Basra IIIT
-
ముగిసిన ‘ట్రిపుల్ ఐటీ’కౌన్సెలింగ్
ముథోల్ : బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ప్రవేశానికి రెండు రోజులుగా నిర్వహిస్తోన్న కౌన్సెలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండో రోజు గురువారం 436 మంది విద్యార్థులకు 398 మంది హాజరయ్యారు. 38 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థుల పదో తరగతి, ఇతర ధ్రువీకరణ పత్రాలను అధికారులు పరిశీలించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. వెయిటింగ్ లిస్ట్ విద్యార్థులకు ఈ నెల 28న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు, అదే రోజు మొదటి, రెండో రోజు కౌన్సెలింగ్ ప్రక్రియకు హాజరుకాని విద్యార్థులకూ కౌన్సెలింగ్ ఉంటుందని కళాశాల అసిస్టెంట్ రిజిస్ట్రార్ రహమాన్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఈ నెల 28 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఆలోగా విద్యార్థులు కళాశాలకు హాజరుకావాలని చెప్పారు. కౌన్సెలింగ్‌లో అధికారులు కె.జ్యోతిగౌడ్, హరికృష్ణగౌడ్, మధుసూదన్‌గౌడ్, విజయ్‌కుమార్, కన్నారావు, బాబు, దరావత్, సతీశ్‌కుమార్, ట్రిపుల్ ఐటీ సిబ్బంది పాల్గొన్నారు. -
ట్రిపుల్ ఐటీని సందర్శించిన పంజాబ్ వర్సిటీ బృందం
ముథోల్, న్యూస్‌లైన్ : మండలంలోని బాసర ట్రిపుల్ ఐటీని శుక్రవారం పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీ అధికారుల బృందం సందర్శించింది. అనంత రం ట్రిపుల్ ఐటీలోని విద్యార్థుల తరగతి గదు లు, ల్యాబ్ తదితర వాటిని పరిశీలించారు. అనంతరం పలు వివరాలను ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి డెరైక్టర్ సత్యనారాయణను అడిగి తెలుసుకున్నారు. పంజాబ్ రాష్ట్రంలో గ్రామీణ వి ద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందు కు ఆ ప్రభుత్వం నూతనంగా విద్యా సంస్థల ను ప్రారంభించనున్నట్లు పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీ డెరైక్టర్ డాక్టర్ హర్మిన్సోచ్ తెలిపారు. అందుకు బాసర ట్రిపుల్ ఐటీలో అనుసరిస్తున్న విద్యా బోధన విధానంపై అధ్యయనం చేసేందుకు ఇక్కడికి వచ్చినట్లు ఆయ న వెల్లడించారు. సాంకేతిక విద్య విద్యార్థుల చెంతకు చేరుతున్న తీరును పరిశీలించనున్నామని వివరించారు. బాసర ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి డెరైక్టర్ మాట్లాడుతూ, బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు అన్ని విధాలా సౌకర్యా లు కల్పించి చదువుల్లో వెనుకబడిన వారిని ప్రోత్సహిస్తూ ఉన్నత స్థానాలు ఆధిరోహించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే తమ ట్రిపుల్ ఐటీ నుంచి ఎంతో మంది విద్యార్థులు వివిధ కంపెనీలకు ఎంపికైనట్లు ఆయన పంజాబ్ బృందానికి వివరించారు. ట్రిపుల్ ఐటీ పంజాబ్ టెక్నిక ల్ ప్రొఫెసర్ సందీప్ కజల్, బాసర ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్ రాజగోపాల్, 14 మంది టెక్నికల్ బృందంతో పాటు ట్రిపుల్ ఐటీ సాంకేతిక బృందం పాల్గొన్నారు. -
దప్పిక తీరే దారేది?
బాసర, న్యూస్‌లైన్ : బాసరలోనే కాకుండా ముథోల్ మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు వేసవి వచ్చిందంటే చాలు నీటి కోసం నానా తిప్పలు పడాల్సిన పరిస్థితులు దాపురిస్తాయి. కారణం ఈ కాలంలో భూగర్భ జలాలు అడుగంటిపోతుంటాయి. దీంతో మహిళలు ఉదయం నుంచే చేతిపంపులు, వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు.అయితే అందరూ అక్కడికి చేరడంతో నీటి కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. గ్రామ శివారులోని వ్యవసాయ భూముల్లో త్రీఫేజ్ కరెంట్ సరఫరా ఉండడంతో ఎండ్లబండ్లపై, ట్యాంకర్లపై నీటిని తెచ్చుకుంటున్నారు. గొంతు తడపని నీటి పథకాలు మండలంలోని బాసర ఆలయం, బిద్రెల్లి గ్రామాలకు గోదావరి ఫిల్టర్‌బెడ్(ఫేస్ 1) సమగ్ర తాగునీటి పథకం నిర్మాణ పనులు రూ.4 కోట్లతో చేపట్టారు. పనులు ప్రారంభమై ఏడాది పూర్తవుతున్నా ఇప్పటికీ అది బాసర గ్రామ ప్రజలకు కుళాయి ద్వారా సరిపడా నీరందించడం లేదు. పైప్‌లైన్ నుంచి కుళాయి ద్వారా నీరందించాలని అధికారులు కాంట్రాక్టర్‌కు పనులు అప్పజెప్పారు. అయితే కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో తాగునీటి పథకం నుంచి పైన్‌లైన్ల ద్వారా వచ్చే నీటి వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో అక్కడక్కడా పైప్‌లైన్ లీకేజీ కావడమే కాకుండా కనీసం వాటికి నల్లాలు(ట్యాప్‌లు) బిగించలేదు. దీంతో పైప్‌లైన్ లీకేజీలతో వచ్చే నీరు వృథాగా మురుగు కాలువల్లో కలుస్తోంది. అది తిరిగి గోదావరి నదిలోకి వెళ్తోంది. అదేవిధంగా సమగ్ర తాగునీటి పథకం(ఫేస్ 2) నుంచి ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ(ఓఅండ్ఎం) నిర్మాణ పనులు రూ.2 కోట్లతో ప్రారంభించారు. దీని ద్వారా మండలంలోని మైలాపూర్, రవీంద్రపూర్, టాక్లీ, దొడపూర్, లాబ్ది, కిర్గుల్(బి) గ్రామాలకు సరిపడా నీర ందించాలి. కానీ ఆ లక్ష్యం నెరవేరకపోవడంతో గ్రామస్తులు తీవ్ర తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తిప్పలు ట్రిపుల్ ఐటీ కళాశాలలో రూ.15.50 కోట్లతో సమగ్ర రక్షిత తాగునీటి పనులను ప్రారంభించారు. ప్రారంభించినప్పటి నుంచి ట్రిపుల్ ఐటీ కళాశాల విద్యార్థులకు నీటి కొరత తప్పడం లేదు. ట్రిపుల్ ఐటీ కళాశాలకు రెండు కిలోమీటర్ల దూరంలోనే గోదావరి నది ఉన్నా అధికారులు శాశ్వత పరిష్కారం చూపడం లేదు. బాసర పథకం నుంచి అందించే అరకొర నీరు సరిపోకపోవడంతో నాలుగు కిలోమీటర్ల దూరంలోని నిజామాబాద్ జిల్లా యంచ గ్రామ తాగునీటి పథకం నుంచి ప్రతి రోజు ట్యాంకర్లతో నీటిని తెప్పిస్తున్నారు. ట్యాంకర్లు రాగానే విద్యార్థులు పరుగులు పెట్టి బకెట్ల ద్వారా నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆ నీరూ సరిపోవడం లేదు. సమస్య పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.