న్యూఢిల్లీ: యాక్సిస్ బ్యాంక్‌లో ఉన్న తన వాటాలో కొంత భాగాన్ని నేటి(మంగళవారం)నుంచి ప్రభు త్వం విక్రయిస్తోంది. ఎస్‌యూయూటీఐ(ద స్పెసిఫైడ్ అండర్‌టేకింగ్ ఆఫ్ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా)ద్వారా ఉన్న వాటాలో 3% వరకూ వాటాను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) ద్వారా విక్రయించనున్నది. ఇందులో భాగంగా 1.98% వాటాకు సమానమైన 5.07 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ చేస్తోంది.
దీంట్లో 10% వాటా షేర్లను రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. మరో 1.02% వాటాకు సమానమైన 2.63 కోట్ల ఈక్విటీ షేర్లను కూడా విక్రయించే అవకాశముంది. ఈ షేర్ల విక్రయానికి ఫ్లోర్ ధరగా రూ.689.52ను నిర్ణయించారు. ఇది సోమవారం ముగింపు ధర (రూ.710.35) కంటే 3% తక్కువ. వాటా విక్రయం సంస్థాగత ఇన్వెస్టర్లకు నేడు(మంగళవారం), రిటైల్ ఇన్వెస్టర్లకు బుధవారం జరుగుతుంది.
నేటి నుంచి యాక్సిస్ బ్యాంక్ ఓఎఫ్‌ఎస్
Published Tue, Feb 12 2019 1:25 AM | Last Updated on Tue, Feb 12 2019 1:25 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment