
ఫ్రాంక్లిన్ టెంపుల్వ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్స్ (ఎఫ్‌టీఏఐ) తాజాగా తమ తొలి ఫండ్ ’ఫ్రాంక్లిన్ ఇండియా లాంగ్ షార్ట్ ఈక్విటీ ఏఐఎఫ్’ను ప్రవేశపెట్టింది. పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌పై అవగాహన ఉండి, ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాల్లో మరింతగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికోసం దీన్ని ఉద్దేశించినట్లు ఎఫ్‌టీఏఐ ప్రెసిడెంట్ నాగనాథ్ సుందరేశన్ తెలిపారు.
దేశీ సంస్థల ఈక్విటీ, డెరివేటివ్స్ మొదలైన వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మధ్య, దీర్ఘకాలానికి మెరుగైన రాబడులు అందించడం, పెట్టుబడుల విలువ పెరిగేలా చూడటం ఈ ఫండ్ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఫండమెంటల్, టెక్నికల్ విశ్లేషణల మేళవింపుతో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment