ముంబై: తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన విజయ డయగ్నోస్టిక్ సెంటర్ పబ్లిక్ ఇష్యూకి రెడీ అయ్యింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు ఢిల్లీలో ఈ సంస్థకు మొత్తం 13 నగరాల్లో 80 రోగ నిర్థారణ కేంద్రాలు ఉన్నాయి. తొలిసారిగా ఈ సంస్థ నిధుల సేకరణ కోసం పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఈ మేరకు సెబికి దరఖాస్తు చేసింది.
35 శాతం
విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రమోటర్ ఎస్ సురేంథ్రనాథ్‌రెడ్డితో పాటు ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేదార ఆల్టర్‌నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌లు సంయుక్తంగా ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 3.56 కోట్ల షేర్లను విక్రయించాలని నిర్ణయించారు. దీని ద్వారా కంపెనీలో 35 శాతం షేర్లు పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. ఇందులో 5 శాతం షేర్ ప్రమోటర్ సురేంద్రనాథ్‌కి కాగా మిగిలిలిన 30 శాతం షేర్లు ప్రైవేటు ఈక్వీటీ సంస్థది.
లాభాల బాటలో విజయ
కేదార ఆల్టర్‌నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ సంస్థ 2016లో విజయ డయగ్నోస్టిక్స్‌లో పెట్టుబడులు పెట్టింది. తాజా షేర్ల విక్రయం ద్వారా ఆ సంస్థ విజయ నుంచి దాదాపుగా తప్పుకోనుంది. గతేడాది విజయ డయాగ్నోస్టిక్స్ నికర లాభం రూ. 84.91 కోట్లు. అంతకు ముందు రూ. 62 కోట్ల లాభాన్ని ఆ సంస్థ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment