Waiting List
-
కన్ఫర్మ్ కాని టికెట్‌తో రైలెక్కితే దించేస్తారు
సాక్షి, హైదరాబాద్: కన్ఫర్మ్ కాని వెయిటింగ్ జాబితాలో ఉన్న రైలు టికెట్‌తో రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణిస్తే టీసీలు ఇక రైలు నుంచి దింపేస్తారు. వారు జనరల్ క్లాస్ టికెట్ ధర చెల్లించి అప్పటికప్పుడు ఆ కోచ్‌లోకి మారాల్సి ఉంటుంది. లేని పక్షంలో రైలు దిగిపోవాల్సిందే. ఈమేరకు రైల్వే బోర్డు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటివరకు.. రిజర్వేషన్ క్లాస్‌కు సంబంధించిన వెయిటింగ్ లిస్ట్ టికెట్‌తో అదే క్లాసులో పెనాల్టీ చెల్లించి ప్రయాణించేందుకు కొనసాగుతున్న ’అనధికార’ వెసులుబాటుకు అవకాశం లేకుండా రైల్వే బోర్డు ఈ నిర్ణయాన్ని తీసుకుంది.ఇక ఆ టికెట్‌తో వెళ్లడం కుదరదు..రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణం చేసేందుకు ఆన్లైన్లో టికెట్ కొన్నప్పుడు.. కన్ఫర్మ్ అయితే సంబంధిత కోచ్‌లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించొచ్చు. కానీ, ప్రయాణ సమయం నాటికి కన్ఫర్మ్ కాని పక్షంలో ఆ టికెట్ రద్దయి, టికెట్ రుసుము మొత్తం సంబంధీకుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. టికెటే రద్దయినందున, ఆ టికెట్ ప్రయాణానికి వీలుండదు.కానీ, రైల్వే స్టేషన్లలోని టికెట్ కౌంటర్లో కొనుగోలు చేసిన రిజర్వ్డ్ క్లాస్ టికెట్ కన్ఫర్మ్ కాని పక్షంలో ఆ టికెట్ రుసుము కోసం మళ్లీ స్టేషన్‌లోని కౌంటర్‌కు వెళ్లి రద్దు ఫామ్ పూరించి టికెట్‌తో కలిపి అందజేస్తే గానీ ఆ డబ్బులు తిరిగి చెల్లిస్తారు. కానీ, చాలామంది ఆ కన్ఫర్మ్ కాని టికెట్‌ను రద్దు చేసుకోకుండా, సంబంధిత కోచ్ లో ప్రయాణిస్తారు. టీసీ వచ్చినప్పుడు ఫైన్ చెల్లించటం లేదా, ఎంతో కొంత ము ట్టచెప్పటం ద్వారానో ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఇద్దరు ముగ్గురు కలిసి ప్రయాణిస్తున్నప్పుడు, కొన్ని టికెట్లు కన్ఫర్మ్ అయి, కొన్ని వెయిటింగ్ జాబితాలోనే ఉండిపోతే, అలాగే సర్దుకుని వెళ్తుంటారు. కానీ, ఇక నుంచి అలాంటి అవకాశం లేకుండా రైల్వే బోర్డు కఠినతరం చేసింది.అలా పట్టుబడితే పెనాల్టీనేటికెట్ కన్ఫర్మ్ కాని పక్షంలో దాన్ని రద్దు చే సుకోవాల్సిందే. ఒక వేళ ఆ టికెట్‌తో రిజర్వ్ డ్ కోచ్‌లో ప్రయాణిస్తూ పట్టుబడితే, వారి నుంచి రూ.250 నుంచి రూ.440 వరకు పెనాల్టీ వ సూలు చేసి, వారిని తదు పరి స్టేషన్లో దింపి, జనర ల్ క్లాస్ టికెట్ రుసుము తీ సుకుని అందులోకి మార్పి స్తారు. జనరల్ క్లాస్‌లో అవకాశం లేనప్పుడు స్టేషన్లో దించేస్తారు. ఈమేరకు జోన్లకు రైల్వేబోర్డు నుంచి ఆదేశాలు వెలువడ్డాయి.వేలల్లో ఫిర్యాదులు.. అలా చేస్తే టీసీలపైనా చర్యలుకన్ఫర్మ్ కాని టికెట్‌తో ప్రయాణించటం నిబంధనలకు విరుద్ధం. అయినా కూడా వాటితో రిజర్వ్డ్ కోచ్‌లలో.. టీసీల సహకారంతో ప్రయాణించే పద్ధతి అనధికారికంగా అమలులో ఉంది. ఇలా క్రమంగా రిజర్వ్డ్ కోచ్‌లలో ఇలాంటి వారి సంఖ్య పెరుగుతూండటంతో.. రిజర్వేషన్ టికెట్‌తో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. కొంతమంది వారిని దబాయించి మరీ సీటులో జాగా కల్పించుకుని ప్రయాణిస్తున్నారు. మరికొందరు సీట్లలో ఏదో ఓ వైపు కూర్చుని వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు.ఇలాంటి వాటిపై ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు రైల్వే బోర్డుకు 8 వేల వరకు ఫిర్యాదులందినట్టు తెలిసింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన రైల్వే బోర్డు, నిబంధనలను కచ్చితంగా అనుసరించాలని, రిజర్వ్డ్ కన్ఫర్మ్ టికెట్ లేని వారు ఎట్టి పరిస్థితిలో రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణించకుండా చూడాలని, ఒకవేళ టీసీలు వారికి వీలు కల్పించినట్టు తేలితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి. కాగా, కన్ఫర్మ్ కాని టికెట్ ఉన్న వారిని జనరల్ కోచ్‌లకు తరలిస్తే, వాటిపై మరింత భారం పెరుగుతుందనీ,. ఈ నేపథ్యంలో రైళ్లలో జనరల్ కోచ్‌ల సంఖ్య పెంచాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. -
ఆ హోటల్లో తినాలంటే నాలుగేళ్లు ఎదురు చూడాల్సిందే
లండన్: బ్రిస్టల్ లోని ఓ ప్రఖ్యాత పబ్‌లో ప్రతేకమైన ఆదివారం స్పెషల్ డిష్ తినాలంటే నాలుగేళ్లు ఎదురు చూడాల్సిందే. ఈరోజు బుక్ చేసుకుని నాలుగేళ్లపాటు ఎదురు చూస్తే చాలు ఆ వంటకం రుచి చూసే భాగ్యం కలుగుతుంది. సాధారణంగా ఓ హోటల్లో తినడానికి ఏదైనా ఆర్డర్ ఇచ్చిన తరవాత నిముషాల వ్యవధిలో ఆ ఐటెం మన ముందు ప్రత్యక్షమవుతుంది. ఆర్డర్ ఇచ్చిన ఐటెం కోసం గంటల తరబడి ఎదురు చూడటమన్నది చాలా అరుదుగా చూస్తుంటాం. మరికొన్ని ప్రముఖ హోటళ్లలో మాత్రం ఆదివారం ప్రైమ్ టైమ్ ఫుడ్ బుకింగ్ కావాలంటే ఒకట్రెండు రోజుల ముందు టేబుల్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఒక ఫుడ్ ఐటెం కోసం నాలుగేళ్లు ఎదురు చూడటమంటే నిజంగా విడ్డూరమే. అలాంటి విడ్డూరమే బ్రిస్టల్ లోని ది బ్యాంక్ టావెర్న్ పబ్. ఈ పబ్‌లో ఆర్డర్ చేయాలంటే ఓపిక ఉండాలి. అందులోనూ ఆ హోటల్ ప్రత్యేకం తినాలంటే బుకింగ్ టైమ్ నాలుగేళ్లు పడుతుంది. అంత పొడవాటి వెయిటింగ్ లిస్టు ఉన్న హోటల్ ప్రపంచంలోనే మరొకటి లేదు. ఆ హోటల్లో సండే స్పెషల్ రోస్ట్ బుక్ చేసుకుంటే మన టైమ్ వచ్చేసరికి కనీసం నాలుగేళ్ల సమయం పడుతుంది. అన్నేళ్ల పాటు ఆగాలంటే నిజంగానే ఓపికపట్టడంలో పీ.హెచ్.డి చేనుండాలి. అందులోనూ భోజనప్రియులు అంత కలం ఆగడమంటే చాలా గొప్ప విషయం. ది బ్యాంక్ టావెర్న్ హోటల్ వడ్డించే సండే రోస్టులో రుచికరమైన ప్రత్యేక వంటకాల ఉఉంటాయి. నోరూరించే ఈ వంటకానికి 2018లో బ్రిస్టల్ గుడ్‌ఫుడ్ అవార్డుల్లో ఉత్తమ సండే లంచ్ అవార్డుతోపాటు అనేక అవార్డులను సొంతం చేసుకుంది. అయితే కరోనా సమయానికి ముందు ఈ హోటల్లో ఆర్డర్లన్నీ సమయానికే డెలివరీ ఇచ్చేవారు. కానీ లాక్డౌన్ సమయంలో పబ్ మూసివేసి ఉండటంతో ఆ సమయంలో వచ్చిన ఆర్డర్లన్నీ పెండింగ్‌లో ఉండిపోయాయి. వాటిని ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తున్న పబ్‌వారు ప్రస్తుతానికి నాలుగేళ్లు వెనుకబడ్డారు. దీంతో ఈ హోటల్లో ఇప్పుడు సండే రోస్ట్ ఆర్డర్ చేసేవారు నాలుగేళ్లు వేయిట్ చేయక తప్పదు. అందుకే ఈ రెస్టారెంట్ వారు ప్రస్తుతానికైతే బుకింగ్ లను పూర్తిగా నిలిపివేశారు. ఇది కూడా చదవండి: వివేక్ రామస్వామికి ఓటు వేయొద్దంటూ మత ప్రచారకుడి ప్రచారం.. -
‘వీసా వెయిటింగ్’ తగ్గిస్తాం: అమెరికా
వాషింగ్టన్: అమెరికా వీసాల కోసం భారతీయులు వేచి ఉండే సమయాన్ని గణనీయంగా తగ్గించేందుకు శాయశక్తులా కృషిచేస్తున్నామని యూఎస్‌కౌన్సిలర్ అఫైర్స్ బ్యూరోలో వీసాల జారీ విభాగం ఉన్నతాధికారి జూలీ స్టఫ్ చెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కూడా ఈ విషయంలో చొరవ తీసుకుంటున్నారన్నారు. ‘‘గత అక్టోబర్‌లో బిజినెస్(బీ1), పర్యాటక(బీ2) వీసాల వెయిటింగ్ పీరియడ్ మూడేళ్లుంది! వీటిని తగ్గించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాం. కోవిడ్‌కు ముందునాటి సాధారణ స్థాయికి తేవడంపై దృష్టిసారించాం. హెచ్–1బీ, ఎల్1 వీసాల వెయిటింగ్ పీరియడ్‌ను 18 నెలల నుంచి 60 రోజులకు కుదించగలిగాం’’ అని ఆమె చెప్పారు. ‘‘ఇంటర్వ్యూతో పనిలేని సందర్భాల్లో వీసా రెన్యువల్‌కు వేచి ఉండాల్సిన పనిలేదు. ఇండియాతోపాటు జర్మనీ, థాయ్‌లాండ్‌లలోనూ భారతీయుల వీసా జారీ కోసం ఎంబసీలు, కాన్సులేట్లకు మరింత మంది సిబ్బందిని పంపుతున్నాం. వారాంతాల్లోనూ ఇంటర్వ్యూలు చేస్తున్నారు’’ అని చెప్పారు. -
దరఖాస్తుదారులు ఓపిక పట్టాలి.. వీసాల జారీపై దృష్టి పెట్టాం: అమెరికా
న్యూఢిల్లీ: అమెరికా వీసాల కోసం భారత్‌లో విపరీతమైన డిమాండే సుదీర్ఘమైన వెయిటింగ్ పీరియడ్‌కు కారణమని యూఎస్ చార్జ్ డి అఫైర్స్ రాయబారి ఎలిజబెత్ జోన్స్ అన్నారు. ‘‘దీన్ని వీలైనంతగా తగ్గించడానికి అమెరికా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది’’ అని శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆమె మీడియాకు తెలిపారు. ‘‘భారీగా కౌన్సెలర్లను నియమించుకుంటున్నాం. వారందరికీ వాషింగ్టన్లో యుద్ధ ప్రాతిపదికన శిక్షణ నడుస్తోంది. వారిలో వీలైనంత మందిని భారత్‌కు రప్పించుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. వచ్చే వేసవికల్లా ఢిల్లీ, ఇతర కాన్సులేట్లలో పూర్తిస్థాయి సిబ్బంది అందుబాటులోకి వస్తారు’’ అని చెప్పారు. దరఖాస్తుదారులంతా ఓపిక పట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అమెరికా వీసాకు తొలిసారిగా దరఖాస్తు చేసుకుంటున్న వారు ఇంటర్వ్యూల కోసం ఏకంగా మూడేళ్ల దాకా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది! -
గుడ్ న్యూస్: అందుబాటులోకి అదనపు బెర్తులు, సీట్లు
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): దసరా, దీపావళి పండగలు సమీపిస్తున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ఎటూ వెళ్లలేని పరిస్థితులు. ఇప్పుడు పరిస్థితులు కాస్త కుదుటపడడంతో దసరా సెలవులకు నగరవాసులు పలు పర్యాటక ప్రాంతాల సందర్శన, బంధువుల వద్దకు వెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో పలు రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ వస్తోంది. డీఆర్ఎం ప్రత్యేక చర్యలు పరిస్థితిని గమనించిన వాల్తేర్ డివిజన్, డివిజనల్ రైల్వే మేనేజర్ అనూప్‌కుమార్ సత్పతి ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం పలు రైళ్లలో వెయిటింగ్ లిస్ట్‌ను క్లియర్ చేసే దిశగా ఆయా రైళ్లకు అదనపు కోచ్‌లను జత చేసి బెర్తులు, సీట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే విశాఖపట్నం–హజరత్ నిజాముద్దీన్–విశాఖపట్నం(సమతా ఎక్స్‌ప్రెస్), విశాఖపట్నం–కోర్బా–విశాఖపట్నం(కోర్భా ఎక్స్‌ప్రెస్), విశాఖపట్నం–హజరత్ నిజాముద్దీన్–విశాఖపట్నం(స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్), విశాఖపట్నం–కడప–విశాఖపట్నం(తిరుమల ఎక్స్‌ప్రెస్), విశాఖపట్నం–బెంగళూరు–విశాఖపట్నం(వీక్లీ స్పెషల్) ఎక్స్‌ప్రెస్‌లకు ఇరువైపులా తాత్కాలికంగా ఒక్కో థర్డ్ ఏసీ కోచ్‌లను జత చేశారు. విశాఖపట్నం–లోకమాన్యతిలక్ టెర్మినస్–విశాఖపట్నం(ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్), విశాఖపట్నం–గా«ంధీదాం–విశాఖపట్నం(ఎక్స్‌ప్రెస్)లకు ఒక్కో స్లీపర్ క్లాస్ కోచ్‌లను, భువనేశ్వర్–విశాఖపట్నం–భువనేశ్వర్(ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్)లకు ఒక్కో ఏసీ చెయిర్ కార్ కోచ్‌లను అదనంగా జత చేశారు. ఇదే విధంగా మరిన్ని రైళ్లకు అదనపు కోచ్‌లను దసరా వరకు కొనసాగించాలని రైల్వే ప్రయాణికులు కోరతున్నారు. ప్రత్యేక రైళ్లు నడపాలి దసరాకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న సికింద్రాబాద్, చెన్నై, బెంగళూరు, భువనేశ్వర్, హౌరా తదితర మార్గాల్లో దసరా ప్రత్యేక రైళ్లు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. వీటిని సాధ్యమైనంత త్వరగా ప్రకటిస్తే ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని సూచిస్తున్నారు. ప్రస్తుతం విశాఖపట్నం–బెంగళూరు–విశాఖపట్నం మధ్య ప్రతి ఆది, సోమవారాల్లో నడుస్తున్న వీక్లీ స్పెషల్‌ను రెగ్యులర్ రైలుగా మార్చేందుకు డీఆర్ఎం కృషి చేయాలని నగరవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. వారణాసి రైలు గురించి కూడా డీఆర్ఎం కృషి చేస్తే బాగుంటుందని చెబుతున్నారు. ఇదీ చదవండి: కాలువలతో చెరువుల అనుసంధానం -
ఒక్క రైలు ఖాళీ ఉండట్లే.. స్పెషల్ ట్రైన్ల కథేంది?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి వివిధ మార్గాల్లో ప్రయాణికుల రాకపోకలు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. అన్ని ప్రధాన రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఇందుకనుగుణంగా అదనపు రైళ్లు అందుబాటులో లేకపోవడంతో వందలాది మంది ప్రయాణికులు నిరీక్షణ జాబితాలో పడిగాపులు కాస్తున్నారు. ప్రత్యేకంగా గతేడాది వరకు కోవిడ్ కారణంగా వాయిదా పడిన ప్రయాణాలు ఈ సంవత్సరం తిరిగి మొదలయ్యాయి. దీంతో అన్ని రూట్లలో రద్దీ పెరిగింది. హైదరాబాద్ నుంచి విశా ఖ, ముంబై, బెంగళూరు, న్యూఢిల్లీ, పట్నా, కోల్ కత్తా, భువనేశ్వర్, తదితర మార్గాల్లో రాకపోకలు సాగించే రైళ్లలో వెయిటింగ్ లిస్టు 150 నుంచి 200 కు పైగా నమోదు కావడం గమనార్హం. సాధారణంగా పండుగ రోజుల్లో, వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో బంధువుల ఇళ్లకు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య బాగా పెరగడంతో రైళ్లు కిక్కిరిసిపోతున్నట్లు రైల్వే ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. రైళ్ల కొరత... ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో డిమాండ్ మేరకు రైళ్లు అందుబాటులో లేకపోవడం వల్ల సకాలంలో రిజర్వేషన్లు లభించడం లేదు. హైదరాబాద్ నుంచి విశాఖ వైపు వెళ్లే గోదావరి, గౌతమి, ఈస్ట్‌కోస్ట్, కోకనాడ తదితర రైళ్లలో ఈ నెలాఖరు వరకే కాకుండా వచ్చే నెలలోనూ వెయిటింగ్ లిస్టు దర్శనమిస్తోంది. తిరుపతికి వెళ్లే రైళ్లలోనూ డిమాండ్ భారీగా పెరిగింది. సాఫ్ట్వేర్ నిపుణులు, పర్యాటకుల రద్దీతో బెంగళూరు, హౌరా, చెన్నై వైపు వెళ్లే రైళ్లలో నిరీక్షణ తప్పడం లేదు. చదవండి: (Hyderabad: హైదరాబాద్‌లో సొరంగ మార్గానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్) సికింద్రాబాద్ నుంచి పట్నా వరకు వలస కూలీలు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తారు. కానీ ఈ రూట్లో ప్రయాణికుల డిమాండ్ మేరకు రైళ్లు లేవు. దీంతో నెల నుంచి 2 నెలల వరకు ఎదురుచూడాల్సి వస్తుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి ప్రతి రోజు సుమారు 2.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. కొంతకాలంగా ప్రయాణికుల రద్దీ 20 శాతానికి పైగా పెరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రత్యేక రైళ్లేవీ... రద్దీ ఉన్న కొన్ని మార్గాల్లో ఇటీవల కొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. కానీ వీటిలో ఎక్కువ శాతం వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు కావడంతో పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందని పట్నా వెళ్లేందుకు రిజర్వేషన్ కోసం ఎదురు చూస్తున్న ఓం ప్రకాశ్ తెలిపారు. హయత్‌నగర్‌లోని ఓ భవన నిర్మాణంలో సెంట్రింగ్‌గా పని చేస్తున్న ఓంప్రకాశ్, అతని సోదరుడు జయప్రకాశ్‌లు సొంత ఊరికి వెళ్లేందుకు నిరీక్షణ జాబితాలో ఎదురు చూస్తున్నారు. జంటనగరాల నుంచి ప్రతి రోజు సుమారు 85 ప్రధాన రైళ్లు నడుస్తున్నాయి. ఇవి కాకుండా మరో 100కు పైగా ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. అయినా ప్రయాణం కోసం పడిగాపులు తప్పడం లేదు. -
వామ్మో ఆ కారుకి అంత డిమాండా? ఏడాదిన్నర వెయిటింగ్ పీరియడ్!!
రా మెటీరియల్ కాస్ట్ పెరిగిందంటూ వరుసగా ఆటో మొబైల్ కంపెనీలు ధరలు పెంచుతూ పోతున్నాయి. ఐనప్పటికీ కార్లకున్న డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. ఇక లేటెస్ట్ ఫీచర్లతో విడుదలైన కార్లను కొనుగోలు చేసేందుకయితే ప్రజలు పోటీ పడుతున్నారు. దీంతో వెయిటింగ్ పీరియడ్ పెరుగుతూ పోతోంది. కరెన్స్ కావాలి ఈ ఏడాది రిలీజైన కార్లలో అత్యధిక వెయిటింగ్ పీరియడ్ ఉన్న కారుగా కియా కరెన్స్ నిలుస్తోంది. ఈ కారుని 2022 ఫిబ్రవరి 15న ఇండియా మార్కెట్లో లాంచ్ చేశారు. ప్రారంభ ధరగా రూ.8.99 లక్షలుగా నిర్ణయించగా ఆ వెంటనే ధరలను సవరించి రూ.9.59 లక్షలకు పెంచారు. ఐనప్పటికీ ఈ కారుకి డిమాండ్ తగ్గడం లేదు. ఏప్రిల్ వరకు 12 వేల యూనిట్లు దేశీయంగా అమ్ముడైపోగా 50వేల కార్లకు బుకింగ్ జరిగింది. కనీసం 23 వారాలు కియా కరెన్స్‌లో ఐదే వేరియంట్లు ఉన్నాయి. ఇందులో పెట్రోల్/ డీజిల్, మాన్యువల్/ఆటో గేర్ షిఫ్ట్, 6/7 సీటర్ వేరియంట్లు ఉన్నాయి. ఇందులో ధర తక్కుగా ఉన్న బేసిక్ వేరియంట్ అయిన ప్రీమియం 1.5 లీటర్ పెట్రోల్ మాన్యువల్‌ను సొంతం చేసుకోవాలంటే గరిష్టంగా 75 వారాల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉందని కియా ప్రతినిధులు తెలిపారు. ఇక ఇందులో హైఎండ్ వేరియంట్ అయిన లగ్జరీ ప్లస్ అయితే 23 వారాల వెయింటింగ్ పీరియడ్ ఉంది. మహీంద్రా ఇక ఇండియాలో అత్యధిక వెయిటింగ్ పీరియడ్ ఉన్న మోడల్‌గా మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఓఓ మోడల్ ఉంది. లేటెస్ట్ ఫీచర్లతో మహీంద్రా గతేడాది రిలీజ్ చేసిన ఈ మోడల్‌ను సొంతం చేసుకునేందుకు చాలా మంది పోటీ పడుతున్నారు. ముందస్తుగా బుకింగ్స్ చేసుకుంటున్నారు. దీంతో ఈ కారు పొందాలంటే 20 నెలల నుంచి రెండేళ్ల వరకు వెయింటింగ్ పీరియడ్ ఉంది. చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ, టయోటా వేలకోట్ల పెట్టుబడులు! -
‘ఆప్షన్, వెయిటింగ్ లిస్ట్ విధానం ఉండాలి’
కాచిగూడ (హైదరాబాద్): గ్రూప్స్‌తోపాటు ఇతర ఉద్యోగ ఖాళీల భర్తీలో ఆప్షన్, వెయిటింగ్ లిస్ట్ విధానాన్ని అమలు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన బీసీ ప్రతినిధి బృందంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కలసి ఉద్యోగ ఖాళీల భర్తీ, అప్షన్ విధానాలపై చర్చించారు. అనంతరం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ గ్రూప్ 1,2,3,4 సర్వీస్ పోస్టు లను నేరుగా భర్తీ చేయాలని అన్నారు. ఇప్పటికే కొన్ని శాఖలలో ఖాళీలను పదోన్న తులతో భర్తీ చేశారని పేర్కొన్నారు. డైరెక్టు రిక్రూట్ మెంట్ ద్వారా యువతను తీసుకుంటే సమర్థవంత మైన, అవినీతి రహిత పాలన అందించవచ్చ న్నారు. గ్రూప్ 4 లోని పోస్టులను జిల్లా, మం డల స్థాయిలో భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
గ్రీన్ కార్డు వెయిటింగ్ లిస్టు 195 ఏళ్లు
వాషింగ్టన్: అమెరికాలో వలసదారులకు శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడానికి వీలు కల్పించే గ్రీన్ కార్డు కోసం భారతీయులు 195 ఏళ్లకు పైగా వేచి చూడాలని అధికార రిపబ్లికన్ సెనేటర్ మైక్ లీ చెప్పారు. ఈ సమస్యను చట్టబద్ధంగా పరిష్కరించడానికి ఇతర సెనేటర్లు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న గ్రీన్ కార్డు విధానంలో ఎన్నో లోపాలున్నాయని వలసదారుల పిల్లలకి దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. గ్రీన్ కార్డు బ్యాక్‌లాగ్‌లో చిక్కుకుపోయిన వలస ఉద్యోగుల పరిరక్షణ కోసం మరో సెనేటర్ డిక్ డర్బిన్ ప్రతిపాదించిన కొత్త చట్టంపై సెనేట్‌లో మైక్ లీ బుధవారం మాట్లాడారు. అమెరికాకు వలస వచ్చిన వారు గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేశాక వారు మరణిస్తే, వారి పిల్లలు నివాస యోగ్యతని కోల్పోతారని చెప్పారు. ‘‘భారత్ నుంచి వచ్చి గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఈబీ–3 కేటగిరీ గ్రీన్‌కార్డు కోసం 195 సంవత్సరాలు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ వారి పిల్లలకు మనం ఆ హోదా కల్పించినా వారు ఎప్పటికీ అమెరికా పౌరులు కాలేరు’’అని లీ అన్నారు. -
పండగకు ప్రయాణమెట్టా?
రానున్నవంతా నూతన సంవత్సరం.. సంక్రాంతి పండుగల సెలవులే. అత్యధికులు వారి సొంత ఊళ్లకు వచ్చివెళ్లేందుకు రైల్వే ప్రయాణాన్నే సౌకర్యంగా భావిస్తారు. కానీ వరుస సెలవులు.. ప్రయాణికుల రద్దీపై రైల్వే మంత్రిత్వ శాఖ, జోనల్ అధికారులు శ్రద్ధ చూపని కారణంగా పండగ సెలవుల్లో ప్రయాణం ఎట్టా...? అనే ఆందోళన సగటు ప్రయాణికుడిలో వ్యక్తమవుతోంది.. విశాఖపట్నం: నూతన సంవత్సరం, సంక్రాంతి పండగలకు సొంత ఊళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతోన్న ప్రయాణికులకు ‘ రైల్వే’ అవస్థలు వెంటాడుతున్నాయి. రాష్ట్రం విడిపోకముందు విజయవాడ, విశాఖ మార్గాల్లో ఉన్న రైళ్లే ఇప్పటికీ శరణ్యంగా ఉండడం కూడా ప్రయాణికుల ఆందోళనకు మరో కారణం. విజయవాడకు రాజధాని మారిన తర్వాత 13 జిల్లాల నుంచి రాకపోకలు సాగించే వారి సంఖ్య లక్షల్లో పెరిగింది. పెరిగిన రద్దీకి సౌకర్యంగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని చెబుతున్నా అనువైన తేదీల్లో లేని కారణంగా అవి నామమాత్రంగా మారాయి. ఉన్న రైళ్లకు అదనపు బోగీల ఏర్పాటులో మాత్రం రైల్వేశాఖ ఏటêవిఫలమవుతూనే ఉంది. ఒక్కో రైలుకు గరిష్టంగా 1200 మంది చొప్పున ప్రయాణించినా అన్ని రైళ్లలో పట్టుమని 6వేల మంది కూడా ప్రయాణించే సౌకర్యం ఉండడం లేదు. రాజధాని విజయవాడకు మారాక విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల నుంచి రోజూ భారీ సంఖ్యలో వెళ్లివస్తున్నారు. సకాలంలో, సరైన రైళ్లులేక వారి ప్రయాణ అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. పండగ సెలవుల్లో ఆ రద్దీ రెట్టింపు ఉన్నట్టు రైల్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో రానున్న పండగల సెలవుల్లో రైల్వే ప్రయాణికులకు అవస్థలు తప్పేలా లేవు. చాంతాడంత వెయిటింగ్ లిస్ట్ సాధారణ రోజుల్లోనే విశాఖపట్నం, విజయవాడ రైళ్లకు రిజర్వేషన్ టికెట్ల వెయిటింగ్ లిస్ట్ 180కి పైగా దాటుతోంది. కొందరైతే వెయిటింగ్ లిస్ట్‌లకు భయపడి ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. ఈ మార్గాల్లో రైళ్లకు నెల రోజుల ముందు టికెట్లు కొనుక్కున్నా ప్రయాణించే రోజుకు బెర్త్‌లు కన్ఫర్మ్ అయ్యే పరిస్థితులు ఉండడం లేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే... సంక్రాంతివరుస సెలవులకు ఇంకా 20 రోజులు గడువు ఉన్నప్పటికీ రిజర్వేషన్ టికెట్లు మంజూరుకాక రిగ్రెట్ వస్తోందని ప్రయాణికులు చెబుతున్నారు. పెరగని ‘ఈక్యూ’ కోటాలు అన్ని వర్గాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉండేలా రైల్వే ప్రయాణాలకు అత్యవసర సమయాల్లో ఎమర్జెన్సీ కోటా(ఈక్యూ) ద్వారా బెర్తులు మంజూరు చేసే విధానం అమలులో ఉంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు విజయవాడ, హైదరాబాద్ మార్గాల రైళ్లకు ఉన్నన్ని ఈక్యూ బెర్తులే ఇప్పటికీ అమలు కావడంతో నిత్యం రైల్వే అధికారులకు సైతం బెర్తుల విషయంలో తల ప్రాణం తోకకు వచ్చినంత పనవుతోంది. అందుకు తెలంగాణ మార్గాల్లోని రైళ్లకు అమలు చేస్తున్న ‘ఈక్యూ’ కోటాను బాగా తగ్గించి, ఏపీలోని రైళ్లకు కోటా పెంచడం ఒక్కటే మార్గంగా తెలుస్తోంది. -
నో బెర్త్.. ప్లీజ్ వెయిట్
సాక్షి, హైదరాబాద్: దసరా, దీపావళి పండుగల సం దర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే నగరవాసులకు ఈసారి ప్రయాణంలో కష్టాలు ఎదుర్కోక తప్పని పరిస్థితి నెలకొంది. సాధారణంగా పండుగలు, వరుస సెలవులను దృష్టిలో ఉంచుకొని కనీసం నెల, 15 రోజులు ముందే ప్రత్యేక రైళ్లను ప్రకటించే దక్షిణమధ్య రైల్వే ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒకటి, రెండు మార్గాల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా భారీ చార్జీలు వసూలు చేసే సువిధ రైళ్లు మినహా ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని రెగ్యులర్ రైళ్లలో ఇప్పటికే వెయిటింగ్ లిస్ట్ వందల్లోకి చేరింది. ఏసీ, నాన్ ఏసీ బెర్తులన్నీ బుక్ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో ప్రత్యేక రైళ్లు వేయడం, రెగ్యులర్ రైళ్లలో బోగీలు పెంచడం మాత్రమే పరిష్కారం. కానీ ఇప్పటివరకు అధికారులు ఆ దిశగా దృష్టి సారించకపోవడం గమనార్హం. తెలంగాణ ఆర్టీసీ దసరా సెలవుల సందర్భంగా 4 వేలకు పైగా ప్రత్యేక బస్సులను ప్రకటించింది. దూరప్రాంతాలకు వెళ్లే అన్ని బస్సుల్లోనూ 50 శాతం అదనపు చార్జీలను విధించింది. అతి తక్కువ ప్రయాణ చార్జీలతో, స్లీపర్ క్లాస్‌లో ప్రయాణించే మెజారిటీ ప్రయాణికులకు ఈ చార్జీలు భారం కానున్నాయి. చివరి నిమిషంలో హడావుడిగా.. చివరి నిమి షం వరకు వేచి చూసి హడావుడిగా అదనపు రైళ్లను ప్రకటించడం దక్షిణమధ్య రైల్వేలో ఇటీవల కాలంలో పరిపాటిగా మారింది. దీంతో ముందస్తు రిజర్వేషన్లకు అవకాశం లేకుండా పోతుంది. రెగ్యులర్ రైళ్లలో భారీగా నమోదయ్యే వెయిటింగ్ లిస్టు చూసి ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. ఆర్టీసీ, ప్రైవేట్ వంటి ప్రత్యామ్నాయ వాహనా ల వైపు వెళ్తున్నారు. సాధారణ రోజుల్లో జంటనగరాల నుం చి 2.5 లక్షల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుండగా.. పండుగలు, వరుస సెలవుల్లో 3 నుంచి 3.5 లక్షల మంది అదనంగా బయలుదేరుతారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, కాకినాడ, బెంగళూర్, తిరుపతి, ముంబై మార్గాల్లో డిమాండ్బాగా ఉంది. భారంగా సువిధ రైళ్లు.. పేద, మధ్యతరగతి వర్గాలకు చౌకగా లభించే రైల్వే ప్రయాణం ఈ ప్రీమియం రైళ్లతో భారంగా మారింది. దూరప్రాంతాలకు వెళ్లే అన్ని వర్గాల ప్రయాణికులకు అందుబాటులో ఉండే స్లీపర్ బోగీలను సైతం వదిలిపెట్టకుండా సువిధ సర్వీసుల పేరుతో రైల్వేశాఖ బెర్తుల బేరానికి దిగింది. ఈ రైళ్లలో విమాన సర్వీసుల తరహాలో ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి చార్జీలు పెరుగుతాయి. సాధారణ చార్జీలపై రెండు నుంచి మూడు రెట్లు అధికంగా విధిస్తారు. సికింద్రాబాద్ నుంచి విశాఖకు ప్రస్తుతం సువిధ రైళ్లు వేశారు. ప్రయాణికుల రద్దీ బాగా ఉండే ఈ మార్గంలో సువిధ రైళ్లు భారంగా పరిణమించాయి. -
టికెట్ కన్ఫర్మ్ అయ్యే చాన్సెంతో చెప్పేస్తుంది
న్యూఢిల్లీ: రైళ్లలో వెయిటింగ్ లిస్ట్‌తో ఇబ్బందిపడే ప్రయాణికుల కోసం రైల్వేశాఖ కొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. రైళ్లలో బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఎంతుందో ప్రయాణికులు దీంతో తెలుసుకోవచ్చని రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతమున్న ఐఆర్సీటీసీ వెబ్సైట్లో సోమవారం అర్ధరాత్రి నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులకు బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఎంతశాతం ఉందో దీనిద్వారా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఐఆర్సీటీసీ వెబ్సైట్లో రోజుకు దాదాపు 13 లక్షల టికెట్లు బుక్ అవుతున్నాయి. రైళ్ల ఆలస్యంపై వీడియో రైళ్ల రాకపోకల ఆలస్యానికి గల కారణాలను అన్ని రైల్వేస్టేషన్లలోని ప్లాట్‌ఫాం స్క్రీన్లపై వీడియో రూపంలో ప్రదర్శించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రైలు ఆలస్యానికి కారణాన్నీ వీడియోలో వివరిస్తారు. ఆలస్యానికి ప్రయాణికులకు క్షమాపణ చెప్పనున్నారు. ప్రస్తుతం దేశంలో 30శాతం రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే శాఖ నివేదికలో వెల్లడైంది. -
వెయిటింగ్ లిస్ట్‌ను వెల్లడించాల్సిందే
న్యూఢిల్లీ: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు(డీఎస్ఎస్ఎస్బీ) పరీక్షలో ఎంపికై వెయిటింగ్ లిస్టులో ఉన్న అభ్యర్ధుల పేర్లను బహిర్గతం చేయాలని కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) ఆదేశించింది. ఈ జాబితాను వారం రోజుల్లో ఆన్లైన్లో ఉంచాలని సీఐసీ కమిషనర్ యశోవర్ధన్ ఆజాద్ సెలెక్షన్ బోర్డును కోరారు. డీఎస్ఎస్ఎస్బీ గత ఏడాది 34 టీచర్ పోస్టుల భర్తీకి గాను పరీక్షలు నిర్వహించింది. ఎంపికైన వారితో 33 పోస్టులను భర్తీ చేసింది. అయితే, వెయిటింగ్ లిస్ట్, కటాఫ్ మార్కులు, ర్యాంకుల వివరాలు తెలపాలని రేఖారాణి అనే అభ్యర్థిని కోరగా డీఎస్ఎస్ఎస్బీ తిరస్కరించింది. దీనిపై ఆమె సీఐసీని ఆశ్రయించారు. వెయిటింగ్ లిస్ట్‌ను రహస్యంగా ఉంచడం సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడమేనని సీఐసీ పేర్కొంది. అర్జీదారుకు వివరాలు తెలుసుకునే హక్కు ఉందంటూ, ఈ పరీక్ష వెయిటింగ్ లిస్ట్‌ను రెండు వారాల్లోగా ఆన్లైన్లో ఉంచాలంది. -
ఎన్టీఆర్ విద్యోన్నతి..అభ్యర్థులు అధోగతి
రెండోవిడత ఎంపికపై నీలినీడలు! వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న వారికి మొండిచేయి అనంతపురం ఎడ్యుకేషన్ : ఎన్టీఆర్ విద్యోన్నతి పథకంపై ఆశలు పెట్టుకుని సివిల్స్ రాయాలనుకున్న చాలామంది అభ్యర్థులు కొందరు అధికారుల అలసత్వం కారణంగా అధోగతి పాలవుతున్నారు. ఎస్సీ, ఎస్టీలకు సివిల్ సర్వీసెస్‌కు సంబంధించి ఉచిత శిక్షణ ఇప్పించేందుకు ఈ పథకం ప్రవేశపెట్టారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు హైదరాబాద్‌లోని ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్, బ్రెయిన్ ట్రీ, లక్ష్మయ్య కోచింగ్ సెంటర్‌తో పాటు బెంగళూరులోని యూనివర్సల్, ఢిల్లీలోని శ్రీరామ్స్ కోచింగ్ సెంటర్లలో ఉచితంగా తొమ్మిది నెలలపాటు శిక్షణ ఇప్పిస్తారు. నెలకు రూ.8 వేలు స్టైఫండ్ కూడా ఇస్తారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం–2016 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 700 మంది ఎస్సీ, 300 మంది ఎస్టీ అభ్యర్థులకు శిక్షణ ఇప్పించాల్సి ఉండగా, వీరిని ఎంపిక చేయడానికి కాకినాడ జేఎన్టీయూ యూనివర్సిటీ వారు ఆగష్టు 28న ఆన్లైన్లో రాత పరీక్ష నిర్వహించారు. 2వేల మందితో మెరిట్ లిస్టు తయారు చేశారు. సెప్టెంబర్ 26, 27 తేదీల్లో మొదటి విడత సర్టిఫికెట్ల పరిశీలనకు 1000 మంది అభ్యర్థులను పిలిచారు. - హాజరైన వారిలో 137 (ఎస్సీలు 107, ఎస్టీలు 30) మంది ఇదివరకే శిక్షణ తీసుకున్నవారు కావడంతో అధికారులు వీరికి అవకాశం కల్పించలేదు. అయితే నోటిఫికేషన్లో ‘శిక్షణ తీసుకున్న వారు అనర్హులు’ అనే విషయాన్ని పొందుపరచక పోవడం వల్లే తాము పరీక్ష రాశామని, ఎంపికయ్యాక కాదంటే ఎలాగని వారిలో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతానికి వారి సర్టిఫికెట్లను పరిశీలించాలని, తుది నిర్ణయం మేరకు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించడంతో ఈ 137 మంది సర్టిఫికెట్లనూ అక్టోబర్ 5న పరిశీలించారు. - మొదటి విడత సర్టిఫికెట్ల పరిశీలనకు 250 మంది దాకా గైర్హాజరు కాగా, వారి స్థానంలో వెయిటింగ్ లిస్టులో ఉన్నవారిని ఎంపిక చేసేందుకు అక్టోబర్ 14న వారి సర్టిఫికెట్లను పరిశీలించారు. దాదాపు ఎస్సీ విద్యార్థులు 200 మంది, ఎస్టీ విద్యార్థులు పదుల సంఖ్యలో హాజరయ్యారు. మూడు వారాలు గడిచినా వారికి ఓటీపీ(వన్ టైం పాస్వర్డ్) రాకపోవడంతో కోచింగ్‌కు వెళ్లలేకపోయారు. ఓటీపీ వస్తేనే ఆన్లైన్లో కోచింగ్ సెంటర్‌ను ఎంపిక చేసుకునే వీలుంటుంది. 2017 జూన్ 18న ప్రిలిమినరీ పరీక్ష సివిల్ సర్వీసెస్ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. యూపీపీఎస్సీ ప్రిలిమనరీ పరీక్ష 2017 జూన్ 18న నిర్వహించనున్నారు. శిక్షణ తొమ్మిది నెలలైతే పరీక్ష గడువు 7 నెలలు మాత్రమే ఉంది. ఇప్పటికే రెండు నెలల శిక్షణ కోల్పోయామని, వెంటనే రెండో జాబితాను ఖరారు చేసి శిక్షణకు పంపించాలని అభ్యర్థులు రాము, రుషికేష్, ముత్యాలప్ప, సాయినాథ్ తదితరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రోశన్నను వివరణ కోరగా... ఎన్టీఆర్ విద్యోన్నతి పథకానికి సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని, అంతా డైరెక్టరేట్ కార్యాలయం వారు, కాకినాడ జేఎన్టీయూ వారే చూస్తున్నారని ఆయన తెలిపారు. -
రైళ్లన్నీ రద్దీ!
సాక్షి, సిటీబ్యూరో: ఉత్తరాది రైళ్లు ప్రయాణికులతో పోటెత్తుతున్నాయి. దీపావళి, చత్ పూజల దృష్ట్యా నగరవాసులు భారీ సంఖ్యలో సొంత ఊళ్లకు తరలి వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్, సికింద్రాబాద్‌ల నుంచి బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వైపునకు వెళ్లే రైళ్లలో భారీ రద్దీ నెలకొంది. ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా అదనపు రైళ్లను ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే అన్ని రైళ్లలో రిజర్వేషన్ బెర్తులు నిండిపోయాయి. కొన్నింటిలో వెయిటింగ్ లిస్టు వందల్లోకి చేరుకోగా, మరికొన్ని రైళ్లలో రిగ్రెట్ దర్శనమిస్తోంది. ఒక్క సికింద్రాబాద్–పట్నాల మధ్య మాత్రమే వారానికి ఒక అదనపు రైలును ఏర్పాటు చేసి అధికారులు చేతులు దులుపుకొన్నారని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆఖరికి తత్కాల్ బోగీల్లో కూడా వెయిటింగ్ లిస్టు 50 నుంచి 100 వరకు పెరిగింది. ఉత్తరాది ప్రజలు ఎంతో ఘనంగా చేసుకొనే దీపావళి పర్వదినం, చత్ పూజల కోసం ప్రతి సంవత్సరం నగరం నుంచి లక్షలాది మంది తరలివెళ్తారు. కానీ అందుకు తగిన విధంగా రైళ్లు అందుబాటులో లేకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. -
హజ్ యాత్ర-2016కు మరో 111 మందికి అవకాశం
సాక్షి, హైదరాబాద్: హజ్‌యాత్ర-2016 కోసం వెయిటింగ్ లిస్ట్‌లోని 111 మందికి అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్ఏ షుకూర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెయిటింగ్ లిస్ట్‌లో 111 నంబర్ వరకు గల అభ్యర్థులు జూలై 4 లోగా పూర్తి స్థాయి చార్జీలను చెల్లించాలని ఆయన సూచించారు. పాస్పోర్టుతో పాటు కలర్ ఫొటోలు, వైద్య పరీక్షల ధ్రువీకరణ పత్రాలను హజ్‌హౌస్‌లో సమర్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
‘వెయిటింగ్ లిస్టు’కు ‘వికల్ప్’ ఊరట
సికింద్రాబాద్-న్యూఢిల్లీ మధ్య సేవలు అందుబాటులోకి సాక్షి, హైదరాబాద్: చాంతాడంత వెయిటింగ్ లిస్టు... చార్ట్ సన్నద్ధమయ్యే వరకూ ఉత్కంఠగా ఎదురుచూపు... చివరకు బెర్త్ కన్ఫర్మ్ కాకపోతే చేసేది లేక ఆఖరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో వెయిటింగ్ లిస్టు ప్రయాణికులకు ఊరట కల్పించే ‘వికల్ప్’ పథకాన్ని ఇటీవల దక్షిణ మధ్య రైల్వే తొలిసారిగా అందుబాటులోకి తెచ్చింది. మొదటగా హైదరాబాద్- ఢిల్లీ మధ్య నడిచే తెలంగాణ ఎక్స్‌ప్రెస్, దక్షిణ్ ఎక్స్‌ప్రెస్, ఏపీ సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ పథకాన్ని ప్రారంభించింది. వీటిలోని ఏదైనా రైలులో వెయిటింగ్ లిస్టులో ఉన్నవారు ఆ తరువాత వచ్చే రైలును ఆప్షన్‌గా ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ నిరీక్షణ జాబితాలో ఉన్నవారు మరో ఆప్షన్‌గా దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఒకవేళ తొలుత కోరుకున్న రైలులో బెర్తు పొందలేకపోతే తరువాతి రైలులో బెర్తులు ఖాళీగా ఉంటే వాటిని కేటాయిస్తారు. గతేడాది న్యూఢిల్లీ- జమ్మూ, న్యూఢిల్లీ-అమృత్సర్ మార్గాల్లో ప్రవేశపెట్టిన ‘వికల్ప్’ సత్ఫలితాలివ్వడంతో... తాజాగా ఈ పథకాన్ని హైదరాబాద్-న్యూఢిల్లీ ప్రయాణికులకూ అందుబాటులోకి తెచ్చారు. దీన్ని వినియోగించుకొనేందుకు ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకొనే సమయంలోనే ‘ఆల్టర్నేట్ ట్రైన్ అకామడేషన్ స్కీమ్’ (ఏటీఏఎస్) ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. టికెట్ ధర తక్కువగా ఉంటే వారి ఖాతాలో జమవుతుంది. అధికంగా ఉంటే ప్రయాణికులు ప్రయాణ సమయంలో చెల్లించాలి. ఎమర్జెన్సీ కోటా దుర్వినియోగానికి కళ్లెం... ఎమర్జెన్సీ కోటా బెర్తులు తరచుగా దుర్వినియోగం కావడం, అనర్హులు, ట్రావెల్ ఏజెంట్లు ఏదోలా వాటిని దక్కించుకొని సొమ్ము చేసుకోవడం వల్ల ముందుగా బుక్‌చేసుకున్న ప్రయాణికులు తీవ్రంగా నష్టపోతున్నారు. సాధారణంగా ఎమర్జెన్సీ కోటా కింద స్లీపర్ క్లాసులో 30 నుంచి 40, థర్డ్ ఏసీలో 6, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీలో 4 చొప్పున బెర్తులు కేటాయిస్తారు. ఎంపీలు, మంత్రులు, వీఐపీల కోసం, అత్యవసర సమయాల్లో ప్రయాణించవలసిన రైల్వే అధికారులు, లోకో పైలట్ తదితరుల కోసం ఈ బెర్తులుంటాయి. కానీ రద్దీ అధికంగా ఉండే మార్గాల్లో ఈ కోటా బెర్తులు దుర్వినియోగమవుతున్నట్లు రైల్వే శాఖ గుర్తిం చింది. దీన్ని అరికట్టేందుకు ‘వికల్ప్’కు శ్రీకారం చుట్టారు. త్వరలో మరిన్ని రద్దీ రూట్లకు విస్తరణ... ‘వికల్ప్’ పథకాన్ని దశలవారీగా రద్దీగా ఉండే సికింద్రాబాద్-విశాఖ, సికింద్రాబాద్-తిరుపతి, హైదరాబాద్-నర్సాపూర్, కాచిగూడ-బెంగళూరు వంటి మార్గాల్లో ప్రవేశపెడతామని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. -
వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటే...
- ప్రత్యామ్నాయ రైల్లో వెళ్లే సౌకర్యం - వికల్ప్ పథకాన్ని విస్తరించిన రైల్వే న్యూఢిల్లీ: వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల కోసం ఎంపిక చేసిన రూట్లలో రైల్వే శాఖ కొత్త ఏర్పాట్లు చేసింది. ఢిల్లీ నుంచి హౌరా, ముంబై, చెన్నై, బెంగళూరు, సికింద్రాబాద్ రూట్లలో వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు ప్రత్యామ్నాయంగా వేరే రైల్లో గమ్యానికి చేర్చేందుకు వికల్ప్ పథకాన్ని సోమవారం విస్తరించింది. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు బెర్త్ కన్ఫర్మ్ చేసుకొని వారి ఇష్టం మేరకు వేరే రైల్లో వెళ్లవచ్చు. ఈ పథకం మెయిల్/ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లలో వర్తిస్తుంది. రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో చెల్లుబాటుకాదు. వికల్ప్ కింద ప్రత్యామ్యాయ వసతి కల్పించాక ప్రయాణ తేదీని మార్చుకోవడానికి అనుమతించరు. చార్జీలో తేడాలున్నా రీఫండ్ ఇవ్వరు.ఎలాంటి అదనపు చార్జీలు కూడా ఉండవు. జూలై 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి.. ► తత్కాల్ టికెట్లను రద్దు చేసుకుంటే సగం మొత్తం వెనక్కిస్తారు. ప్రస్తుతం ఇందులో రీఫండ్ సౌకర్యం లేదు. ► తత్కాల్ బుకింగ్ వేళల్లో మార్పు. ఏసీ బుకింగ్‌లకు ఉదయం 10 నుంచి 11 వరకు. స్లీపర్ కోచ్ టికెట్ బుకింగ్ ఉదయం 11 నుంచి 12 వరకు. రాజధాని, శతాబ్ది ఎక్స్ప్రెస్ల్లో కేవలం మొబైల్ టికెట్లనే అనుమతిస్తారు. ► ప్రాంతీయ భాషల్లోనూ టికెట్ బుకింగ్ రాజధాని, శతాబ్ది ఎక్స్ప్రెస్ల్లో బోగీల సంఖ్య పెంపు. దీనివల్ల ఎక్కుమంది కన్ఫర్మ్ టికెట్స్ పొందొచ్చు. ► సువిధ రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు ప్రత్యామ్నాయం. ఇవి రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ మాదిరి తక్కువ స్టాప్‌లు ఉంటాయి. ► ప్రీమియం సర్వీసు రైళ్లకు ముగింపు. రైళ్లలో ప్రయాణికులకు గమ్యస్థానం వచ్చేటప్పుడు అప్రమత్తం చేసేందుకు ‘వేకప్ కాల్’ సౌకర్యం. లెవెల్ క్రాసింగ్‌ల వద్ద హెచ్చరికలు.. కాపలా లేని లెవెల్ క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాల నివారణకు రైల్వే సాంకేతికత సహాయంతో హెచ్చరికలు చేసే కొత్త విధానాన్ని అవలంబించనుంది. సీసీ కెమెరాలు, రేడియో పౌనఃపున్యం ఆధారంగా పనిచేసే ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమల్లోకి తెచ్చారు. అన్రిజర్వ్డ్ రైల్వే బుకింగ్ కౌంటర్ల వద్ద రద్దీ తగ్గించడానికి హ్యాండ్ హెల్డ్ టర్మినల్స్‌ను ఢిల్లీలోని నిజాముద్దీన్ స్టేషన్లో పైలట్ ప్రాజెకు ్టకింద ప్రవేశపెట్టారు. దీని ద్వారా ప్లాట్‌పాం టికెట్, అన్రిజర్వ్డ్ టికెట్, సీజన్ టికెట్లను కొనొచ్చు. రైల్వేలో ట్రాక్ మరమ్మతులకు ట్రాక్‌మెన్, కీమెన్ల కోసం తేలికైన టూల్ కిట్‌ను రైల్వే తీసుకొచ్చింది. -
అన్ని పనులకూ.. నంబర్ 139
రైళ్లకు సంబంధించిన వివరాలు, వచ్చే సమయం, తిరిగి బయలుదేరే వేళలు, గమ్యస్థానానికి చేరుకునే సమయాలు, ఏసీ బోగీలు, స్లీపర్ క్లాసు.. ఇలా అన్ని వివరాలనూ దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఖాళీ సీట్ల వివరాలు, టికెట్ కొన్న తర్వాత సీటు/బెర్తు కేటాయించిందీ లేనిదీ, వెయిటింగ్ లిస్టులో మన పీఎన్ఆర్ స్థితి ఏమిటనేది వివరిస్తుంది. రైళ్ల సమయాలు, చార్జీలు, సమయాల్లో మార్పుల వివరాలను కూడా తెలుసుకోవచ్చు. ►మన టికెట్ పీఎన్ఆర్ నంబర్‌ను 139కి ఎస్సెమ్మెస్ చేస్తే క్షణాల వ్యవధిలోనే పీఎన్ఆర్ నంబర్ స్థితితో పాటు రైలు బయలుదేరే వేళలు, గమ్యస్థానానికి చేరుకునే సమయం తదితర వివరాలు ఎస్సెమ్మెస్ రూపంలో మనకు అందుతాయి. ► ఇప్పటివరకు సమాచారం తెలుసుకోవడం వరకే పరిమితమైన 139 నంబర్‌ను టికెట్ క్యాన్సిల్ చేసుకోవటానికీ అనుసంధానించారు. ఈ వెసులుబాటు రైల్వే కౌంటర్లో కొన్న కన్ఫర్మేషన్ టికెట్‌కు మాత్రమే వర్తిస్తుంది. అలాంటి టికెట్ ఉన్నవారు దాన్ని రద్దు చేసుకోవాలంటే రైలు బయలుదేరడానికి నాలుగు గంటలు ముందు 139కు ఫోన్ చేసి సమాచారం అందించి, పీఎన్ఆర్ నంబర్‌ను తెలపాలి. ఆ కాల్ లైన్లో ఉండగానే మన సెల్ (టికెట్ బుక్ చేసేప్పుడు ఇచ్చిన మొబైల్ నంబర్)కు వన్‌టైం పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్‌వర్డ్‌ను 139లో మాట్లాడుతున్న రైల్వే ఉద్యోగికి తెలిపితే.. వారు టికెట్‌ను రద్దు చేస్తారు. ఈ సమాచారం ఎస్సెమ్మెస్ రూపంలో మనకు చేరుతుంది. రైలు బయలుదేరిన నాలుగు గంటలలోపు సమీపంలోని రైల్వే కౌంటర్‌కు వెళ్లి టికెట్‌తోపాటు రద్దయినట్టు వచ్చిన ఎస్సెమ్మెస్‌ను చూపితే నిర్ధారిత సర్వీసు చార్జీ మినహాయించి, మిగతా టికెట్ సొమ్మును తిరిగిస్తారు. సాయంత్రం ఆరు తర్వాత బయలుదేరే రైలు అయితే.. ఆ సమయంలో కొన్ని స్టేషన్లలో కౌంటర్లు మూసి ఉంటాయి. అలాంటి చోట మరుసటి రోజు ఉదయం కౌంటర్ తెరిచిన రెండు గంటలలోపు వెళ్తే డబ్బు చెల్లిస్తారు. ►ఆన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్లు, ఐఆర్సీటీసీ అనుబంధ ప్రైవేటు కౌంటర్లలో కొన్న టికెట్లను మాత్రం ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా మాత్రమే రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. రైల్వే కౌంటర్లో కొని కన్ఫర్మ్ కాని టికెట్‌కు కూడా ఇది వర్తించదు. వెయిటింగ్ లిస్టు చూపుతున్న టికెట్ ఆటోమేటిక్‌గా రద్దవుతుంది. ఆన్లైన్ టికె ట్ ఆర్ఏసీలో ఉన్నప్పుడు రద్దు చేసుకోదలిస్తే ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ‘టికెట్ డిపాజిట్ రిసీట్’ ఫైల్ చేయాల్సి ఉంటుంది. రైలు బయలుదేరడానికి అరగంట ముందు ఈ పని పూర్తి చేస్తే మన బ్యాంకు ఖాతాకు టికెట్ సొమ్ము తిరిగి వచ్చేస్తుంది. ►ఒక్కోసారి టికెట్ కొన్నప్పుడు వెయిటింగ్ లిస్టులో చూపుతుంది. తర్వాత అది కన్ఫర్మ్ అవుతుంది. అలాంటప్పుడు రిజిస్టర్డ్ సెల్ నంబర్‌కు ఎస్సెమ్మెస్ వస్తుంది. దాన్ని చూసుకోవాలి. చూసుకోకుండానే టికెట్ కన్ఫర్మ్ కాలేదనుకుని తీరిగ్గా చార్ట్ ప్రిపేరయ్యాక రద్దవుతుందనుకుంటే.. పైసా కూడా వెనక్కి రాదు. ఫిర్యాదు చేయాలా...? రెలైక్కిన తర్వాత ఏదైనా సమస్య ఎదురైనా, రైల్వేకు ఏదైనా సూచన చేయాలన్నా.. మీ టికెట్ పీఎన్ఆర్ నంబర్‌ను పేర్కొంటూ 8121281212కు ఎస్సెమ్మెస్ చేయవచ్చు. దీంతో వెంటనే సిబ్బంది వచ్చి సమస్యను పరిష్కరిస్తారు. ఇది పూర్తిగా దక్షిణ మధ్య రైల్వేకు పరిమితం. ప్రయాణికుల రక్షణ కోసం రైల్వే ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా 182 నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. రైల్లో మీ భద్రతకు ఇబ్బంది అనిపిస్తే వెంటనే ఈ నంబర్‌కు మీ పీఎన్ఆర్ నంబర్‌ను పేర్కొంటూ ఎస్సెమ్మెస్ చేయాలి. దాంతో వెంటనే పోలీసు సిబ్బంది మీ సీటు వద్దకు వచ్చి సహాయం అందజేస్తారు. ఇది ఒంటరిగా ప్రయాణించే మహిళలకు ఎంతో ఉపయుక్తం. మీ బోగీ అపరిశుభ్రంగా ఉంటే ‘క్లీన్ మై కోచ్’ పేరుతో కొత్తగా 58888 నంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. క్లీన్ అని రాసి స్పేస్ ఇచ్చి మీ పీఎన్ఆర్ నంబర్ టైప్ చేసి ఎస్సెమ్మెస్ పంపితే... సిబ్బంది వచ్చి రైలు నడుస్తుండగానే బోగీని శుభ్రం చేస్తారు. ప్రస్తుతం ద.మ. రైల్వే పరిధిలోని 40 రైళ్లలో క్లీనింగ్ సిబ్బందిని నియమించారు. ప్రతి రైల్లో ఎస్కార్ట్ పోలీసులు ఉంటారు. వారు అటూ ఇటూ గస్తీ తిరుగుతుంటారు. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వారిని వెతికి పట్టుకోవడం కష్టంగా ఉంటుంది. అందుకని ప్రతి రైలులోని ఎస్-1 బోగీలో 63వ నంబర్ సీటు వద్ద నిరంతరం ఒక పోలీసు అందుబాటులో ఉంటారు. అక్కడికి వెళ్లి సహాయం పొందవచ్చు. -
ఇకపై ‘వెయిటింగ్ లిస్ట్’వారికి ఎస్ఎంఎస్
ప్రత్యేక రైళ్ల బెర్తులపై సమాచారం హైదరాబాద్: ‘వెయిటింగ్ లిస్టు’ ప్రయాణికులకు కోసం దక్షిణమధ్య రైల్వే వినూత్న సౌకర్యాన్ని అందుబాటులోకి తేనుంది. రద్దీ సమయాల్లో నడిపే ప్రత్యేక రైళ్ల సమాచారాన్ని వారికి సంక్షిప్త సందేశా(ఎస్ఎంఎస్)ల రూపంలో పంపనుంది. వెయిటింగ్ లిస్టు ప్రయాణికులు రిజర్వ్ చేసుకున్న తేదీలతో పాటు ఆ రోజుకు దగ్గర్లో ఏవైనా ప్రత్యేక రైళ్లు నడుపుతుంటే... అందులోని బెర్తుల వివరాలతో సమాచారాన్ని వారికి చేరవేస్తారు. ఇటీవల పొగమంచు కారణంగా తెలంగాణ ఎక్స్‌ప్రెస్, దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ వంటి కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే మంచు తెరలు వీడిపోవడంతో వాటిని పునరుద్ధరించారు. కానీ రైళ్లు ఖాళీగా ఉండటంతో విస్మయానికి గురైన రైల్వే అధికారులు... అదే మార్గంలో నడిచే ఇతర రైళ్లలోని వెయిటింగ్ లిస్టు ప్రయాణికులకు ఎస్ఎంఎస్లు పంపారు. దీనికి అనూహ్య స్పందన రావడంతో ఈ సదుపాయాన్ని అన్ని స్పెషల్ ట్రైన్స్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ వినూత్న ఆలోచనను త్వరలోనే అన్ని ప్రత్యేక రైళ్లకు విస్తరించనున్నట్టు దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. -
రైళ్లేవీ?
భారీగా వెయిటింగ్ లిస్ట్ కొన్నిటిలో ‘నో రూమ్’ కనిపించని ప్రత్యేక ప్రకటన ‘సంక్రాంతి’ ప్రయాణికుల్లో ఆందోళన సిటీబ్యూరో: సంక్రాంతికి సొంత ఊళ్లు వెళ్లాలనుకునే వారికి ఈసారి చుక్కలు కనిపించేలా ఉన్నాయి. అన్ని రైళ్లలోనూ వెయిటింగ్ లిస్టు చాంతాడులా పెరిగిపోయింది. ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వస్తే తప్ప ప్రజలు పండక్కి బయలుదేరడం సాధ్యం కాదు. మరో వారం, పది రోజుల్లో పిల్లలకు సంక్రాంతి సెలవులు రానున్నాయి. సొంత ఊళ్లలో గడిపేందుకు నగర వాసులు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. వీరి ఆశలను ఆవిరి చేస్తూ అన్ని రెగ్యులర్ రైళ్లలో వెయిటింగ్ లిస్టు వెక్కిరిస్తోంది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. డిమాండ్‌ను, పండుగ సెలవులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లు నడపాల్సిన దక్షిణ మధ్య రైల్వే ఇప్పటి వరకు ఆ దిశగా ఒక్క అడుగైనా ముందుకు వేయలేదు. విశాఖ, తిరుపతి, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లన్నీ వచ్చే నెలాఖరు వరకు నిండిపోయాయి. చాలా రైళ్లలో ‘నో రూమ్’ బోర్డు వేలాడుతోంది. ప్రత్యేక రైళ్లు నడిపితే కానీ ఎవరూ సొంత ఊళ్లకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఏటా తగ్గుతున్న ప్రత్యేక రైళ్లు ఏటా ప్రయాణికుల రద్దీ పెరుగుతుండగా... అధికారులు మాత్రం రైళ్ల సంఖ్యను కుదించేస్తున్నారు. సాధారణ రోజుల్లో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నుంచి రోజుకు సుమారు 2 లక్షల మంది వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. ఒక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచే లక్షా 50 వేల మంది ప్రయాణిస్తారు. సంక్రాంతి, దసరా వంటి పండుగ రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపవుతుంది. సెలవు రోజుల్లో లక్ష నుంచి 2 లక్షల మంది అదనంగా వెళుతుంటారు. సంక్రాంతికి 20 లక్షల మందికి పైగా సొంత ఊళ్లకు వెళ్తారు. రద్దీ ఇలా పెరుగుతుంటే... ప్రత్యేక రైళ్లు మాత్రం తగ్గిపోతున్నాయి. 2010 నుంచి వీటి సంఖ్యను క్రమంగా తగ్గించేస్తున్నారు. 2010లో సంక్రాంతికి 52 ప్రత్యేక రైళ్లు నడిపారు. 2011 నాటికి వాటిని 40కి తగ్గించారు. ఆ మరుసటి సంవ త్సరం 31 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. గతఏడాది సంక్రాంతి రైళ్లు 30 లోపే ఉన్నాయి. ఈసారి అసలు నడుపుతారా? లేదనేది ఇంతవరకూ స్పష్టం కాలేదు. ఏజెంట్లకే మేలు సంక్రాంతి, దసరా, దీపావళి వంటి పండుగలు, వేసవి సెలవుల్లో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు నడపడంలో దక్షిణ మధ్య రైల్వే ఏటా విఫలమవుతూనే ఉంది. కనీసం నెల రోజులు ముందుగా ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తే ప్రయాణికులకు ప్రయోజనంగా ఉంటుంది. పండగ సెలవులు ముంచుకొచ్చిన తరువాత అప్పటికప్పుడు రైళ్లు వే స్తుంటే పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. రెగ్యులర్ రైళ్లలో బెర్తుల సంఖ్యను పెంచినా ఉపయోగం అంతంత మాత్రమే. ఆగమేఘాల మీద ప్రత్యేక రైళ్లు వేయడంతో ఆ విషయం ప్రయాణికులు గుర్తించేలోపే ఎక్కువ శాతం సీట్లు ఏజెంట్లు ఎగురేసుకుపోతున్నారు. 150 దాటిన వెయిటింగ్ లిస్ట్ ఇప్పటికే అన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్టు 150 నుంచి 180కి చేరింది. జనవరి మొదటి వారం నుంచి నెలాఖరు వరకు రైలు ప్రయాణం పూర్తిగా అసాధ్యంగా మారింది. గోదావరి, విశాఖ, గరీబ్థ్,్ర ఫలక్‌నుమా, గౌతమి, మచిలీపట్నం, నర్సాపూర్, సింహపురి, నారాయణాద్రి, వెంకటాద్రి, పద్మావతి, రాయలసీమ, తదితర అన్ని ప్రధాన రైళ్లలో వెయిటింగ్ లిస్టు భారీగానే ఉంది. ఈ సంఖ్య ప్రత్యేక రైళ్ల అవసరాన్ని చెప్పకనే చెబుతోంది. -
టికెట్ రద్దు.. ‘డబుల్’ భారం
రద్దు చార్జీలు రెట్టింపు చేసిన రైల్వే ఈ నెల 12 నుంచి కొత్త నిబంధనలు సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: టికెట్ రద్దు చేసుకొనే ప్రయాణికులపై రైల్వేశాఖ భారాన్ని పెంచింది. ఇప్పటి వరకు ఉన్న చార్జీలను రెట్టింపు చేసింది. పెంచిన టికెట్ రద్దు(రీఫండింగ్)చార్జీలు ఈ నెల 12 నుంచి అమల్లోకి రానున్నాయి. వెయిటింగ్ లిస్టు ప్రయాణికులు, ఆర్ఏసీ ప్రయాణికులు ఇప్పటి వరకు బుకింగ్ కౌంటర్లలో టికెట్ రద్దు కోసం రూ.చెల్లిస్తున్న రూ.30ల రుసుము ఇక నుంచి రూ.60కి పెరగనుంది. అలాగే వివిధ తరగతుల కోసం బుక్ చేసుకున్న నిర్ధారిత(కన్ఫర్మ్డ్) టికెట్ రీఫండింగ్ చార్జీలు కూడా రెట్టింపు కానున్నాయి. ప్రస్తుతం నిర్ధారిత టికెట్లపైన ట్రైన్ బయలుదేరడానికి 6 గంటల ముందు, బయలుదేరిన తరువాత 2 గంటలలోపు టికెట్ రద్దు చేసుకొంటే 50 శాతం డబ్బులు తిరిగి చెల్లించే సదుపాయం ఉండేది. ఇక నుంచి బండి బయలుదేరడానికి 12 గంటల నుంచి 4 గంటల ముందు టికెట్లు రద్దు చేసుకున్న ప్రయాణికులకు మాత్రమే ఈ 50 శాతం సొమ్ము తిరిగి చెల్లిస్తారు. అంటే ట్రైన్ బయలుదేరిన తరువాత కూడా టికెట్ రద్దు చేసుకొనే సదుపాయం ఇక ఉండబోదు. రైలు బయలుదేరడానికి 4 గంటలు ముందే టికెట్లు రద్దు చేసుకోవాలన్న నిబంధన వల్ల మిగిలిన బెర్తులను వెయిటింగ్ లిస్టు ప్రయాణికులకు కేటాయించేందుకు అవకాశం ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. 48 గంటల ముందు రద్దు చేసుకునేవారికి రీఫండింగ్ చార్జీల్లో మార్పులు ఇలా ఉంటాయి. ఇప్పటి వరకు నిర్ధారిత ఫస్ట్ ఏసీ టికెట్ రీఫండింగ్ చార్జీ రూ.120 ఉండగా, ఇక నుంచి రూ.240కి పెరగనుంది. సెకెండ్ ఏసీ చార్జీ.. రూ.100 నుంచి రూ.200లకు, థర్డ్‌ఏసీ చార్జీ.. రూ.90 నుంచి రూ.180 కి పెరుగుతుంది. హా స్లీపర్ క్లాస్.. రూ.60 నుంచి రూ.120కి, సెకెండ్ క్లాస్.. రూ.30 నుంచి రూ.60 కి పెరుగుతాయి. ఒకే టికెట్‌పైన ఎక్కువ మంది ప్రయాణికులు బుక్ చేసుకున్నప్పుడు కొందరికి బెర్తులు లభించి, మరి కొందరు వెయిటింగ్ లిస్టులో ఉండే పాక్షిక నిర్ధారిత టికెట్లను రద్దు చేసుకొనేందుకు ప్రస్తుతం ట్రైన్ బయలుదేరిన తరువాత 2 గంటల వరకు గడువు ఉండేది. ఇక నుంచి ట్రైన్ బయలుదేరిన 30 నిమిషాల్లోపు మాత్రమే పాక్షిక నిర్ధారిత టికెట్లు రద్దు చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. ఈ-టిక్కెట్ల రద్దు కోసం ఇప్పటి వరకు ట్రావెల్ డిపాజిట్ రిసీట్(టీడీఆర్)లను అందజేయవలసి ఉండేది. ఇక నుంచి టీడీఆర్ అవసరం లేకుండా.. ఆటోమేటిక్‌గా రద్దవుతాయి. -
మీ టికెట్ కన్ఫమ్ అవుతుందా?
రైల్వే టికెట్ల కన్ఫర్మేషన్ ముందే తెలుసుకోవచ్చు... ♦ మొబైల్ యాప్‌లో కూడా కన్ఫమ్ టికెట్ డాట్ కామ్ ♦ లక్ష డాలర్ల నిధుల సమీకరణ... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఎవరైనా సరే! రైల్వే టికెట్ బుక్ చేయగానే ముందుగా అడిగే ప్రశ్న.. ‘వెయిటింగ్ లిస్ట్ ఎంత అని’! ఇక వెయిట్ లిస్ట్ నంబరు చెప్పాక అడిగే రెండో ప్రశ్న... కన్ఫమ్ అవుతుందా?... అని. మొదటి ప్రశ్నకైతే సమాధానం దొరుకుతుంది కానీ... రెండో ప్రశ్నకు ప్రయాణం చివరి క్షణం వరకూ జవాబుండదు. ఆ రైలు బయలుదేరే రెండుమూడు గంటల ముందు... చార్ట్ ప్రిపేర్ అయ్యాక మాత్రమే తెలుస్తుంది మన టికెట్ కన్ఫమ్ అయిందో లేదో!!. ఇక అప్పుడు తెలిశాక లాభమేముంటుంది చెప్పండి? ప్రత్యామ్నాయం చూసుకోవాలనుకున్నా కష్టం. ప్రయాణం రద్దు చేసుకోవాల్సిందే. ఇవన్నీ అనుభవించిన వాళ్లు ప్రారంభించిందే ‘‘కన్ఫమ్ టికెట్ డాట్ కామ్(www.conformtkt.com)’’. మీక్కావల్సిన రైళ్ల వివరాలను, వాటి టికెట్ల స్టేటస్‌ను ముందే చెప్పేస్తుంది. అప్పటికి వెయిట్‌లిస్ట్ టికెట్ వచ్చినా... మీరు ప్రయాణించే సమయానికి అది కన్ఫమ్ అవుతుందో లేదో కచ్చితంగా చెప్పటమే దీని ప్రత్యేకత. ‘‘మీ ప్రయాణాన్ని కన్ఫమ్ చేయడమే మా పని’’ అంటారు సంస్థ వ్యవస్థాపకులు శ్రీపద్ వైద్య, దినేష్‌కుమార్. శ్రీపద్ది నిజామాబాద్ కాగా... దినేష్‌ది ఖమ్మం. తమ సంస్థకు సంబంధించి శ్రీపద్ ఏమన్నారన్నది ఆయన మాటల్లోనే... అందరికీ ఇదే సమస్య... నేను, దినేష్ ఇద్దరం బెంగళూరులోని ఐబీఎంలో పనిచేసే వారం. సెలవుల్లో హైదరాబాద్‌కు వచ్చినప్పుడల్లా మాకు ఎదురయ్యే ప్రధాన సమస్య టికెట్ బుకింగే. రెండు మూడు నెలల ముందు నుంచే టికెట్లను బుక్ చేస్తే తప్ప కన్ఫమ్ కాని పరిస్థితి. ప్రయాణం అత్యవసరమైతే ఎక్కువ డబ్బులు పెట్టి వెళ్లాల్సిందే. మాకే కాదు. చాలా మందిది ఇదే పరిస్థితి. అప్పుడే అనిపించింది. టెక్నాలజీని ఉపయోగించి టికెట్ కన్ఫమ్ అవుతుందో లేదో ముందే చెప్పేస్తే ఎంతో బాగుంటుంది కదా!! అని. దీంతో అవసరమైతే ఇతర మార్గాల ద్వారా ప్రయాణం చే స్తాం.. లేకపోతే టికెట్లు మరింత ముందుగా బుక్ చేసుకుంటాం. పెపైచ్చు టికెట్ కన్ఫమ్ అవుతుందో లేదో అనే ఒత్తిడి తగ్గుతుంది. ఇలా పుట్టుకొచ్చిందే కన్ఫమ్ టికెట్.కామ్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, యాప్, ఫంక్షన్స్ డెవలప్మెంట్ కోసం రెండేళ్లు శ్రమించి రూ.15 లక్షల పెట్టుబడితో 2014 జూలైలో దీన్ని ప్రారంభించాం. గుట్టంతా ఆల్గోరిథంలోనే.. వెయింటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్ కన్ఫమ్ అవుతుందో లేదో చెప్పాలంటే కాసింత శ్రమ తప్పదు. దీనికి టెక్నాలజీని జోడించి ప్రత్యేకమైన ఆల్గోరిథంను రూపొందించాం. అంటే పీఎన్ఆర్ నంబర్‌ను ఎంటర్ చేయగానే... సరిగ్గా అక్కడి నుంచి రెండు మూడు ఏళ్ల కిందటి వరకూ అదే నెలలో ఎన్ని టికెట్లు బుకింగ్ అయ్యాయి.. ఎన్ని రిజర్వ్ అయ్యాయి.. ఎన్ని క్యాన్సిల్ అయ్యాయి.. వంటి వివరాలన్నీ క్షణాల్లో తెలిసిపోతాయి. వీటి ఆధారంగా ప్రస్తుతం వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్ కన్ఫమ్ అవుతుందో లేదో అంచనా వేస్తాం. టికెట్ కన్ఫర్మేషన్ అవకాశాలు 70 శాతం కంటే ఎక్కువుంటే కన్ఫమ్ అని, 30-70 శాతం మధ్య ఉంటే ప్రోబబుల్ అని, 30 శాతం కంటే తక్కువుంటే అవకాశం లేదని సూచిస్తాం. టికెట్ స్టేటస్ వివరాలను ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ రూపంలో తెలియజేస్తాం. టికెట్ కన్ఫమ్ కాగానే పీఎన్ఆర్ స్టేటస్ వివరాలు సరాసరి ఈ-మెయిల్‌కు పంపిస్తాం. 90 శాతం నిజమవుతాయ్.. ఇప్పటివరకు కన్ఫమ్ టికెట్.కామ్‌లో దేశంలోని 2,500 రైళ్ల నంబర్లు రిజిస్టరై ఉన్నాయి. ప్రస్తుతం మా సైట్‌ను రోజుకు 4వేల మంది, మొబైల్ యాప్‌ను రోజుకు 16 వేల మంది వినియోగించుకుంటున్నారు. వారాంతాల్లో, సెలవు దినాల్లో కూడా టికెట్ల కన్ఫర్మేషన్ను 90 శాతం కచ్చితంగా అంచనా వేస్తాం. ప్రస్తుతానికి ఉచితంగానే సేవలందిస్తున్నాం. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెలరోజుల్లో ఐఓఎస్ యాప్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తాం. ఒక్కోసారి డెరైక్ట్ రైళ్లలో టికెట్లు దొరక్కపోతే... సగం దూరం ఒకటి.. మరో సగం ఇంకో రైలు లాంటివి కూడా సూచిస్తాం. త్వరలో టికెట్ల బుకింగ్ కూడా.. ఇటీవలే బెటర్‌ప్లేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కో-ఫౌండర్ ప్రవీణ్ అగర్వాల్ లక్ష డాలర్ల పెట్టుబడి పెట్టారు. ‘‘పీఎన్ఆర్ స్టేటస్ వివరాలు చెప్పడం వరకే ఎందుకు పరిమితమయ్యారు? మీరే టికెట్ బుకింగ్ చేయొచ్చు కదా!’’ అని మా కస్టమర్లు చాలా మంది అడుగుతున్నారు. అందుకే రైల్వే శాఖతో సంప్రతింపులు జరిపాం. 4 నెలల్లో మా సైట్, యాప్ నుంచి రైలు టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తాం. ఆ తర్వాత బస్సు, విమానాల టికెట్లనూ బుక్ చేసుకునే సేవలను అందుబాటులోకి తెస్తాం. ఒక్కమాటలో చెప్పాలంటే సీటు దొరకలేదని ప్రయాణాన్ని విరమించకుండా.. కూర్చొని ప్రయాణం చేసేలా చేయడమే మా లక్ష్యం. -
దసరా రష్
రైళ్లన్నీ కిటకిట తరగని వెయిటింగ్ లిస్టు ప్రయాణికులఅవస్థలు విశాఖపట్నం సిటీ : రైళ్లకు దసరా తాకిడి పెరిగిం ది. రైళ్లన్నీ రద్దీగా కదులుతున్నాయి. నిరీక్షణ జాబితా చాంతాడులా వేలాడినట్టే బోగీల్లో ప్రయాణికులు కూడా వేలాడుతున్నారు. బుధవారం ఉదయం జన్మభూమి ఎక్స్‌ప్రెస్ నుంచే రద్దీ తీవ్రత మొదలైంది. జనరల్ బుకింగ్ కౌంటర్ దాటి ప్రయాణికులు టికెట్ల కోసం నిరీక్షించారు. జ్ఞానాపురం వైపు కూడా పెద్ద ఎత్తున ప్రయాణికులు క్యూ కట్టారు. ఉదయం 5 గంటలకు క్యూకట్టినా అనుకున్న రైలుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంటోంది. ఉదయం జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించేందుకు సిద్దపడి టిక్కెట్ కోసం నిరీక్షించిన వారిలో అనేక మంది సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌కు బయల్దేరి వెళ్లారు. మధ్యాహ్నం 12.30 గంటలకు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ కోసం కూడా ప్రయాణికులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. ఒకరిని ఒకరు తోచుకుంటూ రెలైక్కేందుకు ఒక్కసారిగా పోటీపడడంతో తోపులాట జరిగింది. జనరల్ బోగీల్లోకి వెళ్లేందుకు ఉభయగోదావరి జిల్లాల ప్రయాణికులు పోటీపడడంతో తోపులాటలు జరిగాయి. సికింద్రాబాద్ వెళ్లేందుకు సాయంత్రం విశాఖ ఎక్స్‌ప్రెస్, గోదావరి ఎక్స్‌ప్రెస్‌ల వద్ద కూడా రద్దీ కనిపించింది. ఆర్పీఎఫ్ పోలీసులు ప్రయాణికులను క్యూ కట్టించడంతో కాస్త తోపులాటలు తగ్గాయి. హౌరా వైపునకు బాగా డిమాండ్.! విశాఖ నుంచి హౌరా వైపు వెళ్లేందుకు భారీ డిమాండ్ వుంది. హౌరా వెళ్లే రైళ్లలో నిలబడేందుకే చోటు కనిపించడం లేదు. చెన్నె, బెంగుళూరు, ముంబాయి నుంచి హౌరా వెళ్లే అన్ని రైళ్లలో రద్దీ విపరీతంగా వుంది. అక్కడి నుంచి వచ్చేటప్పుడే ఆ రైళ్లన్నీ పూర్తిగా నిండిపోయి వుంటున్నాయి. దీంతో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ప్రయాణికులు ఎక్కేందుకు చోటుండడం లేదు. హౌరా మెయిల్, కోరమండల్, ఈస్టుకోస్టు, ఫలక్నామా, యశ్వంత్‌పూర్-హౌరా, విశాఖ-షాలిమార్, సికింద్రాబాద్-హౌరా వంటి రైళ్లన్నీ కిక్కిరిసినడుస్తున్నాయి. ప్రత్యేక రైళ్లు సైతం బెర్తులన్నీ ఫుల్‌గా నిండిపోయాయి. పాఠశాలలకు, ప్రై వేట్ కాలేజీలకు, కోచింగ్ కేంద్రాలకు సెలవులు ఇచ్చేస్తుండడంతో ఊర్ల బాట పట్టారు. -
ముగిసిన ‘ట్రిపుల్ ఐటీ’కౌన్సెలింగ్
ముథోల్ : బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ప్రవేశానికి రెండు రోజులుగా నిర్వహిస్తోన్న కౌన్సెలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండో రోజు గురువారం 436 మంది విద్యార్థులకు 398 మంది హాజరయ్యారు. 38 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థుల పదో తరగతి, ఇతర ధ్రువీకరణ పత్రాలను అధికారులు పరిశీలించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. వెయిటింగ్ లిస్ట్ విద్యార్థులకు ఈ నెల 28న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు, అదే రోజు మొదటి, రెండో రోజు కౌన్సెలింగ్ ప్రక్రియకు హాజరుకాని విద్యార్థులకూ కౌన్సెలింగ్ ఉంటుందని కళాశాల అసిస్టెంట్ రిజిస్ట్రార్ రహమాన్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఈ నెల 28 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఆలోగా విద్యార్థులు కళాశాలకు హాజరుకావాలని చెప్పారు. కౌన్సెలింగ్‌లో అధికారులు కె.జ్యోతిగౌడ్, హరికృష్ణగౌడ్, మధుసూదన్‌గౌడ్, విజయ్‌కుమార్, కన్నారావు, బాబు, దరావత్, సతీశ్‌కుమార్, ట్రిపుల్ ఐటీ సిబ్బంది పాల్గొన్నారు.