సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం బుధవారంతో ముగియనుంది. చివరి రోజు కావడంతో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు నామినేషన్లు భారీగా పడనున్నాయి. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సహా పలువురు ముఖ్య నాయకులు బుధవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. వైఎస్సార్ సీపీ నుంచి కూడా అభ్యర్థులు అన్ని స్థానాలకు వేయనున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడంలో జాప్యం జరగడంతో చివరి వరకు ఉత్కంఠ నెలకొంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్యనేతలు, గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు చివరి రోజు భారీగా వేయనున్నారు. అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లోక్‌సభకు నామినేషన్లు స్వీకరించే సంగారెడ్డి కలెక్టరేట్‌తోపాటు అసెంబ్లీ అభ్యర్థుల నామినేషన్లు స్వీకరించే నియోజకవర్గ కేంద్రాల్లో సైతం అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు పోలీసులు తగిన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు.
రెండు స్థానాలకు నేడు కేసీఆర్ నామినేషన్లు
టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు మెదక్ ఎంపీ, గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇందుకోసం ఆ పార్టీ నాయకులు తగిన ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ ఉదయం 11 గంటలకు హెలీకాప్టర్‌లో సంగారెడ్డిలోని మహిళా ప్రాంగణం సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటా రు. అక్కడి నుంచి ఆయన కలెక్టరేట్‌కు చేరుకుని జిల్లా ఎన్నికల అధికారికి నామినేషన్ సమర్పిస్తారు. ఆ తర్వాత ఆయన హెలీకాప్టర్‌లో గజ్వేల్ చేరుకుని అక్క డ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేస్తారు. కేసీఆర్ నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీలు నిర్వహించేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి.
చివరి రోజు లోక్‌సభకు వేయనున్న అభ్యర్థులు..
మెదక్ లోక్‌సభకు వైఎస్సార్ సీపీ నుంచి పి.ప్రభుగౌడ్, జహీరాబాద్ లోక్‌సభకు కాంగ్రెస్ అభ్యర్థిగా సురేశ్ షెట్కార్, టీడీపీ అభ్యర్థి మదన్‌మోహన్‌రావు బుధవారం నామినేషన్ వేయనున్నారు.
అసెంబ్లీ స్థానాలకు వేసే వారి వివరాలు...
పటాన్‌చెరు: నందీశ్వర్‌గౌడ్(కాంగ్రెస్), గూడెం మహీపాల్‌రెడ్డి(టీఆర్‌ఎస్), సయ్యద్ ర హ్మన్(సీపీఎం)
సంగారెడ్డి: తూర్పు జయప్రకాశ్‌రెడ్డి(కాంగ్రెస్), చింతా ప్రభాకర్(టీఆర్‌ఎస్)
సిద్దిపేట: టి.హరీష్‌రావు(టీఆర్‌ఎస్), టి.శ్రీనివాస్‌గౌడ్ (కాంగ్రెస్),
మెదక్: విజయశాంతి(కాంగ్రెస్), బట్టి జగపతి(టీడీపీ), పద్మాదేవేందర్‌రెడ్డి(టీఆర్‌ఎస్)
జహీరాబాద్: జె.గీతారెడ్డి(కాంగ్రెస్), నరోత్తం(టీడీపీ), కె.మాణిక్‌రావు(టీఆర్‌ఎస్)
నారాయణఖేడ్: కిష్టారెడ్డి(కాంగ్రెస్), విజయపాల్‌రెడ్డి(టీడీపీ), భూపాల్‌రెడ్డి(టీఆర్‌ఎస్)
నర్సాపూర్: సునీతారెడ్డి(కాంగ్రెస్), సీహెచ్ మదన్‌రెడ్డి(టీఆర్‌ఎస్), గజ్వేల్: కె.చంద్రశేఖర్‌రావు(టీఆర్‌ఎస్), ప్రతాప్‌రెడ్డి(టీడీపీ), అందోల్: సి.దామోదర్ రాజనర్సింహ(కాంగ్రెస్), బాబూమోహన్(టీడీపీ)
దుబ్బాక: సీహెచ్ ముత్యంరెడ్డి(కాంగ్రెస్), రఘునందన్‌రావు(బీజేపీ), కాగా వైఎస్సార్ సీపీ నుంచి దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు.
ప్రముఖుల నామినేషన్లు నేడే..
Published Wed, Apr 9 2014 12:07 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement