ముంబై: ప్రపంచంలోనే అతిపెద్ద మురికివాడగా పేరొందిన, ముంబైలోని ధారావి పునర్‌నిర్మాణ ప్రాజెక్ట్ కాంట్రాక్టు అదానీ గ్రూప్ చేతికి వెళ్లనుంది. రూ.5,069 కోట్లను కోట్ చేసి అత్యధిక బిడ్డర్‌గా నిలిచింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్‌ఎఫ్ రూ.2,025 కోట్లకు కోట్ చేసింది. ఈ వివరాలను ప్రాజెక్టు సీఈవో ఎస్‌వీఆర్ శ్రీనివాస్ వెల్లడించారు. ‘‘259 హెక్టార్ల పరిధిలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. కాంట్రాక్టు పొందిన సంస్థ ఏడేళ్లలో 6.5 లక్షల మందికి ఆవాసం సమకూర్చాల్సి ఉంటుంది. వీరంతా ఇప్పుడు ధారావిలో 2.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్నారు. ఈ ప్రాజెక్టు విలువ రూ.20,000 కోట్లు. (టాటా దూకుడు: ఏవియేషన్ మార్కెట్లో సంచలనం)
తొలి దశలో అదానీ గ్రూపు రూ.5,069 కోట్లను ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపించింది. దీన్ని ఏడేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది’’ అని శ్రీనివాస్ తెలిపారు. వివరాలను ప్రభుత్వానికి పంపిస్తున్నామని, పరిశీలన అనంతరం తుది అనుమతి ఇస్తుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు కాంట్రాక్టు పొందిన సంస్థ 6.5 లక్షల మందికి నివాసం ఏర్పాటు చేయడంతోపాటు, మిగిలిన స్థలంలోని నివాస గృహాలను అధిక ధరలకు విక్రయించు కోవచ్చు. అలాగే, వాణిజ్య స్థలం కూడా అందుబాటులోకి వస్తుంది. (టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్‌పర్సన్ హఠాన్మరణం)
ఇదీ చదవండి: నైకా ఫల్గుణి సంచలనం: తగ్గేదేలే అంటున్న బిజినెస్ విమెన్
Comments
Please login to add a commentAdd a comment