ముథోల్, న్యూస్‌లైన్ : మండలంలోని బాసర ట్రిపుల్ ఐటీని శుక్రవారం పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీ అధికారుల బృందం సందర్శించింది. అనంత రం ట్రిపుల్ ఐటీలోని విద్యార్థుల తరగతి గదు లు, ల్యాబ్ తదితర వాటిని పరిశీలించారు. అనంతరం పలు వివరాలను ట్రిపుల్ ఐటీ ఇన్‌చార్జి డెరైక్టర్ సత్యనారాయణను అడిగి తెలుసుకున్నారు. పంజాబ్ రాష్ట్రంలో గ్రామీణ వి ద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందు కు ఆ ప్రభుత్వం నూతనంగా విద్యా సంస్థల ను ప్రారంభించనున్నట్లు పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీ డెరైక్టర్ డాక్టర్ హర్‌మిన్‌సోచ్ తెలిపారు.
అందుకు బాసర ట్రిపుల్ ఐటీలో అనుసరిస్తున్న విద్యా బోధన విధానంపై అధ్యయనం చేసేందుకు ఇక్కడికి వచ్చినట్లు ఆయ న వెల్లడించారు. సాంకేతిక విద్య విద్యార్థుల చెంతకు చేరుతున్న తీరును పరిశీలించనున్నామని వివరించారు. బాసర ట్రిపుల్ ఐటీ ఇన్‌చార్జి డెరైక్టర్ మాట్లాడుతూ, బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు అన్ని విధాలా సౌకర్యా లు కల్పించి చదువుల్లో వెనుకబడిన వారిని ప్రోత్సహిస్తూ ఉన్నత స్థానాలు ఆధిరోహించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే తమ ట్రిపుల్ ఐటీ నుంచి ఎంతో మంది విద్యార్థులు వివిధ కంపెనీలకు ఎంపికైనట్లు ఆయన పంజాబ్ బృందానికి వివరించారు. ట్రిపుల్ ఐటీ పంజాబ్ టెక్నిక ల్ ప్రొఫెసర్ సందీప్ కజల్, బాసర ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్ రాజగోపాల్, 14 మంది టెక్నికల్ బృందంతో పాటు ట్రిపుల్ ఐటీ సాంకేతిక బృందం పాల్గొన్నారు.
ట్రిపుల్ ఐటీని సందర్శించిన పంజాబ్ వర్సిటీ బృందం
Published Sat, May 24 2014 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 7:45 AM
Advertisement
Advertisement