నామినేషన్లు వేయం | caved villages boycott the local body elections nominations | Sakshi
Sakshi News home page

నామినేషన్లు వేయం

Published Thu, Mar 20 2014 2:11 AM | Last Updated on Sat, Sep 2 2017 4:55 AM

caved villages boycott the local body elections nominations

 కుక్కునూరు, న్యూస్‌లైన్:  ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేయమని ముంపుప్రాంత అఖిలపక్షకమిటీ తీర్మానించింది. ఈ మేరకు తీర్మానంపై అన్నిపార్టీల నాయకులు సంతకాలు చేశారు. స్థానిక రామసింగారం సెంటర్‌లో బుధవారం జరిగిన సమావేశంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఎం, వైఎస్‌ఆర్‌సీపీ, సీపీఐ, కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు పాల్గొన్నారు. ముంపు ప్రాంతాల పరిరక్షణకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.

 ఎన్నికలను బహిష్కరించాలని కోరారు. ముంపు ప్రాంతాలను తెలంగాణలోనే ఉంచుతామని ప్రకటించిన తర్వాతనే ఎన్నికలు జరపాలన్నారు. లేకపోతే సార్వత్రిక ఎన్నికలనూ బహిష్కరిస్తామన్నారు. తీర్మానంపై సంతకాలు చేసిన వారిలో ఎస్కే గౌస్, కొన్నె లక్ష్మయ్య, కుచ్చర్లపాటి నరసింహరాజు, మన్యం సత్యనారాయణ, రాయి సత్యనారాయణ, రాయి రవీందర్, చేకూరి రమణరాజు, బోసురాజు,  బాసినేని సత్యనారాయణ, ఆలవాల సీతారాంరెడ్డి,  మడకం చందర్రావు, గంజి రాజేశ్, భూపతి రంగరాజు, సూర్యారావు, వీరభద్రం, తుంగా రమేశ్, లంకలరాజు, బాబూరావు బరపటి భాస్కరరావు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement