ముథోల్ : బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ప్రవేశానికి రెండు రోజులుగా నిర్వహిస్తోన్న కౌన్సెలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండో రోజు గురువారం 436 మంది విద్యార్థులకు 398 మంది హాజరయ్యారు. 38 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థుల పదో తరగతి, ఇతర ధ్రువీకరణ పత్రాలను అధికారులు పరిశీలించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
వెయిటింగ్ లిస్ట్ విద్యార్థులకు ఈ నెల 28న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు, అదే రోజు మొదటి, రెండో రోజు కౌన్సెలింగ్ ప్రక్రియకు హాజరుకాని విద్యార్థులకూ కౌన్సెలింగ్ ఉంటుందని కళాశాల అసిస్టెంట్ రిజిస్ట్రార్ రహమాన్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఈ నెల 28 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఆలోగా విద్యార్థులు కళాశాలకు హాజరుకావాలని చెప్పారు. కౌన్సెలింగ్‌లో అధికారులు కె.జ్యోతిగౌడ్, హరికృష్ణగౌడ్, మధుసూదన్‌గౌడ్, విజయ్‌కుమార్, కన్నారావు, బాబు, దరావత్, సతీశ్‌కుమార్, ట్రిపుల్ ఐటీ సిబ్బంది పాల్గొన్నారు.
ముగిసిన ‘ట్రిపుల్ ఐటీ’కౌన్సెలింగ్
Published Fri, Jul 25 2014 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 10:49 AM
Advertisement