసుకునే వారే దీర్ఘకాలంలో మెరుగైన రాబడులను సొంతం చేసుకుంటున్నట్టు చారిత్రక గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఏదేనీ ఒక విభాగంలో (ఈక్విటీ లేదా డెట్ లేదా గోల్డ్) గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నప్పుడు లేదా కనీసం ఏడాదికి ఒక పర్యాయం అయినా పెట్టుబడుల కేటాయింపులను రీబ్యాలెన్స్ చేసుకోవాలన్నది నిపుణుల సూచన. ఆర్థిక సంవత్సరం చివర్లో ఈ పని చేయడం ద్వారా మూలధన లాభాల పన్ను ప్రయోజనాలు ఉంటే సొంతం చేసుకోవచ్చు. అయితే రీబ్యాలెన్స్ అన్నది రిస్క్ తగ్గించుకునేందుకే కాదు.. మరెన్నో ప్రయోజనాలు దీనివల్ల ఇన్వెస్టర్ పొందొచ్చు. అప్పటి వరకు బాగా పెరిగిన వాటి నుంచి పెట్టుబడులను తీసుకుని, ర్యాలీకి సిద్ధంగా ఉన్న నాణ్యమైన వాటిల్లోకి ప్రవేశించే అవకాశం లభిస్తుంది. చెట్టు నుంచి పుష్పాలను కోసుకుని, మళ్లీ పువ్వుల కోసం చెట్టుకు నీరు, పోషకాలు ఇచ్చినట్టే.. పెట్టుబడుల రీబ్యాలెన్స్ రాబడుల ఫలాలను ఇస్తుందని నిపుణుల సూచన. ఆర్థి క, పెట్టుబడుల వ్యవహారాలు అంత సులభమైనవి కావు. తగిన విషయ జ్ఞానంతోనే చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆర్థిక సలహాదారులను సంప్రదించడం సూచనీయం. -
హెచ్ఎస్ఐఎల్ జూమ్- జీఎంఎం పతనం
తొలుత సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ వెనువెంటనే అమ్మకాలు పెరగడంతో దేశీ స్టాక్ మార్కెట్లు పతన బాటలో సాగుతున్నాయి. కాగా.. సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించడంతో హోమ్ ఇంప్రూవ్మెంట్ ప్రొడక్టుల కంపెనీ హెచ్ఎస్ఐఎల్ లిమిటెడ్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోవైపు దేశీ అనుబంధ సంస్థలో మాతృ సంస్థ 17.59 శాతం వాటాను విక్రయానికి ఉంచడంతో ప్రాసెస్ ఎక్విప్మెంట్ దిగ్గజం జీఎంఎం ఫాడ్లర్ లిమిటెడ్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి హెచ్ఎస్ఐఎల్ షేరు లాభాలతో సందడి చేస్తుంటే.. జీఎంఎం ఫాడ్లర్ భారీ నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం.. హెచ్ఎస్ఐఎల్ లిమిటెడ్ షేరుకి రూ. 105 ధర మించకుండా ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌కు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు హెచ్ఎస్ఐఎల్ తాజాగా వెల్లడించింది. బైబ్యాక్‌లో భాగంగా 6.67 మిలియన్ షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకు రూ. 70 కోట్లవరకూ వెచ్చించనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో హెచ్ఎస్ఐఎల్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 8 శాతం జంప్‌చేసి రూ. 77 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 5.5 శాతం లాభంతో రూ. 75 వద్ద ట్రేడవుతోంది. గత 8 రోజుల్లో ఈ షేరు 29 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! జీఎంఎం ఫాడ్లర్ లిమిటెడ్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రమోటర్ గ్రూప్ సంస్థలు 17.59 శాతం వాటాను విక్రయించనున్నట్లు జీఎంఎం ఫాడ్లర్ తాజాగా పేర్కొంది. ఇందుకు ఫ్లోర్ ధర రూ. 3,500గా నిర్ణయించినట్లు తెలియజేసింది. సోమవారం ముగింపు ధర రూ. 5,241తో పోలిస్తే ఇది 33 శాతం డిస్కౌంట్‌కాగా.. నేటి నుంచి ఓఎఫ్ఎస్ ప్రారంభంకానుంది. రిటైల్ ఇన్వెస్టర్లకు ఆఫర్ బుధవారం వర్తించనుంది. కంపెనీ ప్రమోటర్లు ఫాడ్లర్ ఇంక్, మిల్లర్స్ మెషీనరీ, ఊర్మి పటేల్ సంయుక్తంగా 2.57 మిలియన్ షేర్లను విక్రయించనున్నారు. ఓఎఫ్‌ఎస్‌కు లభించే స్పందన ఆధారంగా మరో 1.52 మిలియన్ షేర్లను సైతం విక్రయించనున్నారు. తద్వారా మొత్తం 28 శాతంవరకూ వాటాను విక్రయించనున్నట్లు తెలుస్తోంది. జూన్‌కల్లా కంపెనీలో ప్రమోటర్ల వాటా 75 శాతంగా నమోదైంది. ఈ నేపథ్యంలో జీఎంఎం ఫాడ్లర్ షేరు ఎన్ఎస్ఈలో 10 శాతం పతనమైంది. కొనుగోలుదారులు కరువుకావడంతో రూ. 4,683 దిగువన ఫ్రీజయ్యింది. -
ధనుకా అగ్రి- హెచ్ఎస్ఐఎల్ బైబ్యాక్ జోష్
సరిహద్దువద్ద చైనాతో వివాదాల నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు పతన బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 261 పాయింట్లు క్షీణించి 39,042 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా అగ్రికెమికల్స్ కంపెనీ ధనుకా అగ్రిటెక్, శానిటరీవేర్, హోమ్ ఇంప్రూవ్మెంట్ ప్రొడక్టుల దిగ్గజం హెచ్ఎస్ఐఎల్ కౌంటర్లకు డిమాండ్ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ధనుకా అగ్రిటెక్ షేరుకి రూ. 1,000 ధర మించకుండా సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ధనుకా అగ్రిటెక్ తాజాగా వెల్లడించింది. బైబ్యాక్‌లో భాగంగా 10 లక్షల ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. బైబ్యాక్‌కు ఈ నెల 28 రికార్డ్ డేట్‌కాగా.. ఇందుకు రూ. 100 కోట్లను వెచ్చించనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో తొలుత ఈ షేరు ఎన్ఎస్ఈలో 9 శాతం దూసుకెళ్లి రూ. 839ను అధిగమించింది. ప్రస్తుతం 6.3 శాతం లాభంతో రూ. 817 వద్ద ట్రేడవుతోంది. హెచ్ఎస్ఐఎల్ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కి ప్రతిపాదించినట్లు హెచ్ఎస్ఐఎల్ తాజాగా వెల్లడించింది. బైబ్యాక్ ప్రతిపాదనను పరిశీలించేందుకు ఈ నెల 21న(సోమవారం) బోర్డు సమావేశమవుతున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో తొలుత హెచ్ఎస్ఐఎల్ షేరు ఎన్ఎస్ఈలో 11 శాతం జంప్‌చేసి రూ. 75ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 6 శాతం లాభంతో రూ. 72 వద్ద ట్రేడవుతోంది. కాగా.. లాక్‌డవున్‌ల కారణంగా ఈ ఏడాది క్యూ1లో హెచ్ఎస్ఐఎల్ రూ. 17 కోట్ల నికర నష్టం ప్రకటించిన విషయం విదితమే. -
మోదీ 2.0 ఏడాది పాలన: రూ.27లక్షల కోట్లను కోల్పోయిన ఇన్వెస్టర్లు
నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. ఈ ఏడాది కాలంలో దలాల్ స్ట్రీట్ ఏకంగా రూ.27లక్షల కోట్ల సంపదను కోల్పోయినట్లు గణాంకాలు చెబుతాయి. హరించుకుపోయిన ఈ మొత్తం ధనం దేశ జీడీపీలో 13.5శాతంగా ఉంది. కోవిడ్ సంక్షోంభంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఇటీవల కేంద్ర ప్రకటించిన రూ.20లక్షల కోట్ల పోలిస్తే 35శాతం ఈ మొత్తం విలువ అధికం. ఇదే ఏడాదిలో ప్రతి 10స్టాకుల్లో 9 స్టాకులు నెగిటివ్ రిటర్న్‌లను ఇచ్చాయి. ఇదే సమయంలో బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల్లో కేవలం 10శాతం కంపెనీల షేర్లు మాత్రం రెండంకెల ఆదాయాలను ఇచ్చాయి. మోదీ ఏడాది పాలనకు 10మార్కులకు 7 మార్కులిచ్చిన హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ దీపక్ జైసనీ మాట్లాడుతూ ‘‘ ప్రభుత్వ పనితీరు నిర్ధారణకు మార్కెట్-క్యాపిటలైజేషన్ ప్రమాణికం కాదు. మార్కెట్ల పనితీరు కేవలం ప్రభుత్వ పాలసీ మీద మాత్రమే ఆధాపడి ఉండదు. అంతర్జాతీయ పరిణామాలు, నిబంధనలు, అంతరాయాలతో పాటు ఇతర అనేక అంశాలు మార్కెట్లను ప్రభావితం చేస్తాయి.’’అని అన్నారు. -
స్త్రీని ఉపాసించే సంస్కృతి మనది
మానవుడిని మాధవుడిగా మార్చే సనాతన ధర్మంలోని గొప్పతనాన్ని సామాన్యుల చెంతకు తీసుకువెళ్లాలి ... తద్వారా సమాజంలో శాంతిని నెలకొల్పాలి అనే లక్ష్యంతో ఆధ్యాత్మిక ప్రవచన జ్ఞానయజ్ఞాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు సామవేదం షణ్ముఖశర్మ. గుంటూరులో యోగవాశిష్టం పై ప్రవచనం చేస్తున్న సందర్భంగా ‘మానవుడు ఆధ్యాత్మిక మార్గంలో ఎందుకు నడవాలి’, ‘పురాణాలలో స్త్రీమూర్తికి ఇచ్చిన స్థానం ఏంటి’ తదితర సందేహాలకు వారు ఇచ్చిన సమాధానాలు సాక్షికి ప్రత్యేకం. ఆధ్యాత్మికం అంటే ? శరీరం, ప్రాణం, మనస్సే కాకుండా ఆత్మ అనే వస్తువు ఉంది అనే జ్ఞానానికే ఆధ్యాత్మికం అని పేరు. ఆత్మ అనేది ఎప్పుడూ నశించనిది, సత్యమైనది. దాని గురించి తెలుసుకున్నవాడు భౌతిక జీవితంలో ఆనందంగా, శాంతంగా జీవించగలుగుతాడు. సైన్సు భౌతికవిజ్ఞానాన్నే చెబుతుంది. పరా విద్య ఆధ్యాత్మికం, పరమాత్మ గురించి చెబుతుంది. మనిషిలో వివేకాన్ని రగిల్చి అశాశ్వతమైన భౌతిక సుఖాల కోసం అవినీతికి, అధర్మానికి పాల్పడకుండా కాపాడే శక్తి ఆధ్యాత్మిక విజ్ఞానానికే ఉంది. ఆధ్యాత్మిక మార్గం అంటే ? భౌతికప్రపంచంలో ధర్మపరమైన అనుబంధం ఉండాలి. అంతరంగంలో ఆత్మస్వరూపుడైన భగవంతుడున్నాడనే స్పృహ ఉండాలి. ఆ స్పృహæతో భౌతిక జీవిత ధర్మాన్ని పాటించినట్లయితే అది వ్యక్తికి, సమాజానికి క్షేమం. సైన్సు సాధించలేనిది ఆధ్యాత్మికత సాధించగలదు. శరీరం పోయినా నువ్వు ఉంటావు అనే భరోసా సైన్సు ఇవ్వలేదు. ఆధ్యాత్మిక శాస్త్రం ఇస్తుంది. తప్పు, ఒప్పు గమనించే పరమాత్మ ఒకరు ఉన్నారని తెలిసాక తప్పు చేయడానికి వెనుకాడతాము. మంచి చేయడానికే ప్రయత్నిస్తాము. ఆధ్యాత్మిక మార్గం అధర్మాన్ని చేయనివ్వదు. ఒక ఓర్పును,ౖ ధైర్యాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మికం జీవితానికి అతీతమైనది కాదు. సరైన జీవితం ఆధ్యాత్మికం. భగవంతుడు అన్నిటికీ ఆతీతుడని ఋషిప్రోక్తం పురాణ కథలలో దేవతలు మానవుల్లా కోపతాపాలకు, రాగద్వేషాలకు గురయినట్లు కనబడుతుంది. దీనిని అర్థం చేసుకోవడం ఎలా ? పురాణాలను అర్థం చేసుకోవడానికి ప్రత్యేక అధ్యయనం అవసరం. మామూలు కథలలాంటివి కాదు. వాటిలో అనేక సంకేతాలు, సందేశాలు ఉంటాయి. యోగశాస్త్రం మంత్రశాస్త్రం, ధర్మశాస్త్రం, జ్యోతిశ్శాస్త్రం, తత్వశాస్త్రం, మనస్తత్వ శాస్త్రం కథల రూపంలో ఇమిడి ఉంటాయి. శివుడు, విష్ణువు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. వారి భావాలు మనలా ఉండటాన్ని లీల అంటారు. మనలా ప్రవర్తించారనడం సరికాదు. మనకు అర్థమయ్యేలా ఋషులు బోధించారు. మానవుడి స్థాయిలో జరిగితే కర్మ అంటారు. భగవంతుడి స్థాయిలో జరిగితే లీల అని చెప్పుకుంటాం. పురాణాలలో భగవంతుని లీలలు చెప్పబడ్డాయి. లీలల్లో సందేశాలు ఉంటాయి. జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం మనకు అర్థమయ్యేలా చెప్పడం కోసం ఋషులు మనకు కథల రూపంలో అందించారు. కోపాలు, తాపాలు, భావాలు అన్ని లోకాల్లో ఉంటాయి. పశువులు, మానవులు, దేవతలు వారి వారి స్థాయికి తగ్గట్టుగా ఆ భావాలు, స్పందనలు వ్యక్తమవుతాయి. దేవతలకు కలిగే భావాలు, స్పందనలు లోకక్షేమానికి దారితీస్తాయి. అంతుపట్టని భగవత్ తత్వం కూడా ఇలాంటి కథల వలన సామాన్య మానవుడికి చేరువ అవుతుంది. పురాణాలలో స్త్రీకి తక్కువ స్థానం ఇచ్చారని కొందరు విమర్శిస్తారు మీలాంటి ప్రవచకులు గొప్పస్థానాన్ని ఇచ్చారని చెబుతారు ఏది సత్యం ? భారతీయ సంస్కృతిలో స్త్రీకి ప్రాధాన్యం ఎక్కువగా ఉంది. ఇంచుమించు అన్ని పురాణాల్లో స్త్రీ పాత్రలు గొప్పగా చూపబడ్డాయి. వేదాలలో ఋషులు ఎలా ఉన్నారో, ఋషికలు అలాగే ఉన్నారు. బ్రహ్మ వాదులు ఎలా ఉన్నారో బ్రహ్మవాదినిలు ఉన్నారు. తత్వశాస్త్రంలోనూ గొప్ప స్త్రీ మూర్తులు ఉన్నారు. రాజ్యాలను నడిపేవారు, గృహసామ్రాజ్యం నడిపే పాత్రలు కోకొల్లలు కనపడతాయి. దత్త చరిత్రలో–మదాలస, త్రిపురరహస్యంలో–హేమలేఖ, యోగవాశిష్టంలో – పద్మలీల, మార్కండేయ పురాణంలో– రాజ్యాలేలిన రాణుల చరిత్ర కనపడతాయి. ప్రపంచాన్ని నడిపే శక్తిగా స్త్రీ రూపాన్ని ఉపాసన చేస్తున్నాము. స్వామి వివేకానంద స్త్రీని మాతృమూర్తిగా గౌరవించడం మన సాంప్రదాయమని బోధించారు. పురాణాలలో, వేదాలలో, ధర్మశాస్త్రంలో స్త్రీకి ఒక గౌరవస్థానం రక్షణస్థానం ఇవ్వబడ్డట్లుగా స్పష్టంగా కనపడుతుంది. ప్రశ్న భక్తులకు మీ సందేశం ? మనకున్న సంస్కృతి యుగాలనాటిది. మనిషికి కావలసిన ఇహపరమైన అన్ని విషయాలు మన గ్రంథాలలో చెప్పబడ్డాయి. అనేక శాస్త్రాల విజ్ఞాన సమన్వయం హిందూ ధర్మశాస్త్రాలలో కనపడుతుంది. వాటి ఎడల ముందుగా గౌరవభావం ఏర్పడితే తరువాత తెలుసుకోవడం జరుగుతుంది. మనిషి బౌద్ధికంగా, ఆధ్యాత్మికంగా ఎదగడానికి కావాల్సిన పూర్ణజ్ఞానం మహర్షులు మనకు ఇచ్చారు. దీనిని మతదృష్టితో కాకుండా విజ్ఞానదృష్టితో గ్రహిస్తూ దానిని ఆచరించే ప్రయత్నం చేయాలి. భారతీయులందరికీ తమ ధర్మంపై, విజ్ఞానంపై భక్తి, గౌరవ భావం ఏర్పడాలి. ఎవరి ధర్మాన్ని వారు ఆచరిస్తూ ఇతరుల ధర్మాన్ని గౌరవించాలి. ఇంకొకరి ధర్మాన్ని నిందించడం వ్యక్తిత్వ లోపమని తెలుసుకోవాలి’’ అంటూ అనుగ్రహ భాషణ చేశారు సామవేదం షణ్ముఖ శర్మ. – కోలుకొండ శ్రీకర్, సాక్షి, గుంటూరు ఈస్ట్ -
40,000 దాటిన సెన్సెక్స్
ఆదాయపు పన్ను విషయంలో, ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించిన పన్ను అంశాల్లో కూడా ఊరటనిచ్చే నిర్ణయాలను కేంద్రం తీసుకోనున్నదన్న వార్తల కారణంగా బుధవారం స్టాక్ మార్కెట్ లాభపడింది. కంపెనీల సానుకూల క్యూ2 ఫలితాలు, షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు కలసివచ్చాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 40,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,800 పాయింట్ల ఎగువకు ఎగబాకాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల నిర్ణయం నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లలో అప్రమత్తత నెలకొన్నా, మన మార్కెట్ మాత్రం ముందుకే దూసుకుపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 6 పైసలు పతనమై 70.91కు చేరినా, ఆ ప్రభావం కనిపించలేదు. బీఎస్ఈ సెన్సెక్స్ 220 పాయింట్ల లాభంతో 40,052 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 57 పాయింట్లు పెరిగి 11,844 పాయింట్ల వద్ద ముగిశాయి. ప్రభుత్వ రంగ కంపెనీలు, ఐటీ, ఆయిల్, గ్యాస్ షేర్లు పెరిగాయి. సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా నాలుగో రోజూ లాభపడ్డాయి. ఆల్‌టైమ్ హై స్థాయిలకు ఈ రెండు సూచీలు చెరో 250 పాయింట్ల దూరంలోనే ఉన్నాయి. ఈక్విటీ పన్ను సంస్కరణలు.. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ)ను రద్దు చేయనున్నారని, దీర్ఘకాల మూలధన లాభాల పన్ను(ఎల్టీసీజీ), సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్(ఎస్టీటీ)ల్లో కూడా మార్పులు, చేర్పులు చేయనున్నారన్ని వార్తలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు కారణంగా కంపెనీల క్యూ2 ఫలితాలు అంచనాలను మించుతుండటం, ప్రభుత్వ కంపెనీల్లో వాటా విక్రయం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల తగ్గింపు అంచనాలు.. ఇవన్నీ సానుకూల ప్రభావం చూపించాయి. ► భారీ రుణభారంతో ఇప్పటికే కుదేలైన టెలికం కంపెనీలకు తాజాగా ఏజీఆర్ విషయమై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో కష్టాలు మరింతగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ రంగానికి బెయిలవుట్ ప్యాకేజీ నిమిత్తం కార్యదర్శుల సంఘాన్ని కేంద్రం నియమించింది. ఈ నేపథ్యంలో టెలికం షేర్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఆరంభంలో 8.5% ఎగసిన వొడాఫోన్ ఐడియా షేర్ చివరకు 1% నష్టంతో రూ.3.81 వద్ద ముగిసింది. ఎయిర్టెల్ షేర్ 2.3% లాభంతో రూ.368 వద్ద ముగిసింది. -
మోస్తరు రిస్క్... రాబడులు ఎక్కువ!
కాస్త అధిక రాబడుల కోసం మోస్తరు రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్ల ముందున్న ఎంపికల్లో ఎస్బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ కూడా ఒకటి. తమవద్దనున్న మిగులు నిల్వలను ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా మెరుగైన రాబడులు సొంతం చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇది అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఈక్విటీ పథకం. అంటే 65 శాతం పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించి, మిగిలిన 35 శాతాన్ని డెట్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. తద్వారా ఈక్విటీ పెట్టుబడులతో అధిక రాబడులు, డెట్ పెట్టుబడులతో రిస్క్‌ను తగ్గించే విధంగా ఈ పథకం పనితీరు ఉంటుంది. గతంలో ఈ పథకం ఎస్బీఐ మ్యాగ్నం బ్యాలెన్స్డ్ ఫండ్ పేరుతో కొనసాగిందన్నది గుర్తుంచుకోవాలి. రాబడులు ఈ పథకం రాబడులు అన్ని సమయాల్లోనూ ఈక్విటీ హైబ్రిడ్ విభాగం సగటు రాబడుల కంటే అధికంగానే ఉన్నాయి. పదేళ్ల కాలంలో వార్షికంగా 13 శాతం రాబడులను ఇచ్చింది. ఇక ఐదేళ్లలో వార్షిక సగటు రాబడులు 16.7 శాతం కాగా, ఈక్విటీ హైబ్రిడ్ విభాగం సగటు రాబడులు 13.8 శాతంగానే ఉన్నాయి. ఐదేళ్లలో ఈ పథకం రాబడులు 14 శాతం, మూడేళ్లలో 12.6 శాతం చొప్పున ఉండగా, ఈ విభాగం సగటు రాబడులు ఇదే కాలంలో 11.2 శాతం, 11.1 శాతం చొప్పున ఉన్నాయి. ఈక్విటీల్లోనూ రిస్క్ తక్కువగా ఉండేందుకు లార్జ్‌క్యాప్ స్టాక్స్‌ను ఎంపిక చేసుకుంటుంది. ముఖ్యంగా కొత్తగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు, రిస్క్ మధ్యస్థంగా ఉండాలని భావించే వారికి ఈ పథకం అనుకూలంగా ఉంటుంది. పోర్ట్‌ఫోలియో ఈక్విటీ, డెట్ కలబోత కనుక భిన్న మార్కెట్ పరిస్థితులకు తగ్గట్టు పోర్ట్‌ఫోలియోను మార్చుకోవడం ఈ పథకం పనితీరులో భాగంగా గమనించొచ్చు. గత ఐదేళ్ల కాలాన్ని పరిశీలిస్తే ఈ పథకం మేనేజర్లు ఈక్విటీల కేటాయింపులను కనిష్టంగా 64 శాతం, గరిష్టంగా 72 శాతం మధ్య నిర్వహించారు. అస్థిరతల సమయాల్లో ఈక్విటీల్లో పెట్టుబడులను తగ్గించుకుని 10 శాతం వరకు నగదు నిల్వలను ఉంచుకునే వ్యూహాన్ని ఈ పథకం పాటిస్తుంది. 2017 మార్కెట్ ర్యాలీ సమయంలో ఈ పథకంలోని మొత్తం ఈక్విటీ పెట్టుబడులు 72 శాతంగా ఉండగా, 2018 కరెక్షన్ సమయానికి 64 శాతానికి పరిమితం అయ్యాయి. దీంతో బెంచ్‌మార్క్ సూచీలతో పోలిస్తే ఈ పథకం నష్టాలను తగ్గించుకుంది. ఈక్విటీ పెట్టుబడుల విషయంలో మల్టీక్యాప్ విధానాన్ని అనుసరిస్తుంది. ప్రస్తుతానికి ఈక్విటీ పెట్టుబడుల్లో 72 శాతాన్ని లార్జ్‌క్యాప్‌లోనే ఇన్వెస్ట్ చేసింది. మిగిలిన మొత్తం మిడ్, స్మాల్‌క్యాప్ కంపెనీలకు కేటాయించింది. అలాగే, పోర్ట్‌ఫోలియోలో 54 స్టాక్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈక్విటీల్లో 72 శాతం, డెట్‌లో 24.58 శాతం పెట్టుబడులు ఉండగా, మిగిలిన మొత్తం నగదు రూపంలో ఉంచుకుంది. ఇక ఈక్విటీ పెట్టుబడుల్లో 31.58 శాతం ఫైనాన్షియల్, బ్యాంకింగ్ రంగ స్టాక్స్‌లోనే ఉన్నాయి. ఆ తర్వాత సేవల రంగంలో 9 శాతం, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ రంగాలకు ఒక్కోదానికీ 5 శాతానికి పైగా కేటాయింపులు చేసింది. -
డీఎల్ఎఫ్ షేర్లను విక్రయించిన సింగపూర్ ప్రభుత్వం
న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్లో సింగపూర్ ప్రభుత్వం 6.8 కోట్ల షేర్లను విక్రయించింది. దీంతో డీఎల్ఎఫ్ షేర్ 8 శాతం వరకూ నష్టపోయింది. బ్లాక్‌డీల్ విలువ రూ.1,298 కోట్లు డీఎల్ఎఫ్ కంపెనీలో సింగపూర్ ప్రభుత్వానికి గత ఏడాది చివరి నాటికి 4.11 శాతం వాటాకు సమానమైన 7.32 కోట్ల ఈక్విటీ షేర్లున్నాయి. దీంట్లో 6.8 కోట్ల ఈక్విటీ షేర్లను ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా సింగపూర్‌ప్రభుత్వం సోమవారం విక్రయించింది. ఒక్కో షేర్ సగటు విక్రయ విలువ రూ.191 ప్రకారం ఈ మొత్తం షేర్ల విక్రయ విలువ రూ.1,298 కోట్లుగా ఉంది. ఈ షేర్లను ఫ్రాన్స్‌కు చెందిన ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సొసైటీ జనరల్, హెచ్ఎస్బీసీ, ఇతర ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారని సమాచారం. ఇటీవలి డీఎల్ఎఫ్ రూ.3,200 కోట్ల క్యూఐపీ ఇష్యూలో పాలు పంచుకున్న హెచ్ఎస్బీసీ, ఇతర సంస్థలు ఈ ఓపెన్ మార్కెట్ లావాదేవీలో కూడా డీఎల్ఎఫ్ షేర్లను కొనుగోలు చేశాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ బ్లాక్‌డీల్ నేపథ్యంలో డీఎల్ఎఫ్ షేర్ భారీగా పతనమైంది. బీఎస్ఈలో 8.4 శాతం నష్టంతో రూ.185 వద్ద ముగిసింది. -
పెట్టుబడులకు.. సిస్టమ్యాటిక్ రికరింగ్ డిపాజిట్
ఈక్విటీలు దీర్ఘకాలంలో మంచి రాబడులను ఇచ్చే సాధనం. కానీ, పెట్టుబడికి, రాబడులకు ఎప్పుడూ రిస్క్ ఎంతో కొంత ఉంటుంది. కనుక పెట్టుబడులన్నీ తీసుకెళ్లి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయకుండా, భిన్న సాధనాల మధ్య వైవిధ్యం ఉండేలా చూసుకోవాలంటూ సూచనలిస్తుంటారు ఆర్థిక సలహాదారులు. పోర్ట్‌ఫోలియో రిస్క్‌ను తగ్గించి స్థిరమైన రాబడులను ఇచ్చే సాధనాలు ఎన్నో ఉన్నాయి. వీటిని పరిశీలించినప్పుడు పెట్టుబడుల మధ్య వైవిధ్యం, సమతుల్యత కోసం రికరింగ్ డిపాజిట్(ఆర్డీ) మంచి ఆప్షన్. బ్యాంకులు అందిస్తున్న రికరింగ్ డిపాజిట్ సాధనాలను ఇన్వెస్టర్లు తమ మధ్య కాలం నుంచి దీర్ఘకాలిక అవసరాల కోసం తప్పకుండా పరిగణనలోకి తీసుకోవచ్చు. ప్రయోజనాలు... ఫిక్స్డ్ డిపాజిట్ లాభాలు ఆర్డీలోనూ ఉంటాయి. కాకపోతే దీనికి అదనంగా పెట్టుబడులకు క్రమశిక్షణ అన్నది ఆర్డీతో సాధ్యం. నిర్ణీత కాలానికి, ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది కనుక... అనవసర దుబారా కంటే పెట్టుబడికి ప్రాధాన్యం గుర్తుకొస్తు్తంది. కనీసం రూ.100 నుంచి కూడా ఆర్డీ చేసుకునేందుకు బ్యాంకులు అవకాశం ఇస్తున్నాయి. సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా, బంధన్బ్యాంకులు వంటివి తక్కువ మొత్తానికే వీలు కల్పిస్తుంటే, హెచ్డీఎఫ్సీ బ్యాంకు వంటి పెద్ద బ్యాంకులు రూ.1,000 నుంచి ఆర్డీ చేసుకునేందుకు అనుమతిస్తున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఒకేసారి ఒకే మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకోవాలి. అదే ఆర్డీ అయితే ప్రతీ నెలా ఇంత చొప్పున నిర్ణీత కాలం వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వడ్డీ రేట్లు... రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఆర్డీ టర్మ్ (కాల వ్యవధి)ను బట్టి వేర్వేరుగా ఉంటాయి. అది కూడా బ్యాంకులను బట్టి మారిపోతుంటాయి. అయితే, ఫిక్స్డ్ డిపాజిట్లకు దగ్గరగానే ఈ రేట్లు ఉండడాన్ని గమనించొచ్చు. ప్రైవేటు రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రభుత్వరంగ బ్యాంకులతో పోలిస్తే అధిక రేటు ఆఫర్ చేస్తోంది. 27–36 నెలల కోసం ఆర్డీ చేసేట్టు అయితే హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఆఫర్ చేస్తున్న రేటు 7.4%. 60 ఏళ్లు దాటిన వారికి అరశాతం వడ్డీ రేటు అదనంగా ఇస్తోంది. బంధన్ బ్యాంకు అయితే 7.65% వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్లకు 0.75% ఎక్కువ ఇస్తోంది. ఇక బ్యాంకులతోపాటు డిపాజిట్లు సేకరించే ఎన్బీఎఫ్సీలు కూడా ఆర్డీ పథకాలను అందిస్తున్నాయి. వీటిల్లో వడ్డీ రేట్లు బ్యాంకుల్లో కంటే ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఎన్బీఎఫ్సీల్లో ఆర్డీ చేసే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే బ్యాంకుల్లో చేసే రూ.లక్ష వరకు డిపాజిట్లకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ బీమా ఉంటుంది. అదే ఎన్బీఎఫ్సీల్లో చేసే డిపాజిట్లకు బీమా వర్తించదు. తమ అవసరాలకు అనుగుణంగా ఆర్డీ టర్మ్‌ను ఎంచుకోవచ్చు. చాలా బ్యాంకులు ఆరు నెలల నుంచి పదేళ్ల కాల వ్యవధి వరకు టర్మ్‌లతో కూడిన ఆర్డీలను అనుమతిస్తున్నాయి. కాకపోతే ఒక్కసారి టర్మ్ ఎంచుకున్న తర్వాత అందులో మార్పులకు అవకాశం ఉండదు. అత్యవసరాల్లో అక్కరకు ఆర్డీలో మరో వెసులుబాటు ఉంది. అత్యవసర నిధి సమకూర్చుకోని వారు, అత్యవసర సందర్భాల్లో నిధులకు ఆర్డీ అక్కరకు వస్తుంది. ఆర్డీలో ఉన్న బ్యాలెన్స్‌పై రాయితీ రేటుతో రుణం తీసుకోవచ్చు. కొన్ని బ్యాంకులు నిర్ణీత వాయిదాల తర్వాత ఓవర్‌డ్రాఫ్ట్ కల్పిస్తున్నాయి. బంధన్ బ్యాంకు 6 నెలల తర్వాత ఓవర్‌డ్రాఫ్ట్‌ను ఆఫర్ చేస్తోంది. నిర్ణీత వ్యవధికి ముందే ఆర్డీని క్లోజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. చాలా బ్యాంకులు ఇందుకు అనుమతిస్తున్నాయి. కాకపోతే అప్పటి వరకు గడించిన వడ్డీ నుంచి కొంత ఉపసంహరించుకుంటాయి. ఇది సాధారణంగా 1–2% ఉండొచ్చు. కొన్ని బ్యాంకులు దీనికి బదులు ఆర్డీ చేసినప్పుడు ఉన్న రేట్ల ప్రకారం... ఎంత కాలానికి ఆర్డీ ఉంచారో చూసి ఆ మేరకు రేటును అమలు చేస్తున్నాయి. ఈ వడ్డీని గడువు తీరాకే చెల్లిస్తున్నాయి. ఇక మూలం వద్ద పన్ను కోత(టీడీఎస్)ను ఆర్డీలకు బ్యాంకులు అమలు చేస్తున్నాయి. 2018–19 ఏడాది వరకు ఒక ఏడాదిలో వడ్డీ ఆదాయం రూ.10,000 దాటితే టీడీఎస్ అమలవుతుంది. తర్వాత నుంచి ఈ పరిమితి రూ.40,000కు పెరగనుంది. మొత్తం ఆదాయం ఆదాయపన్ను శ్లాబ్ కంటే తక్కువే ఉంటే ఫామ్ 15జీ (సీనియర్ సిటిజన్లు ఫామ్ 15హెచ్) సమర్పించడం ద్వారా టీడీఎస్ లేకుండా చూసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ విధానం మీరు ఇప్పటికే బ్యాంకు కస్టమర్ అయితే, నెట్‌బ్యాంకింగ్ ద్వారా ఆర్డీని ఆన్లైన్లో ప్రారంభించుకోవచ్చు. అలాగే, బ్యాంకు శాఖకు వెళ్లి కూడా ఆర్డీని మొదలుపెట్టొచ్చు. దరఖాస్తుతోపాటు అవసరమైన డాక్యుమెంట్లను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. నిజానికి ఆర్డీ అన్నది క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకునేందుకు అందుబాటులో ఉన్న సాధనాల్లో మంచి ఉపకరణం. కాకపోతే రెగ్యులర్‌గా వడ్డీ చెల్లించే ఆప్షన్ ఇందు లో ఉండదు. అలాగే, క్యుములేటివ్ ఇంటరెస్ట్, అసలు కలిపి గడువు తీరిన తర్వాతే చెల్లించడం జరుగుతుంది. రెగ్యులర్ఆర్డీకి అదనంగా ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఉంటే ఫ్లెక్సీ ఆర్డీ లేదా మరో ఆర్డీ ఖాతా ప్రారంభించకుంటే సరిపోతుంది. -
కార్పొరేట్లకు ‘విదేశీ’ జోష్!
న్యూఢిల్లీ: విదేశీ నిధుల బలంతో దేశీయంగా లిస్టెడ్ కంపెనీలలో వాటాల అమ్మకాలు తిరిగి జోరందుకున్నాయి. ముఖ్యంగా గత నెల రోజుల్లోనే ఏకంగా రూ.23,000 కోట్ల మేర ఈక్విటీ అమ్మకాలు చోటు చేసుకోవడం పరిస్థితి మారిందనడానికి నిదర్శనం. కొన్ని నెలల విరామం తర్వాత ఈ స్థాయిలో డీల్స్ చోటు చేసుకోవడం దేశీయ పరిశ్రమకు ఉపశమనం వంటిదని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు పేర్కొంటున్నారు. పాక్షిక వాటాల విక్రయంతోపాటు ప్రస్తుత ఇన్వెస్టర్లు కంపెనీల నుంచి పూర్తిగా తప్పుకోవడం, ప్రమోటర్ల వాటాల ఉపసంహరణలు, తాజాగా ఈక్విటీల జారీ(క్యూఐపీ)తో నిధుల సమీకరణలు కూడా ఇందులో ఉన్నాయి. ‘‘గతేడాది ద్వితీయార్ధం నుంచి మార్కెట్ సెంటిమెంట్ నిద్రాణంగా ఉండగా, గత మూడు వారాల్లో ఇది మారిపోయింది’’ అని యూబీఎస్ సెక్యూరిటీస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ హెడ్ అనుజ్ కపూర్ తెలిపారు. మార్కెట్లో ఆదరణ డచ్ ఆర్థిక సేవల కంపెనీ ఐఎన్జీ గ్రూపు కోటక్ మహీంద్రాలో తనకున్న మొత్తం 3.06 శాతం వాటాను రూ.7,160 కోట్లకు విక్రయించింది. అలాగే ఫ్రెంచ్ బ్యాంకింగ్ దిగ్గజం బీఎన్పీ పారిబాస్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో 9 శాతం వాటాను విక్రయించడం ద్వారా రూ.4,751 కోట్లను సమీకరించింది. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్‌లో బ్రిటన్‌కు చెందిన స్టాండర్డ్ లైఫ్ 5 శాతం వాటాలను రూ.3,634 కోట్లకు విక్రయించింది. రియల్టీ సంస్థ డీఎల్ఎఫ్ రూ.3,178 కోట్లు, లక్ష్మి విలాస్ బ్యాంకు రూ.421 కోట్ల మేర తాజాగా నిధుల సమీకరణను చేపట్టాయి. ఈ లావాదేవీలకు మార్కెట్లో మంచి ఆదరణే లభించడం గమనార్హం. అంతెందుకు, తాజాగా ముగిసిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫర్ ఫర్‌సేల్‌కు సైతం భారీ మద్దతు లభించింది. ఈ స్థాయిలో నిధుల రాకను మార్కెట్ సర్దుబాటు చేసుకోగలదంటున్నారు నిపుణులు. గత నెలలో ఎఫ్ఐఐలు దేశీయ ఈక్విటీల్లో చేసిన పెట్టుబడులు రూ.42,000 కోట్లుగా ఉన్నాయి. ‘‘ఇన్వెస్టర్లలో ఆసక్తి తిరిగి పుంజుకోవడంతో బ్లాక్ డీల్స్, క్యూఐపీలు చోటు చేసుకుంటున్నాయి. నిధుల సరఫరా పరిస్థితులు ఇదే విధంగా ఆశాజనకంగా ఉంటే మరిన్ని లావాదేవీలు జరగొచ్చు’’ అని ఎడెల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్స్ హెడ్ జీబీ జాకబ్ తెలిపారు. ఈ తరరహా అధిక లిక్విడిటీ మార్కెట్లోకి వచ్చినప్పుడు బ్లాక్ ట్రేడ్స్, క్యూఐపీలకు అవకాశం ఉంటుందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు అంటున్నారు. మరిన్ని నిధులు: అంతర్జాతీయ ఈక్విటీల్లో ఇటీవలి ర్యాలీ, ఎన్నికల ఫలితాల పట్ల దేశీయంగా నెలకొన్న సానుకూల సెంటిమెంట్‌తో మరిన్ని క్యూఐపీలు, బ్లాక్ డీల్స్, ఆఫర్ఫర్సేల్ చోటు చేసుకోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సానుకూల వాతావరణంతో ఐపీవో మార్కెట్లో ఇష్యూలు తిరిగి ఆరంభం అవుతాయని అనుజ్ కపూర్ తెలిపారు. ఇటీవలే ఎంబసీ నుంచి వచ్చిన తొలి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్)కు మంచి డిమాండ్ లభించిన విషయాన్ని గుర్తు చేశారు. ఐపీవో మార్కెట్‌కు కూడా అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రెండు ఐపీవోలను చేపట్టిన విషయం గమనార్హం. అయితే, ఇప్పటికిప్పుడు పెద్ద మొత్తంలో ఐపీవోలు రాకపోవచ్చన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. లిస్టెడ్ కంపెనీలకు సంబంధించి డీల్స్ ఎక్కువగా జరుగుతున్నందున ఐపీవోలు వచ్చేందుకు కొంచెం సమయం పడుతుందంటున్నారు. మొత్తం మీద ఐపీవో మార్కెట్ టర్న్‌అరౌండ్‌కు ఎక్కువ అవకాశాలున్నాయనే అభిప్రాయం పరిశ్రమ వర్గాల నుంచి వినిపిస్తోంది. -
కవ్వించి నవ్వించిన వాడి కథ
ముగ్గురు మహానటులు నటించిన సినిమాలోని దృశ్యాలివీ... ఈ సినిమాపేరేంటో చెప్పుకోండి చూద్దాం...‘‘గుండెల్లో భయంకర అగ్నిగోళాలు బ్రద్దలవుతున్నా ప్రజలను కవ్వించి నవ్విస్తా తల్లీ. అమ్మా... ధన్యోస్మీ... జగదాంబ ధన్యోస్మీ’’ అన్నాడు అతడు.ఆతరువాత భార్యాబిడ్డలతో కలిసి విజయనగరరాజ్యంలోకి ప్రవేశించాడు. ఒక సత్రంలోకి వెళ్లి...‘‘ఏవండీ...దూరం నుంచి వస్తున్నాం. బస వీలవుతుందా?’’ అని అడిగాడు నెమ్మదిగా.‘‘ఆ గదిలో బూజు దులుపుకుని ఉండండి. రెండురోజులు ఉండవచ్చు’’ అన్నాడు సత్రం నిర్వాహకుడు. తనను తాను పరిచయం చేసుకునే క్రమంలో తాను కవిని అనే విషయం చెప్పాడు అతడు.‘కవి’ అనే శబ్దం వినిపించగానే అతడికి అక్కడ అపూర్వమైన గౌరవమర్యాదలు లభించాయి. ఇది చూసి కవిగారు మురిసిపోయి...‘‘యాథారాజా తథాప్రజా అని ఊరకే అన్నారా పెద్దలు. మీ ఆదరణలో అతిథి మర్యాదలు చూస్తుంటే ఏలిన వారికి కవులంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది’’ అన్నాడు.ఆచార్య స్వాముల వారిని కలవాలని ప్రయత్నిస్తున్నారు కవిగారు. అక్కడి సిబ్బంది మాత్రం ఇతడిని బొత్తిగా ఖాతరు చేయడం లేదు.‘‘ఎవరయ్యా నువ్వు?’’ అని గద్దించాడు ఒక ఆస్థాన కవి.‘‘నాకు కవిత్వంలో కొంత ప్రవేశం ఉందండి. వారి అనుగ్రహంతో రాజాశ్రయం పొందాలని వచ్చా!’’ తాను వచ్చిన పని గురించి చెప్పారు కవిగారు.‘‘నాకు కవిత్వంలో ప్రవేశం ఉందండి’’ అనే మాట విని ఈ కవిగారిని ఆస్థాన కవిగారు ఇలా వెటకారం చేశారు...‘‘ఈ కాలంలో కవిత్వం, వైద్యం రానివాడెవ్వడులే’’ అన్నాడు. మహారాజును కలిసే వరకే అతని దురదృష్టం. ఆతరువాత అదృష్టమే ఆ కవి వెంట పరుగులు తీస్తుంది. కాని ఆ అదృష్టఘడియ ఎప్పుడు వచ్చేనో ఎలా వచ్చేనో! రాయలవారి సభ.‘‘ఏమిటి మీ విజ్ఞాపన?’’ గంభీరస్వరంతో అడిగారు మంత్రి.‘‘మా తండ్రిగారి మరణశాసనం ప్రకారం స్థిరాస్తి మాకు పంచబడింది. కాని స్థిరాస్తి మాకు పంచలేకపోతున్నారు మహాప్రభో’’ అన్నాడు రాయలవారి ముందు నిల్చున్న ముగ్గురిలో ఒకరు.‘‘కారణం?’’ అడిగారు రాయలవారు.‘‘మా తండ్రిగారి పదిహేడు ఏనుగులు... సగం పాలు నాకు, మూడో పాలు రెండో వాడికి, అందులో మూడో పాలు మూడోవాడికి రావాలి. ఈ పంపకం చేయలేక వాటిని మీ గజశాలకు తోలించారు. మాకు న్యాయం చేయండి మహాప్రభో’’ అని దీనంగా వేడుకున్నాడు ముగ్గురిలో పెద్దవాడు.రాయలవారు వెంటనే స్పందించారు: ‘‘మా పాలనలో ఎన్నడూ అన్యాయం జరగబోనివ్వం’’ అంటూ ‘‘ఈ సమస్య గురించి మీ అభిప్రాయం?’’ అని ధర్మాధికారులను అడిగాడు.‘‘ఎన్ని విధాల భాగించి చూసినా జంతుహింస చేయకుండా పాలు పంచడం సాధ్యంగా కనిపించడం లేదు మహారాజా’’ అన్నాడు ధర్మాధికారులలో ఒకరు.‘‘మరణించినవాడు మతిలేనివాడు కాదు మహాప్రభో. ప్రతిభవంతుడైనా ప్రభుభక్తిపరాయణుడు. కనుకనే సాధ్యం కాని విభాగాలలో మరణశాసనం రాశాడు. కాబట్టి ఆయన అభిమతాన్ని మన్నించి మీరు ఏనుగుల్ని స్వీకరించడం ధర్మం’’ అన్నాడు మరో ధర్మాధికారి.‘‘ధర్మం కాదు మహాప్రభో’’ బాధగా అన్నారు అన్నదమ్ముల్లో ఒకరు.‘‘ఈ మహాసభ నిర్ణయాన్ని అన్యాయమని ఆక్షేపించేది ఎవరో’’ సభను ఉద్దేశించి గట్టిగా అడిగారు మహామంత్రి.‘‘నేను’’ అంటూ ఎవరో అనామకుడు లోనికి వచ్చాడు.‘‘ఎవరు నువ్వు?’’ గద్దించారు మహామంత్రి.‘‘ఎవడో పిచ్చివాడు’’ సమాధానమిచ్చాడు ఒక పాలనాధికారి.‘‘కాదు మహాప్రభో తమ ఆశ్రితుడిని’’ అన్నాడు ఆ అనామకుడు.‘‘విద్యానగర పౌరుడివేనా?’’ అడిగారు మహామంత్రి.‘‘ప్రభువులు అనుగ్రహిస్తే అవుతాను. నియోగి బిడ్డను, ఎందుకు వినియోగించినా వినియోగపడతాను’’ అని తెలివిగా సమాధానం ఇచ్చాడు అనామకుడు. ‘‘ఎవరివయ్యా నువ్వు?’’ అని అక్కడ ఎవరో అడిగారు.తాను కృష్ణా తీరం నుంచి వచ్చాను అని, తండ్రి పేరు గార్లపాటి రామన్న మంత్రి అని చెప్పాడు ఆ యువకుడు.‘‘నువ్వు ఈ సమస్యను పరిష్కరించగలవా?’’ అడిగారు మహామంత్రి.‘‘తమకు అభ్యంతరం లేకుండా పరిష్కరిస్తాను’’ అని రంగంలోకి దిగాడు రామన్నగారి కుమారుడు.‘‘పదిహేడు ఏనుగు బొమ్మలు తెప్పించండి’’ అని అడిగాడు.అలాగే పదిహేడు ఏనుగు బొమ్మలు అతని దగ్గరకు తెచ్చారు.‘‘ఈ పదిహేడు ఏనుగుల్లో రాజుగారి ఏనుగును చేర్చడానిక మీకు ఏమైనా అభ్యంతరమా?’’ అని అడిగాడు.‘‘చేర్చడానికి వీల్లేదు. పంచేవి పదిహేడే’’ అన్నారు ఒక ధర్మాధికారి.‘‘నేను పంచేది కూడా పదిహేడే స్వామి’’ అన్నాడు యువకుడు.సభాసదులలో ఆసక్తి అంతకంతకూ పెరిగిపోయింది.‘ఇతడు ఏం చేయబోతున్నాడు?!’‘‘ఇక్కడ ఉన్నవి ఎన్ని ఏనుగులు?’’ అని అడిగాడు యువకుడు.‘‘పదిహేడు’’ అన్నాడు అక్కడ ఉన్నవారిలో ఒకడు.‘‘పదిహేడు కాదు రాజుగారి ఏనుగుతో కలిపి, వెరసి పద్దెమినిది. ఇందులో సగం పాలు పెద్దవాడికి...ఈ తొమ్మిది తీసుకో...రెండో వాడికి మూడో వంతు...అనగా ఆరు...మూడో వాడి పాలు రెండు...ఇక మిగిలింది శ్రీవారి ఏనుగు. ఇది వారి పాలు’’ అని జటిలమైన సమస్యను నిమిషాల్లో తీర్చేశాడు ఆ యువకుడు.‘‘శబ్భాష్’’ అన్నారు మెచ్చుకోలుగా రాయలవారు.ఆనందంగా ఇంటికి వచ్చాడు ఆ యువకుడు.‘‘ఆహా, రాయలవారిది ఇంద్రవైభవం కమల’’ అన్నాడు భార్యతో.‘‘ఆదరించారా?’’ అడిగింది ఆమె.‘‘అన్నాక తప్పుతుందా! వారు మహారాజు, మనల్ని కవిరాజుని చేసేశారు. మహామంత్రి అప్పాజీగారు, మా నాన్నగారు ఒకే గురువు శిష్యులట! ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. మనకు మంచి భవనం కూడా ఏర్పాటు చేస్తానన్నారు. రేపటి నుంచి మన కాపురం అక్కడే’’ అని సంతోషంగా చెప్పుకుపోతున్నాడు యువకుడు. -
లక్ష్య సాధనకు కేటాయింపులు కీలకం
దేశీ మార్కెట్లపై ఆశావహ ధోరణులు పెరుగుతున్న నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు (ఎఫ్‌పీఐ) మళ్లీ పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఏఎంసీ సీఈవో బాలసుబ్రమణియన్. అలాగే, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్) రూపంలో దేశీయంగా కూడా పెట్టుబడులు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని సాక్షి ప్రాఫిట్‌కు వివరించారు. ఈ నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఈ ఏడాది గణనీయంగా వృద్ధి నమోదు చేయొచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. రిస్కులు, ప్రయోజనాలపరంగా చూస్తే మ్యూచువల్ ఫండ్స్ మెరుగైన సాధనాలు. పొదుపు (లిక్విడ్ ఫండ్స్), రాబడి (ఫిక్స్డ్ ఇన్‌కం స్కీమ్స్), సంపద సృష్టి (ఈక్విటీ పథకాలు), పన్ను ఆదా స్కీమ్స్ (ఈఎల్ఎస్ఎస్ పథకాలు).. ఇలా అవసరం ఏదైనా ప్రతి దానికీ ఒక స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఆర్థిక లక్ష్యాలు చేరుకోవాలంటే ఎల్లవేళలా ఒకే దాంట్లో ఇన్వెస్ట్ చేయకుండా.. వివిధ సాధనాలకు కేటాయించడం శ్రేయస్కరం. ఈ నేపథ్యంలో ఫిక్స్డ్ ఇన్‌కం పథకాలు ప్రతీ ఒక్కరి పోర్ట్‌ఫోలియోలో ఉండతగినవి. ప్రస్తుతం బ్యాంకుల్లో రూ. 69 లక్షల కోట్లు ఎఫ్‌డీల రూపంలో ఉన్నాయని అంచనా. వీటితో పోలిస్తే మ్యూచువల్ ఫండ్ ఫిక్స్డ్ ఇన్‌కం పథకాలు ఇటు మెరుగైన రాబడులు అందించడంతో పాటు పన్నులపరమైన ప్రయోజనాలు కూడా ఇస్తాయి. సంస్కరణలతో ఊతం .. అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాలు, దేశీయంగా బ్యాంకుల మొండిబాకీలు పెరిగిపోవడం, రూపాయి పతనం, వ్యాపార రంగంలో సంక్షోభాలు మొదలైన వాటితో గతేడాది సవాళ్లమయంగా సాగింది. అయితే, 2019లో పరిస్థితులు ఆశావహంగానే ఉంటాయన్న అంచనాలు నెలకొన్నాయి. చమురు ధరలు కాస్త ఉపశమించడం, రూపాయి కొంత బలపడుతుండటం మొదలైనవి ఇందుకు ఊతమిస్తున్నాయి. వ్యవస్థాగతంగా ప్రవేశపెట్టిన వివిధ సంస్కరణలు క్రమంగా ఫలాలిస్తున్న నేపథ్యంలో భారత్‌పై అంతర్జాతీయ ఏజెన్సీలు కూడా ఆశావహ అంచనాలే వెలువరిస్తున్నాయి. వినియోగమే దేశ ఎకానమీ వృద్ధికి చోదకంగా నిలుస్తుందనడానికి నిదర్శనంగా ప్రైవేట్ వినియోగం ఈసారి మరింత ముఖ్యపాత్ర పోషించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం మరింతగా వ్యయం చేస్తుండటం కూడా వినియోగ వృద్ధికి ఊతమివ్వనుంది. ఇక దివాలా చట్టం అమల్లోకి వచ్చాక బ్యాంకుల ఖాతాల ప్రక్షాళన జరగడం కూడా ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు మెరుగుపడటానికి దోహదపడనుంది. ఇక జీఎస్టీ విధానం కూడా స్థిరపడితే, పన్నుల రేట్లు తగ్గిన పక్షంలో వినియోగంతో పాటు మొత్తం మీద ట్యాక్స్ చెల్లించే వారి సంఖ్య కూడా పెరిగేందుకు ఊతమిస్తుంది. సెంటిమెంట్ అంతా సానుకూలంగానే కనిపిస్తున్నప్పటికీ.. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కీలకపాత్ర పోషించనున్నాయి. ఎన్నికలు జరగడానికి ముందు, తర్వాత ఆరు నెలల డేటా పరిశీలిస్తే మార్కెట్లు పాజిటివ్‌గానే స్పందించిన దాఖలాలే ఉన్నాయి. ఏదైతేనేం.. అంతిమంగా ఫండమెంటల్స్, ఎకానమీ స్థిరత్వమే మార్కెట్ పనితీరును ప్రభావితం చేస్తుంది. -
జెట్ రుణ సంక్షోభానికి తెర!
ముంబై: నిధుల కటకట ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్ కోసం రుణదాతలు సిద్ధం చేసిన సమగ్ర ప్రణాళికకు కంపెనీ బోర్డు గురువారం ఆమోదముద్ర వేసింది. 2018 ఫిబ్రవరి 12 నాటి ఆర్బీఐ ఉత్తర్వుల మేరకు ఈ రుణ పరిష్కార ప్రణాళికను రూపొందించినట్టు జెట్ ఎయిర్వేస్ తెలియజేసింది. తాజా ఈక్విటీ రూపంలో నిధులు అందించడం, ఇప్పటికే ఇచ్చిన రుణాలను పునరుద్ధరించడం, ఆస్తుల విక్రయం వంటివి ఈ ప్రణాళికలో భాగం. ఈ చర్యల అనంతరం బ్యాంకులో అతిపెద్ద వాటాదారులు రుణ దాతలే అవుతారు. రుణాలను ఈక్విటీ రూపంలోకి మార్చడం కింద... రూ.10 ముఖ విలువ కలిగిన 11.40 కోట్ల షేర్లను కంపెనీ జారీ చేయనుంది. కాకపోతే పుస్తక విలువ ప్రతికూలంగా ఉన్నందున ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం షేరు ముఖ విలువను రూ.1 కింద పరిగణనలోకి తీసుకుంటారు. జెట్ ఎయిర్వేస్ సుమారు రూ.8,500 కోట్ల రుణాలను చెల్లించాల్సి ఉంది. ఇందులో వచ్చే మార్చి నాటికే తిరిగి చెల్లించాల్సిన మొత్తం రూ.1,700 కోట్లు. తన పనితీరు మెరుగుపరుచుకోవడం, ఆదాయాన్ని పెంచుకోవడం, వ్యయాలను తగ్గించుకోవడం, నెట్వర్క్, సేవలకు సంబంధించిన వ్యాపార నమూనాలో మార్పుల వంటి చర్యలు కూడా ఈ ప్రణాళికలో భాగంగా ఉన్నాయి. ఈ పరిష్కార ప్రణాళికకు ఈ నెల 21న జరిగే సమావేశంలో వాటాదారుల ఆమోదాన్ని కంపెనీ కోరనుంది. నష్టాలు రూ.732 కోట్లు జెట్ ఎయిర్వేస్కి ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో స్టాండ్ అలోన్ ప్రాతిపదికన రూ.588 కోట్ల నికర నష్టాలొచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.165 కోట్ల నికర లాభం వచ్చిందని జెట్ ఎయిర్వేస్ తెలిపింది. ఇంధన వ్యయాలు అధికంగా ఉండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం వల్ల ఈ క్యూ3లో భారీగా నష్టాలు వచ్చాయని వివరించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన చూస్తే, గత క్యూ3లో రూ.186 కోట్ల నికర లాభం రాగా, ఈ క్యూ3లో రూ.732 కోట్ల నికర నష్టాలు వచ్చాయని తెలిపింది. మొత్తం ఆదాయం రూ.6,148 కోట్లు.... కంపెనీ ఆదాయం రూ.6,086 కోట్ల నుంచి రూ.6,148 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు సైతం రూ.6,043 కోట్ల నుంచి రూ.6,786 కోట్లకు పెరిగాయి. గత క్యూ3లో రూ.2,749 కోట్లుగా ఉన్న దేశీయ ఆదాయం ఈ క్యూ3లో రూ.2,560 కోట్లకు తగ్గిందని, అంతర్జాతీయ ఆదాయం కూడా రూ.3,337 కోట్ల నుంచి రూ.3,588 కోట్లకు తగ్గిందని జెట్ ఎయిర్వేస్ తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యలో బీఎస్ఈలో జెట్ ఎయిర్వేస్ షేర్ 1 శాతం లాభంతో రూ.225 వద్ద ముగిసింది. -
నేటి నుంచి యాక్సిస్ బ్యాంక్ ఓఎఫ్ఎస్
న్యూఢిల్లీ: యాక్సిస్ బ్యాంక్‌లో ఉన్న తన వాటాలో కొంత భాగాన్ని నేటి(మంగళవారం)నుంచి ప్రభు త్వం విక్రయిస్తోంది. ఎస్‌యూయూటీఐ(ద స్పెసిఫైడ్ అండర్‌టేకింగ్ ఆఫ్ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా)ద్వారా ఉన్న వాటాలో 3% వరకూ వాటాను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయించనున్నది. ఇందులో భాగంగా 1.98% వాటాకు సమానమైన 5.07 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ చేస్తోంది. దీంట్లో 10% వాటా షేర్లను రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. మరో 1.02% వాటాకు సమానమైన 2.63 కోట్ల ఈక్విటీ షేర్లను కూడా విక్రయించే అవకాశముంది. ఈ షేర్ల విక్రయానికి ఫ్లోర్ ధరగా రూ.689.52ను నిర్ణయించారు. ఇది సోమవారం ముగింపు ధర (రూ.710.35) కంటే 3% తక్కువ. వాటా విక్రయం సంస్థాగత ఇన్వెస్టర్లకు నేడు(మంగళవారం), రిటైల్ ఇన్వెస్టర్లకు బుధవారం జరుగుతుంది. -
విహార యాత్రకు ...సిప్
నా వయస్సు 40 సంవత్సరాలు. నాకు బుద్ది మాంద్యం గల ఒక కొడుకున్నాడు. తన భవిష్యత్ అవసరాల నిమిత్తం నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఎలా ప్లాన్ చేసుకోవాలో సూచించండి? –అరవింద్, విశాఖపట్టణం బుద్ది మాంద్యం గల బిడ్డ ఉంటే, ఆ బిడ్డ అవసరాల కోసం మీకు భవిష్యత్తులో భారీ మొత్తమే అవసరమవుతుంది. దీనికి గాను మీరు పెద్ద మొత్తంలోనే నిధిని ఏర్పాటు చేసుకోవాలి. అందుకని వీలైనంత అధికంగా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయండి. మార్కెట్ పతన సమయాల్లోనూ ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. మీ తదనంతరం మీ బిడ్డ అవసరాలు సజావుగా తీరేలా ఉండాలంటే, మీరు పనిచేస్తున్నంత కాలమూ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తూనే ఉండండి. మీ తదనంతరం కూడా బిడ్డ బాగోగులు చూసుకోవడం కోసం ట్రస్ట్లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి. నమ్మకమైన మిత్రులు, బంధువుల్లో ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులను ట్రస్టీలుగా నియమించి మీరు ఏర్పాటు చేసిన నిధిని మీ కొడుకు కోసం ఉపయోగపడేలా చూడండి. నేను గత పదేళ్లుగా మ్యూచువల్ ఫండ్స్‌లోనూ, షేర్లలోనూ ఇన్వెస్ట్ చేస్తూ, 30 లక్షల వరకూ కూడబెట్టాను. ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలనేది నా కల. గృహ రుణానికి సంబంధించి కొన్ని సూచనలు ఇవ్వండి. –సుధీర్, హైదరాబాద్ ఇల్లు సమకూర్చుకోవడం, రిటైర్మెంట్ నిధి ఏర్పాటు, పిల్లల ఉన్నత చదువుల కోసం ఒక ఫండ్‌ను నిర్మించుకోవడం... ఇవన్నీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు. ఈ తరహా దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీల్లోనూ. మ్యూచువల్ ఫండ్స్‌ల్లోనూ ఒక క్రమ పద్ధతిలో ఇన్వెస్ట్ చేయాలి. ఇల్లు కొనుక్కోవాలనే లక్ష్యం కోసం రూ.30 లక్షలు కూడబెట్టడం మంచి విషయమే. ఇల్లు కొనే విషయంలో మీకు కొన్ని సూచనలు. మీరు ఆ ఇంట్లో నివసించాలనుకుంటేనే ఇల్లు కొనుగోలు చేయండి. ఇలా చేస్తే, మీకు అద్దె డబ్బులు ఆదా అవుతాయి. మీరు గృహ రుణం ద్వారా ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటే రెండు ముఖ్యమైన విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. మొదటిది గృహరుణానికి సంబంధించి మీరు చెల్లించే నెలవారీ వాయిదా (ఈఎమ్ఐ) మీ నెలవారీ వేతనంలో మూడో వంతు దాటకుండా ఉండేలా చూసుకోండి. ఇక రెండో విషయం...మీరు ఇంటికి చెల్లించే డౌన్ పేమెంట్ మీరు కొనుగోలు చేసే గృహం విలువలో కనీసం 40% ఉండాలి. అంటే మీరు కొనే ఇంటి విలువ రూ.80 లక్షలుంటే, 40% మొత్తాన్ని.. అంటే రూ.32 లక్షల వరకూ డౌన్ పేమెంట్ చేస్తే, ఈఎమ్ఐ తక్కువగా ఉంటుంది. ఈ రెండు విషయాలు పాటిస్తే, గృహ రుణం మరింత సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పవచ్చు. నా వయస్సు 41 సంవత్సరాలు. నేను గత పదేళ్ల నుంచే ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. లిక్విడ్, ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లో కలుపుకొని ఇప్పటివరకూ నా ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం రూ.10 లక్షల వరకూ అయ్యాయి. నాకు మరో ఐదేళ్ల వరకూ ఈ డబ్బులు అవసరం ఉండదు. ఈక్విటీ, డెట్‌ల్లో సరిసమానంగా వెయిటేజ్ ఉన్న బ్యాలన్స్డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా? – రవీందర్, విజయవాడ మీరు ఇప్పటికే లిక్విడ్, ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మీకు తగిన అవగాహన వచ్చి ఉంటుంది. బ్యాలన్స్డ్ ఫండ్‌లో కంటే కూడా ఈక్విటీ సేవింగ్స్ ఫండ్‌ను ఎంచుకోండి. బ్యాలన్స్డ్ ఫండ్ కంటే కూడా ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ సురక్షితమైనది. ఈ ఫండ్ తన కార్పస్‌లో మూడో వంతు వరకూ పూర్తిగా ఈక్విటీలోనే ఇన్వెస్ట్ చేస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని కనీసం 12 సమ భాగాలు చేసి, ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఐదేళ్లలో మీరు ఈ ఫండ్ ద్వారా స్థిరాదాయ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసిన దానికంటే అధిక రాబడులను పొందే అవకాశాలున్నాయి. కనీసం ఐదేళ్లకొకసారి కుటుంబంతో కలసి విహారయాత్రకు వెళ్లాలనేది నా ఆలోచన. దీనికోసం ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలపండి? –కార్తీక్, బెంగళూరు కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్లాలనే కల ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు వచ్చిపడే ఖర్చులతో ఉక్కిరిబిక్కిరి అవుతుండటమే కానీ విహార యాత్ర కోసం డబ్బులు వెచ్చించే వెసులుబాటు అందరికీ ఉండదు. జాగ్రత్తగా ప్లాన్ చేస్తే, ఏదైనా సాధ్యమే. మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో పెట్టుబడులు పెడితే మీరు కోరుకుంటున్నట్లు కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్లవచ్చు. విహార యాత్ర నిధిని ఏర్పాటు చేసుకోవడానికి సరళమైన, సులభమైన విధానం ఇది. ఏదైనా ఈక్విటీ ఫండ్‌ను ఎంచుకుని ఆ ఫండ్‌లో సిప్ విధానంలో నెలకు ఎంతో కొంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి. కనీసం ఐదేళ్ల పాటు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే, ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులు మీకు వస్తాయి. స్వల్పకాలంలో స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయి. ఈ ఒడుదుడుకుల కారణంగా మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్ ఆశించిన రాబడులు ఇవ్వకపోయినా, ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించండి. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఈక్విటీల పతనంతో పసిడి జోరు!
అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్ నైమెక్స్‌లో పసిడి పరుగు వరుసగా నాల్గవ వారంలోనూ కొనసాగింది. శుక్రవారంతో ముగిసిన వారంలో ఔన్స్ ధర (31.1గ్రా) ఆరు డాలర్లు లాభపడి 1,232 డాలర్ల వద్ద ముగిసింది. ఒక దశలో 1,240 డాలర్లను కూడా చూసింది. మూడు నెలల గరిష్ట స్థాయి ఇది. అమెరికా ఈక్విటీ మార్కెట్ల పతనం, బాండ్ ఈల్డ్స్ నష్టాలు దీనికి నేపథ్యం. మొత్తంమీద ఆరు నెలలుగా పడుతూ వచ్చిన పసిడి, 1,160 డాలర్ల వరకూ పతనమైనా, వెంటనే రికవరీతో 1,185–1,210 శ్రేణిలో పటిష్ట కన్సాలిడేటెడ్ ధోరణి ప్రదర్శించింది. 1,200 డాలర్లు పసిడి ‘స్వీట్ స్టాప్’గా విశ్లేషకులు పేర్కొన్నారు. ఆ లోపునకు ధర పడిపోతే ఉత్పత్తిదారులకు నష్టం వచ్చే పరిస్థితుల్లో అవి మూతపడతాయని, తిరిగి పసిడికి డిమాండ్ పెరిగి వెంటనే 1,200 డాలర్లపైకి పసిడి ఎగయడం ఖాయమని విశ్లేషణలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా–సౌదీ అరేబియాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలూ, కంపెనీల ఫలితాలు ప్రత్యేకించి టెక్నాలజీ సంస్థల గణాంకాలు అంచనాలకు తగినట్లుగా లేకపోవడంమ పసిడి లాభాలకు తోడయ్యాయి. ‘‘ఈక్విటీలు మరింత కిందకు జారితే, పసిడి మున్ముందు మరింతపైకి లేవడం ఖాయం. ఇన్వెస్టర్లు ప్రస్తుతం తమ ఇన్వెస్ట్మెంట్లకు పసిడినే ఎంచుకోవడం జరుగుతుంది’’ అని సిటీ ఇండెక్స్‌లో టెక్నికల్ అనలిస్ట్ రజాక్జాదా పేర్కొన్నారు. కొంచెం జాగ్రత్త అవసరం... అయితే ప్రస్తుత స్థాయి వద్ద కొంత జాగరూకత అవసరమని ఇన్వెస్టర్లకు బ్లూలైన్ ఫ్యూచర్స్ ప్రెసిడెంట్ బిల్ బ్రూచ్ సూచించారు. ప్రస్తుత స్థాయి కీలక నిరోధంగా ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా వృద్ధి పటిష్టత, డిసెంబర్లో ఈఏడాదిలో నాల్గవసారి ఫెడ్‌రేటు పెంపు అవకాశాలు, డాలర్ ఇండెక్స్ పటిష్ట స్థాయిలో ఉండడం (శుక్రవారం 96.13 వద్ద ముగింపు) వంటి అంశాలను ప్రస్తావించారు. దేశంలో సానుకూలత కాగా పసిడి ధరకు దేశంలో మద్దతు లభిస్తోంది. అంతర్జాతీయంగా ధర పెరగడం సంగతి ఒకవైపయితే, డాలర్ మారకంలో రూపాయి విలువ మారకం బలహీనత మరోవైపు దీనికి దోహదపడుతున్న అంశాలు. -
ఆటుపోట్ల మధ్య పెట్టుబడులకు భద్రత
స్టాక్ మార్కెట్లు గరిష్ట విలువలకు చేరి దిద్దుబాటుకు గురవుతున్న క్రమంలో, తమ పెట్టుబడులకు భద్రత కోరుకునే వారు టాటా ఈక్విటీ పీఈ ఫండ్‌ను పరిశీలించొచ్చు. ఇది విలువ ఆధారిత పెట్టుబడుల విధానాన్ని అనుసరించే పథకం. ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సాధనాల్లో 70 శాతం వరకు పెట్టుబడులు పెడుతుంది. సెన్సెక్స్ పీఈతో పోలిస్తే తక్కువ పీఈతో ఉన్న స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. వివిధ మార్కెట్ క్యాప్‌తో కూడిన స్టాక్స్‌ను ఎంచుకుంటుంది. అంటే ఫ్లెక్సీ క్యాప్ ప్రొఫైల్గానే చెప్పుకోవాలి. ఉదాహరణకు ఏదైనా సమయంలో స్మాల్, మిడ్‌క్యాప్ విభాగాల్లోని స్టాక్స్ విలువల పరంగా మంచి ఆకర్షణీయంగా కనిపిస్తే ఆయా స్టాక్స్‌కు 35–40 శాతం నిధులను కేటాయిస్తుంది. 2013 చివర్లో, 2014లో ఇదే విధానాన్ని అమలు చేసింది. విలువైన ఎంపిక మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ అధిక ధరలకు చేరడంతో గత ఏడాది కాలంగా ఈ స్టాక్స్‌లో ఈ పథకం తన పెట్టుబడులను తగ్గించుకుంది. 2017 మే నెల నాటికి ఈ స్టాక్స్‌లో ఎక్స్పోజర్ 25 శాతంగా ఉంటే, ప్రస్తుతం 10 శాతమే ఉండటం గమనించాలి. అధిక వృద్ధి, అధిక విలువలున్న స్టాక్స్ జోలికి పోకుండా, తక్కువ విలువల వద్ద ఉండి, రానున్న కాలంలో మంచి పనితీరు చూపించే అవకాశం ఉన్న స్టాక్స్‌ను ఎంచుకొని ఇన్వెస్ట్ చేస్తుంది. 2017లో మార్కెట్లు మంచి ర్యాలీ చేస్తున్న సమయంలోనే మిడ్‌క్యాప్, ఈక్విటీల్లో పెట్టుబడులను తగ్గించింది. అందుకే ఏడాది కాల రాబడులను గమనిస్తే ప్రామాణిక సూచీ అయిన సెన్సెక్స్‌తో పోలిస్తే తక్కువగా ఉండడం గమనార్హం. ఏడాది కాలంలో ఈ పథకం 8.9 శాతం రిటర్నులు ఇస్తే, సెన్సెక్స్ రాబడులు 15.5 శాతంగా ఉన్నాయి. అయితే, మూడేళ్లు, ఐదేళ్ల కాలానికి చూస్తే సెన్సెక్స్ కంటే టాటా ఈక్విటీ ఫండ్ అధిక రాబడులను అందించింది. మూడేళ్లలో వార్షికంగా సగటున 15.5 శాతం, ఐదేళ్లలో అయితే వార్షికంగా 26.6 శాతం రాబడులు ఉన్నాయి. ఈ కాలంలో సెన్సెక్స్రాబడులు 10 శాతం, 14.9 శాతంగానే ఉన్నాయి. పోర్ట్‌ఫోలియో కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రంగాల వారీగా ప్రాథాన్యాన్ని కూడా మార్చడం ఈ పథకం పనితీరులో భాగమే. ఎన్పీఏల సమస్యతో బ్యాంకు స్టాక్స్ కుదేలవుతున్న తరుణంలో బ్యాంకులకు బదులు ఫైనాన్స్ స్టాక్స్‌కు ప్రాధాన్యం ఇచ్చింది. మార్కెట్లో అనిశ్చితి పెరగడంతో డెట్/ నగదు నిల్వలు పెంచింది. తాజా పోర్ట్‌ఫోలియోను గమనించినట్టయితే.... ఆటుపోట్లతో కూడిన మార్కెట్ పరిస్థితుల్లో పెట్టుబడుల రక్షణకు ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈక్విటీల్లో 88 శాతం పెట్టుబడులను కలిగి ఉండగా, ఎక్కువ శాతం లార్జ్‌క్యాప్ స్టాక్స్ కావడం గమనార్హం. హెచ్డీఎఫ్సీ, యస్ బ్యాంకు, రిలయన్స్‌లో వాటాలను పెంచుకుంది. ఈ ఏడాది ఆటో రంగంలో పెట్టుబడులను పెంచింది. మారుతి సుజుకి తరహా అధిక విలువకు చేరిన స్టాక్స్‌లో పెట్టుబడులను తగ్గించుకుంది. అదే సమయంలో విలువల పరంగా ఆకర్షణీయంగా ఉన్న మహీంద్రా అండ్ మహీంద్రాలో పెట్టుబడులను పెంచుకుంది. రూపాయి పతనం నేపథ్యంలో లాభపడే ఐటీ రంగ స్టాక్స్‌లోనూ పెట్టుబడులు గతంలో 1–2 శాతం మధ్య ఉంటే, 5 శాతానికి పెంచుకుంది. -
విదేశీ విద్య.. ఇలా సాధ్యమే!
విదేశాల్లో చదవటమంటే చాలా మందికి ఒక కల. ఒకప్పుడిది చాలా ధనవంతులు, ఎంతో ప్రతిభ కలిగిన వారికే సాధ్యమయ్యేది కూడా. కానీ, ఇపుడు విదేశీ విద్యావకాశాలు విస్త ృతమై... చాలామందికి అందుబాటులోకి వచ్చాయి. దేశంలో పలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలున్నా.. వాటిలో ప్రవేశానికి కటాఫ్ 99 శాతం. దీన్నే రీచ్ఐవీ సీఈఓ విభా కాగ్జి మాటల్లో చెప్పాలంటే... దేశంలో ఆమోదనీయ స్థాయిలో ఉన్న నాణ్యమైన విద్య 2 శాతంలోపే!!. మరి మిగిలిన 98 శాతం మంది మాటేంటి? అందుకే ఇపుడు తల్లిదండ్రులు కూడా సాధ్యమైనంత వరకూ తమ పిల్లలకు నాణ్యమైన విద్య చెప్పించాలంటే అది విదేశాల్లోనే సాధ్యమనే భావనతో ఉంటున్నారు. కాకపోతే ఈ ఖరీదైన విదేశీ విద్యను అందుకోవడం ఆర్థి కంగా అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఒకవేళ అందుకోవాలంటే అందుకు ప్రణాళిక అవసరమంటున్నారు నిపుణులు. వారు చెప్పిన వివరాల సమాహారమే ఈ కథనం... – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం విదేశాల్లో కోర్సు పూర్తి చేయడమన్నది ఖరీదైన వ్యవహారమే. ఐవీ లీగ్ కాలేజీల్లో ఏడాది ట్యూషన్ ఫీజు రూ.30– 35 లక్షల మధ్య ఉంది. దీనికి తోడు అదనపు వ్యయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వసతి, ఆహారం, కన్వేయన్స్, విద్యకు అవసరమైన వస్తువుల కొనుగోలు, హెల్త్ ఇన్సూరెన్స్, వినోద ఖర్చులు అదనం. వీటన్నిటికీ మరో రూ.10 లక్షల బడ్జెట్ వేసుకోవచ్చు. ద్రవ్యోల్బణం ప్రభావం, రూపాయి విలువ కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 2018లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 13 శాతం వరకు పడిపోయింది. మరి 2–4 ఏళ్ల కోర్సుల కాలంలో రూపాయి విలువలో వచ్చే వ్యత్యాసాల ఆధారంగా కోర్సు ఫీజులకు చేసే చెల్లింపులు పెరిగిపోవడం, లేదా తగ్గడం జరుగుతుంది. కాబట్టి పిల్లల్ని విదేశీ విద్య కోసం పంపించాలనుకునే వారు మూడేళ్ల కోర్సు కోసం రూ.50 లక్షల బడ్జెట్ వేసుకోవచ్చు. దీనికి 8 శాతం ద్రవ్యోల్బణ రేటును కూడా ముడిపెట్టాలి. అంటే... ఇప్పుడు రూ.50 లక్షల వ్యయమయితే, పదేళ్ల తర్వాత 8 శాతం ద్రవ్యోల్బణం ఆధారంగా కోర్సు ఫీజు రూ.1.07 కోట్లకు పెరిగిపోతుంది. ఇంత పెద్ద మొత్తాన్ని చూస్తే అసాధ్యమేనని అనిపించొచ్చు. కానీ, క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేస్తూ వెళితే సాధ్యమే. ముందుగానే ప్రారంభించాలి పిల్లల విద్యా వ్యయాలను దృష్టిలో ఉంచుకుని ముందు నుంచే పొదుపు మొదలు పెట్టిన వారికి లక్ష్యం సులువవుతుంది. పిల్లలు నెలల వయసులో ఉన్నప్పటి నుంచే వారి విద్యావసరాలకు ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించాలనేది ఫైనాన్షియల్ అడ్వైజర్లు చేసే సూచన. అందుకే. సిప్ విధానంలో ప్రతినెలా ఇన్వెస్ట్ చేస్తూ వెళితే పిల్లలు ఉన్నత విద్యకు వచ్చే సరికి రూ.50 లక్షల నిధి సాకారం అవుతుంది. ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తూ వెళతారు కనుక పెద్ద భారం కూడా అనిపించదు. దీర్ఘకాలం చేతిలో మిగిలి ఉంటే... అధిక రాబడుల కోసం ఈక్విటీ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. సరైన చోట పెట్టుబడి పైన చెప్పుకున్నట్టు ముందు నుంచే ఇన్వెస్ట్ చేస్తూ వెళితే అనుకున్నంత నిధి సమకూరుతుందనుకోవద్దు. మీ అవసరాలకు తగిన మొత్తం సమకూరేందుకు, ఇన్వెస్ట్ చేసే మొత్తం, దానిపై ఆశించే రాబడులు, కాంపౌండింగ్ ప్రయోజనంతో నిర్ణీత సమయానికి ఎంత సమకూరుతుందన్నది ఆధారపడి ఉంటుంది. ఇందుకు అవసరమైతే ఫైనాన్షియల్ అడ్వైజర్ సూచన తీసుకోవాలి. 5–10 ఏళ్లు, అంతకుమించి సమయం ఉంటే, ఈక్విటీ, ఈక్విటీ కలగలసిన సాధనాల్లో మెరుగైన రాబడులనే ఆశించొచ్చు. ‘‘దీర్ఘకాలం పాటు సమయం ఉంటే 65–70%పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకోవడం సురక్షితమే. మంచి ఫలితాల కోసం బ్యాలెన్స్డ్ ఫండ్‌ను ఎంచుకోవాలి. స్టాక్స్, బాండ్లలోనూ ఇవి ఇన్వెస్ట్ చేస్తాయి. ఈక్విటీలకు వర్తించే పన్ను ప్రయోజనాలే వీటికీ అమలవుతాయి. ఇవి 65% వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి కనుక లాభం ఏడాదిలో రూ.లక్ష దాటితే (అమ్ముకున్న సమయంలో) దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. లక్ష వరకూ పన్ను ఉండదు. ఆపై లాభంపై 10%పన్ను చెల్లించాల్సి ఉంటుంది’’ అని ఫిన్స్కాలర్జ్ వెల్త్ మేనేజర్స్ వ్యవస్థాపకురాలు రేణు తెలిపారు. ఆలస్యంగా మొదలు పెడితే... పిల్లలు పుట్టిన వెంటనే వారి విద్య కోసం పెట్టుబడి మొదలుపెట్టని వారు, ఈ అవసరాన్ని కొంత ఆలస్యంగా తెలుసుకుని పెట్టుబడి పెట్టాలనుకునే వారు... సిప్తోపాటు ఏక మొత్తంలో పెట్టుబడులు పెట్టడం పరిష్కారం. లక్ష్యానికి దీర్ఘకాలం లేకపోతే వచ్చిన సమస్య ఏంటంటే రాబడులకు రిస్క్ తీసుకోలేని పరిస్థితి. షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్‌లో అంత ఆటుపోట్లు ఉండవు. రాబడులు బాండ్ ఈల్డ్స్‌కు స మానంగా ఉంటాయి. మూడేళ్లకు పైగా కొనసాగితే ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే తక్కువ పన్ను రేట్లు అమలవుతాయి. విద్యా రుణం తీసుకోవచ్చు... లక్ష్యానికి సరిపడా ఇన్వెస్ట్ చేయలేని వారు, ఇన్వెస్ట్ చేసినప్పటికీ నిర్ణీత సమయంలో అవసరమైనంత నిధి సమకూరని వారు, ఆలస్యంగా ఇన్వెస్ట్ చేయడం ఆరంభించిన వారు పిల్లల విదేశీ విద్యా వ్యయాలను గట్టెక్కేందుకు ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడం పరిష్కారం. దాదాపు అన్ని బ్యాంకులు విద్యా రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. మంచి విద్యా సంస్థల్లో సీటు సంపాదిస్తే సులువుగానే రుణం పొందొచ్చు. పైగా, విద్యా రుణంపై ఆదాయ పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పన్ను చెల్లించే ఆదాయం ఉన్న వారికి ఇదో అదనపు ఆకర్షణ. సంప్రదాయ ఇన్వెస్టర్లయితే... పిల్లల ఉన్నత విద్య అనేది విస్మరించరాని అంశం. అలాగే, వాయిదా వేసేది కూడా కాదు. పెట్టుబడుల్లో రిస్క్ తీసుకోలేని వారు అయితే, పిల్లల ఉన్నత విద్యావసరాల కోసం మరింత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు రమ్య (25) నెదర్లాండ్స్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్‌కు వెళుతోంది. ఆమె చిన్నప్పటి నుంచే ఆమె తండ్రి ఇన్వెస్ట్ చేయడం ఆరంభించాడు. కానీ, సంప్రదాయ సాధనాల్లో చేయడంతో రాబడులు పెద్దగా లేవు. దీంతో కోర్సుకు కావాల్సినంత సమకూరలేదు. దీంతో రమ్య విద్యావసరాల కోసం ఆమె తండ్రి తన రిటైర్మెంట్ నిధిలోనూ కొంత ఖర్చు చేయాల్సి వచ్చింది. ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీలు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొని మెరుగైన రాబడులను ఇవ్వలేవు. దీర్ఘకాలం కోసం పీపీఎఫ్, డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం కాస్తంత నయం. రికరింగ్ డిపాజిట్ కూడా కాస్త మెరుగైన ఆప్షనే. లక్ష్యానికి సమీపంలో... పిల్లల ఉన్నత విద్యకు మరో 2 ఏళ్లు ఉందనగా, ఈక్విటీ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నవారు కొద్దికొద్దిగా వాటిని డెట్ ఫండ్స్‌లోకి మళ్లించుకోవాలి. ఎందుకంటే ఉన్నట్టుండి మార్కె ట్లు పడిపోతే పెట్టుబడుల విలువ అమాంతం కరిగిపోయే ప్రమా దం ఉంటుంది. కనుక పెట్టుబడులను రక్షించుకోవాలనుకుంటే ముందు నుంచే క్రమంగా వైదొలగడం అవసరం. విద్యా వ్యయం ఏ దేశంలో ఎంతెంత? యూఎస్ఏ ట్యూషన్ ఫీజు: ప్రైవేటు కాలేజీల్లో సుమారు రూ.25–30 లక్షలు. ప్రభుత్వ కాలేజీల్లో రూ.15–23 లక్షలు. నివాస వ్యయం: నెలకు రూ.75,000. పశ్చిమ తీరం కంటే తూర్పు తీరంలో తక్కువ. మొత్తం ఖర్చు: ఏటా దాదాపు రూ.34 లక్షలు. ఆస్ట్రేలియా ట్యూషన్ ఫీజు: అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు అయితే రూ.10–16 లక్షలు. పోస్ట్ గ్రాడ్యుయేట్‌కు 12–18 లక్షలు. నివాస వ్యయం: నెలకు రూ.86,000. పట్టణాలను బట్టి ఇందులో మార్పు ఉంటుంది. సిడ్నీ, కాన్బెర్రా పట్టణాల మధ్యే నివాస వ్యయం నెలకు రూ.17,000 తేడా ఉంటుంది. మొత్తం వ్యయం: ఏడాదికి సుమారుగా రూ.25 లక్షలు. యూకే ట్యూషన్ ఫీజు: రూ.8–18 లక్షలు. నివాస వ్యయం: లండన్‌లో అయితే ప్రతి నెలా రూ.1.1 లక్ష వరకు. లండన్ బయట అయితే రూ.91,000. మొత్తం వ్యయం: ఏడాదికి సుమారుగా రూ.25 లక్షలు. కెనడా ట్యూషన్ ఫీజు: అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.10–15 లక్షలు. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.8–20 లక్షలు. నివాస వ్యయం: వీసా అవసరాలను బట్టి ప్రతి నెలా రూ.57,000 వరకు మొత్తం వ్యయం: ఏటా దాదాపు రూ.19.8 లక్షలు సింగపూర్ ట్యూషన్ ఫీజు: అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.5–13 లక్షలు. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.10–25 లక్షలు. నివాస వ్యయం: రూ.50,000 వరకు ప్రతి నెలా. మొత్తం వ్యయం: ఏటా దాదాపు రూ.18 లక్షలు జర్మనీ ట్యూషన్ ఫీజు: పబ్లిక్ యూనివర్సిటీల్లో ఫీజు ఉండదు. కొన్ని నామమాత్రంగా ఏడాదికి రూ.40,000 వరకు చార్జ్ చేస్తున్నాయి. నివాస వ్యయం: మ్యూనిక్, బెర్లిన్ వంటి పెద్ద పట్టణాల్లో అయితే ప్రతి నెలా రూ.54,000. కాలేజీ డార్మెటరీల్లో ఉండేట్టు అయితే రూ.42,000 చాలు. ఫ్రీబర్గ్, హాన్నోవర్ వంటి చిన్న పట్టణాల్లో అయితే రూ.42,000 వరకు అవసరం అవుతుంది. మొత్తం వ్యయం: ఏటా దాదాపు రూ.5.4 లక్షలు. -
అస్థిరతల మధ్య మెరుగైన ఎంపిక!
దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయి గరిష్టాల్లో ఉండడంతోపాటు, అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ, ఇతర అంశాలు ప్రభావం చూపిస్తున్న వేళ, ఈక్విటీల్లో పెట్టుబడుల ద్వారా కాస్తంత రిస్క్ తగ్గించుకుని, మెరుగైన రాబడులు అందుకోవాలనుకునే వారికి మిరే అస్సెట్ హైబ్రిడ్ ఈక్విటీ పథకం అనకూలంగా ఉంటుంది. హైబ్రిడ్ పథకంగా మొత్తం పెట్టుబడుల్లో 65–80 శాతం మేర ఈక్విటీల్లో, మిగిలినది డెట్, మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్లలో ఇన్వెస్ట్ చేస్తుంది. దీనివల్ల రిస్క్ మోస్తరుగానే ఉంటుంది. ఇది కొత్త పథకం. ప్రారంభించి మూడేళ్లే అయింది. ఈ కాలంలో పనితీరు ఫర్వాలేదు. ఏడాది కాలంలో 9.63 శాతం రాబడులను ఇచ్చింది. మూడేళ్లలో చూసుకుంటే ఏటా సగటున రాబడులు 15 శాతంపైన ఉన్నాయి. ఇదే కాలంలో ఈ పథకం రాబడులకు ప్రామాణికంగా పరిగణించే క్రిసిల్ హైబ్రిడ్, ప్లస్ 65 అగ్రెస్సివ్ రాబడులు 9.9 శాతం, 10.7 శాతంగానే ఉన్నాయి. ఈక్విటీల్లో ఎక్కువ భాగం పెట్టుబడులు పెట్టే పథకం కావడంతో దీర్ఘకాల రాబడులను పరిగణనలోకి తీసుకోవడమే సరైనది. సెబీ కేటగిరీల్లో మార్పులకు ముందు మిరే అస్సెట్ ప్రుడెన్స్ ఫండ్ పేరుతో కొనసాగింది. ఈ పథకం 2015లో ఆరంభమైన తర్వాత, మార్కెట్లలో భారీ పతనాలు చోటు చేసుకోలేదు. కనుక 2007 తరహా సంక్షోభాలు ఎదురైతే పనితీరు ఎలా ఉంటుందో చూడాలి. 2016, 2017 ఈ రెండు సంవత్సరాల్లోనూ ఈ పథకం కేటగిరీ సగటు రాబడుల కంటే ఎక్కువే ఇన్వెస్టర్లకు పంచింది. 2016లో 8.5 శాతం, 2017లో 27.8 శాతం రాబడులు ఈ పథకంలో ఉన్నాయి. పోర్ట్‌ఫోలియో ఈక్విటీల్లో ఈ పథకం 60 స్టాక్స్‌ను కలిగి ఉంది. 26 రంగాలకు చెందిన కంపెనీలతో డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో నిర్వహిస్తోంది. స్టాక్స్ ఎంపికకు బోటమ్‌అప్ విధానాన్ని అనుసరిస్తుంది. బ్యాంకింగ్ రంగానికి ప్రాధాన్యం ఇస్తోంది. 20 శాతం నిధులను బ్యాంకింగ్ రంగంలోనే ఇన్వెస్ట్ చేయడం దీన్నే సూచిస్తోంది. 2016 ప్రారంభం నుంచి ఇదే స్థాయిలో పెట్టుబడులను కేటాయించింది. సాఫ్ట్వేర్, కన్జ్యూమర్ డ్యురబుల్స్ రంగాలకు తదుపరి ప్రాధాన్యం ఇచ్చింది. గత ఏడాది కాలంలో ఫైనాన్స్, పెట్రోలియం ఉత్పత్తుల రంగాలకు పెట్టుబడులను పెంచడాన్ని గమనించొచ్చు. ఇక డెట్ విభాగంలో ఎక్కువ భాగం పెట్టుబడులను ప్రభుత్వ సెక్యూరిటీలు, కమర్షియల్ పేపర్లకు కేటాయించింది. తాజా పోర్ట్‌ఫోలియోను గమనిస్తే ఈక్విటీల్లో పెట్టుబడులు 74.68 శాతం, డెట్‌లో 23.19 శాతం చొప్పున ఉంటే, 2.09 నగదు నిల్వలను కలిగి ఉంది. సెబీ కేటగిరీ మార్పుల నేపథ్యంలో ఈ పథకం అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్ కేటగిరీలోకి వస్తుంది. నిబంధనల మేరకు 65–80 శాతం వరకు ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతి ఉంటుంది. 20–35 శాతం మేర ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే, ఈ ఫండ్ మేనేజర్లు ఈక్విటీ పెట్టబడులను 70–75 శాతం మధ్య కొనసాగిస్తూ వస్తున్నారు. -
‘కాంప్లాన్’ బాయ్ ఎవరు?
క్రాఫ్ట్ హీన్జ్ సంస్థకు చెందిన కాంప్లాన్ బ్రాండ్ విక్రయం వేడెక్కుతోంది. దీని కొనుగోలు కోసం పోటీ పడుతున్న వారిలో దేశ, విదేశీ దిగ్గజ కంపెనీలతో పాటు అగ్రశ్రేణి ప్రైవేటు ఈక్విటీ సంస్థలూ ఉన్నాయి. కాంప్లాన్తో పాటు గ్లూకోన్–డి, నైసిల్, సంప్రితి ఘీ బ్రాండ్లతో కూడిన కన్సూమర్ ఫుడ్ డివిజన్‌ను వంద కోట్ల డాలర్లకు విక్రయించాలనేది క్రాఫ్ట్ హెన్జ్ కంపెనీ ఆలోచన. ఈ విభాగం విక్రయ వ్యవహారాలను చూడటానికి జేపీ మోర్గాన్, లజార్డ్ సంస్థలను ఈ కంపెనీ నియమించింది కూడా. కాంప్లాన్ వంటివి బాగా పాతుకుపోయిన బ్రాండ్లు కావటంతో ఐటీసీ, ఇమామి, విప్రో, అబాట్, జైడస్ వెల్నెస్, క్యాడిలా వంటి కంపెనీలతో పాటు బ్లాక్‌స్టోన్, కార్లైల్ వంటి ప్రైవేట్ ఈక్విటీ సంస్థలూ పోటీ పడుతున్నాయి. ఈ కంపెనీలన్నీ వచ్చే నెల 15లోగా తమ తమ బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ కంపెనీల బిడ్లు 70–80 కోట్ల డాలర్ల శ్రేణిలో ఉండొచ్చని సమాచారం. మరోవైపు గ్లాక్సో స్మిత్‌క్లైన్ కంపెనీ కూడా తన కన్సూమర్ హెల్త్‌కేర్ వ్యాపారాన్ని (దీంట్లో హార్లిక్స్ బ్రాండ్ కూడా ఉంది) విక్రయించే ప్రయత్నాలు చేస్తోంది. హార్లిక్స్‌ను అమ్మనున్నట్లు జీఎస్కే ప్రకటించిన కొద్ది రోజులకే క్రాఫ్ట్ హీన్జ్ కంపెనీ కూడా కాంప్లాన్ బ్రాండ్‌ను అమ్మకానికి పెట్టడం విశేషం. కాంప్లాన్.. 8 శాతం మార్కెట్ వాటా! మూడేళ్ల కిందట 2015లో క్రాఫ్ట్ ఫుడ్స్, హీన్జ్ కంపెనీలు రెండూ విలీనమై క్రాప్ట్ హెన్జ్ సంస్థ ఏర్పడింది. ఈ కంపెనీ 13 విభిన్న రకాలైన బ్రాండ్లతో అమ్మకాలు సాగిస్తోంది. ఈ కంపెనీ కన్సూమర్ బిజినెస్ 2016–17 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.1,800 కోట్ల అమ్మకాలు సాధించింది. దీంట్లో ఒక్క కాంప్లాన్ వాటాయే 40 శాతంగా ఉంటుంది. ఈ కాంప్లాన్ బ్రాండ్‌ను 1994లో హీన్జ్ కంపెనీ గ్లాక్సో నుంచి కొనుగోలు చేసింది. మాల్టెడ్ ఫుడ్ డ్రింక్‌లో (ఎమ్ఎఫ్డీ) కాంప్లాన్ మార్కెట్ వాటా 8 శాతంగా ఉంటుంది. భారత్‌లో ఎమ్ఎఫ్డీ పరిశ్రమ రూ.8,000 కోట్లు ఉంటుందని అంచనా. దీంట్లో 44.3 శాతం మార్కెట్ వాటాతో గ్లాక్సో కంపెనీకి చెందిన హార్లిక్స్‌దే అగ్రస్థానం. ఈ కంపెనీకే చెందిన బూస్ట్, మాల్టోవా కూడా మంచి అమ్మకాలు సాధిస్తున్నాయి. క్రాఫ్ట్ కంపెనీకి చెందిన బోర్నవిటా, నెస్లే మిలో తదితర బ్రాండ్లు కూడా మంచి అమ్మకాలే సాధిస్తున్నాయి. వైదొలుగుతున్న ఎమ్ఎన్సీలు... మాల్టెడ్ ఫుడ్ డ్రింక్ (ఎమ్ఎఫ్డీ) కేటగిరీ వృద్ధి ఆశించినంత జోరుగా లేకపోవటం, పోటీ తీవ్రత పెరుగుతుండటంతో ఈ రంగం నుంచి వైదొలగాలని బహుళ జాతి కంపెనీలు భావిస్తున్నాయి. మాల్ట్ బేస్డ్ డ్రింక్స్ విభాగం వృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. 2014లో 13 శాతంగా ఉన్న ఈ పరిశ్రమ వృద్ది 2017లో 9 శాతానికే పరిమితమైంది. అయితే వాండర్ ఏజీ కంపెనీ ఓవల్టీన్, క్యాడిలాకు చెందిన ఆక్టిలైఫ్ వంటి సప్లిమెంట్ న్యూట్రిషన్ డ్రింక్స్ వీటికన్నా మంచి వృద్ధిని సాధించాయి. అలాగని ఈ డ్రింక్స్ వృద్ధి కూడా మరీ చెప్పుకోదగ్గ స్థాయిలో ఏమీ లేదు. ఈ డ్రింక్‌ల సెగ్మెంట్ వృద్ధి 2014లో 21.3 శాతంగా ఉండగా, 2017లో 11.5 శాతానికే పరిమితమయింది. 2017లో క్రాఫ్ట్ హీన్జ్కు న్యూట్రిషినల్ బేవరేజేస్ వ్యాపారంలో 5 కోట్ల డాలర్ల ఇంపెయిర్మెంట్ నష్టాలు (భవిష్యత్తు విలువ క్షీణించటం) వచ్చాయి. వృద్ధి అంతంతమాత్రంగానే ఉండటం, ఇంపెయిర్మెంట్ నష్టాల వంటి కారణాల వల్ల క్రాఫ్ట్ హీన్జ్ కంపెనీ కాంప్లాన్, ఇతర బ్రాండ్లను అమ్మకానికి పెట్టింది. కాగా బ్లాక్‌స్టోన్, కార్లైల్ వంటి పీఈ సంస్థలు కన్సూమర్ హెల్త్‌కేర్ థీమ్‌పై ప్రత్యేక ఆసక్తిని చూపిస్తున్నాయి. గ్లోబల్ కంపెనీలు వదిలించుకోవాలనుకుంటున్న ఈ సెగ్మెంట్ బ్రాండ్ల కొనుగోలుకు ఇవి పోటీ పడుతూ బిడ్లు వేస్తున్నాయి. కాకపోతే అధికారికంగా మాత్రం ఎవరూ ఇంకా స్పందించలేదు. ఆదాయ స్థాయిలు పెరుగుతుండటంతో వినియోగదారులు బ్రాండెడ్ ఉత్పత్తులకే ప్రాధాన్యమిస్తున్నారని, దీంతో వచ్చే 20 ఏళ్లలో ఈ ఉత్పత్తులకు డిమాండ్ మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతుండటం గమనార్హం. కాంప్లాన్ కథ గ్లాక్సో కంపెనీ కాంప్లాన్ను పౌడర్ రూపంలో ఉన్న మిల్క్ ఎనర్జీ డ్రింక్‌గా 1954లో మార్కెట్లోకి తెచ్చింది. ఇంగ్లాండ్‌లో ఈ బ్రాండ్‌ను గ్లాక్సో కంపెనీ 1988లోనే వేరే కంపెనీకి అమ్మేసింది. భారత్‌లో మాత్రం 1994లో క్రాఫ్ట్ కంపెనీకి విక్రయించింది. మాల్టెట్ ఫుడ్ డ్రింక్ మార్కెట్లో కాంప్లాన్ మార్కెట్ వాటా 8 శాతంగా ఉంటుందని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే, క్రాఫ్ట్ అండ్ హెన్జ్ కంపెనీ ఐదవ అతి పెద్ద ఫుడ్ అండ్ బేవరేజ్ కంపెనీ. కాప్రి సన్, క్లాసికో, జెల్–ఓ, కూల్–ఎయిడ్, లంచబుల్స్, మ్యాక్స్‌వెల్... ఇవి ఈ కంపెనీ పాపులర్ బ్రాండ్లలో కొన్ని. షికాగో, పిట్స్బర్గ్ కేంద్రాలుగా ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీలో నియంత్రిత వాటాలు ఏస్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హతావే, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ, 3జీ క్యాపిటల్‌కు ఉన్నాయి. -
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ నుంచి ఆల్టర్నేటివ్ ఫండ్...
ఫ్రాంక్లిన్ టెంపుల్వ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ (ఎఫ్‌టీఏఐ) తాజాగా తమ తొలి ఫండ్ ’ఫ్రాంక్లిన్ ఇండియా లాంగ్ షార్ట్ ఈక్విటీ ఏఐఎఫ్’ను ప్రవేశపెట్టింది. పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌పై అవగాహన ఉండి, ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాల్లో మరింతగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికోసం దీన్ని ఉద్దేశించినట్లు ఎఫ్‌టీఏఐ ప్రెసిడెంట్ నాగనాథ్ సుందరేశన్ తెలిపారు. దేశీ సంస్థల ఈక్విటీ, డెరివేటివ్స్ మొదలైన వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మధ్య, దీర్ఘకాలానికి మెరుగైన రాబడులు అందించడం, పెట్టుబడుల విలువ పెరిగేలా చూడటం ఈ ఫండ్ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఫండమెంటల్, టెక్నికల్ విశ్లేషణల మేళవింపుతో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుందని తెలిపారు. -
అర్ధరాత్రి వరకూ ట్రేడింగ్‌కు రెడీ
ముంబై: ట్రేడింగ్ వేళలను అర్ధరాత్రి వరకూ పొడిగించేందుకు సిద్ధంగా ఉన్నామని నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ (ఎన్ఎస్ఈ) సీఈఓ విక్రమ్ లిమాయే స్పష్టంచేశారు. సెబీ ఆదేశాలకు అనుగుణంగా ప్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) విభాగంలో ట్రేడింగ్‌ను అక్టోబర్ 1 నుంచి రాత్రి 11.15 వరకూ పొడిగించేందుకు ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఎన్ఎస్ఈ కార్యకలాపాలు మొదలై 25 ఏళ్లు అయిన సందర్బంగా బుధవారం ఇక్కడ జరిగిన రజతోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఈ కొత్త లోగోను ఆవిష్కరించారు. ‘ప్రస్తుతం ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 3.30 వరకూ ట్రేడింగ్ జరుగుతోంది. క్యాష్ మార్కెట్ ముగిసిన కొంత వ్యవధి తర్వాత రెండో సెషన్ సాయంత్రం 5 నుంచి ప్రారంభమై రాత్రి 11.15కు ముగుస్తుంది. అయితే, ఈ సెషన్లో డెరివేటివ్స్ (ఎఫ్ అండ్ ఓ) ట్రేడింగ్‌కు మాత్రమే అవకాశం ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఐపీఓ ఎప్పుడంటే... ఎన్ఎన్ఈ కో–లొకేషన్ సర్వర్లకు సంబంధించి వివాదంపై మాట్లాడుతూ... దీనిపై ఇప్పటికే తమ అంతర్గత దర్యాప్తును పూర్తి చేశామని.. దీనికి తగిన పరిష్కారం కోసం సెబీతో తాజాగా మళ్లీ సంప్రదింపులు జరుపుతున్నామని తెలియజేశారు. కన్సెంట్ విధానంలో (నేరాన్ని అంగీకరించడం లేదా నిరాకరించడంతో సంబంధం లేకుండా జరిమానా రూపంలో కొంత చార్జీలను చెల్లించడం) దీన్ని పరిష్కరించుకుంటామని చెప్పారు. ‘ఎన్ఎస్ఈ ఐపీఓ (రూ.10,000 కోట్లుగా అంచనా) ఎప్పుడు వస్తుందో ఇప్పుడే చెప్పలేను. ఎందుకంటే కో–లొకేషన్ సమస్యతో ఇది ముడిపడి ఉంది. ఈ వివాదానికి పరిష్కారం ఎంత త్వరగా లభిస్తుందో అంత త్వరగా ఐపీఓ పూర్తవుతుంది’ అని లిమాయే వివరించారు. ఇక కమోడిటీ కాంట్రాక్టుల్లో ట్రేడింగ్‌ను కూడా అక్టోబర్ 1 నుంచి ప్రారంభించేందుకు సిద్ధమేనని చెప్పారు. ‘దీనికి నియంత్రణ సంస్థ సెబీ అనుమతులు రావాల్సి ఉంది. ముందుగా బులియన్ (బంగారం, వెండి), ఇంధనం, మెటల్ వంటి వ్యవసాయేతర ఉత్పత్తులతో కమోడిటీ ట్రేడింగ్‌ను ప్రారంభిస్తాం’ అని వెల్లడించారు. రిటైల్ ఇన్వెస్టర్లతో పాటు సంస్థాగత ఇన్వెస్టర్ల సంఖ్యను మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని లిమాయే పేర్కొన్నారు. ఈక్విటీ, డెట్‌పై మరింత దృష్టి: చావ్లా వ్యాపార విస్తరణలో భాగంగా ఈక్విటీ, డెట్, వడ్డీరేట్లు ఫ్యూచర్స్ విభాగాలపై మరింత దృష్టి పెడతామని ఎన్ఎస్ఈ చైర్మన్ అశోక్ చావ్లా పేర్కొన్నారు. అదేవిధంగా కంపెనీల నిధుల సమీకరణ వ్యయాలను కూడా తగ్గించడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. కమోడిటీ ఫ్యూచర్స్లోకి ప్రవేశంతో ఎక్సే్ఛంజ్ టర్నోవర్ ఇంకాస్త జోరుందుకుంటుందని చావ్లా తెలిపారు. మరిన్ని శిఖరాలనుచేరాలి...: మన్మోహన్ సరిగ్గా 25 ఏళ్ల క్రితం 1994లో దేశంలో రెండో ప్రధాన స్టాక్ ఎక్సే్ఛంజ్‌గా ఆవిర్భవించి అనతి కాలంలో టర్నోవర్ పరంగా నంబర్ వన్ స్థానానికి ఎగబాకిన ఎన్ఎస్ఈ.. ఇంకా మరెన్నో విజయ శిఖరాలను అధిరోహించాల్సి ఉందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆకాంక్షించారు. అప్పటి ఆర్థిక మంత్రి హోదాలో ఎన్సీఈ కార్యకలాపాలను ప్రారంభించింది మన్మోహన్ కావడం గమనార్హం. ‘1994లో దేశ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై ఎవరికీ అంతగా విశ్వాసం లేదు. ముఖ్యంగా ఫైనాన్షియల్ రంగానికి గడ్డురోజులవి. అయితే, అవన్నీ తప్పని దేశ భవిష్యత్తుకు ఢోకాలేదని నిరూపించగలిగాం’ అని ఎన్ఎస్ఈ రజతోత్సవ వేడుకలో మన్మోహన్ పేర్కొన్నారు. మార్కెట్, దేశ ఆర్థికాభివృద్ధితో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో భారత్‌ను మరింతగా సమ్మిళితం చేసే దిశగా ఎన్ఎస్ఈ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందని మన్మోహన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ కార్యక్రమానికి హాజరవ్వాల్సి ఉన్నా.. అనుకోని కారణాలతో రాలేకపోయా రు. ఆయన సందేశాన్ని చదవి వినిపించారు. -
రిస్క్ తీసుకున్నా రాబడులకు భరోసా!
ఇటీవలి మార్కెట్ల అస్థిరత సమయంలో మిడ్ క్యాప్ స్టాక్స్ బాగా పతనం అయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లు నిరాశ చెందిన విషయం నిజమే. కానీ, దీర్ఘకాలంలో పెద్ద లక్ష్యాలను చేరుకునేందుకు వీలుగా సంపద సృష్టికి ఈక్విటీలకు దూరంగా ఉండడం కూడా సరికాదు. కనుక నాణ్యమైన ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టుకోవడం అర్థవంతమైనదే. ఆ విధంగా చూసినప్పుడు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్ కూడా పరిశీలించదగ్గదే. ఎందుకంటే మార్కెట్లు ర్యాలీ చేస్తున్న సమయంలో స్టాక్స్‌ను కొంత మేర విక్రయించి నగదు నిల్వలు పెంచుకోవడం, అదే సమయంలో డెట్ విభాగంలోనూ కొంత మేర పెట్టుబడుల ద్వారా నష్టాలను సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచడం ఈ పథకం పనితీరులో భాగం. హైబ్రిడ్ పథకంగా ఇది 65–80 శాతం వరకు ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంది. కనీసం 65 శాతం ఈక్విటీలోనూ, 20–35 శాతం వరకు డెట్ విభాగంలోనూ పెట్టుబడులు పెట్టే ఈ పథకాన్ని అటు రాబడుల పరంగా, ఇటు మార్కెట్ల ఆటుపోట్ల సమయంలోనూ కాస్తంత రక్షణగా భావించొచ్చు. పనితీరు గతంలో ఇది ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలన్స్డ్ ఫండ్‌గా ఉండేది. సెబీ మార్పుల తర్వాత పేరు మారింది. దీర్ఘకాలంలో చూసినప్పుడు ఈ విభాగం సగటు రాబడులతో పోలిస్తే ఈ పథకం పనితీరు కాస్త అధికంగానే ఉంది. స్వల్ప కాలం అంటే ఏడాది కాలంలో మాత్రం కాస్త ప్రతికూలంగా ఉండటం గమనార్హం. ఏడాది కాలంలో ఈ పథకం 4.9 శాతం రాబడులు ఇస్తే, ఈ విభాగం సగటు రాబడులు 6.2 శాతంగా ఉన్నాయి. ఇక మూడేళ్ల కాలంలో ఈ పథకం రాబడులు సగటున 10.4 శాతంగా ఉంటే, ఇదే విభాగం సగటు రాబడులు 8.6 శాతమే. ఐదేళ్లలో ఈ పథకం రాబడులు వార్షికంగా 17.4 శాతం కాగా, ఈ విభాగం రాబడులు 15.3 శాతం. గత మూడేళ్లుగా ఈ పథకం ఈక్విటీల్లో 65–74 శాతం మేర పెట్టుబడులు కొనసాగిస్తోంది. 2017లో వడ్డీ రేట్లు పెరిగిన సమయంలో ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఎక్స్పోజర్ను 11–14 శాతం వరకు తగ్గించుకుంది. 2017లో ఈ పథకం రాబడులు తక్కువగా ఉండడానికి కారణం ఐటీ స్టాక్స్‌లో ఎక్స్పోజర్ తగ్గించుకుని, అధిక భాగం లార్జ్‌క్యాప్‌నకు పరిమితం కావడమే. పోర్ట్‌ఫోలియో ఈక్విటీల్లో ప్రధానంగా లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. అవసరమైన సమయాల్లో మిడ్‌క్యాప్ స్టాక్స్‌లోనూ పెట్టుబడులు పెట్టడం ద్వారా రాబడులను పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఈక్విటీ, డెట్ మధ్య పెట్టుబడులు మార్చడం ద్వారా రాబడులు మెరుగ్గా ఉండేలా చూస్తుంది. 2014 ర్యాలీ సమయంలో ఈక్విటీ పెట్టుబడులను 68–70 శాతం స్థాయిలో కొనసాగిస్తే, 2013లో ఇది 65–67 శాతంగా ఉండడం గమనార్హం. 2016లో బ్యాంకింగ్, పవర్, ఆయిల్, గ్యాస్ కంపెనీల స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మెరుగైన రాబడులను ఇవ్వగలిగింది. -
రిస్క్ తక్కువ... స్థిరమైన రాబడి
స్థిరమైన పనితీరుతో పాటు రిస్క్ తక్కువగా ఉండాలని కోరుకునే వారు డీఎస్‌పీబీఆర్ ఈక్విటీ అపార్చునిటీస్ ఫండ్‌ను పరిశీలించొచ్చు. సెబీ మార్పుల తర్వాత కూడా ఈ పథకం పనితీరులో ఎటువంటి మార్పుల్లేవు. ఇది ఇక ముందూ మల్టీక్యాప్గానే కొనసాగుతుంది. పనితీరు ఈ ఫండ్ అన్ని కాలాల్లోనూ ప్రామాణిక సూచీ కంటే మెరుగైన రాబడులతో ముందున్నది. ఈ పథకం పనితీరుకు ప్రామాణిక సూచీ ఎన్ఎస్ఈ 500. మూడేళ్ల కాలంలో 14.6 శాతం, ఐదేళ్లలో 19.6 శాతం, పదేళ్లలో 13.4 శాతం చొప్పున వార్షిక రాబడులను అందించిన పథకం ఇది. ఇదే కాలంలో బెంచ్ మార్క్ రాబడులు 12.8 శాతం, 16.3 శాతం, 10.9 శాతంగానే ఉండడం గమనార్హం. అంటే బెంచ్ మార్క్‌తో పోలిస్తే డీఎస్‌పీబీఆర్ ఈక్విటీ అపార్చునిటీస్ 2–5 శాతం వరకు అధిక రాబడులను అందించినట్టు తెలుస్తోంది. అధిక శాతం లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో మోస్తరు ఎక్స్పోజర్ రాబడులకు కారణం. మొత్తం నిధుల్లో 80% లార్జ్‌క్యాప్ స్టాక్స్‌కు, 10–15% మిడ్‌క్యాప్ స్టాక్స్‌కు కేటాయించింది. అధిక వికేంద్రీకృత పోర్ట్‌ఫోలియో విధానంతో అన్ని మార్కెట్ల సమయాల్లోనూ మెరుగైన పనితీరుకు, కరెక్షన్లో పతనాన్ని పరిమితం చేయడం, అదే సమయంలో ర్యాలీల్లో మోస్తరు పనితీరుకు దోహదపడ్డాయి. అన్ని కాలాల్లోనూ మార్కెట్‌కు ధీటైన పనితీరు కోరుకునేవారు, దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయదలిచిన వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. పోర్ట్‌ఫోలియో గతంలో ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో 50 స్టాక్స్ మేర ఉంటే, గడిచిన ఏడాది కాలంగా 70 స్టాక్స్పైగా కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో స్టాక్స్ సంఖ్య పెంచుకోవడం ద్వారా రిస్క్ తగ్గించే ప్రయత్నంగా దీన్ని చూడొచ్చు. బ్యాంకులు, ఫైనాన్షియల్ స్టాక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. పథకం మొత్తం నిధుల్లో 22.1 శాతం బ్యాంకింగ్ రంగంలోనే ఇన్వెస్ట్ చేసింది. ఫైనాన్షియల్ రంగ స్టాక్స్‌లో 9.1 శాతం పెట్టుబడులు పెట్టింది. ఫార్మాలో 7.2 శాతం, కన్స్ట్రక్షన్ ప్రాజెక్టుల సంబంధిత స్టాక్స్‌లో 6.1 శాతం, ఆటోమొబైల్ రంగ స్టాక్స్‌లో 5.9 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో చూసుకుంటే మాత్రం ఈ పథకం పనితీరు ఆశించిన మేర లేదు. దీనికి కారణం బ్యాంకింగ్ రంగంలో అధిక పెట్టుబడులు పెట్టడమే. అయితే, ఇదే కాలంలో సాఫ్ట్వేర్ రంగంలో ఎక్స్పోజర్ తీసుకోవడం కలిసొచ్చింది. ఆర్థిక వృద్ధి మెరుగుపడితే అధికంగా ప్రయోజనం పొందే కన్స్ట్రక్షన్ కంపెనీల్లోనూ పెట్టుబడులు పెట్టి ఉంది. చమురు ధరలు పెరగడంతో పెట్రోలియం స్టాక్స్‌లో ఎక్స్పోజర్ తగ్గించుకుంది. ఇక పథకం నిర్వహణలోని నిధుల్లో 5–7 శాతం మేర డెట్ పెట్టుబడులు, నగదు రూపంలో కలిగి ఉంది. ఐదేళ్లు, ఆ పై వ్యవధి కోసం ఇన్వెస్ట్ చేసుకునేందుకు పరిశీలించతగిన పథకంగా చెప్పుకోవచ్చు. -
సమీప భవిష్యత్తులోనే రెండంకెల వృద్ధి
ముంబై: ఈక్విటీ మార్కెట్లలో అస్థిరతలు, బ్యాంకింగ్ రంగంలో సమస్యలు ఉన్నప్పటికీ స్థూల ఆర్థిక పరిస్థితులు సానుకూలంగానే ఉన్నాయని బీఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ అన్నారు. ‘‘బ్యాంకుల పుస్తకాల ప్రక్షాళన జరుగుతోంది. ఎన్పీఏల గుర్తింపు పారదర్శకంగా మారింది. వృద్ధి చెందే జీడీపీకి తోడు, జీఎస్టీ, ఐబీసీ వంటి సంస్కరణలతో భారత వృద్ధి త్వరలోనే రెండంకెలకు చేరుతుంది’’ అని చౌహాన్ పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యయాలు పెరగడంతో 2016 డిసెంబర్ నుంచి వృద్ధి వేగాన్ని అందుకుందని చెప్పారు. అధిక వడ్డీ రేట్లు, చమురు ధరలతో ఐపీవోలపై ప్రభావం పడిందన్నారు. అయినప్పటికీ అంతర్జాతీయంగా చూస్తే భారత ఎక్స్ఛేంజ్ల్లో అధిక ఐపీవో కార్యకలాపాలు ఉన్నాయని, 2018 మొదటి ఆరు నెలల్లో 90 ఐపీవోలు 3.9 బిలియన్ డాలర్ల (రూ.26,520 కోట్లు) మేర నిధులు సమీకరించాయని ఆయన తెలిపారు. -
ఈక్విటీ హెచ్చుతగ్గులను ఎలా ఎదుర్కోవాలి?
నేను మరో పదేళ్లలో రిటైరవుతున్నాను. రిటైర్మెంట్ తర్వాత జీవితం సాఫీగా ఉండటం కోసం ఇప్పటికే కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేశాను. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్సీడీ)ల్లో కూడా ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం ఎన్‌సీడీల్లో ఇన్వెస్ట్ చేయవచ్చా? – శ్రీనివాస్, విజయవాడ రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్(ఎన్సీడీ)ల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇవి స్థిరమైన ఆదాయాన్ని ఇస్తాయి. అయితే మీకు డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు ఉండవు. మీరు కొనుగోలు చేసిన ఎన్సీడీలను జారీ చేసిన కంపెనీ బాగా ఉన్నంత కాలం మీ సొమ్ముకు ఎలాంటి ఢోకా ఉండదు. మీరు ఒకటి లేదా రెండు కంపెనీల్లో పెద్ద మొత్తాల్లోనే ఎన్‌సీడీల్లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. అవి మెచ్యూరయ్యే సమయానికి ఆ కంపెనీల ఆర్థిక స్థితిగతులు బాగా లేకపోతే, మీకు ఇబ్బందులు తప్పవు. ఎన్‌సీడీలకు బదులుగా మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. పిల్లల పై చదువులు, సొంత ఇల్లు సమకూర్చుకోవడం, రిటైర్మెంట్ నిధి ఏర్పాటు వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రయోజనాలు పొందవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ కూడా ఎన్‌సీడీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అయితే ఎన్‌సీడీల్లో ఫండ్స్ ఇన్వెస్ట్ చేసే మొత్తం తక్కువగా ఉంటుంది. రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి. మొత్తం మీద రిటైర్మెంట్ కోసం చేసే ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కనీసం మూడో వంతు ఈక్విటీలో ఉండాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చని మీరు తరచూ చెబుతుంటారు. కానీ, ఈక్విటీ మార్కెట్లో ఒడిదుడుకులు చాలా ఎక్కువ కదా ! మరి ఈ ఒడిదుడుకుల ప్రభావం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్ల పెట్టుబడులపై ఉండదా ? వాటిని ఎలా అధిగమించాలి. – మణిమాల, హైదరాబాద్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చనేది నిజం. అలాగే స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు తీవ్రంగానే ఉంటాయన్న మాట కూడా నిజమే. ఈక్విటీ మార్కెట్‌తో సంబంధం ఉన్న ఏ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ అయినా, చివరకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై కూడా స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు 2016లో సెన్సెక్స్ 2 శాతమే రాబడులనిచ్చింది. గత ఏడాది సెన్సెక్స్ రాబడి 28 శాతంగా ఉంది. ఇక ఈ ఏడాది ఇప్పటివరకూ సెన్సెక్స్ రాబడి 4 శాతం వరకూ ఉంటుంది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్‌పై ఒడిదుడుకుల ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. ఈ ఒడిదుడుకుల సమస్యను రెండు రకాలుగా ఎదుర్కోవచ్చు. మొదటిది ఈక్విటీల్లో ఎప్పుడూ దీర్ఘకాలం దృష్ట్యానే ఇన్వెస్ట్ చేయాలి. స్వల్ప కాలిక రాబడుల కోసం ఎప్పుడూ ఈక్విటీలను ఎంచుకోకూడదు. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే, స్వల్పకాలిక ఒడిదుడుకులను విజయవంతంగా ఎదుర్కోవచ్చు. కనీసం ఐదేళ్లకు పైగా ఇన్వెస్ట్ చేయగలిగితేనే ఈక్విటీని ఎంచుకోవాలి. ఇక రెండోది ఈక్విటీల్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయాలి. ఈ విధానంలో ఇన్వెస్ట్ చేస్తే, మార్కెట్ పెరిగినప్పుడు మీకు తక్కువ యూనిట్లు వచ్చినా, మార్కెట్ పతనమైనప్పుడు ఎక్కువ యూనిట్లు వస్తాయి. నా మిత్రుల్లో ఇద్దరు, ముగ్గురు హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఉన్నారు. మొహమాటం కొద్దీ రెండు, మూడు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవలసి వచ్చింది. ఇది కాకుండా మా ఆఫీస్వాళ్ల హెల్త్ పాలసీ కూడా ఉంది. సింగిల్ క్లెయిమ్ కోసం వీటన్నింటిని ఉపయోగించుకోవచ్చా? – వంశీధర్, విశాఖపట్టణం ఆర్థిక సంబంధిత అంశాల్లో ఎప్పుడూ మొహమాటానికి తావు ఇవ్వవద్దు. మొహమాటానికి పోతే అవసరం లేని పాలసీలు తీసుకోవలసి వస్తుంది. అనవసరంగా పాలసీ ప్రీమియంలు చెల్లించాల్సి వస్తుంది. సింగిల్ క్లెయిమ్ కోసం రెండు పాలసీలను ఉపయోగించుకోవచ్చు. ఒక పాలసీ కవరేజ్ పూర్తయితేనే రెండో పాలసీని క్లెయిమ్ చేసుకునే అవకాశాలున్నాయి. సింగిల్ క్లెయిమ్ కోసం రెండు పాలసీలు ఉపయోగించుకోవాలని అనుకున్నారనుకోండి. ఒక్క పాలసీని మాత్రమే నగదు రహిత(క్యాష్‌లెస్) విధానంలో ఉపయోగించుకోవాలి. ఉదాహరణకు, మోకాలి చిప్ప రీప్లేస్మెంట్ కోసం మీకు రూ.2 లక్షలు అవసరమయ్యాయనుకుందాం. మీ ఆఫీస్ పాలసీ కవరేజ్ రూ. లక్షకు, మీరు తీసుకున్న ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ రూ. 1 లక్ష ఉందనుకుందాం. మీరు ఈ రెండు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను వినియోగించుకోవచ్చు. మీరు హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు, హాస్పిటల్ సిబ్బంది ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి క్యాష్‌లెస్ అప్రూవల్ కోసం మీ డాక్యుమెంట్లను పంపిస్తుంది. సదరు సంస్థ ఆమోదం తెలపగానే, మిగిలిన రూ. లక్ష చెల్లించమని మిమ్మల్ని ఆ హాస్పిటల్ అడుగుతుంది. మీరు ఆ మొత్తాన్నిచెల్లించి ట్రీట్మెంట్ తీసుకుంటారు. మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జీ అయ్యేటప్పుడు.. మొదటి బీమా సంస్థ రూ.లక్ష చెల్లించనట్లుగా సెటిల్మెంట్ లెటర్‌ను హాస్పిటల్‌కు పంపిస్తుంది. మీరు ఈ సెటిల్మెంట్ లెటర్‌ను హాస్పిటల్ నుంచి తీసుకొని మీరు చెల్లించిన రూ. లక్ష రికవరీ కోసం వేరే బీమా సంస్థకు పంపించాలి. ఈ సెటిల్మెంట్ లెటర్లో పాలసీ వివరాలు. మీరు ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఎంత ఖర్చయింది, ఎప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. . ఇలా అన్ని వివరాలు ఉంటాయి. మీరు చెల్లించిన రూ. లక్ష మొత్తాన్ని రెండో బీమా సంస్థ నుంచి రీయింబర్స్ పొందడానికి సాధారణంగా ఈ సెటిల్మెంట్ లెటర్ సరిపోతుంది. మీరు ఒకే సంస్థ నుంచి రెండు, మూడు పాలసీలు తీసుకున్నట్లయితే, క్యాష్‌లెస్ సౌకర్యం పొందడం చాలా సులభమవుతుంది. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఆటుపోట్లలో పెట్టుబడికి అనువైనదే!!
ప్రస్తుతం మార్కెట్లు తీవ్ర హెచ్చు, తగ్గులతో ట్రేడవుతున్నాయి. ఇలాంటపుడు ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు నష్టభయం తక్కువగా ఉండాలనే అనుకుంటారు. అలాంటి పథకాల కోసం అన్వేషించే వారు ఎస్బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్‌ను పరిశీలించొచ్చు. మొన్నటి వరకు ఎస్బీఐ మాగ్నం బ్యాలన్స్డ్ ఫండ్‌గా చెలామణి అయిన ఈ పథకం పేరు సెబీ కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్‌గా మారింది. అయితే, పెట్టుబడుల పరంగా పథకం విధానాల్లో పెద్దగా మార్పులేమీ చేసుకోలేదు. ఈక్విటీల్లో కనీసం 65శాతం పెట్టుబడి పెడుతుంది. అంటే ఇంతకుమించి కూడా సందర్భానుసారంగా ఇన్వెస్ట్ చేస్తుంటుంది. మిగిలిన పెట్టుబడులను డెట్ విభాగంలో ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీల్లో పెడుతుంది. మార్కెట్ అస్థిరతల సమయాల్లో ఈ పథకం పనితీరు చెప్పుకోతగిన విధంగా ఉండటం గమనార్హం. నేర్పుతో కూడిన విధానం ఈక్విటీ, డెట్ మార్కెట్లలో అననుకూల సమయాల్లో నగదు నిల్వలను పెంచుకోవడం ఈ పథకం పెట్టుబడుల విధానంలో భాగం. ఈక్విటీల్లో తక్కువ ఎక్స్పోజర్ కారణంగా 2011, 2015 అస్థిరతల మార్కెట్లలో నష్టాలు పరిమితమయ్యాయి. 2014లో బాండ్ మార్కెట్ ర్యాలీలో అధిక లాభాలను ఒడిసి పట్టుకుంది. ఆ ఏడాది 23 శాతం వరకు పెట్టుబడులను దీర్ఘకాలిక ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టింది. అంతకుముందు ఏడాది ఇది 10 శాతంగానే ఉంది. ఇక 2017 ఈక్విటీ మార్కెట్లలో భారీ ర్యాలీ అనంతరం కరెక్షన్ నేపథ్యంలో గడిచిన కొన్ని నెలల కాలంలో ఈక్విటీల్లో పెట్టుబడులను తగ్గించుకుంది. మిడ్‌క్యాప్స్‌కు 30–35 శాతం వరకు కేటాయింపులు చేయడం ద్వారా 2014 బుల్ ర్యాలీలో మంచి పనితీరు కనబరిచింది. అయితే, వీటిలో వాల్యుయేషన్లు గరిష్ట స్థాయికి చేరిన నేపథ్యంలో 2017 నుంచి ఎక్స్పోజర్ తగ్గించుకుంది. డెట్ వైపు గతేడాది కాలంలో 10 ఏళ్ల కాల పరిమితి గల ప్రభుత్వ సెక్యూరిటీలపై ఈల్డ్స్ 7.7 శాతానికి చేరిన నేపథ్యంలో దీర్ఘకాలిక బాండ్లలో పెట్టుబడులను తగ్గించుకుని షార్ట్‌టర్మ్ మనీమార్కెట్ ఇన్స్ట్రుమెంట్లలో ఎక్స్పోజర్ తీసుకుంది. రాబడులు ఇలా ఉన్నాయ్... పెట్టుబడుల పరంగా ఈ విధమైన వ్యూహాల కారణంగా ఈ పథకం సదరు కేటగిరీలో మెరుగైన పనితీరు చూపించగలుగుతోంది. ఏడాది, మూడేళ్లు, ఐదేళ్ల కాలంలో ఈ పథకం రాబడులు కేటగిరీతో పోలిస్తే సగటున 1–5 శాతం అధికంగా ఉన్నాయి. ఏడాది కాలంలో 13.8 శాతం, మూడేళ్లలో 9.9 శాతం, ఐదేళ్లలో 16.8 శాతం చొప్పున వార్షిక రాబడులను ఈ పథకం అందించింది. పోర్ట్‌ఫోలియో:ప్రస్తుతం ఈ పథకం ఈక్విటీలో 65 శాతం, మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్లలో 13 శాతం, కార్పొరేట్ డిబెంచర్లలో 8 శాతం, 11 శాతం ప్రభుత్వ సెక్యూరిటీల్లో కలిగి ఉంది. కాలానుగుణంగా ఈక్విటీ హోల్డింగ్స్‌లో మార్పులు చేస్తుంటుంది. -
మరీ ఎక్కువ రిస్కు వద్దా..?
సెబీ ఆదేశాల నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్స్‌లో కొత్తగా ఏర్పడిన కేటగిరీ ‘కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్’. ఈక్విటీల్లో మోస్తరు రిస్క్ తీసుకునే వారికి ఇది అనుకూలం. ఈ విభాగంలోని ఫండ్ పథకాలు తమ పెట్టుబడుల్లో 10 నుంచి 25 శాతాన్నే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. మిగిలిన పెట్టుబడులను డెట్ సాధనాల్లో పెడతాయి. అధిక భాగాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల కచ్చితంగా నిర్ణీత శాతం రాబడులకు అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఈక్విటీ భాగం నుంచి అధిక రాబడులొస్తాయి. రిస్క్ పరిమితంగా ఉండాలని ఆశించే వారు కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. రిటైర్మెంట్కు దగ్గర్లో ఉన్నవారు, రిటైర్మెంట్ తీసుకున్న వారు కూడా కొంత భాగాన్ని వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చన్నది నిపుణుల సూచన. ఈ విభాగంలో కాస్త మెరుగైన రాబడులను ఇస్తున్న పథకంగా ‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఐపీ25’ పథకాన్ని చెప్పుకోవాలి. అయితే, సెబీ ఆదేశాల నేపథ్యంలో ఈ పథకం పేరు ఈ నెల 28 నుంచి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ రెగ్యులర్ సేవింగ్స్ ఫండ్‌గా మారుతోంది. పేరు మారుతున్నప్పటికీ పథకం పెట్టుబడుల విధానం అలానే కొనసాగనుంది. గడిచిన మూడేళ్ల కాలంలో ఈ పథకం ఈక్విటీల్లో 21– 25 శాతం వరకు ఇన్వెస్ట్ చేసింది. మిగిలిన మొత్తాన్ని డెట్ సాధనాలకు కేటాయించింది. పనితీరు ఇలా ఉంది... ఈ పథకం పనితీరుకు ప్రామాణిక సూచీ ‘క్రిసిల్ హైబ్రిడ్ 75+25 కన్జర్వేటివ్ ఇండెక్స్’. ఇది బీఎస్ఈ 200 (25 శాతం ఈక్విటీ), క్రిసిల్ కాంపోజిట్ బాండ్ ఫండ్ ఇండెక్స్ (75 శాతం డెట్) కలయిక. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఐపీ25 పథకం 2014లో ప్రారంభం కాగా, అప్పటి నుంచి చూస్తే వార్షికంగా 10.3 శాతం రాబడులను పంచింది. మూడేళ్ల కాలంలో చూస్తే వార్షికంగా 9.5 శాతం, ఐదేళ్ల కాలంలో వార్షికంగా 11 శాతం, ఏడేళ్ల కాలంలో వార్షిక రాబడులు 10.8 శాతంగా ఉన్నాయి. ఇదే సమయంలో ఈ విభాగం (తొమ్మిది ఫండ్స్‌తో కూడిన విభాగం) సగటు రాబడులు 7.6 శాతం, 8.8 శాతం, 8.8 శాతం చొప్పునే ఉన్నాయి. ఈ ప్రకారం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఐపీ25 పథకం రాబడులు మెరుగ్గా ఉన్నాయి. అన్ని సమయాల్లోనూ మెరుగైన పనితీరును చూపిస్తూ వస్తోంది. ఈక్విటీల్లో లార్జ్‌క్యాప్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం వల్ల కరెక్షన్ సమయాల్లోనూ రాబడులకు పెద్ద విఘాతం కలగలేదు. అదే సమయంలో బుల్ ర్యాలీల్లోనూ మోస్తరు రాబడులను అందించింది. ఇదీ పోర్ట్‌ఫోలియో... మార్కెట్లలో ఆటుపోట్లకు అనుగుణంగా ఈక్విటీల్లో పెట్టుబడులను 10–25 శాతం మధ్య పెడుతోంది. డెట్ సాధనాల్లో ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్లలో ఇన్వెస్ట్ చేసింది. ఇటీవల డెట్ మార్కెట్లలో ఊగిసలాట పెరగడం, బాండ్లపై పెరిగిన ఈల్డ్ నేపథ్యంలో ఈ పథకం క్రెడిట్ సాధనాల్లో పెట్టుబడిని పెంచింది. రుణ సాధనాల్లో సగటు మెచ్యూరిటీ పదేళ్లు కాగా, గడిచిన ఏడాదిలో దీన్ని 3.6 ఏళ్లకు తగ్గించుకుంది. ఈక్విటీ టాప్ హోల్డింగ్స్ స్టాక్ పేరు పెట్టుబడుల శాతం హెచ్డీఎఫ్సీ బ్యాంకు 4.84 గ్రాసిం ఇండస్ట్రీస్ 3.36 సన్‌ఫార్మా 3.20 జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 2.60 ఎల్అండ్టీ 2.60 భారత్ ఫైనాన్షియల్ 2.45 ఇన్ఫోసిస్ 2.06 టైటాన్ కంపెనీ 2.02 సెంచురీ టెక్స్టైల్స్ 1.75 ఆర్ఐఎల్ 1.73 -
ఈక్విటీలే ముద్దు.. గోల్డ్ ఈటీఎఫ్‌లు వద్దు
న్యూఢిల్లీ: ఈక్విటీలవైపు మొగ్గు చూపుతున్న ఇన్వెస్టర్లు .. క్రమంగా పసిడి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) నుంచి వైదొలుగుతున్నారు. ఏప్రిల్‌లో 14 గోల్డ్ లింక్డ్ ఈటీఎఫ్‌ల నుంచి మరో రూ. 54 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. దీంతో గోల్డ్ ఫండ్స్ నిర్వహణలోని అసెట్స్ విలువ రూ. 4,802 కోట్లకు తగ్గింది. మరోవైపు, ఈక్విటీలు, ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీముల్లో రూ. 12,400 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. అటు లిక్విడ్ ఫండ్స్‌లోకి రూ.1.16 లక్షల కోట్లు చేరాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ (యాంఫీ) విడుదల చేసిన తాజా గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మార్చిలో గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి ఇన్వెస్టర్లు రూ. 62 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. మొత్తం మీద ఏప్రిల్‌లో మ్యూచువల్ ఫండ్ స్కీముల్లోకి రూ. 1.4 లక్షల కోట్లు వచ్చి చేరాయి. దీంతో గత నెలాఖరు నాటికి ఫండ్ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ. 21.36 లక్షల కోట్ల నుంచి రూ. 23.25 లక్షల కోట్లకు చేరింది. గడిచిన అయిదేళ్లుగా గోల్డ్ ఈటీఎఫ్‌లలో ట్రేడింగ్ ఒక మోస్తరుగానే ఉంటోంది. 2012–13లో రూ. 1,414 కోట్ల మేర పెట్టుబడులు చూసిన గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఆ తర్వాత నుంచి ఉపసంహరణలే ఎక్కువగా ఉంటున్నాయి. 2005 నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చి, 2011–12లో రికార్డు స్థాయిలకు చేరిన పసిడి .. 2012లో క్షీణించింది. అప్పట్నుంచి ఔన్సుకి (31.1 గ్రాములు) 1,100–1,400 డాలర్ల శ్రేణిలో తిరుగాడుతోందని మార్నింగ్‌స్టార్ మేనేజర్ రీసెర్చ్ డైరెక్టర్ కౌస్తుభ్ బేలాపుర్కర్ తెలిపారు. ఒకవైపు పసిడి ఇలా ఒకే శ్రేణిలో తిరుగాడుతుండటం, మరోవైపు ఈక్విటీలు మెరుగ్గా రాణిస్తుండటం తదితర అంశాల కారణంగా దేశీ ఇన్వెస్టర్లు .. గోల్డ్ ఈటీఎఫ్‌లకు దూరంగా ఉంటున్నారని ఆయన వివరించారు. -
మ్యూచువల్ ఫండ్స్‌కే ఓటు!
న్యూఢిల్లీ: బ్యాంకు డిపాజిట్లతో సహా ఇతర ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో రాబడులు తగ్గుతుండటంతో ఈక్విటీ మార్కెట్లవైపు మళ్లుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. నేరుగా మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటం కాస్తంత కష్టమైన వ్యవహారం కావటంతో అత్యధికులు మ్యూచువల్ ఫండ్లను ఆశ్రయిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన ఏడాది కాలంలో ఫండ్స్ ఇన్వెస్టర్ల సంఖ్య కొత్తగా 32 లక్షలు పెరిగింది. పరిశ్రమ చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు కూడా దీనికి కారణమవుతున్నట్లు మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (యాంఫీ) చెబుతోంది. ‘‘మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లలో అవగాహన కల్పించేందుకు తొలిగా 2017 మార్చిలో ప్రతిష్టాత్మకంగా మ్యూచువల్ ఫండ్స్ సహి హై (మ్యూచువల్ ఫండ్స్ సరైనవి) ప్రచార కార్యక్రమాన్ని ఆరంభించా. ఇపుడు మరో మీడియా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దీని ద్వారా దీర్ఘకాలంలో మరీ ముఖ్యంగా మార్కెట్లు ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే కలిగే ప్రయోజనాలు ఇన్వెస్టర్లకు తెలియజేస్తాం. తొలి విడత ప్రచార కార్యక్రమం దాదాపు 32 లక్షల మంది కొత్త ఇన్వెస్టర్లను ఫండ్లకు పరిచయం చేసింది. రెండో విడత ప్రచారం మరింత మందిని దగ్గర చేస్తుందని భావిస్తున్నాం’’ అని యాంఫీ తెలియజేసింది. 50 లక్షల మంది కొత్త ఇన్వెస్టర్లే లక్ష్యం వచ్చే ఏడాది కాలంలో 50 లక్షల మంది కొత్త ఇన్వెస్టర్లను ఫండ్లకు పరిచయం చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు యాంఫీ తెలియజేసింది. ‘కుటుంబాల ఆదాయం పెరిగింది. భారత్ దీర్ఘకాలిక వృద్ధి అంచనా నేపథ్యంలో ప్రజలు ఆర్థికంగా పొదుపు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ప్రతి కుటుంబానికీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ సాధనంగా మారతాయి’’ అని యాంఫీ చైర్మన్ ఎ.బాలసుబ్రమణ్యన్ చెప్పారు. ‘ఇన్వెస్టర్లకు సహనం కావాలి. ఇన్వెస్ట్మెంట్లను కొనసాగిస్తూ వెళ్లాలి. పోర్ట్‌ఫోలియోకు డెట్, హైబ్రిడ్ ఫండ్స్‌ను జతచేసుకోవాలి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్‌కు (సిప్) మరీ ముఖ్యంగా మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు అధిక ప్రాధాన్యమివ్వాలి. దీర్ఘకాలంలో లబ్ధి పొందేలా ఇన్వెస్ట్మెంట్లను కొనసాగించాలి’ అని ఆయన వివరించారు. వచ్చే ఏడాది కాలంలో దేశ జనాభాలో 2 శాతం మందిని ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేలా చూడడానికి తమకు ‘మ్యూచువల్ ఫండ్స్ సహి హై’ దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 1.5 శాతం కన్నా తక్కువ మంది ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఏయూఎంలో 25 శాతం వృద్ధి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్ల పెరుగుదలతో పాటు ఫండ్స్ నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) కూడా వృద్ధి చెందాయి. 2017 మార్చి నుంచి చూస్తే ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఫండ్స్ ఏయూఎం విలువ 25 శాతం వృద్ధితో రూ.4.25 లక్షల కోట్లు పెరిగింది. ‘మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో ఇటీవల గణనీయమైన వృద్ధి నమోదయ్యింది. ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని కాపాడుకుంటూ రానున్న రోజుల్లోనూ ఇదే ట్రెండ్‌ను కొనసాగిస్తాం’ అని యాంఫీ సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ తెలిపారు. ఫండ్స్‌లో రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేయండని తెలియజేసే ‘జన్ నివేశ్’ ప్రచార కార్యక్రమ ఆవిష్కరణకు ప్రముఖ మీడియా సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని పేర్కొన్నారు. ఠీఠీఠీ.ఝu్టu్చ జunఛీటట్చజిజీ.ఛిౌఝ మైక్రోసైట్‌ను అందుబాటులో ఉంచిందని, ఇందులో ఫండ్స్‌కు సంబంధించిన వివరాలను, సమీపంలోని ఫండ్ కార్యాలయం, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ల సమాచారాన్ని పొందొచ్చని తెలియజేశారు. -
ఎల్టీసీజీ ఉన్నా ఈక్విటీ ఫండ్స్ ఓకే!!
దీర్ఘకాల మూలధన లాభాల పన్ను (ఎల్టీసీజీ–లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్) మళ్లీ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిదేనా? – పరిమళ, సికింద్రాబాద్ దీర్ఘకాల మూలధన లాభాల పన్ను (ఎల్టీసీజీ–లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్) మళ్లీ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిదే. ఈ ఫండ్స్ తమ మొత్తం నిధుల్లో ఈక్విటీల్లో మూడో వంతు, ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లో మరో మూడో వంతు, ఫిక్స్డ్–ఇన్కమ్ సాధనాల్లో మరో మూడో వంతు చొప్పున ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ ఫండ్స్‌లో ఏడాదికి మించి మీ ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగితే మీరు పొందే రాబడులపై 10 శాతం మేర పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫండ్స్ నుంచి స్టిస్టమేటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) ద్వారా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకుంటే అది మరింత అర్థవంతంగా ఉంటుంది. ఈక్విటీలో పెట్టిన మూడో వంతు పెట్టుబడిని రీ–బ్యాలెన్సింగ్‌కు వినియోగిస్తారు. దీనిపై ఎలాంటి పన్ను భారాలూ ఉండవు. అందుకని ఈక్విటీ సేవింగ్స్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం కొనసాగించవచ్చు. దీంట్లో గ్రోత్ ప్లాన్‌ను ఎంచుకోవాలి. సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) ద్వారా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోవాలి. రోజులు గడిచే కొద్దీ, ద్రవ్యోల్బణం కారణంగా ఈ ఈక్విటీ సేవింగ్స్ స్కీమ్స్ ఆకర్షణ కోల్పోవచ్చు. పెట్టుబడి సంబంధిత కేటాయింపులు కారణంగా వీటికి మాత్రం ప్రాధాన్యత తగ్గదనే చెప్పవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లకు ఇచ్చే డివిడెండ్లపై డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) విధించారు కదా! ఈ సందర్భంలో డివిడెండ్ ప్లాన్‌ను ఎంచుకోవాలా ? లేకుంటే గ్రోత్ ఆప్షన్లో ఇన్వెస్ట్ చేయాలా? – సుధాకర్, విజయవాడ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అందించే డివిడెండ్లపై డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) విధించిన నేపథ్యంలో గ్రోత్ ఆప్షన్‌ను ఎంచుకోవడమే ఉత్తమం. డీడీటీ విధింపుకు ముందు కూడా గ్రోత్ ప్లాన్లే ఆకర్షణీయంగా ఉండేవి. చాలా ఈక్విటీ ఫండ్స్ ఇచ్చే డివిడెండ్లను పరిశీలిస్తే, ఆయా ఫండ్ల డివిడెండ్ ఈల్డ్ ఆరు నుంచి ఏడు శాతానికి మించి ఉండేది కాదు. ఈక్విటీ ఫండ్స్ గ్రోత్ ఆప్షన్లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే ఇంతకు మించి మంచి రాబడులు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పీరియాడిక్ ఆదాయం(డివిడెండ్ల ద్వారా కొంత మొత్తంలో) పొందాలనుకోకూడదు. ఉదాహరణకు రూ.10 ముఖ విలువ గల ఒక ఈక్విటీ ఫండ్‌ను తీసుకుందాం. దీని ఎన్ఏవీ రూ.15 ఉంది. ఇది 10 శాతం డివిడెండ్‌ను ప్రకటించింది. మీరు డివిడెండ్ ఆప్షన్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు రూ.1 డివిడెండ్ లభిస్తుంది. ఈ మేరకు ఎన్ఏవీ రూ.14కు తగ్గుతుంది. 10 శాతం డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే మీకు 90 పైసలే డివిడెండ్ వస్తుంది. అదే గ్రోత్ ఆప్షన్‌ను ఎంచుకుంటే, ఎన్ఏవీ రూ.15 అలాగే కొనసాగుతుంది. పైగా ఎలాంటి పన్ను భారం కూడా ఉండదు. నేను సీనియర్ సిటిజన్‌ను. నేను గతంలో ఇన్వెస్ట్ చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ ఒకటి ఇటీవలే మెచ్యూర్ అయింది. ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసి నెలవారీ కొంత ఆదాయాన్ని పొందాలనేది నా ఆలోచన. దీనికి తగ్గట్టుగా మంచి పెట్టుబడి వ్యూహాన్ని సూచించండి? – ఆంజనేయులు, విశాఖపట్టణం ముందుగా మీ జీవన వ్యయాలకు అవసరమయ్యే నెలవారీ ఖర్చులను పూర్తిగా రాసుకోండి. మీ నెలవారీ అవసరాలకు ఎంత మొత్తం అవసరమవుతుందో లెక్కించండి. ఈ అవసరాలను తీర్చే ఇతర ఆదాయాలు.. (ఉదాహరణకు మీకు ఇంటద్దెలు రావడం కానీ, పెన్షన్ రావడం కానీ) ఏమీ లేని పక్షంలో సీనియర్ సిటిజన్స్ స్కీమ్‌లో రూ.15 లక్షల వరకూ ఇన్వెస్ట్ చేయండి. ఈ స్కీమ్‌లో మీకు 8.3 శాతం వడ్డీ లభిస్తుంది. ఇది పూర్తిగా సురక్షితం. మీకు మూడు నెలలకొకసారి వడ్డీ వస్తుంది. ఎల్ఐసీకి చెందిన ప్రధాన మంత్రి వ్యయ వందన యోజనలో కూడా గరిష్ట పెట్టుబడి రూ.15 లక్షలు. దీనిపై కూడా 8.3 శాతం వడ్డీ వస్తుంది. ఈ రెండు స్కీమ్‌లూ సురక్షితమైనవే. ఒకటి పూర్తిగా ప్రభుత్వం ఆఫర్ చేస్తున్న స్కీమ్ కాగా, మరొకటి ప్రభుత్వం స్పాన్సర్చేస్తున్న స్కీమ్. ఇక మిగిలిన మొత్తాన్ని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి. ఫిక్స్డ్ డిపాజిట్లు సురక్షితమైనవే కానీ, మీ పెట్టుబడి వ్యూహానికి అవి తగవు. రిటైర్మెంట్ వ్యక్తులకు ద్రవ్యోల్బణంతో తట్టుకునే క్రమబద్ధమైన ఆదాయం అవసరం. స్థిరాదాయం అందించే ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలు ప్రస్తుత అవసరాలకు తగ్గ ఆదాయాన్ని మాత్రమే ఇవ్వగలవు. మూడేళ్ల తర్వాత ద్రవ్యోల్బణంతో పాటు ధరలు కూడా పెరుగుతాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా మీ ఆదాయం కూడా పెరగాలి. కానీ ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల్లో మీ పెట్టుబడి కూడా స్థిరంగానే ఉంటుంది. కానీ వృద్ధి ఉండదు. ఐదు లేదా పదేళ్ల కాలానికి ద్రవ్యోల్బణంతో పాటే పెరిగేలా మీ రాబడులు ఉండాలి. దీనికి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడమే సరైన మార్గం. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. మీ పెట్టుబడికి రక్షణ ఉండాలి. అలాగే ద్రవ్యోల్బణానికి తగ్గట్టుగానే రాబడులు ఉండాలి. ఈక్విటీల్లో ఎప్పుడూ ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయకూడదు. వయస్సు పెరుగుతున్న కొద్దీ రిస్క్‌ను తగ్గించుకోవాలి. అందుకని మీ మొత్తం పెట్టుబడుల్లో 30 నుంచి 40 శాతం కంటే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయొద్దు. - ధీరేంద్ర కుమార్ ,సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ప్రపంచ ట్రెండ్.. దిక్సూచి!
న్యూఢిల్లీ: సెలవుల కారణంగా మూడురోజులు మాత్రమే ట్రేడింగ్ జరిగే ఈ వారంలో మార్కెట్...ప్రపంచ సంకేతాలకు అనుగుణంగా కదులుతుందని విశ్లేషకులు చెపుతున్నారు. అమెరికా–చైనాల మధ్య తాజాగా తలెత్తిన వాణిజ్య యుద్ధం విస్త్రతమవుతుందన్న భయాలు, మార్చి డెరివేటివ్ కాంట్రాక్టులు ముగియనుండటం వంటి అంశాల కారణంగా ఈక్విటీల్లో ఒడిదుడుకులు చోటుచేసుకుంటాయని వారు హెచ్చరిస్తున్నారు. మహవీర్ జయంతి, గుడ్‌ఫ్రైడే పండుగలతో వచ్చే గురు, శుక్రవారాల్లో (మార్చి 28, 29 తేదీలు)మార్కెట్‌కు సెలవుకాగా, డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు బుధవారమే (మార్చి 28) జరుగుతుంది. సాధారణంగా ప్రతీ నెలా చివరి గురువారం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ విభాగపు కాంట్రాక్టులు క్లోజ్చేయాల్సివుంటుంది. వాణిజ్య యుద్ధంతో దెబ్బ... చైనా దిగుమతులపై 60 బిలియన్ డాలర్ల విలువైన సుంకాలు విధించే ప్రతిపాదనకు సంబంధించిన ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత గురువారం సంతకాలు చేయగా, ఆ మర్నాడే అమెరికా దిగుమతులపై 3 బిలియన్ డాలర్ల మేర సుంకాల్ని విధిస్తున్నట్లు చైనా ప్రకటించడంతో అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ భయాలు పెరిగాయని, దీంతో ఈక్విటీ మార్కెట్లు దెబ్బతింటున్నాయని మార్కెట్ నిపుణులు చెప్పారు. సమీప భవిష్యత్తులో ఈ తరహా రక్షణాత్మక విధానాలు మరిన్ని వుండవచ్చన్న ఆందోళన మార్కెట్లో నెలకొందని, ఈ విధానాలు ప్రపంచ ఆర్థికాభివృద్ధికి ఆటంకం కల్గిస్తాయని వారు వివరించారు. అమెరికా–చైనాల మధ్య తలెత్తిన ఈ వాణిజ్య యుద్ధ ప్రభావంతో గత వారం భారత్‌తో సహా ప్రపంచ ప్రధాన మార్కెట్లన్నీ పతనమయ్యాయి. గత గురు, శుక్రవారాల్లో అమెరికా సూచీలు 4 శాతం వరకూ క్షీణించాయి. ఇక్కడ సెన్సెక్స్ వారం మొత్తం మీద 579 పాయింట్లు కోల్పోయింది. దేశీయ సమస్యలు కూడా... అంతర్జాతీయ పరిణామాలకు తోడు దేశీయ సమస్యలు కూడా మన మార్కెట్‌ను పట్టిపీడిస్తున్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఇక్కడి ఈక్విటీలు అధిక విలువల్ని కలిగివుండటం, ఎన్నికల ముందస్తు రాజకీయ అనిశ్చితి వంటి అంశాలతో ప్రపంచ మార్కెట్లతో పోలిస్తే భారత్ సూచీలు భారీగా తగ్గాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. అయితే ఇక్కడ ఫండ్స్‌లో రిడంప్షన్ల ఒత్తిడి తగ్గిందని, ఈ మార్చి నెలాఖరునాటికి పరిస్థితులు కుదుటపడతాయని అంచనావేస్తున్నామన్నారు. కానీ అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం తీవ్రతరమయ్యే అవకాశాలున్నందున, మార్కెట్లో కొద్దిరోజులపాటు హెచ్చుతగ్గులు చోటుచేసుకోవొచ్చని, ఈ వారం మార్కెట్‌కు రెండు రోజుల సెలవు దినాలుకావడం, డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు దగ్గరపడటం వంటి అంశాలతో ఒడిదుడుకులు పెరగవచ్చని ఆయన అన్నారు. వాణిజ్య యుద్ధ భయాలు, రాజకీయ వాతావరణం కారణంగా మధ్యకాలికంగా బుల్స్‌పై ఒత్తిడి వుండవచ్చని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమిత్ మోది అంచనావేశారు. -
ఎన్‌పీఎస్‌లో.. పెడుతున్నారా..?
నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో (ఎన్పీఎస్) పెట్టుబడుల తీరుతెన్నులను మార్చాలని పెన్షన్ ఫండ్ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్ఆర్డీఏ) యోచిస్తోంది. ఇందులో భాగంగా... ప్రస్తుతం 50 శాతానికే పరిమితమైన ఈక్విటీలకు కేటాయించే మొత్తాన్ని ఇకపై 75 శాతం దాకా పెంచేలా ప్రతిపాదిస్తోంది. దీనిపై అభిప్రాయాలు సేకరిస్తోంది. ఎందుకిలా? ఒకవేళ ఇలా చేస్తే చందాదారులకు కలిగే లాభనష్టాలేంటి? ఒకసారి చూద్దాం... – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం ప్రస్తుతం ఎన్‌పీఎస్‌లో నాలుగు రకాల ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశముంది. అవి.. 1. ప్రభుత్వ సెక్యూరిటీస్ ఫండ్ లేదా స్కీమ్ జీ 2. కార్పొరేట్ బాండ్స్ ఫండ్ లేదా స్కీమ్ సి 3. ఈక్విటీస్ ఫండ్ లేదా స్కీమ్ ఈ 4. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ లేదా స్కీమ్ ఎ. వీటిల్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రధానంగా రెండు మార్గాలున్నాయి. మొదటిది... లైఫ్ సైకిల్ ఆధారిత విధానం. ఇందులో మీ వయసు ఆధారంగా పెట్టుబడులు పెట్టేలా ముందే నిర్ణయించిన లైఫ్ సైకిల్ ఫండ్ ప్లాన్ ఉంటుంది. దీని ప్రకారం 35 ఏళ్లు వచ్చే దాకా ఈక్విటీలకు గరిష్టంగా 50% కేటాయించవచ్చు. 55 ఏళ్లు వచ్చేసరికి ఇది 10 శాతానికి తగ్గిపోతుంది. అయితే 2016లో కొత్తగా మరో రెండు లైఫ్ సైకిల్ ఫండ్స్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో ఒక దాని తీరు దూకుడుగా ఉండేది కాగా.. ఇంకొకటి కాస్త సంప్రదాయబద్ధంగా ఉండేది. దూకుడుగా ఉండే అగ్రెసివ్ లైఫ్ సైకిల్ ఫండ్ విధానంలో 35 ఏళ్లు వచ్చే దాకా గరిష్టంగా 75% మేర ఈక్విటీలకు కేటాయించవచ్చు. అదే సాంప్రదాయబద్ధంగా ఉండే కన్జర్వేటివ్ ఆప్షన్లో ఇది 25 శాతమే. 55 ఏళ్లు వచ్చేసరికి ఈక్విటీలకు కేటాయింపులు అగ్రెసివ్ ఫండ్ విధానంలోనైతే 15 శాతానికి, కన్జర్వేటివ్ విధానంలోనైతే 5 శాతానికి తగ్గిపోతాయి. ఈ లైఫ్ సైకిల్ ఫండ్స్ విధానంలో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ జోలికి వెళ్లవు. ఇక, రెండవది యాక్టివ్ విధానం. ఇందులో ఏ దశలో కూడా ఈక్విటీలకు కేటాయింపులు 50 శాతానికి మించవు. అయితే, అంతర్గత పరిమితులకు లోబడి ఇన్వెస్టర్లు.. నాలుగింట్లో ఏ స్కీములోనైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. నిర్దిష్ట పరిమితి దాకా కేటాయింపులు చేయొచ్చు. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో మాత్రం పరిమితి 5 శాతమే. ఈ యాక్టివ్ విధానంలోనే ఈక్విటీల్లో ఇప్పటిదాకా 50 శాతంగా ఉన్న పెట్టుబడుల పరిమితిని 75% దాకా పెంచాలని పీఎఫ్ఆర్డీఏ యోచిస్తోంది. అయితే, దీన్లోనూ ఓ మెలిక ఉంది. అది... 50 ఏళ్లు వచ్చే దాకా మాత్రమే ఈక్విటీలకు 75%దాకా కేటాయించవచ్చు. ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గించుకోవాలి. రిటైర్మెంట్ నాటికి దీన్ని 50 శాతానికి తగ్గించుకోవాలి. ఇలా కేటాయింపులు తగ్గించుకుంటూ రాగా మిగిలిన మొత్తాన్ని ఇతర ఫండ్స్‌కి మళ్లించవచ్చు. ఎన్పీఎస్ ప్రయోజనాలు.. ఎన్‌పీఎస్‌లో ఫండ్ మేనేజ్మెంట్ చార్జీలు అత్యంత తక్కువగా 0.01%మేర ఉంటున్నాయి. ఇది కొంత మేర పెరిగినా రాబడులు అధికంగా ఇచ్చే అవకాశాలున్నందున అంతిమంగా ఇన్వెస్టర్లకు లాభమేనన్నది పరిశ్రమ వర్గాల మాట. పన్నుపరమైన ప్రయోజనాలు కల్పించడం ఎన్‌పీఎస్‌లో రెండో ఆకర్షణీయ అంశం. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీసీడీ (1బి) కింద అదనంగా రూ.50,000 మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 80సి కింద లభిస్తున్న రూ.1.5 లక్షల డిడక్షన్‌కి ఇది అదనం. ప్రతికూలాంశాలూ ఉన్నాయ్... మెచ్యూరిటీ తరవాత వచ్చే మొత్తంలో కనీసం 40 శాతాన్ని కచ్చితంగా యాన్యుటీ పథకంలో ఇన్వెస్ట్ చేయాలన్న నిబంధన ఇబ్బందికరమే. సాధారణంగా యాన్యుటీ పథకాలపై వచ్చే రాబడులు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే.. భవిష్యత్‌లో మళ్లీ కావాలనుకుంటే ఎకాయెకిన వెనక్కి తీసుకోలేకుండా కొంత మొత్తాన్ని యాన్యుటీ పథకాల్లో లాక్ చేసేస్తున్నట్లే లెక్క. అలా కాకుండా రిటైర్మెంట్ అవసరాలకు తగిన ఆదాయాన్ని అందించేలా డెట్, ఈక్విటీ మేళవింపుతో.. సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) గల మ్యూచువల్ ఫండ్స్ ఉపయోగకరంగా ఉంటాయన్నది వారి సూచన. మరోవైపు, 50 ఏళ్ల నుంచి ఈక్విటీలకు కేటాయింపులు తగ్గించుకుంటూ రావాలన్న నిబంధనను వ్యతిరేకించే వారూ ఉన్నారు. యాభై ఏళ్లు పైబడినా దూకుడుగా ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే సామర్ధ్యం ఉండే ఇన్వెస్టర్లు కూడా ఉంటారు కాబట్టి.. ఆ ఆప్షన్ వారికే వదిలేయడం మంచిదని సదరు ఫైనాన్షియల్ ప్లానర్స్ అభిప్రాయం. ఏదైతేనేం.. ఈక్విటీలకు కేటాయింపులు పెంచే వీలు కల్పించే ప్రతిపాదన మంచిదే అయినప్పటికీ పరిమితమైన లిక్విడిటీ స్వభావం ఉన్నందున రిటైర్మెంట్ అవసరాల కోసం ఒక్క ఎన్పీఎస్ మీదే ఆధారపడటం సరికాదన్నది నిపుణుల మాట. రిటైర్మెంట్ కోసం ఇతరత్రా సాధనాలకు కూడా పెట్టుబడులు కేటాయించడం మంచిదని వారి అభిప్రాయం. -
విశ్రాంత జీవనానికి.. ఈ ఫండ్లు బెటర్..!
ఈ ఏడాది ఆదాయపు పన్ను గడువు ముగియటానికి ఇంకా 20 రోజులే మిగిలి ఉంది. అంటే మార్చి 31 రావటానికి నిండా మూడు వారాలు కూడా లేదు. పన్ను భారం ఎక్కువవుతోందనుకునే వారు చివర్లో మినహాయింపుల కోసం కొన్ని పెట్టుబడులు పెట్టడం మామూలే. ముందుగానే ప్లాన్ చేసుకోవాలని ఎందరు ఎన్ని రకాలుగా చెప్పినా... వారు చివరి క్షణాల్లోనే ఏదో ఒక పథకంలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. సరే!! ఎవరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా... అది సెక్షన్ 80సీ పరిధిలోకి వచ్చేదైతేనే పన్ను మినహాయింపు లభిస్తుందనేది మనకు తెలియంది కాదు. బ్యాంకులు జారీ చేసే ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టాఫీసు పీపీఎఫ్ డెట్ విభాగంలోనివి. ఈక్విటీ వైపు చూస్తే ముందు కనిపించేది ఈఎల్ఎస్ఎస్లే. మ్యూచువల్ ఫండ్స్ అందించే రిటైర్మెంట్ సేవింగ్ ఫండ్స్‌లో పెట్టుబడులు సైతం òసెక్షన్ 80సీ కింద ప్రయోజనానికి అర్హత కలిగినవే. పన్ను ఆదాతో పాటు రిటైర్మెంట్ అవసరాల కోసం నిధి సమకూర్చుకునేందుకు ఇవి ఉపకరిస్తాయి. విశ్రాంత జీవనంలో ఇబ్బందులు పడకూడదని భావించే వారు ఏ వయసు వారైనా... ఈ పథకాల వైపు చూస్తే మంచిది. రిటైర్మెంట్ ఫండ్స్.. ఒక్కొక్కరికి ఒకటి ఈ ఫండ్స్ సాధారణంగా రిటైర్మెంట్ ప్రణాళిక కోసం ఉద్దేశించినవి. వీటిలో వార్షికంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెడితే అవి సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులోకి వస్తాయి. అంతకు మించి పెట్టుబడి పెట్టినా మినహాయింపు లభించేది రూ.1.5 లక్షలకే అని గుర్తుంచుకోవాలి. హెచ్డీఎఫ్సీ రిటైర్మెంట్ సేవింగ్స్ ఈక్విటీ, హెచ్డీఎఫ్సీ రిటైర్మెంట్ సేవింగ్స్ హైబ్రిడ్ ఈక్విటీ, హెచ్డీఎఫ్సీ రిటైర్మెంట్ సేవింగ్స్ హైబ్రిడ్ డెట్, రిలయన్స్ రిటైర్మెంట్ ఫండ్ వెల్త్ క్రియేషన్, రిలయన్స్ రిటైర్మెంట్ ఫండ్ ఇన్కమ్ జనరేషన్, ఫ్రాంక్లిన్ ఇండియా పెన్షన్, యూటీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ ప్లాన్ ఇవన్నీ రిటైర్మెంట్ అవసరాల కోసం ఇన్వెస్ట్ చేసుకునేందుకు, పన్ను మినహాయింపునుకు అర్హత కలిగిన పథకాలే. ఇన్వెస్టర్ల వయసు, రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా పథకాలను ఎంచుకోవాలి. యువ ఇన్వెస్టర్లయితే.. హెచ్డీఎఫ్సీ రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ ఈక్విటీ, రిలయన్స్ రిటైర్మెంట్ ఫండ్ వెల్త్ క్రిచేషన్ పథకాలు కాస్తంత దూకుడుగా పెట్టుబడులు పెడుతుంటాయి. అంటే అధిక రిస్క్ తీసుకుని ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక రాబడులను ఇచ్చే తరహాలో పనిచేస్తాయి. సేకరించిన నిధుల్లో 85 శాతానికిపైగా ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. రిటైర్మెంట్కు సుదీర్ఘ సమయం కలిగిన యువ ఇన్వెస్టర్లకు ఈ పథకాలు అనువుగా ఉంటాయి. రిటైర్మెంట్కు దగ్గరలో ఉంటే... ఇక హెచ్డీఎఫ్సీ రిటైర్మెంట్ సేవింగ్స్ హైబ్రిడ్ డెట్, రిలయన్స్ రిటైర్మెంట్ ఫండ్ ఇన్కమ్ జనరేషన్ పథకాలు ఆచితూచి వ్యవహరిస్తాయి. అంటే, పెట్టుబడుల విలువను కాపాడేందుకు తక్కువ రిస్క్ ఉండే సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అధిక రిస్క్ ఉండే ఈక్విటీల్లో కేవలం 20– 25 శాతాన్నే ఇన్వెస్ట్ చేస్తాయి. రిటైర్మెంట్కు దగ్గర్లో ఉన్న వారికి ఇవి అనువైనవి. రిస్క్ వద్దనుకునే మధ్య వయస్కులూ వీటిని ఎంచుకోవచ్చు. మధ్యస్థంగా రిస్క్ భరించగలిగితే... హెచ్డీఎఫ్సీ రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ అయితే ఈక్విటీల్లో 65–70 శాతం ఇన్వెస్ట్ చేస్తాయి. ఫ్రాంక్లిన్ ఇండియా పెన్షన్ ప్లాన్, యూటీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ ప్లాన్ పథకాలు ఈక్విటీలకు 40 శాతం కేటాయింపులు చేస్తుంటాయి. మిగిలిన నిధుల్ని బాండ్లలో పెడతాయి. మధ్యస్థంగా రిస్క్ భరించే వారు వీటిని పరిశీలించొచ్చు. ఫ్రాంక్లిన్, యూటీఐ.... సుదీర్ఘ చరిత్ర ఫ్రాంక్లిన్ ఇండియా పెన్షన్ ప్లాన్, యూటీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ ప్లాన్‌కు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఏడాది, మూడేళ్లు, ఐదేళ్లు, పదేళ్ల కాలంలో ఈ పథకాలు చక్కని పనితీరు చూపించాయి. గత పది సంవత్సరాల కాలంలో వార్షికంగా 8.7 నుంచి 9.4 శాతం వరకు రాబడులిచ్చాయి. రిలయన్స్, హెచ్డీఎఫ్సీ పథకాలకు సుదీర్ఘ చరిత్ర లేదు. ఈ మధ్యే ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ ప్రారంభం నుంచి చూస్తే చెప్పుకోతగ్గ రాబడులనే ఇచ్చాయి. మార్కెట్లు బుల్ ర్యాలీలో ఉండడంతో గడిచిన ఏడాది కాలంలో హెచ్డీఎఫ్సీ రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ ఈక్విటీ, రిలయన్స్ రిటైర్మెంట్ ఫండ్ వెల్త్ క్రియేషన్ 34 శాతం చొప్పున లాభపడ్డాయి. లాకిన్ పీరియడ్... మూడు లేదా ఐదేళ్లు! ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ పథకాల (ఈఎల్ఎస్ఎస్) మాదిరే రిటైర్మెంట్ ఫండ్స్‌లోనూ మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. అయితే ఇది పథకాలను బట్టి మారిపోవచ్చు. హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించిన రిటైర్మెంట్ ఫండ్స్‌కు లాకిన్ పీరియడ్ ఐదేళ్లు. ప్రాంక్లిన్ ఇండియా పెన్షన్ ప్లాన్, యూటీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ ప్లాన్‌లో మూడు ఆర్థిక సంవత్సరాలు లాకిన్ పీరియడ్‌గా అమల్లో ఉంది. సెబీ ఇటీవల మ్యూచువల్ ఫండ్ పథకాల వర్గీకరణలో మార్పులు చేయడంతో ఈ పథకాల్లోనూ లాకిన్ పీరియడ్ ఐదేళ్లకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. రిటైర్మెంట్ ఫండ్స్ అన్నవి దీర్ఘకాలిక లక్ష్యానికి ఉద్దేశించినవి. ఇందుకు సంబంధించిన ప్రయోజనాలు నెరవేరడానికి ఇవి దోహదపడతాయి. మధ్యలో ఉపసంహరిస్తే ఎగ్జిట్ లోడ్... మధ్యలో కీలకమైన అవసరాలు ఏర్పడితే ఈ ఫండ్స్ నుంచి పెట్టుబడుల్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. కానీ, ముందుగా పెట్టుబడుల్ని వెనక్కి తీసుకోవటాన్ని తగ్గించేందుకు కంపెనీలు ఎగ్జిట్ లోడ్ విధిస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ ఫండ్స్ లాకిన్ పీరియడ్ ముగిసి, 60 ఏళ్లు రాకముందే పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే విలువలో ఒక శాతాన్ని ఎగ్జిట్ లోడ్‌గా వసూలు చేస్తున్నాయి. ఇక పన్ను అంశాలనూ చూడాలి. ఈక్వీటీ తరహా పథకాలను (అంటే మొత్తం నిధుల్లో 65 శాతం కంటే ఎక్కువ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసేవి) ఏడాది తర్వాత విక్రయిస్తే వాటిపై 10 శాతం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను పడుతుంది. అదే డెట్ పథకాల్లో అయితే మూడేళ్ల తర్వాత విక్రయిస్తే 20 శాతం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ ఫండ్స్‌లో లాకిన్ పీరియడ్ ఐదేళ్లు ఉంది కనుక డెట్ ఫండ్స్‌ను ఆ తర్వాత విక్రయిస్తే ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించి మిగిలిన లాభంపై 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈఎల్ఎస్ఎస్ పథకాలు ప్రధానంగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసేవి. అదే, రిటైర్మెంట్ ఫండ్స్ అయితే డెట్‌లో ఇన్వెస్ట్ చేసేవీ ఉంటాయి. రిటైర్మెంట్ ఫండ్స్‌ను ఎన్పీఎస్, ఇతర పథకాలతో కలసి పెట్టుబడులకు పరిశీలించొచ్చు. -
మార్కెట్లు పెరిగినా ఇబ్బంది లేదు!
రాబడుల విషయంలో ఈక్విటీలను మించి అధిక రాబడులనిచ్చే సాధనాలు దాదాపుగా లేవనే చెప్పాలి. దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ.లక్ష దాటితే 10 శాతం పన్ను ప్రవేశపెట్డం వల్ల రాబడులు పెద్దగా ప్రభావితం కావని, ఈక్విటీలు భవిష్యత్తులోనూ మెరుగైన రాబడులనే ఇస్తాయన్నది విశ్లేషకుల అంచనా. ఈ నేపథ్యంలో... స్టాక్ మార్కెట్లు గరిష్ట స్థాయిలో ఉన్నా కూడా రిస్క్ పెద్దగా లేకుండానే తగిన రాబడులు కావాలనుకునే వారు ఎల్ అండ్ టీ ప్రుడెన్స్ ఫండ్‌ను పరిశీలించొచ్చు. ఎల్అండ్టీ ప్రుడెన్స్ ఫండ్ ఈక్విటీ ఆధారిత బ్యాలన్స్డ్ ఫండ్. పథకం పరిధిలోని మొత్తం నిధుల్లో 65 శాతం వరకు ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. మిగిలిన 35 శాతం మేరకు డెట్ మార్కెట్లో పెట్టుబడి పెడతారు. మార్కెట్లు పెరిగి ఉన్నప్పటికీ మరింత ర్యాలీ చేస్తే ఆ అవకాశం కోల్పోకుండా ఈక్విటీ పెట్టుబడులు ఉపయోగపడతాయి. అదే సమయంలో కరెక్షన్కు లోనైతే రిస్క్ తక్కువగా ఉండేందుకు డెట్ ఎక్స్పోజర్ సాయపడుతుంది. కనుక ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఈ ఫండ్ ఒక మంచి ఆప్షన్. పెట్టుబడుల విధానం, పనితీరు మార్కెట్ల ర్యాలీ ఎంత పద్ధతి ప్రకారం ఉన్నాగానీ ఈ ఫండ్ ఈక్విటీ పెట్టుబడులను పరిమితికి మించి పెంచదు. ఏ సమయంలో చూసినా ఈక్విటీ ఎక్స్పోజర్ 65–75 శాతం మధ్యలోనే ఉంటుంది. మార్కెట్లు బుల్ ర్యాలీ సమయంలో ఎక్స్పోజర్ను గరిష్టంగా 75 శాతం వరకు పెంచుతుంది. ఆటుపోట్లు ఎక్కువైతే పెట్టుబడుల్ని 65 శాతానికి పరిమితం చేస్తుంది. ఈక్విటీల్లోనూ రిస్క్ తక్కువ ఉండే విభాగంపైనే ఎక్కువ దృష్టి పెడుతుంది. ఆటుపోట్లు ఎక్కువగా ఉండే మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో (మార్కెట్ క్యాప్ రూ.10,000 కోట్లకు తక్కువగా ఉన్నవి) పెట్టుబడుల్ని 30 శాతం మించకుండా చూస్తుంది. అలాగే డెట్ వైపు కూడా ఏఏఏ, ఏఏ రేటింగ్ ఉన్న బాండ్లలోనే ఇన్వెస్ట్ చేస్తుంది. బాండ్లలోనూ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఎక్స్పోజర్ పెంచుకోవడం, తగ్గించుకోవడం చేస్తుంటుంది. ఈక్విటీ విభాగంలో 2013లో సాఫ్ట్వేర్, కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్ రంగాలు, 2014 ర్యాలీలో బ్యాంకింగ్, 2016లో కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్ స్టాక్స్‌లో పెట్టుబడుల ద్వారా గణనీయమైన రాబడులనే అందించింది. ఏడాది, మూడేళ్లు, ఐదేళ్ల కాలాన్ని పరిశీలించి చూస్తే ఎల్ అండ్ టీ ప్రుడెన్స్ ఫండ్ ఇదే విభాగంలోని ఇతర ఫండ్ పథకాల కంటే సగటున 3–4 శాతం మెరుగైన రాబడులనే అందించింది. ఏడాది కాలంలో 24.3 శాతం, మూడేళ్లలో 12.4 శాతం, ఐదేళ్లలో సగటున 18.6 శాతం వార్షిక రాబడులను ఇచ్చింది. టాటా బ్యాలన్స్డ్ ఫండ్, ఫ్రాంక్లిన్ బ్యాలన్స్డ్, డీఎస్‌పీబీఆర్ బ్యాలన్స్డ్ ఫండ్ పథకాల కంటే ఎల్ అండ్ టీ ప్రుడెన్స్ రాబడుల్లో ముందుంది. పోర్ట్‌ఫోలియో ఈక్విటీలో 70 నుంచి 80 స్టాక్స్ వరకు పెట్టుబడుల కోసం ఎంచుకుంటుంది. ప్రస్తుతం డెట్ విభాగంలో 26.6 శాతం పెట్టుబడులున్నాయి. లార్జ్‌క్యాప్ స్టాక్స్‌తో పోలిస్తే బుల్ ర్యాలీ కారణంగా మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ధరలు అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడులను 10 శాతం లోపునకు తగ్గించుకుంది. గడిచిన ఏడాది కాలంలో బ్యాంకింగ్, ఫైనాన్స్, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. డెట్ వైపు గత ఏడాది కాలంలో సార్వభౌమ బాండ్ల స్థానాన్ని కార్పొరేట్ బాండ్లతో భర్తీ చేసింది. ఫండ్ పెట్టుబడులు ఎలా..? విభాగం నిధులు (శాతం) డెట్ 26.6 బ్యాంకులు 13.7 ఫైనాన్స్ 9.3 కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులు 5.3 ఫార్మా 5.1 ఆటో 4.9 ఇతర విభాగాలు 35.1 -
ఎల్టీసీజీ ఇన్వెస్టర్ల మేలుకే!
న్యూఢిల్లీ: దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్టీసీజీ) తీసుకురావడాన్ని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి హస్ముఖ్ అధియా సమర్థించుకున్నారు. ఎల్టీసీజీ నుంచి ఈక్విటీలను మినహాయించడం వల్ల ఆస్తుల విలువలు అధిక స్థాయికి చేరతాయని, దీనివల్ల చిన్న ఇన్వెస్టర్లకు రిస్క్ బాగా పెరిగిపోయే అవకాశాలుంటాయని చెప్పారాయన. 14 ఏళ్ల తర్వాత ఎల్‌టీసీజీని తిరిగి తీసుకురావడం వెనుక ఉన్న కారణాలను వెల్లడిస్తూ... ‘‘ఇతర అన్ని రకాల సాధనాల్లో పెట్టుబడులపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను ఉంది. ఈక్విటీలకు మినహాయింపు ఇవ్వడం వల్ల పక్కదారి పడుతుంది. నాలుగైదు సాధనాల్లో ఒకదానికి పన్ను లేకపోతే చాలా మంది తమ నిధుల్ని అందులోనే పెట్టాలనుకుంటారు. దాంతో డిమాండ్ పెరిగి, పెద్ద ఎత్తున నిధులు షేర్లు, ఫండ్స్ వెంట పడితే వాటి విలువలు అనూహ్యంగా పెరిగిపోతాయి. కొన్ని సందర్భాల్లో ఈ విలువలు ఆయా కంపెనీల వాస్తవ విలువలను కూడా ప్రతిఫలించేలా ఉండవు. దానివల్ల చిన్న ఇన్వెస్టర్లకు అధిక ముప్పు ఉంటుంది’’ అని అధియా వివరించారు. ఒక పెట్టుబడి విభాగాన్ని పూర్తిగా పన్నుకు దూరంగా ఉంచడం సరికాదన్నారు. పీహెచ్డీ చాంబర్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో అధియా ఈ మేరకు మాట్లాడారు. దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం, కొన్ని రోజుల నుంచి అంతర్జాతీయంగా మార్కెట్ల తగ్గుదలలో భాగమేనని, ఎల్టీసీజీ తీసుకురావడం వల్ల కాదన్నారు. సోమవారం దేశీయ మార్కెట్లలో ఎఫ్ఐఐలు నికర కొనుగోలుదారులుగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. భారత్ ఇప్పటికీ పెట్టుబడుల పరంగా ఆకర్షణీయంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం ఏడాదిలోపు పెట్టుబడులపై 15 శాతం స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను ఉండగా, దీర్ఘకాలిక పెట్టుబడులపై మూలధన లాభాల పన్ను లేదు. ఈ నేపథ్యంలో 10 శాతం ఎల్‌టీసీజీని కేంద్రం ప్రతిపాదించింది. -
రిలయన్స్ రెగ్యులర్ సేవింగ్ ఫండ్
ఇది బ్యాలెన్స్డ్ ఫండ్. ఈక్విటీలో ఎక్కువ శాతం పెట్టుబడులు పెడితే మార్కెట్లు కరెక్షన్కు లోనైనప్పుడు తమ పెట్టుబడుల విలువ కుంగిపోతుందన్న ఆందోళన ఉంటే దీన్ని పరిశీలించొచ్చు. ఎందుకంటే ఇది ఈక్విటీ, డెట్ల కలబోత. ముఖ్యంగా మార్కెట్లు అధిక స్థాయికి చేరిన తరుణంలో పూర్తి ఈక్విటీ పథకాలతో రిస్క్ ఎక్కువే ఉంటుంది. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆ రిస్క్ పరిమితం చేసుకోవచ్చు. మరోవైపు గత ఏడాది ఆగస్ట్‌లో 25 బేసిస్ పాయింట్ల రెపో రేటు కోత తర్వాత ఆర్బీఐ వడ్డీ రేట్ల పరంగా కఠిన, తటస్థ విధానాన్నే కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో మధ్యస్థాయి రిస్క్‌కు సిద్ధపడేవారు రిలయన్స్ రెగ్యులర్ సేవింగ్ తరహా బ్యాలెన్స్డ్ ఫండ్లను పెట్టుబడులకు పరిశీలించొచ్చు. రిస్క్‌తో కూడిన సాధనాల్లో పెట్టుబడులను కొంత మేర బ్యాలెన్స్డ్ ఫండ్లలోకి మళ్లించడం కూడా వివేకమే. రిస్క్ బ్యాలెన్స్ బ్యాలెన్స్డ్ ఫండ్స్ ప్రధానంగా లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తుంటాయి. డెట్ పోర్ట్‌ఫోలియోకు సంబంధించి అక్రూయెల్ స్ట్రాటజీ (క్రెడిట్ రేటింగ్ మెరుగుపడే అవకాశం ఉన్న వాటిలో ఇన్వెస్ట్ చేయడం) పాటిస్తుంటాయి. రిలయన్స్ రెగ్యులర్ సేవింగ్స్ ఫండ్ – బ్యాలెన్స్డ్ కూడా ఇదే తరహా పథకమే. హైబ్రిడ్ ఈక్విటీ తరహా కేటగిరీలోకి వస్తుంది. పథకం కింద సమీకరించే నిధుల్లో 65 శాతం మేర ఈక్విటీలకు కేటాయిస్తుంది. లార్జ్‌క్యాప్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చే పథకం కావడంతో మార్కెట్లలో అనూహ్య ఆటు పోట్లు ఎదురైనా తట్టుకునే విధంగా మెరుగైన స్థానంలో ఉంది. ఈ కేటగిరీలోనే మంచి పనితీరు చూపిస్తున్న ఇతర పథకాలు... హెచ్డీఎఫ్సీ ప్రుడెన్స్ ఫండ్, ప్రిన్సిపల్ బ్యాలెన్స్డ్ ఫండ్, యూటీఐ బ్యాలెన్స్డ్ ఫండ్లు మాత్రం స్మాల్, మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టే విధానాన్ని అనుసరిస్తున్నాయి. పోర్ట్‌ఫోలియో, పనితీరు ఈ పథకం పనితీరు 2013–16 మధ్య కాలంలో ఆశించిన మేర లేదు. ఎందుకంటే ఆ సమయంలో మిడ్ క్యాప్ స్టాక్స్ ర్యాలీ చేయడంతో రాబడుల విషయంలో మిగిలిన పథకాలతో పోలిస్తే వెనుకబడింది. కారణం ఎక్కువ పెట్టుబడుల్ని లార్జ్‌క్యాప్‌కు కేటాయించడమే. కానీ, 2017లో తిరిగి రాబడుల పరంగా మంచి స్థానానికి చేరుకుంది. టాప్–3 పథకాల్లో ఒకటిగా నిలిచింది. బ్యాంకు స్టాక్స్‌కు అధిక కేటాయింపులతో గత 10 సంవత్సరాల కాలంలో ఏటా 12 శాతం చొప్పున కాంపౌండెడ్ రాబడులను అందించింది. పెట్టుబడులను రక్షించుకోవడంతోపాటు రిస్క్‌ను పరిమితం చేసే విధంగా ఈ పథకం విధానం ఉంటుంది. గత ఐదేళ్లలో పరిశీలిస్తే ఈక్విటీలకు కేటాయింపులను 72 శాతం స్థాయిలో కొనసాగిస్తూ వస్తోంది. ప్రస్తుతం పథకం పరిధిలోని మొత్తం నిధుల్లో 70 శాతం ఈక్విటీలకు కేటాయించగా, అందులో 83 శాతం లార్జ్‌క్యాప్స్‌లోనే ఇన్వెస్ట్ చేసింది. మిగిలిన 17 శాతం నిధుల్ని మిడ్, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడులుగా పెట్టింది. ఇన్విట్‌లకు 2 శాతం కేటాయించడం గమనార్హం. బ్యాంకులు, ఫైనాన్స్, ఆటో, సిమెంట్ రంగాల స్టాక్స్‌కు ప్రాధాన్యం ఇస్తోంది. రాబడుల విషయానికొస్తే ఏడాది కాలంలో 29 శాతం, మూడేళ్లలో 13.2 శాతం, ఐదేళ్లలో 16.4 శాతం, పదేళ్లలో 12 శాతం చొప్పున వార్షికంగా ప్రతిఫలం ఇచ్చింది. ఈక్విటీలో టాప్ పెట్టుబడులు కంపెనీ కేటాయింపులు (%) హెచ్డీఎఫ్సీ బ్యాంకు 8.55 గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 5.56 ఇన్ఫోసిస్ 4.37 ఐసీఐసీఐ బ్యాంకు 4.09 భారత్ ఫైనాన్షియల్ 3.27 లార్సన్ అండ్ టుబ్రో 3.20 హెచ్డీఎఫ్సీ 2.61 ఆర్ఐఎల్ 2.38 కోటక్ మహీంద్రాబ్యాంకు 2.26 ఇండియన్ ఆయిల్ 2.18 -
ఎక్కువ మొత్తానికి గృహరుణం ఓకేనా?
మల్టీక్యాప్ ఫండ్స్‌కు, డైనమిక్ ఫండ్స్‌కు మధ్య తేడా ఏమిటి ? – మాధురి, విజయవాడ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే విధానాన్ని బట్టి మల్టీక్యాప్ ఫండ్స్‌కు, డైనమిక్ ఫండ్స్‌కు తేడా ఉంటుంది. ఎల్లప్పుడూ ఈక్విటీల్లోనే పూర్తిగా ఇన్వెస్ట్ చేసే ఫండ్స్‌ను మల్టీక్యాప్ ఫండ్స్‌గా చెప్పుకోవచ్చు. ఇక డైనమిక్ ఫండ్స్ కూడా దాదాపు అధిక స్థాయిల్లోనే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అయితే మార్కెట్ స్థితిగతులను బట్టి, ఈక్విటీ, స్థిరాదాయ సాధనాలకు సంబంధించిన పెట్టుబడుల కేటాయింపుల్లో మార్పుచేర్పులు చేస్తాయి. అంటే మార్కెట్ బాగా పెరిగిన పరిస్థితుల్లో ఈక్విటీల్లో తక్కువగానూ, మార్కెట్ పతనమైన పరిస్థితుల్లో ఈక్విటీల్లో ఎక్కువగానూ ఇన్వెస్ట్ చేస్తాయి. అందుకే వీటిని డైనమిక్ ఫండ్స్‌గా వ్యవహరిస్తారు. మార్కెట్ పరిస్థితులను బట్టి డైనమిక్ ఫండ్‌ను నిర్వహించే ఫండ్ మేనేజర్ ఒక్కోసారి స్థిరాదాయ సాధనాల్లో 25 శాతం నుంచి 30 శాతం వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక మల్టీక్యాప్ ఫండ్స్ అయితే వివిధ రంగాలకు చెందిన కంపెనీల షేర్లలో ఇన్వెస్ట్ చేసి డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు పొందుతాయి. నా వయస్సు 40 సంవత్సరాలు. నా నికర వేతనం రూ.40,000. ఈ రోజుల్లో గృహ రుణాలపై వడ్డీరేట్లు చౌకగా ఉన్నాయి. అందుకని వీలైనంత ఎక్కువ మొత్తానికి(రూ.30–35 లక్షల వరకూ) గృహ రుణం తీసుకోవాలనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా ? – రవి కుమార్, విశాఖపట్టణం ఈ రోజుల్లో గృహరుణాలపై వడ్డీరేట్లు తక్కువగానే ఉన్నాయన్నది నిజమే. అయితే మీ విషయంలో ఎక్కువ మొత్తానికి గృహ రుణం తీసుకోవడమనేది సరైన నిర్ణయం కాదేమో అనిపిస్తోంది. మీకు వచ్చే ఆదాయంలో 60–80 శాతం వరకూ గృహ రుణ నెలసరి వాయిదాల చెల్లింపులకే పోవడం వల్ల మీ కుటుంబ ఇతర ఆర్థిక అవసరాలపై బాగానే ప్రభావం చూపుతుంది. అనుకోని పరిస్థితుల్లో మీరు ఉద్యోగం కోల్పోతే అప్పుడు పరిస్థితులు మరింత విషమిస్తాయి. ఉద్యోగం కోల్పోయిన కారణంగా ఈఎంఐలు చెల్లించలేక ఇల్లును కూడా కోల్పోవలసి వస్తుంది. అందుకని ఎవరైనా సరే, గృహ రుణానికి సంబంధించిన నెలసరి వాయిదా (ఈఎంఐ) వారి వారి వేతనంలో మూడో వంతుకు మించకుండా చూసుకోవాలి. మీ విషయానికొస్తే, మీ గృహ రుణ ఈఎంఐ రూ.10,000–14,000 రేంజ్‌లోనే ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఈ సందర్భంలో మీరు ఉద్యోగం కోల్పోయినా, గృహ రుణ ఈఎంఐ చెల్లించే స్థాయిలోనైనా వెంటనే మరో చిన్న ఉద్యోగం సంపాదించుకొని, సొంత ఇంటిని చేజారకుండా చూసుకోవచ్చు. అయితే గృహ రుణాలు చౌకగా ఉన్నందున ఎక్కువ మొత్తంలో గృహ రుణం తీసుకోవడం ఒక్కోసారి మంచి ఫలితాలే ఇవ్వవచ్చు. గృహం విలువ భవిష్యత్తులో పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పెరిగే విలువతో పోల్చితే, గృహ రుణంపై అయ్యే వ్యయాలు తక్కువగా ఉంటాయి. మీరు ఉద్యోగం కోల్పోయినా, విషమ పరిస్థితుల్లో ఈఎంఐ చెల్లింపులు కుంటుపడకుండా ఉండేటట్లయితే(మీ భార్య కూడా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ గృహ రుణ ఈఎంఐ చెల్లింపులు చేయగలిగితే) వీలైనంత ఎక్కువ మొత్తంలో గృహ రుణం తీసుకోవచ్చు. అన్ని పరిస్థితులను బేరీజు వేసుకొని సరైన నిర్ణయం తీసుకోండి. నేను ఎల్ఐసీ జీవన్ తరంగ్ పాలసీని 2011లో తీసుకున్నాను. పాలసీ వివరాలను మీకు పంపిస్తున్నాను. ఈ పాలసీని సరెండర్ చేద్దామనుకుంటున్నాను. ఈ పాలసీని సరెండర్ చేయడం వల్ల నేను ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా ? ఈ పాలసీకి దీనికి బదులుగా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలనుకుంటున్నాను. తగిన సలహా ఇవ్వండి. – పవన్, హైదరాబాద్ జీవన్ తరంగ్ అనేది విత్ ప్రాఫిట్స్–హోల్ లైఫ్ ప్లాన్. మీరు పంపిన వివరాలను బట్టి చూస్తే, మీరు తీసుకున్న పాలసీకి బీమా కవరేజ్ రూ.9 కోట్లకు ఉంది. మీరు ఒక వేళ ఇప్పుడు ఈ పాలసీని సరెండర్ చేస్తే మీరు భారీగా నష్టపోతారు. మీరు ఇప్పటిదాకా చెల్లించిన ప్రీమియమ్‌ల్లో మొదటి ఏడాది ప్రీమియమ్‌ను మినహాయించి మిగిలిన దాంట్లో 30 శాతం మాత్రమే మీకు గ్యారంటీడ్ సరెండర్ వ్యాల్యూగా వస్తుంది. ఎల్ఐసీ ఒకోసారి స్పెషల్ సరెండర్ వ్యాల్యూని కూడా చెల్లించవచ్చు. ఇది గ్యారంటీడ్ సరెండర్ వ్యాల్యూ కంటే కొంచెం అధికంగానే ఉంటుంది. మీరు ఈ పాలసీ తీసుకుని మూడేళ్లు దాటింది కాబట్టి మీరు ఈ పాలసీని సరెండర్ చేయవచ్చు. ఈ పాలసీని సరెండర్ చేయడం వల్ల మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. బీమా తీసుకోవాలనుకుంటే ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవడమే ఉత్తమమైన విధానం. టర్మ్ బీమా పాలసీలకు చెల్లించాల్సిన ప్రీమియమ్ తక్కువగా ఉంటుంది. పైగా బీమా కవరేజ్ అధికంగా ఉంటుంది. తక్కువ ప్రీమియమ్ చెల్లించడం ద్వారా అధిక మొత్తానికి బీమా కవరేజ్ పొందవచ్చు. బీమా, ఇన్వెస్ట్‌మెంట్‌కు ఒకే పాలసీని ఎప్పుడూ తీసుకోకూడదు. బీమాకు, ఇన్వెస్ట్‌మెంట్స్‌కు వేర్వేరుగా ఇన్వెస్ట్ చేయాలి. బీమా కోసం టర్మ్ పాలసీని తీసుకున్నట్లుగానే, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. సొంత ఇల్లు సమకూర్చుకోవడం, రిటైర్మెంట్ నిధి ఏర్పాటు, పిల్లల ఉన్నత చదువులు వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. ఈ ఫండ్స్‌లో నెలకు కొంత మొత్తం చొప్పున సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)విధానంలో ఇన్వెస్ట్‌చేస్తే దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందవచ్చు. - ధీరేంద్ర కుమార్ ,సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
కొత్త ఏడాదైనా కాస్త మారదాం..!
మరో సంవత్సరంలోకి అడుగుపెట్టేశాం. మరి ఆర్థికాంశాలకు సంబంధించి ఎప్పుడూ ఏవేవో సాకులు చెప్పుకుంటూ వాయిదాలు వేస్తూ వస్తున్న వారు ఇప్పటికైనా సరైన ప్రణాళిక వేసుకున్నారా? లేదనుకోండి... ఇకనైనా ఆలస్యం చెయ్యకండి. ఎందుకంటే గమ్యంపై స్పష్టత ఉంటేనే ప్రయాణం వేగంగా, సాఫీగా సాగుతుంది. ఈ కొత్త సంవత్సరంలో అనుసరించదగ్గ ఆర్థిక తీర్మానాల గురించి నిపుణులు, ఆర్థిక సలహాదారులు ఏం చెబుతున్నారో ఒకసారి చూద్దాం... ఆలస్యం విషమే! కొత్తవారైతే ముందు 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సెక్షన్ 80సీ ప్రయోజనాలపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే పెట్టుబడులకింకా మూడు నెలల వ్యవధి మాత్రమే ఉంది. మార్చిలోపు పన్ను ఆదా పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలి. చివరి నిమిషం వరకు వాయిదా వేస్తే ఆఖర్లో ఏదో ఒక సాధనంలో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అదే ముందుగా ఆరంభిస్తే వయసు, అవసరాలు, రిస్క్ తీసుకోగల స్థాయి, రాబడులు, అవసరంలో నగదు చేసుకోగల వెసులుబాటు వంటివన్నీ పరిశీలించి తగిన సాధనాలను ఎంపిక చేసుకోవచ్చు. ఏప్రిల్ నుంచి ఆర్థిక సంవత్సరం ఆరంభం అవుతుంది కనక కనీసం జూన్ నుంచయినా పన్ను ఆదా పెట్టుబడులను ఆరంభించి ఏడాది పాటు కొనసాగించాలి. ముందుగా ఆరంభించడం వల్ల కాంపౌండింగ్ ప్రయోజనంతో అధిక రాబడులకు అవకాశం ఉంటుంది. సకాలంలో రిటర్నులు వేయండి... మనలో కొందరు పన్ను రిటర్నులను సకాలంలో దాఖలు చేయరు. ఇది సరైన విధానం కాదు. ఎందుకంటే ఆలస్యమైతే వడ్డీతో పాటు పెనాల్టీ కూడా భరించాలి. గడువులోపు రిటర్నులు వేయకపోతే ఆలస్య రుసుం గతంలో రూ.1,000గా ఉండగా అదిప్పుడు రూ.10,000గా మారింది. అందుకే గడువులోపు రిటర్నులు ఫైల్ చేయాలి. గడువులోపు బీమా పాలసీల ప్రీమియం చెల్లించడం కూడా అవసరమే. లేదంటే బీమా రక్షణ కోల్పోవాల్సి వస్తుంది. ఇంకా రుణాలకు సకాలంలో చెల్లింపులు చేయడం కూడా తప్పనిసరి. ఎందుకంటే ఆలస్యమైతే అనవసర వడ్డీ భారంతో పాటు క్రెడిట్‌స్కోరు కూడా తగ్గిపోతుంది. క్రెడిట్ కార్డు బిల్లు మొత్తం కట్టేస్తే బెటర్! చాలా మందికి క్రెడిట్ కార్డుపై భారీ మొత్తం వాడటం, నెలయ్యేసరికి ఎంతో కొంత కనీస బిల్లు చెల్లించటం అలవాటు. కానీ అలా చేయటం వల్ల వారి మొత్తం రుణం ఎప్పటికీ తీరదనేది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే బ్యాలెన్స్ మొత్తంపై దాదాపు నెలకు 2.5 నుంచి 3 శాతం వడ్డీ అంటే ఏడాదికి 30–36 శాతం చెల్లించాల్సి వస్తుంది. దీనికి ఆలస్యపు చెల్లింపుల ఫీజు కూడా తోడైతే ఇక చెప్పనక్కర్లేదు. అందుకే కార్డుపై వీలైనంత తక్కువ వాడటం... ఏ నెలకు ఆ నెల మొత్తం బిల్లు చెల్లించేయటం చేస్తుండాలి. రుణ సమస్యల్లో ఉన్న వారు ముందుగా తీర్చేయాల్సింది క్రెడిట్ కార్డు బకాయిలే. రివాల్వింగ్ క్రెడిట్‌కు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. జీవితానికీ కవరేజీ తప్పనిసరి.. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ చాలా అవసరం. ఎందుకంటే జీవితం, ఆరోగ్యం అన్నవి ఇలానే ఉంటాయని ఊహించలేం. అనారోగ్యం పాలైతే అయ్యే వ్యయాలు బడ్జెట్‌ను గుల్ల చేసేస్తాయి. కుటుంబానికి ఆధారంగా ఉన్న వ్యక్తి దూరమైతే ఆ కుటుంబాన్ని ఆర్థిక సమస్యలు చుట్టు ముడతాయి. అందుకే తమ వార్షిక ఆదాయానికి కనీసం పది రెట్ల మేర బీమా పాలసీ తీసుకోవడం మరవద్దు. ఏవైనా రుణాలు తీసుకుని ఉంటే వాటికి సరిపడా బీమా కవరేజీ పెంచుకోవాలి. జీవిత బీమాకు టర్మ్ పాలసీలు ఉత్తమం. తక్కువ ప్రీమియానికే గణనీయమైన కవరేజీనిస్తాయి. అలాగే రూ.4–5 లక్షల కవరేజీతో ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్‌పాలసీ కూడా తీసుకోవాలి. ఖర్చుల్లో స్మార్ట్‌గా... ఆరు నెలల అవసరాలను తీర్చే స్థాయిలో ఓ అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం అవసరం. అనుకోని, అనూహ్య, అత్యవసరాలు ఏర్పడితే ఆదుకుం టుంది. ఈ నిధుల్ని ఫిక్స్డ్ డిపాజిట్లలో లేదా తక్కువ రిస్క్ ఉండే లిక్విడ్ డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అవసరంలో వేగంగా వీటిని వెనక్కి తీసుకునే సౌలభ్యం ఉంటుంది. అయితే, సంక్షోభం ఏర్పడితే తప్ప ఈ నిధుల్ని కదలించకూడదు. మీ బడ్జెట్ పరిమితుల్లో స్మార్ట్‌గా ఖర్చు చేయడాన్ని కూడా తెలుసుకోవాలి. ఈ ఖర్చులు చేయి దాటిపోకుండా వాటిని నిరంతరం పరిశీలిస్తూ ఉండాలి. ఈ విషయంలో సా యం చేయడానికి ఆన్లైన్ మనీ మేనేజ్మెంట్ టూల్స్ చాలానే ఉన్నాయి. అవసరం లేని వాటిని రుణం తీసుకుని కొనే చర్యలకు దూరంగా ఉండాలి. ఈక్విటీల్లో సిప్ చేయండి.. ఏడాదికి 4– 6 శాతం వడ్డీనిచ్చే సేవింగ్స్ ఖాతాలో నిధులను నిల్వ చేసుకోవడం సరికాదు. పైగా సేవింగ్స్ రాబడులు ఏడాదిలో రూ.10,000 దాటితే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అందుకే అధిక రాబడులను ఇచ్చే వాటిలో ఇన్వెస్ట్ చేసే అవకాశాలపై దృష్టి సారించడం మంచిది. స్థిరమైన ఆదాయం కోసం డెట్ సాధనాలు అవసరమే కానీ, వీటిలో చాలా వరకు దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి రాబడులను ఇవ్వలేవు. ఈక్విటీలకు మాత్రం ద్రవ్యోల్బణాన్ని మించి రాబడులనిచ్చే సత్తా ఉంది. అందుకే, ఏ సాధనానికి ఎంత కేటాయించాలన్నది ముందుగానే నిర్ణయించుకోవాలి. మీ వయసు, అవసరాలు, రిస్క్‌కు అనుగుణంగా ఈక్విటీ, డెట్ తదితర సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించి అందరికీ నప్పే ఓ ఆచరణీయ సూత్రం ఉంది. 100 నుంచి మీ ప్రస్తుత వయసు తీసివేయగా, ఎంత వస్తే అంత మేర ఈక్విటీలకు పెట్టుబడులు కేటాయించుకోవచ్చు. ఉదాహరణకు మీ వయసు 35 అనుకోండి. అప్పుడు 65 వస్తుంది. అంటే ఈక్విటీలకు మీ పెట్టుబడుల్లో 65 శాతం కేటాయించుకోవచ్చని అర్థం. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అందుకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోవడం కొంత వరకు రక్షణాత్మకం. స్వల్పకాలంలో అస్థిరతలు ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో మాత్రం మంచి ఫండ్స్ రెండంకెల స్థాయిలో లాభాలను ఇస్తున్నాయి. పైపెచ్చు ఈక్విటీ ఫండ్స్‌లో ఏకమొత్తంలో కంటే నెలవారీ సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయటమే మంచిది. ముఖ్యంగా మార్కెట్లు బాగా పెరిగి ఉన్న ప్రస్తుత స్థితిలో స్టాక్స్ విలువలు చాలా గణనీయమైన స్థాయిలో ఉన్నాయి. ఒకవేళ మార్కెట్లు కరెక్షన్కు లోనవుతున్నా గానీ సిప్ రూపంలో పెట్టుబడులు ఆపకూడదు. మార్కెట్లు తగ్గుతున్నప్పుడు ఫండ్స్ యూనిట్ల విలువ కూడా తగ్గుతుంది. కనుక సిప్ రూపంలో ఎక్కువ యూనిట్లు లభిస్తాయి. స్వల్పకాలంలో ఆటుపోట్లు కనిపించినా దీర్ఘకాలంలో సిప్ చాలా చక్కని రాబడులకు బాట వేస్తుంది. -
దెయ్యాల్లేవ్ గియ్యాల్లేవ్
ఆ చీకట్లో వాళ్లను అలా చూస్తే దెయ్యాలు ఉన్నాయనే అనుకుంటారు ఎవరైనా. ఇద్దరు మనుషులు వాళ్లు! ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు. వాళ్ల మధ్యలో ఖరీదైన గుండ్రటి చెక్క బల్ల ఉంది. ఆ బల్ల మీద ఖరీదైన మద్యం సీసా ఉంది. ఉండడానికైతే ఉంది. ఆ ఇద్దరూ తాగడం లేదు. ఆ ఇద్దరికీ తాగే అలవాటు లేదు. చీకట్లో చాలాసేపటిగా చలనం లేకుండాచలికి గడ్డ కట్టుకుపోయినట్లున్న రెండు పొడవాటి చెట్ల మధ్య.. వాళ్లను మనుషులుగా పోల్చుకోవడం ఎంతటి ధైర్యవంతులకైనా కష్టమే. పైగా వాళ్లు తక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఎక్కువగా ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకుంటున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు.. కలర్ టీవీలు అప్పుడప్పుడే అందుబాటులోకి వస్తున్న కాలం నాటి క్షుద్ర రచయిత. ఇంకొకరు ‘ఘోరై’ అనే పెన్ నేమ్‌తో హాబీగా దెయ్యాల కథలు రాస్తూ, దెయ్యాలు లేవని నిరూపించడానికి ట్రై చేస్తున్న ప్రస్తుత రచయిత. ఘోరై అంటే ఘోస్ట్ రైటర్. ‘‘దెయ్యాలు లేవని నిరూపించడానికి నువ్వెవరు? ఆ పని చేయడానికి విజ్ఞాన వేదిక వాళ్లో, అజ్ఞాన దీపిక వాళ్లో ఉంటారు కదా’’ అన్నాడు క్షుర.. చాలాసేపు ఘోరై చెప్పింది విన్నాక. అప్పటికే నడి రాత్రి దాటింది. ‘‘అది నా ధర్మం అనుకున్నాను సార్’’ అన్నాడు ఘోరై. ‘‘పౌరుడిగా.. పాటించడానికి, అవలంబించడానికి, అనుసరించడానికి పౌర సమాజంలో ఇంకా అనేక ధర్మాలు ఉంటాయి. నువ్వు దెయ్యాలనే ఎందుకు పట్టుకున్నావు?’’ అడిగాడు క్షుర. పెద్దగా ఏడ్చేశాడు ఘోరై. ఆ ఏడుపు మనిషి ఏడుస్తున్నట్లుగా లేదు.‘‘ఊరుకో.. ఎందుకు ఏడుస్తున్నావ్?’’ అన్నాడు క్షుర. అతడి వృద్ధాప్యపు దవడ చలికి వణుకుతోంది. ‘‘పాటించడం, అనుసరించడం, అవలంబించడం.. ఎలా ఉండే భాష ఎలా అయిపోయింది సార్.. మీది! మీ దెయ్యం కథలు చదివి వణికి చచ్చిన జనరేషన్ మాది. మీ మాట ఎంత షార్ప్‌గా ఉండేది! శవం కాలుతున్నప్పుడు పుర్రె ‘టప్’మని పేలినట్లు ఉండేది. అదంతా ఏమైపోయింది సార్. అందుకే ఏడుపొచ్చింది’’ అన్నాడు ఘోరై. ‘‘అవన్నీ గుర్తు చెయ్యకు. ఎందుకొచ్చావ్ చెప్పు’’ అన్నాడు క్షుర విసుగ్గా. క్షుర హర్ట్ అయ్యాడని ఘోరైకి అర్థమైంది. తన కథల్లో దెయ్యాల్ని కూడా చాలాసార్లు హర్ట్ చేశాడు ఘోరై. పాఠకులకు ధైర్యం చెప్పడానికి అతడు చేసిన ఘాతుకం అది. అతడి కథల్లో ఒక్కచోటైనా ‘దెయ్యాల్లేవ్ గియ్యాల్లేవ్’ అనే మాట ఉంటుంది. ఆ మాట టెంపరరీగా మనుషులకు ధైర్యం తెప్పించినా, దెయ్యాలను పర్మినెంట్‌గా హర్ట్ చేస్తుందేమోనన్న ఆలోచన అతడికెప్పుడూ కలగలేదు. ‘‘ఏంటి నీ సమస్య?’’ అడిగాడు క్షుర. ‘‘నన్ను రాయొద్దంటున్నారు సార్’’ అన్నాడు ఘోరై.‘‘ఏం రాయొద్దంటున్నారు? ఎవరు రాయొద్దంటున్నారు?’’ ‘‘దెయ్యాల కథల్ని. పాఠకులు’’‘‘ఎందుకట?’’ అడిగాడు క్షుర. ‘‘పిల్లలు భయపడుతున్నారట’’.‘‘మంచిదే కదా. పిల్లలు ఎవరో ఒకరికి భయపడాలి. తల్లిదండ్రులకు భయపడడం లేదు. టీచర్లకు భయపడం లేదు. దేవుడికి భయపడడం లేదు. దెయ్యం భయమైనా లేకపోతే ఎలా? వాళ్లెలా మంచి పౌరుల్లా ఎదుగుతారు?’’ అన్నాడు క్షుర. ఘోరై మనసు మళ్లీ చివుక్కుమంది. తన గురు సమానుడైన క్షుర నోటి నుంచి ‘మంచి పౌరుల్లా ఎదగడం’ అనే దైవ భాష దిగుమతి అయినందుకు కలిగిన బాధ అది. ‘‘కానీ సార్..దెయ్యాలు ఉన్నాయని రాసి నేను పిల్లల్ని భయపెట్టడం లేదు. దెయ్యాలు లేవని రాసి పిల్లల్ని ధైర్యవంతుల్ని చేస్తున్నాను’’ అన్నాడు ఘోరై. ‘‘పిల్లలకు భయమే లేనప్పుడు వాళ్లకు ధైర్యం ఎందుకు చెప్పాలి?’’ అన్నాడు క్షుర. ‘‘అంటే.. సార్, ముందు భయపట్టి, తర్వాత ధైర్యం చెబుతాను. అదీ నా స్టెయిల్ ఆఫ్ రైటింగ్’’ అన్నాడు ఘోరై.. చేతులు నలుపుకుంటూ.ఘోరై వైపు తీక్షణంగా చూశాడు క్షుర.‘‘మరి పాఠకులకు వచ్చిన ప్రాబ్లం ఏంటి?’’ అన్నాడు. ‘‘దెయ్యాలు ఉంటే ఉన్నాయని చెప్పాలి కానీ, లేనప్పుడు లేవని చెప్పడం ఎందుకు అంటున్నారు సార్.’’‘‘నిజమే కదా’’అన్నాడు క్షుర. ‘‘అసలు ఈ పాఠకులకు ఏం కావాలి సార్. పిచ్చి పట్టిపోతోంది నాకు. రాసింది వద్దంటారు. రాయంది కావాలంటారు! చచ్చి, దెయ్యమై పిల్లల్ని తప్ప మిగతా ఇంటిల్లపాదినీ పీక్కుతినాలన్నంత కోపం వస్తోంది సార్’’ అన్నాడు ఘోరై. అతడి ఆవేదనను గమనించాడు క్షుర. ‘‘ఐ కెన్ అండర్‌స్టాండ్. ప్రతి దెయ్యాల రచయితకీ ఉండే ప్రాబ్లమే ఇది’’ అన్నాడు. ఇద్దరూ చాలాసేపు మౌనంగా ఉన్నారు. ‘ఏం చెయ్యమంటారు సార్’ అన్నట్లు చూస్తున్నాడు ఘోరై.క్షుర అతడికి ఏమీ చెప్పలేకపోయాడు. ముప్పై ఏళ్ల క్రితం తనకొచ్చిన సమస్యే ఇప్పుడీ వర్థమాన రచయితకీ వచ్చింది.‘‘రాస్తే ఏమౌతుందట?’’ అడిగాడు ఘోరైని.‘‘చంపేస్తారట సార్. బెదిరిస్తున్నారు’’‘‘రాయడం మానేస్తే ఏమౌతుంది?’’‘‘చచ్చిపోతాను సార్. రాయకుండా ఉండలేను’’.నిట్టూర్పు విడిచాడు క్షుర. ‘‘టేబుల్ మీద ఉన్న ఈ బాటిల్ చూశావా? ఫుల్ బాటిల్. పక్కనే సోడా, గ్లాసులు. తాగడం నాకు ఇష్టం. కానీ మానేశాను. ఇరవై ఏళ్ల క్రితం క్షుద్ర కథలు రాయడం మానేసిన రోజు నేరుగా వైన్ షాపుకు వెళ్లి, కొనితెచ్చుకున్న బాటిల్ ఇది. అప్పట్నుంచీ కథ రాయలేదు, ఈ బాటిలూ ఓపెన్ చెయ్యలేదు. ఎప్పుడైనా మనసు పీకుతుంది. ఒక్క దెయ్యం కథైనా రాయాలని. రాయకుండా ఉండడం కోసం వెంటనే బాటిల్ బయటికి తీస్తాను. ఈ బాటిల్లో నీకు మందు కనిపిస్తోంది కదా. నాకు దెయ్యం కనిపిస్తుంది. దెయ్యం కథ రాయాలన్న నా కోరికను దెయ్యంలా ఈ సీసాలో బంధించాను నేను’’.. మరోసారి నిట్టూర్పు విడిచాడు క్షుర. ఘోరై ఆ బాటిల్ వైపు చూశాడు. ‘మూత తెరవండీ.. మూత తెరవండీ’ అని బాటిల్ లోపల్నుంచి ఎవరో రోదిస్తున్నట్లుగా అనిపించింది. క్షుర వైపు చూశాడు. అతడి కళ్లు చెమ్మగిల్లి ఉన్నాయి. ‘‘ఈ పాఠకులు మనుషులు కాద్సార్’’ అని పైకి లేచాడు.‘‘పాఠకులను అనకు. మనమే మనుషులం కాదు’’ అని క్షుర కూడా పైకి లేచాడు. ఇద్దరూ పైకి లేచిన రెండు క్షణాలకు, అప్పటి వరకు శిలల్లా బిగుసుకుపోయి ఉన్న ఆ రెండు పొడవాటి చెట్లూ ఊగడం మొదలుపెట్టాయి! -
షేర్లలో రాబడిపై అంచనాలు తగ్గాలి
స్టాక్‌మార్కెట్లలో హెచ్చుతగ్గులుండే నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఈక్విటీల నుంచి అధిక రాబడులొస్తాయనే అంచనాలను తగ్గించుకోవాలని, సముచిత రాబడులనే ఆశించాలని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ నేషనల్ సేల్స్ హెడ్ పెషోతన్ దస్తూర్ అభిప్రాయపడ్డారు. సిప్‌లను మధ్యలోనే ఆపేయకుండా దీర్ఘకాలం పాటు కొనసాగిస్తేనే మంచి ప్రయోజనాలు పొందవచ్చని ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. సంస్థ లక్ష్యాలు, రాబోయే రోజుల్లో మార్కెట్ల తీరు తదితర పలు అంశాలపై మాట్లాడారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ... సిప్‌లకు ఈ మధ్య బాగా ఆదరణ పెరిగింది. ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? ప్రైవేట్ మ్యూచువల్ ఫండ్స్‌ని అనుమతించి దాదాపు పాతికేళ్లవుతోంది. ఇందులో తొలి ఇరవై రెండేళ్లలో సిప్ ఖాతాలు దాదాపు డెభ్భై అయిదు లక్షలకు పరిమితమయ్యాయి. కానీ ఈ మూడేళ్లలోనే ఏకంగా మరో డెబ్భై అయిదు లక్షల సిప్ ఖాతాలు వచ్చి చేరాయి. అంటే ఇరవై రెండేళ్లూ ఒక ఎత్తు.. ఈ మూడేళ్లు మరో ఎత్తు. ప్రస్తుతం పరిశ్రమలో దాదాపు 1.5 కోట్ల సిప్లున్నాయి. ప్రతి నెలా దాదాపు రూ.5,000 కోట్ల పైగా నిధులు సిప్ల ద్వారా వస్తున్నాయి. సగటున సిప్ పరిమాణం రూ. 3,500గా ఉంటోంది. ఇక మా సంస్థ విషయానికొస్తే.. మా దగ్గర దాదాపు 13 లక్షల సిప్ ఖాతాలున్నాయి. వీటి ద్వారా రూ. 425 కోట్ల మేర ప్రతి నెలా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. మా నిర్వహణలోని అసెట్స్ విలువ రూ.1.03 లక్షల కోట్లు. ఇందులో సింహభాగం ఈక్విటీలోను, మిగతాది డెట్, క్యాష్ సాధనాల్లోను ఉంది. రూ.లక్ష కోట్ల ఏఎంసీ దాటిన సంస్థల్లో మాది ఎనిమిదో స్థానం. సిప్‌లలోకి ఇన్ని నిధులు రావటానికి కారణమేంటి? కారణాలు చాలా ఉన్నాయి. మెరుగైన మరో సాధనం అందుబాటులో లేకపోవడం కూడా వీటిలో ఒకటి. రెండోది ఈక్విటీ మార్కెట్లు బాగున్నాయని అందరూ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఇక మూడో దానికొస్తే.. టీవీల్లోనూ, పేపర్లలోనూ ప్రచారం ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌పై అవగాహన పెరిగింది. నాలుగోది.. మార్కెట్ పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఇదే మెరుగైన మార్గం. అన్నింటికన్నా ముఖ్యమైన అయిదో అంశం.. టెక్నాలజీ. ఇన్నాళ్లదాకా పేపర్ వర్క్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు డిజిటల్ విధానం రావడంతో ఖాతా తెరవడం నుంచి ఇతర లావాదేవీల నిర్వహణ దాకా అంతా అత్యంత సులభతరంగా ఎలక్ట్రానిక్ మాధ్యమంలోనే నిర్వహించుకునే వెసులుబాటు వచ్చింది. ఇవన్నీ కలసి ఫండ్స్, సిప్స్కి ఆదరణ పెంచుతున్నాయి. కొత్తగా వచ్చేవే కాకుండా.. మధ్యలోనే ఆపేస్తున్నవి కూడా ఉన్నట్లున్నాయి కదా..? నిజమే. కొత్తగా రెండు సిప్ ఖాతాలు వచ్చాయంటే.. ఒకటి ఆగిపోతోంది. అలా జరగకుండా ఉంటే.. ఇప్పుడు సిప్ల సంఖ్య 3 కోట్లు దాటేసి ఉండేది. ఏప్రిల్ 2016–మార్చి 2017 మధ్య 75 లక్షల సిప్‌లు రిజిస్టర్ అయితే.. 36 లక్షల పాత సిప్‌లు ఆగిపోయాయి. అంటే నికరంగా 39 లక్షలే కొత్తగా జతయినట్లు అయింది. మార్కెట్లు బాగున్నప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక క్షీణించినప్పుడు ఎలా ఉంటుందో ఊహించవచ్చు. 40 లక్షల ఖాతాలు వస్తే 75 లక్షలు ఆగిపోయేట్లుగా ఉంటుంది. 2003–2008 మధ్యలో మార్కెట్లు అదే పనిగా పెరిగాయి. అలాగే పదేళ్ల తర్వాత మళ్లీ 2013 నుంచి 2017 దాకా ఇదే ధోరణి సాగింది. 2008లో మార్కెట్లు పడ్డాయి కాబట్టి.. ఇప్పుడూ పడతాయన్నది నా అభిప్రాయం కాదు. 2008 నుంచి 2013 మధ్యలో ఇన్వెస్టర్లు తీవ్ర హెచ్చుతగ్గులు, ప్రతికూలతలు ఎదుర్కొన్నారు. ఈ వ్యవధిలోనే సిప్ బలం బయటపడింది. తక్కువలో కొనుక్కునేందుకు, కాస్ట్ యావరేజింగ్ చేసుకునేందుకు, దీర్ఘకాలంలో మరింత రాబడులు పొందేందుకు ఇది ఉపయోగపడింది. కానీ ఇప్పుడు కొత్త ఇన్వెస్టర్లు గత పరిస్థితులను చూడలేదు. అందుకే ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినా సిప్‌ను ఆపొద్దనే మేం సూచిస్తున్నాం. నిధుల సమస్య ఏదైనా వస్తే ఒకటిరెండు నెలలు గ్యాప్ తీసుకుని మళ్లీ ప్రారంభించే వెసులుబాటు కూడా ఫండ్ సంస్థలు కల్పిస్తున్నాయి. సిప్ చేస్తే నష్టాలు అస్సలు ఉండవనే గ్యారంటీ ఉందా? నిజానికి.. కాంపౌండింగ్, యూనిట్లు కూడబెట్టుకోవడం, రూపీ కాస్ట్ యావరేజింగ్ వంటి అంశాలు సిప్‌లకు ప్రధాన బలాలు. సిప్‌ను మధ్యలోనే ఆపేయడం వల్ల ఈ ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుంది. సిప్‌లలోకి ఇకపైనా నిధుల ప్రవాహం కొనసాగుతుంది. అయితే, సిప్ చేస్తే లాభాలే తప్ప నష్టాలు ఉండవనే ఆలోచన కరెక్టు కాదు. మార్కెట్లలో హెచ్చుతగ్గుల రిస్కులుంటాయని తెలుసుకున్నాకే ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేయడం మంచిది. కేవలం బుల్ మార్కెట్ మాత్రమే ఉండదు. వివిధ దశల గుండా మార్కెట్ సాగుతుంది. రాజకీయ, ఆర్థిక, భౌగోళికపరమైన అనేకానేక అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతుంటాయి. కేవలం బుల్ మార్కెట్ మాత్రమే ఉంటుందని భావించకుండా ఈ దశలన్నింటినీ ఎదుర్కొని ఇన్వెస్ట్మెంట్ సాగించగలగాలి. తద్వారా దీర్ఘకాలంలో ప్రయోజనాలు పొందవచ్చు. దాదాపు పాతికేళ్లుగా భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న మా సంస్థ ఫండ్... ఈ కాలంలో సెన్సెక్స్ కన్నా రెట్టింపు స్థాయిలో సగటున 20 శాతానికి పైగా రాబడులిచ్చింది. అధిక రాబడులపై అంచనాలు సరైనవేనంటారా? ఇప్పుడున్న ధోరణి ఇకపైనా కొనసాగుతుందా.. అంటే కష్టమే. అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం అందరూ.. రిటర్న్‌ల గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన రాబడులు చాలా ప్రత్యేకమైనవని గుర్తుంచుకోవాలి. రిస్కులూ ఉంటాయని గుర్తించాలి. భారీ అంచనాలను తగ్గించుకోవాలి. గత మూడేళ్లలో ఇరవై శాతం రాబడులొచ్చినప్పుడు మరో మూడేళ్లు అదే స్థాయిలో రాబడులు ఎందుకు రావనే ధోరణి ఉంటోంది. కానీ వాస్తవానికి రాబోయే మూడేళ్లలో అందాల్సిన ఫలాలన్నీ కూడా ఇప్పుడే చేతికొచ్చేశాయి. ఇరవై శాతం అంటేనే చాలా అధిక రాబడి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఈక్విటీల నుంచి అధిక రాబడులపై అంచనాలను తగ్గించుకోవాలి. ద్రవ్యోల్బణం 4 శాతం ఉండి.. ఎఫ్డీలు 6.5 శాతం, కార్పొరేట్ బాండ్లు 8 శాతం–9 శాతం మేర రాబడులు ఇస్తున్న పరిస్థితుల్లో ఈక్విటీలు వాటన్నింటికీ రెట్టింపు స్థాయిలో ఏకంగా 20 శాతం మేర రాబడులు ఇవ్వజాలవు. ఇలాంటి సందర్భాల్లో ఈక్విటీల నుంచి ఒక మోస్తరుగా 12 – 13 శాతం మేర రాబడులు మాత్రమే ఆశించడం సముచితంగా ఉంటుంది. అయితే, ఇప్పటికీ మార్కెట్లలో ఇన్వెస్ట్మెంట్కి చాలా అవకాశాలే ఉన్నాయి. లార్జ్‌క్యాప్స్ కావొచ్చు, మిడ్‌క్యాప్ కావొచ్చు మరేదైనా కావచ్చు. ఖరీదైనవిగా కనిపిస్తున్నా.. మల్టీబ్యాగర్స్‌గా నిల్చే స్టాక్స్ చాలానే ఉన్నాయి. మీ ఫండ్ ప్రత్యేకంగా ఏ రంగాలమీదైనా దృష్టి పెట్టారా? ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ప్రత్యేకంగా ఏ రంగంపైనా దృష్టి పెట్టదు. ఏ రంగంలోనైనా తక్కువలో లభిస్తూ.. మెరుగైన రాబడులు అందించగలిగే స్టాక్స్ మాత్రమే మా ఫండ్స్ ఎంపిక చేసుకుంటుంది. డీమోనిటైజేషన్ ముందు, తర్వాత ఫండ్స్‌లోకి నిధుల ప్రవాహం ఎలా ఉంది? కేవలం డీమోనిటైజేషన్ వల్ల ఫండ్స్‌లోకి నిధులు వచ్చాయనుకోవడం లేదు. నిజానికి డీమోనిటైజేషన్ వల్ల ఫండ్స్‌లోకి నిధులు వచ్చే పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ముందుగా బ్యాంకుల్లోకి భారీగా డిపాజిట్లొచ్చాయి. దీంతో అవి వడ్డీ రేట్లు తగ్గించాయి. ఫలితంగా మెరుగైన రాబడులు అందించే సాధనాల వైపు ఇన్వెస్టర్లు చూడటం మొదలుపెట్టారు. ఎఫ్డీలు, డెట్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, బంగారాన్ని దాటి ఈక్విటీలు మెరుగ్గా కనిపిస్తుండటంవల్ల వాటివైపు మళ్లారు. అయితే, ఇలాంటి పరిస్థితి సిస్టమిక్ రిస్క్‌కు దారితీస్తుందని నా అభిప్రాయం. తగినంత రిస్క్ సామర్ధ్యం లేకపోయినా కేవలం అధిక రాబడులొస్తాయనే ఏకైక కారణంతో మిగతా సాధనాలన్నీ వదిలేసి.. ఎఫ్డీలు మొదలైన వాటిల్లో ఉన్న డబ్బునంతా కూడా ఈక్విటీల్లోకి మళ్లించేయడం వల్ల వ్యవస్థాగతమైన రిస్కు పరిస్థితి తలెత్తుతుంది. ఇన్వెస్టరైనా, అడ్వైజరైనా ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. రిస్కు సామర్ధ్యానికి తగ్గ సాధనాల్లోనే ఇన్వెస్ట్ చేయాలి. అందరూ ఏదైనా సాధనంలో రాబడుల గురించే మాట్లాడుతున్నారంటే.. మనం రిస్కుల గురించి ఆలోచించాల్సిన సమయం అని అర్థం చేసుకోవాలి. పరిశ్రమ, మీ సంస్థ వృద్ధి లక్ష్యాలేంటి? ప్రస్తుతం ఇండస్ట్రీ పరిమాణం రూ.22.5 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో సుమారు నలభై శాతం.. అంటే రూ. 8.5 లక్షల కోట్లు ఈక్విటీ, బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో ఉంది. రూ.6.5 లక్షల కోట్లు క్యాష్ ఫండ్స్‌లో ఉంది. మరో 30 శాతం డెట్ ఫండ్స్‌లో ఉంది. 2025 నాటికి ఈ పరిశ్రమ రూ. 95 లక్షల కోట్ల స్థాయికి చేరగలదని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల సమాఖ్య యాంఫీ అంచనా. 2021 నాటికి రూ.2.5 లక్షల కోట్ల ఏఎంసీగా నిలవాలన్నది మా లక్ష్యం. ప్రస్తుతం ఇది రూ.1.03 లక్షల కోట్లుగా ఉంది. పరిశ్రమ 22 ఏళ్లలో సాధించిన సిప్‌లు.. మూడేళ్లలోనే సాధించగలిగినప్పుడు మా సంస్థ మరో మూడేళ్లలో రెట్టింపు ఏఎంసీ లక్ష్యాన్ని సాధించడం కష్టం కాదన్నది మా అభిప్రాయం. (సాక్షి, బిజినెస్ బ్యూరో ప్రతినిధి) -
పోతే పోనీ అనుకుంటే...ఆదాయం అదుర్స్!
♦ రిస్క్‌తో పాటు భారీ రాబడినిచ్చేవి ఈక్విటీలొక్కటే కాదు ♦ మెరుగైన రాబడులకు మరిన్ని ప్రత్యామ్నాయాలున్నాయ్ ♦ బిట్ కాయిన్, విలువైన రాళ్లు, పీటుపీ వ్యాపారం ఇలాంటివే ♦ వీటిపై అవగాహన పెంచుకున్నాకే పెట్టుబడి పెట్టడం బెటర్ ♦ లేకపోతే పెట్టుబడి పెట్టిన అసలుకూ ఎసరే చాలామంది అంటుంటారు... షేర్ మార్కెట్ అంటే రిస్క్ ఎక్కువని. నిజమే!! కొన్ని చిన్న, మధ్య తరహా షేర్లలో పెట్టుబడి పెడితే నెల రోజులకే మన సొమ్ము రెట్టింపయిపోవచ్చు. పది రోజులు తిరక్కుండానే జీరో కూడా అయిపోవచ్చు. దీనర్థం ఒక్కటే!! రిస్క్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో... అక్కడ రివార్డ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. అంటే రాబడి అన్నమాట. మరి ఇలా రిస్క్ తీసుకుంటే భారీ రివార్డ్నిచ్చేది స్టాక్ మార్కెట్ ఒక్కటేనా? షేర్లు ఒక్కటేనా? ఇంకేవీ ఈ స్థాయిలో లేవా? ఈ ప్రశ్నకు ఉన్నాయనే సమాధానమే వస్తుంది. మరి ఆ ప్రత్యామ్నాయా పెట్టుబడి సాధనాలేంటి? వాటిలో ఉండే రిస్క్‌లేంటి? ఇవన్నీ తెలియజెప్పేదే ఈ కథనం. వడ్డీ వ్యాపారం... పీటుపీ అప్పులిచ్చే వ్యాపారం నిజానికి బ్యాంకులు... ఆర్థిక సంస్థలది. కాకపోతే కొందరు వ్యక్తులు కూడా ఇపుడు ఈ వ్యాపారంలోకి దిగుతున్నారు. డబ్బులు అవసరమైనవారికి వారు అప్పులిస్తారన్న మాట. ఈ ఇద్దరినీ కలపటానికి ఇపుడు ఆన్లైన్ వేదికగా ‘ఐలెండ్’ వంటి మార్కెట్ లీడర్లతో పాటు పలు సంస్థలున్నాయి. దీన్నే పీర్ టు పీర్ (పీటుపీ) అంటుంటారు. ఉదాహరణకు... వరుణ్ (38) అనే ప్రైవేటు ఉద్యోగి ఇదే విధమైన వ్యాపారాన్ని ఆదాయ మార్గంగా ఎంచుకున్నాడు. ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.20వేల రుణాన్ని ఇస్తుంటాడు. ఇలా 100 మందికి రుణాలిచ్చి సగటున 28 – 30 శాతం రాబడులను అందుకుంటున్నాడు. ఈ విధమైన వ్యాపారంలో ఎగవేతల ప్రమాదం కూడా ఉంటుంది. వరుణ్ దగ్గర అప్పు తీసుకున్న వారిలో ఇద్దరు ఏడాదిగా చెల్లించడం మానేశారు. ఇదే ఈ వ్యాపారంలో రిస్క్. ఈ రంగంలో ఎగవేతలు 4 శాతం వరకూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వ్యాపారం అన్న తర్వాత రిస్క్ ఎలానూ ఉంటుంది. కాకపోతే కొన్ని జాగ్రత్తలతో వాటిని ఎదుర్కోవటం కష్టం కాదన్నది నిపుణుల అభిప్రాయం. ఉదాహరణకు కొత్తగా పీటుపీ వ్యాపారంలో అడుగు పెట్టేవారు... ఒక్కరికే ఎక్కువ మొత్తంలో రుణం ఇవ్వకూడదు . ఉదాహరణకు రూ.లక్ష పెట్టుబడితో రంగంలోకి దిగితే ఒక్కరికి రూ.5 వేలకు మించి రుణం ఇవ్వకుండా జాగ్రత్తపడాలి. రుణ గ్రహీతల మనస్తత్వం, వారి చెల్లింపుల తీరుపై అవగాహన తర్వాత తదుపరి అడుగులు వేయాలన్నది ఈ రంగంలోని నిపుణుల సూచన. ఉదాహరణకు కొందరు పీటుపీ వ్యాపారులు పెళ్లి కాని బ్రహ్మచారులకు రుణాలు ఇవ్వరు. పెళ్లయి, పిల్లలు ఉన్నవారికే వారి ప్రాధాన్యం. ఎందుకంటే వీరు బాధ్యతగా ఉంటారని. క్రిప్టో కరెన్సీ...: బిట్ కాయిన్ రిస్క్‌తో పాటు రివార్డు కూడా భారీగా ఉన్న పెట్టుబడి సాధనాల్లో బిట్ కాయిన్ ఒకటి. యువ, కొత్త ఇన్వెస్టర్లను ఇప్పుడు బాగా ఆకర్షిస్తోంది. డిజిటల్ రూపంలో మాత్రమే కనిపించే ఈ అనధికార కరెన్సీ (ఆర్బీఐ ఆమోదం లేదు) ధర ఏడాది కిందట ఒకో బిట్‌కాయిన్‌కు 579 డాలర్లు. ప్రస్తు తం ఇది 2,600 డాలర్ల స్థాయిలో ఉంది. ఇటీవలే 3,100 డాలర్ల స్థాయికి కూడా వెళ్లొచ్చింది. అంటే ఏడాదిలో దీని రాబడులు 4 నుంచి 5 రెట్ల వరకు ఉన్నాయన్న మాట. ఒక బిట్‌కాయిన్‌లో మిల్లీ వంతును కూడా కొనుగోలు చేసేందుకు అవకాశం ఉండడంతో ఇన్వెస్టర్లు దీనివైపు చూస్తున్నారు. అంతర్జాతీయంగా బదిలీ చేసుకోతగ్గ ఈ ఆన్లైన్ కరెన్సీకి ప్రపంచంలో ఏ ప్రభుత్వ ఆమోదమూ లేదు. కానీ పలు అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌తో సహా అమెజాన్ వంటి సంస్థలు కూడా ఈ కరెన్సీలో చెల్లింపుల్ని అంగీకరిస్తున్నాయి. మరో వంక ఈ కరెన్సీపై ఏ ప్రభుత్వానికీ నియంత్రణ కూడా లేదు. నిజానికి ఇది సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ సాధనం కానే కాదు. కాకపోతే దీన్ని ఆమోదించే ప్రైవేటు సంస్థల సంఖ్య పెరుగుతున్న కొద్దీ దీని విలువ కూడా పెరుగుతూనే ఉంటుంది. ఇందులో పెట్టుబడి పెట్టేవారు కూడా స్వల్ప కాలంలో లాభాలను తీసుకునే ధోరణితోనే ఉంటున్నారు. ఈక్విటీ మార్కెట్లతో పోల్చుకుంటే వీటిలో రిస్క్ ఎక్కువేనని తెలుసు. ఎందుకంటే ఇటీవలే ఇది 3,100 డాలర్ల స్థాయిని తాకింది. మరి అప్పుడు కొన్నవారి పరిస్థితేంటి? స్వల్పకాలంలోనే 15 శాతం నష్టపోయినట్లు లెక్క. అయితే అధిక రాబడుల కోసం వీటిని ఆశ్రయిస్తున్న వారి సంఖ్య మెల్లగా పెరుగుతోంది. ఒకవేళ బాగా రిస్క్ తీసుకోవటానికి సిద్ధపడ్డవారైతే తమ దగ్గరున్న నిధుల్లో కేవలం 2 నుంచి 3 శాతం లోపే ఈ తరహా సాధనాలకు కేటాయించడం కొంతలో కొంత సురక్షితం. ఎందుకుంటే భారీ ప్రతిఫలాన్ని ఇవ్వడంలో ముందుండే ఇవి... అదే సమయంలో కుడి ఎడమైతే జీరో అయిపోయినా ఆశ్చర్యపడనక్కర్లేదు. వీటిలో ఆటుపోట్లు ఎక్కువ. విలువైన రాళ్లు... నకిలీలుంటాయ్!! వజ్రాలు, ఇతర విలువైన రాళ్లపై పెట్టుబడులు కూడా మంచి రాబడులను ఇవ్వగలవు. వీటిలో రాబడులు ఒక నెలలో 10 నుంచి 15 శాతం వరకూ ఉండొచ్చు. ఒక్కో సారి నెల పాటు, ఏడాది పాటు కూడా ధరలు స్థిరంగా ఉండేందుకూ అవకాశం లేకపోలేదు. ఈ వ్యాపారం ఎక్కువ శాతం అవ్యవస్థీకృతం. అయినప్పటికీ పారదర్శకత ఎక్కువే. ఎప్పటికప్పుడు రేట్లను ఆన్లైన్లో చూసుకోవచ్చు. తద్వారా మార్కెట్ ధరపై ఒక అంచనాకు రావచ్చు. డివైన్ సొలిటైర్స్ తదితర కొన్ని కంపెనీలు ప్రతి నెలా వజ్రాల ధరలను ప్రకటిస్తున్నాయి. ఎవరైనా కొనుగోలుదారుడు తిరిగి విక్రయించాలనుకుంటే వారికి మార్కెట్ ధరలో కనీసం 90 శాతం చెల్లిస్తామన్న హామీనిచ్చే కంపెనీలు కూడా ఉన్నాయి. ఆభరణాల విక్రేత ఈ మేరకు ధర ఇచ్చేందుకు నిరాకరిస్తే నేరుగా కంపెనీనే సంప్రదించొచ్చు. పెట్టుబడుల కోసం వజ్రాల బాట పడితే అధిక నాణ్యత గలవి కాకుండా మోస్తరు నాణ్యత ఉన్న వాటిని, అందులోనూ 0.3 క్యారట్ల నుంచి 0.8 క్యారట్ల మధ్యలో ఉన్నవి ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో రాబడులు ఎక్కువగా ఉంటాయంటున్నారు. నకిలీల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నది వీరి సూచన. రంగు, క్లారిటీ, కట్, క్యారట్ ఇవన్నీ ఓ వజ్రం ధరలో కీలక పాత్ర పోషిస్తాయి. పెట్టుబడుల కోసం వజ్రాలు కొనే వారు కొంచెం ఫీజు చెల్లించయినా సరే తప్పకుండా సీరియల్ నంబర్‌తో ఉన్న సర్టిఫికెట్ తీసుకోవాలి. క్రౌడ్ ఫండింగ్... హీరో–జీరో ఏదైనా ఓ కొత్త వ్యాపారం లేదా స్టార్టప్ సంస్థలో పెట్టుబడి పెట్టడమే క్రౌడ్ ఫండింగ్. ఉదాహరణకు ఓ వ్యక్తి అద్భుతమైన ఉత్పత్తిని తయారు చేశాడు. దాన్ని మార్కెట్లోకి తేవటానికి తన దగ్గర డబ్బుల్లేవు. వాటికోసం క్రౌడ్ ఫండింగ్ వెబ్సైట్లపై ఆధారపడ్డారు. అంటే ఆయా సైట్లలో తన ఉత్పత్తిని వివరిస్తూ... పెట్టుబడి కావాలని అభ్యర్థించాడు. అలా పెట్టుబడి పెట్టినవారికి తన కంపెనీలో వాటా ఇస్తాడన్న మాట. ఒకవేళ ఆ ఉత్పత్తి గనక మార్కెట్లోకి వచ్చి విజయవంతమైతే... తన వ్యాపారానికి తిరుగుండదు. ఈ క్రౌడ్ ఫండింగ్ చేసినవారి వాటా విలువ కూడా భారీగా పెరుగుతుంది. అయితే క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు స్వీకరించే సంస్థల్లో నకిలీవి కూడా ఉంటాయి. నిధులందుకుని బోర్డు తిప్పేసే అవకాశమూ ఉంటుంది. నిజానికి క్రౌడ్ ఫండింగ్ చేసినవారికి కంపెనీ నిర్ణయాల్లో ఎటువంటి పాత్రా ఉండదు. ఇలా నిధులు సమీకరించే వాటిలో ఎక్కడో ఒకటి రెండు మాత్ర మే దీర్ఘకాలానికి నిలదొక్కుకుని లాభాలను అందించే అవకాశం ఉంటుంది. స్టార్టప్ విఫలమైనా, ఉత్పత్తి ఆదరణకు నోచుకోకపోయినా పెట్టుబడి పెట్టిన వారికి అసలు కూడా తిరిగి రాదు. అందుకే పెట్టుబడికి ముందే నేరుగా సంబంధిత స్టార్టప్ లేదా ఉత్పత్తికి సంబంధించి యజమానులతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకోవాలన్నది ఈ రంగంలోని నిపుణుల సూచన. -
ఈక్విటీల్లోకి పెట్టుబడుల వరద
♦ ఆరు నెలల్లో రూ.97,000 కోట్లు ♦ ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌పీఐ, మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ♦ మార్కెట్ల రికార్డులకు వెన్నుదన్ను ♦ విదేశీ ఇన్వెస్టర్లకు దీటుగా దేశీయ ఇన్వెస్టర్ల పెట్టుబడులు ♦ ఇది ఆరోగ్యకర సంకేతమంటున్న నిపుణులు న్యూఢిల్లీ: ఈక్విటీ మార్కెట్ల భారీ ర్యాలీకి విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ), మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) సంస్థలు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ఇందుకు నిదర్శనం ప్రస్తుత ఏడాది తొలి ఆరు నెలల్లో వీరు నికరంగా రూ.97,705 కోట్లను పెట్టుబడులుగా పెట్టడమే. వీటిలో ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ.55,908 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, ఫండ్స్ పెట్టుబడులు రూ.41,797 కోట్లుగా ఉన్నాయి. 2016 సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో పోల్చి చూస్తే ఈ ఏడాదిలో ఎఫ్‌పీఐలు, మ్యూచువల్ ఫండ్స్ మూడు రెట్లు అధికంగా పంప్ చేయడం విశేషం. బుల్ మార్కెట్ వాతావరణాన్ని ఇది ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2016 తొలి ఆరు నెలల్లో ఈక్విటీల్లో ఎఫ్‌పీఐలు, మ్యూచువల్ ఫండ్స్ నికర పెట్టుబడులు రూ.28,811 కోట్లుగా ఉన్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ జీవితకాల గరిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్న విషయం తెలిసిందే. ఎఫ్‌పీఐలు, ఫండ్స్ నుంచి వస్తున్న నిధుల వెల్లువలు సూచీలు ఈ స్థాయికి చేర డంలో ప్రధాన పాత్ర పోషించాయని చెప్పుకోవాలి. మార్కెట్లు ఈ ఏడాదిలో ఇప్పటికే 18 శాతానికి పైగా పెరిగి ప్రపంచంలో మంచి పనితీరు చూపించిన మార్కెట్లుగా నిలిచాయి. మిడ్, స్మాల్ క్యాప్‌లలో అయితే ఈ పెరుగుదల మరింత వేగంగా ఉంది. ఈ సూచీలు సమారు 30 శాతం మేర పెరగడం గమనార్హం. 11 నెలలుగా ఫండ్స్ జోరు మ్యూచువల్ ఫండ్స్ ఈ ఏడాది జనవరి – జూన్ కాలంలో పెట్టిన పెట్టుబడులు రూ.41,797 కోట్లు కాగా, వీటిలో రూ.30,328 కోట్లు (మొత్తంలో 78 శాతం) కేవలం మూడు నెలలు ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో వచ్చినవే. అంతేకాదు, 2016 ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకూ ఫండ్స్ ఈక్విటీ విభాగంలో నికర కొనుగోలుదారులుగానే కొనసాగుతున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ పట్ల ప్రాచుర్యం, అవగాహన పెరగడం వీటిలోకి నిధుల రాక అధికం కావడానికి కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇక ఎఫ్‌పీఐల రూ.55,908 కోట్ల పెట్టుబడుల్లో ఒకటో వంతు రూ.16,097 కోట్లు ఐపీవో మార్గంలో వచ్చినవి కావడం గమనార్హం. కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు ఏర్పాటైన తర్వాత అంటే 2014 జూన్ క్వార్టర్లో ఎఫ్‌పీఐలు భారీగా రూ.59,521 కోట్లను ఈక్విటీల్లోకి పంప్ చేయగా, ఆ తర్వాత అత్యధికంగా ఇన్వెస్ట్ చేసింది ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలోనే. ఎఫ్‌పీఐలు, ఫండ్స్ 2008 తొలి ఆరు నెలల్లో నికరంగా రూ.17,114 కోట్ల నిధుల్ని వెనక్కి తీసుకోగా, ఇక ఆ తర్వాత ఇప్పటి వరకూ ఏటా తొలి ఆరు నెలల్లో నికర కొనుగోలుదారులుగానే ఉన్నారు. ఇక ముందూ మన మార్కెట్లు దేశ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఆకర్షిస్తాయనే పరిశీలకులు భావిస్తున్నారు. సమీప కాలంలో పెట్టుబడుల ఉపసంహరణకు అవకాశం ఉన్నప్పటికీ అది సాధారణ ప్రక్రియలో భాగమేనంటున్నారు. ‘‘దీర్ఘకాలంలో వృద్ధి పరంగా భారత్‌కు ఉన్న అవకాశాలు అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. ప్రోత్సాహకరమైన అంశమేమిటంటే దేశీయ ఇన్వెస్టర్ల నుంచి కూడా పెట్టుబడులు పెరగడం. ఇది మార్కెట్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనివల్ల అంతర్జాతీయ అంశాల కారణంగా దేశీయ మార్కెట్లలో ఆటుపోట్లు తగ్గుతాయి’’ అని వేద ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ వ్యవస్థాపకుడు జ్యోతివర్ధన్ జైపూరియా పేర్కొన్నారు. ఇన్వెస్టర్లలో పరిణతి ఇన్వెస్టర్లలో పరిణతి పెరిగింది. నిపుణుల ఆధ్వర్యంలో సరైన నియంత్రణలతో నడిచే మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు సురక్షితమని వారు అర్థం చేసుకుంటున్నారు. అదే సమయంలో ఇతర పెట్టుబడి సాధనాలైన రియల్టీ, బంగారం ఆకర్షణను కోల్పోయాయి. దీంతో వారు ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు – నీలేష్‌షా, ఎండీ,కోటక్ మహింద్రా అస్సెట్ మేనేజ్మెంట్ -
ద్రవ్యోల్బణానికి ఈక్విటీలే విరుగుడు!
♦ ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని మెరుగైన రాబడులకు అవకాశం ♦ సంప్రదాయ పథకాల్లో వచ్చే రాబడులు స్వల్పమే ♦ ద్రవ్యోల్బణంతో ముడిపెట్టి చూస్తే మిగిలేదేమీ ఉండదు ‘ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు’ అన్నది వెనుకటి నుంచీ పెద్దలు చెప్పే మాట. ‘పిల్లలకు చదువులు చెప్పించి చూడు’ అన్నది నేటి తరం చెప్పుకోవాల్సిన మాట. ఎల్కేజీ, యూకేజీలకే వేలాది రూపాయల ఫీజులు... ఇంజనీరింగ్‌కు రూ.లక్షలు, వైద్య విద్యకు రూ.కోట్లు కుమ్మరించాల్సి వస్తోంది. ఇప్పుడే ఇంత కాస్ట్లీగా ఉంటే భవిష్యత్తులో విద్య చెప్పించడం సామాన్యులకు ఎంత శక్తికి మించిన వ్యవహారమో ఊహించొచ్చు. ఇక సొంతిల్లు సమకూర్చుకోవడం, పిల్లలకు వివాహాలు చేయడం కూడా బడ్జెట్‌తో ముడిపడినవే. జీవన వ్యయమూ ఏటేటా పెరిగిపోతూనే ఉంది. పరిస్థితి ఇలా ఉంటే... లక్ష్యాలు ఘనంగా ఉంటే... అనాదిగా వస్తున్న సంప్రదాయ పొదుపు, మదుపు సాధనాలైన బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారం, పీపీఎఫ్‌లను నమ్ముకుంటే ఒడ్డెక్కడం కష్టమే! మనిషి జీవితాన్ని ప్రభావితం చేసే వాటిలో ద్రవ్యోల్బణం కీలకమైనది. ఇది నిత్యావసరాల ధరలను పెంచేస్తూ రాబడులను మింగేసే మహమ్మారి. ఉదాహరణకు మీరు ఓ వస్తువును ఈ రోజు రూ.100 పెట్టి కొన్నారనుకోండి. 5 శాతం ద్రవ్యోల్బణం రేటు ఉంటే ఏడాది తర్వాత అదే వస్తువును రూ.105 పెట్టి కొనాల్సి వస్తుంది. అలాగే, సేవింగ్స్ ఖాతాలో రూ.100ను ఓ ఏడాది పాటు ఉంచేశారనుకోండి. దీనిపై వచ్చే వడ్డీ 4 శాతమే. ఏడాది పాటు సేవింగ్స్ ఖాతాలో ఉంచిన రూ.100 కాస్తా రూ.104 అవుతాయి. మరి ఏడాది క్రితం రూ.100కు కొన్న వస్తువు ద్రవ్యోల్బణం కారణంగా నేడు రూ.105 కాగా, బ్యాంకు ఖాతాలో రూ.100 రూ.104 దగ్గరే ఆగిపోయింది. అంటే మరో రూపాయి అదనంగా సమకూర్చుకుంటే గానీ సదరు వస్తువును సొంతం చేసుకోలేరు. ఈ ఉదాహరణను బట్టి చూస్తే బ్యాంకు సేవింగ్స్ ఖాతా వడ్డీ రేటు ద్రవ్యోల్బణం రేటు కంటే తక్కువగా ఉందని అర్థమవుతోంది. వాస్తవంగా బ్యాంకు ఖాతాలో ఉంచిన రూ.100పై నికరంగా ఒక రూపాయి సంపదను మీరు ఓ ఏడాదిలో కోల్పోయినట్టు. ఇక సేవింగ్స్ ఖాతాలో ఉన్న నగదుపై వచ్చే వడ్డీ ఓ ఏడాదిలో రూ.10,000 దాటితే దానిపై పన్ను కట్టాల్సి ఉంటుంది. ఈ పన్నును, ద్రవ్యోల్బణాన్ని తీసేసి చూస్తే రూ.100 ఏడాది తర్వాత రూ.103.60గానే మిగిలిపోతుంది. ఇక్కడ మనం చెప్పుకున్నది నిత్యావసర వస్తువుల ద్రవ్యోల్బణమే. అదే విద్యా ద్రవ్యోల్బణం చూసుకుంటే అది ఇంకా ఎక్కువే ఉంది. ఫీజుల పెరుగుదల ఏటేటా 10 శాతంకంటే ఎక్కువే ఉంటోంది. సగటున 10 శాతంగా చూసుకున్నా ఓ ఇంజనీరింగ్ కోర్స్ వ్యయం ఈ రోజు రూ.8 లక్షలు ఉంటే, ఎనిమిదేళ్ల తర్వాత రూ.17 లక్షలు అవుతుంది. 2030లో అయితే రూ.30 లక్షలు వ్యయం చేయాల్సిందే. ఇక వైద్య చికిత్సా వ్యయాల్లోనూ భారీ పెరుగుదల చూస్తూనే ఉన్నాం. ఈ స్థాయి వ్యయాలను తట్టుకోవాలంటే ఆ మేర ఆదాయార్జన పెరగాలి. పెట్టుబడులపై రాబడులు సైతం ద్రవ్యోల్బణాన్ని మించి ఉండాలి. సిప్‌తో మరింత ప్రయోజనం ప్రతి నెలా రూ.10,000 చొప్పున ఓ మంచి ఈక్విటీ పథకంలో 25 ఏళ్ల పాటు పెట్టుబడులు పెడుతూ వెళితే రూ.1.9 కోట్లు సమకూరుతుంది. అదే ఆర్డీలో రూ.10,000 చొప్పున పెడుతూ వెళితే 6 శాతం రేటు ఆధారంగా సమకూరే మొత్తం రూ.70 లక్షలే. ఉదాహరణకు పిల్లల విద్య కోసం ప్రతి నెలా రూ.5,000 చొప్పున మంచి ఈక్విటీ పథకాల్లో పెట్టుబడి పెడుతూ వెళితే నాలుగేళ్ల పాప లేదా బాబు కళాశాల విద్యకు వచ్చే సరికి 12 శాతం వార్షిక రాబడులు వస్తాయనుకుంటే రూ.20 లక్షల నిధి సమకూరుతుంది. ఇది చూడ్డానికి భారీ నిధిగానే కనిపిం చొచ్చు. కానీ ఓ పదేళ్ల తర్వాత దీని వాస్తవిక విలువ సగమే ఉంటుందని భావించొచ్చు. నికర లాభాలు..! పెట్టుబడులకు సంబంధించి ప్రాథమిక సూత్రం... పన్ను అనంతరం రాబడులు ద్రవ్యోల్బణ రేటును మించి ఉండాలి. అప్పుడే సంపద సృష్టి సాధ్యమవుతుందని ఆర్థిక పండితులు చెబుతుంటారు. చాలా వరకు సంప్రదాయ పొదుపు పథకాలు ఈ విధమైన సంపద సృష్టికి అక్కరకు రాలేదని గణాంకాలు చెబుతున్నాయి. పీపీఎఫ్ పథకంలో కాస్త మెరుగైన రాబడులు ఉన్నప్పటికీ ఈక్విటీలతో పోలిస్తే దూరంలోనే ఉన్నాయి. చారిత్రక గణాంకాలను చూసినా ఈక్విటీలు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడులను ఇచ్చాయని తెలుస్తోంది. రెండు, మూడు, ఐదేళ్లలో భారీ సంపదను సృష్టించడం అంటే చాలా కష్టం. అదే ఓ 15, 20, అంతకంటే ఎక్కువ కాలానికి ఈక్విటీలు, ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడుల ద్వారా సంపదను సృష్టించుకోవడం కష్టమైన పనేమీ కాదు. గత 25 ఏళ్లలో బంగారం 8.9 శాతం రాబడులను ఇస్తే, బ్యాంకు ఎఫ్డీలు 8.7 శాతమే ఇచ్చాయి. కానీ, మంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మాత్రం 12.2 శాతం రాబడులను అందించాయి. ఇక్కడ చూడాల్సిన మరో అంశం పన్ను. బ్యాంకు ఎఫ్డీలు, బంగారంపై రాబడులకు పన్ను భారం ఉండగా... ఈక్విటీలు, ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడులపై రాబడులకు దీర్ఘకాలంలో ఎటువంటి పన్నూ లేదు. -
దాన శీలం
ఆత్మీయం దానం... ధర్మం మన సంప్రదాయంలో భాగం. దానగుణం కొందరికి పెద్దల నుంచి అబ్బితే, ఇంకొందరికి స్వతహాగానే అలవడుతుంది. కొందరు చేతికి ఎముక లేనట్టు విరివిగా దానాలు చేస్తే, మరి కొందరు అవతలివారి అవసరానికి సరిపడేలా లేదా తమ స్తోమతకు తగ్గట్టు చేస్తారు. దాత తెలుసుకోవలసిందేమంటే, దానం అంటే మనకు అవసరం లేనివాటిని లేదా పనికి రానివాటిని వదిలించుకునేందుకు చేసేది కాదు... మనం దానం చేస్తున్నాము కదా అని దానం పుచ్చుకునే వారిని చిన్నచూపు చూడకూడదు. ఇంత చేశాం అంత చేశాం అని గప్పాలు కొట్టుకోకూడదు. తన నుంచి దానం గ్రహించిన వ్యక్తి ఎక్కడయినా కనపడితే, అతను తనవల్లే బతుకుతున్నాడు అని గొప్పలు చెప్పుకోకూడదు. లోపాలు ఉన్న వాటిని, అయోగ్యమైన వాటిని దానం పేరుతో వదిలించుకోకూడదు. దానం చేసిన తర్వాత అయ్యో, నాకిష్టమైన దానిని ఇచ్చానే అని బాధపడుతూ, దాని మీద మమకారాన్ని వదులుకోవాలి. సహాయం అవసరమై ఎవరైనా వస్తే రేపు రా మాపురా అని తిప్పుకోకూడదు. అన్నిటినీ మించి కుడి చేతితో ఇచ్చిన దానాన్ని ఎడమ చేతికి కూడా తెలియకుండా చేయాలి. అలాంటివారే ఉత్తమ దాతలు. శ్రేష్టమైన వాటినే దానం చేయాలి. అలా ఉత్తమ దానాలు చేయబట్టే కర్ణుడు, ధర్మరాజు వంటివారు గొప్ప దానశీలురుగా నేటికీ కొనియాడబడుతున్నారు. -
పితృవాక్య పరిపాలనే పరమ ధర్మం
పితృ దేవోభవ తండ్రి అనేవాడు తనకేమిటని చూసుకోడు. తనకున్నది పిల్లలకిచ్చి వారు తృప్తిపడితే అదే సంతోషమనుకుంటాడు. ఇది లౌకికమైన తండ్రికేకాదు, పరమేశ్వరుడు కూడా ఇదే బుద్ధితో ఉంటాడు. ఒకానొకప్పుడు సముద్రంలో హాలాహలం ఉత్పన్నమయి ప్రాణులన్నీ పడిపోతుంటే, తట్టుకోలేక తండ్రి అయిన పరమశివుడితో మొరపెట్టుకున్నాయి. ఆయన భార్యకు చెప్పుకున్నాడు. ‘మనం తల్లిదండ్రులం కదూ, మనం ఉండగా బిడ్డలు అలా బాధపడొచ్చా! పార్వతీ, నేను పుచ్చేసుకుంటా ఆ హాలాహలం’ అన్నాడు. ఆమెకూడా ‘సరే, మీ ఇష్టం’ అంది. తండ్రి కాబట్టి గబగబా వెళ్ళి చేతిలోకి తీసుకున్నాడు. ‘లోపలికి మింగినా, బయటికి వదిలినా లోకాలతోపాటూ లోకులూ పోతారు’ అని కంఠంలోనే ఉంచేసుకుని మచ్చలేనివాడు కాస్తా నీలకంఠుడయ్యాడు. తండ్రిగా ఇంత కష్టాన్ని తాను సంతోషంగా స్వీకరించాడు. అదీ తండ్రి ఆర్తి అంటే. తండ్రి తప్పుల్ని ఎంచడం, ‘ఆయనకేం తెలుసు, నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను’ అనడం ఘోర అపచారం. తండ్రిని గౌరవించడం అంటే–తండ్రిని తండ్రిగా చూడడం, ఆయన మాటను శిరసావహించడం మాత్రమే. శ్రీరామాయణం లో ఒక సన్నివేశంలో రామచంద్ర మూర్తి లక్ష్మణస్వామితో ఇలా అంటాడు–’ధర్మాన్ని గురించి తెలుసుకోవాలంటే ధర్మశాస్త్రాలేవీ చదవక్కరలేదు. తండ్రి చెప్పినమాట వినడమే బిడ్డల ధర్మం. ఆయనకు సేవచేయడమే ధర్మం. తండ్రిని ధిక్కరించడం ధర్మంకానే కాదు. నాకన్నీ తెలుసనుకోవడం పరమ అధర్మం’. ఈవేళ సమాజంలో వింతపోకడ ఒకటి కనిపిస్తున్నది. ‘ఎవడి పెళ్ళి వాడి ఇష్టం. తండ్రికి చెప్పేదేమిటి?’అని. పుస్తకాలు తండ్రి కొనివ్వాలి, బడికి తండ్రి పంపించాలి. బట్టలు తండ్రి తీసివ్వాలి. కానీ ‘నాభార్య ఎవరో నేను నిర్ణయించుకుంటాను’. ఇది తప్పు. వివాహమనేది వ్యక్తిగత విషయం కానేకాదు. దానితో పలువురి ప్రత్యక్ష, పరోక్ష బాధ్యతలు, సమస్యలు, కుటుంబ గౌరవప్రతిష్ఠలు ముడిపడి ఉన్నాయి. పక్కన ఎటువంటి పిల్లవచ్చి కూర్చుంటే తన కుమారుడు సుఖశాంతులు పొందుతాడో తెలుసుకోగలిగిన వాడు తండ్రి ఒక్కడే. కాబట్టి కోడలిని నిర్ణయించే అధికారం తండ్రి ఒక్కడిదే. రాముడికి సరైన ఇల్లాలిని వెతకండని దశరథుడు మంత్రులందరినీ పురమాయించాడు. ఇంతలో విశ్వామిత్ర మహర్షి రాక, తరువాత శివధనుర్భంగం అయ్యాయి. జనకమహారాజు బంగారు పాత్రలో నీళ్ళుపట్టుకొచ్చి కన్యాదానం చేస్తానన్నాడు. ‘‘ఇవ్వడానికి మీరెవరు, పుచ్చుకోవడానికి నేనెవర్ని. క్షత్రియుడిని కాబట్టి శివధనుర్భంగం చేశాను. పిల్లను మీరిస్తారంటారేమో, నేను పుచ్చుకోను. ఆ పిల్ల నా భార్యగా ఉండాలో కాదో చెప్పవలసినవాడు నన్ను కన్న నాతండ్రి దశరథ మహారాజు. ఆయనకు కబురు చేయండి. ఆయన వచ్చి స్వీకరించ మంటే స్వీకరిస్తాను’’ అన్నాడు. అదీ రాముడి ప్రజ్ఞ. దానికి దశరథుడు పొంగిపోయాడు. ఆయన వచ్చి ’ఈమె నీకు భార్య’ అన్న తరువాత పాణిగ్రహణం చేశాడు. తండ్రి అంటే రాముడికి ఎంత మర్యాదంటే...రామా! రామా! అని పిలిచే రామనామం గొప్పదే. కానీ తండ్రిపేరుతో కలిపి ‘దాశరథీ!’ అని పిలిస్తే చాలు ఉలిక్కిపడిపోతాడట! అమ్మో! నన్నెవరో మా నాన్న గారి పేరుతో పిలుస్తున్నారని పరవశించిపోతాడట! తండ్రిని గౌరవించే విషయంలో రాముడిని చూసి నేర్చుకోవాలి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు స్వరార్చకుడు ఆరాధన తాళ్లపాక అన్నమాచార్యులు అంటే అందరికీ అర్థం కాకపోవచ్చు కానీ, అన్నమయ్య అంటే మాత్రం అందరం పులకిస్తాం. పదకవితా పితామహుడు, స్వరకర్త, దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి ఆద్యుడు అన్నమయ్య. తిరుమలేశుడంటే వల్లమాలిన భక్తితో అన్నమయ్య స్వామిపై 32 వేల పదములల్లి తరించాడు. ఆయన కీర్తనలతో తెలుగు నేల పులకించింది. చందమామరావే జాబిల్లి రావే అంటే పిల్లలు గోరుముద్దలు తింటారో తినరో కానీ, వేంకటేశ్వరుడు మాత్రం ఎంతో ఇష్టంగా నైవేద్యాలారగిస్తాడు. జో అచ్యుతానంద జోజో ముకుందా అంటూ అన్నమాచార్య కృతి ఆలపిస్తే చిన్నారులే కాదు... స్వామివారూ నిద్రలోకి జారుకోవలసిందే! సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు ఖడ్గమైన నందకం వైశాఖ శుద్ధ పూర్ణిమనాడు ఈ పుడమిపై అన్నమయ్యగా ఆవిర్భవించి, అదివో అల్లదివో హరివాసమూ అంటూ స్వామిని పొడగంటి, వినరో భాగ్యము విష్ణుకథా అంటూ కమ్మగా ఆలపించి, మెండైన బ్రాహ్మణుడుండేటి మెట్టుభూమి ఒకటే... ఛండాలుడుడుండేటి సరిభూమియునొకటే అంటూ కులమత భేదాలను నిరసించి ‘అదిగో అల్లదివో హరివాసమూ’ అంటూ స్వామి సేవలో తరించి నింగికెగసింది. ఈ పర్వదినాన అన్నమయ్య పదాలను పాడుకోవడమే కాదు, ఆ పదాలలోని పరమార్థాన్ని వంటబట్టించుకోవడమే ఆయనకు అర్పించే అసలైన పదార్చన.. స్వరార్చన. అహింసా రాజహంస బౌద్ధ వాణి మొదటి నుండి సిద్ధార్థుడు హింసను ఒప్పుకునేవాడు కాదు. ఆయన జీవితంలో రెండు సంఘటనలు చాలా ముఖ్యమైనవి. వాటిలో ఒకటి హంస వృత్తాంతం. సిద్ధార్థుని పెదనాన్న కొడుకు దేవదత్తుడు. ఇద్దరూ స్నేహితులు. ఒకరోజున ఒక అందమైన హంస ఆకాశంలో ఎగురుతూ పోతోంది. దేవదత్తుడు బాణం సంధించి, హంసను నేలకూల్చాడు. అది రెక్కలు టపటప కొట్టుకుంటూ, బాధగా రోదిస్తూ వచ్చి, ఒక ఉద్యానవనంలో సిద్ధారున్ధికి దగ్గరలో పడింది. సిద్ధార్థుడు వెళ్లి, బాణం లాగి గాయాన్ని కడిగాడు. తోటలోని కొన్ని ఆకులు నలిపి, గాయం మీద ఉంచి, తన వల్లెవాటును చించి, కట్టుకట్డాడు. చల్లని నీటితో దాని ముఖాన్ని తుడుస్తుండగా పరుగు పరుగున దేవదత్తుడు వచ్చి– ‘‘ఈ హంస నాది. నాకు ఇవ్వు’’ అని అడిగాడు. ‘‘సోదరా! ఇది నాది. నీకు ఇవ్వను’’ అన్నాడు.‘‘దీన్ని కొట్టిన వాణ్ణి నేను. పడగొట్టిన వాడిదే హంస.’’ అన్నాడు దేవదత్తుడు. ‘‘దీన్ని రక్షించిన వాణ్ణి నేను. కాబట్టి రక్షించిన వాడిదే రాజహంస’’ అన్నాడు సిద్ధార్థుడు. ఇద్దరి వాదం వివాదంగా మారి చివరికి రాజసభకు చేరింది. హంస ఎవరిదో ఎవ్వరూ తేల్చలేకపోయారు. చివరికి మహామంత్రి కల్పించుకుని, హంసను సభమధ్యలో నిలబెట్టి, ‘‘మీ ఇద్దరూ పిలవండి. ఎవరి దగ్గరకొస్తే వారిదే హంస’’ అన్నాడు. అది సిద్ధార్థుడు పిలవగానే వచ్చి అతని భుజం మీద వాలింది. కొన్ని రోజులు ఆ హంసను తన దగ్గరే ఉంచుకుని, గాయం మానగానే ఆకాశంలో వదిలేశాడు. ‘‘చంపడమే కాదు, స్వేచ్ఛగా ఎగిరే పక్షుల్ని పంజరాల్లో బంధించినా హింసే’’ అని చాటిన ఆ కరుణాసముద్రుడు సిద్ధార్థుడు... గౌతమ బుద్ధుడు. – డా. బొర్రా గోవర్ధన్ మేధాసంపదకుగురువు అను గ్రహం నవగ్రహాలలో గురువు మేధాసంపదకు, ఆధ్యాత్మిక శక్తికి, నైతికతకు కారకుడు. దేవగురువైన బృహస్పతినే నవగ్రహాలలో గురువుగా వ్యవహరిస్తారు. జ్యోతిష శాస్త్రరీత్యా గురువు సహజంగానే శుభఫలితాలను ఇచ్చే గ్రహం. అయితే, కొన్ని సందర్భాలలో గురుగ్రహం వల్ల కూడా కొన్ని చెడు ఫలితాలు సంభవిస్తాయి. గురువు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు, స్వక్షేత్రంలో ఉన్నప్పుడు, మిత్రక్షేత్రాల్లో ఉన్నప్పుడు, మిత్రగ్రహాలతో కలసి ఉన్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. చంద్రునితో కలసి కేంద్రాలలో ఉన్నప్పుడు గజకేసరి యోగం కలిగిస్తాడు. గురువు వల్ల శుభయోగాలు కలిగినప్పుడు గుకె దశాంతర్దశలలో మేధాసంపద, సాంఘిక గౌరవం, గురువుల అనుగ్రహం, న్యాయాధికారం, పాలనాధికారం, సంపద ప్రాప్తి కలుగుతాయి. గురుబలం గల వారు బోధన, పరిశోధన, న్యాయ, శాస్త్ర, ఆధ్యాత్మిక వృత్తుల్లో రాణిస్తారు. ప్రతికూల పరిస్థితుల్లో ఉంటే గురువులు, అధికారుల ఆగ్రహానికి గురికావడం, నష్టాల్లో కూరుకుపోవడం వంటి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక నష్టాలు, ఆరోగ్యభంగం, మనశ్శాంతి లోపించడం జరుగుతుంది. ఈ దుష్ఫలితాలు తొలగడానికి గురుజపం, పూజ, శనగలు, పసుపు వస్త్రాలు దానం ఇవ్వడం, కనక పుష్యరాగం ధరించడం మంచిది. దేవునితో కాదు... దేవునిలో ఉండాలి! సువార్త దేవుడు చాలా పెద్దగా ఉంటాడా అన్నది పదేళ్ల బాలుకు సంశయం. అప్పుడే ఆకాశంలో వెళుతున్న ఒక విమానాన్ని చూపించి, అంతుంటాడు దేవుడని తండ్రి చెప్పాడు. ‘‘దేవుడంత చిన్నవాడా?’’ అన్నాడా బాలుడు నిరుత్సాహంగా. మరునాడు తండ్రి విమానాశ్రయానికి తీసుకెళ్తే అక్కడ విమానాల్ని దగ్గర నుండి చూసి ‘విమానాలు ఇంత పెద్దవా?’ అన్నాడా బాలుడు. ‘‘అవును, దూరం నుండి అన్నీ చిన్నవే. దేవుడూ అంతే. ఆయనకు సమీపంగా ఉంటే ఆయనెంత పెద్దవాడో అర్థమవుతుంది’’ అన్నాడు తండ్రి. ధర్మశాస్త్రోపదేశకుడొకాయన యేసును దేవుడిచ్చిన ఆజ్ఞలన్నింటిలోకి అతి ప్రాముఖ్యమైనదేది? అనడిగాడు. అత్యంత ప్రాముఖ్యమైనవి ఒకటి కాదు రెండున్నాయంటూ, అద్వితీయుడైన దేవుని సంపూర్ణంగా ప్రేమించాలన్నది మొదటిది కాగా, దేవుని సంపూర్ణంగా ప్రేమించినట్టే, మన పొరుగువాణ్ణి కూడా అంతే ప్రేమించాలన్నది రెండవ ప్రాముఖ్యమైన ఆజ్ఞ అని యేసు జవాబిచ్చాడు. ‘నిజమే, బలులివ్వడం, హోమాలు చేయడం కన్నా ముఖ్యమైనది. దేవుని, మన పొరుగువానిని ప్రేమించడమే ముఖ్యమని ఆ బోధకుడు అంగీకరించాడు. అందుకు యేసు నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవని అతనితో వ్యాఖ్యానించాడు (మార్కు 12:33) దేవునికి దూరంగా ఉండటం కన్నా, దగ్గరగా ఉండటం మంచిదే! కాని ఈ రెండింటి కన్నా దేవునిలో ఉండేవారు నిజంగా ధన్యులు. ఈ సాన్నిహిత్యంలో దేవుని మహాలక్షణాలు, ఆయన శక్తి విశ్వాసికి సొంతమవుతాయి. లోకమన్నా, లోకభోగాలన్నా అందరికీ ఆకర్షణే! దీపం çపురుగులకూ దీపానికి ఉన్న ఆకర్షణలాంటిదే ఇది. చివరకు ఆ పురుగులన్నీ దీపం వెలుగులో తిరుగుతూనే దీపం మంటలో పడి అంతమవుతాయి. లోకానికి వెలుగు, మంట రెండూ ఉన్నాయి. లోకం వెలుగులో ఎదిగి బాగుపడాలనుకునేవారు చివరకు దాని మంటలో మాడి మసైపోక తప్పదు. మరణాంతకరమైన ఈ ‘ఆకర్షణ’ నుండి తప్పించుకునే ఒకే ఒక మార్గం దేవునికి దగ్గర కావడం. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగు మంట కారణంగా వెలువడేది కాదు. ఆయనే వెలుగు గనుక ఆ వెలుగులో విశ్వాసికి లోకానుబంధం ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది. దేవునికి సమీపమయ్యే కొద్దీ లోకాకర్షణకు దూరమై వాటన్నింటికీ అతీతుడవుతాడు విశ్వాసి. ప్రభువులో ఎదగడమంటే ఇదే. మొక్క నేల‘లో’ ఉంటేనే ఎదుగుతుంది, స్థిరపడుతుంది, ఫలాలనిస్తుంది. నేలలో పడకుండా నేలకు ఎంత సమీపంలో ఉన్నా ఆ విత్తనం మొక్కగా మారడం అసాధ్యం. అందుకే యేసు ‘నాలో’ ఉంటేనే ఫలిస్తారని బోధించాడు (యోహాను 15:4). విమానాన్ని దూరం నుండి చూసే వారి కన్నా అతి దగ్గరి నుండి చూసే వాళ్ళు గొప్పవాళ్లనుకోవడం భ్రమ. విమానంలో కూర్చొని ప్రయాణించే వారికే దాని శక్తి, వేగం, అదిచ్చే ఆనందం అర్థమవుతుంది. ఆయనలో ఎదగాలనుకుంటే ఆయనలో స్థిరంగా వేళ్లూనడం తప్ప వేరే మార్గం లేదు. – రెవ.డా.టి.ఎ. ప్రభుకిరణ్ సత్కార్యాల్లోనేసంతోషం.. సాఫల్యం ఇస్లాం వెలుగు అందమైన ఇల్లు, కోరుకున్న భార్య, రత్నాల్లాంటి బిడ్డలు, విలాసవంతమైన వాహనాలు, కావలసినంత బ్యాంకుబ్యాలెన్సు, బలం, అధికారం, – ఇంకా రకరకాల విలాసవంతమైన సాధనా సంపత్తి నిత్యం అందుబాటులో ఉన్నప్పటికీ, సంతోషం కోసం, సంతృప్తికరమైన జీవితం కోసం వెదుకులాట మానవసమాజంలో ప్రతినిత్యం మనం చూస్తున్నాం. అన్నీ ఉండి కూడా అనుభవించలేని అనేకమంది సంపన్నులూ మనకు పరిచయమే. అంటే ఇవన్నీ పాక్షిక ఆనందాన్ని మాత్రమే అందించగలవు కాని, పరిపూర్ణసంతోషానికి సోపానం కాలేవని మనకు అర్ధమవుతోంది. అయినా మనిషి అనాదిగా శాంతి, సంతోషాలకోసం తంటాలు పడుతూనే ఉన్నాడు. తనకు తోచిన ప్రయోగాలతోపాటు, తన లాంటి వారు చెప్పే సూత్రాలన్నిటినీ పాటిస్తున్నాడు. ఎవరెవరి చుట్టూనో తిరుగుతూ, చెప్పిందల్లా చేస్తూ, తృణమో పణమో సమర్పించుకుంటూ ఉన్నాడు. కాని ఎక్కడా శాంతి, సంతోషం లభించడంలేదు. ధనం ధారపోసి కొనుక్కుందామంటే, అది మార్కెట్లో లభ్యమయ్యే వస్తువుకూడా కాదాయె. మరేమిటీ మార్గం? మంచిజీవితం, శాంతి, సంతోషం, సంతృప్తి ఇవన్నీ ఎండమావేనా?? ఈ విషయాన్ని ఒక శిష్యుడు ప్రవక్త(స)వారిని అడిగాడు. అప్పుడాయన ‘అల్లాహ్‌ను బాగా స్మరించు. అనాథలను ఆదరించు. పేదసాదలకు శక్తిమేర సహాయం చెయ్యి.’ అని ఉపదేశించారు. అంటే, ఇలా చెయ్యడం ద్వారా నువ్వు కోరుకుంటున్న శాంతి, సంతోషాల మంచి జీవితం ప్రాప్తమవుతుంది అని అర్ధం. కాని దురదృష్టవశాత్తు నాలుగు రాళ్ళ సంపాదన సమకూరగానే మనుషుల్లో అహం పెరిగిపోతోంది. దైవాన్ని స్మరించడం తరువాత సంగతి, అసలు దైవాన్నే మరిచి పోయి, పేద సాదలను దగ్గరికి రానివ్వని పరిస్థితి నెలకొంటోంది. మరిక శాంతి లభించాలంటే ఎలా లభిస్తుంది.? కాబట్టి సర్వకాల సర్వావస్థల్లో దైవాన్ని స్మరిస్తూ, సాధ్యమైనంతమేర మంచి పనులు చేస్తూ, చెడులకు దూరంగా ఉండే ప్రయత్నం చెయ్యాలి. సత్కార్యాల్లో లభించే సంతోషం... సంతృపి ్తమరెందులోనూ లభించదు. ధర్మబద్ధమైన సంపాదన, ధర్మసమ్మతమైన ఖర్చు, సత్కార్యాల్లో సమయాన్ని వెచ్చించడం... ఇదిగనక మనం ఆచరించగలిగితే నిత్యసంతోషం, ఇహపరసాఫల్యం సొంతమనడంలో సందేహమే లేదు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ నృసింహ జయంతి ఒక పర్వం శ్రీమన్నారాయణుని దివ్యావతారాలలో నాలుగవదైన నృసింహావతారం అత్యంత విశిష్టమైనది. వైశాఖ శుద్ధ చతుర్దశినాటి సాయంకాలం నరసింహమూర్తి హిరణ్యకశిపుని వధించేందుకు ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి.‘ఇందుగలడందులేడని సందేహము వలదు’ అన్న తన భక్తుడైన ప్రహ్లాదుని విశ్వాసాన్ని నిజం చేసి చూపడానికి స్తంభం బద్దలు కొట్టుకుని వచ్చాడు. జగత్తు అంతటా తానున్నానని నిరూపించాడు.ఈ రోజు ఆచరించవలసిన విధులునృసింహ జయంతినాడు బ్రహ్మ ముహూర్తంలో లేచి తలంటుకొని స్నానం చేసి స్వామివారికి షోడశోపచార పూజ జరిపి, శ్రీ నృసింహస్తోత్రం–శ్రీ నృసింహ సహస్ర నామ జపం చేసి పానకం–వడపప్పు, చక్రపొంగలి–దద్ధ్యోదనం నివేదిస్తే స్వామి వారి అనుగ్రహంతో సర్వసంపదలు లభిస్తాయి.ప్రాణభయం, శతృపీడ, దుష్టగ్రహాల వల్ల, భూత ప్రేత పిశాచాలు, శత్రువుల దుష్ట ప్రయోగాల వల్ల కలిగే బాధలను తక్షణమే నివారించి భక్తులను రక్షించి, ఆ ప్రయోగం చేసినవారిపైనే తిప్పికొట్టే అనుగ్రహమూర్తి – శ్రీ నారసింహుడుసర్ప, మృత్యు, అగ్ని, అకాల మరణ, శస్త్ర, వ్రణ, శతృపీడలవల్ల బాధపడ్డవారు, చెరసాల పాలబడ్డవారు, దుష్టులచే పీడించబడే సాధువులు శ్రీనృసింహస్వామిని జపధ్యాన ఉపాసనల ద్వారా పూజించినట్లయితే, తక్షణమే కష్టాలనుండి విముక్తి పొందుతారని పెద్దల మాట. నయన మనోహరం... నేత్ర దర్శనం ఒక విశేషం తిరుమల క్షేత్రంలో ప్రతి గురువారం రోజున శ్రీవారి దర్శనానికి విశిష్టత ఉంది. మూలమూర్తి దర్శనం, సమర్పించే నివేదనలు, అలంకారాలు విభిన్నంగా ఉంటాయి. ప్రతి గురువారం వేకువజామున రెండవ అర్చన తర్వాత మూలమూర్తికి ఎలాంటి ఆభరణాలు, అలంకారాలు లేకుండా నిరాడంబర స్వరూపంతో దర్శన మిస్తారు. ఆభరణాలే కాకుండా నొసటన పెద్దగా ఉండే పచ్చ కర్పూరపు తిరునామాన్ని బాగా తగ్గించి, స్వామి నేత్రాలను దర్శించుకునే మహద్భాగ్యాన్ని భక్తులకు కల్పిస్తారు. ఆ రోజు ఆభరణాల బదులు పట్టుధోవతిని ధరింప చేస్తారు. 12:2 కొలతలతో పట్టు ఉత్తరీయాన్ని యజ్ఞోపవీతంగా అలంకరిస్తారు. స్వామివారి శిరస్సుపై కిరీటాన్ని తీసి పట్టువస్త్రాన్ని కిరీటం తరహాలో తలపాగా చుడతారు. బంగారు శంఖచక్రాలు, బంగారు కర్ణభూషణాలు, సాలిగ్రామ హారాలు అలంకరిస్తారు. మెడలో వక్షఃస్థల బంగారు అలమేలు మంగహారం అలంకరిస్తారు. కాళ్లకు కyì యాలు, పాదాలకు బంగారు తొడుగులు అలంకరిస్తారు. ఇలా ద్వాపర యుగంలోని నల్లని కృష్ణయ్యే వెంకటాద్రిలో గోవిందుడయ్యా అన్న రీతిలో దర్శనమిస్తాడు స్వామి. ఈ గురువారం రోజున కొందరికి తాము చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవాల్సిందిగా హెచ్చరించినట్టుగా స్వామివారు గోచరిస్తారు. గురువారం మాత్రం ఆలయంలోనేకాదు తిరుమలలో కూడా ఏ చిన్న తప్పు చేయడానికీ సిబ్బంది భయపడతారు.గురువారం నాటి దర్శనాన్నే నేత్ర దర్శనం అని అంటారు. ఆకారాలు వేరైనా అసలు పదార్థం ఒక్కటే! ఒక బోధ మనం చక్కెరతో ఎన్నో విధాలైన బొమ్మలు చేస్తాం. ఆకారాలు వేరైనా మూల పదార్థం ఒక్కటే. అదేవిధంగా, అన్ని ఉపాధులూ పరమేశ్వరుని వివిధ రూపాలే అనే జ్ఞానం కలిగితే ఆనందం కలుగుతుంది. సర్వమంటేనే పరమాత్మ. ఆకలిని పోగొట్టుకోవడానికి అన్నం మాత్రం చాలు. కానీ, మన నాలుక షడ్రసోపేతమైన పదార్థాలను కోరుతూ ఉంటుంది. నయనేంద్రియం కూడా అందమైన వస్తువులను దర్శించాలని ఆకాంక్షిస్తూ ఉంటుంది. దీనికి కారణం రుచులపై ఉన్న ప్రేమే. ఆధ్యాత్మిక విషయాలలోనూ అంతే! ఎందరో దేవతామూర్తులున్నారు. ఒక్కొక్కరికీ ఒక్కొక్క మూర్తి విశేషంపై అనురాగం, భక్తీ ఏర్పతుంటుంది. ఆ మూర్తిని మాత్రం వారు చిత్తశుద్ధితో సేవించుకుంటే చాలు... ఆనందం, ఐశ్వర్యం, అంత్యాన మోక్షప్రాప్తీ కలుగుతాయి. అయితే తొందరపడి వైద్యులనూ, మందులనూ మార్చినట్లు దేవతలను మార్చకూడదు. ఎన్నిమూర్తులున్నా, పరమాత్మ ఒక్కటే. నదులన్నీ సముద్రంలోనే కదా కలిసేది... అదేవిధంగా మనుషుల ఆరాధనలకు గమ్యం ఈశ్వరుడే. వీటిలో ఏది నిజం? ఒక సందేహం దక్షయజ్ఞంలో సతీదేవి యోగాగ్నితో భస్మమయ్యిందని అంటారు కదా, మరి సతీదేవి దేహాన్ని భుజాన ధరించి శివుడు నాట్యం చేస్తుంటే, విష్ణువు తన చక్రంతో ఆ శరీరాన్ని ఛేదించాడనీ, ఆ శరీర ఖండాలు పడిన చోట శక్తిపీఠాలు ఏర్పడ్డాయనీ శక్తిపీఠాల స్థలపురాణాలు చెబుతాయి. వీటిలో ఏది నిజం? ఈ రెండు అంశాలూ విభిన్న పురాణాలలో ఉన్నాయి. అయితే ఇక్కడ యోగాగ్నిలో దగ్ధమవడం అంటే బూడిదై పోవడం కాదు. యోగాగ్ని ద్వారా జీవచైతన్యం దేహాన్ని విడిచిపెట్టిందని అర్థం చేసుకోవాలి. పురాణ కథలన్నీ సంకేత వాదాలు. మనలోని యోగకేంద్రాలనే శక్తిపీఠాలంటారు. మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్న సప్త భూమికలలో యాభై శక్తిపీఠాలున్నాయి. పరమేశ్వరుని ఆధారం చేసుకున్న శక్తి వ్యాపించింది. ఆ వ్యాపించిన స్థానాలే శక్తి పీఠాలు. వ్యాపకత్వమే విష్ణువు. ఇలా శివ– శక్తి– విష్ణు తత్వాలుగా వ్యాపించిన శక్తి కేంద్రాలకు ఈ కథ మార్మిక సంకేతం. పురాణ కథలను మానవ స్థాయిలో చూడరాదు. వాటిలో అనేక మంత్ర– యోగ– తత్త్వ శాస్త్ర మర్మాలుంటాయి. పరస్పర విరుద్ధంగా ఉన్న అంశాలను ఒకదానితో ఒకటి సమన్వయం చేయాలి. అలా సమన్వయం చేసి తెలుసుకోవాలంటే శాస్త్ర పరిజ్ఞానంతో విశ్లేషణ చేసుకోవాలి. తొందరపడి నిర్ణయానికి రాకూడదు. -
వ్యక్తి ధర్మం ఇలా..
చేతిలోకి మొబైల్ వచ్చిన తర్వాత ఎదుటివాడి ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం మానేశాం. పైగా దానిని సెల్‌ఫోన్‌తో చిత్రీకరించి, కుదిరితే సెల్ఫీలు దిగి ఫేస్‌బుక్కులోనో, వాట్సాప్‌లోనో పెడుతున్న రోజులివి. కానీ సిరియాలోని ఒక ఫొటోగ్రాఫర్ నైతిక ధర్మం కోసం కాసేపు తన వృత్తిధర్మాన్ని పక్కన పెట్టేశాడు. గత వారం సిరియాలోని పశ్చిమ అలెప్పొలో రెబల్స్‌కు పట్టున్న రషీదిన్ వద్ద ఓ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. గమ్యానికి చేరే మార్గంలో కాసేపు విశ్రాంతి కోసమని డ్రైవర్ బస్సు నిలపడంతో అందులో నుంచి దిగిన ఓ చిన్నారి చిప్స్ తింటూ నిలబడింది. అంతలోనే పెద్దపేలుడుతో ఆ బస్సులోని 126 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరిలో దాదాపు 80 మంది చిన్నారులే. ఆ సమయంలో అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్ అబ్ద్ అల్‌ఖదర్ హబక్‌కు చుట్టుపక్కల దృశ్యాలు చూసేసరికి అతని గుండె ఆగినంత పనైంది. వెంటనే తేరుకున్న అతను కాసేపు కెమెరాలను పక్కనపెట్టేయాలని సహచరులకు చెప్పి క్షతగాత్రులను కాపాడేందుకు రంగంలోకి దిగాడు. తొలుత ఒక చిన్నారి వద్దకు వెళ్లి చూశాడు. అప్పటికే ఆ బాలుడు చనిపోయి ఉన్నాడు. వెంటనే సమీపంలోనే గాయాలతో పడిఉన్న మరో బాలుడి వద్దకు వెళ్లాడు. అతను ఊపిరి తీసుకోవడానికి అవస్థ పడుతున్నట్లు గమనించిన హబక్, వెంటనే బాలుడిని చేతుల్లోకి తీసుకొని అంబులెన్స్ వద్దకు చేర్చాడు. తర్వాత మరో బాలుడిని కాపాడేందుకు వచ్చాడు. ఈ క్రమంలో ఓ బాలుడి మృతదేహాన్ని చూసి చలించిపోయిన హబక్ మోకాళ్లపై కూలబడిపోయి కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ దృశ్యాలన్నిటిని సమీపంలో ఉన్న వేర్వేరు ఫొటోగ్రాఫర్లు చిత్రీకరించారు. ఈ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో కొన్ని వేలసార్లు షేర్ అయ్యాయి. నెటిజన్లు హబక్ మానవత్వానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. -
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు
ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలతో రెండు విధాలా మేలు పన్ను ప్రయోజనాలు దీర్ఘకాలికంగా అధిక రాబడులు సేఫ్ గేమ్ తగదు... ఇన్వెస్ట్ చేయడమంటే.. ఏదో ఒక సాధనంలో పెట్టుబడి పెట్టేయడం కాదు. సరైన సాధనాన్ని ఎంచుకోవాలి. రిస్కును తగ్గించుకునేందుకు చాలా మంది యువత కూడా తక్కువ రిస్కుండే ఫిక్సిడ్ డిపాజిట్లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లు వంటి వాటిలో అత్యధికంగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. దీనివల్ల అధిక రాబడులు దక్కించుకునే అవకాశాలను కోల్పోతారు. రిటైర్మెంట్ వంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఈక్విటీ మార్కెట్స్ వంటి సాధనాలే సరైనవి. ఉదాహరణకు వార్షిక ప్రాతిపదికన పీపీఎఫ్ పదిహేనేళ్ల కాలానికి 8.3 శాతం రాబడులే అందించగా.. బీఎస్ఈ సెన్సెక్స్ అదే వ్యవధిలో 14.7 శాతం రాబడినిచ్చింది. పన్ను ప్రయోజనాలూ ముఖ్యమే.. మనం పెట్టే పెట్టుబడులు మన సంపద పెరుగుదలకు ఉపయోగపడటంతో పాటు పన్ను ప్రయోజనాలు కూడా అందించేలా చూసుకోవాలి. ఏడాదికి రూ.1.5 లక్షలు సరిగ్గా ఇన్వెస్ట్ చేయడం ద్వారా గణనీయంగా పన్ను మినహాయింపులు పొందవచ్చన్నది చాలా మందికి తెలీదు (గరిష్ట ట్యాక్స్ రేటు 34.61 శాతంగాను, సెక్షన్ 80సీ కింద లభించే పన్ను మినహాయింపులను పరిగణనలోకి తీసుకుంటే). ట్యాక్స్ పేయర్లు పన్ను పోటును తగ్గించుకునేందుకు ప్రభుత్వం.. పీపీఎఫ్, జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్) పోస్టాఫీస్ డిపాజిట్, అయిదేళ్ల బ్యాంకు డిపాజిట్, జీవిత బీమా, ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీము (ఈఎల్ఎస్ఎస్) మొదలైన సాధనాలెన్నో అందుబాటులో ఉంచింది. వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవడం కాకుండా రిస్కులు, రివార్డులు బేరీజు వేసుకుని చూసుకోవాలి. ఇక్కడే ఈఎల్ఎస్ఎస్ ఉపయోగపడుతుంది. ఈఎల్ఎస్ఎస్ .. మిగతావాటితో పోటీ... ముందుగా.. గరిష్టంగా రూ. 1.5 లక్షలు ఇన్వెస్ట్ చేసేందుకు పన్ను ఆదా ప్రయోజనాలు కల్పించే సాధనాల మధ్య కొన్ని వ్యత్యాసాలు పరిశీలిద్దాం (అదనంగా రూ. 50,000 దాకా మినహాయింపుని అందించే ఎన్పీఎస్ కలపకుండా). ఉదాహరణకు మీరు ప్రతీ సంవత్సరం రూ. 1.5 లక్షలు చొప్పున రెండు దశాబ్దాలు ఇన్వెస్ట్ చేశారనుకుందాం. అంటే అప్పటికి మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం రూ. 30 లక్షలకు చేరుతుంది. వేల్యూరీసెర్చ్ సంస్థ అంచనాల ప్రకారం గడిచిన ఇరవై ఏళ్లుగా పీపీఎఫ్‌లో ఇంత మొత్తం ఇన్వెస్ట్ చేసి ఉంటే 2015 నాటి గణాంకాల ప్రకారం 9.59 శాతం రాబడి తో రూ. 82.14 లక్షలు అయ్యేది. ఇది చాలా పెద్ద మొత్తమే! కానీ వడ్డీ రేట్లు తగ్గుతున్న నేపథ్యంలో ఇదే స్థాయి రాబడులు కొనసాగకపోవచ్చు. అదే.. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ వార్షిక సగటు రాబడులను పరిగణనలోకి తీసుకుంటే... మీరు ఇన్వెస్ట్ చేసిన రూ. 30 లక్షలు.. ఏకంగా 2.74 కోట్లయ్యేది. ఇది పీపీఎఫ్‌కి మూడు రెట్లు అధికం. అంటే 19.81 శాతం రాబడి అన్నమాట. గడిచిన ఇరవై ఏళ్ల వ్యవధిలో స్టాక్ మార్కెట్ రెండు సంక్షోభాలు ఎదుర్కొన్న తర్వాత కూడా ఈ స్థాయి రాబడులు అందుకోగలగడం గమనార్హం. కనుక ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే కోటీశ్వరులు కావడంతో పాటు పన్నులు కూడా ఆదా చేసుకుని ఉండేవారని చెప్పవచ్చు. లాకిన్ వ్యవధి ప్రయోజనాలు.. పెట్టే పెట్టుబడులపై రాబడులతో పాటు లాకిన్ వ్యవధి చూసుకోవడమూ ముఖ్య మే. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్లు మొదలైన వాటికి లాకిన్ వ్యవధి అయిదేళ్లుగా ఉండగా, ఎన్ఎస్సీకి 6 ఏళ్లు, పీపీఎఫ్‌కు 15 ఏళ్లు (ఆరేళ్ల తర్వాత పాక్షిక విత్‌డ్రాయల్ సదుపాయం ఉంది)గా ఉంది. అదే ఈఎల్ఎస్ఎస్కయితే యూనిట్ల కేటాయింపు తేదీ నుంచి మూడేళ్ల వ్యవధి మాత్రమే. అయితే, ఈ వ్యవధి ముగియగానే రిస్కు పెరిగిపోతుందేమోనని డబ్బు అవసరం లేకపోయినా.. చాలా మంది ఇన్వెస్టర్లు తమ యూనిట్స్‌ను అమ్మేస్తుంటారు. మళ్లీ ఆ డబ్బును తీసుకెళ్లి ఎక్కడో ఒక దగ్గర ఇన్వెస్ట్ చేయాల్సిందే కదా! కాబట్టి లాకిన్ వ్యవధి అయిపోయినా డబ్బు నిజంగానే అవసరం అయ్యేంత వరకూ.. ఈఎల్ఎస్ఎస్ నిధులను అందులోనే ఇన్వెస్ట్ చేయడం కొనసాగించడం వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. ఎప్పుడు.. ఎంత మొత్తంతో మొదలుపెట్టాలి.. చాలా మంది జనవరి–మార్చి మధ్య పన్ను లెక్కలేసుకోవడం మొదలుపెడతారు. పన్ను పోటును తప్పించే ఇన్వెస్ట్మెంట్ సాధనాల కోసం హడావుడి పడుతుంటారు. ఇలా ఏడాది చివర్న ఎకాయెకిన రూ. 1.5 లక్షలు పెట్టుబడి పెట్టేందుకు పరుగులు తీయకుండా .. ప్రతి నెలా కొంత కొంతగా.. అంటే రూ. 12,500 చొప్పున ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ వెడితే, చివరికి రూ. 1.5 లక్షల టార్గెట్ సులువుగా చేరుకోవచ్చు. దీనివల్ల 3 ప్రయోజనాలు ఉన్నాయి. ఆఖరి 2–3 నెలల్లో ఆర్థిక ఒత్తిడులు తగ్గించుకోగలగడం మొదటిది. ఆర్థిక క్రమశిక్షణ అలవర్చుకోగలగడం రెండోది. ఇక మూడోదేమిటంటే.. ప్రతి నెలా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఫండ్ యూనిట్స్‌ను వేర్వేరు రేట్లలో కొనుక్కోవచ్చు. మార్కెట్ తగ్గినప్పుడు ఎక్కువ యూనిట్లు దక్కించుకోవచ్చు. తద్వారా లాభాలను మరింతగా పొందే అవకాశం దక్కించుకోవచ్చు. క్లుప్తంగా రెండు పిట్టలను ఒకే దెబ్బతో తెచ్చిపెట్టగలిగే సాధనం ఈఎల్ఎస్ఎస్. ఇటు పన్నుపరంగాను, అటు పెట్టుబడిపరంగాను ప్రయోజనాలు కల్పిస్తుంది. పైపెచ్చు ఒకటి కొంటే మూడు ఫ్రీ డిస్కౌంటు ఆఫర్‌లాగా కూడా పనిచేస్తుంది. పన్ను పరిధిలోకి వచ్చే రూ. 1.5 లక్షల మొత్తానికి మినహాయింపు పొందవచ్చు. ఇక ఈ పెట్టుబడిపై డివిడెండు రూపంలో వచ్చే ఆదాయానికి, పూర్తి మొత్తంపై వచ్చే రాబడికి కూడా మినహా యింపు ఉంటుంది. ఇలా సిస్టమాటిక్ పద్ధతిలో పన్ను మినహాయింపు పొం దేందుకు చేసే ఇన్వెస్ట్‌మెంట్‌తో భవిష్యత్‌లో సంపదను కూడా పెంచుకోవచ్చు. రిటైర్మెంట్ తర్వాత అవసరాలకు తగినన్ని ఆర్థిక వనరులు లేకపోవడమనేది పదవీ విరమణకు దగ్గర్లో ఉన్న వారికి ఆందోళనకరమే. ఇలాంటి సమస్య రాకూడదంటే... యుక్తవయసు నుంచే సరైన ఇన్వెస్ట్మెంట్ సాధనాలను ఎంచుకోవటమొక్కటే తగిన మార్గం. సదరు సాధనం పన్ను ప్రయోజనాలతో పాటు అటు అధిక రాబడులు సైతం ఇవ్వగలగాలి. ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీము (ఈఎల్ఎస్ఎస్) ఈ కోవకి చెందినదే. ఈ అంశాలను మరింతగా రిశీలిస్తే... -
3-6 నెలలకు ఏ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి ?
మూడు నుంచి ఆరు నెలల కాలానికి మంచి రాబడులు రావాలంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?ఈక్విటీ ఫండ్సలో ఇన్వెస్ట్ చేస్తే, ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చే రాబడులపై పన్ను ఉంటుందా? -పవన్, విశాఖ పట్టణం మూడు నుంచి ఆరు నెలల స్వల్ప కాలానికి మీ డబ్బులను లిక్విడ్ మ్యూచువల్ ఫండ్సలో గానీ, ఆల్ట్రా షార్ట్టర్మ్డెట్మ్యూచువల్ఫండ్లో గానీ ఇన్వెస్ట్ చేయవచ్చు. లిక్విడ్ మ్యూచువల్ఫండ్స్... ప్రభుత్వ సెక్యూరిటీల్లోనూ, మూడు నెలల వ్యవధి గల డిపాజిట్లలోనూ ఇన్వెస్ట్ చేస్తారుు. మీరు ఎప్పుడైనా ఈ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్సలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోవచ్చు. ఎలాంటి ఎగ్జిట్ లోడ్ ఉండదు. పన్నులు పోగా వీటిపై ఏడాదికి 4-7 శాతం రాబడులు వస్తారుు. ఇక ఆల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స91 రోజులకు మించిన ఏడాదిన్నర కాలం కంటే తక్కువ వ్యవధి ఉన్న డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తారుు. ఇక ఈక్విటీ ఫండ్సవిషయానికొస్తే, ఇన్వెస్ట్ చేసిన ఏడాదిలోపే ఈ ఫండ్స యూనిట్లను విక్రరుుస్తే మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మూడు నుంచి ఆరు నెలల కాలానికి ఈక్విటీ ఫండ్సలో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయం కాదు. కనీసం ఐదేళ్లకు మించి ఇన్వెస్ట్చేయగలిగితేనే ఈక్విటీ ఫండ్సను ఎంచుకోవాలి. రూ. 6లక్షల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్(ఎఫ్డీ) ఈ నెలలోనే మెచ్యూర్ కానున్నది. ఈ డబ్బులను మరో 6-7 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఏ మ్యూచువల్ ఫండ్సలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? -సుధాకర్, విజయవాడ 6-7 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఈక్విటీ ఫండ్సలో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. మీరు మ్యూచువల్ ఫండ్సలో ఇన్వెస్ట్ చేయడం కొత్త అరుుతే, 2 లేదా 3 మంచి బ్యాలెన్సడ్ ఫండ్సను ఎంచుకొని వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలి. ఒక వేళ మీరు పన్ను చెల్లిస్తున్నట్లరుుతే, పన్ను ప్రయోజనాల కోసం ఈక్విటీ లింక్డ్ సేవింగ్స స్కీమ్స్(ఈఎల్ఎస్ఎస్)ను పరిశీలించవచ్చు. ఈఎల్ఎస్ఎస్ల్లో ఇన్వెస్ట్ చేస్తే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. లక్షన్నర వరకూ పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. నేను కిసాన్ వికాస పత్ర(కేవీపీ)లో రూ.5 లక్షల వరకూ ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. మెచ్యూరిటీ తర్వాత నాకు ఎంత మొత్తం లభిస్తుంది. పన్ను ప్రయోజనాలేమైనా ఉంటాయా? -కిషన్, నిజామాబాద్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కిసాన్ వికాస పత్రాలపై రాబడి రేటు 7.8 శాతంగా ఉంది. అంటే మీ పెట్టుబడి 110 నెలల్లో (9 సంవత్సరాల 2 నెలల కాలానికి) రెట్టింపు అవుతుంది. ఇప్పుడు మీరు రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 9 ఏళ్ల 2 నెలల తర్వాత మీకు రూ.10 లక్షలు వస్తారుు. కిసాన్ వికాస పత్రలో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఎలాంటి పన్ను ప్రయోజనాలు లేవు. వీటిపై వచ్చే వడ్డీకి ఇతర వనరుల ద్వారా వచ్చిన ఆదాయం కింద పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కేవీపీకు టీడీఎస్(ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్) వర్తించదు. నేను లాయర్‌గా పనిచేస్తున్నాను. పన్ను ప్రయోజనాల కోసం పీపీఎఫ్(పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్-ప్రజా భవిష్యనిధి), ఈఎల్ఎస్ఎస్(ఈక్విటీ లింక్డ్ సేవింగ్స స్కీమ్)ల్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంది. దేంట్లో ఎంతెంత ఇన్వెస్ట్ చేయాలి? ఇక ఈఎల్ఎస్ఎస్ విషయానికొస్తే, ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా?లేకుంటే రెండు స్కీమ్‌లను ఎంచుకోవాలా? -ఈశ్వర్, హైదరాబాద్ దీర్ఘకాలంలో ఈక్విటీ ఫండ్స మంచి రాబడులనిస్తారుు. మంచి రాబడులు పొందాలంటే పీపీఎఫ్ కంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్సస్కీమ్లో ఇన్వెస్ట్ చేయడమే ఉత్తమం. స్వల్పకాలంలో ఇవి కొంత రిస్క్అరుునప్పటికీ, ఐదేళ్లకు మించిన కాలానికి ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడులనిస్తారుు. గ్యారంటీడ్ రిటర్న్‌లు ఇస్తాయనే ఆకర్షణ పీపీఎఫ్‌కు ఉంది. అరుుతే ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ రాబడులు ఏమంత ఆకర్షణీయంగా ఉండవని చెప్పవచ్చు. పన్ను ఆదా చేసే ఏవైనా రెండు ఫండ్సను ఎంచుకొని వాటిల్లో ఇన్వెస్ట్ చేయండి. వీటికి లాక్ ఇన్ పీరియడ్ మూడేళ్లని మర్చిపోకండి. బ్యాలెన్సడ్ ఫండ్‌సకు సంబంధించి పన్నులు ఎలా ఉంటారుు? వీటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా పొందే స్వల్పకాలిక, దీర్ఘకాలిక రాబడులపై ఏమైనా పన్నులు చెల్లించాలా ? -రూపస్, బెంగళూరు బ్యాలెన్సడ్ ఫండ్స లేదా హైబ్రిడ్ ఫండ్స... డెట్, ఈక్విటీ కలగలిపిన సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తారుు. వీటిల్లో ఈక్విటీ ఆధారిత ఫండ్స ఉంటారుు, డెట్ ఆధారిత ఫండ్సకూడా ఉంటారుు. ఏదైనా ఒక ఫండ్ తన నిధుల్లో కనీసం 65 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తే దానిని ఈక్విటీ ఆధారిత బ్యాలెన్సడ్ ఫండ్ అంటారు. ఏదైనా ఫండ్ ఈక్విటీల్లో 65 శాతం కంటే తక్కువ ఇన్వెస్ట్ చేస్తే దానిని డెట్ ఆధారిత బ్యాలెన్సడ్ ఫండ్ అంటారు. ఈక్విటీ ఆధారిత బ్యాలెన్సడ్ ఫండ్సలో ఏడాదికి మించిన ఇన్వెస్ట్‌మెంట్స్‌కు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను మినహారుుంపు లభిస్తుంది. కొనుగోలు చేసిన ఏడాదిలోపే ఈక్విటీ ఆధారిత బ్యాలెన్స డ్ ఫండ్ యూనిట్లను విక్రరుుస్తే స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను 15 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఇక డెట్ ఓరియంటెడ్ బ్యాలెన్సడ్ ఫండ్స విషయానికొస్తే, మూడేళ్లకు మించి ఈ ఫండ్సలో ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగిస్తే, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను విధిస్తారు. ఇది ఇండెక్సేషన్‌తో కలిపి అరుుతే 10 శాతం, ఇండెక్సేషన్ ప్రయోజనాలు లేకుంటే 20 శాతంగా ఉంటుంది. వీటిపై స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి ఉంటుంది. -
ఎంతసేపూ ఆ సేవింగ్స్ పథకాలేనా?
• ఈక్విటీలపై అవగాహన అవసరం • దీర్ఘకాలంలో అధిక రాబడి సాధ్యమే • ఫండ్స్ చక్కటి ఆర్థిక సాధనాలు మన వాళ్లెప్పుడూ పొదుపు ఆధారిత పథకాలకే ఓటేస్తుంటారు. ఎందుకంటే నష్టమనే మాట వారికి ఇష్టం ఉండదు. తప్పనిసరిగా రిటర్న్ రావాల్సిందే. అందుకే వారు ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్, దీర్ఘకాలంలో పసిడి కొనుగోళ్లు వంటి వాటికి మొగ్గుచూపుతారు. ఇటీవల కొన్ని పన్ను రహిత బాండ్లు జారీ అయ్యారుు. లాకిన్ పీరియడ్ 15 ఏళ్లు. అంటే ఈ కాలంలో డబ్బు అసలు బయటకు తీయడం కుదరదు. ఇక ఈ బాండ్లపై కూపన్ (వడ్డీ)రేటు 7.5 శాతం నుంచి 8 శాతంగా ఉంది. చిత్రంగా దీనికి ప్రజల నుంచి ఊహించని మద్దతు లభించింది. ఇదే ఇన్వెస్టర్ 15 ఏళ్ల పాటు కదల్చబోనని మొరారుుంచుకుని ఈక్విటీలో డబ్బు పెడతాడా అంటే... పెట్టడుగాక పెట్టడు. 15 ఏళ్లు ఆగితే కచ్చితంగా మంచి రిటర్న్ వచ్చే భారత్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్ను లాంటి ఎన్నో ఈక్విటీలున్నా... అటువైపు చూడడు. ఇంకా చెప్పాలంటే... 15 ఏళ్ల లక్ష్యంతో పెట్టుబడిపెట్టినా... ఈక్విటీల్లో అనూహ్య పరిణామాలతో 15 ఏళ్లకు వచ్చే రిటర్న్ ఎప్పుడైనా రావచ్చు. ఈక్విటీని క్యాష్ చేసుకోడానికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది. అరుునా భారతీయ మదుపుదారు నుంచి పెద్దగా ఉత్సాహం ఉండదు. అరుుతే ఇక్కడ మార్పు ఎలా అన్నదే ప్రశ్న. పలు కారణాలు.. భారతీయ ఇన్వెస్టర్ ధోరణికి కారణాలు చాలా ఉన్నారుు. అందులో ప్రధానమైనది తప్పనిసరిగా రిటర్న్స్ రావాలి. ద్రవ్యోల్బణం సంగతి, ఆ లెక్కల పట్ల అంతగా అవగాహన ఉండదు. ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించి పరిశోధనా పూర్వక విధానం ఉండదు. అరుుతే ప్రజల్లో ఈక్విటీల పట్ల సానుకూల దృక్పథం ఏర్పడ్డానికి పరిశ్రమ పలు చర్యలు తీసుకుంటోంది. ఇక్కడ ఒక విషయం చూద్దాం. నిఫ్టీ 50 సీఏజీఆర్ (కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్) 14 శాతం. పన్ను రహిత బాండ్లకు ఇది రెట్టింపు. ఇది గ్లోబల్ ఇన్వెస్టర్లను సైతం ఆకర్షిస్తోంది. కానీ, మన ఇన్వెస్టర్లను మాత్రం ఆకర్షించటం లేదు. సంపద సృష్టి దిశలో భారతీయులు ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఫండ్స్ వైపు చూడొచ్చు... సరే... సాధారణ వ్యక్తికి ప్రత్యక్షంగా ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టాలంటే అవగాహన లేకపోవచ్చు. అలాంటప్పుడు మ్యూచువల్ ఫండ్స ఉన్నారుు కదా! భారతీయుల వివిధ పెట్టుబడుల మొత్తాన్ని పరిశీలిస్తే- మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్మెంట్లు 3 నుంచి 4% దాటట్లేదు. కానీ ఇక్కడ తగిన ప్లానింగ్, రిస్క్ ఇబ్బందిలేని సలహాలతో ఏ ఇన్వెస్టర్ అరుునా తన దీర్ఘకాలిక ప్రయోజనాలను సాధించేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇన్వెస్టర్ ఆలోచనా ధోరణి మారడమే ముఖ్యం. ఈక్విటీ ఆధారిత ఫండ్స్ దీర్ఘకాలంలో ఇతర సాంప్రదాయక పెట్టుబడులకన్నా మంచి రిటర్న్స్ అందిస్తారుు. పదేళ్ల కాలంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ 13.8% రిటర్న్స్ అందిస్తే, పసిడి 9.1 శాతం, రియల్టీ 8.2 శాతం రిటర్న్ ఇచ్చింది. ఫైనాన్షియల్ మార్కెట్‌పై దృష్టి పెట్టే సమయం, అనుభవం లేనివారికి ఆ వైపునకు సంబంధించి ఫండ్స్ మంచి సాధనం. ఎస్అండ్పీ గ్లోబల్ లిటరసీ సర్వే ఇటీవల ఒక నివేదికను విడుదల చేస్తూ... భారతీయుల్లో 73 శాతం పురుషులు, 80% మంది మహిళలకు కొత్త ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అవగాహన లేదని పేర్కొంది. ఈ ధోరణి మారడానికి పరిశ్రమ, సం బంధిత వర్గాలు కృషి చేయాల్సిన అవసరం ఉంది. -
సెన్సెక్స్ రివర్స్.. 105 పాయింట్లు డౌన్
36 పాయింట్లు తగ్గిన నిఫ్టీ ముంబై: ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాల్ని తగ్గించడంతో క్రితం రోజు జరిగిన ఈక్విటీ ర్యాలీ ఒకరోజుకే పరిమితమయ్యింది. గ్లోబల్ సంకేతాలు బలహీనంగా వుండటంతో ఇటీవల బాగా పెరిగిన షేర్లలో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించారు. దాంతో శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ 105 పాయింట్లు క్షీణించి 28,668 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 36 పాయింట్ల తగ్గుదలతో 8,832 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అయితే వారం మొత్తంమీద సెన్సెక్స్ 69 పాయింట్లు (0.24 శాతం), నిఫ్టీ 52 పాయింట్లు (0.58 శాతం) చొప్పున లాభపడ్డాయి. సెప్టెంబర్ డెరివేటివ్ సిరీస్ వచ్చేవారం ముగియనుండటంతో ఇన్వెస్టర్లు వారి లాంగ్ పొజిషన్లు ఆఫ్‌లోడ్ చేసుకున్నారని, దాంతో మార్కెట్ క్షీణించినట్లు జియోజిత్ బీఎన్పీ పారిబాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ చెప్పారు. బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు.. గురువారం భారీ కొనుగోళ్లను ఆకర్షించిన బ్యాంకింగ్ షేర్లే తాజాగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. యాక్సిస్ బ్యాంక్ 5.84 శాతం పతనమై రూ. 557 వద్ద ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐలు 1.1 శాతం మేర తగ్గాయి. లుపిన్, ఇన్ఫోసిస్, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్‌లు 1-2.5 శాతం మధ్య క్షీణించాయి. మరోవైపు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 0.4 శాతం ఎగిసి కొత్త రికార్డుస్థాయి రూ. 1,313 వద్ద ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 1.4 శాతం ర్యాలీ జరిపి 52 వారాల గరిష్టస్థాయి రూ. 1,103 వద్ద క్లోజయ్యింది. డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీలు స్వల్పంగా పెరిగాయి. -
మార్కెట్లకు ‘ఫెడ్’ బూస్ట్!
భవిష్యత్తులోనూ కనిష్టస్థాయిలోనే అమెరికా వడ్డీ రేట్లు... * ఫెడ్ తాజా అంచనాలతో ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్ల పరుగు * షేర్లు, బంగారం, రూపాయి...జూమ్ ఇదిగో..అదిగో...త్వరలోనే వడ్డీ రేట్లు పెంచేస్తున్నాం అంటూ నెలల నుంచి చెపుతూ వస్తున్న అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ చేతులెత్తేయడంతో ప్రపంచంలో రిస్క్ ఆస్తులు మళ్లీ భారీగా ర్యాలీ జరుపుతున్నాయి. ఈక్విటీలు, కమోడిటీలు, వర్థమాన దేశాల కరెన్సీలు కలసికట్టుగా కదం తొక్కుతున్నాయి. ప్రస్తుతానికి వడ్డీ రేట్లు పెంచడం లేదంటూ బుధవారం రాత్రి ఫెడ్ ప్రకటన వెలువడగానే అక్కడ క్రూడ్, బంగారం, వెండి, ఈక్విటీలు ఒక్కసారిగా ఎగిసిపోయాయి. అమెరికా డాలరు నిలువునా పతనమయ్యింది. ఇక గురువారం ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో కూడా ఇదే ట్రెండ్ నడిచింది. బంగారం ఔన్సు ధర 2%పైగా ఎగిసి 1,338 డాలర్లకు చేరగా, వెండి 3.5%పెరిగింది. బ్రెంట్ క్రూడ్ తిరిగి 47.5 డాలర్ల స్థాయికి పెరిగిపోయింది. ఇదే సమయంలో భారత్ రూపాయితో సహా కొరియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా తదితర వర్థమాన దేశాల కరెన్సీలు భారీగా పెరిగాయి. ఫెడ్ నిర్ణయం కారణం కాదు.. తొమ్మిది సంవత్సరాల తర్వాత తొలిసారిగా గతేడాది డిసెంబర్లో అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను పావుశాతం పెంచినప్పుడు ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లలో ఏర్పడ్డ ప్రకంపనలు సామాన్యమైనవి కాదు. వరుసగా రెండు నెలల పాటు ఈక్విటీ మార్కెట్లు 15-20 శాతం మధ్య పతనమయ్యాయి. వర్థమాన కరెన్సీలు నిలువునా పతనమయ్యాయి. రూపాయి 4%పైగా నష్టపోయింది. ఎందుకంటే అప్పుడు భవిష్యత్తు పెంపుపై ఫెడ్ ఇచ్చిన రోడ్ మ్యాప్ అటువంటిది. 2016లో 3 దఫాలు, 2017లో నాలుగు దఫాలు, 2018లో మరో 3 సార్లు రేట్లు పెంచుతూ 3.4%కి వడ్డీ రేట్లను చేరవచ్చన్న అంచనాల్ని ఫెడ్ అధికారులు అప్పట్లో వెలిబుచ్చారు. కానీ ఆ అంచనాలు క్రమేపీ తగ్గాయి. తాజా ఫెడ్ సమీక్షలో ఫెడ్ అధికారుల అంచనా ప్రకారం ఈ ఏడాది ఒకసారే పెరుగుదల వుంటుంది. ప్రస్తుతం 0.25-0.50 శాతం వున్న ఫెడ్ ఫండ్స్ రేటు (వాణిజ్య బ్యాంకులకు ఫెడ్ ఇచ్చే నిధులకు వసూలు చేసే వడ్డీ) దీర్ఘకాలంలో 2.9%కి మాత్రమే చేరవచ్చని తాజా ఫెడ్ సమీక్షలో పాల్గొన్న అధికారుల అంచనా. ఈ అంచనా ఈ ఏడాది జూన్‌లో 3% వుంది. అలాగే 2017లో రెండు దఫాలు మాత్రమే రేట్లు పెరగవచ్చన్నది ఇప్పటి అంచనా. గతేడాది డిసెంబర్లో వేసిన అంచనాల ప్రకారం 2017లో నాలుగుదఫాలు, ఈ ఏడాది జూన్‌లో ప్రకటించిన అంచనాల ప్రకారం మూడు దఫాలు రేట్లు పెరగాల్సివుంది. గత అంచనాలన్నింటినీ క్రితంరోజు సమావేశంలో పూర్తిగా తగ్గించడం రిస్క్ ఆస్తుల ర్యాలీకి ప్రధాన కారణం. అంతేగానీ ఈ సెప్టెంబర్‌లో రేట్లు పెంచకపోవడం కాదు. ఈ ఏడాది డిసెంబర్లో పెంచే అవకాశాలున్నాయని స్పష్టమైన సంకేతాల్ని ఫెడ్ ఇచ్చినప్పటికీ, రేట్ల పెంపు నెమ్మదిగా వుంటుందనే భావనతో ప్రస్తుతానికి డిసెంబర్ పెంపును ఇన్వెస్టర్లు పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. సెన్సెక్స్ 266 పాయింట్లు అప్.. అంతర్జాతీయ ఈక్విటీ ర్యాలీలో భాగంగా భారత్ మార్కెట్ గురువారం రెండు వారాల గరిష్టస్థాయిలో ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 266 పాయింట్లు ఎగిసి 28,773 పాయింట్ల వద్ద ముగిసింది. 8,850 పాయింట్ల స్థాయిని అధిగమించిన నిఫ్టీ 90 పాయింట్లు పెరిగి 8,867 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సెప్టెంబర్ 6 తర్వాత సూచీలకు ఇదే పెద్ద పెరుగుదల. నిఫ్టీలో భాగమైన అరబిందో ఫార్మా అన్నింటికంటే అధికంగా 6 శాతం ర్యాలీ జరిపి రూ. 855 వద్ద ముగిసింది. సెన్సెక్స్-30 షేర్లలో 23 లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లో భారత్ మెరుగ్గా ర్యాలీ (0.93%) జరిపింది. జపాన్ మార్కెట్‌కు గురువారం సెలవుకాగా, హాంకాంగ్, తైవాన్, చైనా, ఇండోనేషియా సూచీలు 0.67% వరకూ పెరిగాయి.ఆసియాతో పోలిస్తే యూరప్ సూచీలు పెద్ద ఎత్తున ఎగిసాయి. కడపటి సమాచారంమేరకు అమెరికా మార్కెట్ 0.7% పెరుగుదలతో ట్రేడవుతోంది. 66.66 స్థాయికి రూపాయి ప్రపంచ ప్రధాన కరెన్సీలతో పోలిస్తే అమెరికా డాలరు కేవలం రెండు రోజుల్లో 1.2 శాతంపైగా పతనమైన ప్రభావంతో భారత్ రూపాయి కూడా భారీగా బలపడింది. ముంబై ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లో అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ ఒక్కసారిగా 36 పైసలు పెరిగింది. దాంతో రూపాయి రెండు వారాల గరిష్టస్థాయి 66.66 స్థాయికి చేరింది. గురువారం రాత్రి కడపటి సమాచార మేరకు ఆఫ్‌షోర్ మార్కెట్లో ఇది మరింత ఎగిసి 66.52కి పెరిగింది. భారత్ కరెంటు ఖాతాలోటు జూన్ క్వార్టర్లో 0.1%కి తగ్గడమూ రూపాయి భారీ ర్యాలీకి కారణం. 2.5% పెరిగిన బంగారం ప్రపంచ మార్కెట్లో వరుసగా రెండు రోజులపాటు పుత్తడి పెరిగింది. డాలరుకు అభిముఖంగా ట్రేడయ్యే బంగారం ఫెడ్ నిర్ణయం వెలువడగానే న్యూయార్క్ మార్కెట్లో బుధవారం 1,310 డాలర్ల నుంచి 1,334 డాలర్లకు (ఔన్సు ధర) చేరగా, గురువారం మరో 14 డాలర్ల పెరుగుదలతో 1,348 డాలర్లకు చేరింది. అయితే భారత్ మార్కెట్లో ఈ పెరుగుదల పరిమితంగా వుంది. రూపాయి విలువ బలపడటమే ఇందుకు కారణం. ఇక్కడ ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర రెండు రోజుల్లో కలిపి దాదాపు రూ. 450 వరకూ పెరిగి రూ. 31,315కు చేరింది. ప్రపంచ మార్కెట్లో వెండి 3.8 శాతంవరకూ పెరగడంతో ఇక్కడ కేజీకి 1,300 పెరిగి రూ. 47,500 వద్దకు చేరింది. -
బీఎస్ఈ నుంచి ‘సింగిల్ మెసేజ్ విండో’ సేవలు
న్యూఢిల్లీ: ప్రముఖ స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్ఈ తాజాగా ఈక్విటీ, కరెన్సీ డెరివేటివ్స్ విభాగాల్లో ఒకే ఒక మెసేజ్‌తో పలు కోట్స్ చేయడానికి వీలుగా ‘సింగిల్ మెసేజ్ విండో’ సేవలను ప్రారంభించింది. దీని ద్వారా ట్రేడింగ్ చేసే వ్యక్తి 99 కోట్స్ చేయవచ్చని బీఎస్ఈ తెలిపింది. ఒకే ప్రొడక్ట్‌కు చెందిన పలు కాంట్రాక్టులకు మల్టిపుల్ కోట్స్ ఇవ్వొచ్చని పేర్కొంది. ఈ కోట్ అనేది ఒక సైడ్ (కొనడం లేదా అమ్మడం) కావొచ్చు లేదా డబుల్ సైడ్ (కొనడం, అమ్మడం)కు సంబంధించినది కావొచ్చని తెలిపింది. రిక్వెస్ట్ ద్వారా కోట్స్‌ను సవరించుకోవచ్చని పేర్కొంది. ఒకవేళ ట్రేడర్ రిస్క్ రిడక్షన్ మోడ్‌లోకి వెళితే పెండింగ్‌లో ఉన్న అన్ని కోట్స్ డిలీట్ అవుతాయని తెలిపింది. -
ప్రాచీన కళాఖండాలూ.. పెట్టుబడికి మార్గాలే!
దీర్ఘకాలంలో ఈక్విటీల్లాంటి రాబడి అభిరుచి ఉన్నవారికి చక్కని అవకాశం శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి తల పాగా కావచ్చు. పికాసో వేసిన అపురూపమైన చిత్రం కావచ్చు. గాంధీ వాడిన చేతి కర్ర కావచ్చు. ప్రాచీన కళాఖండాలు, కళాత్మక, అరుదైన వస్తువులకు ఎంతో విశిష్టత ఉంటుందనేది సత్యం. వీటిపై పెట్టే పెట్టుబడులు ఈక్విటీలు, రియల్టీలకు తీసిపోకుండా బ్రహ్మాండమైన రాబడులను కూడా అందిస్తాయన్న విషయం తెలుసా...? మరి వీటిలో పెట్టుబడి పెట్టాలనుకుంటే మాత్రం ముందు కొన్ని విషయాలపై దృష్టి పెట్టాలి. గుర్తింపు ఉన్న డీలర్లు.. ప్రాచీన వస్తువులు, కళాఖండాలను గుర్తింపు ఉన్న డీలర్ ద్వారానే కొనుగోలు చేయడం క్షేమం. ఎందుకంటే కొనే వస్తువు నిజంగా పాత కాలం నాటికి చెందినదేనా...? కాదా...? దాన్ని వారు అధికారికంగానే విక్రయిస్తున్నారా? అలా విక్రయించడానికి వారికి అనుమతి ఉందా? ఇవన్నీ గమనించాల్సిన అవసరం చాలా ఉంది. ఇష్టపడితేనే.. లాభం దృష్టితో ఏదో ఒకదాన్ని కొనేయడం కాదు. డెకరేటివ్ ఆర్ట్, ఫర్నిచర్, మరో అలంకరణ, అరుదైన వస్తువు... ఇలా ఏదైనా కావచ్చు. వేల సంవత్సరాల క్రితం నాటి ఆట వస్తువు కావచ్చు. కూర్చునే కుర్చీ కావచ్చు. వీటిలో ఏది కొనాలన్న దానిపై స్పష్టత ఉండాలి. పైగా ఇష్టపడితేనే కొనాలనేది నిపుణుల సూచన. ఇందుకోసం తగినంత శోధన చేయడం పెట్టుబడి నిర్ణయాలను లాభదాయకం చేస్తుంది. డిమాండ్ దేనికి...? పురాతన కళాఖండాల మార్కెట్‌కు, మిగిలిన మార్కెట్లకు పోలికలున్నాయి. ఇక్కడ కూడా ఆటుపోట్లు ఉంటాయి. అందుకే బాగా డిమాండ్ ఉండి, తక్కువ లభ్యత ఉన్న వాటిపై పెట్టుబడులు పెడితే స్థిమితంగా ఉండొచ్చు. ఫలానా వాటికే డిమాండ్ ఉన్నదనే విషయం తెలుసుకునేందుకు ఇటీవల వేలం వివరాలను సంబంధిత సంస్థల వెబ్సైట్లను ఆశ్రయించడం ద్వారా ఏ ఉత్పత్తులు అధికంగా అమ్ముడయ్యాయి, వేటికి డిమాండ్ అధికంగా ఉందన్న వివరాలు తెలుసుకోవచ్చు. ఇక అరుదుగా లభించే వస్తువులపై పెట్టుబడులైతే మంచి రాబడినిస్తాయి. ఒకవేళ పాత కాలం నాటి ఆభరణాల్లో ఏదో ఒకదాన్ని కొనుగోలు చేయాలనుకుంటే డిజైన్ పరంగా ప్రత్యేకంగా ఉన్నవాటిని ఎంపిక చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. కంటికి కనిపించని లోపాలు... ఓల్డ్ ఈజ్ గోల్డే. కానీ, ఎక్కడో చిన్న లోపం. తెలివిగా వాటిని కనిపించకుండా విక్రయదారులు తమ నైపుణ్యానికి పని చెబుతారు. అందుకే వేలంలో కొనే ప్రాచీన వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించిగానీ కొనుగోలుపై నిర్ణయం తీసుకోకూడదు. బీమా అవసరం... ప్రాచీన వస్తువు ఏదైనా కొనుగోలు చేసిన తర్వాత దానిపై బీమా తీసుకోవడం తప్పనిసరి. అధిక విలువ ఉన్నవి అయితే, దానిపై విలువ మదింపు సర్టిఫికెట్లను బీమా సంస్థలు అడుగుతాయి. అలాగే, నిర్ణీత విలువ ఉంటేనే బీమా అవకాశం కల్పిస్తున్నాయి. బీమా సంస్థ నుంచి ఈ వివరాలు తెలుసుకోవచ్చు. ఆర్ట్ ఇండెక్స్‌లు స్టాక్ మార్కెట్లకు సూచీలున్నట్టే... వరల్డ్ ఆల్ ఆర్ట్ ఇండెక్స్, మీ మోసెస్ ఫ్యామిలీ ఆఫ్ ఫైన్ ఆర్ట్ ఇండెక్స్ వంటి సూచీలు కూడా ఉన్నాయి. స్టాక్స్ ధరల పెరుగుదలను సూచీలు ప్రతిబింబించినట్టే... పురాతన వస్తువుల ధరల పెరుగుదలను ఈ సూచీల ఆధారంగా తెలుసుకోవచ్చు. ఒకసారికి మించి అమ్మడుపోయిన ప్రతీ వస్తువు ధరను ట్రాక్ చేయడం ద్వారా నిర్ణీత కాలంలో ఎంత మేర రాబడులు ఇచ్చాయన్నది పోల్చి చూపిస్తాయి. వరల్డ్ ఆల్ ఆర్ట్ ఇండెక్స్ గత 60 ఏళ్ల రాబడులను పరిశీలిస్తే ఈక్విటీల కంటే కొంచెం తక్కువగానే ఉన్నాయి. అయినా, స్టాక్స్‌పై పెట్టుబడుల పట్ల కొందరు సుముఖంగా ఉండకపోవచ్చు. కళాత్మక వస్తువుల పట్ల మక్కువ ఉండవచ్చు. అలాంటి వారికి ఈ మార్కెట్ బాగా పనికొస్తుంది. పెట్టుబడి పెట్టేముందు ఒక్కసారి... దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఆర్ట్, ప్రాచీన వస్తువులు మంచి అప్షన్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే స్టాక్ మార్కెట్ అయితే నగదు అవసరం ఏర్పడితే వెంటనే అమ్మేసుకుని సొమ్ము చేసుకోవచ్చు. కానీ, ప్రాచీన వస్తువుల మార్కెట్లో ఇలా ఉండదు. కొనుగోలు దారులు కొద్ది మందే ఉంటారు. అందుకే అవసరం వచ్చినప్పుడు వెంటనే నగదు చేసుకోవడం వీలు కాకపోవచ్చు. పైగా లావాదేవీలపై చార్జీలు కూడా అధికంగా ఉంటాయి. అయితే, దీర్ఘకాలంలో మంచి ప్రతిఫలాలను అందిస్తుందని చరిత్ర చెబుతోంది. -
అటల్ పెన్షన్ యోజనకు పన్ను మినహాయింపు ఉందా?
నేను అవైవ యంగ్ స్కాలర్ ఆడ్వాండేజ్ ప్లాన్‌ను 2011లో తీసుకున్నాను. అప్పటి నుంచి నెలకు రూ.4,000 చొప్పున చెల్లిస్తూ వచ్చాను. ఇప్పటివరకూ మొత్తం రూ.2.6 లక్షల వరకూ చెల్లించాను. ఆ ఫండ్ విలువ ప్రస్తుతానికి రూ.2.63 లక్షలుగా ఉంది. ఆశించిన స్థాయిలో ఈ ఫండ్ పనితీరు లేదు. నేను ఇప్పుడు ఏమి చేయాలి? - సాయి కార్తీక, హైదరాబాద్ పిల్లలకు సంబంధించిన ప్లాన్లు బీమా పాలసీల్లాంటివే. వీటిల్లో మీ జీవితానికి కవర్ ఉంటుంది. నామినీగా బిడ్డ పేరు ఉంటుంది. ఈ చిల్డ్రన్స్ ప్లాన్లు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి సంప్రదాయబద్ధమైనవి, రెండోవి యూనిట్ లింక్డ్ ప్లాన్స్. మీరు తీసుకున్న అవైవ యంగ్ స్కాలర్ అడ్వాండేజ్ ప్లాన్ అనేది యూనిట్ లింక్డ్ ప్లాన్. ఈ తరహా ప్లాన్‌ల్లో సదరు సంస్థ మీరు చెల్లించిన ప్రీమియం నుంచి జీవిత బీమా (మొరాలిటీ చార్జీలు), నిర్వహణ వ్యయాలు, ఫండ్ మేనేజర్ చార్జీలు తదితర చార్జీలను మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తాయి. ఈచార్జీలన్నీ పోనూ ఇన్వెస్ట్ చేసే మొత్తం తక్కువగా ఉంటుంది కాబట్టి, ఈ తరహా ప్లాన్లు సరైన రాబడులనివ్వలేవు. మార్కెట్ బాగా ఉన్నప్పుడు కూడా తగిన రాబడులు రావు. అయితే ఏజెంట్లకు ఆకర్షణీయ కమిషన్లు వస్తాయి. కాబట్టి ఏజెంట్లు ఉన్నవి, లేనివి అన్నీ కల్పించి ఈ తరహా ప్లాన్లను ఇన్వెస్టర్లకు అంటగడతారు. ఇక మీ విషయానికొస్తే, భవిష్యత్ నష్టాలను తగ్గించుకోవడానికి గానూ, మీరు ఈ ప్లాన్‌ను తక్షణం సరెండర్ చేయండి. ఈ ప్లాన్‌కు 5 సంవత్సరాల లాక్-ఇన్-పీరియడ్ ఉంటుంది. మీ పాలసీకి ఈ లాక్-ఇన్ పీరియడ్ పూర్తయింది. కాబట్టి మీరు ఎలాంటి సరెండర్ చార్జీలు చెల్లించాల్సిన పనిలేదు. అంతేకాకుండా ఈ పాలసీని సరెండర్ చేయడం వల్ల మీపై ఎలాంటి పన్ను బాధ్యత ఉండదు. మీరు సరెండర్ చేసే నాటికి ఫండ్ విలువ ఎంత ఉంటుందో, అదే మీకు వచ్చే సరెండర్ వేల్యూ. ఇక భవిష్యత్తులో బీమా, ఇన్వెస్ట్మెంట్ కలగలసిన ఈ తరహా ప్లాన్స్ల్లో ఎన్నడూ ఇన్వెస్ట్ చేయకండి. జీవిత బీమా పాలసీ కోసం టర్మ్ పాలసీలు తీసుకోండి. వీటికి చెల్లించాల్సిన ప్రీమియమ్‌లు తక్కువగా ఉంటాయి. బీమా కవర్ అధికంగా ఉంటుంది. పిల్లల కోసం ఇన్వెస్ట్ చేయడమంటే, అది దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కిందకు వస్తుంది. ఇలాంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధన కోసం మంచి బ్యాలెన్స్డ్ లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను రెండు లేదా మూడింటిని ఎంచుకోండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. నేను నెలవారీ వేతనం పొందే ఉద్యోగాన్ని చేస్తున్నాను. అటల్ పెన్షన్ యోజన(ఏపీవై)లో చేరితే, పన్ను ఆదా ప్రయోజనాలు లభిస్తాయా? ఆ వీలు ఉంటే ఏపీవైకు సంబంధించి ఏ ఆప్షన్ కింద ఎంత మొత్తంలో నాకు పన్ను ఆదా అవుతుందో చెప్పండి. - కరీముల్లా, నిజామాబాద్ అటల్ పెన్షన్ యోజన(ఏపీవై) అనేది భారత పౌరులకు ముఖ్యంగా అవ్యవస్థీకృత రంగంలో పనిచేసేవారి కోసం ఉద్దేశించినది. నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్)లో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి పన్ను ప్రయోజనాలు లభిస్తాయో, ఏపివైలో ఇన్వెస్ట్ చేసినా కూడా అలాంటి పన్ను ప్రయోజనాలే లభిస్తాయి. ఈ స్కీమ్ కింద చెల్లించిన ప్రీమియమ్‌కు ఆదాయపు పన్ను చట్టం, సెక్షన్ 80సీసీడీ కింద మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 80సీసీడీ కింద పన్ను మినహాయింపు రూ.50,000గా ఉంది. ఇది సెక్షన్ 80సీ కింద లభించే రూ.1.5 లక్షల పరిమితికి అదనం. ఇక ఏపీవై విత్‌డ్రాయల్స్ పెన్షన్ రూపంలో అందుతాయి. వీటిపై మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి మీరు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఏ భారత పౌరుడైనా 18-40 సంవత్సరాల వయస్సులో ఉంటే అటల్ పెన్షన్ యోజనలో చేరవచ్చు. ఈ స్కీమ్ కింద ఇన్వెస్ట్ చేసిన వారికి 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు రూ. 1,000/2,000/3,000/4,000/5,000 చొప్పున పెన్షన్ వస్తుంది (మీరు పెట్టే ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బట్టి). మీ వయస్సు, మీరు ఎంత పెన్షన్ కోరుకుంటున్నారు. ఎంత కాలం ఇన్వెస్ట్ చేస్తారు అన్న దానిని బట్టి మీరు ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలో ఆధారపడి ఉంటుంది. నేను కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఆదాయపు పన్ను చెల్లించకుండా ఉండాలంటే వాటిని ఎప్పుడు విక్రయించాలి ? - హరినాధ్, విశాఖపట్టణం మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే, మీరు కొనుగోలు చేసిన ఫండ్స్‌ను ఏడాది తర్వాత విక్రయిస్తే, వచ్చే లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఈక్విటీ ఫండ్స్ దీర్ఘకాలిక మూలధన లాభాలపై ప్రస్తుతం ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. ఇక వీటిని ఏడాదిలోపే విక్రయిస్తే, వచ్చే రాబడులను స్వల్పకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఈక్విటీ ఫండ్స్‌పై స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను 15%గా ఉంది. ఇక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై వచ్చే డివిడెండ్స్‌పై ఇన్వెస్టర్లు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక ఈక్విటీ కాకుండా మరే ఇతర మ్యూచువల్ ఫండ్స్‌లోనో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. వీటిని మూడేళ్ల తర్వాత విక్రయిస్తేనే, వాటిపై వచ్చే రాబడులను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. డెట్ ఫండ్స్‌పై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను 20%గా(ఇండేక్సేషన్ ప్రయోజనాలతో కలుపుకొని) ఉంటుంది. ఇక డెట్ మ్యూచువల్ ఫండ్స్‌ను మూడేళ్లలోపే విక్రయిస్తే, వీటిపై వచ్చే లాభాలను స్వల్పకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఈ లాభాలను మీ మొత్తం ఆదాయానికి కలిపి, మీకు వర్తించే ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక డెట్ ఫండ్స్‌పై డివిడెండ్లపై మ్యూచువల్ ఫండ్ సంస్థలే 25% డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్, సర్‌చార్జీ, సెస్‌లను ప్రభుత్వానికి చెల్లిస్తాయి. ఈ డివిడెండ్లపై ఇన్వెస్టర్లు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. -
షేర్లవైపూ చూడండి..!
♦ ద్రవ్యోల్బణానికి తగ్గ రాబడి అక్కడే వస్తుంది ♦ జీవిత బీమాకు యూలిప్ పాలసీలు చాలవు ♦ ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ రెగో సూచనలు నేనో ప్రభుత్వోద్యోగిని. వయస్సు 46 సంవత్సరాలు. నెల వేతనం రూ.50,000. నేను రిటైరవడానికి మరో పన్నెండేళ్ల సమయం ఉంది. ప్రస్తుతం సొంతంగా ఇండిపెండెంట్ హౌస్, ఒక డబుల్ బెడ్రూం అపార్ట్మెంట్ ఉన్నాయి. ఈ ఏడాది ఆఖరుకి ఇంటి మీద మరో ఫ్లోర్ వేయాలనుకుంటున్నాను. ఇందుకోసం రూ.4 లక్షలు పొదుపు చేశాను. బ్యాంకు నుంచి మరో రూ.5 లక్షలు తీసుకోవాలనుకుంటున్నాను. ఇలా తీసుకున్న హౌసింగ్ లోన్ మీద వడ్డీకి సంబంధించి డిడక్షన్ క్లెయిమ్ చేసుకునే వీలుందా? పెట్టుబడుల విషయానికొస్తే, నెలకు రూ.4,000 ఫండ్స్‌లో (సిప్ మార్గంలో), మరో రూ.1,000 ఎస్బీఐ చిల్డ్రన్ యులిప్ పాలసీకి, పోస్టల్ ఆర్డీ కింద రూ. 3,500 కడుతున్నాను. ఎంఐఎస్ ఫండ్‌లో రూ.4 లక్షలు, ఎఫ్డీలో మరో రూ.6 లక్షలు ఉన్నాయి. ఎల్ఐసీ మనీ బ్యాంక్ పాలసీ నుంచి రూ.1 లక్ష వస్తుంది. ఎస్బీఐ స్మార్ట్ పర్ఫార్మర్లో అయిదేళ్ల పాటు రూ.50,000 ఇన్వెస్ట్ చేశాను. ప్రస్తుతం దాని విలువ రూ.3 లక్షలు. ఈ ఏడాది అటు ఎస్బీఐ వెల్త్ బిల్డింగ్‌లో రూ.50,000 పెట్టుబడి పెట్టాను. లక్ష్యాలకు సంబంధించి మా అబ్బాయికి ప్రస్తుతం 14 సంవత్సరాలు. తన చదువుకు తగినంత నిధి, నా రిటైర్మెంట్ తర్వాత అవసరాల కోసం రూ.40 లక్షల మేర ఫండ్‌ను సమకూర్చుకోవాలనుకుంటున్నాను. తగిన సూచనలు చేయగలరు. అశోక్ గారు, మీరిచ్చిన వివరాలు పరిమితంగానే ఉన్నాయి. వాటికి అనుగుణంగా సూచనలిస్తున్నాను. ఇంటి రుణం మీద చెల్లించే అసలు, వడ్డీకి సెక్షన్ 80సీ, సెక్షన్ 24ల కింద డిడక్షన్ పొందవచ్చు. పోస్టల్ రికరింగ్ డిపాజిట్ల మీద ప్రస్తుతం 7.4% మేర వడ్డీ లభిస్తోంది. యులిప్ పాల సీలతో తగినంత జీవిత బీమా కవరేజి లభించదు. అలాగే, రాబడులు కూడా మీ అవసరాలకు అనుగుణంగా లభించకపోవచ్చు. కాబట్టి.. వీటి కాలవ్యవధి తీరిన తర్వాత వీలయితే డిస్కంటిన్యూ చేయొచ్చు. ఈక్విటీవైపు చూడండి... మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే .. మీ పోర్ట్‌ఫోలియో ఎక్కువగా రియల్టీ, డెట్‌లోనే కేంద్రీకృతమై ఉంది. మీ అబ్బాయి చదువుకు కావాల్సిన డబ్బును సమకూర్చుకోవాలంటే ఈక్విటీల్లో పెట్టుబడులు మరికాస్త మెరుగైన రాబడులందించే అవకాశముంది. మీరు ఎంత నిధి సమకూర్చుకోవాలనుకుంటున్నారన్నది తెలియరాలేదు. కాకపోతే దాదాపు 12 సంవత్సరాల వ్యవధి ఉన్నందున.. ఈక్విటీ మార్కె ట్ల హెచ్చుతగ్గుల రిస్కుల ప్రభావాలు మీ పెట్టుబడులపై తక్కువగానే ఉండగలవు. ఎల్ఐసీ నుంచి వచ్చిన డబ్బును, ఆర్డీ..యులిప్‌ల ద్వారా వచ్చిన డబ్బుతో ఈక్విటీ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) పద్ధతిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. మీ అబ్బాయి చదువు కోసం వీలయినంత ఎక్కువగా పెట్టుబడికి కేటాయించవచ్చు. రూ.40 లక్షలు చాలవేమో!! రిటైర్మెంట్ నాటికి రూ. 40 లక్షల దాకానైనా ఉండాలనుకుంటున్నారు. ఇది పెద్ద కష్టమేమీ కాదు. ప్రస్తుతం మీ దగ్గర రూ. 16.3 లక్షల మేర ఉన్నాయి (రికరింగ్ డిపాజిట్లు, యులిప్‌ల ప్రస్తుత విలువ తెలియనందున వాటిని పరిగణనలోకి తీసుకోకుండానే), అలాగే సిప్ మార్గంలో నెలకు చేసే రూ. 5,000 (ఆర్డీ, యులిప్ నిధులు మళ్లించాకా చేసే ఇన్వెస్ట్మెంట్) పెట్టుబడులు సురక్షితంగా 8 శాతం రాబడినైనా ఇస్తాయి. అయితే, మీరు ఇక్కడ ధరల పెరుగుదలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ద్రవ్యోల్బణం 5 శాతంగా వేసుకున్నా.. మీరు ఇప్పుడు రూ.40 లక్షలు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. అప్పటికి రూ.72 లక్షలు అవసరమవుతాయి. ఇప్పటికే మీరు రూ. 4,000 సిప్ చేస్తున్నందున.. ఈ అదనపు మొత్తం సమకూర్చుకోవడానికి అది తోడ్పడుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ తప్పనిసరి.. ఇక, ఇతరత్రా రిస్కుల నుంచి మీ కుటుంబానికి ఆర్థిక భద్రత కలిగించే ందుకు కనీసం రూ. 50 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. 20 సంవత్సరాల టర్మ్ పాలసీ తీసుకుంటే ఏడాదికి సుమారు రూ. 11,000 ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. అలాగే మరో రూ. 25 లక్షలకు వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ కూడా తీసుకోండి. దీనికి ఏటా దాదాపు రూ. 4,000 ప్రీమియం ఉంటుంది. వైద్య అవసరాల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ఉందనే భావిస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా మీకోసం, మీ జీవిత భాగస్వామి కోసం పర్సనల్ ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకుంటే.. రిటైర్మెంట్ తర్వాత అధిక ప్రీమియంలు కట్టాల్సిన అవసరం ఉండదు. తదుపరి కొన్నేళ్ల తర్వాత మీ పోర్ట్‌ఫోలియోను ఒకసారి పునఃసమీక్షించుకోండి. రిటైర్మెంట్కి దగ్గరయ్యే కొద్దీ పెట్టుబడులను క్రమంగా డెట్ సాధనాల వైపు మళ్లించండి. అయితే, పూర్తి స్థాయిలో ఫలితాలు లభించేందుకు మంచి ఫైనాన్షియల్ ప్లానర్‌ను సంప్రదించి తగిన ఆర్థిక ప్రణాళికలు రూపొందిం చుకుని, పాటించడం శ్రేయస్కరం. అనిల్ రెగో ఫైనాన్షియల్ ప్లానర్ సీఈఓ, రైట్ హొరైజన్స్ -
మరో 181 పాయింట్ల ర్యాలీ
♦ 27,808 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్ ♦ 8,500 శిఖరంపైన నిఫ్టీ ముంబై: మార్కెట్లోకి ఇన్వెస్టర్ల పెట్టుబడుల ప్రవాహం కొనసాగడంతో ఈక్విటీలు వరుసగా రెండో రోజు జోరుగా పెరిగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ మంగళవారం మరో 181 పాయింట్లు పెరిగి 11 నెలల గరిష్టస్థాయి 27,808 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,500 పాయింట్ల స్థాయిని దాటేసింది. ఈ సూచి 53 పాయింట్ల పెరుగుదలతో 8,521 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. కీలకమైన పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ఈ ర్యాలీ జరగడం విశేషం. మార్కెట్ ముగిసిన తర్వాత ఈ గణాంకాలు వెలువడ్డాయి. మే నెలలో పారిశ్రామికోత్పత్తి పుంజుకోగా, జూన్ నెల ద్రవ్యోల్బణం 5.77 శాతానికి చేరింది. జపాన్, బ్రిటన్ కేంద్ర బ్యాంకులు ఉద్దీపన ప్యాకేజీల్ని ప్రకటించవచ్చన్న అంచనాలతో గ్లోబల్ ర్యాలీ జరుగుతున్నదని, అందులో భారత్ మార్కెట్ కూడా పాలుపంచుకుంటున్నదని విశ్లేషకులు చెప్పారు. ప్రైవేటు బ్యాంకులు, మెటల్స్ జోరు... ప్రైవేటు బ్యాంకింగ్ షేర్లు, మెటల్ షేర్లు జోరుగా పెరిగాయి. ఐసీఐసీఐ బ్యాంక్ 4.6 శాతం ర్యాలీ జరపగా, యాక్సిస్ బ్యాంక్ 3 శాతం పెరిగింది. టాటా స్టీల్ 4.6 శాతం ఎగిసింది. వేదాంత, హిందాల్కోలు 5-6 శాతం మధ్య పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల జోష్... ప్రపంచ మార్కెట్లలో కూడా ర్యాలీ కొనసాగడంతో ఇక్కడ సెంటిమెంట్ మరింత బలపడింది. సోమవారం అమెరికా ఎస్ అండ్ పీ ఇండెక్స్ ఆల్‌టైమ్ రికార్డుస్థాయిలో ముగిసిన ప్రభావంతో మంగళవారం ప్రధాన ఆసియా మార్కెట్లన్నీ ఎగిసాయి. జపాన్, హాంకాంగ్, చైనా, దక్షిణ కొరియా సూచీలు 1.5-2 శాతం మధ్య పెరిగాయి. యూరప్‌లో బ్రిటన్ ఎఫ్టీఎస్ఈ మినహా మిగిలిన దేశాల ఇండెక్స్‌లు 1 శాతంపైగా ర్యాలీ జరిపాయి. కడపటి సమాచారం అందేసరికి అమెరికా సూచీలు 0.5 శాతం పెరుగుదలతో ట్రేడవుతున్నాయి. -
రిస్క్‌లేని పెట్టుబడి సాధనమేది...?
మా అమ్మగారు సీనియర్ సిటిజన్. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం ఆమెకు ఇష్టం లేదు. 10-15 ఏళ్లపాటు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారు. పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్(పీపీఎఫ్)లో ఇన్వెస్ట్ చేయమంటారా? లేక ఆల్ట్రా షార్ట్‌టర్మ్, షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా? దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే పన్ను ప్రయోజనాలు అధికంగా లభిస్తాయి. - రాధాకృష్ణ, నెల్లూరు పన్ను ప్రయోజనాలతో పాటు సురక్షితమైన రాబడులు కావాలంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్ కంటే పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్(పీపీఎఫ్) ఉత్తమమైన ఇన్వెస్ట్మెంట్ మార్గమని చెప్పవచ్చు. పీపీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చే రాబడులపై ఎలాంటి పన్నులు ఉండవు. అయితే పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తే 15 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. దీనిపై వచ్చే రాబడులు ప్రభుత్వ సెక్యూరిటీలపై వచ్చే రాబడుల కన్నా కొంచెమే అధికంగా ఉంటాయి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు సొమ్ములను వెనక్కితీసుకోవాలి అనుకుంటే డెట్ ఫండ్స్ ఉత్తమం. ఈ డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన మూడేళ్లలోపే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకుంటే స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీ అమ్మగారి ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ మూడేళ్ల త ర్వాత ఈ డెట్ ఫండ్స్ నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకుంటే దీర్ఘకాల మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఇండెక్సేషన్ ప్రయోజనాలతో కలిపి 20 శాతంగా ఉంటుంది. ఈక్విటీ మార్కెట్లో లాగానే డెట్ మార్కెట్లో కూడా వివిధ బాండ్ల ధరలు ఒడిదుడుకులకు లోనవుతుంటాయి. అందుకని డెట్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ రాబడులు, ఏడాది ఏడాదికి మారుతూ ఉంటాయి. ఇప్పుడు పీపీఎఫ్ వడ్డీరేట్లు కూడా ప్రతి మూడు నెలలకొకసారి మారుతూ ఉన్నాయి. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఎలాంటి రిస్క్ వద్దనుకుంటే, పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఇది సురక్షితమైన పెట్టుబడి సాధనం. ప్రభుత్వ దన్నుతో ఇది నడుస్తుండడమే దీనికి కారణం. నేను భారత పౌరసత్వం వదులుకొని జర్మనీ పౌరసత్వం తీసుకోవాలనుకుంటున్నాను. ఓవర్సీస్ సిటిజెన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డ్‌కు దరఖాస్తు చేయాలనుకుంటున్నాను. అయితే నాకు కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో కూడా కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. భారత పౌరసత్వం వదులుకొని జర్మనీ పౌరసత్వం తీసుకోవడం వల్ల ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఏమైనా ప్రభావం ఉంటుందా? - మార్గరెట్, హైదరాబాద్ ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా(ఓసీఐ), నాన్ రెసిడెంట్ ఇండియన్(ఎన్నారై)తో దాదాపు సమానం. ఆర్థిక, విద్య తదితర రంగాల్లో ఈ హోదాలు ఉన్నవారికి ఒకే విధమైన హక్కులు లభిస్తాయి. ఒక్క వ్యవసాయ, ప్లాంటేషన్ ఆస్తుల కొనుగోళ్లలో మాత్రమే తేడా ఉంటుంది. మీరు మీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు, అయితే మీ పౌరసత్వంలో మార్పులు, చేర్పులు గురించి మీ బ్యాంక్‌కు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు సమాచారమందించడం తప్పనిసరనే విషయాన్ని మాత్రం మరచిపోకండి. నా వయస్సు 34 సంవత్సరాలు. నా కోసం ఎల్ఐసీ న్యూ ఎండోమెంట్ ప్లాన్, నా నాలుగేళ్ల కూతురి కోసం జీవన్ అంకుర్ పాలసీలను తీసుకున్నాను. రెండింటి మెచ్యురిటీ కాలం 20 ఏళ్లు. ఈ రెండింటి వార్షిక ప్రీమియమ్ రూ.59,000. ఇప్పటికి మూడేళ్ల ప్రీమియమ్‌లు చెల్లించాను. దీర్ఘకాల రాబడులకు ఇవి సరైనవి కావని మిత్రులంటున్నారు. ఈ పాలసీల నుంచి బయటపడే మార్గం చెప్పండి. - సందేశ్, వైజాగ్ ఎల్ఐసీ న్యూ ఎండోమెంట్ ప్లాన్‌కు సంబంధించి గ్యారంటీడ్ సరెండర్ వేల్యూ--మీరు చెల్లించిన మొత్తం ప్రీమియమ్‌లలో ఒక ప్రత్యేకమైన శాతంగా ఉంటుంది. అదనపు ప్రీమియమ్, రైడర్లకు చెల్లించిన ప్రీమియమ్లకు మినహాయింపు ఉంటుంది. మీరు తీసుకున్న పాలసీ కాల వ్యవధి, మీరు ఈ పాలసీని ఎప్పుడు సరెండర్ చేస్తారు అన్న విషయాలపై ఈ పర్సంటేజ్ ఆధారపడి ఉంటుంది. ఇక ఎల్ఐసీ జీవన్ అంకుర్ అనేది లాభాలతో కూడిన సంప్రదాయ ప్లాన్. ఈ ప్లాన్‌లో రిస్క్ కవర్ తండ్రి/తల్లిపై ఉంటుంది. ఈ ప్లాన్‌లో కూతురు నామినీగా ఉంటుంది. ఈ పాలసీ తీసుకొని మూడేళ్లైతేనే/ లేదా మూడు పూర్తి ప్రీమియమ్‌లు చెల్లిస్తేనే మీరు ఈ పాలసీని సరెండర్ చేయగల అవకాశముంటుంది. దీనికి సరెండర్ వేల్యూ- మీరు చెల్లించిన ప్రీమియమ్‌ల్లో 30 శాతం(మొదటి ఏడాది ప్రీమియమ్, ఆప్షనల్ రైడర్, అదనపు ప్రీమియమ్‌లను మినహాయించి)గా ఉంటుంది. మీకు నష్టాలు వచ్చినా సరే, ఈ పాలసీలను సరెండర్ చేయడమే సముచితమని భావిస్తున్నాం. ఇలాంటి బీమా, ఇన్వెస్ట్మెంట్ కలగలసిన ప్లాన్లు స్వల్ప మొత్తానికే బీమా కవర్‌ను ఇస్తాయి. అంతంత రాబడులు మాత్రమే వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ కోసం ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోవడం సరైనది కాదు. ఇలా చేస్తే బీమా కవర్, రాబడుల్లో రాజీ పడాల్సి ఉంటుంది. జీవిత బీమా కోసమైతే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలి. తక్కువ ప్రీమియమ్‌లు, అధిక రాబడులు వీటి ప్రత్యేకత. ఇక పాప చదువు, ఇంటి కొనుగోలు వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసమైతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. నేను ఒక మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్) రెగ్యులర్ ప్లాన్‌లో రెండేళ్ల నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదే మ్యూచువల్ ఫండ్ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్‌కు సంబంధించిన డెరైక్ట్ ప్లాన్‌కు మారాలనుకుంటున్నాను. అలా మారే వీలుందా? అవసరమైతే ఏమైనా పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందా ? - అబ్దుల్లా, వరంగల్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్ఎస్ఎస్) లేదా ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లకు తప్పనిసరిగా మూడేళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ఈ లాక్ ఇన్ పీరియడ్ పూర్తయిన తర్వాతనే మీరు రెగ్యులర్ ప్లాన్ నుంచి డెరైక్ట్ ప్లాన్‌కు మారాల్సి ఉంటుంది. అంతకంటే ముందుగానే మారడానికి వీలు లేదు. జరిమానా చెల్లించి మారే వీలు ఏమీ లేదు. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ, డెట్ల వాటా ఎంత ఉండాలి?
ఫైనాన్షియల్ బేసిక్స్.. ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ, డెట్ల వాటా ఎంత ఉండాలనేది ప్రధానంగా ఆ ఇన్వెస్ట్మెంట్లు చేస్తోన్న వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తోన్నది... 20-30 ఏళ్ల వయసున్న వారైతే.. వారు భరించే రిస్క్ ఒక విధంగా ఉంటుంది. అదే ఇన్వెస్ట్ చేస్తున్నది 50-55 ఏళ్ల వయసున్న వారైతే.. వారు భరించగలిగే రిస్క్ మరోలా ఉంటుంది. ఇక్కడ రిస్క్‌ను వయసు ప్రభావితం చే స్తోందన్న విషయాన్ని మనం గ్రహించాలి. 23 ఏళ్లకే కెరీర్‌ను ప్రారంభించిన వారు అధిక రిస్క్‌ను భరించడానికి సిద్ధంగా ఉండొచ్చు. అదే వయసు ఎక్కువగా ఉన్న వారు తక్కువ రిస్క్‌ను భరించడానికి ఆసక్తి చూపుతారు. అప్పుడు వారి ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోలు వేరు వేరుగా ఉంటాయి. ఎక్కువ రిస్క్ భరించే వారు ఈక్విటీల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు. తక్కువ రిస్క్ భరించే వారు డెట్ సాధనాల వైపు మొగ్గు చూపుతారు. ఇక మధ్య వ యస్కుల విషయానికి వస్తే వీరు బ్యాలెన్స్డ్గా ఉంటారు. 20-30 ఏళ్ల వారి పోర్ట్‌ఫోలియోలో సాధారణంగా ఈక్విటీ వాటా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక 30-40 ఏళ్ల వారి పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ, డెట్ల వాటా సమానంగా ఉంటుంది. ఇక 50-60 ఏళ్లు, అంతకుపై వయసు ఉన్న వారి పోర్ట్‌ఫోలియోలో డెట్ వాటా అధికంగా ఉంటుంది. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ రిస్క్‌ను భరించాల్సి వస్తుంది. అదే డెట్ సాధనాల్లో అయితే వడ్డీ రేట్లు, క్రెడిట్ రిస్క్‌లు పొంచి ఉంటాయి. -
ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌మెంట్‌కు ముందు?
ఫైనాన్షియల్ బేసిక్స్.. ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుగా ప్రాధమిక ఆర్థిక అంశాలపై పట్టు సాధించాలి. ఆర్థిక వ్యవస్థలో చాలా రంగాలుంటాయి. బ్యాంకింగ్, ఆయిల్, స్టీల్, మైనింగ్, ఎఫ్ఎంసీజీ, సిమెంట్... ఇలా. మీరు ఏ ఏ రంగాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాటి గురించి అధ్యయనం చేయాలి. ఉదాహరణకు స్టీల్ రంగాన్ని ఎంచుకొని అందులోని కంపెనీకి సంబంధించిన షేర్లలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే.. ఆ రంగానికి సంబంధించిన అంశాలపై కన్నేసి ఉంచాలి. ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండాలి. అలాగే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న కంపెనీ, దాని కార్యకలాపాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. సమకాలీన దేశీ, అంతర్జాతీయ అంశాలపై అవగాహన కలిగి ఉండాలి. అలాగే ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోను ఎప్పుడూ డైవర్సిఫైడ్‌గా ఉంచుకోవాలి. ‘అన్ని గుడ్లను ఒకే బాక్స్‌లో పెట్టకూడదు’ అనే సామెతను మనం ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. అన్నీ ఒకే చోట ఉన్నప్పుడు.. బాక్స్ కిందపడితే ఏవీ మిగలవు. అన్నీ పగిలిపోతాయి. అందుకే ఇన్వెస్ట్మెంట్లను కూడా ఒకే రంగ కంపెనీలపై పెడితే.. ఆ రంగం సరైన పనితీరును కనబరచకపోతే నష్టాలను చూడాల్సి వస్తుంది. అందుకే వివిధ రంగాలకు సంబంధించిన కంపెనీ షేర్లలో ఇన్వెస్ట్ చేయాలి. మార్కెట్లలో పెట్టుబడి పెడుతున్నామంటే.. రిస్క్ కూడా భరించాల్సి ఉంటుందనే విషయాన్ని మరచిపోకూడదు. ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ల విషయంలో ఎప్పుడూ కూడా ఇతరుల సలహాలను పాటించొద్దు. -
ఫండ్స్... ఏవి బెస్ట్..
ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా అయేషా ఈ మధ్యనే వృత్తి జీవితాన్ని ప్రారంభించింది. చిన్నప్పటి నుంచే చక్కటి ప్రణాళికలతో ముందుకెళ్ళిన అయేషా ఇప్పుడు ఉద్యోగం చేయడం ప్రారంభించిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా అదే విధానాన్ని ఎంచుకుంది. ఇందులో భాగంగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకొని ఫండ్ అడ్వైజర్‌ని సంప్రదించింది. అడ్వైజర్‌తో సంభాషించిన తర్వాత మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి మూడు అంశాలు ఆకర్షించాయి. ఇందులో మొదటిది అయేషా స్వల్పకాలిక దృష్టితో కాకుండా దీర్ఘకాలానికి సంపదను సృష్టించుకోవాలన్నది లక్ష్యం. దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్‌కు మ్యూచువల్ ఫండ్స్ ఒక చక్కటి ఇన్వెస్ట్మెంట్ సాధనంగా భావించింది. అలాగే ఈ రంగంలో బాగా అనుభవం ఉన్న ఫండ్ మేనేజర్లకు ఇన్వెస్ట్మెంట్ అవకాశం ఇవ్వడం రెండోది. అలాగే ఇన్వెస్ట్మెంట్ విధానం చాలా సులభంగా ఉండటం, ఎప్పుడు కావాలంటే అప్పుడు నగదును వెనక్కి తీసుకునే అవకాశం ఉండటం మరింత ఆకర్షించింది. అయేషా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకుందే కానీ... ఏ పథకంలో ఇన్వెస్ట్ చేయాలన్నది ఇప్పుడు అతిపెద్ద సమస్య. సుమారు 40 ఫండ్ హౌస్‌లు 1,000కిపైగా పథకాలను అందిస్తున్నాయి. దీర్ఘకాలంలో సంపద సృష్టికి ఈక్విటీలు చక్కటి అవకాశంగా భావిస్తున్న అయేషా డెట్ పథకాల్లో కాకుండా కేవలం ఈక్విటీ పథకాల్లోనే ఇన్వెస్ట్ చేయాలనుకుంటోంది. కానీ ఈక్విటీల్లో కూడా డైవర్సిఫైడ్ ఈక్విటీ, బ్యాలెన్స్డ్, మిడ్‌క్యాప్, సెక్టర్ ఫండ్స్ అంటూ అనేక రకాలున్నాయి. ఇప్పుడు వీటిల్లో వేటిని ఎంచుకోవాలన్నది కూడా సమస్యే. అయేషా ఇన్వెస్ట్మెంట్ ప్రణాళిక ప్రకారం బ్యాలెన్స్డ్, మిడ్ క్యాప్ ఫండ్స్ అనుకూలం కాదు. ఇక మిగిలినది డైవర్సిఫైడ్ ఈక్విటీ, సెక్టర్ ఫండ్స్. ఇప్పుడు ఈ రెండింటిలో ఉన్న లాభనష్టాలను పరిశీలిద్దాం.. తేడా ఏమిటి.. డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్... పేరుకు తగ్గట్టుగానే ఈ ఫండ్ అత్యధికంగా వివిధ రంగాలకు చెందిన లార్జ్‌క్యాప్ షేర్లలో ఇన్వెస్ట్ చేస్తుంది. కొంతమొత్తం చిన్న షేర్లకు కేటాయిస్తుంది. ఈ ఫండ్ ముఖ్యోద్దేశం సాధ్యమైనంత వరకు స్టాక్ మార్కెట్లో ఉండే నష్టభయాన్ని తగ్గించడమే. ఇందుకోసం ఒకదానితో ఒకటి సంబంధం లేని షేర్లను ఎంపిక చేసుకుంటారు. ఇంకా సులభంగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే.. మీ ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని బ్యాంకులు, ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్ రంగాలకు కేటాయించారనుకుందాం. ఒక్కసారి వడ్డీరేట్లు పెరగడం మొదలైతే ఈ మూడు రంగాలు బాగా దెబ్బతింటాయి. దీంతో భారీ నష్టాలను మూటకట్టుకోవాల్సి వస్తుంది. వడ్డీరేట్లు తగ్గితే లాభాలు కూడా అదే విధంగా వస్తాయి కానీ అది వేరే విషయం. ఇలా ఒక సంఘటన వల్ల ఎక్కువ నష్టాలు రాకుండా ఉండే విధంగా పోర్ట్‌ఫోలియోలో విభిన్న రంగాలకు చెందిన పెద్ద కంపెనీల షేర్లు ఉండే విధంగా చూస్తారు. ఇక సెక్టర్ ఫండ్స్ విషయానికి వస్తే ఇవి కేవలం ఒక సెక్టర్‌కి చెందిన షేర్లలో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాయి. ఉదాహరణకు ఫార్మా ఫండ్‌ను తీసుకుంటే ఈ పథకం కేవలం ఫార్మా కంపెనీల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తుంది. అదే బ్యాంక్ ఫండ్ బ్యాంకు షేర్లలో, ఎఫ్ఎంసీజీ ఫండ్ ఆ రంగానికి చెందిన ఎఫ్ఎంసీజీ షేర్లలో ఇన్వెస్ట్ చేస్తుంది. వీటిలో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే.. ఆ రంగం పనితీరు బాగున్నప్పుడు మంచి లాభాలు వస్తాయి. కానీ ఇదే సమయంలో ఆ రంగం పనితీరు బాగోకపోతే నష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. గత మూడేళ్లను పరిశీలిస్తే ఫార్మా ఫండ్స్ సగటున 19.5 శాతం రాబడిని ఇస్తే, బ్యాంకింగ్ ఫండ్స్ 5.2 శాతం, టెక్నాలజీ ఫండ్ 22 శాతం లాభాలను అందించాయి. ఇదే సమయంలో డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ 11.4 శాతం లాభాలను ఇచ్చాయి. దీన్ని బట్టి మీరు దేన్ని ఎంచుకుంటారు? లక్ష్యం ఏమిటి? స్టాక్ మార్కెట్లో ఉండే సహజమైన నష్ట భయాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకుంటూ అధిక లాభాలను పొందాలన్న ఉద్ధేశంతో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. ముఖ్యంగా రిటైర్మెంట్, పిల్లల చదువు వంటి లక్ష్యాలకు ఇన్వెస్ట్ చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఒక లక్ష్యం కోసం ఇన్వెస్ట్ చేసేవారికి సెక్టర్ ఫండ్స్ అనుకూలంగా ఉండవు. ఒకసారి ఆ రంగంలో ఏదైనా ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే మీ లక్ష్యాన్ని చేరుకోలేరు. మూడేళ్ల క్రితం ఐటీ సెక్టర్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు మంచి లాభాలు వచ్చాయి. కానీ ఇదే సమయంలో బ్యాంకింగ్, ఇన్ఫ్రా రంగాల్లో ఇన్వెస్ట్ చేసిన వారి పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. కాబట్టి రాబోయే కాలంలో ఏ సెక్టర్ పనితీరు బాగుంటుందో ముందుగా ఊహించడం చాలా కష్టమైన పని. కాబట్టి దీర్ఘకాలిక లక్ష్యాలకు డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ అనువుగా ఉంటాయి. ఒకేసారి విభిన్నమైన రంగాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిస్క్ భయాన్ని తగ్గించుకోవడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవచ్చు. రిస్క్ చేస్తానంటే... డైవర్సిఫైడ్ ఫండ్స్ కాకుండా సెక్టర్ ఫండ్స్‌ను ఎంచుకుంటే ఆ మేరకు మీ పోర్ట్‌ఫోలియోలో రిస్క్ భయం పెరుగుతుంది. సెక్టర్ ఫండ్స్‌లో మూడు రకాలైన భయాలుంటాయి. ఉదాహరణకు ఫార్మా సెక్టర్‌ను తీసుకుంటే... యూఎస్ ఎఫ్‌డీఏ నిబంధనల వల్ల గడచిన ఏడాది నుంచి ఫార్మా షేర్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇలా మన అంచనాలకు సంబంధం లేకుండా బయటి సంఘటనల వల్ల కొన్ని సందర్భాల్లో ఆయా రంగాలు ఒత్తిడిని ఎందుర్కొంటాయి. అలాగే సెక్టర్ ఫండ్స్‌లో లార్జ్ క్యాప్ షేర్లు చాలా తక్కువ ఉంటాయి. దీంతో ఫండ్ మేనేజర్లు చిన్న షేర్లలో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. దీంతో పోర్ట్‌ఫోలియోలో రిస్క్ మరింత పెరుగుతుంది. డైవర్సిఫైడ్ ఫండ్స్‌తో పోలిస్తే సెక్టర్ ఫండ్స్‌లో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. అయేషా ఏమి చేయాలి? ♦ చివరగా అయేషా పోర్ట్‌ఫోలియో ఏవిధంగా ఉంటే బాగుంటుందో ఇప్పుడు చూద్దాం. ♦ డైవర్సిఫైడ్ ఫండ్స్‌తో అనేక లాభాలున్నాయి కాబట్టి ప్రధానంగా వీటిపైనే దృష్టిపెట్టాలి. ♦ అయేషా చిన్న వయస్సులోనే ఉద్యోగం ప్రారంభించింది కాబట్టి ఇన్వెస్ట్మెంట్లో కొంత రిస్క్ చేయొచ్చు. సెక్టర్ ఫండ్స్ పనితీరును పరిశీలించడం కోసం పోర్ట్‌ఫోలియోలో గరిష్టంగా 20 శాతం మించకుండా సెక్టర్ ఫండ్స్‌కు కేటాయించుకోవచ్చు. ♦ ఒకేసారిగా కాకుండా ప్రతినెలా ఇన్వెస్ట్ చేసే విధంగా సిప్ విధానాన్ని ఎంచుకోవాలి. దీనివల్ల మార్కెట్లో ఉండే ఒడిదుడుకుల నుంచి లబ్ధి పొందొచ్చు. ♦ సెక్టర్ ఫండ్స్ పనితీరును మధ్యమధ్యలో పరిశీలించాలి. ఒకవేళ పనితీరు బాగోలేకపోతే.. వాటినుంచి వైదొలిగి ఆ మొత్తాన్ని తిరిగి డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్‌కు మరల్చాలి. - అనిల్ రెగో సీఈవో, రైట్ హొరెజైన్స్ -
ఇది ఈక్విటీ నామ సంవత్సరం
ఇపుడున్నవన్నీ మంచి శకునాలే... గత రెండేళ్లు వర్షాలు సరిగా లేకపోవడంతో ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడింది. ఈ ఏడాది వర్షాలు బాగా కురిస్తే దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై రానున్న కాలంలో కనిపిస్తుంది. ఇదే సమయంలో ఆర్బీఐ వడ్డీరేట్లు మరింత తగ్గే అవకాశాలున్నాయంటూ మొన్న పరపతి విధాన సమీక్షలో సంకేతాలివ్వడం శుభపరిమాణం. అలాగే బ్యాంకులు నిరర్థక ఆస్తుల్ని గుర్తించి వాటికి తగిన కేటాయింపులను చేయడంతో రానున్న త్రైమాసికాల్లో బ్యాంకుల లాభాలు తిరిగి పెరిగే అవకాశాలున్నాయి. ప్రతీ త్రైమాసికానికి అంతర్జాతీయంగా ఏదో ఒక సమస్య తలెత్తుతోంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధి ఇంకా సవాళ్లను ఎదుర్కొంటున్నా... ఇప్పుడిప్పుడే సమస్యలు ఒక కొలిక్కి వస్తున్న సంకేతాలు వస్తున్నాయి. కరెన్సీ, కమోడిటీలు, వడ్డీరేట్లు, వృద్ధిరేట్లకు సంబంధించి మధ్య మధ్యలో సమస్యలు రావచ్చు. కాబట్టి ఈ ఏడాది ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలి. బ్యాంకింగ్ మినహా మెరుగైన ఫలితాలు ఇక రంగాల వారీగా చూస్తే బ్యాంకింగ్ రంగాన్ని మినహాయించి మిగిలిన అన్ని రంగాలకు చెందిన కంపెనీల ఆదాయాలు బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత తొమ్మిది నెలలుగా నిరర్థక ఆస్తుల వల్ల బ్యాంకుల ఆదాయాలు గణనీయంగా తగ్గాయి, ఇప్పుడు చివరి త్రైమాసిక ఫలితాలు కూడా అదే విధంగా ఉండే అవకాశం ఉంది. బ్యాంకులు ఎన్పీఏలను రైట్ ఆఫ్ చేయడం ఒక కొలిక్కి వస్తే కానీ బ్యాంకుల ఆదాయాలు పెరిగే అవకాశాలు లేవు. మొత్తం మీద చూస్తే బ్యాంకింగ్ ఆదాయాల్లో మూడు నుంచి నాలుగు శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాం. ఇదే సమయంలో లో బేస్ ఎఫెక్ట్ వల్ల కమోడిటీస్ కంపెనీల ఆదాయాల్లో ఈ ఏడాది గణనీయమైన వృద్ధి నమోదు కానుంది. రోడ్లు, ఇతర నిర్మాణ రంగాల్లో కొత్త ప్రాజెక్టులు మొదలు కావడం స్పష్టంగా కనిపిస్తోంది. దీనివల్ల గత నాలుగు నెలల నుంచి సిమెంట్ డిమాండ్ కూడా పెరుగుతోంది. దీంతో రానున్న కాలంలో నిర్మాణ రంగానికి చెందిన యంత్రసామగ్రి, మైనింగ్ వర్క్‌లు బాగా పెరిగే అవకాశం ఉంది. వడ్డీరేట్లు దిగొస్తుండటంతో ఎన్‌బీఎఫ్‌సీల ఆదాయాల్లో కూడా పెరుగుదల ఉంటుంది. కొత్త బ్యాంకులు రావడంతో, మొండి బకాయిలను క్లీన్ చేయడంతో వచ్చే ఆరు నెలల తర్వాత ప్రైవేటు బ్యాంకుల ఆదాయాలు బాగుంటాయి. ఇక ఎఫ్ఐఐల నిధుల ప్రవాహ విషయానికి వస్తే.. కొంత భిన్న వాతావరణం నెలకొని ఉంది. ఒక ఈటీఎఫ్‌ల రూపంలో నిధులు వస్తుంటే... ఇదే సమయంలో దీర్ఘకాలిక దృష్టితో ఇన్వెస్ట్ చేసినవారు మంచి కంపెనీల నుంచి వైదొలుగుతున్నారు. మొత్తం మీద చూస్తే ఆదాయాలు పెరిగే దశలోకి కంపెనీలు వచ్చాయి. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలో పయనించనుంది అనడానికి స్పష్టమైన సంకేతాలు మనకు కనపడుతున్నాయి. వడ్డీరేట్లు దిగిరానుండటంతో దీర్ఘకాలంలో ఈక్విటీలు మంచి రాబడిని ఇచ్చే అవకాశం ఉంది.ఈ ఏడాది ఇతర ఇన్వెస్ట్మెంట్ సాధనాలతో పోలిస్తే ఈక్విటీలే అధిక రాబడిని అందిస్తాయని అంచనా వేస్తున్నాం. ఈ ఏడాది ఈక్విటీలు 10 నుంచి 15 శాతం రాబడిని ఇవ్వొచ్చు. ఏదైనా బయట పరిణామాలు జరిగితేనే మార్కెట్లు ఒడిదుడుకులకు గురవుతాయి. - అనూప్ మహేశ్వరి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, డీఎస్పీ బ్లాక్‌రాక్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ -
పన్నుల పని మొదలెట్టారా?
శ్రీకర్‌కు జీతం నెలకు 70వేల పైనే. కాకపోతే గత నెల జీతం... అంటే మార్చిది కేవలం 30వేలే వచ్చింది చేతికి. ఎందుకంటే ప్లానింగ్ లోపం. ఆదాయపు పన్ను మినహాయింపులకు ఏమేం చేస్తున్నారో చెప్పాలని వాళ్ల ఆఫీసు ఫైనాన్స్ విభాగం ముందు నుంచీ అడుగుతున్నా... రకరకాల కారణాలు చెబుతూ వచ్చాడు శ్రీకర్. రకరకాల ప్రతిపాదనలు ముందు చెప్పినా... చివరికొచ్చేసరికి అవేమీ చెయ్యలేకపోయాడు. ఫలితం... మార్చి జీతంలో భారీగా కోతపడింది. ఒక్క మార్చి మాత్రమే కాదు. అంతకు ముందు మూడు నెలల నుంచీ... అంటే డిసెంబర్ నుంచీ అలా కోతలు పడుతూనే వచ్చాయి. ఇక లాభం లేదు!! వచ్చే ఏడాదైనా ముందు నుంచీ ప్రణాళిక వేసుకుని పన్ను మినహాయింపుల కోసం ఏదో ఒకటి చెయ్యాలని గట్టిగా అనుకున్నాడు. అలా అనుకుంటూ ఉండగానే ఏప్రిల్ నెలాఖరు వచ్చేసింది. శ్రీకర్‌కు భయం పట్టుకుంది. నిజానికి ఒక్క శ్రీకర్ మాత్రమే కాదు. చాలామంది పరిస్థితి ఇదే. ఆర్థిక సంవత్సరం మొదలైన దగ్గర్నుంచీ పన్ను ప్లానింగ్ చెయ్యాలని అనుకుంటారు. కానీ సమయం గడిచిపోతూ ఉంటుంది. అందుకే... అలాంటి వారికోసమే ఈ ప్లానింగ్ పాఠం... నిజం చెప్పాలంటే... హడావుడిలోనే ఎక్కువ తప్పులు జరుగుతాయి. ఆర్థిక ప్రణాళికైనా అంతే. ఆఖరు నిమిషం నిర్ణయాలకు తావులేకుండా గరిష్టంగా పన్ను లాభాలు పొందటానికి ప్రణాళిక కావాలి. ఇప్పటి నుంచీ మొదలుపెడితే అందుకు బోలెడంత సమయం లభిస్తుంది. అవసరమైతే మధ్యలో తగు మార్పులు కూడా చేసుకోవచ్చు. ఈ ఏడాది ఆదాయ పన్ను చట్టంలో పెద్దగా మార్పులు జరగలేదు కాబట్టి గతేడాదిలాగే ప్రణాళికలను సిద్ధం చేసుకోవచ్చు. కానీ గతేడాదితో పోలిస్తే కొన్ని పెట్టుబడి సాధనాల పనితీరులో చాలా మార్పు వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు. - సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం ఏడాది ఆరంభం నుంచే ప్లానింగ్ తప్పనిసరి * అలాగైతే జేబుకు భారం లేకుండా మినహాయింపులు * ఆఖరి క్షణం నిర్ణయాల్లో తప్పులు కూడా జరగొచ్చు * మధ్యలో నిర్ణయాలు మార్చుకోవటానికీ తగినంత సమయం * వడ్డీరేట్లు తగ్గుతున్నాయి కనుక ఇపుడే డిపాజిట్లు చేయటం బెటర్ * ఈ ఏడాది స్టాక్ మార్కెట్ల పనితీరు కూడా ఆశావహమే షేర్లు కొన్నా పన్ను లాభమే... గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీలు స్వల్ప నష్టాలను అందించినా... ఈ ఏడాది ప్రారంభం నుంచి సానుకూల సంకేతాలనే ఇస్తున్నాయి. దీర్ఘకాలంలో ఈక్విటీలు మంచి రాబడినిచ్చే అవకాశం ఉంటుంది కనుక కొద్దిగా రిస్క్ చేయగలిగే సామర్థ్యం ఉన్నవారు వీటిల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వివిధ మార్గాల్లో పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ఇందుకోసం ఆదాయ పన్ను చట్టంలో 80సీ, 80సీసీజీ అని రెండు సెక్షన్లు ఉన్నాయి. తొలిసారిగా డీమ్యాట్ ఖాతా తెరిచి షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ కొన్న వారు సెక్షన్ 80సీసీజీ కింద పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. దీన్నే రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్ స్కీం (ఆర్జీఈఎస్ఎస్)గా పిలుస్తున్నారు. ఈ పథకం కింద గరిష్టంగా ఇన్వెస్ట్ చేసే రూ.50,000లలో సగభాగం అంటే రూ.25,000 పన్ను ఆదాయం నుంచి తగ్గించి చూపించుకోవచ్చు. ఇలా వరుసగా మూడేళ్ళు చేసే ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఈ మినహాయింపు పొందవచ్చు. వార్షికాదాయం పన్నెండు లక్షల లోపు ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఎంపిక చేసిన కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పన్ను ప్రయోజనం పొందొచ్చు. వీటిని ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్‌లు లేదా ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్‌గా పిలుస్తారు. దాదాపు అన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఈ ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్‌ను అందిస్తున్నాయి. వీటి రాబడులు మార్కెట్ కదలికలపై ఆధారపడి ఉంటాయి. వీటికి లాకిన్ పిరియడ్ మూడేళ్లు. ఆరోగ్యంతో పాటు పన్ను లాభం... ప్రస్తుత పరిస్థితుల్లో దురదృష్టవశాత్తూ ఆసుపత్రి పాలైతే అంతే!! ఎందుకంటే ఆసుపత్రి ఖర్చులు మామూలు జీతగాళ్లు తట్టుకునే స్థాయిలో లేవు. అందుకని ప్రతి ఒక్కరికీ ఇపుడు జీవితబీమా మాదిరే ఆరోగ్య బీమా కూడా అత్యవసరం. కాకపోతే ఈ ఆరోగ్య బీమాకు చెల్లించే ప్రీమియంపై పన్ను మినహాయింపు కూడా పొందొచ్చు. - గతేడాది నుంచి సెక్షన్ 80డీ కింద ఆరోగ్య బీమాకు చెల్లించే ప్రీమియంపై లభించే పన్ను మినహాయింపు పరిధిని పెంచారు. 60 ఏళ్ళలోపు వయస్సున్న వారైతే ఆరోగ్య బీమాకు చెల్లించే మొత్తంలో రూ.25,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. అదే సీనియర్ సిటిజన్స్‌కైతే ఈ పరిమితి రూ. 30,000. ముందస్తు వైద్య పరీక్షలకు చేసే వ్యయంపై గరిష్టంగా రూ.5,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. కానీ ఈ మొత్తం రూ.25,000 పరిధిలోకే వస్తుంది. భారా ్యభర్తలు, పిల్లలు, తల్లిదండ్రుల వైద్య పరీక్షలకోసం చేసే ఖర్చులు కూడా ఈ పరిధిలోకి వస్తాయి. ఇది కాకుండా తల్లిదండ్రులకు చెల్లించే వైద్య బీమా ప్రీమియంపై కూడా మినహాయింపు ఉంటుంది. తల్లిదండ్రులు 60 ఏళ్ళలోపు వారైతే రూ. 25,000, అదే సీని యర్ సిటిజన్స్ అయితే రూ.30,000 అదనంగా పొందొచ్చు. అంటే ఈ సెక్షన్ ద్వారా గరిష్టంగా రూ. 50 వేల నుంచి రూ. 60 వేలవరకు ప్రయోజనం పొందవచ్చు. ఇవి కాకుండా బీమా, పీపీఎఫ్, హోమ్లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, పిల్లల ట్యూషన్ ఫీజులు వంటి అనేక పన్ను ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని చక్కగా వినియోగించుకోవడం ద్వారా సాధ్యమైనంత వరకు పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. పైన పేర్కొన్న వాటిలో మీకు అనువైన పథకాలను ఎంచుకొని వాటిలో క్రమ శిక్షణతో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్ను లాభాలతో పాటు దీర్ఘకాలంలో తగినంత సంపదను వృద్ధి చేసుకోవచ్చు. డిపాజిట్లు... వడ్డీ తగ్గుతోంది ఎటువంటి రిస్క్ లేకుండా స్థిరాదాయం పొందాలనుకునే వారికి ఈ ఏడాది కాస్త నిరాశే మిగిలింది. గడిచిన ఏడాది కాలంగా డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గుతుండటమే కాకుండా... మరింత తగ్గే అవకాశాలున్నాయంటూ బలమైన సంకేతాలు వస్తున్నాయి. గడిచిన ఏడాది కాలంలో డిపాజిట్లపై వడ్డీరేట్లు ఇంచుమించు రెండు శాతం వరకు తగ్గాయి. మున్ముందు మరింత తగ్గొచ్చు కూడా. అందుకని పన్ను మినహాయింపు కోసం బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేవారికి కాస్తంత ఇబ్బందే. పెపైచ్చు ఇకపై పోస్టాఫీసుకు సంబంధించిన చిన్న మొత్తాల పొదుపు రేట్లను ప్రతి మూడు నెలలకోసారి సమీక్షించనున్నారు కూడా. * ప్రస్తుతం పోస్టాఫీసు ఐదేళ్ల డిపాజిట్‌పై 7.9 శాతం వడ్డీని అందిస్తుండగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐదేళ్ల కాలానికి 7 శాతం వడ్డీరేటు మాత్రమే అందిస్తోంది. * అమ్మాయిల పెళ్లిళ్లకు అక్కరకొచ్చేలా సుకన్య-సమృద్ధి పేరుతో మరో ప్రత్యేక సేవింగ్స్ పథకం ఉంది. 10 ఏళ్లలోపు అమ్మాయిల పేరిట ఈ * ఖాతా ప్రారంభించొచ్చు. ప్రస్తుతం ఈ పథకంపై 8.6 శాతం వడ్డీ వస్తోంది. ఈ పథకం పోస్టాఫీసు, కొన్ని ఎంపిక చేసిన బ్యాంకుల్లో అందుబాటులో ఉంది. * మున్ముందు వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉంది కనుక ఇన్వెస్ట్ చేసే ముందు ఎక్కడ అధిక వడ్డీ వస్తోందో పరిశీలించుకోండి. ప్రస్తుతానికి బ్యాంకుల కన్నా పోస్టాఫీసులే అధిక వడ్డీ అందిస్తున్నాయి. * పన్ను ప్రయోజనాల కోసం ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే ఆలస్యమయ్యే కొద్దీ వడ్డీరేట్లు మరింత తగ్గే ప్రమాదం ఉందని గుర్తుంచుకోవాలి. ఎన్పీఎస్... ఆకర్షణ పెరిగింది ఈ రోజుల్లో ప్రభుత్వోద్యోగాలంటే అతి కొద్ది మందికే పరిమితం. ప్రైవేటు ఉద్యోగాల్లో ఎక్కువ జీతంతో ఉండి రకరకాల పథకాల్లో ఇన్వెస్ట్ చేసేవారికైతే ఇబ్బంది ఉండదు. కానీ చిన్న జీతాలుండి... రిటైరైనవారు ఆ తరవాత ఏం చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానమే పెన్షన్ ప్లాన్లు. అందులో ప్రభుత్వ నియంత్రణలో నడిచే న్యూ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) ప్రధానమైంది. ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ అందించే ఈ ఎన్పీఎస్ పథకానికి ప్రతి ఏడాదీ కొన్ని అదనపు ఆకర్షణలు చేరుస్తున్నారు. ఈ సారి కూడా ఎన్పీఎస్ విత్డ్రాయల్స్పై చేసిన సవరణలు ఈ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాయి. మొన్నటి వరకు ఎన్పీఎస్ నుంచి వెనక్కి తీసుకునే ప్రతి పైసానూ పన్ను ఆదాయంగా పరిగణించి దానిపై పన్ను చెల్లించమని అడిగేవారు. కానీ మొన్నటి బడ్జెట్లో ఎన్పీఎస్ నుంచి వెనక్కి తీసుకునే 40 శాతం మొత్తంపై ఎలాంటి పన్నూ విధించకూడదని ప్రతిపాదన చేశారు. అంతేకాక ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసే మొత్తంపై సెక్షన్ 80సీసీడీ కింద గరిష్టంగా రూ.50,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. -
25,000 స్థాయిని దాటితేనే..
మార్కెట్ పంచాంగం ఎన్నో నెలల తర్వాత ఈక్విటీలు, క్రూడ్, బంగారం, మెటల్స్...ఇలా ట్రేడయ్యే అన్ని ఆస్తుల ధరలూ పెరుగుతున్నాయి. అలాగే చైనాతో సహా ఇతర వర్థమాన దేశాల కరెన్సీలన్నీ బలపడుతున్నాయి. ఈక్విటీలు పెరిగితే బంగారం తగ్గడం, క్రూడ్ తగ్గితే షేర్లు క్షీణించడం, చైనా మార్కెట్ పతనమైతే ఇతర ప్రపంచ మార్కెట్లు పడిపోవడం, డాలరు పెరిగితే ఇతర వర్థమాన కరెన్సీలు తగ్గడం వంటి ట్రెండ్స్ అన్నీ హఠాత్తుగా మటుమాయమయ్యాయి. ఒకవైపు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించగా, మరోవైపు అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచవచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అయినా అన్నింటి ధరలూ అప్‌ట్రెండ్‌లోనే వున్నాయి. ఈ ధోరణి ఇక ఎన్నోరోజులు కొనసాగకపోవొచ్చు. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడం శ్రేయస్కరం. ఇక సూచీల స్వల్పకాలిక సాంకేతికాంశాలకు వస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు మార్చి 11తో ముగిసిన 4 రోజుల ట్రేడింగ్‌వారంలో పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 72 పాయింట్ల స్వల్పలాభంతో 24,718 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం వారం వరుసగా మూడురోజులపాటు 24,820 పాయింట్ల వద్ద చిన్న అవరోధం ఏర్పడినందున, ఈ వారం ఇదేస్థాయి తొలి నిరోధం కాగలదు. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు భారీగా ర్యాలీ జరిపిన నేపథ్యంతో ఈ సోమవారం ఈ స్థాయిపైన సెన్సెక్స్ ప్రారంభమైతే వెనువెంటనే 25,000 పాయింట్ల శిఖరాన్ని తాకే చాన్స్ వుంది. దాదాపు ఇదే స్థాయి వద్ద జనవరి 14, ఫిబ్రవరి 1 తేదీల్లో డబుల్‌టాప్ ఏర్పడినందున, ఈ స్థాయిని బలంగా దాటి స్థిరపడితేనే తదుపరి అప్‌ట్రెండ్ సాధ్యపడుతుంది. అటుపైన సెన్సెక్స్ 25,230 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని కూడా ఛేదిస్తే కొద్దిరోజుల్లో 26,256 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగే చాన్స్ వుంటుంది. ఈ వారం క్షీణిస్తే 24,440 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తుండగా, 24,380-24,280 శ్రేణి వద్ద మద్దతు సెన్సెక్స్ కీలకమైనది. మార్చి 2 నాటి గ్యాప్‌అప్ అయిన ఈ శ్రేణిని సూచీ కోల్పోతే ప్రస్తుత అప్‌ట్రెండ్ ప్రమాదంలో పడే వీలుంది. ఈ శ్రేణి దిగువన 24,044 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఆ లోపున 23,820 పాయింట్ల స్థాయి వద్ద మరో మద్దతు లభిస్తున్నది. నిఫ్టీ కీలక మద్దతు శ్రేణి 7,406-7,380 ఎన్ఎస్ఈ నిఫ్టీ అంతక్రితం వారంతో పోలిస్తే 25 పాయింట్ల లాభంతో 7,510 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సోమవారం గ్యాప్‌అప్‌తో మొదలైతే 7,550 స్థాయి వద్ద తక్షణ నిరోధం ఏర్పడవచ్చు. ఈ స్థాయిపైనే నిఫ్టీ ప్రారంభమైతే వేగంగా 7,600 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని దాటితేనే నిఫ్టీ మరింత పెరిగి 7,675 స్థాయివరకూ ర్యాలీ జరపవచ్చు. ఈ స్థాయిని కూడా ఛేదించి, స్థిరపడితే రానున్న వారాల్లో 7,980 పాయింట్ల దిశగా కదిలే అవకాశం వుంటుంది. ఈ వారం మార్కెట్ తగ్గితే నిఫ్టీకి తక్షణం 7,425 వద్ద చిన్నపాటి మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే 7,406-7,380 పాయింట్ల మద్దతు శ్రేణి సమీపకాలంలో అప్‌ట్రెండ్‌కు కీలకం. ఈ శ్రేణిని కోల్పోతే 7,308 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు. ఆ లోపున ముగిస్తే క్రమేపీ 7,235 పాయింట్ల వద్దకు తగ్గే ప్రమాదం వుంటుంది. - పి.సత్యప్రసాద్ -
ఈ ఏడాదికి ఈక్విటీలే మంచివి!
2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభ ఛాయలు మళ్లీ కనిపిస్తున్నాయా?... భారీగా పడుతున్న ముడి చమురు ధరలు, నెమ్మదించిన చైనా పరుగులు... తగ్గుతున్న కమోడిటీ ధరలు, అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ల దిగువ చూపులు... ఇవన్నీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గడ్డు పరిస్థితుల్లో ఉందన్న విషయాన్ని చెపుతున్నాయి. ఇదే సమయంలో అమెరికాలో వడ్డీరేట్లు పెరిగితే ఇండియా వంటి వర్థమాన దేశాలకు విదేశీ నిధుల రాక తగ్గుతుంది. 2014లో మంచి లాభాలను అందించిన ఈక్విటీలు 2015లో మాత్రం నష్టాలనిచ్చాయి. మార్చిలో నమోదు చేసిన గరిష్ట స్థాయి నుంచి ఇప్పటి వరకు సుమారు 20 శాతం నష్టపోయాయి. మరో పక్క బంగారం ధరలూ కనిష్ట స్థాయి వద్ద పరిమిత శ్రేణిలో కదులుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టడానికి ఏ పథకాలు అనువుగా ఉంటాయో ఒకసారి చూద్దాం.... * రెండు మూడేళ్ల దీర్ఘకాలానికే ఇన్వెస్ట్ చేయాలి * స్వల్పకాలానికైతే బంగారం; రియల్టీ కూడా వద్దు ఆకర్షణీయంగా డెట్ ఫండ్స్.. వడ్డీరేట్లు తగ్గుతున్నప్పుడు డెట్ ఫండ్స్ మంచి రాబడులనిస్తాయి. ఎందుకంటే బాండ్ రేట్లు వడ్డీరేట్ల కదలికలకు వ్యతిరేక దిశలో కదులుతాయి. కాబట్టి వడ్డీరేట్లు తగ్గుతుంటే బాండ్ రేట్లు పెరగడం ద్వారా అధిక రాబడిని పొందవచ్చు. చేతిలో నగదు ఉండి ప్రతి నెలా క్రమం తప్పకుండా ఆదాయం కావాలనుకునే వారు మంత్లీ ఇన్కమ్ ప్లాన్స్ కేసి చూడొచ్చు. అంతేకాదు అధికాదాయ పన్ను శ్లాబులో ఉన్న వారికి డెట్ ఫండ్స్ ఒక చక్కటి ఇన్వెస్ట్మెంట్ సాధనంగా చెప్పొచ్చు. ఇన్వెస్ట్ చేసిన 36 నెలల తర్వాత వైదొలిగితే ఇండక్సేషన్ లేకుండా 10 శాతం, ఇండక్సేషన్ పరిగణనలోకి తీసుకుంటే 20 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. మెరుపు తగ్గిన బంగారం.. 2008-2012 మధ్యకాలంలో బాగా మెరిసిన బంగారం.. గత కొన్నేళ్లుగా వెలవెలపోతోంది. విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు, దేశాల మధ్య యుద్ధ వాతావరణాలు వచ్చిన సందర్భాల్లో బంగారంలో పెట్టుబడులను సురక్షితమైనవిగా భావిస్తారు. ఈ విధంగా ఆలోచించి కొంత మొత్తం బంగారంలో కేటాయించవచ్చు. బంగారంలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి గోల్డ్ బాండ్స్ ఒక చక్కటి సాధనం. 2.75 శాతం వడ్డీ వస్తోంది. కానీ బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందన్న విషయం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి... స్వల్ప కాలానికి నో ‘రియల్’ ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందించిన పెట్టుబడి సాధనాల్లో రియల్ ఎస్టేట్ ఒకటి. 2004-13 మధ్య కాలంలో దేశీయ రియల్ ఎస్టేట్ రంగం మంచి లాభాలను అందించింది. కానీ రియల్ ఎస్టేట్ అనేది ఒక నిర్దిష్టమైన పెట్టుబడి పథకం కాదు. మీరు కొనే ప్రాంతం.. అక్కడి పరిస్థితులను బట్టి రేటు మారుతుంటుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై రాబడి అనేది ఒకే విధంగా ఉండదు. దీర్ఘకాలంలో మంచి రాబడులను అందించే సాధనాల్లో రియల్ ఎస్టేట్ ఒకటిగా చెప్పుకోవచ్చు. స్వల్ప కాలానికి అంత ఆకర్షణీయంగా లేదు. ప్రస్తుత పరిస్థితే కొనసాగుతుంది. ఒడిదుడుకులుంటాయి.. ప్రస్తుత మార్కెట్లు చాలా బలహీనంగా, బేరిష్‌గా ఉన్నాయి. కానీ మా అంచనా ప్రకారం మార్కెట్ల పతనం చివరి దశకు వచ్చింది. ప్రస్తుత స్థాయి నుంచి జరిగితే మరో 5 శాతం పతనం కావచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు కుదుట పడితే తిరిగి మార్కెట్లు ర్యాలీ చేయడం ప్రారంభిస్తాయి. జీఎస్టీ బిల్లును ప్రభుత్వం ఆమోదింప చేయలేనప్పటికీ మిగిలిన సంస్కరణల విషయంలో సరైన దారిలోనే వెళుతోంది. బొగ్గు, స్పెక్ట్రమ్ వేలం, డిస్కంల రుణ సమస్యలు పరిష్కరించడం వంటి విషయాల్లో సంస్కరణలు చేపట్టింది. ఇన్ఫ్రా ప్రాజెక్టులకు భారీ కేటాయింపులు చేస్తోంది. వచ్చే బడ్జెట్లో మరిన్ని సంస్కరణలను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. 2016 సంగతి ఎలా ఉన్నా... దీర్ఘకాలంలో లాభాలుంటాయి. రెండు మూడేళ్ల దృష్టిలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టొచ్చు. సిస్టమాటిక్ విధానంలో మ్యూచువల్ ఫండ్ మార్గంలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. - వి.కె.విజయకుమార్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్, జియోజిత్ బీఎన్పీ పారిబాస్ -
లక్షలు పెట్టకుండానే.. లక్ష్యాన్ని చేరుకుంటాం!
ఉమన్ ఫైనాన్స్ ఈ రోజుల్లో చాలామంది మహిళలు రిజిస్ట్రేషన్ లేని చిట్టీలు కట్టి మోసపోతున్నారు. అలాగే మరికొంతమంది కిట్టీ పార్టీలు పెట్టుకొని ఆ డబ్బుతో బంగారం/ వెండి కొంటున్నారు. ఇంకొంతమంది నెల నెలా మిగులు డబ్బును పోపు డబ్బాలలో దాస్తున్నారు. దీని వలన ఆ డబ్బుకు వడ్డీ ఏమీ రావడం లేదు. ఇలాంటి వారికి మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ఒక చక్కటి మార్గం. మ్యూచువల్ ఫండ్స్ చిన్న మొత్తాలను సేకరించి వివిధ రకాల పెట్టుబడి (ఈక్విటీ, డెట్) మార్గాలలో పెట్టుబడి పెడతారు. వీటిని ఫండ్ మేనేజర్స్ పరిశీలిస్తూ ఉంటారు. వీటిలో ఎప్పుడు మీ దగ్గర డబ్బు మిగిలితే అప్పుడు పెట్టుబడి పెట్టవచ్చు. లేదా నెల నెలా క్రమం తప్పకుండా ఒక నిర్ణీత మొత్తాన్ని సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ-సిప్)లో పెట్టుబడి పెట్టవచ్చు. వీటిలో ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ (ఈఎల్ఎస్ఎస్) ట్యాక్స్ బెనిఫిట్స్‌ని కూడా అందిస్తాయి.మీరు పెట్టుబడి పెట్టిన స్కీమ్ లాక్ ఇన్ పీరియడ్ లేదా ట్యాక్స్ సేవింగ్ స్కీమ్ కాకపోతే మీ డబ్బును ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. ఇప్పుడు చాలావరకు ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి.వీటిలో రాబడి అనేది మార్కెట్ రిస్క్ మీద ఆధారపడి ఉంటుంది. వీటిలో దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడి పెడితే ఆ లక్ష్యాలను చేరుకోవచ్చు. మీ పిల్లల పైచదువులకు, పెళ్లిళ్లకు, రిటైర్మెంట్ తదితర అవసరాలకు. ఈ కింద తెలిపిన జాగ్రత్తలను తప్పక తీసుకోండిముందు చిన్న మొత్తంతో సిప్‌లో మొదలుపెట్టి ఆ తరువాత క్రమేణా మీ లక్ష్యానికి అనుగుణంగా పెంచుకుంటూ పోండి.{పతి నెలా క్రమం తప్పకుండా ఇది కూడా ఒక అత్యవసర ఖర్చు అనుకొని, సిప్‌లో జమ చేయండి. ఎన్ని సంవత్సరాలకు అనుకొని పెట్టుబడి మొదలుపెట్టారో అన్ని సంవత్సరాలు పెట్టుబడి పెట్టండి. మీ లక్ష్యానికి అవసరమైనప్పుడు అవసరానికి తగినంత సొమ్మును మాత్రమే వెనక్కి తీసుకొని మిగిలిన సొమ్మును ఫండ్‌లోనే ఉంచండి. నెల నెలా ఒక 1000 రూపాయలు ఒక మంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో సిప్ పద్ధతిలో పెట్టుబడి పెడితే రాబడి ఎలా ఉంటుందో ఈ పట్టికలో చూద్దాము. గడచిన 34 సంవత్సరాలలో ఈక్విటీలో పెట్టుబడిని గమనిస్తే వార్షికంగా 17 నుండి 18శాతం రాబడిని అందించాయి. నెలకు ఒక 1000 రూపాయలను సిప్‌లో పెట్టుబడి పెడితే 18 శాతం చొప్పున 30 సంవత్సరాలకు 1 కోటి 40 లక్షల సంపదను పొందుతూ ఉంటే అలాంటి చిన్న మొత్తాలను మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టలేమా! మ్యూచువల్ ఫండ్స్ స్కీమును ఎంపిక చేసుకొనేటప్పుడు ఆ మ్యూచువల్ ఫండ్ సంస్థ, యాజమాన్యం, వారి పనితీరు, ఆ స్కీము గడచిన 5, 10, అంతకుమించిన కాలాలకు ఏ విధమైన రాబడులను అందించిందో అలాగే భవిష్యత్తు పనితీరును కూడా పరిగణనలోకి తీసుకొని మీ అవసరాలను బట్టి ఒక 2, 3 స్కీములలో పెట్టుబడిని కొనసాగించవచ్చు. అలాగే 6 నెలలకు, సంవత్సరానికి లేదా కాలానుగుణంగా మీ స్కీము పనితీరును గమనిస్తూ అవసరమైన నిర్ణయాలు తీసుకొనవలసి ఉంటుంది. కనుక సాధ్యమైనంత వరకు మీ ఖర్చులను తగ్గించుకుని పొదుపు చేయడమే కాకుండా ఆ డబ్బును మ్యూచువల్ఫండ్స్లో ఒక క్రమ పద్ధతిలో సిప్‌లో పెట్టుబడి పెట్టి మీ దీర్ఘకాలిక లక్ష్యాలను నెరవేర్చుకోండి. రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’ -
డెరైక్ట్, రెగ్యులర్ ప్లాన్లలో ఏది బెటరు..?
నేను ప్రైవేట్‌రంగంలో పనిచేస్తున్నాను. నా నెల జీతం రూ.25,000. నెలకు రూ.5,000-8,000 వరకూ ఇన్వెస్ట్ చేయగలను. 15 ఏళ్ల తర్వాత రూ.50-60 లక్షల నిధిని ఏర్పాటు చేసుకోవడం నా లక్ష్యం. ఈ లక్ష్య సాధన కోసం ఏ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటారు ? - ఖాదర్, హైదరాబాద్ నెలకు రూ.5,000-8,000 చొప్పున 15 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేస్తే, 12 శాతం వార్షిక రాబడుల చొప్పున మీరు రూ.25-40 లక్షల నిధిని ఏర్పాటు చేసుకోగలుగుతారు. మీరు దీర్ఘకాలం(15 ఏళ్లపాటు) ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తే బావుంటుంది. దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్ చేస్తే ఈక్విటీలు ఇచ్చినంత స్థాయిలో రాబడులను మరే ఇన్వెస్ట్మెంట్ సాధనం ఇవ్వలేదు. మంచి రేటింగ్ ఉన్న డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకొని వాటిల్లో ఇన్వెస్ట్ చేయండి. మీ జీతం పెరిగినప్పుడల్లా మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని పెంచండి. ఇలా చేయడం వల్ల మీరు కావాలనుకుంటున్న నిధిని సులభంగా, త్వరగా ఏర్పాటు చేసుకోగలుగుతారు. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఈ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు... బిర్లా సన్‌లైఫ్ ఫ్రంట్‌లైన్ ఈక్విటీ, బీఎన్పీ పారిబా డివిడెండ్ ఈల్డ్ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూ చిప్ ఫండ్, హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్ ఫండ్, మిరా అసెట్ ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్, టాటా ఇథికల్ ఫండ్. ఏదైనా మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌కు సంబంధించి డెరైక్ట్, రెగ్యులర్ ప్లాన్ల ఎక్స్పెన్స్ రేషియోలో చాలా తేడా ఉంటోంది. ఉదాహరణకు ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్ రెగ్యులర్ ప్లాన్ ఎక్స్పెన్స్ రేషియో 2.31 శాతంగా ఉండగా, అదే ఫండ్ డెరైక్ట్ ప్లాన్ ఎక్స్పెన్స్ రేషియో 0.82 శాతంగా ఉంది. ఈ రెండు ప్లాన్ల మధ్య తేడా 1.49 శాతం. చక్రగతి వృద్ధిని పరిగణనలోకి తీసుకుంటే, తేడా దీర్ఘకాలంలో చాలా ఎక్కువగా ఉంటుంది కదా ! అసలు డెరైక్ట్, రెగ్యులర్ ప్లాన్ల మధ్య ఎక్స్పెన్స్ రేషియో విషయంలో ఇంత భారీ వ్యత్యాసం ఎందుకు ఉంటుంది? - రఘురామ్, విజయవాడ మ్యూచువల్ ఫండ్ సంస్థలు 2013 నుంచి డెరైక్ట్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. ఈ డెరైక్ట్ ప్లాన్లలో ఇన్వెస్టర్లు నేరుగా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఫలితంగా కమీషన్లు, ప్రమోషన్ల వ్యయాలు ఆదా అవుతాయి. ఈ వ్యయాలేమీ లేనందున మ్యూచువల్ ఫండ్స్ రెగ్యులర్ ప్లాన్ల ఎక్స్పెన్స్ రేషియో కన్నా డెరైక్ట్ ప్లాన్ల ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంటుంది. అయితే ఇన్వెస్ట్‌మెంట్స్‌పై సొంతంగా రీసెర్చ్ చేసి, నిర్ణయాలు తీసుకోగలిగిన ఇన్వెస్టర్లు మాత్రమే డెరైక్ట్ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేయాలి. ఇలా కుదరని పక్షంలో రెగ్యులర్ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేయాలి. మరో రెండేళ్లలో రిటైరవుతున్నాను. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి, నెలవారీ పెన్షన్ రూ.50,000 వరకూ వస్తుంది. వైద్యపరంగా తగిన కవర్ ఉంటుంది. ఇతర ఖర్చుల కోసం నెలవారీ కొంత ఆదాయం కావాలి. దీని కోసం ఏయే స్కీముల్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తే బావుంటుంది? - శంకర్, ఆనంతపురం మీకు నెలవారీ రూ.50,000 వరకూ పెన్షన్ వస్తుంది. ఇక నెలకు ఎంత మొత్తం ఇతర ఖర్చుల కోసం కావాలో నిర్ణయించుకోండి. దాన్ని బట్టి ఎంత ఇన్వెస్ట్ చేయాలో తెలుస్తుంది. ఇక నెలవారీ ఆదాయం కోసం ప్రభుత్వ రంగ సంస్థల పన్ను రహిత బాండ్లు, సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్), పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇవి సురక్షిత ఇన్వెస్ట్మెంట్ సాధనాలు. పన్ను రహిత బాండ్లు మినహా మిగిలిన రెండు సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తే పన్నుపోటు తప్పదు. ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడాన్ని కూడా పరిశీలించవచ్చు. పన్ను అంశాల దృష్ట్యా వీటిని ఈక్విటీ ఫండ్స్ గానే పరిగణిస్తారు. వీటిల్లో మీ ఇన్వెస్ట్మెంట్లను ఏడాదికి పైగా కొనసాగిస్తే, ఎలాంటి పన్నులు చెల్లించక్కర్లేదు. మీరు ఎంత కాలం ఇన్వెస్ట్ చేయగలరు, మీరు భరించగలిగే రిస్క్, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఏ ఏ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయించుకోండి. నా దగ్గర ప్రస్తుతం రూ.2 లక్షలున్నాయి. వీటిని 15 రోజుల కోసం ఏదైనా లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. 15 రోజుల కాలానికి లిక్విడ్ ఫం డ్ నుంచి ఎంత రాబడులు వస్తాయి. మంచి లిక్విడ్ ఫండ్‌ను సూచించండి? - వెంకట్, ప్రొద్దుటూరు లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత రాబడులు వస్తాయనేది కచ్చితంగా చెప్పలేము. ఈ రాబడులు మార్కెట్ పనితీరును బట్టి ఉంటాయి. ఈ కేటగిరి ఫండ్స్ ట్రాక్ రికార్డ్‌ను పరిశీలిస్తే, ఈ ఫండ్స్ 8 శాతం వరకూ వార్షిక రాబడులను ఇస్తున్నాయి. గత ఏడు రోజుల్లో 7.3 శాతం, నెల రోజుల్లో 7.05 శాతం చొప్పున రాబడులనిచ్చాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) విధానంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పదేళ్లపాటు ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఐదేళ్ల తర్వాత పాక్షికంగా లాభాలను స్వీకరించవచ్చా? లేకుంటే పదేళ్ల వరకూ ఎలాంటి లాభాలు స్వీకరించకుండానే ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించమంటారా? అంతర్జాతీయంగా కానీ, దేశీయంగా కానీ ఏవైనా ఆర్థిక విపత్కర పరిస్థితులు తలెత్తితే, ఎలా? - శశాంక్, గుంటూరు ప్రస్తుత మార్కెట్ పరస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎప్పుడూ పెట్టుబడి వ్యూహాలను నిర్ణయించుకోకూడదు. మీ ఆర్థిక లక్ష్యాలను బట్టి పెట్టుబడి వ్యూహాలు ఉండాలి. మీ విషయం తీసుకుంటే, మీరు పదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఐదేళ్ల తర్వాత ఏదో జరుగుతుందన్న ఆందోళనను పక్కన పెట్టండి. దానికి బదులుగా క్రమం తప్పకుండా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మదింపు చేస్తూ ఉండండి. మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్ పనితీరు అదే కేటగిరిలోని ఇతర ఫండ్స్‌తో పోల్చితే సరైన పనితీరు కనబరచకపోతే (ఏడాది కాలంలో) దానికి కారణమేమిటో శోధించండి. పనితీరు సరిగ్గా లేకపోతే మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వేరే ఫండ్స్‌లోకి మార్చండి. మీ ఇన్వెస్ట్మెంట్ కాలం పదేళ్లు కాబట్టి, ఎనిమిదేళ్లు, లేదా తొమ్మిదేళ్ల తర్వాత ఈ ఫండ్స్‌లోని ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బ్యాంక్ డిపాజిట్లు, లిక్విడ్ ఫండ్స్ తదితర సురక్షిత సాధనాల్లోకి మార్చుకోండి. ఇలా చేస్తే స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉంటే ఆ ప్రభావం మీ ఇన్వెస్ట్మెంట్లపై ఉండదు. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
75% వాటా తీసుకుందాం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్ఫ్రా కంపెనీ ఐవీఆర్‌సీఎల్‌కి ఇచ్చిన అప్పులు మొత్తాన్ని ఈక్వి టీగా మార్చుకోవాలని బ్యాంకులు నిర్ణయించినట్లు తెలిసింది. అన్ని బ్యాంకులూ కలసి దాదాపు రూ.7,350 కోట్లను ఐవీఆర్‌సీఎల్‌కు రుణాలుగా ఇచ్చాయి. ఈ మొత్తాన్ని ఈక్విటీగా మార్చుకోవటం ద్వారా, తమ ఖాతా పుస్తకాల నుంచి ఈ కంపెనీకి సంబంధించి ఎన్పీఏలు ఏమీ లేకుండా చూసుకోవాలని ఈ మధ్యనే జరిగిన సీనియర్ లెండర్స్ సమావేశంలో బ్యాంకులు ప్రాధమికంగా నిర్ణయించినట్లు తెలియవచ్చింది. డిసెంబర్ 19న జరిగే బోర్డు సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. బ్యాంకులు దీన్ని ఈక్విటీగా మార్చుకున్నట్లయితే వాటి ఖాతా పుస్తకాల్లో ఇది ఇక ఎన్పీఏగా కనపడదు. దీంతో సాంకేతికంగా ఎన్పీఏలను తగ్గించుకున్నట్లుగా చూపించే అవకాశం ఉంటుంది. నిజానికి ఐవీఆర్‌సీఎల్‌లో స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చరింగ్ (ఎస్డీఆర్) నవంబర్ 26 నుంచి అమల్లోకి వచ్చినట్లు బ్యాంకులు ఇప్పటికే ప్రకటించాయి. ఎస్బీఐ నేతృత్వంలో అప్పులిచ్చిన బ్యాంకులన్నీ కలిసి ఎస్డీఆర్ను అమలు చే యనున్నాయి. తదుపరి కార్యాచరణలో భాగంగా అప్పులు, వడ్డీని ఈక్విటీగా మార్చుకుంటున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఐవీఆర్‌సీఎల్‌లో బ్యాంకుల వాటా ఇప్పటికే 49%కి చేరింది. మొత్తం అప్పుల్ని ఈక్విటీగా మార్చుకుంటే ఇది 75% దాటుతుందని అంచనా. ఇదే సమయంలో ప్రమోటర్ల వాటా 8.28% నుంచి 5% దిగువకు పడిపోతుందని అంచనా. కాగా కంపెనీలో మెజారిటీ వాటా బ్యాంకులు చేతికి వెళ్ళినా పాత యాజమాన్యాన్నే కొనసాగిస్తారన్న నమ్మకాన్ని ఐవీఆర్సీఎల్ చైర్మన్ ఇ.సుధీర్ రెడ్డి వ్యక్తం చేశారు. ఎస్డీఆర్ అమలుతో కంపెనీ పనితీరు మెరుగవుతుందని, ప్రాజెక్టుల నిర్వహణకు నిధుల కొరత తీరుతుందని చెప్పారు. -
సెక్టార్ ఫండ్స్‌లో పెట్టుబడులు వద్దు
పూర్తిగా ఫార్మా షేర్ల పోర్ట్‌ఫోలియోతో కూడిన ఫార్మా మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నాలుగు నుంచి ఐదేళ్ల కాలానికి ఇలా ఇన్వెస్ట్ చేసి, వచ్చిన ఆ డబ్బులను నా కూతురు ఉన్నత విద్యాభ్యాసానికి వినియోగించాలనేది నా ఆలోచన. తగిన సలహా ఇవ్వండి? -సాంబశివ, వరంగల్ సెక్టార్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైన ఇన్వెస్ట్మెంట్ విధానం కాదని నా అభిప్రాయం. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రంగం షేర్లు మంచి పనితీరు కనబరుస్తాయి. అయితే ఆ రంగం పనితీరు బాగా ఉన్నా లేకున్నా సదరు సెక్టార్ ఫండ్ మేనేజర్ అదే రంగంలోని షేర్లలోనే ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి మొత్తం మీద మీకు వచ్చే రాబడులు అంతంతమాత్రంగానే ఉంటాయని చెప్పవచ్చు. అందుకని మీరు భరించగలిగే రిస్క్, మీ పెట్టుబడుల కాలపరిమితిని పరిగణనలోకి తీసుకొని ఏదైనా డైవర్సిఫైడ్ ఫండ్‌ను ఎంచుకొని ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ మీరు ఐదేళ్లకు మించి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి మంచి రాబడులు పొందవచ్చు. ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో నాలుగేళ్ల పాటు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)లో ఇన్వెస్ట్ చేశాను. నాలుగేళ్ల తర్వాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏడాది పాటు సిప్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ ఫండ్ నుంచి నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవాలనుకుంటున్నాను. నేను ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా? - రాజేశ్, కాకినాడ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని ఏడాది తర్వాత ఉపసంహరించుకుంటే ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. మీరు నాలుగేళ్ల పాటు సిప్ విధానంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి, ఏడాది తర్వాత ఆ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకున్నారు. కాబట్టి మీపై ఎలాంటి మూలధన లాభాల పన్ను భారం ఉండదు. చివరి సిప్ ఇన్స్టాల్మెంట్ ఏడాది పూర్తయితేనే ఇది వర్తిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఆదాయపు పన్ను ఆదా చేసుకోవచ్చని నా మిత్రుడొకరు చెప్తున్నారు. రకరకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కదా ! ఏ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసినా పన్ను రాయితీలు లభిస్తాయా? లేకుంటే ప్రత్యేకమైన మ్యూచువల్ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తే పన్ను రాయితీలు వస్తాయా? వివరించండి. - భాస్కర్, కరీంనగర్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్ఎస్ఎస్), లేదా ట్యాక్స్ ప్లానింగ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ ప్రకారం రూ.1.5 లక్షల వరకూ పన్ను మినహాయింపులు పొందవచ్చు. నేను కొన్ని డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశాను. అయితే ఈ డెట్ ఫండ్స్ ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదు. ఇటీవల వడ్డీరేట్లు తగ్గుతున్న నేపథ్యంలో డెట్ ఫండ్స్ రాబడులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది. ఈ ఇన్వెస్ట్మెంట్స్ సురక్షింగానే ఉంటాయా? -వెంకట్, తిరుపతి మీ డెట్ ఫండ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మీరు ఇవ్వలేదు. అందుకని డెట్ ఫండ్స్‌కు సంబంధించి సాధారణ అంశాలను వివరిస్తారు. రేట్ల కోత డెట్ ఫండ్స్‌కు ప్రయోజనకరమే. దీర్ఘకాలిక డెట్ స్కీమ్‌లకు రేట్ల కోత ఎంతో మేలు చేస్తుంది. రేట్లను తగ్గించిన ప్రతిసారి ఈ స్కీమ్‌లు ఎన్ఏవీ పెరుగుతూ ఉంటుంది. డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్స్ పూర్తిగా సురక్షితమైనవని చెప్పలేం. డెట్ ఫండ్స్ పనితీరు డెట్ మార్కెట్ పనితీరుతో అనుసంధానమై ఉంటుంది. అయితే ఇవి సాపేక్షకంగా సురక్షితమైనవని చెప్పవచ్చు. ఫ్రాంక్లిన్ ఇండియా హై గ్రోత్ కంపెనీస్ ఫండ్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఏడు నెలలుగా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇప్పటివరకైతే ఇవి మంచి రాబడులను ఇవ్వలేదు. ఇన్వెస్ట్మెంట్స్ ఆపేసి నా డబ్బులు వెనక్కి తీసుకుందామనుకుంటున్నాను. అలా చేయమంటారా? లేక సిప్‌ను కొనసాగించమంటారా? - ప్రియ, సికింద్రాబాద్ స్వల్పకాలిక పనితీరు ఆధారంగా నిర్ణయాలు తీసుకోకూడదు. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అది సరైన పెట్టుబడి వ్యూహం కాదు. ఇక ఫ్రాంక్లిన్ ఇండియా హై గ్రోత్ కంపెనీస్ ఫండ్ అనేది ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న మల్టీ క్యాప్ స్కీమ్. మూడు, ఐదేళ్ల కాలానికి ఈ విభాగానికి చెందిన మ్యూచువల్ ఫండ్స్‌లో మంచి పనితీరు కనబరిచిన ఫండ్ ఇదే. ఈ ఫండ్ ట్రాక్ రికార్డ్ కూడా చాలా బాగుంది. మంచి రాబడులు ఇవ్వగలిగిన సత్తా కూడా ఈ ఫండ్‌కు ఉంది. ఎలాంటి ఆందోళన, సందేహాలు, అనుమానాలు లేకుండా ఈ ఫండ్‌లో సిప్‌ను కొనసాగించండి. -
బ్యాలెన్స్ సరే... మరి రీబ్యాలెన్సో?
* పోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్స్ అత్యవసరం * అలాగైతేనే పొందిన లాభాలు చేతికొస్తాయ్ ఇంటిని చూసి ఇల్లాలి గురించి చెప్పొచ్చంటారు. అలాగే పోర్టుఫోలియో చూసి కూడా సదరు ఇన్వెస్టర్ తెలివైన వాడా? కాదా అని చెప్పొచ్చు. పోర్ట్‌ఫోలియో ఎల్లప్పుడు డైవర్సిఫైడ్‌గా ఉండాలి. రిస్క్ అధికంగా ఉండే ఈక్విటీతో పాటు తక్కువ రిస్క్ ఉండే డెట్ సాధనాల్లో కూడా ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. ఇలా చేస్తే మీ పోర్ట్‌ఫోలియో చాలా బలంగా ఉన్నట్లు అర్థం. ఒకదానిలో నష్టం వచ్చినా... ఇంకొక దానిలో లాభం వస్తే వచ్చిన నష్టం సమానం అవుతుంది. అప్పుడు రిస్క్ బ్యాలెన్స్ అవుతుంది. ఫోర్ట్‌ఫోలియోను డైవర్సిఫైడ్‌గా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో... దాన్ని రీ బ్యాలెన్స్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇది ఎలాగో చూద్దాం.. పోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్స్ అంటే? పోర్ట్‌ఫోలియోను బ్యాలెన్స్డ్గా ఎలా ఉంచుకుంటామో... అలాగే దాన్ని నిర్ణీత సమయాల్లో క్రమబద్ధంగా రీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాలి. ఎందుకంటే ఒక వ్యక్తి పోర్ట్‌ఫోలియో, ఫండ్స్ విలువ ఎప్పుడూ ఒకేలా ఉండవు. మారుతూ ఉంటాయి. వాటికి అనుగుణంగా అసెట్స్ కేటాయింపులు కూడా మారుస్తూ ఉండాలి. దీన్నే ఫోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్స్గా పేర్కొంటారు. సాధారణంగా ఇన్వెస్టర్లు మార్కెట్లు పెరుగుతున్నపుడు వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి, పతనమవుతున్నప్పుడు వాటి నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ రీ-బ్యాలెన్స్ విధానంలో మార్కెట్లు పడుతున్నప్పుడు అందులో ఇన్వెస్ట్‌చేసి... పెరుగుతున్నప్పుడు లాభాలు పొంది బయటకు వస్తారు. పోర్ట్‌ఫోలియోలోని స్టాక్స్ కొన్ని పెరగవచ్చు... అలాగే కొన్ని తగ్గొచ్చు. పెరిగిన స్టాక్స్ అలాగే పెరుగుతూ వె ళ్తాయని చెప్పలేం. అవి కూడా కొంత పెరిగిన తర్వాత తగ్గొచ్చు. ఇలా స్టాక్స్ పెరిగి మళ్లీ తగ్గితే మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే పోర్ట్‌ఫోలియోను రీబ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాలి. పరిస్థితులకు అనుగుణంగా ఈక్విటీ, డెట్‌లకు కేటాయించిన ఇన్వెస్ట్మెంట్లను మార్చుకుంటూ వెళ్లాలి. ఉదాహరణకు 2008లో ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఈక్విటీ మార్కెట్ పతనమైంది. ఇలాంటి సమయాల్లో అందరి పోర్ట్‌ఫోలియోలో డెట్‌పై ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువగా, ఈక్విటీపై తక్కువగా ఉంటాయి. కానీ రీ బ్యాలెన్స్ విషయానికి వస్తే.. ఈక్విటీ పైనే ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. ఈక్విటీ మార్కెట్ పతనమైనప్పుడు స్టాక్స్ తక్కువ ధరల వద్ద ఉంటాయి. అప్పుడు స్టాక్స్ కొంటే అవి వాటి అసలు ధర వద్ద మనకు లభిస్తాయి. అలాగే 2013లో మార్కెట్లు మందగమనంలో ఉన్నాయి. ఇలా స్టాక్ మార్కెట్ పతనమైనప్పుడు స్టాక్స్ కొనడం వల్ల ఈక్విటీ అసెట్స్‌ను బాగా పెంచుకోవచ్చు. ఈ విధంగా తక్కువ ధరల వద్ద కొన్న స్టాక్స్ తర్వాతి కాలంలో బాగా పెరిగే అవకాశం ఉంది. అప్పుడు మీ స్టాక్స్‌ను విక్రయించి లాభాలను పొందొచ్చు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ సంస్థ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ (సిప్) ఫోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్స్ లక్ష్యంగా బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్‌ను అందిస్తోంది. పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మారాలి... పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మారుతూ ఉంటాయి. అప్పుడు మీరు కూడా మీ ఇన్వెస్ట్మెంట్ వ్యూహాలను మార్చుకోవాలి. ఉదాహరణకు మీరు మీ మిగులు సంపదను ఈక్విటీపై 70 శాతం, డెట్ సాధనాలపై 30 శాతం ఇన్వెస్ట్ చేద్దాం అని అనుకున్నారు. కానీ అప్పుడు ఈక్విటీ మార్కెట్ బాగా ఊపుమీద ఉంది. అలాంటప్పుడు మీరు ఈక్విటీపై 70 శాతం ఇన్వెస్ట్‌మెంట్‌ను 80 శాతానికి పెంచుకోవచ్చు. డెట్ సాధనాలపై ఇన్వెస్ట్‌మెంట్‌ను 20 శాతానికి తగ్గించుకోవచ్చు. ఈక్విటీపై లాభాలను పొందిన తర్వాత తిరిగి మీ ఇన్వెస్ట్మెంట్లను ఈక్విటీపై 70 శాతంగా, డెట్‌పై 30 శాతంగా ఉంచుకోవచ్చు. ఇదే రీబ్యాలెన్స్ వ్యూహం. రీబ్యాలెన్స్ సులువే కానీ.. రీబ్యాలెన్స్ వ్యూహం సులభంగానే కనిపిస్తుంది. కానీ దీనికి క్రమశిక్షణ కావాలి. అనుకున్న వ్యూహాలను అమలు చేయడానికి సరైన సమయం కావాలి. ఈక్విటీ మార్కెట్ ఎప్పుడు పతనమౌతుందో తెలియదు. స్టాక్స్ ధరలు ఎప్పుడు తక్కువ స్థాయిలో ఉంటాయో ట్రాక్ చేయడం కష్టం. ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఎంట్రీ ఇవ్వడం సులువైన పనికాదు. అలాగే ప్రాఫిట్స్ను బుక్ చేసుకోవడంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. - నిమేష్ షా సీఈఓ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ -
ఎందులో ఇన్వెస్ట్ చేద్దాం
ప్రతి ఒక్కరికి కొన్ని ఆర్థిక లక్ష్యాలు ఉంటాయి. వాటికి అనుగుణంగా వారు కొన్ని ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఇలా ఇన్వెస్ట్ చేసే సమయంలోనే అసలు సమస్య ప్రారంభమౌతుంది. దేనిలో ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడ పెట్టుబడి పెడితే మన డబ్బుకు రక్షణతోపాటు రాబడి లభిస్తుంది? వంటి అనేక ప్రశ్నలు మన మనసులో ఘర్షణకు తెరలేపుతాయి. అలాంటి వారి సందేహాలను నివృత్తి చేయడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం. పెట్టుబడి పెట్టే సమయంలో సాధారణంగా చాలా మంది ఈక్విటీ, గోల్డ్, రియల్ ఎస్టేట్ వంటి మూడు ఇన్వెస్ట్మెంట్ సాధనాలు పరిగణనలోకి తీసుకుంటారు. ఈ మూడింటిలో ఒక్కో దానికి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే రిస్కులు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని, మీ అవసరాలకు అనుగుణంగా ఇన్వెస్ట్ చేసుకోండి. 1980-2014 మధ్యకాలంలో బంగారం 11 శాతం రాబడిని, ఈక్విటీ మార్కెట్ 17 శాతం రాబడిని అందించాయి. ఇన్వెస్టర్లు గత రెండు దశాబ్దాల కాలంలో రియల్టీ ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం వల్ల 20% మేర రాబడిని పొందారు. * రిస్క్‌తోపాటు అధిక రాబడికి కేరాఫ్ ఈక్విటీ * రియల్ ఎస్టేట్‌తో లిక్విడిటీ సమస్య * పసిడి పెట్టుబడులకు పన్ను రాయితీలు నిల్ ఈక్విటీ ప్రయోజనాలు ♦నేరుగా షేర్లలో లేదా మ్యూచువల్ ఫండ్స్ మొదలైన వాటి ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. ♦మిగతా సాధనాలతో పోలిస్తే అధిక రాబడులు వచ్చే అవకాశం. ♦లిక్విడిటీ సౌకర్యం ఉంటుంది. ♦చాలా తక్కువ మొత్తంతో ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించవచ్చు. ♦షేర్లపై అంతగా అవగాహన లేనప్పుడు ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇవి ప్రొఫెషనల్స్ పర్యవేక్షణలో ఉంటాయి కనుక రిస్కులు కొంత మేర తగ్గొచ్చు. ♦పన్ను తదనంతర రాబడి ఆకర్షణీయంగా ఉంటుంది. ♦దీర్ఘకాల పెట్టుబడులకు పన్ను మినహాయింపులు వర్తిస్తాయి. ప్రతికూలతలు ♦రిస్క్ అధికంగా ఉంటుంది. ♦స్వల్ప కాలంలో అధిక ఒడిదుడుకులు ఎదుర్కోవాలి. ♦మంచి స్టాక్స్‌ను ఎంచుకోవడం కొంత కష్టం. బంగారం పయోజనాలు ♦భౌతిక బంగారంపై పెట్టుబడి పెట్టడం సులభం. ♦దీర్ఘకాలంలో ఇన్వెస్ట్మెంట్ వల్ల అధిక రాబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ♦బంగారాన్ని ఆభరణాలు, ఇతర రూపాల్లోకి మార్చుకోవచ్చు. ♦అవసరమైన సందర్భాల్లో బంగారంపై సులభంగా రుణాలు పొందొచ్చు. ♦ ప్రస్తుతం భౌతిక రూపంలో కాకుండా ఎలక్ట్రానిక్ విధానంలో.. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) ద్వారా కూడా బంగారంలో ఇన్వెస్ట్ చేసే వీలుంది. పయోజనాలు ♦భౌతిక బంగారంపై పెట్టుబడి పెట్టడం సులభం. ♦దీర్ఘకాలంలో ఇన్వెస్ట్మెంట్ వల్ల అధిక రాబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ♦బంగారాన్ని ఆభరణాలు, ఇతర రూపాల్లోకి మార్చుకోవచ్చు. ♦అవసరమైన సందర్భాల్లో బంగారంపై సులభంగా రుణాలు పొందొచ్చు. ♦ ప్రస్తుతం భౌతిక రూపంలో కాకుండా ఎలక్ట్రానిక్ విధానంలో.. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) ద్వారా కూడా బంగారంలో ఇన్వెస్ట్ చేసే వీలుంది. రియల్టీ ప్రయోజనాలు ♦తక్కువ అస్థిరత, మార్కెట్ ధరలు క్రమంగా పెరుగుతుండటం వంటి అంశాల కారణంగా ఇన్వెస్ట్‌మెంట్‌కు స్థిరత్వాన్ని తీసుకువస్తాయి. ♦పునరుద్ధరణ, మరమ్మత్తుల వల్ల ఇన్వెస్ట్మెంట్ విలువ పెరుగుతుంది. ♦అద్దెకు ఇచ్చిన పక్షంలో నిరంతర ఆదాయానికి అవకాశం ఉంది. ♦అవసరమైన పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్‌పై సులభతరంగా రుణాలు పొందగలిగే వెసులుబాటు. ప్రతికూలతలు ♦ స్టాంపు సుంకం, రిజిస్ట్రేషన్ ఫీజులు మొదలైన వాటి కారణంగా ట్రాన్సాక్షన్ వ్యయాలు అధికంగా ఉంటాయి. ♦ఇన్వెస్ట్‌మెంట్‌కు అధిక మొత్తంలో డబ్బు అవసరం. ♦ఇందులో నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉంటుంది. ♦ప్రాపర్టీ విక్రయాలు వెంటనే జరగవు. కాబట్టి లిక్విడిటీ ♦తక్కువగా ఉంటుంది. -
మార్కెట్ పడుతోంది.. ఇప్పుడేం చేయాలి?
ఇటీవల స్టాక్ మార్కెట్ పతనమవుతోంది. మార్కెట్ పడిపోతున్నప్పుడే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలని కొందరంటున్నారు. ఎంత వరకూ పడుతుందో చెప్పలేం కాబట్టి, వేచి చూడమని మరికొందరంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక రిటైల్ ఇన్వెస్టర్‌గా మేం ఏమి చేయాలి? - కాత్యాయని, తిరుపతి, వంశీకృష్ణ, ఈ మెయిల్ మీరు క్రమం తప్పకుండా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు, మీరు ఇన్వెస్ట్ చేసే డబ్బులు మీకు 5-10 ఏళ్లపాటు అవసరం లేదనుకున్నప్పుడు.. స్టాక్ మార్కెట్ పతనమవుతున్న ఈ సందర్భం ఇన్వెస్ట్‌మెంట్స్‌కు మంచి అవకాశమని చెప్పవచ్చు. మీకు చౌక ధరలో మంచి షేర్లు లభిస్తాయి. మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మార్కెట్ పతన బాటలోనూ, మనకు డబ్బులు అవసరమైనప్పుడు మార్కెట్ ఉచ్ఛస్థాయిలోనూ ఉండాలనుకోవడం సగటు ఇన్వెస్టర్ కోరిక, దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేయాలనుకునేవాళ్లు ఈక్విటీల్లో తప్పక ఇన్వెస్ట్ చేయాల్సిందే. అయితే మార్కెట్ ఎంత వరకూ పతనమవుతుందనేది ఎవరూ ఊహించలేరు. ఇక మార్కెట్ పతనబాటలో ఉన్న ఈ పరిస్థితుల్లో ఒక రిటైల్ ఇన్వెస్టర్‌గా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మీరు యావరేజ్ చేయండి. మార్కెట్లు ఎప్పుడూ మీ నియంత్రణలో ఉండవు. మీ నియంత్రణలో ఉండేవి రెండే విషయాలు... మీరు ఎంత కాలం ఇన్వెస్ట్ చేస్తారు? ఎంత క్రమ శిక్షణతో ఇన్వెస్ట్ చేస్తారనే రెండు విషయాలే మీ నియంత్రణలో ఉంటాయి. మీరు నిర్దేశించుకున్న ఆర్థిక లక్ష్యం (ఇల్లు/కారు కొనడం, పిల్లల చదువులు.. తదితర లక్ష్యాలు) కోసం క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి.. అవసరమైనప్పుడు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను క్యాష్ చేసుకోండి. నేను ఐసీఐసీఐ, డీఎస్పీ సంస్థలకు సంబంధించి ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్(ఎఫ్ఎంపీ)లో ఇన్వెస్ట్ చేశాను. అవి ఈ నెలలోనే మెచ్యూర్ అవుతున్నాయి. వీటికి సంబంధించి పన్ను నిబంధనల్లో మార్పులు చేర్పులు జరిగాయని విన్నాం. నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఈ ఎఫ్ఎంపీల్లో కొనసాగించమంటారా? వీటిని రిడీమ్ చేసుకొని వేరే సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోమంటారా? - మహేశ్, కరీంనగర్ ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్(ఎఫ్ఎంపీ)లను పొడిగించుకునే అవకాశం ఇన్వెస్టర్లకు లేదు. మ్యూచువల్ ఫండ్ కంపెనీలు పాత ఎఫ్ఎంపీలను పొడిగించాలని ఆఫర్ చేస్తేనే మీరు వీటిని కొనసాగించగలుగుతారు. ఒక వేళ మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఈ ఎఫ్ఎంపీలను కొనసాగించాలని ఆఫర్ చేస్తే.., మీకు తక్షణం ఈ సొమ్ములు అవసరం లేనిపక్షంలో మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఈ ఎఫ్ఎంపీల్లోనే కొనసాగించండి. ఇక వీటికి సంబంధించి పన్ను విషయాల్లో కొన్ని మార్పులు, చేర్పులు జరిగాయి. ఎఫ్‌ఎంపీల నుంచి మూడేళ్లలోపు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకుంటే మీరు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఏ ట్యాక్స్ స్లాబ్ కిందకు వస్తారో, ఈ స్లాబ్‌కు సంబంధించి పన్ను రేటు మీకు వర్తిస్తుంది. ఐసీఐసీఐ ప్రు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, హెచ్‌డీఎఫ్‌సీలకు సంబంధించిన మంత్లీ ఇన్‌కం ప్లాన్(ఎంఐపీ) సంబంధించిన డివిడెండ్లపై ఏమైనా పన్నులు చెల్లించాలా? - క్రాంతి, గుంటూరు మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి మంత్లీ ఇన్‌కం ప్లాన్(ఎంఐపీ)ల డివిడెండ్లపై ఇన్వెస్టర్లు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పని లేదు. మ్యూచువల్ ఫండ్ సంస్థలే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) (ఇది ప్రస్తుతం 28.33 శాతంగా ఉంది) చెల్లించి మీకు డివిడెండ్లను అందజేస్తాయి. మీకు వచ్చే రాబడుల నుంచే ఈ డీడీటీని సదరు మ్యూచువల్ ఫండ్ సంస్థలు ప్రభుత్వానికి చెల్లిస్తాయి. గత మూడేళ్లుగా ఐడీఎఫ్సీ ప్రీమియర్ ఈక్విటీ ఫండ్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. అయితే ఇటీవల కాలంలో ఈ ఫండ్ పనితీరు సరిగ్గా లేదు. ఈ ఫండ్ నుంచి వేరే ఫండ్‌కు మారమంటారా? లేదా ఈ ఫండ్‌లోనే కొనసాగమంటారా? - కిరణ్, విజయవాడ ఐడీఎఫ్సీ ప్రీమియర్ ఈక్విటీ ఫండ్ నుంచి మీరు వైదొలగాల్సిన అవసరం లేదు. ఏడాది కాలానికి ఇది మంచి పనితీరునే కనబరిచింది. ఈ ఫండ్ ఐదు సంవత్సరాల ట్రాక్ రికార్డ్ కూడా ఈ కేటగిరీ ఇతర ఫండ్ల కంటే కూడా చాలా మెరుగ్గా ఉంది. మేం ఈ ఫండ్‌కు 4 స్టార్ రేటింగ్ ఇచ్చాం. ఒక ఏడాది పనితీరు బాగాలేదన్న కారణంతో ఈ ఫండ్ నుంచి వైదొలగడం సరికాదు. స్వల్పకాలాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ తరహా ఫండ్ల పనితీరుపై నిర్ణయం తీసుకోవడం సరైనది కాదు. -
వైజాగ్ స్టీల్ ఐపీవోకి సెబీ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ - ఆర్ఐఎన్ఎల్ (వైజాగ్ స్టీల్) ప్రతిపాదిత ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదముద్ర వేసింది. ఇందుకు సంబంధించిన ప్రాస్పెక్టస్‌ను వైజాగ్ స్టీల్ సెప్టెంబర్‌లో సమర్పించింది. దీనికి ఈ నెల 22న సెబీ తుది క్లియరెన్స్ ఇచ్చింది. ప్రతిపాదిత ఐపీవో కింద 48,89,84,620 షేర్లను ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో విక్రయించనుంది. ఇందులో 35 శాతం షేర్లను రిటైల్ ఇన్వెస్టర్లకు, 50 శాతం అర్హత పొందిన సంస్థాగత ఇన్వెస్టర్లకు ఉద్దేశించారు. రిటైల్ ఇన్వెస్టర్లకు ఆఫర్ ధరపై అయిదు శాతం దాకా డిస్కౌంటు లభిస్తుంది. వైజాగ్ స్టీల్ దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్ ప్రకారం ప్రభుత్వం 10 శాతం వాటాలు విక్రయించనుంది. యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా, డాయిష్ ఈక్విటీస్ (ఇండియా) ఈ ఇష్యూని నిర్వహిస్తాయి. వాస్తవానికి 2014-15లోనే ఐపీవో రావాల్సి ఉన్నప్పటికీ పలు అవాంతరాలు ఎదురయ్యాయి. ఇటీవలి హుద్‌హుద్ తుపాను తాకిడితో వాటిల్లిన నష్టాన్ని పూర్తిగా అంచనా వేసిన తర్వాత ఐపీవో తేదీలపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అధికారి ఒకరు తెలిపారు. హుద్‌హుద్ తుపాను తాకిడి కారణంగా వైజాగ్ స్టీల్ లాభదాయకత రూ. 350 కోట్ల మేర దెబ్బ తిని ఉంటుందని ప్రాథమిక అంచనా. -
భారతీయుల సంపద.. 257 లక్షల కోట్లు
వ్యక్తిగత సంపద విలువ 5 ఏళ్లలో 84% వృద్ధి.. ⇒గతేడాదితో పోలిస్తే 27% అప్ ⇒నాలుగేళ్లలో రెట్టింపు అయ్యే చాన్స్ డివూండ్ ⇒వ్యక్తిగత ఆస్తుల్లో బంగారానిదే తొలి స్థానం ⇒2015లో ఈక్విటీలే అధిక రాబడిని ఇస్తారుు ⇒2020కి సెన్సెక్స్ లక్ష్యం 1,00,000 ⇒కార్వీ ఇండియూ వెల్త్ రిపోర్ట్ ⇒ఐదవ ఎడిషన్ విడుదల హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటంతో వచ్చే ఐదేళ్లలో భారతీయుుల వ్యక్తిగత సంపద రెట్టింపు అవుతుందని కార్వీ ఇండియా వెల్త్ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం రూ.257.4 లక్షల కోట్లుగా ఉన్న దేశ వ్యక్తిగత సంపద వచ్చే ఐదేళ్లు ఏటా 15 శాతం వృద్ధితో రూ. 500 లక్షల కోట్లు దాటుతుందని అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే వ్యక్తిగత సంపద 27.5 శాతం వృద్ధి చెందితే, గడిచిన ఐదేళ్లలో 84 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. కార్వీ ప్రైవేట్ వెల్త్ సంస్థ విడుదల చేసిన ఐదవ భారతీయ సంపద వివరాల ప్రకారం భారతీయుల వ్యక్తిగత చరాస్తుల (నగదు, బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, ఈక్విటీ ఆధారిత పెట్టుబడులు) విలువ రూ. 134.7 లక్షల కోట్లు (52.3%), స్థిరాస్తుల (రియుల్ ఎస్టేట్, గోల్డ్, డైమండ్, సిల్వర్, ప్లాటినమ్) విలువ రూ. 122.7 లక్షల కోట్లు (47.7%)గా ఉంది. భారతీయుుల వ్యక్తిగత సంపద వృద్ధిపై ఆర్థికమాంద్య ఛాయలు కనిపించలేదని, ఇప్పుడు ఆర్థిక వృద్ధిరేటు పుంజుకుంటుండటంతో వచ్చే ఐదేళ్లలో ఈ సంపద రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నట్లు కార్వీ ప్రైవేట్ వెల్త్ సీఈవో సునీల్ మిశ్రా పేర్కొన్నారు. జీడీపీ 7.5 శాతానికి... 2018 నాటికి దేశ జీడీపీ వృద్ధిరేటు 7.5 శాతానికి చేరుతుందని నివేదిక అంచనా వేసింది. వచ్చే ఐదేళ్లు ఈక్విటీల పనితీరు బాగుంటుందని, ఇతర ఇన్వెస్ట్మెంట్ సాధనాలతో పోలిస్తే ఈక్విటీలే అధిక రాబడిని అందిస్తాయని కార్వీ పేర్కొంది. వచ్చే ఐదేళ్లు ఈక్విటీలు 25 శాతం వృద్ధి చెందడం ద్వారా 2020 నాటికి సెన్సెక్స్ 1,00,000 పాయింట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. బంగారానికి తగ్గిన డివూండ్ ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ పెరిగినప్పటికీ ఇండియూలో తగ్గినట్లు కార్వీ పేర్కొంది. 2012-13లో ఇండియా 918 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటే 2013-14లో ఈ విలువ 5.6 శాతం క్షీణించి 867 టన్నులకు పడిపోయింది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్ 16 శాతం వృద్ధితో 3,237 టన్నుల నుంచి 3,745 టన్నులకు పెరిగింది. కానీ ఇప్పటికీ భారతీయుల వ్యక్తిగత సంపదలో బంగారానిదే మొదటి స్థానం. సుమారు రూ. 62.53 లక్షల కోట్ల విలువైన బంగారాన్ని భారతీయులు కలిగి ఉన్నారు. బంగారం తర్వాత రియల్ ఎస్టేట్, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఈక్విటీలు వరుస స్థానాల్లో ఉన్నారు. రియల్ ఎస్టేట్‌లో రూ. 50.38 లక్షల పెట్టుబడులు, ఫిక్స్డ్ డిపాజిట్లు బాండ్స్‌లో రూ. 29.39 లక్షల కోట్లు, ప్రత్యక్ష ఈక్విటీల్లో రూ. 26.66 లక్షల కోట్లు, బీమాలో రూ. 22.12 లక్షల కోట్లు కలిగి ఉన్నారు. -
న్యూ ఫండ్ ఆఫర్లో పెట్టుబడి సరికాదు...
నేను రూ. 2 లక్షలను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో 2005లో ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ విలువ రూ.10 లక్షలు. నేను 20 శాతం ట్యాక్స్ స్లాబ్‌లో ఉన్నాను. నేను ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకుంటే ఎంత పన్ను చెల్లించాలి ? నా ఆదాయపు పన్ను రిటర్నుల్లో ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఎలా చూపాలి? ఈ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తాన్ని, నా మొత్తం ఆదాయానికి కలపాలా? అలా కలిపితే నేను 30 శాతం ట్యాక్స్ స్లాబ్‌కు చేరతాను. దయచేసి నా సందేహాలను నివృత్తి చేయండి? -పవన్, గుంటూరు దీర్ఘకాలం పాటు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రయోజనాలు పొందవచ్చనడానికి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మీరు పొందిన లాభాలే నిదర్శనం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను కొన్న ఏడాది తర్వాత వాటిని విక్రయిస్తే పొందే లాభాలపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు ఏ ట్యాక్స్ స్లాబ్‌లో ఉన్నా సరే ఇది వర్తిస్తుంది. ఒక వేళ ఏడాదిలోపే విక్రయిస్తే 15 శాతం షార్ట్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాలి. ఇక మీ విషయానికొస్తే మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి తొమ్మిదేళ్లయింది. కాబట్టి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై మీరు ఎలాంటి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై మీరు ఆర్జించిన రూ.8 లక్షల లాభాలపై మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. మీ ఆదాయపు పన్ను రిటర్నుల్లో ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లాభాలను మూలధన లాభాల ఆదాయం అనే హెడ్ కింద చూపించాలి. నేను ఇప్పుడు ఎన్ఎఫ్ఓ(న్యూ ఫండ్ ఆఫర్)లో గానీ, ప్రస్తుతమున్న ఏదేని ఫండ్‌లో గానీ ఒకేసారి రూ.50,000 ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఈ ఇన్వెస్ట్‌మెంట్‌పై మూడేళ్ల తర్వాత రూ.72,000 ఆశిస్తున్నాను. అప్పుడు నా సోదరి వివాహానికి ఈ సొమ్ములు అవసరం. ఈ విషయంలో నాకు తగిన సలహా ఇవ్వండి. -రంజని, హైదరాబాద్ ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేసే ఆలోచన పూర్తిగా మానుకోండి. ఇది సరైనది కాదు. గత కొన్నేళ్ల పనితీరును మదింపు చేసిన తర్వాతనే ఇన్వెస్ట్ చేయడానికి మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. ఎన్ఎఫ్ఓలో అలాంటి అవకాశం ఉండదు కాబట్టి. ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయం కాదు. మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఫండ్‌నే ఎంచుకోండి. ఒకేసారి ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం కంటే కూడా కొంత కొంత మొత్తాల్లో క్రమం తప్పకుండా(సిప్-సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రయోజనాలు పొందుతారు. ఇక మీ విషయానికొస్తే, మీ రూ.50,000 మొత్తాన్ని ఏదైనా ఒక బ్యాలెన్స్డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. బ్యాలెన్స్డ్ ఫండ్స్ తమ నిధుల్లో 65 శాతం మొత్తాన్ని ఈక్విటీలో, మిగిలిన మొత్తాన్ని డెట్ మార్కెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. నిధుల కేటాయింపు సమతూకంగా ఉండేలా, మంచి రాబడులు వచ్చేలా, అదే సమయంలో ఇన్వెస్ట్మెంట్స్ సురక్షితంగా ఉండేలా బ్యాలెన్స్డ్ ఫండ్స్ పనితీరు ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని ఫండ్స్‌ను సూచిస్తున్నాం... హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్డ్ అడ్వాండేజ్, టాటా బ్యాలెన్స్డ్. ఈ మూడు ఫండ్స్ గత కొన్నేళ్లుగా మంచి పనితీరును కనబరుస్తున్నాయి. నా వయస్సు 29 ఏళ్లు. ఇటీవలే నా పెళ్లైంది. నా భార్య కూడా ఉద్యోగే. ఇద్దరం కలసి నెలకు రూ.70,000 వరకూ ఆర్జిస్తాం. మేం ఇంత వరకూ ఎలాంటి బీమా పాలసీలు తీసుకోలేదు. మా మీద ఆధారపడినవాళ్లు కూడా ఎవరూ లేరు. మాకు బీమా పాలసీలు అవసరమా? -అర్జున్, కర్నూల్ మీపై ఆధారపడిన వాళ్లు ఎవరూ లేనప్పటికీ, మీరు బీమా పాలసీలు తీసుకోవలసిందే. మీకు పెళ్లి అయిందంటే, మీకొక కుటుంబం ఉందన్నమాట. ఆ కుటుంబానికి బీమారక్షణ తప్పనిసరి. మీ వయస్సు చిన్నదే. ఈ వయస్సులో బీమా పాలసీ తీసుకుంటే మీరు తక్కువ ప్రీమియమే చెల్లిస్తే సరిపోతుంది. వీలైనంత త్వరగా ఆన్లైన్ టర్మ్ బీమా పాలసీ తీసుకోండి. ఆలస్యమైన కొద్దీ, ప్రీమియం వ్యయాలు పెరుగుతుంటాయి. -
మార్కెట్ ఇంకా పెరుగుతుందా!
దేశీ స్టాక్‌మార్కెట్ల వేల్యుయేషన్ అధికంగా ఉందా లేక తక్కువగా ఉందా అన్నది పక్కనపెడితే గత కొన్నాళ్లుగా చోటు చేసుకుంటున్న పరిణామాలను బట్టి చూస్తుంటే మార్కెట్లు మరింత పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలతో భారీ సంస్కరణలపై ఆశలు మొలకెత్తాయి. ద్రవ్యోల్బణం, రుతుపవనాలు, ప్రాజెక్టుల అమలు వంటి కొంత మేర ప్రతికూలాంశాలతో ఇన్వెస్టర్లలో ఊగిసలాట ధోరణి ఉన్నప్పటికీ మొత్తం మీద సానుకూల పరిస్థితే ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ బుల్ మార్కెట్ ప్రారంభ దశలో ఉండే సంకేతాలే. ఇన్వెస్ట్మెంట్కి అవకాశాలే. పరిశీలించి చూడగా కొన్ని అంశాలు దీనికి ఊతమిస్తున్నాయి. మొదటి అంశం విషయానికొస్తే.. మార్కెట్లు చక్రీయ నమూనా రికవరీ ప్రక్రియ ప్రారంభ దశలో ఉన్నాయి. ఇలాంటప్పుడు ఒత్తిడిలో ఉన్న రంగాల కంపెనీల ఆదాయార్జనా సామర్ధ్యాలను విశ్లేషకులు పూర్తి స్థాయిలో అంచనా వేయలేని పరిస్థితి ఉంటుంది. అయితే, అంచనాలకు భిన్నంగా క్రమక్రమంగా ఈ తరహా సంస్థలు మెరుగైన ఆదాయాలను ఆర్జించడం మొదలవుతుంది. రుణభారం తగ్గించుకుంటూ మెల్లగా ఈక్విటీ విలువను గణనీయంగా పెంచుకునే ప్రయత్నం చేస్తాయి. సాధారణంగా ఇలాంటి పరిణామాలను మార్కెట్లు పూర్తి స్థాయిలో అంచనా వేయలేవు. మరోవైపు, ద్రవ్యోల్బణ కట్టడిపరంగా ఆర్బీఐ తీసుకుంటున్న చర్యల ఫలితాలు ఇప్పటికే కనిపించడం మొదలైంది. రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం మరింత తగ్గగలదు. ఫలితంగా మార్కెట్లు ఊహిస్తున్న దానికంటే వేగంగా వడ్డీ రేట్లు తగ్గొచ్చు. సాధారణంగా మార్కెట్ విశ్లేషకులు ఇటువంటి పరిణామాలను దీర్ఘకాలిక దృష్టితో కాకుండా తాత్కాలిక కోణంలో మాత్రమే చూస్తుంటారు. అలా కాకుండా కాస్త మెలకువగా వ్యవహరిస్తే ఈక్విటీ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశాలు లభించగలవు. ఇవే కాకుండా టెక్నాలజీ రాకతో భారత్‌లో కొంగొత్త వ్యాపారాలు పుట్టుకురానున్నాయి. ఇవి ప్రారంభ దశలో ఉన్నప్పుడే సరైన వ్యాపారాన్ని గుర్తిస్తే మెరుగైన లాభాలను కూడా గడించవచ్చు. ఇటు సంపన్న, అటు వర్ధమాన దేశాలన్నీ చూసినా కూడా పెట్టుబడులను పెట్టేందుకు అనువైన దేశాల్లో ప్రస్తుతం భారత్‌ను మించి మరొకటి కనిపించడం లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే డాలరు మారకం విలువ బలపడి, రూపాయి క్షీణించినా.. ఇప్పటికిప్పుడు ఒక్కసారిగా భారత మార్కెట్ల నుంచి విదేశీ నిధులు తరలి వెళ్లిపోకపోవచ్చు. ఇలాంటి నేపథ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు, దేశీ మార్కెట్లు మరింత ఎగసేందుకు పుష్కలంగా అవకాశాలున్నట్లు కనిపిస్తోంది. -
పెట్టుబడికి షేర్లు, డెట్ సాధనాలు
ఎన్నికల ఫలితాల అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో భారత్‌పై ఆశాభావం, అంచనాలు పెరిగాయి. అటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీపై సైతం ఆశలు ఊపందుకున్నాయి. ఇదే పరిస్థితులు మెరుగుపడేందుకు దోహదపడుతుంది. ఇలాం టప్పుడు పెట్టుబడులపై అధిక రాబడులు అందుకునేందుకు ప్రత్యేక వ్యూహం పాటించాల్సి ఉంటుంది. కంపెనీలు వివిధ వ్యాపారాల్లో ఎలాగైతే ఇన్వెస్ట్ చేస్తుంటాయో అలాగే ఇన్వెస్టర్లు కూడా రిస్కు సామర్థ్యాన్ని బట్టి వివిధ సాధనాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ప్రయోజనాలు పొందవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈక్విటీలు, ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలు ఇందుకు ఉపయోగపడగలవు. ఈక్విటీలు , ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలు.. పోర్ట్‌ఫోలియోలో ఉండదగిన కీలకమైన సాధనాల్లో ఈక్విటీ, ఫిక్స్డ్ ఇన్కమ్ కూడా ఉంటాయి. రాబోయే రోజుల్లో ఈ రెండూ కూడా మెరుగైన పనితీరు కనపర్చగలవన్న అంచనాలు నెలకొన్నాయి. ఇటు దేశీయంగాను, అటు అంతర్జాతీయంగాను ఆర్థిక పరిస్థితులు చక్కబడుతున్న కొద్దీ కంపెనీల ఆదాయాలు మెరుగుపడుతుండటం ఒక కారణం. కాగా, ద్రవ్యోల్బణ కట్టడి చర్యల మూలంగా వడ్డీ రేట్లు దిగి రానుండటం మరో కారణం. ఈక్విటీలు, ఎఫ్డీ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడానికి పైన పేర్కొన్న రెండూ బలమైన కారణాలే. దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వ్యవధిని ఏడాది నుంచి మూడేళ్లకు పెంచడం వల్ల ఈ తరహా సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే విషయంలో మార్పులు వచ్చాయి. షేర్లలో పెట్టుబడులకు సంబంధించి డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీములను ఎంచుకోవచ్చు. పోర్ట్‌ఫోలియోలో వీటికి కాస్త ఎక్కువ కేటాయింపులే జరపవచ్చు. అసలు ఏ స్కీమును ఎంచుకోవాలన్న విషయంలో ఇన్వెస్టర్లకు చాలా సందర్భాల్లో సందేహాలు ఎదురవుతుంటాయి. ఈ ప్రశ్న మంచిదే అయినప్పటికీ.. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఏ సాధనం వృద్ధి కూడా పెరుగుతూనే పోదు. ఒక్కోసారి పెరగొచ్చు.. ఒక్కోసారి తగ్గొచ్చు. కాబట్టి, వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. లార్జ్ క్యాప్, మల్టీ క్యాప్, మిడ్ క్యాప్, బ్యాలెన్స్డ్ ఫండ్స్ వంటి వివిధ ఈక్విటీ సాధనాలను ఎంచుకోవచ్చు. ఇన్వెస్టర్లకు గరిష్ట లాభాలు అందించే ఉద్దేశంతో వీటిలో ఒక్కొక్కటీ మార్కెట్లో ఒక్కో విభాగంపై దృష్టి పెడుతుంటాయి. కనుక, డబ్బు మొత్తాన్ని ఒకే ఫండ్‌లో పెట్టేయకుండా వివిధ ఫండ్ స్కీముల్లో ఇన్వెస్ట్ చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఇక స్థిరమైన ఆదాయాలను అందించే సాధనాల విషయానికొస్తే.. ఇప్పటి వడ్డీ రేట్లను బట్టి చూస్తే..స్వల్పకాలిక మొదలుకుని మధ్యకాలిక వ్యవధికి సంబంధించిన ఓపెన్ ఎండెడ్ ఫిక్స్డ్ ఇన్కమ్ స్కీములను ఎంచుకోవచ్చు. ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్లలో పన్ను పరమైన ప్రయోజనాలను పొందాలంటే ఇన్వెస్ట్మెంట్ వ్యవధిని మూడేళ్లకు పెంచారు. కనుక, లిక్విడ్ ప్లస్, షార్ట్.. మీడియం టర్మ్ ప్లాన్లు, డైనమిక్ ఫండ్స్ వంటి ఓపెన్ ఎండెడ్ ఫిక్స్డ్ ఇన్కమ్ స్కీముల్లో కేటాయింపులు పెంచవచ్చు. -
ఐసీఐసీఐ బ్యాంక్ షేరు విభజన
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ అగ్రగామి ఐసీఐసీఐ బ్యాంక్ షేరును 1:5 నిష్పత్తిలో విభజించేందుకు డెరైక్టర్ల బోర్డు మంగళవారం ఆమోదముద్ర వేసింది. అంటే రూ. 10 ముఖ విలువగల ఒక్కో షేరును రూ.2 ముఖ విలువగా 5 షేర్లుగా విడగొట్టనున్నట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. బ్యాంకు స్టాక్ మార్కెట్లో లిస్టయిన తర్వాత ఇదే తొలి షేరు విభజన కావడం గమనార్హం. షేర్ల లావాదేవీల్లో లిక్విడిటీ(సరఫరా) పెంచడమే ఈ చర్యల లక్ష్యమని బ్యాంక్ వివరించింది. కాగా, ఒక్కో అమెరికన్ డిపాజిటరీ షేరు(ఏడీఎస్) ఇప్పుడున్నట్లుగానే రెండు ఐసీఐసీఐ షేర్లకు సమానంగా కొనసాగనుందని... అయితే, తాజా విభజనతో అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్(ఏడీఆర్) హోల్డర్ వద్ద నున్న ఒక్కో ఏడీఎస్కు ఈక్విటీ షేర్ల సంఖ్య 10కి పెరగనుందని ఐసీఐసీఐ వెల్లడించింది. వాటాదారులు, ఇతర నియంత్రణపరమైన అనుమతులకు లోబడి షేర్ల విభజన అమల్లోకి వస్తుందని.. దీనికి సంబంధించి రికార్డు తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు బ్యాంక్ పేర్కొంది. కాగా, మంగళవారం ఐసీఐసీఐ బ్యాంక్ షేరు ధర బీఎస్ఈలో 1.31 శాతం (రూ.20.50) నష్టంతో రూ.1,547.70 వద్ద స్థిరపడింది. -
షేర్లకు ఎంత కేటాయించాలి..?
ఏయే రంగాల్లో ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయించుకున్న తర్వాత తలెత్తే మరో ముఖ్యమైన ప్రశ్న ఈక్విటీలకు ఎంత కేటాయించాలన్నది. 2007లో మార్కెట్ గరిష్ట స్థాయిలో ఇన్వెస్ట్ చేసినవాళ్లలో చాలామంది ఇప్పుడు ఈక్విటీల్లో చాలా కొద్ది మొత్తంలోనే ఇన్వెస్ట్ చేసి ఉంటారు. ఇలాంటి పరిస్థితులు రాకుండా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పడు గమనించాల్సిన వాటిల్లో కొన్ని ముఖ్యమైన అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం. దీర్ఘకాలానికే: దీర్ఘకాలంలో సంపదను వృద్ధి చేసుకునే విధంగా షేర్లలో పెట్టుబడి పెట్టాలి. బ్యాలెన్స్డ్గా ఉండే ఇన్వెస్టర్లు ఈక్విటీలకు కనీసం 45 నుంచి 55 శాతం కేటాయించే విధంగా చూసుకోండి. ప్రస్తుతం చాలామంది పోర్ట్‌ఫోలియోలను పరిశీలిస్తే ఈక్విటీ వాటా 10 నుంచి 20 శాతంగా ఉంది. దీర్ఘకాలిక దృష్టితో ఈక్విటీల్లో పెట్టుబడులను క్రమేపీ పెంచుకోండి. రిస్క్-రివార్డ్ ప్రీమియం: ఈక్విటీ పెట్టుబడుల్లో రిస్క్-రివార్డ్ ప్రీమియం అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం. ముఖ్యంగా ఆర్థిక వృద్ధిరేటు తిరిగి గాడిలో పడుతున్నప్పుడు, బుల్ ర్యాలీ ప్రారంభంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసే వారికి రిస్క్ తక్కువగా ఉండి, రివార్డ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఇన్వెస్టర్లు పెట్టుబడులు ప్రారంభించినట్లు గత 2 నెలల నుంచి మ్యూచువల్ ఫండ్స్‌లో పెరుగుతున్న పెట్టుబడులే చూపుతున్నాయి. కాబట్టి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇదే సరైన సమయం. -
ఆర్థిక లక్ష్యం అలవోకగా ఛేదిద్దాం
ద్రవ్య మార్కెట్లు ఇటీవలి సంవత్సరాల్లో తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. కొన్ని ద్రవ్య సంస్థలు పతనమయ్యాయి. ద్రవ్యోల్బణం పెరిగింది. రూపాయి మారకం విలువ క్షీణించింది. సవాళ్లూ, అవకాశాలూ ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాల సాధనకు అప్రమత్తంగా వ్యవహరించాలి. స్వల్పకాలంలో డబ్బు సంపాదించే యోచనను పక్కనపెట్టి సంపద సృష్టికి దీర్ఘకాలిక వ్యూహాలు రూపొందించుకోవడం మేలు. పూర్వకాలంలో మన తాత ముత్తాతలు ఒక్కో లక్ష్యానికి ఒక్కో హుండీని ఏర్పాటు చేసి వాటిలో డబ్బు దాచుకునేవారు. కిరాణా సరుకులకు ఒకటి, విలాసాలకు మరొకటి, ఏడాదికోసారి జరిపే యాత్ర ఖర్చులకు ఇంకొకటి, ఇంట్లో త్వరలో జరిగే పెళ్లికి మరొకటి... ఇలా ఒక్కో అవసరానికి ఒక్కో హుండీ ఉండేది. ఈ పద్ధతినే మనం లక్ష్యం ఆధారిత ఆర్థిక ప్రణాళిక అని అంటున్నాం. ఈ పద్ధతి చాలా సులువైనది. ఇప్పటి కాలానికి అన్వయిస్తే, పిల్లల చదువుకు, వివాహాలకు, ఇల్లు, వాహనం కొనుగోలుకు లక్ష్యాలు రూపొందించుకుని అందుకు అనువుగా పొదుపు, పెట్టుబడులు ప్రారంభించాలన్నమాట. లక్ష్యం నిర్దేశించుకోవడం అత్యంత ప్రాముఖ్యమైనది. తొందరపాటుతోనో, పొరపాటుగానో నిర్దేశించుకునే లక్ష్యాలు మంచి కంటే చెడే ఎక్కువ చేయవచ్చు. లక్ష్యాలు మిమ్మల్ని తప్పుదోవ పట్టించినా, లక్ష్యాలు సునాయాసంగా సాధించేవి అయినా వాటివల్ల ప్రయోజనం పెద్దగా ఉండదు. ఒకవేళ లక్ష్యాలు అత్యంత కష్టసాధ్యమైనవైతే మీ వైఫల్యానికి మీరే ప్రణాళిక రూపొందించుకున్నట్లు అవుతుంది. లక్ష్యాన్ని నిర్దేశించుకునే సమయంలో బాగా గుర్తుంచుకోవాల్సిన కొన్ని అంశాలివి... విలువ: లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంత సొమ్ము దాచుకోవాలో నిర్దుష్టంగా అంచనా వేయాలి కాలం: లక్ష్య సాధనకు మనకు ఎన్నేళ్ల తర్వాత డబ్బు అవసరమవుతుందో నిర్ణయించుకోవాలి. రిస్కు: లక్ష్యాల సాధనలో భాగంగా రిస్కులను ఎదుర్కొనే సామర్థ్యం ఎంత ఉందో పరిశీలించుకోవాలి. ప్రాధాన్యం: లక్ష్యాలన్నీ ముఖ్యమైనవే అయినప్పటికీ వాటి ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు పిల్లల కాలేజీ ఫీజు చెల్లించడం లక్ష్యమైతే సంబంధిత పెట్టుబడిలో ఎలాంటి రిస్కుకూ తావుండదు. అంటే, రిస్కు అతి తక్కువగా ఉండే పెట్టుబడి ప్రణాళికను ఎంచుకోవాలి. ఇల్లు, కారు కొనుగోలు, వివాహం వంటి పెద్ద అవసరాలకు దీర్ఘకాలిక లక్ష్యాలు రూపొందించుకోవాలి. ఇలాంటి వాటికి సొమ్ము అధికంగా కావాలి. కనుక, పొదుపులో క్రమశిక్షణ పాటించాలి, మూల ధనమూ వృద్ధి చెందుతుండాలి. ఇందుకోసం ప్రతి లక్ష్యానికీ ఓ సిప్ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ - ఎస్ఐపీ)ను చేపట్టండి. ఎంపిక చేసిన ఈక్విటీల్లో సమయానుకూలంగా పెట్టుబడులు పెట్టడం కంటే క్రమబద్ధంగా సిప్ పద్ధతిలో ఇన్వెస్ట్ చేయడమే మరింత లాభదాయకమని సర్వేలు చెబుతున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్లో 5-10 శాతాన్ని బంగారంలో ఇన్వెస్ట్ చేయడం మంచిది. మార్కెట్ కుంగి పోతే నిరాశ చెందకండి. మీ ఇన్వెస్ట్మెంట్ ప్లాను, రిస్క్ ప్రొఫైల్‌కు అనుగుణంగా మరిన్ని పెట్టుబడులు చేయండి. ప్రతి ఒక్కరికీ తగిన పథకాలు మ్యూచువల్ ఫండ్లలో ఉన్నాయి. కనుక వీటిపైనా దృష్టిసారించండి. -
భవితకు చక్కని ప్లానింగ్..
పిల్లల భవిష్యత్తు అవసరాలకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడటమే ప్రతి తల్లిదండ్రుల ముందుండే అతిపెద్ద లక్ష్యం. చక్కగా ప్రణాళికాబద్ధంగా వెళితే ఇలాంటి దీర్ఘకాలిక లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు. పిల్లల ఆర్థిక ప్రణాళిక కోసం తల్లిదండ్రులు అనుసరించాల్సిన విధానంపై అవగాహన కల్పించేదే ఈ వారం ప్రాఫిట్ లీడ్ స్టోరీ... పిల్లలు పుట్టినప్పటి నుంచి వారి బంగారు భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటుంటారు. వారిని జీవితంలో ఉన్నత శిఖరాల్లో నిలపడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. పిల్లల్లో ఉంటే సృజనాత్మక శక్తిని గ్రహించి వారిని ఆయా రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేర్చడానికి శిల్పిలాగా కృషి చేస్తారంటే అతిశయోక్తి కాదేమో. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. పిల్లలు పెద్ద అవుతున్న కొద్దీ వారి ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. దీనికి అనుగుణంగానే ఆర్థిక ప్రణాళికలను కూడా రచించుకోవాలి. పిల్లల భవిష్యత్తు ప్రణాళికకు సంబంధించి బీమా పథకాలు అనువుగా ఉంటాయి. ముఖ్యంగా స్థిరమైన ఆదాయం ఉన్న వారు వారి ఫ్యామిలీ బడ్జెట్లో చిన్నారుల కోసం ప్రతీ నెలా కొంత కేటాయించే విధంగా చూసుకోవాలి. చదువు, విదేశాల్లో ఉన్నత విద్య, పెళ్ళి వంటి ప్రధాన అవసరాలే కాకుండా వ్యాపారం ప్రారంభించడానికి కొంత మూల ధనం సమకూర్చడం తదితర అనేక అవసరాలు ఉంటాయి. వీటన్నింటికీ నగదు భారీగానే అవసరం అవుతుంది. ఈ కలల లక్ష్యాలను చేరుకోవడానికి బీమా కంపెనీలు వివిధ పథకాలను అందిస్తున్నాయి. ఒకవేళ అనుకోని సంఘటన ఏదైనా జరిగితే... పిల్లల లక్ష్యాలు ఆగకుండా, ఎటువంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా కొనసాగించడానికి బీమా పథకాలు అక్కరకు వస్తాయి. కాబట్టి పిల్లల కోసం చేసుకునే ప్లానింగ్‌లో బీమా తప్పకుండా ఉండే విధంగా చూసుకోవాలి. చిన్నారుల భవిష్యత్తు కోసం నిర్దేశించిన బీమా పథకాలు దీర్ఘకాలానికి సంబంధించినవే ఉంటాయి. కాబట్టి వీటిల్లో క్రమం తప్పకుండా దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవాలి. పెరుగుతున్న విద్యావ్యయం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలకు ఈ బీమా పథకాలు చక్కటి పరిష్కారాన్ని చూపుతాయి. పిల్లల కోసం బీమా పథకాలను తీసుకునేటప్పుడు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి... పిల్లల కోసం చేసే ఆర్థిక ప్రణాళికల్లో జాప్యం వద్దు. ఎంత తొందరగా మొదలు పెడితే అంత ప్రయోజనం ఉంటుంది. చాలా బీమా పథకాల్లో మెచ్యూర్టీ లేదా క్రమానుగత చెల్లింపులు పిల్లల వయసు 18 ఏళ్ళు రాగానే మొదలవుతాయి. కాబట్టి ఈ దీర్ఘకాలిక పథకాలను ఎంత తొందరగా ప్రారంభిస్తే అంత ఎక్కువ నిధిని సమకూర్చుకోవచ్చు. ఒకవేళ ఏ పథకం తీసుకోవాలో అర్థం కాకపోతే గుర్తింపు పొందిన ఆర్థిక ప్రణాళిక నిపుణులను సంప్రదించి మీ అవసరాలకు అనువైన పథకాన్ని ఎంచుకోండి. ప్రధాన పాలసీకి అనుబంధంగా ప్రీమియం వైవర్ అనే రైడర్‌ను అందిస్తుంటాయి. పిల్లల పథకాలతో పాటు తప్పకుండా తీసుకోవాల్సిన రైడర్లలో ఇది అత్యంత ముఖ్యమైనది. ప్రీమియం చెల్లించే పాలసీదారుడు మరణిస్తే... భవిష్యత్తు ప్రీమియంలు కట్టనవసరం లేకుండా పాలసీ కొనసాగడానికి ఈ రైడర్ దోహదం చేస్తుంది. అంటే పాలసీదారుడు మరణించినా... ఆ వ్యక్తిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ఎటువంటి ఆర్థిక భారం లేకుండానే లక్ష్యాలను చేరుకోవచ్చు. దీర్ఘకాలంలో ఈక్విటీలకు అధిక లాభాలను ఇచ్చే శక్తి ఉండటంతో యులిప్స్ పథకాలను తీసుకోవచ్చు. అత్యధికంగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే గ్రోత్ ఫండ్‌ను ఎంచుకొని లక్ష్యాన్ని చేరుతున్నప్పుడు వచ్చిన లాభాలను కాపాడుకోవడానికి ఈ మొత్తాన్ని క్రమానుగతంగా డెట్ పథకాల్లోకి మార్చుకోండి. లేకపోతే అటు వృద్ధికి అవకాశం ఉంటూ, ఇటు అసలుకు ఢోకా లేకుండా ఉండే విధంగా బ్యాలెన్స్డ్ పథకాలను ఎంచుకోండి. వీటితో పాటు ప్రీమియం చెల్లించే వ్యక్తికి తగినంత బీమా రక్షణ ఉండే విధంగా చూసుకోండి. పన్ను ప్రయోజనాలపరంగా చూసినా బీమా పథకాలు రెండిందాల ప్రయోజనాన్ని కలిగిస్తాయి. చెల్లిస్తున్న ప్రీమియంపై సెక్షన్ 80సీ ప్రకారం పన్ను ప్రయోజనంతోపాటు, సెక్షన్ 10 (10డీ) ప్రకారం మెచ్యూర్టీ ద్వారా అందుకునే మొత్తాన్ని కూడా పన్ను భారం లేని ఆదాయంగా పరిగణిస్తారు. పాలసీ తీసుకునే ముందు అందులో పొందుపర్చిన నిబంధనలు, ఆ పథకం మీ అవసరాలకు తగినట్లుగా ఉందా లేదా అన్న విషయాలను ఒకసారి పరిశీలించాలి. అలాగే మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ కంపెనీల బీమా పథకాలతో పోల్చి చూసి మేలైనదాన్ని ఎంచుకోండి. -
జూన్‌లో పెట్టుబడులు రూ. 26,000 కోట్లు
న్యూఢిల్లీ: దేశీ క్యాపిటల్ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులు కొనసాగుతున్నాయి. జూన్ నెలలో ఇప్పటివరకూ రూ. 26,165 కోట్లను(4.42 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు పూర్తి మెజారిటీ లభించడంతోపాటు, నరేంద్ర మోడీ అధ్యక్షతన ఏర్పాటైన కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణాత్మక చర్యలు ఎఫ్ఐఐలకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. తాజా గణాంకాల ప్రకారం ఎఫ్ఐఐలు ఈక్విటీలలో నికరంగా రూ. 10,359 కోట్లు, రుణ(డెట్) మార్కెట్లో రూ. 15,806 కోట్ల చొప్పున ఇన్వెస్ట్ చేశారు. దీంతో ఈ నెలలో ఇప్పటివరకూ మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 4% పుంజుకుంది. ఈ ఏడాది జనవరి నుంచి చూస్తే ఎఫ్ఐఐలు ఓవైపు ఈక్విటీలలో నికరంగా రూ. 56,163 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా, మరోపక్క రూ. 61,925 కోట్ల విలువైన రుణ సెక్యూరిటీలను కొనుగోలు చేశారు. ఇవి దాదాపు 20 బిలియన్ డాలర్లకు(రూ. 1.18 లక్షల కోట్లు) సమానం. -
మోడీ ఎఫెక్ట్.. లక్ష కోట్ల ఎఫ్ఐఐ నిధులు
మోడీని గతేడాది సెప్టెంబర్‌లో ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన నాటినుంచి చూస్తే.. దేశంలోకి విదేశీ నిధుల ప్రవాహం పోటెత్తింది. అప్పటినుంచి ఏకంగా రూ. లక్ష కోట్లకుపైగా ఎఫ్ఐఐ పెట్టుబడులు రావడమే దీనికి నిదర్శనం. సెబీ తాజా గణాంకాల ప్రకారం... మోడీ ప్రధాని అభ్యర్థి ప్రకటన తర్వాత... ఈక్విటీల్లోకి రూ.88,772 కోట్లు, డెట్ మార్కెట్లలోకి రూ.13,399 కోట్లు చొప్పున మొత్తం రూ.1,02,171 కోట్ల నిధులు వెల్లువెత్తాయి. దేశంలో సుస్థిర ప్రభుత్వం రానుండటంతో... సంస్కరణలకు ఢోకా ఉండదన్న విశ్వాసమే ఎఫ్ఐఐల జోరుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఎన్డీఏకి పూర్తి స్థాయిలో పటిష్ట మెజారిటీ రావడంతో విదేశీ నిధులు మరింత పుంజుకోనున్నాయని పేర్కొన్నారు. కాగా, 2014 ప్రారంభం నుంచి ఇప్పటిదాకా ఎఫ్ఐఐలు దేశీ మార్కెట్లోకి రూ.74,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. -
ఐసీఐసీఐ కొత్త యులిప్
ఐసీఐసీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ గ్యారంటీడ్ వెల్త్ ప్రొటెక్టర్ పేరుతో యూనిట్ ఆథారిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈక్విటీలకు కేటాయిస్తూ.. ఇన్వెస్ట్ చేసిన అసలును రక్షించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. 45 ఏళ్ల లోపు ఉన్న వారు గరిష్టంగా 60 శాతం వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆరు ఏళ్లు దాటిన తర్వాత సగటు ఫండ్ విలువలో 0.25% లాయల్టీ అడిషన్, 10 ఏళ్లు నిండితే వెల్త్ బూస్టర్ పేరుతో అదనపు రాబడి ఈ పాలసీలోని ప్రత్యేక ఆకర్షణలు. -
ఈ నాలుగు ముఖ్యం
ఈక్విటీలు గత కొన్నేళ్లుగా ఆశించిన లాభాలను ఇవ్వకపోవడంతో ఇన్వెస్టర్లు డెట్ ఫండ్లు, బంగారం వంటి ఇతర ప్రత్యామ్నాయాలపైకి దృష్టి మళ్లించారు. ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడానికి పసిడిలో పెట్టుబడులు పెట్టారు. 2011 అక్టోబర్ నుంచి 2013 మే మధ్యకాలంలో (ఈ వ్యవధిలో రెపో రేటు 8 శాతం పైనుంచి 7.25 శాతానికి తగ్గింది) రిజర్వు బ్యాంకు అనుసరించిన విధానాల కారణంగా డెట్ ప్రొడక్టుల్లో పెట్టుబడులు పెట్టిన వారికి 10% వరకు ఆదాయం లభించింది. 2013 జూన్ తర్వాత ప్రపంచ పరిణామాల నేపథ్యంలో ఫిక్స్డ్ ఇన్కమ్ మార్కెట్లలో అసాధారణ అస్థిరత్వం నెలకొంది. ఈ సమస్యను అధిగమించేందుకు లిక్విడిటీని కట్టడి చేసే చర్యలను రిజర్వు బ్యాంకు చేపట్టింది. స్థూల ఆర్థిక వాతావరణం మెరుగుపడడంతో ఆ చర్యల ఉపసంహరణను రిజర్వు బ్యాంకు క్రమంగా అమలుచేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రెపో రేటును ఆర్బీఐ మరోమారు 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందనేది మార్కెట్ అంచనా. కనుక, మీ కష్టార్జితాన్ని డెబిట్ ప్రొడక్టుల్లో ఇన్వెస్ట్ చేసే ముందు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అవేమిటంటే... {పొడక్టుపై వసూలు చేసే చార్జీలను పరిశీలించాలి. చార్జీల వ్యయం అధికంగా ఉంటే ఆ మేరకు ఆదాయం తగ్గిపోతుంది. {పొడక్టుకు ఉన్న క్రెడిట్ రేటింగ్‌ను చూడాలి. సొమ్మును ఎలాంటి పథకాల్లో పెట్టుబడి పెడతారో గమనించాలి. అధిక ఆదాయం ఉన్నదంటే.. తక్కువ రేటింగ్ కలిగిన ఇన్‌స్ట్రుమెంట్లపై ఈ ప్రొడక్టు దృష్టి కేంద్రీకరిస్తుందన్న మాట. టాక్స్-ఫ్రీ బాండ్లు మినహా, ఇతర బాండ్ల విషయంలో పన్ను భారం ఉంటుంది. తక్కువ పన్ను సౌలభ్యం డెట్ ఫండ్లలో ఉంది. డెబిట్ మ్యూచువల్ ఫండ్లలో ఏడాదికి మించి చేసే పెట్టుబడులపై ఇండెక్సేషన్ బెనిఫిట్‌ను(ద్రవ్యోల్బణం పెరుగుదల) కోరడం ద్వారా పెట్టుబడిదారులు పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. గత కొన్ని నెలలుగా కొంత అస్థిరత్వం ఉన్నప్పటికీ, ఫిక్స్డ్ డిపాజిట్లు, బాండ్లు, డిబెంచర్లు, డెబిట్ మ్యూచువల్ ఫండ్లు (ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్లు, అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్లు, షార్ట్ టర్మ్ ఫండ్ల వంటివి) అధిక రాబడి ఇస్తూనే ఉన్నాయి. డెబిట్ ఫండ్లలో పెట్టుబడులను నాలుగు అంశాల ఆధారంగా చేయాలి. అవి: 1. ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ 2. ప్రొడక్టులు 3. పోర్ట్‌ఫోలియోలు 4. పనితీరు. -
ఐపీవో నిబంధనల సడలింపు
ముంబై: ఈక్విటీ, డెట్ ఇష్యూల ద్వారా కంపెనీలు నిధులు సమీకరించే ప్రక్రియను సులభతరం చేసేలా స్టాక్‌మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనలు సడలించింది. అలాగే, మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడేవారిని, పొంజీ స్కీముల వంటివి నిర్వహించే వారిని కట్టడి చేయడానికి మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. మంగళవారం జరిగిన సమావేశంలో బోర్డు ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంది. విదేశీ ఇన్వెస్టర్ల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) విభాగం నిబంధనలపై సెబీ స్పష్టతనిచ్చింది. దీనికికూడా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) విభాగం తరహాలోనే పన్ను ప్రయోజనాలు లభించేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొంది. ఎఫ్‌పీఐ విధానంలో రిస్కు సామర్థ్యాన్ని బట్టి విదేశీ ఇన్వెస్టర్లను మూడు తరగతులుగా విభజించిన సంగతి తెలిసిందే. పబ్లిక్ ఆఫర్ల విషయానికొస్తే.. ఐపీవోలకు గ్రేడింగ్ తప్పనిసరన్న నిబంధనను తొలగించాలన్న ప్రతిపాదనను సెబీ బోర్డు ఆమోదించింది. దీంతో ఇకపై ఇది ఐచ్ఛికంగానే ఉంటుంది. అలాగే, ఒకే ప్రాస్పెక్టస్ ద్వారా ఒక ఏడాదిలో విడతలవారీగా నిధుల సమీకరణకు ఉపయోగపడే షెల్ఫ్ ప్రాస్పెక్టస్ విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో సెబీ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఇవి అమల్లోకి వస్తాయి. అధికారాల దుర్వినియోగానికి చెక్... వివిధ అంశాలకు సంబంధించి కొత్తగా తనకు దఖలుపడిన అధికారాలు దుర్వినియోగం కాకుండా, సమర్థవంతంగా ఉపయోగించుకునే దిశగా కూడా సెబీ బోర్డు కొత్త నిబంధనలను ఆమోదించింది. తనిఖీలు .. జప్తు చేయడాలు, సెటిల్మెంట్ అంశాలు, ఇన్వెస్టర్లకు వేగవంతంగా సొమ్ము తిరిగి లభించేలా చూడటం తదితర అంశాలకు సంబంధించి సెబీకి మరిన్ని అధికారాలు లభించిన సంగతి తెలిసిందే. ఇవి దుర్వినియోగం కాకుండా, సంబంధిత సంస్థల ప్రైవసీకి భంగం కలగకుండా చూడటం తాజా నిబంధనల ప్రధానోద్దేశం. ఒకవైపు ఇన్సైడర్ ట్రేడింగ్ వంటి తీవ్రమైన నేరాలకు సెటిల్మెంట్ అవకాశం కల్పించకుండా మరోవైపు సివిల్ వివాదాలు పారదర్శకంగా పరిష్కారమయ్యేలా చూసేందుకు కూడా స్పష్టమైన విధివిధానాలను సెబీ ఖరారు చేసింది. లిస్టెడ్ కంపెనీలకు కొత్త కార్పొరేట్ గవర్నెన్స్ కోడ్, ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనల సవరణ, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టుల ఏర్పాటు విధివిధానాలు తదితర అంశాలు కూడా సెబీ బోర్డు సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం. అయితే, వీటిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -
ఎయిర్ ఇండియాకు మార్కెట్ల నుంచి నిధులు!
న్యూఢిల్లీ: క్షీణిస్తున్న రూపాయి విలువ, పెరుగుతున్న ద్రవ్యలోటు నేపథ్యంలో ఎయిర్ ఇండియాకు ఈక్విటీ ద్వారా నిధులు అందించే ప్రతిపాదనల నుంచి ప్రభుత్వం వెనక్కుతగ్గింది. వెరసి రూ. 3,574 కోట్ల ప్రతిపాదనను ఆర్థిక శాఖ నిలిపివేసింది. అంతేకాకుండా అవసరమైన నిధులను మార్కెట్ల నుంచి సమీకరించుకోవాల్సిందిగా ప్రభుత్వం సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఈక్విటీ ప్రతిపాదన ఆలస్యమవుతుందేతప్ప, రద్దుకాలేదని వివరించాయి. ఫలితంగా వెంటనే అవసరమయ్యే నిధులను రుణాల ద్వారా సమీకరించుకోనుంది. వీటితోపాటు భూములను విక్రయించే యోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్లోగల రూ. 700 కోట్ల విలువైన స్థలాన్ని విక్రయించేందుకు అవకాశమున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. -
మళ్లీ ఎఫ్ఐఐల జోరు రూ. 11,000 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు
న్యూఢిల్లీ: మళ్లీ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు దేశీయ స్టాక్స్‌పట్ల ఆసక్తిని కనబరుస్తున్నారు. వెరసి సెప్టెంబర్ 2-22 మధ్య కాలంలో ఈక్విటీలలో నికరంగా రూ. 11,043 కోట్లను(173 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్ చేశారు. అయితే మరోవైపు ఇదే సమయంలో రూ. 985 కోట్ల(15.9 కోట్ల డాలర్లు) విలువైన డెట్ సెక్యూరిటీలను నికరంగా విక్రయించారు. దీంతో దేశీయ క్యాపిటల్ మార్కెట్లలో ఎఫ్ఐఐల నికర పెట్టుబడులు రూ. 10,058 కోట్లకు(156 కోట్ల డాలర్లు) పరిమితమయ్యాయి. ఆర్బీఐ కొత్త గవర్నర్‌గా రఘురామ్ రాజన్ బాధ్యతలు స్వీకరించాక ఎఫ్ఐఐల పెట్టుబడులు పుం జుకోవడం గమనార్హం. అంతకుముందు ఆగస్ట్ నెలలో ఎఫ్ఐఐలు నికరంగా దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి రూ. 16,000 కోట్ల(250 కోట్ల డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. నియంత్రణ సంస్థ సెబీ వెల్లడించిన తాజా గణాంకాలివి. డాలరుతో మారకంలో పతనమవుతున్న రూపాయి విలువను నిలువరించేందుకు రాజన్ చేపట్టిన చర్యలు ఎఫ్ఐఐల పెట్టుబడులను ఆకట్టుకుంటున్నాయని నిపుణులు విశ్లేషించారు. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహాయక ప్యాకేజీలను కొనసాగించడానికి నిర్ణయించడం కూడా దీనికి జత కలిసిందని పేర్కొన్నారు. ఫలితంగా ఈ నెలలో ఇప్పటివరకూ రూపాయి విలువ 350 పైసలు(5.3%) పుంజుకుని 62.23 వద్ద నిలిచింది. -
స్పెక్ట్రమ్ ఈక్విటీకి గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నుంచి స్పెక్ట్రమ్ పవర్ కంపెనీ తీసుకున్న రుణాన్ని ఈక్విటీగా పరిగణిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం ఇన్చార్జి చైర్మన్ శేఖర్‌రెడ్డి, సభ్యుడు అశోకాచారి ఆదేశాలిచ్చారు. కంపెనీ ఈక్విటీని రూ. 106.6 కోట్లుగా కాకుండా రూ. 224.53 కోట్లుగా పరిగణించాలని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా ఈక్విటీపై ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలను 1998 నుంచి చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ప్రోత్సాహకాల రూపంలో చెల్లించాల్సిన మొత్తం రూ.100 కోట్ల మేరకు ఉంటుందని అంచనా. ఈ మొత్తం విద్యుత్ చార్జీల రూపంలో ప్రజలపైనే పడనుంది. కాగా, ఎల్‌వీఎస్‌తో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని (పీపీఏ) రద్దు చేయాలని డిస్కంలు వేసిన పిటిషన్‌ను ఈఆర్సీ తిరస్కరించింది.