సెక్టార్ ఫండ్స్‌లో పెట్టుబడులు వద్దు | Sector Funds In Not for the investments | Sakshi
Sakshi News home page

సెక్టార్ ఫండ్స్‌లో పెట్టుబడులు వద్దు

Published Mon, Nov 16 2015 1:27 AM | Last Updated on Sun, Sep 3 2017 12:32 PM

సెక్టార్ ఫండ్స్‌లో పెట్టుబడులు వద్దు

సెక్టార్ ఫండ్స్‌లో పెట్టుబడులు వద్దు

పూర్తిగా ఫార్మా షేర్ల పోర్ట్‌ఫోలియోతో కూడిన ఫార్మా మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నాలుగు నుంచి ఐదేళ్ల కాలానికి ఇలా ఇన్వెస్ట్ చేసి, వచ్చిన ఆ డబ్బులను నా కూతురు ఉన్నత విద్యాభ్యాసానికి వినియోగించాలనేది నా ఆలోచన. తగిన సలహా ఇవ్వండి?
-సాంబశివ, వరంగల్

 
సెక్టార్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైన ఇన్వెస్ట్‌మెంట్ విధానం కాదని నా అభిప్రాయం. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రంగం షేర్లు మంచి పనితీరు కనబరుస్తాయి. అయితే ఆ రంగం పనితీరు బాగా ఉన్నా లేకున్నా సదరు సెక్టార్ ఫండ్ మేనేజర్ అదే రంగంలోని షేర్లలోనే ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి మొత్తం మీద మీకు వచ్చే రాబడులు అంతంతమాత్రంగానే ఉంటాయని చెప్పవచ్చు.

అందుకని మీరు భరించగలిగే రిస్క్, మీ పెట్టుబడుల కాలపరిమితిని పరిగణనలోకి తీసుకొని  ఏదైనా డైవర్సిఫైడ్ ఫండ్‌ను ఎంచుకొని ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ మీరు ఐదేళ్లకు మించి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి మంచి రాబడులు పొందవచ్చు.

ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో  నాలుగేళ్ల పాటు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్)లో ఇన్వెస్ట్ చేశాను. నాలుగేళ్ల తర్వాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏడాది పాటు సిప్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ ఫండ్ నుంచి నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవాలనుకుంటున్నాను. నేను ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా?
 - రాజేశ్, కాకినాడ

 
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని ఏడాది తర్వాత ఉపసంహరించుకుంటే ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. మీరు నాలుగేళ్ల పాటు సిప్ విధానంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి, ఏడాది తర్వాత ఆ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకున్నారు. కాబట్టి మీపై ఎలాంటి  మూలధన లాభాల పన్ను భారం ఉండదు. చివరి సిప్ ఇన్‌స్టాల్‌మెంట్ ఏడాది పూర్తయితేనే ఇది వర్తిస్తుంది.
 
మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఆదాయపు పన్ను ఆదా చేసుకోవచ్చని నా మిత్రుడొకరు చెప్తున్నారు. రకరకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కదా ! ఏ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసినా పన్ను రాయితీలు లభిస్తాయా? లేకుంటే ప్రత్యేకమైన మ్యూచువల్ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తే పన్ను రాయితీలు వస్తాయా? వివరించండి.
 - భాస్కర్, కరీంనగర్

 
ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్‌ఎస్‌ఎస్), లేదా ట్యాక్స్ ప్లానింగ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ ప్రకారం రూ.1.5 లక్షల వరకూ పన్ను మినహాయింపులు  పొందవచ్చు.
 నేను కొన్ని డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశాను. అయితే  ఈ డెట్ ఫండ్స్ ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదు. ఇటీవల వడ్డీరేట్లు తగ్గుతున్న నేపథ్యంలో డెట్ ఫండ్స్ రాబడులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ సురక్షింగానే ఉంటాయా?
 -వెంకట్, తిరుపతి
 
మీ డెట్ ఫండ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మీరు ఇవ్వలేదు. అందుకని డెట్ ఫండ్స్‌కు సంబంధించి సాధారణ అంశాలను వివరిస్తారు. రేట్ల కోత డెట్ ఫండ్స్‌కు ప్రయోజనకరమే. దీర్ఘకాలిక డెట్ స్కీమ్‌లకు రేట్ల కోత ఎంతో  మేలు చేస్తుంది. రేట్లను తగ్గించిన ప్రతిసారి ఈ స్కీమ్‌లు ఎన్‌ఏవీ పెరుగుతూ ఉంటుంది. డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ పూర్తిగా సురక్షితమైనవని చెప్పలేం. డెట్ ఫండ్స్ పనితీరు డెట్ మార్కెట్ పనితీరుతో అనుసంధానమై ఉంటుంది. అయితే ఇవి సాపేక్షకంగా సురక్షితమైనవని చెప్పవచ్చు.
 
ఫ్రాంక్లిన్ ఇండియా హై గ్రోత్ కంపెనీస్ ఫండ్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఏడు నెలలుగా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇప్పటివరకైతే ఇవి మంచి రాబడులను ఇవ్వలేదు. ఇన్వెస్ట్‌మెంట్స్ ఆపేసి నా డబ్బులు వెనక్కి తీసుకుందామనుకుంటున్నాను. అలా చేయమంటారా? లేక సిప్‌ను కొనసాగించమంటారా?
 - ప్రియ, సికింద్రాబాద్  

 
స్వల్పకాలిక పనితీరు ఆధారంగా నిర్ణయాలు తీసుకోకూడదు. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అది సరైన పెట్టుబడి వ్యూహం కాదు. ఇక ఫ్రాంక్లిన్ ఇండియా హై గ్రోత్ కంపెనీస్ ఫండ్ అనేది ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న మల్టీ క్యాప్ స్కీమ్. మూడు, ఐదేళ్ల కాలానికి ఈ విభాగానికి చెందిన మ్యూచువల్ ఫండ్స్‌లో మంచి పనితీరు కనబరిచిన ఫండ్ ఇదే. ఈ ఫండ్ ట్రాక్ రికార్డ్ కూడా చాలా బాగుంది. మంచి రాబడులు ఇవ్వగలిగిన సత్తా కూడా ఈ ఫండ్‌కు ఉంది. ఎలాంటి ఆందోళన, సందేహాలు, అనుమానాలు లేకుండా ఈ ఫండ్‌లో సిప్‌ను కొనసాగించండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement