
న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌లో సింగపూర్ ప్రభుత్వం 6.8 కోట్ల షేర్లను విక్రయించింది. దీంతో డీఎల్‌ఎఫ్ షేర్ 8 శాతం వరకూ నష్టపోయింది.
బ్లాక్‌డీల్ విలువ రూ.1,298 కోట్లు
డీఎల్‌ఎఫ్ కంపెనీలో సింగపూర్ ప్రభుత్వానికి గత ఏడాది చివరి నాటికి 4.11 శాతం వాటాకు సమానమైన 7.32 కోట్ల ఈక్విటీ షేర్లున్నాయి. దీంట్లో 6.8 కోట్ల ఈక్విటీ షేర్లను ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా సింగపూర్‌ప్రభుత్వం సోమవారం విక్రయించింది. ఒక్కో షేర్ సగటు విక్రయ విలువ రూ.191 ప్రకారం ఈ మొత్తం షేర్ల విక్రయ విలువ రూ.1,298 కోట్లుగా ఉంది. ఈ షేర్లను ఫ్రాన్స్‌కు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ సొసైటీ జనరల్, హెచ్‌ఎస్‌బీసీ, ఇతర ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారని సమాచారం.
ఇటీవలి డీఎల్‌ఎఫ్ రూ.3,200 కోట్ల క్యూఐపీ ఇష్యూలో పాలు పంచుకున్న హెచ్‌ఎస్‌బీసీ, ఇతర సంస్థలు ఈ ఓపెన్ మార్కెట్ లావాదేవీలో కూడా డీఎల్‌ఎఫ్ షేర్లను కొనుగోలు చేశాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ బ్లాక్‌డీల్ నేపథ్యంలో డీఎల్‌ఎఫ్ షేర్ భారీగా పతనమైంది. బీఎస్‌ఈలో 8.4 శాతం నష్టంతో రూ.185 వద్ద ముగిసింది.