
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ ఆర్.కృష్ణయ్య
అంబర్‌పేట (హైదరాబాద్): మహిళా సాధికారతపై దేశవ్యాప్తంగా గుణాత్మక చర్చ జరగాలని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. గురువారం అంబర్‌పేట జైస్వాల్ గార్డెన్‌లో బీసీ మహిళా సంఘం రాష్ట్ర కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పదేళ్ల కిందట పార్లమెంట్‌లో మహిళా బిల్లు ప్రవే పెట్టి అమలు చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో వాటా ఉంటేనే వారి జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని తెలిపారు. సమావేశంలో బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు శారదగౌడ్ మాట్లాడుతూ అవకాశం వస్తే రాబోయే ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment