ఒంగోలు, న్యూస్‌లైన్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు బుధవారం జిల్లా వ్యాప్తంగా పోటెత్తాయి. జెడ్పీటీసీ స్థానాలకు 109 మంది నామినేషన్లు దాఖలు చేయగా ఎంపీటీసీకి 1674 నామినేషన్లు వేయడం గమనార్హం. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ పుల్లలచెరువు మండలం నుంచి జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు వైఎస్సార్ సీపీ యర్రగొండపాలెం నియోజకవర్గ సమన్వయకర్త పాలపర్తి డేవిడ్‌రాజు కూడా హాజరయ్యారు.
జెడ్పీటీసీకి తొలిరోజైన సోమవారం సీపీఐ నుంచి ఒకరు, టీడీపీ నుంచి ఒకరు నామినేషన్లు దాఖలు చేశారు. రెండోరోజు మంగళవారం ఒక్క నామినేషన్ కూడా రాలేదు. బుధ, గురువారాలు మాత్రమే నామినేషన్లకు గడువు ఉండడంతో భారీగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉందని భావించి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరుగుతున్న పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంపైపు రోడ్డుపై పూర్తిస్థాయిలో పోలీసులు మోహరించారు. ఎంపీటీసీలకు సంబంధించిన నామినేషన్లు కూడా పోటాపోటీగా సాగాయి. త్రిపురాంతకం మండలంలోని ఎంపీటీసీలకే బుధవారం ఒక్కరోజు 68 మంది నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం.
బుధవారం జెడ్పీటీసీకి దాఖలైన 109 నామినేషన్లలో వైఎస్సార్‌సీపీ తరఫున అత్యధికంగా 63 వచ్చాయి. టీడీపీ 32, కాంగ్రెస్ 4, బీజేపీ 2, స్వతంత్రులు 8 మంది నామినేషన్లు వేశారు. దీంతో మూడోరోజు ముగిసే నాటికి మొత్తం వైఎస్సార్‌సీపీ 63, టీడీపీ 33, కాంగ్రెస్ 4, బీజేపీ 2, సీపీఐ 1, స్వతంత్రులు 8 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు అయింది.
ఎంపీటీసీలు: 1674 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఒంగోలు రెవెన్యూ డివిజన్: ఈ డివిజన్‌లో మొత్తం 488 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో బీఎస్పీ 1, సీపీఐ 1, సీపీఎం 25, కాంగ్రెస్ 2, వైఎస్సార్‌సీపీ 172, టీడీపీ 234, స్వతంత్రులు 53
కందుకూరు రెవెన్యూ డివిజన్: ఈ డివిజన్‌లో 758 మంది నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ 3, సీపీఐ 5, సీపీఎం 10, కాంగ్రెస్ 7, వైఎస్సార్ సీపీ 322, టీడీపీ 344, స్వతంత్రులు 67.
మార్కాపురం రెవెన్యూ డివిజన్: దాఖలైన మొత్తం నామినేషన్ల సంఖ్య 428. బీఎస్పీ 2, బీజేపీ 4, సీపీఐ 7, సీపీఎం 3, కాంగ్రెస్ 3, వైఎస్సార్ సీపీ 212, టీడీపీ 130, స్వతంత్రులు 67 మంది ఉన్నారు.
పోటెత్తిన నామినేషన్లు
Published Thu, Mar 20 2014 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 4:55 AM
Advertisement
Advertisement