సాక్షి, మంచిర్యాల : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాలు తెలుగుదేశం పార్టీలో గందరగోళానికి దారి తీస్తున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను పార్టీ పరంగా సమర్థించాలో.. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో నిరసించాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. పోలవరం ముంపు గ్రామాలు, రుణ మాఫీ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ) సమీక్షపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ అవలంబిస్తున్న విధానాలు తెలంగాణలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల ఉనికిని గల్లంతు చేస్తున్నాయి.
ముంపు ఎవరికి?
పోలవరం ముంపు ప్రాంతాల విషయంలో తెలంగాణ, ఆం ధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పోరు ప్రారంభమైంది. ఈ అంశం లో పార్టీ పరంగా ఏం నిర్ణయం చెప్పాలో తెలియని స్థితిలో చంద్రబాబు మిన్నకున్నారు. ముంపు గ్రామాల విషయంలో టీడీపీ విధానం ఏమిటో ‘బాబు’తో చెప్పించాలని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఎండ గట్టారు. తాజాగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ) రద్దుచేయాలని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మరింత నిప్పు రాజేస్తున్నాయి.
ఈ విషయమై ప్రధానమంత్రి నరేంద్రమోడీతో చర్చించేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేసుకున్నారు. అదే సమయంలో టీఆర్‌ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ సర్కారు నిర్ణయాన్ని తెలంగాణ వ్యతిరేక చర్యగా పేర్కొంటూ ప్రజల్లోకి తీసుకువెళ్తోంది. ఈ పరిస్థితి టీడీపీ నాయకులు ప్రజల వద్దకు వెళ్లలేని వాతావరణాన్ని సృష్టించింది. మరోవైపు రుణమాఫీ విషయంలో తెలంగాణ సర్కారును ఇరకాటంలో పెట్టించాలనే చంద్రబాబు ఎత్తుగ డ బెడిసికొట్టింది. రుణామాఫీ విషయంలో మంత్రివర్గ స మావేశంలోని అంతర్గత చర్చ ఆధారంగా తెలంగాణ ప్రభుత్వంపై టీ.టీడీపీ నేతలు అంతెత్తున ఎగిరిపడ్డారు.
రుణ మాఫీని పూర్తిస్థాయిలో చేయాల్సిందేనని అల్టిమేటం జారీచేశారు. చంద్రబాబు ఏపీ రైతుల రుణమాఫీ విషయంలో కమిటీ వేస్తామని, 6 నెలల్లో పూర్తిస్థాయి నివేదిక తెప్పించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పడాన్ని టీఆర్‌ఎస్ శ్రేణులు బాహాటంగానే ప్రశ్నిస్తున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వంపై ఎగిరిపడ్డ టీ.టీడీపీ నేతలు చంద్రబాబు నిర్ణయం తర్వాత కిమ్మనకుండా ఉండడం గమనార్హం.
ఇక్కడా వెన్నుపోటేనా?
‘తెలంగాణ ప్రభుత్వం ఐదేళ్లు పాలించకముందే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం’అని చంద్రబాబు పేర్కొనడం తెలంగాణవాదుల్లో ఆగ్రహాన్ని తెప్పించాయి. ప్రజాస్వామ్యబద్ధం గా, పూర్తి మెజార్టీతో ఎన్నికయిన సర్కారును పదవీకాలం ముగియక ముందే తాము అధికారంలోకి వస్తామని చెప్ప డం వెనక అర్థాన్ని ప్రజలు గ్రిహ ం చారని టీడీపీ నాయకుడొకరు పేర్కొన్నారు. తెలంగాణ తొట్టతొలి ప్రభుత్వానికే మా నాయకుడి తనదైన వెన్నుపోటు మార్కు రాజకీయం చూపి స్తున్నాడని తెలుగుతమ్ముళ్లు మథన పడుతున్నారు.
ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజల మద్ద తు కూడగట్టుకోవాలే గానీ ఈ రకమైన వ్యాఖ్యల ద్వారా ఏ సందేశం ఇస్తున్నారని అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారు.పార్టీ అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి తదనంతర పరిణామాలు తెలియకుండా మాట్లాడితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో అధికారం సిద్ధించే వరకు హైదరాబాద్‌ను వదలబోనని పేర్కొన్న నా యకుడు ప్రవర్తించాల్సిన తీరు ఇదేనా అని వారు లోలోన మథనపడుతున్నారు. అధికారం దేవుడెరుగు తమకు అంధకారం తప్పేలా లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అక్కడ వ్యూహం.. ఇక్కడ శాపం..
Published Wed, Jul 9 2014 1:34 AM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM
Advertisement
Advertisement