కాచిగూడ (హైదరాబాద్): గ్రూప్స్‌తోపాటు ఇతర ఉద్యోగ ఖాళీల భర్తీలో ఆప్షన్, వెయిటింగ్ లిస్ట్ విధానాన్ని అమలు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన బీసీ ప్రతినిధి బృందంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కలసి ఉద్యోగ ఖాళీల భర్తీ, అప్షన్ విధానాలపై చర్చించారు.
అనంతరం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ గ్రూప్ 1,2,3,4 సర్వీస్ పోస్టు లను నేరుగా భర్తీ చేయాలని అన్నారు. ఇప్పటికే కొన్ని శాఖలలో ఖాళీలను పదోన్న తులతో భర్తీ చేశారని పేర్కొన్నారు. డైరెక్టు రిక్రూట్ మెంట్ ద్వారా యువతను తీసుకుంటే సమర్థవంత మైన, అవినీతి రహిత పాలన అందించవచ్చ న్నారు. గ్రూప్ 4 లోని పోస్టులను జిల్లా, మం డల స్థాయిలో భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment