ఎందులో ఇన్వెస్ట్ చేద్దాం
ప్రతి ఒక్కరికి కొన్ని ఆర్థిక లక్ష్యాలు ఉంటాయి. వాటికి అనుగుణంగా వారు కొన్ని ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఇలా ఇన్వెస్ట్ చేసే సమయంలోనే అసలు సమస్య ప్రారంభమౌతుంది. దేనిలో ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడ పెట్టుబడి పెడితే మన డబ్బుకు రక్షణతోపాటు రాబడి లభిస్తుంది? వంటి అనేక ప్రశ్నలు మన మనసులో ఘర్షణకు తెరలేపుతాయి. అలాంటి వారి సందేహాలను నివృత్తి చేయడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం.
పెట్టుబడి పెట్టే సమయంలో సాధారణంగా చాలా మంది ఈక్విటీ, గోల్డ్, రియల్ ఎస్టేట్ వంటి మూడు ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలు పరిగణనలోకి తీసుకుంటారు. ఈ మూడింటిలో ఒక్కో దానికి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే రిస్కులు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని, మీ అవసరాలకు అనుగుణంగా ఇన్వెస్ట్ చేసుకోండి. 1980-2014 మధ్యకాలంలో బంగారం 11 శాతం రాబడిని, ఈక్విటీ మార్కెట్ 17 శాతం రాబడిని అందించాయి. ఇన్వెస్టర్లు గత రెండు దశాబ్దాల కాలంలో రియల్టీ ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం వల్ల 20% మేర రాబడిని పొందారు.
* రిస్క్‌తోపాటు అధిక రాబడికి కేరాఫ్ ఈక్విటీ
* రియల్ ఎస్టేట్‌తో లిక్విడిటీ సమస్య
* పసిడి పెట్టుబడులకు పన్ను రాయితీలు నిల్
ఈక్విటీ
ప్రయోజనాలు
♦నేరుగా షేర్లలో లేదా మ్యూచువల్ ఫండ్స్ మొదలైన వాటి ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు.
♦మిగతా సాధనాలతో పోలిస్తే అధిక రాబడులు వచ్చే అవకాశం.
♦లిక్విడిటీ సౌకర్యం ఉంటుంది.
♦చాలా తక్కువ మొత్తంతో ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించవచ్చు.
♦షేర్లపై అంతగా అవగాహన లేనప్పుడు ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇవి ప్రొఫెషనల్స్ పర్యవేక్షణలో ఉంటాయి కనుక రిస్కులు కొంత మేర తగ్గొచ్చు.
♦పన్ను తదనంతర రాబడి ఆకర్షణీయంగా ఉంటుంది.
♦దీర్ఘకాల పెట్టుబడులకు పన్ను మినహాయింపులు వర్తిస్తాయి.
ప్రతికూలతలు
♦రిస్క్ అధికంగా ఉంటుంది.
♦స్వల్ప కాలంలో అధిక ఒడిదుడుకులు ఎదుర్కోవాలి.
♦మంచి స్టాక్స్‌ను ఎంచుకోవడం కొంత కష్టం.
బంగారం
పయోజనాలు
♦భౌతిక బంగారంపై పెట్టుబడి పెట్టడం సులభం.
♦దీర్ఘకాలంలో ఇన్వెస్ట్‌మెంట్ వల్ల అధిక రాబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
♦బంగారాన్ని ఆభరణాలు, ఇతర రూపాల్లోకి మార్చుకోవచ్చు.
♦అవసరమైన సందర్భాల్లో బంగారంపై సులభంగా రుణాలు పొందొచ్చు.
♦ ప్రస్తుతం భౌతిక రూపంలో కాకుండా ఎలక్ట్రానిక్ విధానంలో.. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) ద్వారా కూడా బంగారంలో ఇన్వెస్ట్ చేసే వీలుంది.
పయోజనాలు
♦భౌతిక బంగారంపై పెట్టుబడి పెట్టడం సులభం.
♦దీర్ఘకాలంలో ఇన్వెస్ట్‌మెంట్ వల్ల అధిక రాబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
♦బంగారాన్ని ఆభరణాలు, ఇతర రూపాల్లోకి మార్చుకోవచ్చు.
♦అవసరమైన సందర్భాల్లో బంగారంపై సులభంగా రుణాలు పొందొచ్చు.
♦ ప్రస్తుతం భౌతిక రూపంలో కాకుండా ఎలక్ట్రానిక్ విధానంలో.. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) ద్వారా కూడా బంగారంలో ఇన్వెస్ట్ చేసే వీలుంది.
రియల్టీ
ప్రయోజనాలు
♦తక్కువ అస్థిరత, మార్కెట్ ధరలు క్రమంగా పెరుగుతుండటం వంటి అంశాల కారణంగా ఇన్వెస్ట్‌మెంట్‌కు స్థిరత్వాన్ని తీసుకువస్తాయి.
♦పునరుద్ధరణ, మరమ్మత్తుల వల్ల ఇన్వెస్ట్‌మెంట్ విలువ పెరుగుతుంది.
♦అద్దెకు ఇచ్చిన పక్షంలో నిరంతర ఆదాయానికి అవకాశం ఉంది.
♦అవసరమైన పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్‌పై సులభతరంగా రుణాలు పొందగలిగే వెసులుబాటు.
ప్రతికూలతలు
♦ స్టాంపు సుంకం, రిజిస్ట్రేషన్ ఫీజులు మొదలైన వాటి కారణంగా ట్రాన్సాక్షన్ వ్యయాలు అధికంగా ఉంటాయి.
♦ఇన్వెస్ట్‌మెంట్‌కు అధిక మొత్తంలో డబ్బు అవసరం.
♦ఇందులో నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉంటుంది.
♦ప్రాపర్టీ విక్రయాలు వెంటనే జరగవు. కాబట్టి లిక్విడిటీ
♦తక్కువగా ఉంటుంది.