caved villages
-
జేబులు నింపుకోవడమే వారి లక్ష్యం
కొండాపురం : ముంపు గ్రామాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించకుండా పునారవాస కేంద్రాల్లో సిమెంట్‌రోడ్ల పనుల టెండర్లలో మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలు ఫిఫ్టీ–ఫిప్టీ పనులు పంచుకొని వారు జేబులు నింపుకొవడానికికే తప్ప ప్రజలకు మేలు చేయలేదని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం తాళ్లప్రొద్దుటూరులో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు, జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ సుధీర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి శంకర్‌రెడ్డితో కలసి ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయంలో రూ.32 లక్షల ఎకరాలను భూమి లేని నిరుపేదలకు పంచారన్నారు. మహానేత ð మరణించిన తర్వాత ఎవ్వరూ పేదలకు భూమిని పంచలేదన్నారు. ఇవ్వాల భూమిలేని ప్రతి పేదవాడికి భూమి ఇస్తామని ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో కరెంట్ బిల్లులు కట్టలేకపోతున్నారని వారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. రాజశేఖర్‌రెడ్డి హయంలో నియోజక వర్గంలో 42 వేల గృహాలు మంజూరు చేశారన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న నియోజకవర్గానికి 50 వేలు గృహలు కట్టిస్తామన్నారు. టీడీపీ ప్రభుత్వంలో బంగారుతల్లి పథకం కింద రూ. 20 వేలు ఇస్తామని చెప్పి ఏ ఒక్క హామీ నేరవేర్చలేదన్నారు. రేషన్ షాపులో 9 వస్తువులు ఇచ్చేవాళ్లు టీడీపీ ప్రభుత్వంలో బియ్యం కూడా సక్రమంగా ఇవ్వలేదన్నారు. చంద్రబాబు పాలనలో ఒక్క రైతుకు కూడా పూర్తిగా రుణమాఫీ కాలేదని, బంగారు ఇంటికి రాకపోగా బంగారు వేలం నోటీసులు ఇంటి కొస్తున్నాయని ఆయన విమర్శించారు. చంద్రబాబు 13 ఏళ్ల పాలనలో ఒక్క పథకం కూడా ప్రజలకు గుర్తుకురాలేదన్నారు. వైఎస్సార్ పేరు చెబితే ఆరోగ్యశ్రీ,, 108 సేవలు, ఉచిత విద్యుత్, జలయజ్ఞం లాంటి పథకాలు గుర్తుకొస్తాయన్నారు. ఏడాదిలోపే వైఎస్సార్సీపీ అధికారంలోకి రాబోతుందని, రైతులకు గిట్టుబాటు ధర కోసం ధరల స్థిరీకరణతో పాటు రచ్చబండలో తలెత్తిన సమస్యలన్నీంటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సురేష్‌బాబు మాట్లాడుతూ రచ్చబండ కార్యక్రమం అంటేనే మహానేత దివంగతనేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గుర్తుకొస్తున్నారన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సక్రమంగా అందించాలని సంకల్పంతో రచ్చబండ కార్యక్రమం ప్రవేశపెట్టాడన్నారు. కాబట్టి రచ్చబండలో సమస్యలన్ని రాబోతున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పరిష్కరిస్తామన్నారు. పి.రామసుబ్బారెడ్డి తొమ్మిదేళ్లు గృహనిర్మాణ మంత్రిగా పనిచేసినప్పుడు 9 వేలు గృహాలు కట్టించారన్నారు. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని ఆయన ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. జమ్మలమడుగులో అభివృద్ధి చేస్తా అన్న మంత్రి ఆదినారాయణరెడ్డి ముంపు గ్రామాల్లోకి వచ్చి ఒక్కరోజైనా సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాడా అంటూ ఆయన విమర్శించారు. కచ్చితంగా రాబోయే రోజుల్లో అన్ని వర్గాలవారికి న్యాయం జరుగుతుందన్నారు. 30 ఏళ్ల నుంచి ఆది, రామసుబ్బారెడ్డిలకు బుద్దిచెప్పే రోజులు దగ్గరపడ్డాన్నారు. సర్వేలో అన్యాయం.. డాక్టర్ సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ ముంపుగ్రామాల ప్రజలకు తప్పకుండా 10 నుంచి 13 లక్షలు ఫ్యాకేజీ పెంచుతామని రచ్చబండలో ముంపువాసులకు హామీ ఇచ్చారు. రెండో విడత సర్వేలో అన్యాయం జరిగిందని నాదృష్టికి తీసుకొచ్చారని మన ప్రభుత్వం రాగానే రీ సర్వే చేయించి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామన్నారు. గండికోట ప్రాజెక్టు కింద ముంపు నిర్వాసితులు యువకులు, యువతకు 18 ఏళ్లకు రెండు నెలలు తక్కువ ఉన్నా పరిహారం వర్థింప చేయలేదన్నారు. మన ప్రభుత్వం రాగానే 10 ఏళ్లు, 15 ఏళ్లు వయస్సును బట్టి పరిహారం ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్ల ప్రొద్దుటూరు ఎస్. రామసుబ్బారెడ్డి, హరినారాయణరెడ్డి, విజయ్‌కుమార్, గొందిశివ, మండల కన్వీనర్ నిరంజన్‌రెడ్డి, మండల మైనార్టీ అధ్యక్షుడు ఖాదర్‌బాషా, జిల్లా కార్యదర్శి రామముని రెడ్డి, కొండాపురం పట్టణ అ««ధ్యక్షుడు వాసుదేవరెడ్డి, మండల యూత్ కన్వీనర్ లక్ష్మీకాంత్‌రెడ్డి, రైతు విభాగ అధ్యక్షుడు రామనాథరెడ్డి, కోడూరు రామసుబ్బారెడ్డి, రామిరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, సత్యనారాయణరెడ్డి, చింతా రాజారెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ముంపు నుంచి తేలిన రత్నాపూర్
ఎస్సారెస్పీలో అడుగంటిన నీరు బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో నీరు లేకపోవడంతో ముంపు గ్రామాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అర్ధ శతాబ్దం క్రితం ముంపునకు గురైన నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం రత్నాపూర్ గ్రామ ఆనవాళ్లు బయటపడింది. ఇదివరకే కుస్తాపూర్ రామలింగేశ్వర స్వామి ఆలయం, రత్నాపూర్ గ్రామ ఆరాధ్య దైవం మల్లన్న గుట్ట వరకు రోడ్డు మార్గం బయల్పడింది. ప్రస్తుతం ఆ గ్రామ చెరువు, ఇళ్ల పునాదులు బయట పడ్డాయి. దీంతో మల్లన్న గుట్ట వద్ద పూజలు నిర్వహించేందుకు వస్తున్న ఆ గ్రామస్తులు తాము నివాసం ఉన్న ఇళ్ల ఆనవాళ్లను చూసి ఆవేదన, మరోవైపు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. రత్నాపూర్ గ్రామంలో మల్లన్న గుట్ట చుట్టూ నివాసాలు ఉండేవని చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే గుట్ట చుట్టూ పునాదులు వరుస క్రమంలో కనిపిస్తున్నాయి. మల్లన్న గుట్టకు సమీపంలో వీరన్న గుట్ట ఉంది. ఆ గుట్ట పూర్తిగా ప్రాజెక్ట్‌లో ముంపునకు గురైంది. ప్రస్తుతం ఆ గుట్ట పూర్తిగా బయటపడింది. అక్కడి వరకు రోడ్డు ఉంది. రత్నాపూర్ గ్రామం మల్లన్న గుట్టకు, వీరన్న గుట్టకు మధ్యలోనే ఉందనడానికి గుర్తులు కనిపిస్తున్నాయి. అలాగే, మల్లన్న గుట్టపై ఉన్న బురుజుపై గండదీపం ముట్టించే వారని చెబుతున్నారు. బురుజుపై గండ దీపం వెలిగిస్తే ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్‌కు కనిపించేదని వృద్ధులు పేర్కొంటున్నారు. -
బిల్లు ఉపసంహరించాలి
ఆదిలాబాద్ రూరల్ : పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తూ పార్లమెంట్ ఆమోదించిన బిల్లును ఉపసంహరించుకోవాలని జిల్లా సర్పంచుల సం ఘం, ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం జిల్లాకేంద్రంలోని ఆర్అండ్ బీ వసతి గృహం నుంచి ర్యాలీ తీశారు. కొమురం భీమ్ చౌరస్తాకు చేరుకొని ధర్నా నిర్వహించారు. వివిధ ఆదివాసీ సంఘాలు, స ర్పంచుల సంఘం నాయకులు మాట్లాడారు. ఆదివాసీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకప క్షంగా కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసి బిల్లు ఆమోదించడం అన్యాయమన్నారు. ఈ బిల్లును ఉపసంహరించుకొని, ముంపు గ్రామాలను తెలంగాణలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లక్షా 50 వేల మంది ఆదివాసీలను నిర్వాసితులను చేసే పోలవరం ప్రాజెక్టు రద్దు కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, న్యాయస్థానం ద్వారా పోరాడాలని కోరారు. ఇకనైనా కేంద్రం పోలవరం ప్రాజెక్టుపై తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని కలెక్టర్ జగన్మోహన్కు వినతిపత్రం సమర్పించారు. సర్పంచుల సంఘం జిల్లా కన్వీనర్ తుంరం చందర్షావ్, జిల్లా కో కన్వీనర్లు పెందోర్ మోహన్, మర్సుకోల కేశవ్, ఆదిలాబాద్ ఎంపీపీ నైతం లక్ష్మీసుఖలాల్, తోటి సంఘం జిల్లా అధ్యక్షుడు తొడసం శ్రీనివాస్, ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు కనక మాధవరావు, జిల్లా కార్యదర్శి మర్సుకోల వసంత్‌రావు, ఆదివాసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెస్రం గంగారాం, గిరిజన ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ గేడం మనోహర్, మేస్రం శంకర్, ఆదిమ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సిడాం వామన్‌రావు, అఖిల భారతీయ ఆదివాసీ వికాస్ పరిషత్ జిల్లా అధ్యక్షుడు సిడాం రాంకిషన్, తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కుర్సేంగే తానాజీ పాల్గొన్నారు. -
అక్కడ వ్యూహం.. ఇక్కడ శాపం..
సాక్షి, మంచిర్యాల : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాలు తెలుగుదేశం పార్టీలో గందరగోళానికి దారి తీస్తున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను పార్టీ పరంగా సమర్థించాలో.. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో నిరసించాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. పోలవరం ముంపు గ్రామాలు, రుణ మాఫీ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ) సమీక్షపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ అవలంబిస్తున్న విధానాలు తెలంగాణలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల ఉనికిని గల్లంతు చేస్తున్నాయి. ముంపు ఎవరికి? పోలవరం ముంపు ప్రాంతాల విషయంలో తెలంగాణ, ఆం ధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పోరు ప్రారంభమైంది. ఈ అంశం లో పార్టీ పరంగా ఏం నిర్ణయం చెప్పాలో తెలియని స్థితిలో చంద్రబాబు మిన్నకున్నారు. ముంపు గ్రామాల విషయంలో టీడీపీ విధానం ఏమిటో ‘బాబు’తో చెప్పించాలని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఎండ గట్టారు. తాజాగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ) రద్దుచేయాలని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మరింత నిప్పు రాజేస్తున్నాయి. ఈ విషయమై ప్రధానమంత్రి నరేంద్రమోడీతో చర్చించేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేసుకున్నారు. అదే సమయంలో టీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ సర్కారు నిర్ణయాన్ని తెలంగాణ వ్యతిరేక చర్యగా పేర్కొంటూ ప్రజల్లోకి తీసుకువెళ్తోంది. ఈ పరిస్థితి టీడీపీ నాయకులు ప్రజల వద్దకు వెళ్లలేని వాతావరణాన్ని సృష్టించింది. మరోవైపు రుణమాఫీ విషయంలో తెలంగాణ సర్కారును ఇరకాటంలో పెట్టించాలనే చంద్రబాబు ఎత్తుగ డ బెడిసికొట్టింది. రుణామాఫీ విషయంలో మంత్రివర్గ స మావేశంలోని అంతర్గత చర్చ ఆధారంగా తెలంగాణ ప్రభుత్వంపై టీ.టీడీపీ నేతలు అంతెత్తున ఎగిరిపడ్డారు. రుణ మాఫీని పూర్తిస్థాయిలో చేయాల్సిందేనని అల్టిమేటం జారీచేశారు. చంద్రబాబు ఏపీ రైతుల రుణమాఫీ విషయంలో కమిటీ వేస్తామని, 6 నెలల్లో పూర్తిస్థాయి నివేదిక తెప్పించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పడాన్ని టీఆర్ఎస్ శ్రేణులు బాహాటంగానే ప్రశ్నిస్తున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వంపై ఎగిరిపడ్డ టీ.టీడీపీ నేతలు చంద్రబాబు నిర్ణయం తర్వాత కిమ్మనకుండా ఉండడం గమనార్హం. ఇక్కడా వెన్నుపోటేనా? ‘తెలంగాణ ప్రభుత్వం ఐదేళ్లు పాలించకముందే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం’అని చంద్రబాబు పేర్కొనడం తెలంగాణవాదుల్లో ఆగ్రహాన్ని తెప్పించాయి. ప్రజాస్వామ్యబద్ధం గా, పూర్తి మెజార్టీతో ఎన్నికయిన సర్కారును పదవీకాలం ముగియక ముందే తాము అధికారంలోకి వస్తామని చెప్ప డం వెనక అర్థాన్ని ప్రజలు గ్రిహ ం చారని టీడీపీ నాయకుడొకరు పేర్కొన్నారు. తెలంగాణ తొట్టతొలి ప్రభుత్వానికే మా నాయకుడి తనదైన వెన్నుపోటు మార్కు రాజకీయం చూపి స్తున్నాడని తెలుగుతమ్ముళ్లు మథన పడుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజల మద్ద తు కూడగట్టుకోవాలే గానీ ఈ రకమైన వ్యాఖ్యల ద్వారా ఏ సందేశం ఇస్తున్నారని అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారు.పార్టీ అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి తదనంతర పరిణామాలు తెలియకుండా మాట్లాడితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో అధికారం సిద్ధించే వరకు హైదరాబాద్‌ను వదలబోనని పేర్కొన్న నా యకుడు ప్రవర్తించాల్సిన తీరు ఇదేనా అని వారు లోలోన మథనపడుతున్నారు. అధికారం దేవుడెరుగు తమకు అంధకారం తప్పేలా లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ముంపు గ్రామాలకు తెలంగాణ నుంచే విద్యుత్
సాక్షి, హైదరాబాద్: పోలవరం ముంపు గ్రామాలకు తెలంగాణ నుంచే విద్యుత్ సరఫరా కానుంది. ఈ మేరకు ఎన్పీడీసీఎల్ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని ఎన్పీడీసీఎల్ బోర్డు సమావేశం శుక్రవారం జరిగింది. పోలవరం ముంపు ప్రాంతాలైన ఏడు మండలాలకు చెందిన 208 నివాస ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ తాజాగా రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీటికి ఎక్కడి నుంచి విద్యుత్ సరఫరా చేయాలనే విషయంలో సందిగ్ధత ఏర్పడింది. ఈ ప్రాంతాలకు ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యుత్‌ను సరఫరా చేసేందుకు లైన్లు లేవు. కొత్తగా లైన్లు ఏర్పాటు చేసేందుకూ అవకాశం లేదు. ఎందుకంటే మధ్యలో గోదావరి నది ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతాలకు ఎన్పీడీసీఎల్ నుంచే విద్యుత్ సరఫరా అవుతోంది. అందువల్ల ఎన్పీడీసీఎల్ నుంచే సరఫరా కొనసాగించాలని నిర్ణయించారు. కాగా ఈ ప్రాంతాలకు ఎంత మేర విద్యుత్ సరఫరా అవుతుందో లెక్కించి... దానికి ప్రతిగా ఆంధ్రప్రదేశ్ కోటా నుంచి ఎన్పీడీసీఎల్కు సరఫరా చేయనున్నారు. -
నామినేషన్లు వేయం
కుక్కునూరు, న్యూస్‌లైన్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేయమని ముంపుప్రాంత అఖిలపక్షకమిటీ తీర్మానించింది. ఈ మేరకు తీర్మానంపై అన్నిపార్టీల నాయకులు సంతకాలు చేశారు. స్థానిక రామసింగారం సెంటర్లో బుధవారం జరిగిన సమావేశంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఎం, వైఎస్ఆర్సీపీ, సీపీఐ, కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు పాల్గొన్నారు. ముంపు ప్రాంతాల పరిరక్షణకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఎన్నికలను బహిష్కరించాలని కోరారు. ముంపు ప్రాంతాలను తెలంగాణలోనే ఉంచుతామని ప్రకటించిన తర్వాతనే ఎన్నికలు జరపాలన్నారు. లేకపోతే సార్వత్రిక ఎన్నికలనూ బహిష్కరిస్తామన్నారు. తీర్మానంపై సంతకాలు చేసిన వారిలో ఎస్కే గౌస్, కొన్నె లక్ష్మయ్య, కుచ్చర్లపాటి నరసింహరాజు, మన్యం సత్యనారాయణ, రాయి సత్యనారాయణ, రాయి రవీందర్, చేకూరి రమణరాజు, బోసురాజు, బాసినేని సత్యనారాయణ, ఆలవాల సీతారాంరెడ్డి, మడకం చందర్రావు, గంజి రాజేశ్, భూపతి రంగరాజు, సూర్యారావు, వీరభద్రం, తుంగా రమేశ్, లంకలరాజు, బాబూరావు బరపటి భాస్కరరావు ఉన్నారు. -
‘ముంపు’ తగ్గించాలి.. పరిహారం పెంచాలి
సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు నేలకొండపల్లి, న్యూస్‌లైన్: పోలవరం ఎత్తు తగ్గిస్తే ముంపు గ్రామాల సంఖ్యను తగ్గించాలని, (ముంపు) నిర్వాసితులకు పరిహారం పెంచాలని సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆయన శనివారం నేలకొండపల్లిలోని కర్నాటి కృష్ణయ్య భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ముంపు గ్రామాలన్నిటినీ జిల్లాలోనే ఉంచాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ గ్రామాలను సీమాంధ్రలో కలపడం అనివార్యమైతే మాత్రం వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోల వరం ప్రాజెక్ట్ ఎత్తును 150 నుంచి 135 మీటర్లకు తగ్గిస్తే చాలా గ్రామాలకు ముంపు ముప్పు తగ్గుతుందని అన్నారు. ముంపు బాధితులకు నూతన చట్టం ప్రకారం ఎకరాకు ఐదులక్షల రూపాయలు పరిహారంగా ఇవ్వాలని, జిల్లాలోనే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీపీఐ శక్తివంచన లేకుండా కృషి చేసిందన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన కాంగ్రెస్, బీజేపీ, జేఏసీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. రెండు రాష్ట్రాల ప్రజలు ఐక్యతతో ఉండాలని ఆకాంక్షిచారు. టీడీపీతో పొత్తు ఉండదు మతోన్మాద బీజేపీతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్న టీడీపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల పొత్తు ఉండదని పువ్వాడ స్పష్టం చేశారు. అధికారం కోసం తహతహలాడుతున్న చంద్రబాబు ఇప్పటికే బీజేపీతో కలిసి చాలా దూరం వెళ్లారని అన్నారు. ఎన్నికలలో వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసయినా గెలవాలని ఆ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న పార్టీలతో, కలిసొచ్చే వారితో పొత్తుకు సీపీఐ సిద్ధంగా ఉందన్నారు. లేనట్టయితే జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ, ఖమ్మం పార్లమెంట్ స్థానాల్లో సీపీఐ అభ్యర్థులు బరిలో ఉంటాయని అన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిద్ధి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి భానుప్రసాద్, బైరవునిపల్లి సర్పంచ్ సీతారాములు పాల్గొన్నారు. -
‘సీమాంధ్రలోకి ముంపు గ్రామాల’పై...నిరసన వెల్లువ
కేంద్రం దిష్టిబొమ్మ దహనం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను స్థానిక అంబేద్కర్ సెంటర్లో సీపీఐ, దాని అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు ఆదివారం దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయుసీ జిల్లా కార్యదర్శి, సీపీఐ డివిజన్ కార్యదర్శివర్గ సభ్యుడు వై.నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్ట్ కింద గ్రామాల ముంపునకు ముందు అంగీకరించి, ఇప్పుడు వీల్లేదంటూ మొసలి కన్నీరు కారుస్తున్న ప్రజాద్రోహులను ఏజెన్సీ ప్రజలు క్షమించరని అన్నారు. ఆదివాసీ గ్రామాలను సీమాంధ్రలో కలిపితే సహించేది లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు సునీల్ కుమార్, కోలా రాజు, బల్లా సాయికుమార్, ఎస్విఎస్.నాయుడు, వి.దుర్గారావు, సురేష్ నాయుడు, నవీన్, మంతోజు, గోపి, జయకర్, విక్రమ్, శ్యామల తదితరులు పాల్గొన్నారు. చెవిలో పువ్వులతో సీపీఎం ప్రదర్శన పోలవరం ముంపు గ్రామాల ప్రజల చెవుల్లో స్థానిక ఎంపీ, ఎమ్యెల్యేలు పువ్వులు పెట్టి మోసగించారని ఆరోపిస్తూ సీపీఎం నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఇక్కడ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకుడు, మాజీ ఎమ్యెల్యే కుంజా బొజ్జి మాట్లాడుతూ.. వేల కోట్ల రూపాయలతో ఏజెన్సీలో విద్య, వైద్య, వ్యాపార రంగాల అభివృద్ధి జరిగిందని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో ఈ అభివృద్ధంతా జల సమాధి అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవేవీ పట్టించుకోకుండా స్థానిక ఎంపీ, ఎమ్యెల్యేలు పైరవీలతో కాలం గడుపుతున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో నాయకులు ఎంబి.నర్సారెడ్డి, బి.వెంకటరెడ్డి, ప్రతాప్‌కుమార్, గిరి ప్రసాద్, మాధవరావు, నాగరాజు, శివాజీ, లీలావతి, జ్యోతి, గంగ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ రిలే దీక్షలు స్థానిక బస్టాండ్ ఎదుట టీడీపీ ప్రారంభించిన రిలే దీక్షలు ఆదివారం రెండోరోజుకు చేరాయి. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొమరం ఫణీశ్వరమ్మ మాట్లాడుతూ... భద్రాచలం నియోజకవర్గాన్ని గోదావరిలో నిండా ముంచిన పాపం యూపీఏ అధ్యక్షరాలు సోనియా గాంధీదేనని విమర్శించారు. ముంపు గ్రామాలను సీమాంధ్రకు వదిలేది లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలలో ఆమెతోపాటు పార్టీ నాయకులు అన్నెం వెంకటేశ్వరరావు, అక్కల శ్రీనివాస్, గొర్ల రామకృష్ణ, అక్కల జ్యోతి, జయరాజు, రవి, లక్ష్మి కూర్చున్నారు. శిబిరాన్ని టీడీపీ నాయకులు కుంచాల రాజారాం, కొడాలి శ్రీనివాస్, వట్టికొండ రాము, కోనేరు రాము, ఆలీ పాష తదితరులు సందర్శించారు.