ఎంతసేపూ ఆ సేవింగ్స్ పథకాలేనా?
• ఈక్విటీలపై అవగాహన అవసరం
• దీర్ఘకాలంలో అధిక రాబడి సాధ్యమే
• ఫండ్స్ చక్కటి ఆర్థిక సాధనాలు
మన వాళ్లెప్పుడూ పొదుపు ఆధారిత పథకాలకే ఓటేస్తుంటారు. ఎందుకంటే నష్టమనే మాట వారికి ఇష్టం ఉండదు. తప్పనిసరిగా రిటర్న్ రావాల్సిందే. అందుకే వారు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్, దీర్ఘకాలంలో పసిడి కొనుగోళ్లు వంటి వాటికి మొగ్గుచూపుతారు. ఇటీవల కొన్ని పన్ను రహిత బాండ్లు జారీ అయ్యారుు. లాకిన్ పీరియడ్ 15 ఏళ్లు. అంటే ఈ కాలంలో డబ్బు అసలు బయటకు తీయడం కుదరదు. ఇక ఈ బాండ్లపై కూపన్ (వడ్డీ)రేటు 7.5 శాతం నుంచి 8 శాతంగా ఉంది. చిత్రంగా దీనికి ప్రజల నుంచి ఊహించని మద్దతు లభించింది. ఇదే ఇన్వెస్టర్ 15 ఏళ్ల పాటు కదల్చబోనని మొరారుుంచుకుని ఈక్విటీలో డబ్బు పెడతాడా అంటే... పెట్టడుగాక పెట్టడు.
15 ఏళ్లు ఆగితే కచ్చితంగా మంచి రిటర్న్ వచ్చే భారత్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్ను లాంటి ఎన్నో ఈక్విటీలున్నా... అటువైపు చూడడు. ఇంకా చెప్పాలంటే... 15 ఏళ్ల లక్ష్యంతో పెట్టుబడిపెట్టినా... ఈక్విటీల్లో అనూహ్య పరిణామాలతో 15 ఏళ్లకు వచ్చే రిటర్న్ ఎప్పుడైనా రావచ్చు. ఈక్విటీని క్యాష్ చేసుకోడానికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది. అరుునా భారతీయ మదుపుదారు నుంచి పెద్దగా ఉత్సాహం ఉండదు. అరుుతే ఇక్కడ మార్పు ఎలా అన్నదే ప్రశ్న.
పలు కారణాలు..
భారతీయ ఇన్వెస్టర్ ధోరణికి కారణాలు చాలా ఉన్నారుు. అందులో ప్రధానమైనది తప్పనిసరిగా రిటర్న్స్ రావాలి. ద్రవ్యోల్బణం సంగతి, ఆ లెక్కల పట్ల అంతగా అవగాహన ఉండదు. ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించి పరిశోధనా పూర్వక విధానం ఉండదు. అరుుతే ప్రజల్లో ఈక్విటీల పట్ల సానుకూల దృక్పథం ఏర్పడ్డానికి పరిశ్రమ పలు చర్యలు తీసుకుంటోంది. ఇక్కడ ఒక విషయం చూద్దాం. నిఫ్టీ 50 సీఏజీఆర్ (కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్) 14 శాతం. పన్ను రహిత బాండ్లకు ఇది రెట్టింపు. ఇది గ్లోబల్ ఇన్వెస్టర్లను సైతం ఆకర్షిస్తోంది. కానీ, మన ఇన్వెస్టర్లను మాత్రం ఆకర్షించటం లేదు. సంపద సృష్టి దిశలో భారతీయులు ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతో ఉంది.
ఫండ్స్ వైపు చూడొచ్చు...
సరే... సాధారణ వ్యక్తికి ప్రత్యక్షంగా ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టాలంటే అవగాహన లేకపోవచ్చు. అలాంటప్పుడు మ్యూచువల్ ఫండ్‌స ఉన్నారుు కదా! భారతీయుల వివిధ పెట్టుబడుల మొత్తాన్ని పరిశీలిస్తే- మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్లు 3 నుంచి 4% దాటట్లేదు. కానీ ఇక్కడ తగిన ప్లానింగ్, రిస్క్ ఇబ్బందిలేని సలహాలతో ఏ ఇన్వెస్టర్ అరుునా తన దీర్ఘకాలిక ప్రయోజనాలను సాధించేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇన్వెస్టర్ ఆలోచనా ధోరణి మారడమే ముఖ్యం.
ఈక్విటీ ఆధారిత ఫండ్స్ దీర్ఘకాలంలో ఇతర సాంప్రదాయక పెట్టుబడులకన్నా మంచి రిటర్న్స్ అందిస్తారుు. పదేళ్ల కాలంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ 13.8% రిటర్న్స్ అందిస్తే, పసిడి 9.1 శాతం, రియల్టీ 8.2 శాతం రిటర్న్ ఇచ్చింది. ఫైనాన్షియల్ మార్కెట్‌పై దృష్టి పెట్టే సమయం, అనుభవం లేనివారికి ఆ వైపునకు సంబంధించి ఫండ్స్ మంచి సాధనం. ఎస్‌అండ్‌పీ గ్లోబల్ లిటరసీ సర్వే ఇటీవల ఒక నివేదికను విడుదల చేస్తూ... భారతీయుల్లో 73 శాతం పురుషులు, 80% మంది మహిళలకు కొత్త ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అవగాహన లేదని పేర్కొంది. ఈ ధోరణి మారడానికి పరిశ్రమ, సం బంధిత వర్గాలు కృషి చేయాల్సిన అవసరం ఉంది.