
న్యూఢిల్లీ: రైళ్లలో వెయిటింగ్ లిస్ట్‌తో ఇబ్బందిపడే ప్రయాణికుల కోసం రైల్వేశాఖ కొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. రైళ్లలో బెర్త్ కన్‌ఫర్మ్ అయ్యే అవకాశం ఎంతుందో ప్రయాణికులు దీంతో తెలుసుకోవచ్చని రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతమున్న ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో సోమవారం అర్ధరాత్రి నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులకు బెర్త్ కన్‌ఫర్మ్ అయ్యే అవకాశం ఎంతశాతం ఉందో దీనిద్వారా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో రోజుకు దాదాపు 13 లక్షల టికెట్లు బుక్ అవుతున్నాయి.
రైళ్ల ఆలస్యంపై వీడియో
రైళ్ల రాకపోకల ఆలస్యానికి గల కారణాలను అన్ని రైల్వేస్టేషన్లలోని ప్లాట్‌ఫాం స్క్రీన్లపై వీడియో రూపంలో ప్రదర్శించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రైలు ఆలస్యానికి కారణాన్నీ వీడియోలో వివరిస్తారు. ఆలస్యానికి ప్రయాణికులకు క్షమాపణ చెప్పనున్నారు. ప్రస్తుతం దేశంలో 30శాతం రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే శాఖ నివేదికలో వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment