ఒంగోలు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన బిల్లును లోక్‌సభ ఆమోదించడాన్ని నిరసిస్తూ బుధవారం జిల్లావ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ ప్రకటించారు. విదేశీ వనిత అయినా..తోబుట్టువులా అక్కున చేర్చుకొని ఆదరించిన తెలుగు జాతిని రెండు ముక్కలు చేసిన నియంత సోనియాగాంధీని సమైక్యవాదులంతా బంద్
దేశం నుంచి తరిమికొట్టాలన్నారు. రాష్ట్ర విభజన బిల్లుపై ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా..పార్లమెంట్‌లో కనీసం చర్చించకుండా ప్రజాప్రతినిధులైన ఎంపీల అభిప్రాయాలకు విలువనివ్వకుండా చివరకు ఎంపీలపై దాడి చేయించి వారిని సస్పెండ్ చే యడం దారుణమన్నారు. పార్లమెంట్లో బిల్లును మూజువాణి ఓటుతో ముగించేసి రాష్ట్ర విభజన కాంగ్రెస్ పార్టీ సొంత అజెండా అన్నట్లుగా సోనియాగాంధీ వ్యవహరించడాన్ని దుయ్యబట్టారు. సోనియాగాంధీ నిరంకుశ పాలనకు నిరసనగా బుధవారం జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ బంద్‌కు పిలుపునిచ్చిందని పేర్కొన్నారు. బంద్‌కు రాజకీయ పార్టీలే కాకుండా అన్ని ఉద్యోగ, విద్యా, కార్మిక సంఘాలు సంఘీభావం ప్రకటించాలని కోరారు. రాష్ట్రాన్ని విభ జించేందుకు సహకరించిన కేంద్రమంత్రులకు, విభజనవాదులకు చెంపపెట్టులా ఉండేలా బంద్‌కు సహకరించాలని బాలాజీ పిలుపునిచ్చారు.
నేడు వైఎస్సార్ సీపీ బంద్
Published Wed, Feb 19 2014 2:04 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement