Dr nookasani balaji
-
రాష్ట్రాభివృద్ధి జగన్‌తోనే సాధ్యం
పుల్లలచెరువు, న్యూస్‌లైన్ : రాష్ట్రాభివృద్ధి వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. మండలంలోని ఐటీవరం, చౌటపాచర్ల, కొండారెడ్డి కొష్టాలు, ముటుకుల గ్రామాల్లో నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజుతో కలిసి బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు. ఆయన పాలనలో ప్రతి కుటుంబం ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందిందన్నారు. విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్, పేదలకు ఆరోగ్యశ్రీ, 108, 104 వంటి మహోన్నత పథకాలు ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో వైఎస్సార్ చెరగని ముద్రవేసుకున్నారని కొనియాడారు. మహానేత సంక్షేమ పథకాలకు ఆయన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు తూట్లు పొడిచారని విమర్శించారు. వైఎస్సార్ పథకాలు తిరిగి అమలు చేయాలంటే ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వం రాష్ట్రానికి అవసరమన్నారు. ప్రజా సంక్షేమం కోరే నాయకులను ఎన్నుకోవాలని ఓటర్లకు బాలాజీ పిలుపునిచ్చారు. నియోజకవర్గ సమన్వయకర్త పాలపర్తి డేవిడ్‌రాజు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే వైఎస్ రాజశేఖరరెడ్డి పథకాలన్నింటినీ వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తారని చెప్పారు. వైఎస్సార్ సీపీతోనే సీమాంధ్ర అభివృద్ధి చెందుతుందన్నారు. యువకులు వైఎస్సార్ సీపీకి అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఆళ్ల శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో 30 కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరాయి. బాలాజీ, డేవిడ్‌రాజులు వీరికి కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ఉడుముల శ్రీనివాసరెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యులు కోటిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, సెంట్రల్ బ్యాంక్ మాజీ డెరైక్టర్ బి.సుబ్బారెడ్డి, మార్కెట్ యార్డు డెరైక్టర్ శ్రీనివాసరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సుందరరావు, సర్పంచ్‌లు సీతారామిరెడ్డి, అబ్రహం, జి.శ్రీనివాసరావు, పాపయ్య, ఎండ్రపల్లి స్వామి, బీవీ సుబ్బారెడ్డి, కె.బచ్చయ్య, కె.వెంకటేశ్వర్లు, ఆళ్ల శ్రీకాంత్‌రెడ్డి, బుల్లెబ్బాయి, బడే సాహెబ్, లక్ష్మీబాయి, శంకరరెడ్డి, గాలిరెడ్డి పాల్గొన్నారు. -
పోటెత్తిన నామినేషన్లు
ఒంగోలు, న్యూస్‌లైన్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు బుధవారం జిల్లా వ్యాప్తంగా పోటెత్తాయి. జెడ్పీటీసీ స్థానాలకు 109 మంది నామినేషన్లు దాఖలు చేయగా ఎంపీటీసీకి 1674 నామినేషన్లు వేయడం గమనార్హం. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ పుల్లలచెరువు మండలం నుంచి జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు వైఎస్సార్ సీపీ యర్రగొండపాలెం నియోజకవర్గ సమన్వయకర్త పాలపర్తి డేవిడ్‌రాజు కూడా హాజరయ్యారు. జెడ్పీటీసీకి తొలిరోజైన సోమవారం సీపీఐ నుంచి ఒకరు, టీడీపీ నుంచి ఒకరు నామినేషన్లు దాఖలు చేశారు. రెండోరోజు మంగళవారం ఒక్క నామినేషన్ కూడా రాలేదు. బుధ, గురువారాలు మాత్రమే నామినేషన్లకు గడువు ఉండడంతో భారీగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉందని భావించి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరుగుతున్న పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంపైపు రోడ్డుపై పూర్తిస్థాయిలో పోలీసులు మోహరించారు. ఎంపీటీసీలకు సంబంధించిన నామినేషన్లు కూడా పోటాపోటీగా సాగాయి. త్రిపురాంతకం మండలంలోని ఎంపీటీసీలకే బుధవారం ఒక్కరోజు 68 మంది నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం. బుధవారం జెడ్పీటీసీకి దాఖలైన 109 నామినేషన్లలో వైఎస్సార్సీపీ తరఫున అత్యధికంగా 63 వచ్చాయి. టీడీపీ 32, కాంగ్రెస్ 4, బీజేపీ 2, స్వతంత్రులు 8 మంది నామినేషన్లు వేశారు. దీంతో మూడోరోజు ముగిసే నాటికి మొత్తం వైఎస్సార్సీపీ 63, టీడీపీ 33, కాంగ్రెస్ 4, బీజేపీ 2, సీపీఐ 1, స్వతంత్రులు 8 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు అయింది. ఎంపీటీసీలు: 1674 నామినేషన్లు దాఖలయ్యాయి. ఒంగోలు రెవెన్యూ డివిజన్: ఈ డివిజన్లో మొత్తం 488 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో బీఎస్పీ 1, సీపీఐ 1, సీపీఎం 25, కాంగ్రెస్ 2, వైఎస్సార్సీపీ 172, టీడీపీ 234, స్వతంత్రులు 53 కందుకూరు రెవెన్యూ డివిజన్: ఈ డివిజన్లో 758 మంది నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ 3, సీపీఐ 5, సీపీఎం 10, కాంగ్రెస్ 7, వైఎస్సార్ సీపీ 322, టీడీపీ 344, స్వతంత్రులు 67. మార్కాపురం రెవెన్యూ డివిజన్: దాఖలైన మొత్తం నామినేషన్ల సంఖ్య 428. బీఎస్పీ 2, బీజేపీ 4, సీపీఐ 7, సీపీఎం 3, కాంగ్రెస్ 3, వైఎస్సార్ సీపీ 212, టీడీపీ 130, స్వతంత్రులు 67 మంది ఉన్నారు. -
షర్మిల పర్యటన
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల గురువారం నుంచి జిల్లాలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె నెల్లూరు జిల్లా కావలి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు చీమకుర్తి చేరుకుని అక్కడ సభలో ప్రసంగించిన తరువాత, సాయంత్రం 6 గంటలకు కనిగిరి వెళ్లి ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. రాత్రి అక్కడే బస చేస్తారు. ఈమేరకు జిల్లా కన్వీనరు డాక్టర్ నూకసాని బాలాజీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 21వ తేదీ ఉదయం ఆమె కనిగిరి నుంచి బయలుదేరి గిద్దలూరు చేరుకుంటారు. అక్కడ ఉదయం 10.30 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు మార్కాపురం వచ్చి అక్కడ ప్రసంగించిన తరువాత, గుంటూరు జిల్లా వినుకొండకు వెళతారు. రాత్రి అక్కడే బస చేసి, 22వ తేదీన ఉదయం పది గంటలకు అద్దంకి చేరుకుని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మధ్యాహ్నం గుంటూరు జిల్లా చిలకలూరిపేట చేరుకుని, అక్కడ ఎన్నికల ప్రచారం చేపట్టి, తిరిగి సాయంత్రం 6 గంటలకు చీరాల వచ్చి సభలో మాట్లాడతారు. షర్మిల రాక కోసం పార్టీ కార్యకర్తలు భారీగా స్వాగత ఏర్పాట్లు చే స్తున్నారు. ఈ సందర్భంగా నూకసాని బాలాజీ మాట్లాడుతూ షర్మిల సభలకు ప్రజలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని ఆరు మునిసిపాలిటీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం ఎగుర వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. షర్మిల పర్యటన సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ప్రచార సభలను విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. -
నేడు వైఎస్సార్ సీపీ బంద్
ఒంగోలు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన బిల్లును లోక్‌సభ ఆమోదించడాన్ని నిరసిస్తూ బుధవారం జిల్లావ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ ప్రకటించారు. విదేశీ వనిత అయినా..తోబుట్టువులా అక్కున చేర్చుకొని ఆదరించిన తెలుగు జాతిని రెండు ముక్కలు చేసిన నియంత సోనియాగాంధీని సమైక్యవాదులంతా బంద్ దేశం నుంచి తరిమికొట్టాలన్నారు. రాష్ట్ర విభజన బిల్లుపై ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా..పార్లమెంట్లో కనీసం చర్చించకుండా ప్రజాప్రతినిధులైన ఎంపీల అభిప్రాయాలకు విలువనివ్వకుండా చివరకు ఎంపీలపై దాడి చేయించి వారిని సస్పెండ్ చే యడం దారుణమన్నారు. పార్లమెంట్లో బిల్లును మూజువాణి ఓటుతో ముగించేసి రాష్ట్ర విభజన కాంగ్రెస్ పార్టీ సొంత అజెండా అన్నట్లుగా సోనియాగాంధీ వ్యవహరించడాన్ని దుయ్యబట్టారు. సోనియాగాంధీ నిరంకుశ పాలనకు నిరసనగా బుధవారం జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ బంద్‌కు పిలుపునిచ్చిందని పేర్కొన్నారు. బంద్‌కు రాజకీయ పార్టీలే కాకుండా అన్ని ఉద్యోగ, విద్యా, కార్మిక సంఘాలు సంఘీభావం ప్రకటించాలని కోరారు. రాష్ట్రాన్ని విభ జించేందుకు సహకరించిన కేంద్రమంత్రులకు, విభజనవాదులకు చెంపపెట్టులా ఉండేలా బంద్‌కు సహకరించాలని బాలాజీ పిలుపునిచ్చారు.