Vivek Debroy
-
2047 నాటికి ‘ఎగువ మధ్య తరగతి’ కేటగిరీలోకి భారత్!
న్యూఢిల్లీ: కొనుగోలు శక్తి సమానత్వం (పీపీపీ) నిబంధనల ప్రకారం, 2047 నాటికి భారతదేశం ‘ఎగువ మధ్య తరగతి’ కేటగిరీలోకి ప్రవేశించే అవకాశం ఉందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) చైర్మన్ వివేక్ దేవ్రాయ్ పేర్కొన్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే అధిక ఆదాయ కేటగిరీలో ఉన్నాయని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. భారత ఆర్థిక వృద్ధి రేటు పురోగతి కేవలం ఎగుమతులమీదే ఆధారపడి ఉందన్న అభిప్రాయం తప్పని ఆయన పేర్కొంటూ, దీనితోపాటు దేశాభివృద్ధికి బహుళ అవకాశాలు ఉ న్నాయని అన్నారు. ప్రపంచ బ్యాంక్ నిర్వచనం ప్ర కారం, తలసరి వార్షిక ఆదాయం 12,000 డాల ర్ల కంటే ఎక్కువ ఉన్న దేశాన్ని అధిక–ఆదాయ దేశంగా పరిగణిస్తారు. ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశాన్ని ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశంగా పరిగణిస్తున్నారు. 2047 నా టికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మా ర్చాలని ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా నిర్దేశించా రు. అభివృద్ధి చెందిన దేశం మానవ అభివృద్ధి సూ చిక (హెచ్డీఐ)లో దాదాపు తొలి స్థానాల్లో ఉంటుంది. సాధారణంగా అధిక స్థాయి ఆర్థిక వృద్ధి, సా« దార ణ జీవన ప్రమాణం, అధిక తలసరి ఆదా యంతో పా టు విద్య, అక్షరాస్యత, ఆరోగ్యాల విష యాల్లో మంచి ప్ర మాణాలను అభివృద్ధి చెందిన దేశం కలిగి ఉంటుంది. -
ఐదుగురు సభ్యులతో ఆర్థిక సలహా సంఘం
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ సభ్యుడు వివేక్ డెబ్రాయ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ఆర్థిక సలహా సంఘాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం నియమించారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో మోదీ ఏర్పాటు చేసిన తొలి ఆర్థిక సలహా సంఘం ఇదే. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు మూడేళ్ల కనిష్టానికి పడిపోయి, విమర్శలు పెరిగిన నేపథ్యంలో సలహా సంఘాన్ని నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కౌన్సిల్లో మిగతా సభ్యులుగా నీతి ఆయోగ్ ప్రధాన సలహాదారు రతన్ వాటల్, ఆర్థిక వేత్తలు సుర్జీత్ భల్లా, రథిన్ రాయ్, ఆషిమా గోయల్ ఉంటారు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విషయాలను విశ్లేషించి ప్రధానికి తెలియజేయటం, ఆయనకు సలహాలు ఇవ్వటం వీరి విధి. -
వ్యవసాయ ఆదాయ పన్నుపై జైట్లీ వివరణ
న్యూఢిల్లీ: వ్యవసాయ ఆదాయంపై పన్ను విధింపు పై ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. వ్యవసాయ ఆదాయంపై ఎలాంటి పన్ను విధించే యోచన ఏదీ లేదని బుధవారం స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం వద్ద అలాంటి ప్రణాళిక ఏదీ లేదని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నీతి ఆయోగ్ సూచించినట్టుగా వ్యవసాయ ఆదాయంలో ఏ పన్ను విధించాలనే ప్రణాళిక లేదని జైట్లీ ట్వీట్ చేశారు.తద్వారా నీతి ఆయోగ్ సభ్యుడు వివేక్ డెబ్రాయ్ సలహాను ఆయన కొట్టివేశారు. వ్యవసాయ ఆదాయంపై కూడా పన్ను విధించాలన్న నీతి ఆయోగ్ సూచనల నేపథ్యంలో జైట్ల వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వ్యవసాయ ఆదాయంపై న్ను వేయాలన్న యోచన ఏ దశలోనూ కలగలేదని జైట్లీ స్పష్టం చేశారు. ప్రస్తుతం రష్యాల్లో ఉన్నఅరుణ్ జైట్లీ వ్యవసాయ ఆదాయంపై ఎలాంటి పన్ను విధించేందుకు ప్రభుత్వం ప్రణాళిక వేయలేదని ప్రకటించారు. రాజ్యాంగ కేటాయించిన అధికారం ప్రకారం, ఈ తరహా పన్ను విధించేందుకు కేంద్రానికి ఎలాంటి అధికారంలేదని ఆయన వివరించారు. టాక్స్ ఆదాయాన్ని పెంచుకునేందుకుగాను వ్యక్తిగత ఆదాయపు పన్నుపై మినహాయింపులు తొలగించాలని, అలాగే రాష్ట్రాల ఆదాయ వనరుల్ని పెంచేందుకు వ్యవసాయాన్ని కూడా పన్ను పరిధిలోకి తీసుకురావాలని నీతి ఆయోగ్ సభ్యుడు వివేక్ డెబ్రాయ్ సూచించారు. దీనివల్ల పన్ను పరిధి పెరిగి, సాంఘిక సంక్షేమ పథకాలకు మరిన్ని నిధులు సమకూరుతాయని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో అమలవుతున్న వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉండాలని సూచించడం ఆందోళన రేపింది. కాగా వ్యవసాయ ఆదాయం పన్ను విధించబోమని మార్చి 22న జైట్లీ పార్లమెంటుకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. FM @arunjaitley :As per the Constitutional Allocation of Powers, the Central Govt has no jurisdiction to impose tax on agricultural income. — Ministry of Finance (@FinMinIndia) April 26, 2017 -
సాగు ఆదాయాన్ని పన్ను పరిధిలోకి తేవాలి
న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆదాయపు పన్నుపై మినహాయింపులు తొలగించాలని, అలాగే రాష్ట్రాల ఆదాయ వనరుల్ని పెంచేందుకు వ్యవసాయాన్ని కూడా పన్ను పరిధిలోకి తీసుకురావాలని నీతి ఆయోగ్ సభ్యుడు వివేక్ డెబ్రొయ్ సూచించారు. దీనివల్ల పన్ను పరిధి పెరిగి, సాంఘిక సంక్షేమ పథకాలకు మరిన్ని నిధులు సమకూరుతాయని చెప్పారు. మూడు లేదా ఐదేళ్ల సరాసరి ఆదాయం పరిగణనలోకి తీసుకుని వ్యవసాయ ఆదాయంపై పన్ను విధించాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో అమలవుతున్న వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉండాలన్నారు.