సంగారెడ్డి డివిజన్/సంగారెడ్డి అర్బన్, న్యూస్‌లైన్: జెడ్పీటీసీ నామినేషన్ల పర్వం ముగిసింది. నామినేషన్ల దాఖలకు గురువారం చివరిరోజు కావటంతో భారీ ఎ త్తున నామినేషన్లు వచ్చాయి. దీంతో జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరించే సంగారెడ్డిలోని జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన అభ్యర్థులు జెడ్పీ ప్రధాన గేటు వద్ద బారులు తీరారు. ఒక దశలో అభ్యర్థులు పోటెత్తడంతో గందరగోళం నెలకొంది.
ఒకరినొకరు పరస్పరం తోపులాడుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చా రు. సాయంత్రం 5 గంటల వరకే నామినేషన్లు తీసుకోవాల్సి ఉన్నా అప్పటికే క్యూ లో చాలామంది ఉండడంతో అధికారులు రాత్రి వరకు స్వీకరించారు. సరిగ్గా 5 గంటలకు ప్రధాన గేటు మూసివేసి లోపల ఉన్న వారి నుంచే నామినేషన్లు తీసుకున్నారు.
వైఎస్సార్ సీపీ నుంచి ముగ్గురు..
పలువురు ప్రముఖులు చివరిరోజు నామినేషన్లు దాఖలు చేశారు. నారాయణఖేడ్ జెడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్ సీపీ తరఫున మహానంద షెట్కార్, శ్రీదేవి షెట్కార్, పెద్దశంకరంపేట నుంచి స్పందన నామినేషన్ వేశారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ సునీతాపాటిల్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు ఆర్.సత్యనారాయణ మేనకోడలు నాగరాణి, టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు బీరయ్య యాదవ్, ఆయన సతీమణి సుధారాణి నామినేషన్ దాఖలు చేశారు. ఆస్ట్రేలియాలో ఎంఎస్ చేసిన చైతన్యరెడ్డి పుల్కల్ నుంచి టీఆర్‌ఎస్ తరపున బరిలో దిగారు.
నారాయణఖేడ్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు నగేష్ షెట్కార్ కూతురు వర్ష, జితేందర్ షెట్కార్ సతీమణి సంగీత నారాయణఖేడ్ స్థానానికి కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేశారు. జిన్నారం నుంచి టీడీపీ నాయకుడు చంద్రారెడ్డి, తెలుగు యువత జిల్లా నాయకుడు శ్రీకాంత్‌గౌడ్ పటాన్‌చెరు నుంచి, బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి నామినేషన్ వేశారు. మనూ రు జెడ్పీటీసీగా 60 ఏళ్ల వృద్ధురాలు గంగమ్మ నామినేషన్ వేయగా దుబ్బాక నుంచి నిండు గర్భిణి పద్మజ స్వయంగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. సీపీఎం నుంచి 14 మంది ఒకేమారు వరుసగా నామినేషన్ వేశారు.
తొగుటలో ఎంపీటీసీకి రెండు..
తొగుట: మండలంలో ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్ సీపీ తరఫున ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఎల్లారెడ్డిపేట స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో నర్మెట లావణ్య, ఘనపురం ఎంపీటీసీ స్థానం జనరల్‌కు రిజర్వు కావడంతో పుల్లగూర్ల రాజిరెడ్డిలు గురువారం వైఎస్సార్ సీపీ తరఫున నామినేషన్లు వేసినట్టు ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రాజిరెడ్డి తెలిపారు.
చివరిరోజు సందడే సందడి
Published Thu, Mar 20 2014 11:45 PM | Last Updated on Tue, Oct 2 2018 2:53 PM
Advertisement
Advertisement