పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ, డెట్‌ల వాటా ఎంత ఉండాలి?
ఫైనాన్షియల్ బేసిక్స్..
ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ, డెట్‌ల వాటా ఎంత ఉండాలనేది ప్రధానంగా ఆ ఇన్వెస్ట్‌మెంట్లు చేస్తోన్న వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. అంటే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తోన్నది... 20-30 ఏళ్ల వయసున్న వారైతే.. వారు భరించే రిస్క్ ఒక విధంగా ఉంటుంది. అదే ఇన్వెస్ట్ చేస్తున్నది 50-55 ఏళ్ల వయసున్న వారైతే.. వారు భరించగలిగే రిస్క్ మరోలా ఉంటుంది. ఇక్కడ రిస్క్‌ను వయసు ప్రభావితం చే స్తోందన్న విషయాన్ని మనం గ్రహించాలి. 23 ఏళ్లకే కెరీర్‌ను ప్రారంభించిన వారు అధిక రిస్క్‌ను భరించడానికి సిద్ధంగా ఉండొచ్చు. అదే వయసు ఎక్కువగా ఉన్న వారు తక్కువ రిస్క్‌ను భరించడానికి ఆసక్తి చూపుతారు.
అప్పుడు వారి ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలు వేరు వేరుగా ఉంటాయి. ఎక్కువ రిస్క్ భరించే వారు ఈక్విటీల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు. తక్కువ రిస్క్ భరించే వారు డెట్ సాధనాల వైపు మొగ్గు చూపుతారు. ఇక మధ్య వ యస్కుల విషయానికి వస్తే వీరు బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు.
20-30 ఏళ్ల వారి పోర్ట్‌ఫోలియోలో సాధారణంగా ఈక్విటీ వాటా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక 30-40 ఏళ్ల వారి పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ, డెట్‌ల వాటా సమానంగా ఉంటుంది. ఇక 50-60 ఏళ్లు, అంతకుపై వయసు ఉన్న వారి పోర్ట్‌ఫోలియోలో డెట్ వాటా అధికంగా ఉంటుంది. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ రిస్క్‌ను భరించాల్సి వస్తుంది. అదే డెట్ సాధనాల్లో అయితే వడ్డీ రేట్లు, క్రెడిట్ రిస్క్‌లు పొంచి ఉంటాయి.