న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆదాయపు పన్నుపై మినహాయింపులు తొలగించాలని, అలాగే రాష్ట్రాల ఆదాయ వనరుల్ని పెంచేందుకు వ్యవసాయాన్ని కూడా పన్ను పరిధిలోకి తీసుకురావాలని నీతి ఆయోగ్ సభ్యుడు వివేక్ డెబ్రొయ్ సూచించారు.
దీనివల్ల పన్ను పరిధి పెరిగి, సాంఘిక సంక్షేమ పథకాలకు మరిన్ని నిధులు సమకూరుతాయని చెప్పారు. మూడు లేదా ఐదేళ్ల సరాసరి ఆదాయం పరిగణనలోకి తీసుకుని వ్యవసాయ ఆదాయంపై పన్ను విధించాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో అమలవుతున్న వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉండాలన్నారు.