SEBI list
-
డీలిస్టింగ్‌పై సెబీ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: లిస్టెడ్ అనుబంధ సంస్థల డీలిస్టింగ్ విషయంలో హోల్డింగ్ కంపెనీలకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రామాణిక నిర్వహణ విధానాలను ప్రకటించింది. సర్దుబాటు పథకంలో భాగంగా లిస్టెడ్ అనుబంధ సంస్థను లిస్టెడ్ హోల్డింగ్ కంపెనీ స్టాక్ ఎక్సే్ంజీల నుంచి డీలిస్ట్ చేయదలచినప్పుడు రివర్స్ బుక్ బిల్డింగ్ పద్ధతి నుంచి మినహాయింపునకు సెబీ ఇటీవల అనుమతించింది. ఇందుకు వీలుగా పూర్తిస్థాయి నిబంధనలను తాజాగా విడుదల చేసింది. లిస్టయిన అనుబంధ సంస్థలు, హోల్డింగ్ కంపెనీలు ఒకే విధమైన బిజినెస్‌లు నిర్వహిస్తున్నప్పుడు ఈ నిబంధనలు వర్తించనున్నాయి. వీటి ప్రకారం రెండు కంపెనీలు కలసిపోవడం ద్వారా భారీ ప్రయోజనాలకు అవకాశముండాలి. రెండు కంపెనీల ఆదాయంలో కనీసం 50 శాతం ఒకే బిజినెస్ నుంచి నమోదవుతూ ఉండాలి. అంతేకాకుండా రెండు సంస్థలూ ఒకే గ్రూప్‌నకు చెంది ఉండాలి. రెండు సంస్థలూ కనీసం మూడేళ్లుగా స్టాక్ ఎక్సే్ంజీలలో లిస్టయి ఉండాలి. వెరసి జూన్‌లో నోటిఫై చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా సెబీ తాజాగా పలు నిబంధనలను విడుదల చేసింది. -
Vijaya Diagnostic: పబ్లిక్ ఇష్యూకి సిద్ధం
ముంబై: తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన విజయ డయగ్నోస్టిక్ సెంటర్ పబ్లిక్ ఇష్యూకి రెడీ అయ్యింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు ఢిల్లీలో ఈ సంస్థకు మొత్తం 13 నగరాల్లో 80 రోగ నిర్థారణ కేంద్రాలు ఉన్నాయి. తొలిసారిగా ఈ సంస్థ నిధుల సేకరణ కోసం పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఈ మేరకు సెబికి దరఖాస్తు చేసింది. 35 శాతం విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రమోటర్ ఎస్ సురేంథ్రనాథ్‌రెడ్డితో పాటు ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేదార ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లు సంయుక్తంగా ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 3.56 కోట్ల షేర్లను విక్రయించాలని నిర్ణయించారు. దీని ద్వారా కంపెనీలో 35 శాతం షేర్లు పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. ఇందులో 5 శాతం షేర్ ప్రమోటర్ సురేంద్రనాథ్‌కి కాగా మిగిలిలిన 30 శాతం షేర్లు ప్రైవేటు ఈక్వీటీ సంస్థది. లాభాల బాటలో విజయ కేదార ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సంస్థ 2016లో విజయ డయగ్నోస్టిక్స్‌లో పెట్టుబడులు పెట్టింది. తాజా షేర్ల విక్రయం ద్వారా ఆ సంస్థ విజయ నుంచి దాదాపుగా తప్పుకోనుంది. గతేడాది విజయ డయాగ్నోస్టిక్స్ నికర లాభం రూ. 84.91 కోట్లు. అంతకు ముందు రూ. 62 కోట్ల లాభాన్ని ఆ సంస్థ ప్రకటించింది. -
సహారా ఆస్తుల్లోమరికొన్ని వేలానికి..
♦ 42కు చేరిన మొత్తం స్థలాల సంఖ్య ♦ రిజర్వ్ ధర రూ.4,345 కోట్లు ♦ జాబితాలో ఇంకా 20 భూములు... న్యూఢిల్లీ: వేలం ప్రక్రియకు సంబంధించి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ జాబితాలో మరో పదహారు సహారా ఆస్తులు చేరాయి. వీటి బిడ్ ధరను రూ.1,245 కోట్లుగా నిర్ణయించింది. దీనితో వేలానికి సిద్ధమయిన మొత్తం భూముల సంఖ్య 42కు చేరింది. వీటి మొత్తం రిజర్వ్ ధర రూ.4,345 కోట్లకు చేరింది. రానున్న రోజుల్లో ఇంతే విలువైన ఆస్తులు వేలం జాబితాలో చేరే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి. సెబీ గురువారం రెండు వేర్వేరు నోటీసులు విడుదల చేస్తూ... జూలై 20వ తేదీన రూ.666 కోట్ల రిజర్వ్ ధరతో ఎస్బీఐ క్యాప్స్ ఎనిమిది ఆస్తుల ఈ-వేలం నిర్వహిస్తుందని పేర్కొంది. రూ.579 కోట్ల విలువైన మరో ఎనిమిది ఆస్తులను జూలై 18న హెచ్డీఎఫ్సీ ఈ-వేలం వేస్తుందని పేర్కొంది. జూలై 7, జూలై 13వ తేదీల్లో ఎస్బీఐ క్యాప్స్ మరికొన్ని భూములను ఈ ఆక్షన్ నిర్వహిస్తుండగా, జూలై 4, జూలై 15 తేదీల్లో హెచ్డీఎఫ్సీ రియల్టీ కొన్ని భూములకు వేలం నిర్వహించనున్నాయి. ఇరు సంస్థలు సమానంగా మొత్తం 26 ఆస్తులకు ఈ వేలం నిర్వహించనున్నాయి. రిజర్వ్ ధర రూ.3,100 కోట్లు. తరువాత మిగిలిన ఆస్తుల వేలం... 31 ల్యాండ్ పార్శిళ్లను రూ.2,400 కోట్లకు విక్రయించడానికి హెచ్డీఎఫ్సీ రియల్టీకి సెబీ అనుమతి ఉంది. ఇక ఎస్బీఐ క్యాప్ విషయంలో 30 ల్యాండ్ ప్రొపర్టీల అమ్మకాలకు అనుమతి ఉంది. దేశ వ్యాప్తంగా ఈ ఆస్తులు ఉన్నాయి. మిగిలిన ఆస్తుల ఈ- విక్రయానికి మరోసారి నోటీసులు వెలువడనున్నాయి. ఈ కేసులో రెండేళ్ల పాటు తీహార్ జైలులో ఉన్న సహారా చీఫ్ సుబ్రతారాయ్ ప్రస్తుతం పెరోల్‌పై ఉన్నారు.