
టికెట్ ఖరారైతే ఎస్‌ఎంఎస్
రైల్వే వెయింటింగ్ లిస్ట్ ప్రయాణికుల మొబైల్‌కు సందేశం
న్యూఢిల్లీ: మీది వెయింటింగ్ లిస్టు రైలు టికెట్టా? అnrతే మీ ప్రయూణానికి ముందు గనుక మీ టికెట్లు కన్‌ఫర్మ్ (ఆర్‌ఏసీలోకి వచ్చినా) అయితే రైల్వే శాఖే మీ మొబైల్ ఫోన్‌నంబర్‌కు తాజా స్థితిని తెలియజేసే సంక్షిప్త సందేశం (ఎస్‌ఎమ్మెస్) పంపుతుంది. గత 10 రోజులుగా ఈ మేరకు ప్రయోగం కొనసాగుతోందని, సోమవారం నుంచి వెయింటింగ్ లిస్ట్ ప్రయాణికులందరినీ ఎస్‌ఎమ్మెస్ ద్వారా అప్రమత్తం చేయడం లాంఛనంగా ప్రారంభించినట్టు రైల్వే శాఖ సహాయ మంత్రి అధీర్ రంజన్ చౌదరి తెలిపారు. ప్రతిరోజూ సుమారు 10 లక్షల మంది తమ మొబైల్ ఫోన్ల ద్వారా ఈ విధంగా అలర్ట్‌లు పొందుతారన్నారు.
రైల్వే సాంకేతిక విభాగం ‘క్రిస్’ దీనిని అభివృద్ధి పరిచినట్లు తెలిపారు. టికెట్ బుకింగ్ సమయంలో ఇచ్చిన మొబైల్ ఫోన్‌కు కోచ్, బెర్త్ నంబర్లు తెలియజేసే ఎస్‌ఎమ్మెస్ ప్రయూణానికి 3 గంటల ముందు వస్తుందని వివరించారు. రైల్వే బడ్జెట్ సందర్భంగా హామీ ఇచ్చిన ఈ సేవతో ప్రయూణికులకు ప్రయోజనం చేకూరడమే కాకుండా రైల్వే వెబ్ సైట్‌పై భారం తగ్గుతుందని రైల్వే బోర్డు సభ్యుడు (ట్రాఫిక్) డీపీ పాండే చెప్పారు. టికెట్ ఆర్‌ఏసీ పరిధిలోకి వచ్చినా లేదా కన్‌ఫర్మ్ అయిప్పుడే ఎస్‌ఎమ్మెస్ వస్తుందని వివరించారు. ఇలావుండగా స్లీపర్ క్లాస్ బోగీలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రైల్వే మంత్రి మల్లికార్జున్ ఖర్గే సోమవారం బళ్లారిలో చెప్పారు. భద్రతా ప్రమాణాల మెరుగుదలపై సుప్రీంకోర్టు నోటీసును తీవ్రంగా పరిగణిస్తున్నట్టు ఇక్కడ ఓ రైల్వేలైను ప్రారంభోత్సం సందర్భంగా ఆయన తెలిపారు.