సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ఘట్టానికి గురువారం తెరపడింది. జిల్లాలో జెడ్పీటీసీ స్థానాలకు 627, ఎంపీటీసీ స్థానాలకు 5,510 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం అధికారులు జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లను పరిశీలించనున్నారు. చివరిరోజున జెడ్పీటీసీ స్థానాలకు 463, ఎంపీటీసీ స్థానాలకు 3,758 మంది నామినేషన్లు దాఖలు చేశారు. జెడ్పీటీసీ అభ్యర్థులు సంగారెడ్డి జెడ్పీ కార్యాలయం వద్ద బారులు తీరారు. మండలాల్లో సైతం ఇదే పరిస్థితి కనిపించింది. మొదటి రెండు రోజులు అభ్యర్థులు జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు వేసేందుకు ఆసక్తి చూపలేదు.
అయితే చివరిరోజు ఎంపీటీసీ అభ్యర్థులతో మండల పరిషత్ కార్యాలయాలు కిటకిటలాడాయి. అన్ని ప్రధాన రాజకీయపార్టీల నుంచి అభ్యర్థులు పెద్ద సంఖ్యలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీ పడేందుకు ఆసక్తి చూపారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి స్థానికం బరిలో 50 మంది ఉన్నారు. జడ్పీటీసీ స్థానాలకు 9 మంది, ఎంపీటీసీ స్థానాలకు 41 మంది పోటీ చేస్తున్నారు.
జెడ్పీటీసీ స్థానాలకు మొత్తం 627 నామినేషన్లు రాగా మొదటి రోజున 4, రెండో రోజు 5, మూడో రోజు 155, చివరి రోజున 463 నామినేషన్లు వచ్చాయి.
ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 5,510 నామినేషన్లు రాగా మొదటి రోజు 30, రెండోరోజు 95, మూడోరోజు 1627, తుదిరోజున 3758 దాఖలయ్యాయి.
జెడ్పీటీసీకి 627 ఎంపీటీసీకి 5,510 నామినేషన్లు
Published Thu, Mar 20 2014 11:42 PM | Last Updated on Sat, Sep 2 2017 4:57 AM
Advertisement
Advertisement