న్యూఢిల్లీ: లిస్టెడ్ అనుబంధ సంస్థల డీలిస్టింగ్ విషయంలో హోల్డింగ్ కంపెనీలకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రామాణిక నిర్వహణ విధానాలను ప్రకటించింది. సర్దుబాటు పథకంలో భాగంగా లిస్టెడ్ అనుబంధ సంస్థను లిస్టెడ్ హోల్డింగ్ కంపెనీ స్టాక్ ఎక్సే్ంజీల నుంచి డీలిస్ట్ చేయదలచినప్పుడు రివర్స్ బుక్ బిల్డింగ్ పద్ధతి నుంచి మినహాయింపునకు సెబీ ఇటీవల అనుమతించింది. ఇందుకు వీలుగా పూర్తిస్థాయి నిబంధనలను తాజాగా విడుదల చేసింది.
లిస్టయిన అనుబంధ సంస్థలు, హోల్డింగ్ కంపెనీలు ఒకే విధమైన బిజినెస్‌లు నిర్వహిస్తున్నప్పుడు ఈ నిబంధనలు వర్తించనున్నాయి. వీటి ప్రకారం రెండు కంపెనీలు కలసిపోవడం ద్వారా భారీ ప్రయోజనాలకు అవకాశముండాలి. రెండు కంపెనీల ఆదాయంలో కనీసం 50 శాతం ఒకే బిజినెస్ నుంచి నమోదవుతూ ఉండాలి. అంతేకాకుండా రెండు సంస్థలూ ఒకే గ్రూప్‌నకు చెంది ఉండాలి. రెండు సంస్థలూ కనీసం మూడేళ్లుగా స్టాక్ ఎక్సే్ంజీలలో లిస్టయి ఉండాలి. వెరసి జూన్‌లో నోటిఫై చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా సెబీ తాజాగా పలు నిబంధనలను విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment