కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రాదేశిక పోరులో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఒక్కరోజే గడు వు ఉండటంతో అభ్యర్థులు తరలివచ్చారు. జెడ్పీ, మండల కార్యాలయాలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు, వారి మద్దతుదారులతో కిటకిటలాడాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు వేసే అభ్యర్థులతో నలుగురిని మాత్రమే పోలీసులు జెడ్పీలోకి అనుమతించారు. జెడ్పీ ఆవరణలో కౌంటర్ ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్ ద్వారా నామినేషన్ పత్రాలు బుధవారం ఒక్కరోజే 1,500 వరకు అమ్ముడుపోయాయి. ఐదు గంటల వరకు అభ్యర్థులను అనుమతించాల్సి ఉండగా, ముందే గేట్లు మూసేయడంతో అభ్యర్థులు పోలీసులతో గొడవకు దిగారు. కాగా, సాయంత్రం ఏఎస్పీ జోయేల్ డేవిస్ నామినేషన్ల పర్వాన్ని పరిశీలించారు.
నామినేషన్లు..
జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు 52 జెడ్పీటీసీ స్థానాలకు 6, రెండో రోజు 8 నామినేషన్లు రాగా, 636 ఎంపీటీసీ స్థానాలకు మొదటి రోజు 30, రెండో రోజూ 84 నామినేషను దాఖలు అయ్యాయి. ఇక మూడో రోజైన బుధవారం జెడ్పీటీసీ స్థానాలకు 135 రాగా, ఎంపీటీసీలకు 1,215 వచ్చాయి. మంచిర్యాల, కౌటాల టీఆర్‌ఎస్ అభ్యర్థులు శ్రీదేవి, మల్లయ్య, రాజేశ్వర్‌రావు, తాంసి నుంచి టీడీపీ అభ్యర్థి విజయ, ముథోల్ నుంచి సంధ్యరాణి, తానూర్ నుంచి బి. రాజన్న, ముథోల్ నుంచి సంధ్యారాణి, కాాగజ్‌నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గౌతమ్, ఇచ్చోడ నుంచి వాఘ్మారే శోభ తదితరులు జెడ్పీటీసీ అభ్యర్థులుగా నామినేషన్లు వేయడానికి వచ్చారు. కాగా, శుక్రవారం అధికారులు వచ్చిన నామినేషన్ల పరిశీలిస్తారు. ఈనెల 24న ఉపసంహరణ తర్వాత బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు.
నేడే ఆఖరు!
Published Thu, Mar 20 2014 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 4:55 AM
Advertisement