ముంపు గ్రామాలకు తెలంగాణ నుంచే విద్యుత్ | power supply to caved villages from telangana | Sakshi
Sakshi News home page

ముంపు గ్రామాలకు తెలంగాణ నుంచే విద్యుత్

Published Sat, May 31 2014 12:35 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM

power supply to caved villages from telangana

 సాక్షి, హైదరాబాద్: పోలవరం ముంపు గ్రామాలకు తెలంగాణ నుంచే విద్యుత్ సరఫరా కానుంది. ఈ మేరకు ఎన్‌పీడీసీఎల్ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని ఎన్‌పీడీసీఎల్ బోర్డు సమావేశం శుక్రవారం జరిగింది. పోలవరం ముంపు ప్రాంతాలైన ఏడు మండలాలకు చెందిన 208 నివాస ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ తాజాగా రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీటికి ఎక్కడి నుంచి విద్యుత్ సరఫరా చేయాలనే విషయంలో సందిగ్ధత ఏర్పడింది. ఈ ప్రాంతాలకు ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యుత్‌ను సరఫరా చేసేందుకు లైన్లు లేవు. కొత్తగా లైన్లు ఏర్పాటు చేసేందుకూ అవకాశం లేదు. ఎందుకంటే మధ్యలో గోదావరి నది ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతాలకు ఎన్‌పీడీసీఎల్ నుంచే విద్యుత్ సరఫరా అవుతోంది. అందువల్ల ఎన్‌పీడీసీఎల్ నుంచే సరఫరా కొనసాగించాలని నిర్ణయించారు. కాగా ఈ ప్రాంతాలకు ఎంత మేర విద్యుత్ సరఫరా అవుతుందో లెక్కించి... దానికి ప్రతిగా ఆంధ్రప్రదేశ్ కోటా నుంచి ఎన్‌పీడీసీఎల్‌కు సరఫరా చేయనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement