న్యూఢిల్లీ: సోలార్ మాడ్యూల్స్ తయారీలో ఉన్న వారీ ఎనర్జీస్ రూ.1,000 కోట్ల నిధులను సమీకరించింది. ప్రైవేట్ ఇన్వెస్టర్స్ నుంచి ఈ మొత్తాన్ని స్వీకరించినట్టు సంస్థ సీఎండీ హితేష్ దోషి తెలిపారు.
ఈ నిధులతో ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 9 గిగావాట్లకు చేర్చనున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఇది 5 గిగావాట్లు ఉంది. 2023 జనవరి నాటికి విస్తరణ పూర్తి అవుతుందని పేర్కొన్నారు.
గుజరాత్‌లోని చిక్లిలో ఉన్న కంపెనీకి చెందిన మాడ్యూల్స్ తయారీ కేంద్రం వద్ద 5.4 గిగావాట్ల సోలార్ సెల్స్ తయారీ యూనిట్ సైతం స్థాపిస్థామన్నారు. సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారీలో భాగంగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకంలో పాలుపంచుకోనున్నట్టు గుర్తు చేశారు. వారీ ఎనర్జీస్ ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ), ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్, రూఫ్‌టాప్ సొల్యూషన్స్ అందించడంతోపాటు సోలార్ వాటర్ పంప్స్ తయారీలోనూ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment