సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో ఆదివారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధిక శాతం ఓటర్లు టీఆర్‌ఎస్‌వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. అన్ని పార్టీల అభ్యర్థులు రాత్రికి రాత్రే కోట్లాది రూపాయలను పంచినా ఓటర్లు మాత్రం పరిణతితో కూడిన తీర్పే ఇవ్వబోతున్నట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్, తెచ్చిన టీఆర్‌ఎస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడిచిందనే చెప్పాలి. రెండు కళ్ల సిద్ధాంతాన్ని నమ్ముకున్న తెలుగుదేశం పార్టీ డీలాపడింది. ఒక్క గజ్వేల్ నగర పంచాయతీలో మినహా మిగిలిన అన్నిచోట్ల టీడీపీ మూడో స్థానంలోకి వెళ్లినట్టేనని తెలుస్తోంది.
జహీరాబాద్ మున్సిపాలిటీ, జోగిపేట నగర పంచాయతీలో కాంగ్రెస్ పార్టీకి, సదాశివపేట మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ వార్డులు వచ్చే అవకాశాలున్నాయి. సంగారెడ్డి, మెదక్ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్-కాంగ్రెస్ పార్టీలు, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీలో టీడీపీ-టీఆర్‌ఎస్ పార్టీలు హోరాహోరాగా పోరాడినట్టు పరిశీలకులు చెబుతున్నారు. ఈ మూడు చోట్ల కూడా చైర్మన్ ఎంపికకు అవసరమైనన్ని మెజార్టీ వార్డులు రాకపోవచ్చు. ఇక్కడ స్వతంత్ర, ఎంఐఎం, బీజేపీ అభ్యర్థులు కీలకం కానున్నారు. వారు ఎవరికి మద్దతు తెలిపితే ఆ పార్టీయే చైర్మన్ పీఠం దక్కించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తానికి టీఆర్‌ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జిగా ఆ పార్టీ నాయకుడు హరీష్‌రావు వ్యూహం ఫలించిందనే చెప్పాలి. అన్ని పార్టీలకంటే టీఆర్‌ఎస్ భారీగా ఓటింగ్ శాతాన్ని పెంచుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలబడిన చోట గట్టిపోటీ ఇచ్చారు.
కారు జోరు..!
Published Sun, Mar 30 2014 11:40 PM | Last Updated on Sat, Sep 2 2017 5:22 AM
Advertisement
Advertisement