భారతీయుల సంపద.. 257 లక్షల కోట్లు | 257 lakh crore of Indian wealth | Sakshi
Sakshi News home page

భారతీయుల సంపద.. 257 లక్షల కోట్లు

Published Wed, Dec 17 2014 4:13 PM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM

భారతీయుల సంపద.. 257 లక్షల కోట్లు

భారతీయుల సంపద.. 257 లక్షల కోట్లు

వ్యక్తిగత సంపద విలువ 5 ఏళ్లలో 84% వృద్ధి..

గతేడాదితో పోలిస్తే 27% అప్
నాలుగేళ్లలో రెట్టింపు అయ్యే చాన్స్ డివూండ్
వ్యక్తిగత ఆస్తుల్లో బంగారానిదే తొలి స్థానం
2015లో ఈక్విటీలే అధిక రాబడిని ఇస్తారుు
2020కి సెన్సెక్స్ లక్ష్యం 1,00,000
కార్వీ ఇండియూ వెల్త్ రిపోర్ట్
ఐదవ ఎడిషన్ విడుదల

 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటంతో వచ్చే ఐదేళ్లలో భారతీయుుల వ్యక్తిగత సంపద రెట్టింపు అవుతుందని కార్వీ ఇండియా వెల్త్ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం రూ.257.4 లక్షల కోట్లుగా ఉన్న దేశ వ్యక్తిగత సంపద వచ్చే ఐదేళ్లు ఏటా 15 శాతం వృద్ధితో రూ. 500 లక్షల కోట్లు దాటుతుందని అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే వ్యక్తిగత సంపద 27.5 శాతం వృద్ధి చెందితే, గడిచిన ఐదేళ్లలో 84 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.

కార్వీ ప్రైవేట్ వెల్త్ సంస్థ విడుదల చేసిన ఐదవ భారతీయ సంపద వివరాల ప్రకారం భారతీయుల వ్యక్తిగత చరాస్తుల (నగదు, బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, ఈక్విటీ ఆధారిత పెట్టుబడులు) విలువ రూ. 134.7 లక్షల కోట్లు (52.3%), స్థిరాస్తుల (రియుల్ ఎస్టేట్, గోల్డ్, డైమండ్, సిల్వర్, ప్లాటినమ్) విలువ రూ. 122.7 లక్షల కోట్లు (47.7%)గా ఉంది. భారతీయుుల వ్యక్తిగత సంపద వృద్ధిపై ఆర్థికమాంద్య ఛాయలు కనిపించలేదని, ఇప్పుడు ఆర్థిక వృద్ధిరేటు పుంజుకుంటుండటంతో వచ్చే ఐదేళ్లలో ఈ సంపద రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నట్లు కార్వీ ప్రైవేట్ వెల్త్ సీఈవో సునీల్ మిశ్రా పేర్కొన్నారు.
 
జీడీపీ 7.5 శాతానికి...
2018 నాటికి దేశ జీడీపీ వృద్ధిరేటు 7.5 శాతానికి చేరుతుందని నివేదిక అంచనా వేసింది. వచ్చే ఐదేళ్లు ఈక్విటీల పనితీరు బాగుంటుందని, ఇతర ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలతో పోలిస్తే ఈక్విటీలే అధిక రాబడిని అందిస్తాయని కార్వీ పేర్కొంది. వచ్చే ఐదేళ్లు ఈక్విటీలు 25 శాతం వృద్ధి చెందడం ద్వారా 2020 నాటికి సెన్సెక్స్ 1,00,000 పాయింట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు ఈ నివేదిక పేర్కొంది.
 
బంగారానికి తగ్గిన డివూండ్
ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ పెరిగినప్పటికీ ఇండియూలో తగ్గినట్లు కార్వీ పేర్కొంది. 2012-13లో ఇండియా 918 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటే 2013-14లో ఈ విలువ 5.6 శాతం క్షీణించి 867 టన్నులకు పడిపోయింది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్ 16 శాతం వృద్ధితో 3,237 టన్నుల నుంచి 3,745 టన్నులకు పెరిగింది. కానీ ఇప్పటికీ భారతీయుల వ్యక్తిగత సంపదలో బంగారానిదే మొదటి స్థానం. సుమారు రూ. 62.53 లక్షల కోట్ల విలువైన బంగారాన్ని భారతీయులు కలిగి ఉన్నారు.
 
బంగారం తర్వాత రియల్ ఎస్టేట్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఈక్విటీలు వరుస స్థానాల్లో ఉన్నారు. రియల్ ఎస్టేట్‌లో రూ. 50.38 లక్షల పెట్టుబడులు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు బాండ్స్‌లో రూ. 29.39 లక్షల కోట్లు, ప్రత్యక్ష ఈక్విటీల్లో రూ. 26.66 లక్షల కోట్లు, బీమాలో రూ. 22.12 లక్షల కోట్లు కలిగి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement