muthol
-
ఆ శునకాల నుంచైనా నేర్చుకోండి!
సాక్షి, చిత్రదుర్గ/రాయ్‌చూర్/బాగల్కోట్/హుబ్లీ: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పోలింగ్ తేదీ దగ్గరవుతున్న కొద్దీ.. వాగ్బాణాల వాడి పెరుగుతోంది. భారతీయ సైన్యంలో సేవలందిస్తోన్న ఉత్తర కర్ణాటకకు చెందిన ముధోల్ శునకాల నుంచైనా దేశభక్తి నేర్చుకోండంటూ కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హుబ్లీలో ఆదివారం జరిగిన ప్రచార ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. ‘దేశభక్తి అనే మాట వినపడగానే ఇబ్బందిపడేవారికి, దేశభక్తిని విమర్శించేవారికి, దేశభక్తి వల్లనే కష్టాలని భావించేవారికి నేనొకటే చెబుతున్నా. మీ పెద్దల నుంచి మీరేం నేర్చుకోలేదు.. కనీసం సైన్యంలో సేవలందిస్తోన్న ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన శునకాల నుంచైనా కాస్త దేశభక్తి నేర్చుకోండి. అలా నేర్చుకుంటారని కూడా నేను అనుకోవడం లేదు’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘దేశాన్ని ముక్కలు చేస్తామంటూ నినాదాలు చేసిన వారికి మద్దతిచ్చిన పార్టీ మీది’ అని మండిపడ్డారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆందోళనల సమయంలో విద్యార్థులకు ప్రస్తుత కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ స్వయంగా వెళ్లి సంఘీభావం తెలిపిన విషయాన్ని ప్రధాని ఇలా పరోక్షంగా ప్రస్తావించారు. ఉత్తర కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలోని ముధోల్ ప్రాంతానికి చెందిన జాతి కావడంతో ఇక్కడి శునకాలకు ఆ పేరు వచ్చింది. అవి భారతీయ ఆర్మీలో సేవలందిస్తున్న తొలి భారతీయ జాతి శునకాలు. పేదలకు పదవులు వారికిష్టంలేదు ‘వారు అంబేడ్కర్‌ను అవమానించారు. ఆయనను అంగీకరించలేదు. సమయాన్ని ఇవ్వలేదు’ అని బాగల్కోట్ బహిరంగ సభలో మోదీ పేర్కొన్నారు. దళిత నాయకుడైన రామ్‌నాథ్ కోవింద్‌ను బీజేపీ రాష్ట్రపతిగా గెలిపించుకోవటం కూడా కాంగ్రెస్‌కే నచ్చలేదన్నారు. ‘దేశంలో ప్రస్తుతం ఉన్న పదవులను పేదలు, సామాన్యులు అందుకోవటం కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారింది’ అని విమర్శించారు. ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విధానాలను ప్రశ్నించారని అప్పటి మైసూరు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్. నిజలింగప్పను కాంగ్రెస్ దారుణంగా అవమానించిందన్నారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ ఎంతకైనా తెగిస్తోందని చిత్రదుర్గ ర్యాలీలో మోదీ విమర్శించారు. ‘18వ శతాబ్దంలో దళిత సామాజిక వర్గానికి చెందిన ఒణకె ఓబవ్వ చిత్రదుర్గ సామ్రాజ్యాన్ని కాపాడుకోవటం కోసం సుల్తాన్ వంశస్తుడైన మైసూరు హైదర్ అలీ సైన్యంతో పోరాడి.. కన్నడ తెగువను చూపారు. అలాంటి ఎందరో యోధులు, యోధురాళ్లను విస్మరించిన కాంగ్రెస్.. సుల్తాన్ల జయంతులు మాత్రం జరుపుతోంది’ అని మండిపడ్డారు. దోపిడీని అరికట్టినందుకే.. రాజకీయంగా తనను ఎదుర్కొనేందుకే కాంగ్రెస్ పార్లమెంటు సమావేశాలనూ అడ్డుకుంటోందని మోదీ విమర్శించారు. ‘నన్ను వ్యతిరేకించటం, విమర్శించటమే కాంగ్రెస్‌కు ఉన్న ఏకైక ఎజెండా. అందుకే పార్లమెంటును కూడా జరగనీయటం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీని మేం అరికట్టాం. అందుకే వారు నాపై, మా పార్టీ నేతలను దూషిస్తున్నారు’ అని తెలిపారు. తాము అధికారంలోకివస్తే రాయచూరు జిల్లాలో పండించే సోనామసూరి బియ్యానికి అంతర్జాతీయ మార్కెట్లో గుర్తింపు తెస్తామని, హట్టి బంగారు గనుల అభివృద్ధికి శ్రమిస్తామన్నారు. -
ముగిసిన ‘ట్రిపుల్ ఐటీ’కౌన్సెలింగ్
ముథోల్ : బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ప్రవేశానికి రెండు రోజులుగా నిర్వహిస్తోన్న కౌన్సెలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండో రోజు గురువారం 436 మంది విద్యార్థులకు 398 మంది హాజరయ్యారు. 38 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థుల పదో తరగతి, ఇతర ధ్రువీకరణ పత్రాలను అధికారులు పరిశీలించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. వెయిటింగ్ లిస్ట్ విద్యార్థులకు ఈ నెల 28న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు, అదే రోజు మొదటి, రెండో రోజు కౌన్సెలింగ్ ప్రక్రియకు హాజరుకాని విద్యార్థులకూ కౌన్సెలింగ్ ఉంటుందని కళాశాల అసిస్టెంట్ రిజిస్ట్రార్ రహమాన్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఈ నెల 28 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఆలోగా విద్యార్థులు కళాశాలకు హాజరుకావాలని చెప్పారు. కౌన్సెలింగ్‌లో అధికారులు కె.జ్యోతిగౌడ్, హరికృష్ణగౌడ్, మధుసూదన్‌గౌడ్, విజయ్‌కుమార్, కన్నారావు, బాబు, దరావత్, సతీశ్‌కుమార్, ట్రిపుల్ ఐటీ సిబ్బంది పాల్గొన్నారు. -
ట్రిపుల్ ఐటీని సందర్శించిన పంజాబ్ వర్సిటీ బృందం
ముథోల్, న్యూస్‌లైన్ : మండలంలోని బాసర ట్రిపుల్ ఐటీని శుక్రవారం పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీ అధికారుల బృందం సందర్శించింది. అనంత రం ట్రిపుల్ ఐటీలోని విద్యార్థుల తరగతి గదు లు, ల్యాబ్ తదితర వాటిని పరిశీలించారు. అనంతరం పలు వివరాలను ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి డెరైక్టర్ సత్యనారాయణను అడిగి తెలుసుకున్నారు. పంజాబ్ రాష్ట్రంలో గ్రామీణ వి ద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందు కు ఆ ప్రభుత్వం నూతనంగా విద్యా సంస్థల ను ప్రారంభించనున్నట్లు పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీ డెరైక్టర్ డాక్టర్ హర్మిన్సోచ్ తెలిపారు. అందుకు బాసర ట్రిపుల్ ఐటీలో అనుసరిస్తున్న విద్యా బోధన విధానంపై అధ్యయనం చేసేందుకు ఇక్కడికి వచ్చినట్లు ఆయ న వెల్లడించారు. సాంకేతిక విద్య విద్యార్థుల చెంతకు చేరుతున్న తీరును పరిశీలించనున్నామని వివరించారు. బాసర ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి డెరైక్టర్ మాట్లాడుతూ, బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు అన్ని విధాలా సౌకర్యా లు కల్పించి చదువుల్లో వెనుకబడిన వారిని ప్రోత్సహిస్తూ ఉన్నత స్థానాలు ఆధిరోహించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే తమ ట్రిపుల్ ఐటీ నుంచి ఎంతో మంది విద్యార్థులు వివిధ కంపెనీలకు ఎంపికైనట్లు ఆయన పంజాబ్ బృందానికి వివరించారు. ట్రిపుల్ ఐటీ పంజాబ్ టెక్నిక ల్ ప్రొఫెసర్ సందీప్ కజల్, బాసర ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్ రాజగోపాల్, 14 మంది టెక్నికల్ బృందంతో పాటు ట్రిపుల్ ఐటీ సాంకేతిక బృందం పాల్గొన్నారు. -
యూడీసీని నిలదీసిన అంగన్వాడీ కార్యకర్తలు
ముథోల్, న్యూస్‌లైన్ : స్థానిక ఐసీడీఎస్ కార్యాలయ ఆవరణలో యూడీసీ మహేశ్‌ను అంగన్వాడీ కార్యకర్తలు మంగళవారం నిలదీశారు. ప్రాజెక్టు పరిధిలోని కుభీర్, భైంసా, లోకేశ్వరం, తానూర్, ముథోల్ మండలాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు టీఏ, డీఏ బిల్లుల విషయమై ప్రశ్నించారు. ఏడాదిగా బిల్లులు రావడం లేదని, అంగన్వాడీ కేంద్రాల అద్దె చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. టీడీఏ, డీఏ, కట్టెల బిల్లులు ఇవ్వాలని కోరితే పర్సంటేజీ అడుగుతున్నాడని ఆరోపించారు. ఐసీడీఎస్ పరిధిలోని 300 మంది అంగన్వాడీ కార్యకర్తలు రూ.6వేల చొప్పున చెల్లిస్తే బిల్లులు చేస్తానని అంటున్నాడని పేర్కొన్నారు. నెలనెల కోడిగుడ్లు ఇవ్వడం లేదని తెలిపారు. -
నేడే ఆఖరు!
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రాదేశిక పోరులో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఒక్కరోజే గడు వు ఉండటంతో అభ్యర్థులు తరలివచ్చారు. జెడ్పీ, మండల కార్యాలయాలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు, వారి మద్దతుదారులతో కిటకిటలాడాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు వేసే అభ్యర్థులతో నలుగురిని మాత్రమే పోలీసులు జెడ్పీలోకి అనుమతించారు. జెడ్పీ ఆవరణలో కౌంటర్ ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్ ద్వారా నామినేషన్ పత్రాలు బుధవారం ఒక్కరోజే 1,500 వరకు అమ్ముడుపోయాయి. ఐదు గంటల వరకు అభ్యర్థులను అనుమతించాల్సి ఉండగా, ముందే గేట్లు మూసేయడంతో అభ్యర్థులు పోలీసులతో గొడవకు దిగారు. కాగా, సాయంత్రం ఏఎస్పీ జోయేల్ డేవిస్ నామినేషన్ల పర్వాన్ని పరిశీలించారు. నామినేషన్లు.. జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు 52 జెడ్పీటీసీ స్థానాలకు 6, రెండో రోజు 8 నామినేషన్లు రాగా, 636 ఎంపీటీసీ స్థానాలకు మొదటి రోజు 30, రెండో రోజూ 84 నామినేషను దాఖలు అయ్యాయి. ఇక మూడో రోజైన బుధవారం జెడ్పీటీసీ స్థానాలకు 135 రాగా, ఎంపీటీసీలకు 1,215 వచ్చాయి. మంచిర్యాల, కౌటాల టీఆర్ఎస్ అభ్యర్థులు శ్రీదేవి, మల్లయ్య, రాజేశ్వర్‌రావు, తాంసి నుంచి టీడీపీ అభ్యర్థి విజయ, ముథోల్ నుంచి సంధ్యరాణి, తానూర్ నుంచి బి. రాజన్న, ముథోల్ నుంచి సంధ్యారాణి, కాాగజ్నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గౌతమ్, ఇచ్చోడ నుంచి వాఘ్మారే శోభ తదితరులు జెడ్పీటీసీ అభ్యర్థులుగా నామినేషన్లు వేయడానికి వచ్చారు. కాగా, శుక్రవారం అధికారులు వచ్చిన నామినేషన్ల పరిశీలిస్తారు. ఈనెల 24న ఉపసంహరణ తర్వాత బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు.