purchasing power
-
2047 నాటికి ‘ఎగువ మధ్య తరగతి’ కేటగిరీలోకి భారత్!
న్యూఢిల్లీ: కొనుగోలు శక్తి సమానత్వం (పీపీపీ) నిబంధనల ప్రకారం, 2047 నాటికి భారతదేశం ‘ఎగువ మధ్య తరగతి’ కేటగిరీలోకి ప్రవేశించే అవకాశం ఉందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) చైర్మన్ వివేక్ దేవ్రాయ్ పేర్కొన్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే అధిక ఆదాయ కేటగిరీలో ఉన్నాయని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. భారత ఆర్థిక వృద్ధి రేటు పురోగతి కేవలం ఎగుమతులమీదే ఆధారపడి ఉందన్న అభిప్రాయం తప్పని ఆయన పేర్కొంటూ, దీనితోపాటు దేశాభివృద్ధికి బహుళ అవకాశాలు ఉ న్నాయని అన్నారు. ప్రపంచ బ్యాంక్ నిర్వచనం ప్ర కారం, తలసరి వార్షిక ఆదాయం 12,000 డాల ర్ల కంటే ఎక్కువ ఉన్న దేశాన్ని అధిక–ఆదాయ దేశంగా పరిగణిస్తారు. ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశాన్ని ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశంగా పరిగణిస్తున్నారు. 2047 నా టికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మా ర్చాలని ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా నిర్దేశించా రు. అభివృద్ధి చెందిన దేశం మానవ అభివృద్ధి సూ చిక (హెచ్‌డీఐ)లో దాదాపు తొలి స్థానాల్లో ఉంటుంది. సాధారణంగా అధిక స్థాయి ఆర్థిక వృద్ధి, సా« దార ణ జీవన ప్రమాణం, అధిక తలసరి ఆదా యంతో పా టు విద్య, అక్షరాస్యత, ఆరోగ్యాల విష యాల్లో మంచి ప్ర మాణాలను అభివృద్ధి చెందిన దేశం కలిగి ఉంటుంది. -
కోలుకుంటున్న ఖజానా
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోంది. కరోనాతో ఏర్పడ్డ సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021–22లో రాష్ట్ర సొంత ఆదాయం పెరగడం దీనిని సూచిస్తోంది. ఆర్థిక మందగమనంతో 2019–20లో రాష్ట్ర ఆదాయం ఆశించిన స్థాయిలో రాలేదు. ఆ తర్వాత ఏడాది 2020–21లో కోవిడ్ లాక్డౌన్, ఆంక్షలతో రాష్ట్ర సొంత ఆదాయం భారీగా పడిపోయింది. ఈ సమయంలో పేద, మధ్య తరగతి వర్గాలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల ద్వారా వారికి నేరుగా నగదు బదిలీ చేసింది. దీంతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. కోవిడ్ సంక్షోభం తగ్గుముఖం పట్టడం.. ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో ఈ ఆర్థిక ఏడాది 2021–22లో సవరించిన అంచనాల మేరకు రాష్ట్ర సొంత ఆదాయం రూ.73,690 కోట్లకు చేరుతుందని రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే విశ్లేషించింది. అయితే, 2019–20 ఆర్థిక ఏడాదిలో రాష్ట్ర సొంత ఆదాయం కేవలం రూ.57,601 కోట్లు రాగా ఆ మరుసటి సంవత్సరం 2020–21లో రూ.57,427 కోట్లు మాత్రమే వచ్చిందని పేర్కొంది. అంటే.. 2019–20లో వచ్చిన ఆదాయం కూడా 2020–21లో రాలేదు. ప్రధానంగా లాక్డౌన్లో రవాణా ఆంక్షల కారణంగా ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. 2021–22లో అమ్మకం పన్నుతో పాటు ఎస్జీఎస్టీ, రవాణా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రంగాలన్నింటిలో ఆదాయం పెరుగుదల నమోదైనట్లు సర్వే పేర్కొంది. అలాగే.. పన్నేతర ఆదాయం కూడా పెరుగుతున్నట్లు సర్వే వెల్లడించింది. 2019–20లో పన్నేతర ఆదాయం రూ.3,315 కోట్లు రాగా 2020–21లో రూ.3,395 కోట్లు వచ్చింది. 2021–22లో సవరించిన అంచనాల మేరకు రూ.5,451 కోట్లు వస్తుందని అంచనా వేసింది. -
సీఎం కేసీఆర్‌కు రమణ్‌సింగ్ లేఖ
ఛత్తీస్‌గఢ్ నుంచి 1,000 మెగావాట్ల కొనుగోళ్లకు గతంలో ఒప్పందం సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన లాంఛనాలను సత్వరంగా పూర్తి చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు లేఖ రాశారు. ఛత్తీస్‌గఢ్‌లోని మార్వా థర్మల్ విద్యుత్ ప్లాంట్ నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఆ రాష్ట్రంతో తెలంగాణ ప్రభుత్వం 2015 సెప్టెంబర్ 22న దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ) కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఖరీదైన ఛత్తీస్‌గఢ్ విద్యుత్ రాష్ట్రానికి గుదిబండగా మారనుందని విద్యుత్ రంగ నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ ఒప్పందం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మీమాంసలో పడింది. దీంతో ఇంత వరకు ఈ ఒప్పందానికి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్ఈఆర్సీ) ఆమోద ముద్ర వేయలేదు. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ధరలు తగ్గించేందుకు ఒప్పందంలో కొన్ని సవరణలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈఆర్సీ సూచిం చింది. ఈ విషయంలో టీఎస్ఈఆర్సీ ఇంత వరకు ఎలాంటి అధికారిక ఉత్తర్వు లు జారీ చేయకపోవడంతో కొంత గందరగోళం నెలకొంది. ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో గతంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఇంధన మంత్రి ఓ సారి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అరుునా, స్పందన లేకపోవడంతో తాజాగా ఛత్తీస్‌గఢ్ సీఎం స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిసింది. -
దక్షిణ డిస్కంకు ఎ-గ్రేడ్
- బీ+ రేటింగ్తోనే సరిపెట్టుకున్న ఉత్తర డిస్కం - జాతీయ స్థాయి వార్షిక రేటింగ్లను ప్రకటించిన కేంద్రం - ఇకపై సకాలంలో ఏఆర్‌ఆర్‌లు సమర్పించాలని సూచన సాక్షి, హైదరాబాద్: కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించిన 4వ జాతీయ స్థాయి వార్షిక రేటింగ్స్‌లో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) ఎ-గ్రేడ్ సాధించి మంచి పనితీరును చాటుకోగా...ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎన్పీడీసీఎల్) మాత్రం బీ+ గ్రేడ్‌తో సరిపెట్టుకుంది. పనితీరు ఆధారంగా 2012 నుంచి కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ వివిధ రాష్ట్రాల్లోని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు ఏటా రేటింగ్స్ కేటాయిస్తోంది. కార్యశీలత, ఆర్థిక నియంత్రణ, సంస్కరణలపరంగా డిస్కంల పనితీరును పరిగణనలోకి తీసుకొని 21 రాష్ట్రాల్లోని 40 ప్రభుత్వరంగ డిస్కంలకు తాజాగా 2016కి సంబంధించిన వార్షిక రేటింగ్స్‌ను ప్రకటించింది. విద్యుత్‌రంగ ప్రాజెక్టులకు రుణాలను కేటాయిస్తున్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) పర్యవేక్షణలో కేర్, ఇక్రా అనే ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ఈ రేటింగ్స్‌ను కేటాయించాయి. ఇందులో డిస్కంల బలాలు, బలహీనతలను ప్రముఖంగా వెల్లడించిన కేంద్రం... పనితీరు మెరుగుదల కోసం డిస్కంలు తీసుకోవాల్సిన చర్యలను సైతం సిఫారసు చేసింది. దక్షిణ డిస్కంకు సిఫారసులు: 2017-18కి సంబంధించిన ఏఆర్‌ఆర్‌ను సకాలంలో వచ్చే నవంబర్ 30లోగా ఈఆర్సీకి సమర్పించాలి. దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోళ్లను పెంచి విద్యుత్ కొనుగోలు ధరలను హేతుబద్ధీకరించాలి. ఉత్తర డిస్కంకు సిఫారసులు: ఏఆర్ఆర్లను సకాలంలో దాఖలు చేయాలి. మీటరింగ్‌ను మెరుగుపరుచుకోవాలి.దీర్ఘకాలిక ఒప్పందాలతో విద్యుత్ కొనుగోళ్లు చేపట్టాలి. -
ప్రాజెక్టుల డీపీఆర్‌లు బయటపెట్టాలి
ప్రభుత్వానికి టీజేఏసీ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చేపట్టిన సాగు, తాగునీటి పథకాల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను వెంటనే బహిర్గతం చేయాలని తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి (టీజేఏసీ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రాజెక్టుల కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ (సీబీఏ)లతోపాటు విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను (పీపీఏ) ప్రజల ముందుంచాలని స్పష్టం చేసింది. మణుగూరు థర్మల్ పవర్ ప్రాజెక్టు, జెన్కో ప్రాజెక్టుల బ్యాక్‌డౌన్, ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, థర్మల్ పవర్టెక్తో ఒప్పందాలు, సింగరేణి ప్రాజెక్టు నిర్మాణ, ఉత్పత్తి వ్యయాల పెంపుపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా డిమాం డ్ చేసింది. విద్యుత్ నియంత్రణ కమిషన్ (ఈఆర్సీ) విచారణలో ఉద్యోగులు పాల్గొన రాదంటూ విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తేయాలని, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మాదిరిగానే ప్రభుత్వరంగ సంస్థల్లోని ఉద్యోగులకూ వేతనాలు పెంచాలని కోరింది. ప్రభుత్వ నిర్ణయాలను వెలువరించే ఉత్తర్వులను ప్రజ లకు అందుబాటులో ఉంచాలని సూచించింది. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రజా సమస్యలకు సంబంధించిన 30 అంశాలపై జేఏసీ ఏకగ్రీవ తీర్మానాలు చేసింది. తీర్మానాలు, సమావేశంలో చర్చించిన అంశాలను టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విలేకరులకు వివరించారు. ప్రాజెక్టులపైనే రాష్ట్ర భవిష్యత్తు ప్రాజెక్టుల డీపీఆర్‌లు, సీబీఏలపై నిపుణులతో సదస్సులు నిర్వహిస్తామని, సదస్సుల్లో వ్యక్తమైన అభిప్రాయాలను ప్రజల వద్దకు తీసుకెళ్తామని ప్రొఫెసర్ కోదండారం చెప్పారు. రూ. వేల కోట్ల ప్రజాధనం ఇమిడి ఉన్న ప్రాజెక్టులపైనే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులు, సాగు, తాగునీటి ప్రాజె క్టుల్లో అవకతవకలు, ప్రజలకు భారంగా పరిణమించనున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు తదితర అంశాలపై ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యతను టీజేఏసీ చేపడుతుందని, ఈ మేరకు రాష్ట్రవ్యాప్త సదస్సులు, పాదయాత్రలను జేఏసీ నిర్వహించనుందని చైర్మన్ కోదండరాం వెల్లడించారు. రాష్ట్రంలో మరిన్ని కరువు మండలాలను గుర్తించాలని, ఇప్పటికే ప్రకటించిన కరువు మండలాల్లో ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాగునీటి సరఫరా, పశుగ్రాసం పంపిణీతోపాటు పంట నష్టపోయిన రైతులకు పరిహారం, ఇన్పుట్ సబ్సిడీని అందించాలన్నారు. కరువు ప్రాంతాల్లో వేసవి సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనం అమలు చేయాలని, వృద్ధులకు, చేతి వృత్తిదారులకు ఈ పథకాన్ని వర్తింపజేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వమే ఉచితంగా విద్య, వైద్యం అందించాలి ప్రభుత్వరంగంలోనే విద్య, వైద్య విభాగాలను బలోపేతం చేసి ఉచితంగా ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలని కోదండరాం డిమాండ్ చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ఐడీపీఎల్, హిందుస్తాన్ కేబుల్స్ తదితర మూతపడిన పరిశ్రమలను తెరిపించడంతోపాటు హిమాచల్‌ప్రదేశ్‌లో మాదిరిగా ప్రైవేటు కంపెనీల్లో స్థానికులకు రిజిర్వేషన్ కల్పించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని ఆయన సూచించారు. రాష్ట్ర పురోభివృద్ధి కోసం తెలంగాణ జేఏసీ కొనసాగుతుందని, రాజకీయేతర శక్తిగానే ముందుకెళుతుందన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రతి విషయంపైనా జేఏసీ తన విధానాన్ని ఇకపైనా ప్రకటిస్తుందన్నారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా, ఆయన సూచించిన మార్గంలోనే జేఏసీ నడుస్తుందన్నారు. తెలంగాణ సాధన కోసం ప్రాణాలర్పించిన, జైళ్లు, కేసుల పాలైన, ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలన్నారు. సమావేశంలో టీజేఏసీ రాష్ట్ర సమన్వయ కర్త పిట్టల రవీందర్, విద్యుత్ జేఏసీ కన్వీనర్ రఘు, జేఏసీ నాయకులు ఖాజా మొహినుద్దీన్, నల్లపు ప్రహ్లాద్, వివిధ జిల్లాల టీజేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు. టీజేఏసీ తీర్మానాల్లో మరికొన్ని.. ► ఉద్యమంలో పాల్గొన్న లాయర్ల కోసం రూ. 100 కోట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ నిధిని అర్హులైన వారి సంక్షేమానికి తక్షణం వాడాలి ► కరువు పరిస్థితులను అంచనా వేసేందుకు గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని వర్షపాతాన్ని లెక్కించాలి. ఇందుకోసం అన్ని గ్రామాల్లోనూ వర్షపాత నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాలి ► పంటలు నష్టపోయిన రైతులకు తక్షణ సాయంగా ఎకరానికి రూ. 10 వేల చొప్పున రైతులకు నగదు అందించాలి ► వ్యవసాయ అనుబంధ చేతి వృత్తిదారులు, మేకలు, గొర్రెల పెంపకందారులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలి ► ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానించాలి ► ఒకేసారి రైతులకు రుణమాఫీ చేసి వెంటనే పంట రుణాలు ఇప్పించాలి ► వ్యవసాయ స్థిరీకరణ కోసం వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, పాడి పరిశ్రమను అభివృద్ధి చేయాలి -
‘ఛత్తీస్’ వెలుగుల వెనుక చీకట్లు!
రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించేందుకు ఛత్తీస్‌గఢ్ నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్ల కోసం ప్రభుత్వం అక్కడి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఛత్తీస్‌గఢ్ నుంచే మరో 1,000 మె.వా.ను కొనుగోళ్లు చేయాలన్న ప్రతిపాదన సైతం ప్రభుత్వం వద్ద ఉంది. అయితే పరిస్థితులు ‘ఓపెన్ యాక్సెస్’కు మారిన నేపథ్యంలో అక్కడి నుంచి టెండర్లు లేకుండా విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదన్న భావన వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ధరలు భారం కానున్నాయి. ఉత్తరాదిన తక్కువ ధరకే విద్యుత్ లభిస్తుండడంతో ఛత్తీస్‌గఢ్ నుంచే ఎందుకు మొగ్గుచూపాలన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. టెండర్లు లేకుండా ఆ రాష్ట్రం నుంచి విద్యుత్ కొనుగోలా? * కాంపిటిటీవ్ బిడ్డింగ్‌కు వెళ్లకపోవడంతో భారీగా చార్జీల భారం * ఛత్తీస్‌గఢ్‌తో ఎంవోయూపై పునఃపరిశీలన జరపాల్సిన తరుణం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ కొరత ఉన్న సమయంలో ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలన్న ఆలోచన చేసింది. ఇతర ప్రాంతాలతో పోల్చితే.. పొరుగునే ఉన్న ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రానికి విద్యుత్ లైన్ల నిర్మాణానికి వ్యయప్రయాసలు తక్కువ ఉంటాయన్న ఆలోచనే ఇందుకు కారణం. ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రానికి విద్యుత్ లైన్లను నిర్మించాలని అప్పట్లో నిర్ణయం తీసుకుంది. అయితే ఇందుకు రూ.3 వేల కోట్ల ఖర్చు అవుతుందని ట్రాన్స్‌కో తేల్చడంతో ఈ ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకుంది. సీన్ కట్ చేస్తే మొత్తం కథే మారింది. కారిడార్‌పై గ్యారెంటీ లేదు : సొంత లైన్ల నిర్మాణానికి బదులు.. కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్(పీజీసీఎల్) నిర్మిస్తున్న వార్దా-డిచ్పల్లి-మహేశ్వరం లైన్ల ద్వారా ఛత్తీస్‌గఢ్ నుంచి ‘ఓపెన్ యాక్సెస్’ విధానంలో విద్యుత్ తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లైన్ల నిర్మాణం పూర్తికావడానికి రెండున్నరేళ్లకు పైనే పట్టనుంది. అప్పటి వరకు ఛత్తీస్‌గఢ్ విద్యుత్ రాష్ట్రానికి వచ్చే అవకాశం లేదు. ఈ లైన్‌ను పూర్తిగా తెలంగాణకే కేటాయిస్తారా అంటే.. అందుకు గ్యారెంటీ లేదు. ఈ లైన్ల కోసం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కంటే ముందే తమిళనాడు ప్రభుత్వం దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు అవసరాల కోసం దరఖాస్తు చేసుకుంది. నిబంధనల మేరకు ముందు దరఖాస్తు చేసుకున్న వారికే కేటాయింపులు జరగనున్నాయి. దీంతో ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ తీసుకొచ్చేందుకు కారిడార్ లభిస్తుందా అన్నది అనుమానమే. కారిడార్ వస్తే తక్కువ ధరకే కొనొచ్చు.. రెండున్నరేళ్ల తర్వాత ‘ఓపెన్ యాక్సెస్’లో విద్యుత్ కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ఛత్తీస్‌గఢ్ నుంచే కరెంటు ఎందుకు కొనుగోలు చేయడం అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఛత్తీస్‌గఢ్ జెన్కో నిర్మిస్తున్న ప్రాజెక్టు వ్యయం ఇప్పటికే మెగావాట్‌కు రూ.7 కోట్లు దాటింది. స్థిర, అస్థిర వ్యయాలు, ట్రాన్స్మిషన్ చార్జీలు కలుపుకుంటే ఈ ప్రాజెక్టు నుంచి వచ్చే విద్యుత్ వ్యయం యూనిట్‌కు రూ.5పైనే కానుందని అంచనా. కేవలం రూ.4 నుంచి రూ.4.50 వ్యయంతో విద్యుత్‌ను విక్రయించేందుకు ఉత్తరాదిన పలు విద్యుదుత్పత్తి కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయి. కొనుగోళ్లు చేసేవారు లేక వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు నిరుపయోగంగా మారడంతో ఉత్తరాదిన విద్యుత్ ధరలు భారీగా తగ్గిపోతున్నాయి. ఉత్తర-దక్షిణాది గ్రిడ్ల మధ్య కారిడార్ లభ్యత లేకపోవడంతో ఈ విద్యుత్‌ను దక్షిణాదికి తరలించే మార్గం లేకపోవడమే ప్రధాన కారణం. వార్దా-డిచ్పల్లి-మహేశ్వరం లైన్లతో ఈ అడ్డంకి తొలగిపోనుంది. రాష్ట్ర ప్రభుత్వం సొంత కారిడార్ నిర్మాణ ఆలోచనను విరమించుకున్న నేపథ్యంలో... ఛత్తీస్‌గఢ్ నుంచి కాంపిటీటివ్ బిడ్డింగ్ లేకుండా విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరమే లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విద్యుత్ కొనుగోళ్ల కోసం కాంపిటీటివ్ బిడ్డింగ్‌కు వెళ్తే ఛత్తీస్‌గఢ్ కంటే తక్కువ ధరకే విద్యుత్‌ను విక్రయించేందుకు ఉత్తరాది విద్యుత్కేంద్రాలు ముందుకు వచ్చే అవకాశం ఉండడమే ఇందుకు కారణం. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఉత్పత్తి ధరను ఆ రాష్ట్ర ఈఆర్సీ నిర్ణయించనుంది. ఆ విద్యుత్‌ను అక్కడి డిస్కంలు కొనుగోలు చేసి తెలంగాణకు అమ్ముతాయి. దీంతో ధరల విషయంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఆడిందే ఆట పాడిందే పాట కానుంది. -
కృష్ణపట్నం, హిందూజా విద్యుత్‌కు ఓకే
డిస్కంల అంచనాలకు ఈఆర్సీ ఆమోదం సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో మొత్తం 52,000 మిలియన్ యూనిట్ల విద్యుత్తు అవసరం ఉంటుందని తెలంగాణ ఈఆర్సీ అంచనా వేసింది. కృష్ణపట్నం నుంచి 5,600 మిలియన్ యూనిట్లు, హిందూజా నుంచి 3,650 మిలి యన్ యూనిట్ల విద్యుత్తు వస్తుందని డిస్కంలు వేసిన అంచనాలకు ఈఆర్సీ ఆమో దం తెలిపింది. ఏపీతో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల పేచీ ఉన్న కృష్ణపట్నం, హిందూజా, దిగువ సీలేరు నుంచి 53.89 శాతం విద్యుత్తు వాటా తమకే దక్కుతుందని డిస్కంలు ఏఆర్‌ఆర్‌లలో స్పష్టం చేశాయి. జనవరి నుంచి కృష్ణపట్నం మొదటి యూని ట్ 431 మెగావాట్లు, ఏప్రిల్‌లో రెండో యూనిట్ నుంచి మరో 431 మెగావాట్లు సమకూరుతుంది. ఏప్రిల్ 15 నుంచి హిందూజా మొదటి యూనిట్ ద్వారా 280 మెగావాట్లు, జులై 15 నుంచి రెండో యూనిట్ ద్వారా 280 మెగావాట్లు అందుబాటులోకి వస్తుందని డిస్కంలు ఇచ్చిన నివేదికలో ఉన్నాయి. వీటిని పరిశీలించి ఆమోదం తెలిపినట్లుగా ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్ వెల్లడించారు. ఏపీ ఇచ్చే విద్యుత్తు వాటాలు తీసుకోవాలా.. వద్దా.. అని రాష్ట్ర ప్రభుత్వం వెనుకా ముందాడుతున్న తరుణంలో ఈఆర్సీ అనుమతి ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. -
హిందూజాకు తలొగ్గిన సర్కారు!
ట్రాన్స్‌కో అభ్యంతరాలు బుట్టదాఖలు ప్రజలపై విద్యుత్ భారం ఖాయం సాక్షి, హైదరాబాద్: పవర్ రేసులో పరుగెత్తడమే లక్ష్యంగా ప్రభుత్వం హిందూజా సంస్థ గొంతెమ్మ కోర్కెలకు సర్కారు తలూపినట్లు తెలుస్తోంది. ప్రభుత్వమే హుకుం జారీ చేయడంతో ఏపీ ట్రాన్స్‌కో ఈ నెల 30వ తేదీకల్లా ఆ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సిద్ధమైంది. దీనివల్ల రాష్ట్ర ప్రజలపై మోయలేని విద్యుత్ భారం తప్పనిసరి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. హిందూజా డిమాండ్లను ఏపీ ట్రాన్స్‌కో మొదటినుంచి వ్యతిరేకిస్తోంది. దీంతో యాజమాన్యం నేరుగా ప్రభుత్వం పెద్దలను ఆశ్రయించి వారిని సంతృప్తి పరచడంతో హిందూజా కోరినట్టు పీపీఏలు చేసుకోవాలని ట్రాన్స్కోపై ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది.1040 మెగావాట్ల హిందూజా తాజాగా ఒక యూనిట్‌ను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. పాత పీపీఏలను పక్కనబెట్టి, కొత్త డిమాండ్లను తెరమీదకు తెచ్చింది. స్థిర వ్యయం రూ. 1.75 వరకూ ఇవ్వాలని ప్రతిపాదించింది. 75 శాతం విద్యుత్‌ను బయట అమ్ముకోవడానికి అనుమతి కోరింది.దీనికి అధికారులు ససేమిరా అనడంతో 100 శాతం విద్యుత్ రాష్ట్రానికే ఇవ్వడానికి ఒప్పుకుంది. సంస్థ కోరిన యూనిట్ కాస్ట్ ఇవ్వాలనే డిమాండ్ పెట్టింది. దీనివల్ల రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు భారీగా పెరుగుతాయని ట్రాన్స్‌కో అడ్డుపడింది. దీంతె ప్రభుత్వాన్ని ఆశ్రయించి ట్రాన్స్కోపై ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం యూనిట్ రూ. 1.50లకు విద్యుత్ కొనుగోలుకు స్థిర ఛార్జీ నిర్ణయించే వీలుంది. స్థిర, చర వ్యయాన్ని లెక్కిస్తే యూనిట్ రూ. 15 రూపాయలకు వెళ్ళినా ఆశ్చర్యం లేదని విద్యుత్ అధికారులు అభ్యంతరం చెబుతున్నారు. దీనిపై న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నామని ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్ తెలిపారు. -
అసలే లోటు.. ఆపై పీపీఏల రద్దు పోటు
-
తెలంగాణకు తీవ్ర కరెంట్ కష్టాలు
అసలే లోటు.. ఆపై పీపీఏల రద్దు పోటు * తాజాగా జాతీయగ్రిడ్ కారిడార్‌లో దక్కని బుకింగ్ * ఉత్తరాది కరెంటును తన్నుకుపోయిన తమిళనాడు * ఛత్తీస్‌గఢ్ కరెంటుకూ రెండున్నరే ళ్లు ఆగాల్సిందే * ఇప్పుడప్పుడే అందుబాటులోకి వచ్చే కొత్త ప్లాంట్లూ లేవు * విభజన హడావుడిలో కొరవడిన ముందుచూపు సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు వరుసగా కరెంటు షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఒకదాని వెంట మరొక ఇబ్బంది వచ్చి పడుతోంది. రాష్ర్టం ఏర్పడిన పక్షం రోజుల్లోనే విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏల) రద్దు రూపంలో తొలి దెబ్బ తగలగా.. జాతీయ గ్రిడ్ నుంచైనా అదనపు విద్యుత్‌ను పొందాలని ఆశిస్తే తాజాగా తమిళ తంబిలు దానికి గండికొట్టారు. మనకంటే ముందే ఆ కోటాను సొంతం చేసుకున్నారు. మహారాష్ట్రలోని షోలాపూర్ నుంచి కర్ణాటకలోని రాయచూర్ వరకు ఏర్పాటైన లైను ద్వారా ఉత్తరాది రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలుకు అవకాశమేర్పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ లైనును తమిళనాడు ఇప్పటికే బుక్ చేసుకోవడంతో తెలంగాణకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. మరోవైపు ఛత్తీస్‌గఢ్ నుంచి అదనపు విద్యుత్ కొనుగోలుకు ప్రస్తుతం లైన్లు లేవు. దీన్ని ఏర్పాటుకు రెండున్నరేళ్లకుపైగా సమయం పట్టే అవకాశముంది. మరోవైపు అదనపు విద్యుత్ ఉత్పత్తి కోసం కొత్త ప్లాంట్ల ఏర్పాటుకూ కొంత సమయం పడుతుంది. మొత్తంమీద ఈ పరిస్థితి తెలంగాణకు గోరుచుట్టుపై రోకలిపోటులా మారింది. ఎటు చూసినా రాష్ట్రాన్ని విద్యుత్ సంక్షోభం వెన్నాడుతూనే ఉంది. తమిళనాడు ముందుచూపు ఒకవైపు రాష్ట్రంలో విభజన ప్రక్రియ జరుగుతూ పాలన స్తంభించగా.. మరోవైపు తమిళనాడు ముందుచూపుతో వ్యవహరించింది. షోలాపూర్-రాయచూర్ రెండో లైను ద్వారా సరఫరా అయ్యే సుమారు 1,250 మెగావాట్లలో.. సుమారు వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ను తమిళనాడు ముందుగానే ‘బుక్’ చేసుకుంది. నిజానికి మొదటి లైనును కూడా ఆ రాష్ర్టం ఇదే విధంగా బుక్ చేసుకుంది. రెండో లైను విషయంలోనైనా ముందు జాగ్రత్త వహించాలని రాష్ర్ట ప్రభుత్వ వర్గాలు అప్పుడే అభిప్రాయపడ్డాయి. అయితే రాష్ర్ట విభజన ప్రక్రియ హ డావుడిలో పడిపోయి ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మెజారిటీ విద్యుత్‌ను తమిళనాడు ఎగరేసుకుపోవడంతో మిగిలిన 250 మెగావాట్ల కోసం మిగతా దక్షిణాది రాష్ట్రాలు (తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి) పోటీపడాల్సి వస్తోంది. దీంతో జాతీయ గ్రిడ్ ఆవిష్కృతమైనప్పటికీ రాష్ర్ట విద్యుత్ కష్టాలు తీరేందుకు అవకాశం లేకుండా పోయింది. ఏపీ నుంచీ వచ్చే పరిస్థితి లేదు ప్రస్తుతం తెలంగాణలో 161 మిలియన్ యూనిట్ల(ఎంయూ) డిమాండ్ ఉంది. సరఫరా మాత్రం 131 ఎంయూలకే పరిమితమైంది. దీంతో కోతలు అమలు చేయాల్సి వస్తోంది. ఈ లోటును ఇప్పటికిప్పుడు పూడ్చుకునే అవకాశాలు కనిపించడం లేదు. విభజన చట్టం మేరకు ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేద్దామంటే.. అక్కడ కూడా విద్యుత్ కోతలు రాజ్యమేలుతున్నాయి. ఆ రాష్ట్రానికి కూడా అదనపు విద్యుత్ వచ్చేది 2016 జూన్ తర్వాతే. అది కూడా ఒడిశాలోని అంగుళ్ నుంచి శ్రీకాకుళం మీదుగా వేమగిరి వరకూ నిర్మితమవుతున్న 765 కేవీ సామర్థ్యం కలిగిన డబుల్ సర్క్యూట్(డీసీ) లైను అందుబాటులోకి వస్తేనే ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలుకు అవకాశ ముంది. అంటే ఏపీ నుంచి అదనపు విద్యుత్ కొనుగోలుకు ఇప్పట్లో అవకాశం లేదు. పైగా ఇప్పటికే పోలవరం ఆర్డినెన్స్ వల్ల సింగూర్ జల విద్యుత్ కేంద్రం ఆ రాష్ట్రానికే దక్కింది. ఈ రకంగానూ తెలంగాణకు నష్టం వాటిల్లింది. ఛత్తీస్‌గఢ్ కరెంటూ ఇప్పుడే రాదు ఛత్తీస్‌గఢ్ నుంచి అదనపు విద్యుత్ కొనుగోలుకు రాష్ర్ట ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం ఏపీఈఆర్సీకి తెలంగాణ డిస్కంలు దరఖాస్తు చేసుకున్నాయి. అయితే, ఒప్పందం రూపంలో కాకుండా బిడ్డింగ్ రూపంలో ముందుకు వెళ్లాలని ఈఆర్సీ తేల్చిచెప్పింది. కానీ తెలంగాణ ఈఆర్సీ ఏర్పాటైన తర్వాత ఎంవోయూ రూపంలోనే ముందుకు వెళ్లాలని రాష్ర్ట ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ రావాలంటే ప్రత్యేక విద్యుత్ లైను అవసరం. దీన్ని ఏడాదిలోపు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అయితే రెండున్నరేళ్లకు పైగానే పడుతుందని పవర్‌గ్రిడ్ అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. అదనపు ఉత్పత్తికీ ఆలస్యమే రాష్ర్టంలో తీవ్ర కొరతను దృష్టిలో పెట్టుకుని రానున్న మూడేళ్లలో 6 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు తెలంగాణ జెన్కో ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. ఖమ్మం జిల్లాలో పాల్వంచ వద్ద 800 మెగావాట్లు, వరంగల్ జిల్లాలో భూపాలపల్లి వద్ద 800 మెగావాట్లు, మణుగూరులో 4 వేల మెగావాట్లు, రామగుండం వద్ద 800 మెగావాట్లు కలిపి మొత్తం 6,400 మెగావాట్ల సామర్థ్యమున్న విద్యుత్ కేంద్రాలను వచ్చే మూడేళ్లలో నిర్మించడానికి సిద్ధమైంది. ఇప్పటికే పాల్వంచ ప్లాంటుకు అవసరమైన భూసేకరణకు ప్రజాభిప్రాయ సేకరణ తంతునూ జెన్కో పూర్తిచేసింది. ఈ ప్లాంటుకు పూర్తిస్థాయి ప్రాజెక్టు రిపోర్ట్(డీపీఆర్) కూడా తయారైంది. అయితే, ఈ ప్లాంట్లన్నీ అందుబాటులోకి వచ్చేందుకు కనీసం నాలుగేళ్లయినా పట్టే అవకాశం ఉంది. ఇక నిర్మాణంలో ఉన్న ప్లాంట్లను తీసుకుంటే.. 600 మెగావాట్ల కేటీపీపీ మాత్రమే వచ్చే ఏడాదిలో వస్తుంది. పెరుగుతున్న డిమాండ్‌కు ఇది ఏ మాత్రమూ సరిపోదు. పులిచింతల, జూరాల వంటి జల విద్యుత్ కేంద్రాల నిర్మాణం జరుగుతున్నా.. నీటి వనరుల లభ్యత ఉంటేనే విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. కాబట్టి వీటిపై భరోసా పెట్టుకోలేము. మొత్తంమీద ఎటు చూసినా తెలంగాణలో ఇప్పుడప్పుడే విద్యుత్ కష్టాలకు తెరపడే అవకాశం కనిపించడం లేదు. ముందుచూపు ఫలితం తమిళనాడులో రెండేళ్ల క్రితం విద్యుత్ లోటు ఏకంగా 50 మిలియన్ యూనిట్లు ఉండేది. వారంలో మూడు రోజులపాటు పరిశ్రమలకు విద్యుత్ కోతలు అమలయ్యేవి. రాష్ర్ట రాజధానిలోనూ కనీసం ఐదారు గంటల పాటు సరఫరా ఆగిపోయేది. ఈ నేపథ్యంలో ఆ రాష్ర్ట ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించి షోలాపూర్-రాయచూర్ లైను ద్వారా ఉత్తరాది రాష్ట్రాల నుంచి లభ్యమయ్యే విద్యుత్‌లో ఏకంగా 2 వేల మెగావాట్లను ఇతర రాష్ట్రాలకంటే ముందే బుక్ చేసుకుంది. దాన్ని 25 ఏళ్లపాటు పొందేందుకు కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. అలాగే రాష్ట్రంలోని అనేక ప్రైవేటు విద్యుత్ ప్లాంట్ల నుంచి మొత్తం విద్యుత్‌ను కొనుగోలు చేయడంతో రెండేళ్లలోనే లోటును అధిగమించింది. ఇప్పుడు రబీ, వేసవి కాలంలోనూ పెద్దగా కోతల్లేవు. పరిశ్రమలకు పవర్ హాలిడే నుంచి విముక్తి లభించింది. గృహాలకు నామమాత్రంగానే కోతలు పెడుతున్నారు. రాష్ర్టంలో 290 మిలియన్ యూనిట్ల వరకు డిమాండ్ ఉంటే ఏకంగా 280 మిలియన్ యూనిట్లను ప్రభుత్వం సరఫరా చేయగలుగుతోంది. -
అట్టుడికిన అసెంబ్లీ
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మంగళవారం శాసన సభ ధర్నాలతో దద్ధరిల్లింది. తొలుత జేడీఎస్, అనంతరం బీజేపీ సభ్యులు ధర్నాలకు దిగడంతో స్పీకర్ కాగోడు తిమ్మప్ప పలు సార్లు సభను వాయిదా వేయాల్సి వచ్చింది. విద్యుత్ శాఖ డిమాండ్లపై గ్రాంట్లకు చర్చ సందర్భంగా జేడీఎస్ పక్షం నాయకుడు కుమార స్వామి మాట్లాడుతూ 2007-08 నుంచి 2012-13 వరకు విద్యుత్‌ను ఇష్టారాజ్యంగా కొనుగోలు చేశారని ఆరోపించారు. దీనిపై దర్యాప్తునకు సభా సంఘాన్ని నియమించాలని డిమాండ్ చేశారు. ఉదయం సభలో విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివ కుమార్ చర్చకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా సభా సంఘాన్ని ఏర్పాటు చేయాలన్న జేడీఎస్ డిమాండ్‌ను ఆయన తోసిపుచ్చారు. దీంతో ఆ పార్టీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకొచ్చి ధర్నాకు దిగారు. సభ్యులను శాంతింపజేయడానికి చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. అధికార, జేడీఎస్ పక్ష సభ్యులను తన ఛాంబర్‌కు పిలిపించి, ప్రతిష్టంభనను తొలగించడానికి ప్రయత్నించారు. కాసేపు చర్చల అనంతరం సభా సంఘం ఏర్పాటుకు ప్రభుత్వం సమ్మతించింది. దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సభలో ప్రకటన చేస్తూ 2006 నుంచి 2013 వరకు విద్యుత్ కొనుగోలుపై దర్యాప్తు చేయడానికి సభా సంఘాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. దీనిపై ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 2000 సంవత్సరం నుంచి విద్యుత్ కొనుగోలుపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. దీనికి సీఎం సమ్మతించలేదు. జేడీఎస్ డిమాండ్ మేరకు సభా సంఘాన్ని ఏర్పాటు చేశామంటూ, 15 సంవత్సరాల కిందట విద్యుత్ కొనుగోలుపై ఇప్పుడు దర్యాప్తు చేయడం సరికాదని సమాధానమిచ్చారు. దీనిపై సంతృప్తి చెందని బీజేపీ సభ్యులు ధర్నాకు దిగారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేసి, అన్ని పార్టీల నాయకులతో చర్చలు జరిపారు. దర్యాప్తు కాల వ్యవధిపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో, దీనిపై ఉభయ సభల్లోని పార్టీల నాయకులతో సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. -
అక్కడ వ్యూహం.. ఇక్కడ శాపం..
సాక్షి, మంచిర్యాల : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాలు తెలుగుదేశం పార్టీలో గందరగోళానికి దారి తీస్తున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను పార్టీ పరంగా సమర్థించాలో.. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో నిరసించాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. పోలవరం ముంపు గ్రామాలు, రుణ మాఫీ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ) సమీక్షపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ అవలంబిస్తున్న విధానాలు తెలంగాణలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల ఉనికిని గల్లంతు చేస్తున్నాయి. ముంపు ఎవరికి? పోలవరం ముంపు ప్రాంతాల విషయంలో తెలంగాణ, ఆం ధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పోరు ప్రారంభమైంది. ఈ అంశం లో పార్టీ పరంగా ఏం నిర్ణయం చెప్పాలో తెలియని స్థితిలో చంద్రబాబు మిన్నకున్నారు. ముంపు గ్రామాల విషయంలో టీడీపీ విధానం ఏమిటో ‘బాబు’తో చెప్పించాలని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఎండ గట్టారు. తాజాగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ) రద్దుచేయాలని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మరింత నిప్పు రాజేస్తున్నాయి. ఈ విషయమై ప్రధానమంత్రి నరేంద్రమోడీతో చర్చించేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేసుకున్నారు. అదే సమయంలో టీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ సర్కారు నిర్ణయాన్ని తెలంగాణ వ్యతిరేక చర్యగా పేర్కొంటూ ప్రజల్లోకి తీసుకువెళ్తోంది. ఈ పరిస్థితి టీడీపీ నాయకులు ప్రజల వద్దకు వెళ్లలేని వాతావరణాన్ని సృష్టించింది. మరోవైపు రుణమాఫీ విషయంలో తెలంగాణ సర్కారును ఇరకాటంలో పెట్టించాలనే చంద్రబాబు ఎత్తుగ డ బెడిసికొట్టింది. రుణామాఫీ విషయంలో మంత్రివర్గ స మావేశంలోని అంతర్గత చర్చ ఆధారంగా తెలంగాణ ప్రభుత్వంపై టీ.టీడీపీ నేతలు అంతెత్తున ఎగిరిపడ్డారు. రుణ మాఫీని పూర్తిస్థాయిలో చేయాల్సిందేనని అల్టిమేటం జారీచేశారు. చంద్రబాబు ఏపీ రైతుల రుణమాఫీ విషయంలో కమిటీ వేస్తామని, 6 నెలల్లో పూర్తిస్థాయి నివేదిక తెప్పించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పడాన్ని టీఆర్ఎస్ శ్రేణులు బాహాటంగానే ప్రశ్నిస్తున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వంపై ఎగిరిపడ్డ టీ.టీడీపీ నేతలు చంద్రబాబు నిర్ణయం తర్వాత కిమ్మనకుండా ఉండడం గమనార్హం. ఇక్కడా వెన్నుపోటేనా? ‘తెలంగాణ ప్రభుత్వం ఐదేళ్లు పాలించకముందే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం’అని చంద్రబాబు పేర్కొనడం తెలంగాణవాదుల్లో ఆగ్రహాన్ని తెప్పించాయి. ప్రజాస్వామ్యబద్ధం గా, పూర్తి మెజార్టీతో ఎన్నికయిన సర్కారును పదవీకాలం ముగియక ముందే తాము అధికారంలోకి వస్తామని చెప్ప డం వెనక అర్థాన్ని ప్రజలు గ్రిహ ం చారని టీడీపీ నాయకుడొకరు పేర్కొన్నారు. తెలంగాణ తొట్టతొలి ప్రభుత్వానికే మా నాయకుడి తనదైన వెన్నుపోటు మార్కు రాజకీయం చూపి స్తున్నాడని తెలుగుతమ్ముళ్లు మథన పడుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజల మద్ద తు కూడగట్టుకోవాలే గానీ ఈ రకమైన వ్యాఖ్యల ద్వారా ఏ సందేశం ఇస్తున్నారని అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారు.పార్టీ అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి తదనంతర పరిణామాలు తెలియకుండా మాట్లాడితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో అధికారం సిద్ధించే వరకు హైదరాబాద్‌ను వదలబోనని పేర్కొన్న నా యకుడు ప్రవర్తించాల్సిన తీరు ఇదేనా అని వారు లోలోన మథనపడుతున్నారు. అధికారం దేవుడెరుగు తమకు అంధకారం తప్పేలా లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.