
సాక్షి, హైదరాబాద్: కేంద్ర వార్షిక బడ్జెట్.. బీసీలను తీవ్రంగా అవమానపరిచిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ భవన్‌లో ఆదివారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. జనాభాలో 56% ఉన్న బీసీల సంక్షేమానికి కేవలం రూ.2వేల కోట్లు కేటాయించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
బీసీల సంక్షేమానికి కేంద్రం ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదని, రూ.45వేల కోట్లతో రూపొందించిన బడ్జెట్‌లో బీసీలకు కనీసం 0.1 శాతం కూడా కేటాయించలేదన్నారు. బడ్జెట్ సవరణ చేపట్టి బీసీలకు కనీసం రూ.2లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు అమలు చేస్తున్నట్లు బీసీలకు కూడా ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలు అమలు చేయాలని కోరారు. 80శాతం మ్యాచింగ్ గ్రాంటు ఇచ్చి బీసీ వసతిగృహాలను కేంద్రమే నిర్మించాలని, రూ.50 వేల కోట్లతో జాతీయ బీసీ కార్పొరేషన్ ద్వారా 80శాతం బీసీ విద్యార్థులకు విద్యారుణాలు ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment